Wednesday, January 30, 2013

*
కపిల రాంకుమార్|| రజితోత్సవం|| **

సువిశాల
సుందర
రమణీయ ఉద్యానవంలో
మనోహర ప్రకృతీ రమణీయంలో
కోకొల్లలుగా జాజులు
విరబూచిన తరుణంలో
ఇంతుల సిగలోని
బంతిపూల హ్ర దయాంతరంగ
తరంగ పంక్తుల్లో
విలాస, విహారమాశించిన
శుభ దినంలో
ఈ శ్రావణంలో
ఆ వనంలో
ఒకచోట
ఆ నల్లబండమీద
వేపచెట్టు దక్షిణపు నీడన
కుక్కలు చింపిన విస్తరిలా
విసిరేసిన విస్కీ బాటిల్లా
అంత నీచంగ కనబడ్డా
మంచి వయసుగ
మనసు దోచేలా
మరులు కొలిపేలా
ఈలవేసేలా
జాలి కలిగేలా
జడవిరబోసుకున్న సుకుమారి
నగ్న శరీరంలా
నాగరికతా ప్రపంచంచే
మోసం చేయబడ్డ వనితలా
విధి వంచితయై
మనో వేదితయై
విరహంతో - విరసంతో - నీరసంతో
సృంఖలాలు తెంచుకొని
స్పందనాలు కలిగించుకొని,
బంధనాలు విడగొట్టుకొని
రజితోత్సవ వత్సరాన
రజ:తమోగుణాలు విరబూసిన
మన దేశం - ఈ వనిత!
ఎన్నో పంచవర్ష ప్రణాళికలు
ప్రవేశించాయి,
ఆక్రోశించాయి,
ఆవేశించాయి,
అలసట చెందాయి
ఆయాసం తీర్చుకుంటున్నాయి!
కట్టుబడిలోనే వున్నాం!
పెట్టుబడిలోనేవున్నాం!
అడపా దడపా ముట్టడికి
గురౌతూనేవున్నాం!
ఎంతమంది రాజులు-తరాజులు
తమ ఫోజులు చూపించలేదు?
ఈ బూజులు దులుపుతామని
రోజులు దాటించలేదు?
యెంతమంది చేతగాక గాజులు తొడుక్కోలేదు?
ఆ నాటి జాజులు వాడిపోయాయి!
వాటిపై మోజులు తీరిపోయాయి!
'' మాసాలు గడుస్తున్నకొద్ది
మోసాలకు గిరాకీ పెరుగుద్ది! "
పామరుడి నోటవచ్చిన మాట
విలువైన వరహాల్ మూట
ప్రగతి ప్రపంచానికి కొత్త బాట!
కని పిస్తోందిచూడు దూర దూర తీరాలలోని
దేస దేశాలలోని రాజకీయ చైతన్యం!
శ్రామిక - కర్షక మేథావుల మస్తిష్కంలొ
కదిలే
మెదిలే
కుమిలే
వేదన - అవేదన
కనిపెట్టారా ఎవరైనా!
స్వాతంత్ర్యోత్సవం జరుపుకోవలెననియున్నా
సహజోత్సాహం నిండుసున్నా!
అందుకే మౌనం వహించి యిలా ఓ గేయం రాసి కూర్చున్నా!
__________________________________________
30.01.2013 10.50 am.
_____________
** 15.08.1973 న - పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శ్రీమాం పెద్దింటి సూర్యనారాయణ్ దీక్షితదాసురధ్యక్షతన, నరసాపురం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ అతిథిగా హాజరై జరిగిన కవిసమ్మేళనం లో చదివినది.

Tuesday, January 29, 2013

ఒక్క పలుకు

కపిల రాంకుమార్ || ఒక్క పలుకు ||
వక్క పలుకు ఒంటికి హాని
ఒక్క పలుకు యింటికి హాయి!
నన్నయ చెప్పినదదే!

నీ ఓటు వోటి పోతోంది కాని
తూటా కావడంలేదెందుకని?
తల పట్టుకుని కూర్చోడం కాదు
తలపడటం నేర్చుకో!

నా పాట
పగ పట్టదు కాని
పగను పెంచుతుంది!

