Monday, September 30, 2013

|| శకునపక్షి నాటికలో సామెతలు - నార్ల వెంకటేశ్వరరావు ||

కపిల రాంకుమార్| శకునపక్షి నాటికలో సామెతలు  - నార్ల వెంకటేశ్వరరావు ||
నార్ల వెంకటేశ్వర రావు రాసిన శకున పక్షి నాటిక ఒక రైతు కుటుంబ నేపథ్యమ్ళొ రాసినదైనా
సంభాషణలలో తెలుగు సామెతలు మెందుగా ప్రతీ పాత్ర ద్వారా పలికించిహాస్యం పండింది.
పొద్దున్నే వచ్చావేమిటన్న రామయయ్యతో సీతాపతి '' పొద్దున్నే వచ్చిన వాన, పొద్దుపోయి 
వచ్చిన చుట్టం పోయేదిలేదని '' దిగులుగావుందా అంటాడు. అయినా నువ్వు వూరికినే రాలేదని
అన్నప్పుడు నీ కొకరి అంటూ సొంటూ గిట్టదు కదా అంటూ సీతాపతి '' నన్ను ముట్టుకోకు నామాల
కాకి '' అంటావు అనే సామెత వాడతాడు. యేం పనిమీదొచ్చావో చెప్పవయ్యా అన్నపుడు '' చల్ల 
కొచ్చి ముంత దాస్తున్నాననేగా'' నీచోద్యం! వూరికినే రావులేవయ్యా వచ్చిందెందుకో చెప్పు అన్నపుడూ
మళ్ళి సామెత వేస్తాడు సీతాపతి రామయ్యతో '' లాభంలేని  సెట్టి వరదను పోడంటావ్ '' బాగా
మాటలు నేర్చావనగానే '' వలచి వస్తే మేనమామ కూతురు వరస కాదనే రకం ' నీది  అని సమాధా
నమిస్తాడు . మనసులో మాట బయట పెడ్తున్నట్లనిపించేలా ' రోహిణీ కార్తెలో రోళ్ళు బద్దలుతా'యని
వురకే అన్నారా. తాగటాని చల్లబొట్టు కూడ లేదేమో అని రామయ్య భార్యతో అంటాడు.  అయ్యో
పాడిలేదేమీ అన్నయ్యా అనగానే '' పాడిలేని యిల్లు పాతాళలోకం కదూ''ఎక్కడైనం వాదికపీటుకో
వచ్చుగా అనగానే  యేమోనమ్మా '' అమ్మాబోతే ఆదివి  కొనబోతే కొరివి '' లాతెచ్చుకున్న అణా
పెరుగుతో కాలం గడువదుకదా. అయినా మీ పాలెం పడ్డ యీనిందనుకుంటాను, మర్మగర్భంగా
ఆరా తీయాలని ఆంటాడు. అందుకు  ''యీని యేం లాభంలే అన్నయ్యా నిన్న పక్కింటావిడ
దిష్టితగిలనట్టుంది ఒక్క చుక్కైఅనా విడివలేదు . వెంటనే అందుకుంటాదు ' నరుడి కంట
నల్లరాయైనా పగుల్తింది ' అని పాటిమీద సాయెబును పిలిచి తావెత్తు కట్టించు సలహా యిస్తాడు.
పిలిపిద్దామని పాలేరుని వెళ్ళమంటే కుదర్దు అని మొరాయించాడు. అంది ఇలాలు.  అలాగటమ్మా
' తిండికి తిమ్మ రాజు పనికి పోతురాజు '' పిదప కాలంలో పాలేరుమాట వినటంలేదు.' పత్తి గింజలు
తింటావా బసవన్నా అంటే ఆహా అన్నాడట, మరి గంత కట్టనా అంటే ఊహూ అన్నాడాట '
అలావుమొదన్నమాట వాళ్ళపని. సాయెబుని నే వెళ్ళిపిలుచుకొస్తాగాని ఆ చల్లనీళ్ళు నువ్వే పోద్దువుగాని
 చెల్లమ్మా! అంటాడు. అదా ఆపనిమీద వచ్చావన్నమాట అని రామయ్య అనగానే ఆ ' అయినోళ్ళకు
ఆకుల్లో, కానోళ్ళకు కంచాల్లోను ' అని ఆర్.ఐ.కి సమర్పించుకున్నావు కాని నాకు కుండనీళ్ళడిగితే
ఎలా చదువుతున్నాడో బావ చూడమ్మా అని దెప్పుతాడు. అందుకు రామయ్య '' కాలికేస్తే
మెడకి, మెడకేస్తే కాలి ' వేస్తావు మాటలు నేర్చావుకదా, చల్లకొచ్చాననే విషయం ముందే చెప్పొచ్చుగా
అంటాదు.ఆ వెనుకటికెవడో'' కడుపులో లేందిం కావిలించుకుంటే వొస్తుందా ' అని సమాధానం
వెంటనే అందుకుంటాడు సితాపతి. ఇంకో సందర్భంలో పిల్లవాడు ఇంటికిరాలేదని ఇంటావిడ అనగానే
అందుకుని సీతాపతి '' సముద్రం యీదవచ్చు కాని సంసారం ఈదరాదు. ' ఈ కాలం పిల్లలకి యేం
తెలుస్తాయి, సంసారమ్ళొణి సాధక బాధకాలు వూరిమీద పడి తిరగటమేకదా. ఇంకో సందర్భంలో
సీతాపతీ నువ్వే నయం ఐదురూఅడపిల్లలకి పేళ్ళిళ్ళుచేసావు పైసా అప్పులేకుండా, అని రామయ్య
అనగానే  ఇక నామాటే చెప్పుకోవాలీ ' వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తులాభారం తూగితే, కరెడ్ల
కామమ్మ వంకా్యల భారం తూగిందట '  నీకంటే నాలుగెకరాలుపంచుకున్నానే కాని  నాపని
'' నానాటికి తీసికట్టు నాగంభట్లు ' అన్నట్టుగావుంది, చ్వరికి పుగాకు తుంపుకు కూడా ఠికాణా లేదు.
వెనకటికి నాబోటివాడెవదొ '  దశాదశా రమ్మంటే, దరిద్రాన్ని పిలవమన్నదట!.'' దశంటే నీది
పుగాకుకాడొకటి పారెయ్ బావ!, అని మరొక కోరిక వెళ్ళబుచ్చుతాడు సీతాపతి.......
______________________________________________
....నాటిక ఆసాంతం కథా సంవిధానం తో పాటు, సంభాషణలు గ్రామీణ నేపథ్యంతో సాగుతుంది.
నార్లవారి రచనలు వాల్యూం 2 - సంపాదకుడు :వెలగా వెంకటప్పయ్య- ప్రచురణ- నార్ల కుటుంబం
2004 వెల.200-/- అన్ని పుస్తక విక్రయకేంద్రాలలో
___________________________________________
27-9-2013 - సా. 5.30

కపిల రాంకుమార్||సాహితీ సుమాలు - నలిమెల భాస్కర్ ||

కపిల రాంకుమార్||సాహితీ సుమాలు - నలిమెల భాస్కర్ ||
నలిమెల బాస్కర్ ' సాహితీ సుమాలు ' అనే  పుస్తకానికి ' నిఖిలేశ్వర్ ' ముందుమాట రాస్తూ
' సుమ' సౌరభాలతో సాహిత్య ద్వారాలు తెరిచిన భాస్కరుడన్నారు. 17 వ శతాబ్దానికి చెందిన ఉర్దూ కవి
మీర్ నుంది 20 వ శతాబ్దానికి చెందిన కొండ జాతి అక్షరమల్లె ' ఛునీ ' దాకా 35 మంది సాహితీవేత్తలతో
కరచాలనం చేయిస్తాడు. ఈ వ్యాసాలన్నీ గతంలో ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలొ 35 వారాలపాటు
సాహితీ సుమాల పరిమళం వెదజల్లాయి. అవి ఒక పుస్తకరూపంలో నయనం ప్రచురణలు, సిరిసిల్ల వారు
వెలుగులోకి తెచ్చారు, డిసెంబరు 2000 లో.  '' సాత్ వలేకర్ మొదలు మనవాడైన ఎలుగు పెద్ద సామల సద్దశివ
గురించి ఈ తరం చదివితే అపారమైన వదుష్యం, కళాత్మక హృదయం, ఆ వ్యక్తిత్వాల్లో ఎంతగా రక్తరంజితమైపోయాయో అర్త్హం చేసుకోగలం. '' అంటారు నిఖిలేశ్వర్.

