కపిల రాంకుమార్ || టుమ్రీలు – 3 ||
గొడుగు
అభయం
పడగ
భయం
**
నీడ
వెంటాడుతుంది
గోడ
వెన్నంటివుంటుంది
**
పెదవి
అందం
పదవి
గండం
**
రవి
ఎవరికి అందడు
పైరవి
అందుకుంటాడు
**
కవి కలం
రైతు హలం!
రౌతు శూలం
దేశానికి బలం!
**
అద్దం
అబద్ధం చెప్పదు !
నీ రూపాన్నే
అచ్చుగుద్దుతుంది!
**
అరువు
వస్త్రం కంటే
స్వంత
గొంతే శస్త్రం!
**
చెప్పేటప్పుడు
బాగానే వుంటది!
అప్పచెప్పేటప్పుడే
బాధగా వుంటది !
**
గోడపై
కబుర్లాడమంటే
ఇదే సందనుకుని
పిడకలెందుకొడతార్రా!
**
రాతి దెబ్బ
మాయమౌతుంది!
రాత దెబ్బ
గాయమౌతుంది!
**
ధాన్యంలో
మెరిక(గ)లు ఏరీ పారెయ్యాలి!
పిల్లల్లో
మెరికలు ఏరి పెట్టుకోవాలి!
**
మంచు పడితే
బిగిసి పోవటం ఖాయం!
మరీ ముంచబడితే
ముగిసిపోయేది కాయం!
**
24.12.2016
గొడుగు
అభయం
పడగ
భయం
**
నీడ
వెంటాడుతుంది
గోడ
వెన్నంటివుంటుంది
**
పెదవి
అందం
పదవి
గండం
**
రవి
ఎవరికి అందడు
పైరవి
అందుకుంటాడు
**
కవి కలం
రైతు హలం!
రౌతు శూలం
దేశానికి బలం!
**
అద్దం
అబద్ధం చెప్పదు !
నీ రూపాన్నే
అచ్చుగుద్దుతుంది!
**
అరువు
వస్త్రం కంటే
స్వంత
గొంతే శస్త్రం!
**
చెప్పేటప్పుడు
బాగానే వుంటది!
అప్పచెప్పేటప్పుడే
బాధగా వుంటది !
**
గోడపై
కబుర్లాడమంటే
ఇదే సందనుకుని
పిడకలెందుకొడతార్రా!
**
రాతి దెబ్బ
మాయమౌతుంది!
రాత దెబ్బ
గాయమౌతుంది!
**
ధాన్యంలో
మెరిక(గ)లు ఏరీ పారెయ్యాలి!
పిల్లల్లో
మెరికలు ఏరి పెట్టుకోవాలి!
**
మంచు పడితే
బిగిసి పోవటం ఖాయం!
మరీ ముంచబడితే
ముగిసిపోయేది కాయం!
**
24.12.2016