నా మాట
తూటాలంటిదే కాని
నా మనసు మిఠాయి సుమా!

నుదిటి రాతను  చదువలేం
చేతిరాత మాత్రం చదువగలం
మన అంతరంగాన్ని ఆవిష్కరించేదే అది!

నీ అడుగులు తడబడుతున్నాయి
నిలదీసి అడుగలేక
బడుగువనే భయం!
వెనుకబడితే - నీ వెంకాలే బడిత వస్తుంది
తిరగబడితే
ఆ బడితే పారిపోతుంది!

'' ఇస్తా యిస్తా నన్న వారిని -
వస్తా వస్తా నన్న వారిని నమ్మొద్దంటే
సామెతలంటూ నన్ను తిట్టావు!
 సర్కారీ మాటల్ మర్మం తెలిసి
ఇపుడేమంటావు?

'' పోరాడితే పోయేవేమీ లేవు - బానిస సంకేళ్ళు తప్ప ''
అది రాజకీయ నినాదమని కొట్టిపారేసావు!
ఇప్పూడా పోరాట ఆరాటమే శరణ్యమయిందికదా!
నిజం యెప్పుడూ  చేదు మాత్రే
చేదుతో కాని వున్న మాయరోగం పోదని తెలుసుకో!

ఇవి ఊసుబోని కబుర్లు కావు!
ఊపిరి పోసే ' ఖబర్లు !లేవో!
29 జనవరి 2013 ఉదయం 9.21


Sunday, January 27, 2013

'' ప్రణయ తపస్సు ''

శ్రీ రావెళ్ళ వెంకట రామారావు (గోఖినేపల్లి - ఖమ్మం) వారి కవిత
'' ప్రణయ తపస్సు ''

మధురామృతము గ్రోలి మత్తెక్కినానే,
కలికీ! నీ కన్నులలో కవితగన్నానే!

ప్రణయ దేవత పొందు ప్రాప్తిగన్నానే,
కలమెత్తి నీ కీర్తి కవిత రాసేనే!

తారుణ్య లావణ్య తను, గ్రోలినానే,
సరళ హృదయపు వీణ సారించు తానే!

అనురాగ జలధిలో అడుగులుంచానే
గళమెత్తి నీ ప్రేమ ఘనత పాడేనే

వాక్సుధ ధార్ల్లో ప్రవహించి నానే
చిత్తాన నీ మూర్తి స్థిరపరచినానే!

వలపు తేనియ ద్రావి పులకరించానే
భావమందున ప్రణయ సేవ జేసేనే!

మహనీయమౌ రాగ మహిమగొలిచేనే
నిత్య జీవిత శ్రమల నేను గెల్చెదనే!

ప్రణ్య ' ఓంకార " మే  పఠన జేసేనే
స్వర్గ సుఖముల యిలనె సాధించుతాన!.

(రాగ జ్యోతులు - గేయ సంపుటి -ప్రథమ ముద్రణ 1954 జయ ఉగాది 1954 వెల నాల్గణాలు -తెలంగాణా రచయితల సంఘం, ఖమ్మంమెట్టు - పేజి. 12-13)
ఆ నాటి వారి పదాలు, లాలిత్యం, తెలుసుకోటం కోసం పోస్టు చేసాను)  27.1.2013 ఉ.10.42.
శ్రీ రావెళ్ళ వెంకట రామారావు (గోఖినేపల్లి - ఖమ్మం) వారి కవిత
'' ప్రణయ తపస్సు ''

మధురామృతము గ్రోలి మత్తెక్కినానే,
కలికీ! నీ కన్నులలో కవితగన్నానే!

ప్రణయ దేవత పొందు ప్రాప్తిగన్నానే,
కలమెత్తి నీ కీర్తి కవిత రాసేనే!

తారుణ్య లావణ్య తను, గ్రోలినానే,
సరళ హృదయపు వీణ సారించు తానే!

అనురాగ జలధిలో అడుగులుంచానే
గళమెత్తి నీ ప్రేమ ఘనత పాడేనే

వాక్సుధ ధార్ల్లో ప్రవహించి నానే
చిత్తాన నీ మూర్తి స్థిరపరచినానే!