''ఈ పరిచయ వ్యాసాలుచదువుతూంటే ఓకచోటా అకస్మాత్తుగా ఆగి ఆలోచిస్తాం.' విధి' వక్రీకరించినా ఓడిపోని
అజేయ సంకల్పంతో జీవితాన్ని సార్థకం చేసుకున్న మన కరీంనగర్ (ఊటూరు గ్రామం)(కీ.శే)ముద్దసాని రామిరెడ్డి
గారు పలుకరిస్తారు.గత 33 (2000 నాటికి) సంవత్సరాలుగా మంచంమీద బోర్లా పడుకుని తనకు
తొచినరీతిలో సాహిత్య సేవ చ్స్తూవున్నారాయన. 1967 లో జరిగిన రోడు ప్రమాదంలో వెన్నెముక విరిగి
శయ్యాగతుడుగా శేష జీవితాన్ని అక్షరాయాగం చేస్తూ ఆరాధన కావించాడు. ఇక మన పొరుగున వున్న తమిళ కథాశిల్పి ' పుదుమై పిత్తన్‌ ' కన్నడ అభ్యుదయ రచయితా అశ్వత్థ, మలయాళీ రెబల్ రచయిత ' కోవిలమ్‌' మనలో ఎంతమందికి తెలుసు? చాల మందికి అసలు తెలియదు అని అంగీకరించే పరిస్థితి యీనాటికి నెలకొనివుంది.
భాషాపరమైన యిబ్బందులున్నా, కనీసం ఇంగ్లీషు లేదా హిందీ అనువాదాల ద్వారానైనా మన భారతీయ
రచయితలను మనం ఏమాత్రం చదువుతున్నామనే ఆత్మ పరిశిలన చేసుకోవాలి'' అంటారు నిఖిలేశ్వర్.
'' 1950-70 మధ్య ఆనాటి తరానికి శరత్, ప్రేమ్‌చంద్, రాహుల్ శాంకృత్యాయం తదితరులు అనువాదాల ద్వారా
మనకెంతో దగ్గరైనారు. మరి ఈ రోర్జు ప్రోత్సహిస్తున్నామా?..ఆ కర్తవ్యాన్ని తిరిగి నలిమెల భాస్కర్ ఈ సాహితీ సుమాల ద్వారా గుర్తుచేస్తూ, తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా అనువాద యాగం కావిస్తున్న సోమయాజి. అందుకు ఆయనని మనసారామెచ్చుకుంటున్నాను ..అంటు ముగించారు నిఖిలేశ్వర్
డిసెంబర్ 6-2000 న.
___________________________________________
1.10.2013 ఉదయం 6.50

Saturday, September 28, 2013

|| మన సంస్కృతి- బొడ్డేమ్మ పండుగ||

కపిల రాంకుమార్|| మన సంస్కృతి- బొడ్డేమ్మ పండుగ||
భాద్రపద మాసంలో బహుళ పంచమినాడుప్రారంభించి, మహాలయామవాస్యతో ముగించే ' బతుకమ్మ '
పండుగకు ముందు ఉత్సవంగా ' బొడ్డెమ్మ పండుగ ' తెలంగాణా సంస్కృతిలో ప్రసిద్ధమైనది.
_________________________________________________
మాలుమర్తి మేడ మీద చందమామ - వెండియ్య వేనగిరులు చందమామ
ఇత్తడి చేరలు చందమామ - ఇత్తడి చేరలకు చందమామ
రాగియ్య కడువలు చందమామ - రాగియ్య కడువలకు చందమామ 
ుత్యాల ముగ్గులు చందమామ - ముత్యాల ముగ్గులకు చందమామ
వజ్రాల వాకిండ్లు చందమామ -వజ్రాల వాకిండ్లకు చందమామ
పవడాల పందిళ్ళు చందమామ - పవిడాల పందిళ్ళకు చందమామ
మంచినీళ్ళ బావిబుట్టె చందమామ - మంచినీళ్ళబావి పక్క చందమామ
మంచిమల్లె తీగ బుట్టె చందమామ- మంచిమల్లె తీగకు చందమామ
కోసేవారు లేక పాయే చందమామ - కోసెవారు లేకపోతే చందమామ
కొండెత్తు పెరిగిపోయే చందమామ - కొండెత్తుపెరిగితే చందమామ
కోయించు చందప్ప చందమామ -కోయించి చందప్ప చందమామ
పంచిపెట్టు గౌరమ్మ చందమామ - పంచి పెట్టు చందమామ!

తొమ్మిదో రోజున పరమాన్నము వండి, పంచిపెట్టి, ఒక బావి వద్దకు గూడి

'' బొడ్డెమ్మ బొడ్డెమ్మ బిడ్డాలెందరె
బావిల పడ్డవారికి బారిద్దరమ్మ
చెర్లా బడ్డ వారికి చేరిద్దరమ్మ
కుంట్లబడ్డావారికి కోరిద్దరమ్మ
నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ
నిద్రకూ నూరేండ్లు నీకువెయ్యేండ్లు
నినుగన్న తల్లి నిండ నూరేళ్ళు ''
అని పాట పాడి బొడ్డెమ్మని ఆ నీళ్ళలో విడిచిపెడతారు.
____________________________________
జానపద గేయ సాహిత్యం -డా. బిరుదురాజు రామరాజు - పారమార్థిక గేయములు -
నుండిసేకరణ.
____________________________________
27.9.2013 ఉదయం.11.10

Sunday, September 22, 2013

\ చిరంజీవి హరీష్

కపిల రాంకుమార్|\ చిరంజీవి హరీష్||
కళాకారులెందరో - కన్నీటిదండలై
హృదయాలదోసిళ్ళ - కైమోడ్పులిడగ
అభ్యుదమింటిపేరు - ఆదరణే ఒంటితీరు
హరీష్ వంటివారు - యింకెవరు కానరారు!
కలిగినోడికి కనికరముండుట - కలకాదు సుమా పచ్చినిజం!
అడిగినోడికి కాదనకుండ - ఆదుకొనుటతని నైజం!
‘అరసాలను ' ' విరసాలను '- రకరక భావాలను
సభలలోన మేళవించి - పలురకాల ప్రోత్సహించి
దాన శీలికి ఎముకేలేదు - కార్యశీలికి కునుకేరాదు
ప్రజావైద్యునిగ హస్తవాసి - ప్రజాబంధువై వాసిగాంచె
సామ్యవాద పక్షాలకు - తలలోని నాలుకయై
కళారంగసంస్థలకు - ఆయువై, ప్రాణమై
ఆదర్శిలింటితొనె- అమలుచేసిన మార్గదర్శి
సంప్రదాయ సంకెలలను - ఖండించిన ప్రగతివాది
పుస్తకాలనె్న్నింటినో - వీలునామరూపంగా
బివికేకందించిన - మహామనీషి
కనపడని కథకుదుగా - మంద్రస్వర మాటరిగా
అందరిని అలరించిన - మృదు భాషకుడు
అందలానికేగినా - అందరిమదిలోన
అంబరాన తారలాగ - మందస్మితుడైనాడు
స్తవనీయుడు - అస్మదీయుడు
ప్రాత: స్మరణీయుడు - మరణ రహితుడు.

