కపిల రాంకుమార్ ||కవితా సందేశాలు || 2|
11. అప్పుడే పుట్టకు – కొంచెం ఆగు
ఈ జనానికి తెలిసిరాని
మగజాతికి నీవులేని మనుగడ యెలా వుంటుందో
కొంచెం రుచి చూపించు! ………..భార్గవీ రావు
12. అబలనా నేను? సబలనని నిరుపించుకోలేనా?
మానవతను మరిచానా? నాటికి, నేటికి నేనే ఆరని జ్యోతిని!…..జ్యోతిరాణి
13.పీడిత ్ర్రజాపోరులో సగాన్ని కదనమ్లో నిలిచిన కామ్రేడ్
నీ ఆదిమ గణాలకు నాయకత్వం నెరపిన ఆదిమానవిని …రత్నమాల
14. రాజ్యానికి ఉద్యమానికి మధ్య అర్థమ్లేమి యుద్ధానికి కలవరపడుతున్నాను
యే మాత్రం నిజాయితీ లేని ఈ పోరాటాన్ని చూసి సిగ్గు పడుతున్నాను.
—–మహెజబిన్.
15. మాటలు రానప్పుడేమోకాని – పోరాటం చేయకలిగినప్పుడు
చేతులు కట్టుకొను కూర్చోటం యిక నా వల్లకాదు………షాజహానా.
16.నాన్నకైనా బుద్ధిలేదా! వాళ్ళమకైనా చెప్పలేడా!
ఆడజాతే లేని రోజున ఆయనెట్టా పుట్టినాడో?
అమ్మా నేనొచ్తె యీ యింటికేమి శాపం?….
పైశాచిక యీ కృత్యం మీ అమ్మే చేసుంటే నీ
స్థానమెక్కడదని ప్రశ్నిస్తా బామ్మని!
నే అడిగేందుకు లేత ఆదుగేసేందుకు
ఈ ఒక్కసారీ పుట్టనీ – చచ్చి నీ కడుపునేపుట్టనీ…….కపిల
17. 1)కమ్మో, రెడ్డో అంటాడే కాని – మనిషినని చెప్పడేం?
హిందువు, ముస్లిం, క్ర్స్టియను అంటాడే కాని మనిషినని చెప్పడేం?
అసలిక్కడ మనుషులే లేరా? వీళ్ళు మనుషులు కారా??
2) గుడిపాటి వెంకట కలం – అతివ వాద మహోజ్వలం
స్త్రీల అణచివేతలపై ఉప్పొంగిన లావానలం!
3) అగ్గిలా ఆవేశం చెలరేగినప్పుడు – చల్లార్చేదీ –నేనే
బొగ్గులా అలోచనలు చచ్చుపడినప్పుడు – రగిలించేదీ – నేనే
(తన శ్రీమతి కుమారికి పుస్తకం అంకితమిస్తూ)……..
——- సింగంపల్లి అశోక్ కుమార్.
15.3.2013 సా 6.45
—-ముగింపు రేపు.