వలపు తేనియ ద్రావి పులకరించానే
భావమందున ప్రణయ సేవ జేసేనే!

మహనీయమౌ రాగ మహిమగొలిచేనే
నిత్య జీవిత శ్రమల నేను గెల్చెదనే!

ప్రణ్య ' ఓంకార " మే  పఠన జేసేనే
స్వర్గ సుఖముల యిలనె సాధించుతాన!.

(రాగ జ్యోతులు - గేయ సంపుటి -ప్రథమ ముద్రణ 1954 జయ ఉగాది 1954 వెల నాల్గణాలు -తెలంగాణా రచయితల సంఘం, ఖమ్మంమెట్టు - పేజి. 12-13)
ఆ నాటి వారి పదాలు, లాలిత్యం, తెలుసుకోటం కోసం పోస్టు చేసాను)  27.1.2013 ఉ.10.42.

Saturday, January 26, 2013

మీకిది తగునా?

కపిల రాంకుమార్|| మీకిది తగునా?||

నా ఊసెందుకు మీ తిట్ల పురాణంలో
నేను మోసే బ్రువు అంత సులువనా!
జాగ్రత రేవు పెట్టేస్తాను!

నా పేర్ రెట్టిస్తారెందుకు?
నమ్మకద్రోహులకు నాకు పోలికా?
ప్రాణాలకు తెగించే విశ్వాసం మీకుందా?

నాతో పోలికేంటి? బద్ధకస్తులకి
పొలందున్నినా, బండిలాగినా
పోటికి రాలేరు!

కాకి ముక్కుకు దొండపండని
మూతి విరుపెందుకు?
నే ముట్టితే కదా
మీ పితృ దేవతలకి ఆత్మతృప్తి?

ఇక నుండి మిమ్మల్ని మీరే పోల్చుకోండి
మాటలతో కాల్చుకోండి
మంచిచెడులుయెంచుకోండి
కలుపు మొక్కలనేరితేనే
స్వార్థ పరుల ఆటకట్టు!

ఉపమానాలతో మావూసులెత్తకండి
ఎంతసేపు యెదుటివారినెంచటం కాదు
మీ వీపుపై మరకల్ని చూసుకోండి
మాలావెనుకచూపుండదుగా!

మాకు కినుక తెప్పించకండి!
తరువాతి పరిణామాలకు
బాధ్యత మాత్రం మీదే!
తస్మాత్ జాగ్రత!

కపిల రాంకుమార్ 26.01.2013 ఉ.5.03

Friday, January 25, 2013

సమకాలీన కవిత్వంలో - నిఖిలేశ్వర్,

సమకాలీన కవిత్వంలో

- నిఖిలేశ్వర్, 9177881201
01/10/2012

TAGS:

ఆరేడు దశాబ్దాల మీదుగా పయనించిన మన సమకాలీన తెలుగు కవిత్వం ఒక సజీవ ప్రవాహం! ఈ ప్రవాహంలోని ఆటుపోటుల మధ్య కొందరు కవులు మాత్రమే తమ సత్తాను నిరూపించుకోగలిగారు. మరికొందరు పదాల అల్లికతో, ప్రాసల గారడీతో చప్పట్లు కొట్టించుకున్నారు. ఇక సామాజిక- రాజకీయ అవగాహన లోపించిన కొందరు అంతే త్వరగా కాలగర్భంలో కలసిపోయారు. ఆత్మ సంతృప్తికోసమే రాయాలనుకునే కవులు ఎటుతోచని స్థితిలో ఏదో ఒకటి రాస్తున్నారు. తమ భావజాలాన్ని సంక్లిష్టంగా వ్యక్తీకరించి చివరికి- ‘‘ఎవరికీ అర్థంకాని నా కవిత్వం ఎవరిని ఉద్ధరించడాని’’కని మానుకున్నారు. ఇక మానవీయ సంవేదనను గుండెలకు హత్తుకునేలా వ్యక్తంచేసిన కవులు ఏ కాలంలోనైనా స్వల్పంగానే వుంటారు. దృశ్య- శ్రవ్య అనుభవాలను అంతే గాఢంగా అక్షరీకరించేవారు కూడా కొందరు మాత్రమే! వచన కవితా ప్రక్రియలో రచనలు చేస్తున్నవారు ఈ రోజు వందలాది సంఖ్యలో వున్నారు. వీరిలో చాలామంది ఏదో ఒక అంశంపై వెంటనే స్పందించి, పత్రికలకు ఎక్కేయాలనే ఆదుర్దాకొద్ది వ్యాస రచన సరళిలో రాసి కవిత్వమని భ్రమపడుతున్నారు. సుప్రసిద్ధ కవులు కొందరు నిస్సారమైన కవితలతో గత కీర్తి పెట్టుబడిగా ఉద్భోదలు చేస్తున్నారు. సమాంతరంగా మరోవైపు పునరుద్ధరణ ధోరణితో పద్య రచనను ప్రోత్సహించాలని, పౌరాణిక గాథలను- కులీన వాదనలను తిరగదోడుతూ, అదే మన సంస్కృతి పరిరక్షణ అని ఊదరగొడుతున్నారు. కవిత్వరూపమేదైనా సమకాలీనతను, ఆధునిక హేతువాద స్పృహను కోల్పోతే ఆ కవిత్వానికి ప్రాసంగికత వుండదు.
ఉద్యమశీలిగా నిరంతర చైతన్యంతో ప్రజలను స్పందింపచేసిన తెలుగు కవిత్వం- భావ, అభ్యుదయ, దిగంబర- విప్లవ భావజాలంతో సాహిత్య సామాజిక దిశలను స్పష్టంగా చూపించింది. ఆయా చారిత్రక దశల్లో ప్రజా ఉద్యమాలకనుగుణంగా వివిధ అస్తిత్వ పోరాటాలతోనూ తన అద్యాయాలను లిఖించింది. ముఖ్యంగా గత పాతికేళ్ల కవిత్వాన్ని నిశితంగా పరిశీలించినపుడు, తెలుగు కవిత్వ దశ-దిశ మారిపోయిన వాస్తవాన్ని అర్థంచేసుకోగలం. వివిధ అస్తిత్వ వాదాల మధ్య కొనసాగుతున్న సంభాషణలో, ఎన్నో వాద-వివాదాల చర్చలతో ప్రస్తుతం కవులు అనేక పాయలుగా- గ్రూపులుగా విడిపోయారు. కులం, ప్రాంతం, బాల్యం, ప్రపంచీకరణ, పర్యావరణ, మతం వంటి సమస్యల చుట్టూ కవిత్వం పరిభ్రమిస్తున్నది. వీటి ప్రమేయం లేకుండా అనిబద్ధ కవులుగా చలామణిలో వున్నవారు కొందరు, తామే అచ్చమైన కవిత్వం రాస్తున్నామని- తమ అంతరంగాల చీకటి గదుల్లో తచ్చాడుతున్నారు. కోల్పోయిన తమ గతంలోని ఆనందాన్ని- మాధుర్యాన్ని లేదా విషాదాన్ని ఏకరువు పెడుతూ వ్యక్తిగత ప్రతీకలు- ఉపమానాలతో తమకు మాత్రమే అర్థమయ్యే కవిత్వం రాస్తున్నారు. ఈ కవుల రచనా ప్రక్రియకు (ఉత్పత్తికి) ఎలాంటి ఎరువు - విద్యుత్తు అక్కరలేదు.
ఇక ఈ దశలోనే గతానుగతికంగా వచ్చిన ధోరణుల గురించి క్లుప్తంగా ప్రస్తావించి ఒక అంచనాకు రావాలనుకుంటే -