22. 9. 2013 – డా. కానూరి హరీష్ వర్థంతి.

|| త్రిశంకు స్వర్గం||

కపిల రాంకుమార్ || త్రిశంకు స్వర్గం||

భూమ్యాకాశాలు కలసినట్లు దృశ్యం భ్రమే కాని
నిజం చేసేలా ధరలాకాశాన చెట్టపట్టాలేసుకుంటే
నమ్మకతప్పటంలేదు
జేబులో డబ్బులకు సంచి నిండేదొకనాడు
ఇపుడంతా తారుమారు!
నియంత్రణ చేయాల్సిన
సర్కారు చేతులు కట్టుకుని
చోద్యం చూస్తోంది!
ధర్నాలు చేసినా, రస్తారోకో చేసినా
రాజ్య హింసకైనా సిద్ధమేకాని
రాజ్య క్షేమం పట్టకుంది!
సరఫరాచేసే సంస్థలన్నీ కట్టుకట్టి
గిట్టుబాటు ధర రాకుంటే
చందా నిలుపుదలచేస్తామన్నపుడుల్లా
మూల్యం పెందుకుంటూపోతోంది!
మూలిగేనక్కమీద తాటిపండు పడి
జనం గగ్గోలు పెడుతున్నా
తగ్గిపోతున్న రూపాయి వలువలకు
మాకేం రంకుకడతారేం అంటూ
ఎదురుదాడి చేస్తోంది సర్కారీ కుక్క!
వంటకు గాసూ లేదు గాసునూనె దొరకదు
వండని ప్రకృతి ఫలాలు తిందామంటే
వనాలు లేవు కాంక్రీటు భవనాలు తప్ప!
రెంటికి చెడ్డ రేవళ్ళనుచేసి
రోట్లో తలపెట్టిన తరువాత
రేట్ల పోటు తట్టుకోపోతేయెలా సామెతలేస్తోంది
ఇల్లెక్కి కోట్లకు కోట్లు తినమరిగి
అరిచే కోడిలా యుపియే పుంజు!
సుఖమెరిగిన ప్రాణాలు సౌకర్యాలొదుకోలేక
రేపటి రాజెవడో రెడ్డెవదో తేల్చే ఓట్ల సమరం వరకు!
త్రిశంకు స్వర్గంలో వేలాడటమే మన కర్తవ్యం!
21.9.2013__________________5.10 pm.

Friday, September 20, 2013

కపిల రాంకుమార్|| యాదృచ్ఛికం||

కపిల రాంకుమార్|| యాదృచ్ఛికం||

రోజూ బస్కీలు తీసే వాసు
వెలుగురాకముందే
లంగోటి కట్టి
అంగవస్త్రంతో
దోడ్లో సాధన చేస్తుంటే
తూర్పు వెలుగురేఖలు
బద్ధకంగా శ్వేత వర్ణం వదిలి
మంకెనపూరంగేసుకుని
పలుకరించేవేళ
కిలకిలరావాలు
సన్నాయి వాయించే గుడిగంటలకు
తోడిరాగమవుతున్నవేళ
లంగావోణీలో మంగ
చల్లని పచ్చికపై అంగలువేసుకుంటూ
పూలకోసం బావి వెంపు కదులుతున్నవేళ,
పాలేరు వెంకన్న పాలుపితికి
వంటింటి గుమ్మంలో పెట్టి
గడ్డిమోపుతేవటానికి
వాము వెంపు వడివడి నడుస్తున్నపుడు
మువ్వల సవ్వడిచేస్తూ చెంగుచెంగుమనే
లేగదూడ అదాటుగా బావి అంచుకు వస్తున్నపుడు
ముగ్గురి దృష్టి దానివైపే మరలింది
క్షణంలో పడబోయే దూడని
కాపాడే ఆత్రంలో దూడను గెంటారే కాని
వారు మాత్రం బావితో మమేకమయ్యారు!
జీవ ప్రాణరక్షణలో స్వయంరక్షణ మరచి
తామరాకులా బావిలోనే తేలారు!
యాదృచ్ఛికంగా జరిగిందే
కాని మనసును నలిపేసింది.

20.09.2013 ఉదయం 5.59...

కపిల రాంకుమార్‘’|| The uncommitted poet ‘’ ||అద్దేపల్లి వారి కైత|



కపిల రాంకుమార్‘’|| The uncommitted poet ‘’ ||అద్దేపల్లి వారి కైత||

He wakes up in the morning
Offers his prayers to God
And writes a poem of Devotion
As the clock shows noon
Hunger growls in his stomach
He writes a poem on hunger
He goes for an evening walk along the Fields
Charming clouds criss-cross the sky
Birds sing sweet songs on the trees
He remembers Krishna Sastry
And writes a lyrical poem
Before he retires for the night
His beloved tickles his heart
He writes a poem on love
Sighing with satisfaction
At his four poems written that day
His eyes full of thoughts
Of tossing them to the world
He falls asleep
This uncommitted poet.
_____________________________________________________________

And there are 43 poems in this book and all are in simple and free with reachable language.
I need a letter – Telugu poems – translated by Ramana Sonti of Addepalli Ramamohana Rao, October 2011 Rs.75/- in all leading bookshops.
_____________________________________________________________
16.9.2013 సా .4.02

కపిల రాంకుమార్||| మాట - అర్థాలు పరమార్థాలు||

కపిల రాంకుమార్||| మాట - అర్థాలు పరమార్థాలు||

మాట = భాష కాని ఇంకేమైనా అర్థఛాయలు కనపడతాయేమో, చూద్దాం! అవి 
ఎన్నోవున్నాయి. ' ఏ మాటకామాటే చెప్పుకోవాలి ' మాష్టారు పాఠం చెప్పితే చాలా బాగా 
చెప్తారు. అంటే ఆయన పాఠం చెప్పడం అరుదు. కాని చెబితే చాల చక్కగా చెబుతారు 
అని అర్థం.దేశం కాని దేశంలో లేదా మనరాష్ట్రం కాని చోట తెలుగు మాటలు వినబడితే 
అవి తెలుగు పదాలని అర్థం. ఆ మాటలు ఎక్కడో విన్నట్టుంది కళ్ళు నులుంకుని చూచాను.
అంటే శబ్దాలు అని. ఈ ఒక్క సారి నా మాట విను, అటు వెళ్ళడం మానెయ్! చెప్పిన మాట
విన్నావంటే బాగుపడతావు, లేకపోతే నీ ఖర్మ! ఇక్కడ సలహా అని. గురుడు చెప్పిన మాట -
ధర్మ సూక్తి కావొచ్చు, ఆలి చెప్పిన మాట ఆజ్ఞ కూడ కావొచ్చు. నాన్న రాసిన నాలుగుపేజీల
వుత్తరంలో చెల్లెలు పెళ్ళిమాట ఎక్కడా లేదు, డబ్బు పంపమని తప్ప. వాళ్ళకి కట్నం మాట
ఎత్తితే కోపంట! - ఇక్కడ మాట అంటే ప్రస్తావన. వాడు నోటి మాట మీద లక్షలు పుట్టిస్తాడు.
మాట యిక్కడ భరోసాగానేనా? ఆ మాటకు వస్తే నేనూ వంట చెయ్యగలను తెలుసా!
మాట అంటే నిజంగానేనా? మొన్న నేనడిగిన డబ్బు మాట యేంచేసావ్? మాట అంటే
సంగతి/విషయం.ఇస్తానన్న మాట నిజమేగాని కాస్త నా మాట కూడ ఆలోచించు.
రెండు అర్థాలతో మాట. మీరు యెప్పుడు వచ్చేది, యేం చేసేది వేరే మాట, - మాట అనవసరం!
తిట్లమాట అటుంచు, దెబ్బలు కూడ పడ్డాయిగా? మాట విషయం/ సంగతి అవుతుంది
కరెంటు ఎలాదు యిపుడా చదువు మాట లేకపోతే స్విచ్చులన్ని ఆర్పేయరాదూ? మాట ఇక్కడ
ఉద్దేశం/ఆలోచన. నువ్వు వాళ్ళింటికి వెళ్ళే మాట తేలుస్తే, నేను నాకోసం అత్తెసరు వేసుకుంటా
మాట ఇక్కడ నిర్ణయమని/ఖచ్చితమని. ఆయన మాటే ఎప్పుడు పై మాట అంటే ఆయన నిర్ణయమే
ఖరారని. మా పాపకి మాటలు వస్తున్నాయి. వ్యక్తీరణ స్థితి వాడి మాట ఆవిడ దగ్గర యెత్తకు
మాట - ఊసు, ప్రస్థావన. నేను మాట యిచ్చాను తిరిగులేదు. వాగ్దానం. ఇదుగో ఆడిన మాట
తప్పడం మా యింటా వంటా లేదు. వాగ్దాన భంగం/మాట తప్పడం. ఎవరీ చెప్పనని మాటయిస్తే
అసలు విషయం చెబుతా! మాట ఒట్టులాంటిది. ఒరే మాటలు తూలకు! నోరు జారకు, మాట
జారకు అని. నేను మాట పదే వాడిని కాను. మాట ఇక్కడ అపవాదు అని. వాడు వూరకే మాటలు
తేల్చేస్తాడు.చూసావా ఎలా మాటలు నముల్తున్నాడో . నిర్దిష్టంగా లేకపోవటం/ దాటివేయటం.
ఇవాళవున్న పరిస్థితి ఐదురోజుల పెళ్ళంటే మాటలా? అన్నా, హైదరాబాదులొ ఉదయం
9 గంటలపుడు బస్సెక్కడమంటే మాటలా? ..కష్టమైన పని, సాధ్యం కానిది, ప్రయాసతో కూడినది
అనే అర్థాలు - మాటకు చెందుతాయి. మా ఆవిడకు నాకు మాటలు లేవు పొద్దుటినుండి. అంటే
అభిప్రాయ భేదాన్ని సూచిస్తుంది. మా నాన్నకి ఆ వకీలుకి మాటలు లేవు, నేనక్కడికి పోను.
అంటే శతృత్వం సూచిస్తుంది. మాటవరసకి అన్నానే అనుకో అలా చెప్పాపెట్టకూండా వెళ్ళడమే
అంటే ఉదాహరణకి అలా అన్నందుకు వెడతావా అని.'' మాటా మంతీ '' అంటే....సంభాషణ అని,
ఆ అమ్మాయి మాటల పోగు ' . అంటే మాటకారి. కబుర్ల పుట్ట. పని అయేఏసరికి ఎంత టైం అవుతుందో
మంచి మాట చేసుకుని వెళ్ళు......మర్మగర్భంగా భోజనం చేసి వెళ్ళు అని. అందుకే వాడితో స్నేహం
మానేసా మొన్నటినుంచి, నీ గురించే వాడికి నాకు మాటా మాటాఅనుకున్నాం. తగాదా పడ్డాం అని.
మాట .....ఎన్ని అర్థాలను వెదజల్లిందో...
___________________________________________
'' పదుగురాడుమాట పాటియై (పాడియై) ధరచెల్లు ......అని మనం వినేవుంటాం.
మాట అర్థం ఒక్కొక్క సందర్భాలలో ఎలా మారుతువుంటుందో జొన్నలగడ్డ
వెంకటేశ్వరరావు గారు '' తెలుగు పదాలు-అర్థాలు-పరమార్థాలు '' అనే వ్యాసం
' సాహితీ స్రవంతి ' మాసపత్రిక (సి.పి.బ్రౌన్‌ అకాడేమీ ప్రచురణ జనవరి 2012)
_సంచికలో (పేజి 50,51)..ఆధారంగా
__________________________________________
18.9.2013 సా.4.20

Wednesday, September 11, 2013

కపిల రాంకుమార్|| కవిత్వానికి మానిఫెస్టో!||

కపిల రాంకుమార్ || కవిత్వానికి మానిఫెస్టో||

అనుభవాలను అనుపానంగా అందించే
ముసలాళ్ళను లెక్కచేయం!
పైగా వాళ్ళది చేదస్తమంటాం!
కాని ఒకప్పుడు 
నడిచే దారిలోనో, చేసే పనిలోనో
ఆటంకాలొచ్చినపుడు మాత్రం 
అనిపిస్తుంది వాళ్ళ మాట వినుంటే బావుండునేమోనని!
***
కొత్త  ఒక వింత – పాత ఒక రోతకదా మనకి!
జ్వరం తగ్గి పథ్యం చేసే వేళ
పాత చింతకాయ పచ్చడి,
నిమ్మకాయ కారం తప్పనిసరి అవుతుంది
లాలాజల వృద్ధికి, పూర్వ శక్తి కూడగట్టుకోడానికి!
***
అలాగే కావ్యేతిహాసాలను
ఎప్పుడైనా పలుకరిస్తేనే కదా
పుక్కిటి పురాణాలేవో, ప్రతీకలకు ఆధరవులేవో
ఉపయోగించాలా వద్దా అని తెలిసేది!
***
కథకైనా, కవితకైనా
నడకనేది అవసరం!
నడతనేదీ అవసరం!
ఛందమను, శబ్దమను, అలంకారమను
ఉపమానమను తెలీకుండానే
తోసుకువస్తాయి వరసలోకి!
అల్లిక వదులుగానో, బిగుతుగానో అయినా
హృదయస్పందన కలిగించేలా
ఊకను దంచకుండా
ఊహలని పెంచితేనే
పది కలాలు రాసినా
పది కాలాల పాటు నిలిచినా
కవిత్వమనిపించాలి
కవిత్వమై ఆలపించాలి
కవిత్వానికి '' మానిఫెస్టోలా '' !

11.09.2013 సాయంత్రం 4.40

Saturday, September 7, 2013

కపిల రాంకుమార్ || బఠాణీలు||2||

కపిల రాంకుమార్ || బఠాణీలు||2||

పాప కైనా - కను
పాప కైనా
ప్రాపకమున్నంతవరకే!
**
ధనమైనా - ఇం
ధనమైనా
దగ్ధం కానంతవరకే
**
కారైనా (వయసు)
నీరైనా
కారితే బేకారే!
**
మాటైనా
కోటైనా (భవంతి)
ఓటిపోనంతవరకే!
**
చేతలైనా
నేతలైనా
పాతకాలు కానంతవరకే!
**
చేయి ఇవ్వటానికి
చేయి అందివ్వటానికి
చేంతాడంత బేధంవుంది!
**
7.9.13...ఉ . .10.04