సామాజిక న్యాయంకోసం, ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా దళిత సాహిత్యోద్యమం ఈ దశలోనే పురోగమించింది. కవితాపరంగా కొందరు శక్తివంతమైన అభివ్యక్తినివ్వగలిగారు. దళిత కులాల స్పృహకు- చైతన్యానికి పూలే- అంబేడ్కర్- మార్క్స్ తాత్వికత ఒక దిశను చూపించింది. అట్టడుగు ప్రజల వేదనలకు- ఆకాంక్షలకు గొంతునిచ్చింది. అయితే వర్గీకరణ గొడవల్లో అనవసర రాద్ధాంతం చేసుకున్నారు కొందరు దళిత కవులు!
సమాంతరంగా స్ర్తివాద కవిత్వం ‘దేహరాజనీతి’ని అధిగమించే క్రమంలోనే- నిస్సంకోచంగా తమ శరీర బాధలను- అవమానాలను గాధలను బలంగా వ్యక్తంచేస్తూ పురుషాధిక్యతను సవాలుచేయగలిగింది. అనేక కోణాల్లో ప్రసరించిన ‘స్ర్తివాదం’ చివరికి పునరావృతమై స్తంభించిపోయింది. సామూహిక సామాజిక పోరాటాలను విస్మరించి వ్యక్తిగత పరిష్కారాలకు- పురస్కారాలకు పరిమితమైపోయింది.
మరోపాయ- మైనార్టీ అస్తిత్వవాదం. ముస్లీం సోదరుల ఆత్మనివేదన, సాంఘిక వివక్ష (మతపరంగా)కు ప్రతిరూపమే తెలుగులోని ముస్లిం కవిత. సాంస్కృతికంగా- భాషాపరంగా ఈ మైనార్టీ కవిత్వం తన విలక్షణతను కొంతమేర నిరూపించుకుంది. అయితే అవసరాన్ని మించిన ఉర్దూ పద బాహుళ్యంతో కవితాభిమానులకు అర్ధంకాకుండా, అధోపీఠికల (చ్య్యిఆ శ్యఆళఒ) అవసరాన్ని నొక్కి చెప్పింది.
కొంతకాలంగా ప్రాంతీయ అస్తిత్వ సమస్యల నేపథ్యంలో ఆయా మాండలిక పద ప్రయోగాలతో కవిత్వం వచ్చింది. తెలంగాణ ప్రజలు తమ ప్రాంతీయ సంస్కృతి పరిరక్షణకు ఆత్మగౌరవానికి, జల వనరుల సౌకర్యానికి రాజకీయంగా- పాలనాపరంగా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ మాండలికంలో కవితలు- కథలు ఆయా సంకలనాలు సంపుటాలుగా వెలువడుతున్నాయి. ప్రాంతీయ అసమానతలు తొలగిపోడానికి ప్రజల బాధలను - గాథలను వారి వాడుక భాషలో- యాసలో వ్యక్తం చేయడం ఒక సాహిత్య పరిణామం. అయితే మాండలికాన్ని కృత్రిమంగా సందర్భ రహితంగా ఉపయోగించినందువల్ల కవితా రచన పేలవమై నిస్సారమైపోయింది. తెలంగాణ తెలుగు మాత్రమే అచ్చమైన తెలుగు భాష అని మన తెలుగు భాషా పరిణామక్రమాన్ని, చారిత్రక వికాసాన్ని నిరాకరించడం అవివేకమైన చర్య. తెలుగు ప్రజల ఉమ్మడి సాహిత్య- సాంస్కృతిక వారసత్వం ఒక చారిత్రక సత్యమనే యధార్థాన్ని విస్మరించలేము. ఈ దశలోనే ఒక మంచి పరిణామం- తెలంగాణ ప్రాంత సాహిత్య- సాంస్కృతిక రినైజాన్స్- పునర్ వికాస క్రమంవల్ల అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.