కపిల రాంకుమార్|| భరోసాకు సమాధి||

కపిల రాంకుమార్|| భరోసాకు సమాధి||

సందిట్లో సడేమియాలా, రాజకీయ సంక్షోభాలు
అవినీతి కుంబకోణాలు. ఎడపెడా ఉద్యమాలు
తడిసి మోపెడవుతున్న, ధరాఘాతాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే
అచేతనత్వపు అమాయకత్వాన్ని
ఆసరాచేసుకుని తమకు కావలసిన రీతిలో
పార్లమెంటులో బిల్లు చెల్లుబాటయ్యేలా
హాజరైన వారితోనే నెగ్గించుకున్న ఎత్తుగడలో
విజయం సాధింది యు.పి.ఏ.
మద్దతిచ్చింది భా.జ.పా!
వేతన జీవుల వెతలు లెక్కలేదన్నట్టుగా
గుత్తగా బజారుపాలుచేసి
కనీస భరోసాను సమాధిచేసి
కొల్లగొట్టేలా ఒడుదుడుకుల
మార్కెట్ మాయాజూదంలో
బరితెగించే ఆట మొదలయ్యింది!
ఇప్పుడీ విషయం ఎవరికీ పట్టనట్టేవుంది!
యావత్తు ఉద్యోగ సంఘాల నోరు పడిపోయిందా?
రాజకీయపార్టీలమ్ముడుపోయాయా?
ఎప్పటినుండో వామపక్షాలు నెత్తి నోరు బాదుకుంటే
ఎవరికీ తలకెక్కలేదా?
కుక్కతోక పట్టుకు గోదావరీదేవారి చందంగా
ఆశలపై నీళ్ళు చల్లినా చలనంలేదా?
రాబోయే వృద్ధాపం నిరాశామయం చేస్తుంటే
మనకెందుకులే అని మౌనంగా వున్న ఉద్యోగ సంఘాల వారిని
రాక్షసంగా జనాలకు కీడుచేసే యంత్రాంగపు నాయాళ్ళ తొత్తులయ్యారనాలా?
జరగాల్సిన నష్టం జరిగిపోయింది
చట్టమై ఉద్యోగ జీవితాలను చట్ట్రంలో బిగిసిపోయింది!
యదార్థవాది లోక విరోథి కదా మీ అక్కసు వామపక్షాలమీదెందుకు?
చీము నెత్తురుంటే,,భవిష్యత్తంధకారం కాకుండా చేయగలరా?
____________________________
6.9.2013

Wednesday, September 4, 2013

కపిల రాంకుమార్ ||బడి పిల్లలు - నీ ఒడి పిల్లలు||

కపిల రాంకుమార్ ||బడి పిల్లలు - నీ ఒడి పిల్లలు||

బడిపిల్లలు - నీ ఒడి పిల్లలు
బుడిబుడి నడకల బుడతలు వీరు

మరకలు లేని మరకత మణులు
మర్మాలెరుగని మందారాలు
అక్కున చేర్చి మక్కువ తీర
పాటలతో ఆటలతో
పాఠాలను అందించు!

మొక్కలు వీరు పసి - మొగ్గలు వీరు
అరమరికెరుగని - విరజాజులు వీరు!
ఇష్టపడే రీతి - కష్టపడె తీరు
సష్టవాలు పెంచు స్పష్టత కలిగించు

శిక్షణలో ఔదార్యం రక్షణలో సమతుల్యం

లక్ష్యాల బాటలపై లక్షణంగ నడుపు!
ఇంటివద్ద విసుగును ఇంటివద్దే వదిలి
కంటికి రెప్పలా కాపాడుతు వుండు!

మట్టిలోని మాణిక్యాలను మెరుగు దిద్దె శిల్పివై
మట్టి ఋణం తీర్చగాను వెరపెరుగని రైతువై
శత్రువలను దునుమాడ సరిహద్దుల జవానువై
బాధ్యతలు చేపట్టిన బుద్ధి జీవి నీవయ్య!

నీ జీతం పెరుగుదల నికెంత ముఖ్యమో
వారి జీవితమెదుగుట అదియంతే ముఖ్యం!
జాతికీర్తి నలుదిశలా వ్యాప్తిచేసే శక్తి నివ్వు
తరిగిపోని జ్ఞానమిచ్చే దాతవీవు పంతులయ్య!

సుద్దులెన్నొ నేర్పి పౌరులుగ తీర్చిదిద్ది
నీ పేరును నిలిపేలా శిష్యులను మలచు
గురువంటె దైవమనే భావన మంచిదే
పరువును పరువున పరువులో చేరనీకు!
_____________
(రచనా కాలం 2005)
4.9.2013 రాత్రి 8.21 (ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆశంస)

కపిల రాంకుమార్ || నియో మాట్రిమోనియల్ సెర్చ్||

కపిల రాంకుమార్ || నియో మాట్రిమోనియల్ సెర్చ్||
( జస్ట్ ఫర్ ఫన్‌)
ఎవరైనా సరే
కట్నం యివ్వలేని వారు
తీసుకోమనే వారు 
ఉన్న డిగ్రీలు, 
పంచుకున్న ఆస్తులు
అనుభవించిన పస్తులు
ఎత్తు కొలుచుకోటాలు
బరువులు తూగటాలు
మా ప్రమాణాలకు సరితూగాలి
తదుపరి పరిణామాలకు వారే బాధ్యత!
దరఖాస్తు చేసుకోవచ్చు
దానితో పాటు
రక్త పరీక్షతో పాటు,
ఇతరేతర బంధాలు, అనుబంధాలు
స్నేహితుల, శత్రువుల
గురువుల తల్లిదండ్రుల,
తోడబుట్టిన వారి నుండికూడ
ధృవపత్రం జతచేయని వారు
వివాహ పరిచియవేదిక
ప్రవేశానికి అర్హులు కారు!
ఆవేశాలు, కావేశాలు
దరిరానివారు మాత్రమే
బయలుదేరండి!
పడమటి గాలి సోకినవారు
పబ్బులు, క్లబ్బులు
ఏదేని సప్తవ్యసనాలున్న వారు
బయటపడితే నిర్భయ శిక్ష అమలు!
సంబంధం కుదిరితే
మరునిముషంలో-దండ మార్పులు!
రిజిష్ట్రారు కార్యాలయంలో
నమోదు గారంటీ!
సమయం, తేదీ, స్థలం
తరువాత తెలుపబడును!
గమనిక: ఫేస్ బుక్ అసలు ఫొటో లేని వారు
దరఖాస్తు చేయడానికి అర్హులు కారు.
షరా:ఈ ప్రకటన వెలువడిన అరగంటలోగా
దాఖలు చేసుకోవలెను.
సిఫార్సులు, చెల్లవు!
3.9.2013

Monday, September 2, 2013

కపిల రాంకుమార్|| సెప్టెంబర్ 1 ప్రాముఖ్యత ప్రపంచ చరిత్రలో ||

కపిల రాంకుమార్|| సెప్టెంబర్ 1 ప్రాముఖ్యత ప్రపంచ చరిత్రలో ||
'' ఏ దేశ చరిత్ర చూసినా ఏ మున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం ‘‘- శ్రీశ్రీ.
1939: రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది.తేదీ సెప్టెంబరు 1, 1939 – సెప్టెంబరు 2, 1945
స్థానం:యూరోప్, పసిఫిక్, ఆగ్నేయ ఆసియా, చైనా, మధ్య ప్రాచ్యం, మధ్యధరా ప్రాంతం మరియు ఆఫ్రికా
ఫలితం:మిత్ర రాజ్యాల విజయం. ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం. అ.సం.రా. మరియు సోవియట్ యూనియన్‌లు అగ్ర రాజ్యాలుగా రూపొందాయి. ఐరోపాలో మొదటి ప్రపంచం మరియు రెండవ ప్రపంచం అనే ప్రభావ ప్రాంతాల అవతరణ - దీని నుండి ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభం. రెండవ ప్రపంచ యుద్ధం లేదా రెండవ ప్రపంచ సంగ్రామం (Second World War) అనేది 1939 నుండి 1945 వరకు ప్రపంచంలోని అనేక దేశాల నడుమ ఏక కాలంలో ఉమ్మడిగా, విడివిడిగా జరిగిన అనేక యుద్ధాల సమాహారం. దీనికి పూర్వ రంగంలో జరిగిన రెండు ప్రధాన సైనిక సంఘటనలు ఈ మహా యుద్ధానికి దారి తీశాయి. వాటిలో మొదటిది, 1937లో మొదలయిన రెండవ చైనా-జపాన్ యుద్ధం. రెండవది, 1939లో జర్మనీ దేశం పోలాండ్ పై జరిపిన దురాక్రమణ. రెండవ చైనా-జపాన్ యుద్ధం వివిధ ఆసియా దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తే, జర్మనీచే పోలాండ్ దురాక్రమణ ఐరోపా దేశాల మధ్య యుద్ధానికి కారణభూతమయింది. ఇది క్రమంగా ప్రపంచంలోని అనేక దేశాలు మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాల పేరుతో రెండు ప్రధాన వైరి వర్గాలుగా మారి ఒక మహా సంగ్రామంలో తలపడేటట్లు చేసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్య సుమారు పది కోట్లు. ఇందులో పాల్గొన్న దేశాలు ఒక రకమయిన పరిపూర్ణ యుద్ధ పరిస్థితిని ఎదుర్కొన్నాయి (అనగా, సైనిక-పౌర భేదాలు లేకుండా అందుబాటులో ఉన్న వారందరూ ఏదో ఒక రకంగా యుద్ధంలో పాలుపంచుకోవటం). ఆకారణంగా ఆయా దేశాల ఆర్ధిక, పారిశ్రామిక, సాంకేతిక వనరులన్నింటినీ యుద్ధ ప్రయోజనాలకోసమే వాడవలసి వచ్చింది.
1931 సెప్టెంబరు లో జపాన్ దేశం చైనా అధీనంలోని మంచూరియా ప్రాంతంపై దాడి చేసి ఆక్రమించుకుంది. రెండేళ్ల తరువాత, 1933లో, జర్మనీ లో అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో అతివాద నాజీ పార్టీ అధికారంలోకొచ్చింది. హిట్లర్ నాయకత్వంలో జర్మనీ శరవేగంగా సైనికంగా బలపడింది. 1938 నాటికి హిట్లర్ జర్మనీని తూర్పు దిశగా విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
జర్మని మనసు మరింత క్షోభ పడిన అంశాలుగా '' వెర్సైల్స్‌'' ఒప్పందం, నానాజాతి సమితి ఆవిర్భావం, ప్రపంచ మహా ఆర్థిక సంక్షోభం మొదలగునవి పేర్కొన్నపుడు, అవే రెండో ప్రపంచ యుద్ధ సన్నహాకానికి బీజాలు పడివుంటాయని భావించవచ్చును. అసలు అంతకంటే కూడ ఏదో మౌలికమైన కారణం బలీయంగాఉండివచ్చునని తెలుస్తున్నది. బహుశ: పోలెండును నాశనంచేసి, వరుస క్రమంలో సోవియట్ యూనియన్‌ (రష్యా)ని జయించి, తన అధీనంలోకి తెచ్చుకోవాలనే కామన మూలము. గతంలో సోవియట్ యూనియన్‌ తో చేసుకున్న దురాక్రమణ ఒప్పందం యెడల పేరుకుపోయిన విరోధ భావమే అందుకు కారణం. తాను చేసిన పెద్ద పొరపాటుగా నిర్థారణకు రావటం జర్మనీ లో యుద్ధ పిపాసకు హేతువైంది. ఆ పరిస్థితులను పాశ్చాత్య దేశాలు రాజీకుదుర్చు కునేందుకు వీలు లేని స్థితి హిట్లరే తీసుకువచ్చాడనేది నిర్వివాదాంశం. అలా అతను కృతకృత్యుడ య్యాడనే చెప్పక తప్పదు. అతని పాలన మొత్తం యుద్ధ సన్నాహాలు, కుట్రలు, కుతంత్రాలతోనే సాగింది. రెండవ ప్రపంచ యుద్ధ వాతావరణం కల్పించన వ్యక్తి, దోషి హిట్లరే అని నిర్ద్వంద్వంగా చెప్పక తప్పదు. గమనించాల్సిన విషయం ఒకటుంది. మొదటి ప్రపంచ యుద్ధానంతరం '' శాశ్వత శాంతి ఒప్పందం '' కుదిరింది. కాని ఆ తర్వాత తలెత్తిన అశాంతుల వల్ల ఆ ఒప్పందపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. పైపెచ్చు త్వర త్వరగా అభివృద్ధిచెందుతున్న శాస్త్ర, సాంకేతిక జ్ఞాన నైపుణ్యం వలన మారణాయుధాలలో అత్యంత ప్రమాదకరమైన '' అణుబాంబు '' తయారీ యుద్ధ వాతావరణం వైపు మొగ్గు చూపేలా చేసింది, దాని ద్వారా అంతా నాశనంచేసి దేశాలను తన అధీనంలోకి తెచ్చుకోవచ్చుననే దురాశ, సామ్రాజ్య వాదానికు మరింత ఊతమిచ్చింది. మారణాయుధాల తయారీ, లేదా సమకూర్చుకోటం రెండవ ప్రపంచ యుద్ధం దారిచూపి, దేశాల మధ్య ఆయుధ పోటీని రెట్టింపు చేసింది. 1939-45 కాలంలొ జరిగిన యుద్ధాలాన్ని యెంతో వినాశాన్ని, విధ్వంసాన్ని సృష్టించాయి. అంతటితో ఆగక ఆసియా, ఆఫ్రికా సుదూర పసిఫిక్ దీవుల్లో భీకర పోరాటాలకు ఆజ్యం పోసాయి. అన్నీ దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి అనివార్యంగా తీసుకెళ్ళాయి. హిట్లర్ తనకు బద్ధ శత్రువైన సొవియట్ యూనియన్‌ తో ''దురాక్రమణ వ్యతిరేక ఒప్పందం '' కుదుర్చుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యపడేలా చేయటం ఒక గొప్ప (దుష్ట) నైపుణ్యం అని తదుపరి గాని అర్థం కానిది. 1939 సెప్టెంబరు ఒకటో తారీఖున పోలెండ్ సరిహద్దుపై తన సేనలను (కావాలనే మారువేషాల్లో - పోలెండు సైనికుల మాదిరి భ్రమ కలిగించి) పోలెండు పంపి తన సేనలపై దాడి జరిగిందని (తను యేర్పాటు చేసుకున్నట్లే) సాకు చూపి, పోలెండ్ ను బిస్కట్ నమిలినట్లు చేయడంలోనే ఆతని దురాక్రమణ చాతుర్యం యెంత కుటిల మైనదో అర్థమౌతుంది. గతంలోనే చేసుకున్న ఒప్పందవలన జర్మనీపై దాడి జరిగితే పోలెండుకు మద్దతు యిస్తామని, బ్రిటన్‌, ఫ్రాన్సు దేశాలు మాట యిచ్చివున్నందున సహకరించాల్సిన తప్పనిసరి పరిస్థితిని కల్పించాడు. అందువలన అవి పోలెండుకు మద్దతుగా జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. అయినా నెలరోజులలో హిట్లరు పోలెండు పై విజయం సాధించాడు. అందుకే ఈ కాలాన్ని (1939-40) యుద్ధ ప్రకటనల కాలంగా చరిత్రలో నిలచిపోయింది. 