ఆయా దశల్లో వచ్చిన మన అత్యాధునిక తెలుగు కవితా పరిణామాల నేపథ్యంలో ఆలోచిస్తే- ప్రపంచంలోని ఏ భాషలోని కవిత్వానికైనా సమానంగా సమ ధీటుగా - సగౌరవరంగా మన కవిత్వం నిలిచిందనే వాస్తవాన్ని మరచిపోలేము. ఇంగ్లీషు- హిందీలో వచ్చిన ఆయా భాషా కవిత్వాల అనువాదాలను చాలాకాలంగా చదువుతున్న అనుభవంతో నేను ఈ మాట చెబుతున్నాను. ఇక ప్రస్తుతం మన వర్తమాన దశను నిర్మొహమాటంగా- విమర్శనాత్మకంగా అంచనా వేస్తే ఎదుటవున్న దృశ్యం - అస్తిత్వం - కవుల కెరీరిజం - ఆశ్రీత పక్షపాతం - ముఠాతత్వం - నేల బారుగా వస్తున్న శుష్కమైన రచనలు- ఉద్యమాల పట్ల భ్రమవిచ్ఛిత్తి, అంతిమంగా ఖరీదైన అందమైన అట్టల వెనుక ఊరేగుతున్నాయి. అందువల్లనే ఈ అసంబద్ధమైన పద చిత్రాలను, పేలవమైన భావజాలాన్ని చూసి - ఇంతకు మన కవిత్వం దిశ ఏమిటి? అని కొందరు విమర్శకులు- పాఠకులు ప్రశ్నలను సంధిస్తున్నారు. ఈ ప్రశ్నలకు జవాబుగా మనం- గత దశాబ్ద కాలంలో వచ్చిన అసంఖ్యాక కవితా సంకలనాలను- వ్యక్తిగత సంపుటాలను పరిశీలించవచ్చు. మిత్రులు రామచంద్రవౌళి, దర్భశయనం, పాపినేని విడివిడిగా వార్షిక కవితా సంకలనాలు వెలువరిస్తూ సమకాలీన కవిత్వానికి వేదికలవుతున్నారు. జిల్లాల వారిగా సంకలనాలు వచ్చాయి. వీరందరిని మనం మనసారా అభినందించవచ్చు.
ఇంతకు ఈ కవితా సంపుటాలు- సంకలనాలు పుస్తకాల షాపుల్లో ఒక మూలన పడివున్నా కొందరు తెలుగు కవులు కీర్తికాంక్షతో - కొంత నిష్కామకర్మతో ఆర్థికంగా నష్టపోయినా, వందలాది సంఖ్యలో తమ కవితా వ్యవసాయాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆత్మసంతృప్తితో పేఠికలు, పొగడ్తలు స్వాతిశయంతో విజృంభించేసరికి, ఈనాటి కవిత్వాన్ని చివరికి ఆ కవులు మాత్రమే చదువుకుంటున్నారనేది మరో చేదు నిజం! ఇటీవల ఒక పాజిటివ్ పరిణామాన్ని మన గమనించవచ్చు- ఇంటర్నెట్, ఫేస్‌బుక్‌ల ద్వారా తెలుగులోకి కొత్త కవులు రంగంలోకి ప్రవేశిస్తున్నారు. వేలాది మంది ఈ కవిత్వాన్ని పంచుకుంటున్నారనే వార్తను ఆహ్వానిద్దాం మనసారా! కవి సమ్మేళనాలు - సామూహిక పఠనాలు క్షీణించిన ఈ దశలో ఇదో శుభపరిణామం. కవిత్వంలో ఎప్పుడైనా నూతన వ్యక్తీకరణ, భాషపై పట్టు కొత్త అనుభవాలతో వచ్చే ప్రతీకలు, నిజాయితీ, సరళత్వంతోపాటు కవుల జీవన నిబద్ధత- స్పష్టమైన సామాజిక అవగాహన- గాఢత వుంటే తప్ప అంతరంగంలోని నిజం కవిత్వంగా వెల్లువెత్తదు. అలాగే ఈ వర్తమాన కవితా పరిదృశ్యంలో ఇప్పుడు మహాకవులు - కవితా ప్రవక్తలనే వారు ఎవ్వరూ లేరు!!
కవిత్వం మెదడులో వున్నంత కాలం గర్భస్థ శివువే అని అంటున్న కొడవటిగంటి కుటుంబరావుగారు ఒక వాస్తవాన్ని విడమర్చి చెబుతున్నారు- ‘‘ప్రచురణ అయినప్పుడు అన్ని కవితలూ ఒక్కటే- వాటి జాత్య లక్షణాలు భిన్నం కావచ్చు గాక - కాని బయటికి వచ్చి, పుష్టి సంపాదించుకుని, పెరిగి పెద్దవై చరిత్ర ప్రసిద్ధాలవుతాయి. కొన్ని ఈసురోమంటూ జీవిస్తాయి. కొన్ని పురిట్లోనే సంధిగొట్టి పోవటమూ కద్దు.’’ (జ్యోతిమాస పత్రిక - జనవరి 1970)
ఇక అంతిమంగా కాలం మాత్ర నిర్దయగా కవిత్వంలోని చెత్తాచెదారాన్ని ఊడ్చి పారేస్తూనే వుంది. చక్కని చిక్కని ఉత్తమ కవిత్వాన్ని రాసే కవులను అక్కున చేర్చుకుంటున్నది! మనందరి అనుభవంలోకి వస్తున్న యధార్థమిది!http://archive.andhrabhoomi.net/content/contemporary-poetry