1939 సెప్టెంబరులో జర్మన్‌ ప్రారంభించిన యుద్ధాన్ని అనవసరయుద్ధంగా అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి లిన్‌స్టన్‌ చర్చిల్ పేర్కొనటం గమనార్హం. యుద్ధాన్ని నివారించకలిగిన అవకాశాలు వచ్చినట్లే వచ్చి జారిపోయి యుద్ధం అనివార్యమైందని గ్రహించవచ్చును. అసలు హిట్లరు నైజం యేమిటో తెలుసుకోగోరు వారు అతని స్వీయచరిత్ర ' మెయిన్‌ క్యాంప్ ' చదివితే బోధపడుతుంది. అతనిలోని క్రూరత్వం, యుద్ధ కాంక్ష, సామ్రాజ్యవాద కామం ఎంత తీక్షణంగా వున్నయో మొత్తం బయంకర విశ్వరూపం మనకు దర్శనమిస్తుంది. అతని ప్రసంగాలలోని తీవ్రత, ఉద్రేకం కమ్యూనిజం నిర్మూలనాధ్యేయం, కార్మిక సంఘాలయెడల విచ్చిన్న ధోరణి, అతనిలొ మెండుగా వున్నయనే భ్రమ కొంత కాలం ఫ్రెంచి, ఇంగ్లండు వారికి ఉండేది. కేవలం వెర్సైల్ ఒప్పందం అల్ల తీవ్రంగా నష్టపోవడం, ఇతర దేశాలకు తాను అపరాధాలు చెల్లించవలసిరావటం. జర్మనీలోని డెమొక్రాటిక్ సోషలిస్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నిరంగాలలో విఫలమవ్వటం తన నాజీయిజానికి నియంతృత్వానికి మార్గం సుగమం చేసాయి. అందుకే 1934 నాటికి హిట్లర్ అధికారం చేపట్టీ పచ్చి నియంతగా, సైనిక బలాన్ని పెంచుకోవటమే కాక తిరుగులేని నాయకుడుగా ఎదిగి, నౌకాదళ అభివృద్ధిపరిచి, సైనికాధికురులందర్ని తన చెప్పుచేతల్లోపెట్టుకుని, పెత్తనం చెలాయించి వారి తోడ్పాటుతోనే జపాన్‌ సామ్రాజ్య విస్తరణ మొదలు పెట్టాడని తెలుస్తున్నది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు జపాను వారు కూడ ఆసియాలో కమ్యూనిజాన్ని పారదోలాలనే కంకణం కట్టుకునివుండట వలన ఆ నినాదంతోనే జపాను 1931 ముందుకురావటం కమ్యూనిజానికి వ్యతిరేకంగా ఉద్యమ నడపటంతో పాటు అందులో భాగంగా ఉత్తర మంచూరియాలో ఘర్షణ సాకు చూపెట్టి, చొరబడి అంతర్జాతీయ అభిప్రాయాలేవీ పట్టించుకోకుండా ఒంటెద్దుపోకడతోనే అక్కడ తన అజమాయిషిలో ఒక ''కీలుబొమ్మ'' ప్రభుత్వాన్ని యేర్పాటుచేసింది. 1933 లో చైనాలో జహోల్ ను, 1935 లో చహార్ ను ఆక్రమించింది. 1936 నాటికి చైనా ఈశాన్య చైనాలో తిష్టవేసింది. అదే సంవత్సరం జపాన్‌, జర్మనీ కలసి కొమిన్‌టర్న్‌ ఒప్పందం, ఏడాది తర్వాత వారితో ఇటలీ చేరడం, చైనా పై దురాక్రమణ కావించి, షాంగై, నాన్‌కింగ్ లను ఆక్రమణ చేసి, 1939 లో దక్షిణ చైనా కోస్తాతీరంలో ఎక్కువభాగం తన అధీనంలోకి తెచ్చుకుంది. యూరప్ లో యుద్ధ ప్రజ్వలనే జపాన్‌ పథకాలకు అనువైన నేపథ్యం అయింది. జపాన్‌ను ఆదర్శంగా తీసుకున్న ' ముసోలిన్‌ ' ఇఠోపియాపై దాడిచేయాలనుకుంటే దానికి బ్రిటన్‌ అడ్డు చెప్పటం హిట్లరు తో చర్చించి ఫ్రెంచ్ని ఒత్తిడి చేయబోతే, అందుకు ఫ్రెంచ్ వారు అనుమతిని ఉపసంహరించుకున్నారు. **
చిట్ట చివరగా 1945 మే నెల 5వ తేదీన జర్మనీ తన ఓటమిని అంగీకరించింది. దర్మిలా జర్మనీని మట్టి కరిపించిన మిత్ర కూటమి ( బ్రిటన6, అమెరికా, ఫ్రెంచ్) జపాన్‌ పై దృష్టి సారించి 1945 ఆగష్టులో హిరోషిమా నాగసాకి లపై అణుబాంబులవర్షం కురిపించి విధ్వంసం చేయటం మనమెరిగినదే. ఆ దెబ్బతో జపాను కూడ ఓటమినంగీకరించడం ప్రపంచ చరిత్ర్తలో చిరస్థాయిగా నిలచిన దారుణ మారణ యుద్ధకాండకు నిదర్శనాలే కాదు. ఆ యుద్ధం తాలూకు శకలాలు, నష్టాలు, బాధలు, మరువలేనివి. సామ్రాజ్య వాద దేశాల దాహం యెలాంటి ఘోరాలు చేస్తుందో తెలుసుకునేందుకు చరిత్రలో నిలిచిపోయాయి. ఆర్థిక సంక్షోభాలను సాకుగా తీసుకునో, లోబరుచుకునో, పెత్తనం చలాయించాలనే బుద్ధి వాటికి ఇప్పటిలో పోదు. అంత కఠోర సామ్రాజ్య కండూతి కలిగిన అమెరికాను, దాని పొరుగు దేశమైన కెనడాను వదిలి, యింకా స్పష్టంగా చెప్పాలంటే వెలివేసి 33 దేశాలు ఒక కూటమిగా '' సలాక్ '' పేరుతో ఒక కోలుకోలేని '' ఝలక్ '' యిచ్చాయి. వాటిలాగ, మిగతా దేశాలు కూడ సామ్రాజ్యవాదా్నికి వ్యతిరేకంగా ఓ బలమైన కూటమి యేర్పడితేగాని సరళీకరణ, ప్రపంచీకరణ, గ్లోబలీకరణ (ఎల్.పి.జి.)లకు వ్యతిరేకంగా సెప్టెంబర్ ఒకటోతేదీన ప్రతిన పూనాలని కోరుకుంటూ.........(వ్యాసం విస్తృతి కాకుండ కొన్ని విషయాలను కుదించడం జరిగింది) ** (ముక్తాయింపు: 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరి సారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన పలు ఎదురు దాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే మాసంలో సోవియెట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించటంతో హిట్లర్ ఆత్మ హత్య చేసుకున్నాడు. దానితో జర్మనీ మిత్ర రాజ్యాలకు లొంగిపోయింది. పసిఫిక్ దీవులు ఒక్కటొక్కటే జపాన్ నుండి అమెరికన్ సేనల అధీనంలోకి వచ్చాయి. ఆగ్నేయాసియాలో బ్రిటిష్ దళాలు జపాన్ సేనలను ఓడించి తరిమికొట్టాయి. అప్పటికీ జపాన్ మొండిగా పోరాటాన్ని కొనసాగించింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో మిత్ర రాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియెట్ యూనియన్ జపాన్ తో తమకు గల తటస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి జపాన్ అధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి వశపరచుకుంది. అదే సమయంలో అమెరికా జపాన్ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకీ లపై అణుబాంబులను ప్రయోగించటంతో తప్పని పరిస్థితిలో జపాన్ కూడా లొంగిపోయింది.)
__________________________________________
** ఆధునిక ప్రపంచ చరిత్ర, రెండవ ప్రపంచ యుద్ధం - వాటి పర్యవసానాలు, సీక్రెట్స్ ఆఫ్ సెకండ్ వర్ల్ద్ వార్ లాంటి పుస్తకాల సహాయంతో మరియు వికిపీడియా నుండి సేకరించి ఇది తయారు చేయబడింది) **రచయిత: కపిల రాంకుమార్, గ్రంథాలయ నిర్వాహకుడు, బోడేపూడి విజ్ఞానకేంద్రం, సుందరయ్యనగర్ ఎన్‌.ఎస్.పి.కాలనీ, ఖమ్మం 507 002 మొబైల్ నెం. 9849535033