||'' మెరికలు ''||

కపిల రాంకుమార్||'' మెరికలు ''||
1
సంక్షేమ పథకాలు
సంక్షోభంలో పడ్డాయి
తమ క్షేమం పెరిగి
జన క్షేమం మరచి!
2
పోలీసులకు లేదు బలం
పాలసీలో యేది నిజం - ఆరుద్ర
సంస్కరణలు బేహోష్
మార్పుల్ పైపై పాలిష్
పోలీష్ మాలిష్ - మింగును ఆయుష్!
3
సగానికి సగం యాభై కాదట
సగంలో సగం పాతికేనట!
సమానవాటా బిల్లు పెద్దల చిల్లు
జాషువా యేనాడో చెప్పలేదా
మన నేతలే దానికి అడ్డు!
4
బరువులసంచీ చదువు
యశపాల్ వద్దన్నా
ఎల్కేజీ తు ఇంటరు వరకు
మూటలు మోసే కూలీలుగా
తయారుచేయటమే కద్దు!
దండనలేని చదువొక నినాదం
బండమోతలేని విధానం కాదా!
దండగ మారి యోచనలౌ కాకపోతే?
5
చూస్తున్నరు కదా తీస్తున్నాం
తీస్తున్నరుకదా   చూస్తున్నాం
ఓకరికొకరు తప్పించుకునే వాదన!
మరి విజయవంతమౌతున్న
కుటుంబ చిత్రాల మాటేమిటి
చిత్రాల మోజులో జరుగుతున్న నేరాలమాటేమిటి?

25-01-2013 . 4.50 am.

Wednesday, January 23, 2013

|| శాడిజం ముర్దాబాద్||

కపిల రాం కుమార్|| శాడిజం ముర్దాబాద్||

వీడొక కొత్తరకం వ్న్మాది (శాడిస్టు)
పదేళ్ళ కాపురం
ఓ రెండేళ్ళ కొడుకు
ఇప్పుడేమొ మొహం మొత్తింది
కొత్త పిట్టను వలేసి పట్టాడు
పెళ్ళాన్ని వదిలించుకోవాలికదా
ఆ బిడ్డ్ తన బిడ్డ కాదని వింత వాదం
అక్రమ సంతు అని కొత్త తంతు

***
భార్య విలవిల
న్యాయ పోరాటం
డి.ఎన్.ఏ పరీక్ష
ఆమెకు వ్యతిరేకం
మనోడి పంట పండింది
కోర్టులో విడాకులు
రిపోర్ట్ ఆధారంగా!

***
ఆమెది అరణ్య రోదన
మేలుకున్న మీడియా
రహస్య శోధన
వెలుగులోకి పచ్చి నిజం
అమ్ముడుపోయిన
వ్యవస్థ తప్పుడు నివేదిక

***

కట్టుకున్నోడని గుడ్డిగా
నమ్మకు వనితా
ప్రతీ దానికి ఆధారలుంచుకోకుంటివా
ముప్పులు తప్పవు సుమా!

***

మృగాడి పథకం తిరగబడి
చట్రంలో అరదండం!
పదాలంటె ఆ మాత్రం
చైతన్యం పొందక తప్పదు!

23-01-2013 సా> 7.02

నన్నయ హితోక్తులు!