కపిల రాంకుమార్|| సబాల్ట్రన్‌ ఆర్తి, ఆక్రోషం '' అజా '' || సుంకిరెడ్డి నారాయణరెడ్డి|

కపిల రాంకుమార్|| సబాల్ట్రన్‌ ఆర్తి, ఆక్రోషం '' అజా '' || సుంకిరెడ్డి నారాయణరెడ్డి||

జాతి అణచివేతను ప్రశ్నిస్తున్న సంకలనం '' అజా'' -

అజా అనేది ఆర్తికాదు, పిలుపు కాదు, ధ్వంస రచనలో నిట్ట నిలువునా మునుగుతున్న
ఒక ఆక్రందన,ఒక అర్తనాదం, నిస్సహాయ ఆక్రోషం, గాయం నుంచి కారే కన్నీళ్ళు
గాయం నుంచి కారే కవిత్వం. ప్రేయసి చేసిన గాయంలోంచి, విధి చేసిన గాయం లోంచి ఒంటరి
ముస్లిం బాధే కవిత్వమై ప్రవహించినట్లు, మెజారిటి మతం చేసిన గాయం నుంచి, అమెరికా చేసిన గాయం నుంచి ముస్లిం ఒంటరితనమే విశాలంగా పరుచుకున్న కవిత్వం
ఇక్బాల్ : నాకేం కవిత్వ మొస్తది అంటూనే
'' నా తోటలో పూలే లేవు
నన్ను పువ్వడిగితే ఎట్లా తెచ్చేది.'' కవిత్వం రాదంటూనే కవిత్వంలో మాట్లాడాడు.
ఇదీ సైగల్ గొంతులోని మెలాంకలీ అంటే.
సోవియట్ రష్యా వున్నపుడు ప్రపంచం బొమ్మ, బొరుసు వున్న నాణెం, బొమ్మ పోయింది.
బొమ్మ వుండొద్దు. బొమ్మ వుంటే దానికి చీమూ నెత్తురు వుంటాయి. అది ప్రశ్నిస్తుంది
ప్రపంచంలో కమ్యూనిజం ఓడిన తరవాత మరో బొమ్మ ఇస్లాం మిగిలే వుంది.
అదీ పోవాలి. ఇప్పుడు ఇస్లాం ప్రాణమున్న వైధ్యమున్న బొమ్మ. మొమ్మలుండొద్దు,
బొరులొక్కటే వుండాలి. అది ప్రపంచమైనా, భారత్ అయినా! అందరూ నిద్ర పోవాలి.
డాలర్ రెక్కల కింద. కాషాయం కరవాలాల కింద. ' అజా' లుండొద్దు. అరఫత్ లుండొద్దు
**
' దేశాలు స్వతంత్ర్యాన్ని కోరుతున్నాయి
జాతులు విమ్నుక్తి కోరుతున్నాయి.'
ఏమైంది? ఇన్ని దశాబ్దాల తర్వాత? ఒక జాతి అణిచివేతను ప్రశ్నించిన ప్రపంచ కవుల
సంకలనం ఇంకా రాలేదు, కాని అదే ప్రశ్నతో అచ్చిన ఆంధ్ర దేశ ముస్లిం కవుల సంక
లనమిది. స్కైబాబ, అన్వర్ ల ముందుమాటలు ఈ సంకలనాన్ని తెరిచే ''సెషామ్‌ '':
''నీకు బురఖా అంటే తల్లో, చెల్లో, భార్యో, బంధువో
కాని కాషాయానికి బురఖా అంటే తురకదే!
...
అరే సాయిబూ!
పిల్లల్ని పుట్టిచ్చుడే కాదు
అప్పుడప్పుడు పిల్లల్ని కాపాడుకుందాం '' ...అన్వర్
నీళ్ళు నమలకూండా సూతిగా, స్పష్టంగా మొదలవుతుందీ సంకలనం.
' నబూత్ ' అనే కవితలో
ఇక్కడే
నా ఘర్ ఒకటివుండాలి
కిలకిలా నవ్వుతూ స్వాగతం పలికే
' దెహ్ లీజ్ ' ఒకటి వుందాలి!
ఇక్కడే ఎక్కడో తప్పిపోయిన
నా ' తకదీర్ ' కోసం వెతుక్కుంటున్నాను
' తన్‌హాయి' ని తలకు చుట్టుకొని.......' అంటూ సాగుతుంది.
గుజరాత్ ఘటనపై స్కైబాబ :''కుడికన్ను చూస్తుండగానే
ఎడమకన్ను పెరికివేత
భార్యల కను రెప్పలమీదే
భర్తల దహనం!
భర్తల పిచ్చి చూపులముందే
బరిసెలు దిగబడిన యోనుల రక్తం ''

ఇషాఖ్ మహమ్మద్ : ''అక్కడ మతోన్మాదం

రక్తపు హోళీ ఆడుతోంది
అది రక్తం కాదు
రంగు నీళ్ళని బుకాయిస్తోంది ''

గౌస్ మొహియుద్దీన్‌: ''ఆ చమేలీ నవ్వు
చమన్‌ లో పూసినందుకే
రెమ్మారెమ్మా విరచబడింది ''

జమీలా నిషాత్ : ' ఆ ఇళ్ళ బూడిద
మమ్మల్ని పిలుస్తోంది
విరిగిన తలుపులు
చప్పుడు చేస్తున్నాయి ''
మహమూద్ : '' తప్పిపోయిన బంతిలా
తన బాల్యాన్ని వెతుక్కుండున్నాడు
తల్లీతండ్రినీ వెతుక్కుంటున్నాడు
రెగిపడిన మాంసం ముద్దలతో
పోల్చుకుంటున్నాడు.''
యాకూబ్ : ' నేనేం చేసాను
నా శరీరంలో కోర్కెల్ని తీర్చే
ఒక మర్మాంగం కూడా ఉందని తెలియనిదాన్ని ''
షాజహానా: '' ఆకాశాన్ని చీరి
చందమాను లాగిపారేస్తే
చీకటి అమవాస్య
ఆ తల్లి కడుపులోంచి మాట్లాడుతున్నాను ''
.....కవుల పేర్లు తీసేసి చదివితే ఇది ఒక దీర్ఘ కవిత్గా కనిపిస్తుంది కదూ.
అవును అంద్రిలోనూ బీభత్సం, ఒకే రకంగా రక్తాన్ని మరిగిస్తున్నప్పుడు
అందర్లోంచి వెలువడిన ఒకే కావ్యమిది. ..
ఈ సమీక్షలో మొదట్లో కోట్ చేసినట్లు దేనీ అస్థిత్వం దానిదే, దేని గౌరవం,

దేని స్థానం దాని కివాల్సిందే. అలా కాకపోతే అది, వైవిధ్యంలేని, అంద విహీనమైన
శిలా సదృశమైన దేశమౌతుంది. ప్రపంచమౌతుంది.
అంత వికారమైన దేశమెందుకు? ప్రపంచమెందుకు??
_________________________________
పేజి 187-189 . ముల్కి - ముస్లిం సాహిత్య సంకలనం (వ్యాసాలు, రిపోర్ట్లు, కవితలు, సమీక్షలు )సంపాదకులు : స్కైబాబ, వేముల ఎల్లయ్య హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ జూలై 2005 వెల రు.65/- మా బి.వి.కె. గ్రంథాలయంలో ఈ పుస్తకమున్నది.
__________________________________
2.9.2013 9.51 am.