సభా మర్యాద

సభలో ఎలా మాట్లాడాలి? (యయాతి బోధన)

మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్

సభలో మనసుకు ప్రియంగా ఉండే హిత వాక్యాలే చెప్పాలి. చాలా మితంగా మాత్రమే మాట్లాడాలి. అదీ సరళంగా, ఎదుటివారు నొచ్చుకొనని రీతిగా మాట్లాడాలి.
సత్యవాక్యం విలువ

నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు, మఱి బావులు నూఱిటికంటెనొక్క స
త్క్రతు వది మేలు, తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు, త
త్సుతు శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్

నూరు నూతులకంటె ఒక బావి (దిగుడు మెట్లున్నది) మంచిది. నూరు బావులకంటె ఒక యజ్ఞము మంచిది. అటువంటి నూరు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు. నూరుగురు కొడుకులకంటె ఒక సత్యవాక్యము మేలు
శారద రాత్రుల వర్ణన

ఇది నన్నయ వ్రాసిన చివరి పద్యం - శరత్కాలపు రాత్రుల అందమయిన వర్ణన

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచిపూరము లంబరి పూరితంబులై

మెరిసే తారకహారాలపట్ల శారదరాత్రులు దొంగలుగామారాయి (తెల్లని వెన్నెలలో చుక్కలు బాగా కనపడవు). అప్పుడే వికసించిన తెల్లకలువల http://te.wikiquote.org/wiki/

Tuesday, January 22, 2013

|| అష్టపదాలు||

కపిల రాం కుమార్ || అష్టపదాలు||

దమ్ము చూపి దుమ్ము దులిపి
దిమ్మ తిరిగె తీర్పు నిద్దాం!
కొమ్ము పెరిగి కొమ్మలనూపె
రిమ్మ తెగులు మట్టుపెడదాం!
-1-
సొమ్ము పొగరు కమ్ముకున్న
కుమ్ములాటల ఆటకట్టుదాం!
జాలరా, జూదరా! కాదు
వాడు ఓటడగే బిచ్చగాడు!
-2-
మంత్రగాడు, తంత్రగాడు
యంత్రవేగపు మోసగాడు!
మీటనొక్కిన బల్బు వెలుగున
బలుపు కాస్త తగ్గిపోవు!
-3-
నానబెట్టి సాగదీసి
తేట తెల్లం చేయకుండా
మొలకల పిలకలపై
ఉక్కుపాదం మోపుటేంది!
-4-
శుష్క వాగ్దానాలు
శూంస్య హస్తాలు
రిక్త సౌలతులు
భజన మండలులా!
-5-
కాంగీయుల గాంగేయులు
నిప్పులగుండం తొక్కేరు
కాలు వాచి కీలు విరిగి
కూలబడిరి వెన్నువిరిగి
-6-
చేతుల పనిదాటి
నోటి దురద హెచ్చి
అపవాదుల బురదలోన
అనివార్యపు తప్పిదాలు
-7-
రాబోయే సాలుకు యే హస్తగతాలు జారి
అయారాం గయారాం కొల్లేటీ తాడంత బారులు
విదేశీ పక్షుల్లా యే గూటికి వలసలో!
వెండి తెర వినోదం త్వరలోనే విడుదల!
--8--
ఈ '' నెల వంక '' ను చూడకు
అపశ్రుతులొస్తాయి!
'' ఈనెల " వంక చూడకు
చూపులకే మొక్క మాడిపోయె!
ఈ ' నెల ' వంకను చూడకు
జేబుకు చిల్లులే
ఈ నెలవు నీది కాదు
భంగ పడతావు!

22-01-2013 ఉ.10.34

| ఎన్నికలు – ఎన్ని కలలు?||

కపిల రాంకుమార్|| ఎన్నికలు – ఎన్ని కలలు?||
ఎన్నికల్లో ఎన్ని కలలో – సోషలిజపు పిచ్చి భ్రమలు
ఓట్ల బాంకులు కొల్లగొట్టే జిత్తులమారియెత్తుగడలు
కట్ట గుడ్డ తిన రొట్టె ఉండగూడు ఓటుకొరకు
కళ్ళు పొడిచి వేళ్ళు కూరికె వేనవేల్ వరములెన్నొ!
తీర్చబోవగ నికి ధనము లేదని తీర్చడానికి చేతులడ్డమని
తీర్చజాలక తలలువంచియు వంకలెన్నొ వెతుక గలరు!
పదవి వస్తే మరుపు వచ్చును పదవి పోతే ప్రేమ పుట్టును
పెదవి తడిసిన ఒక యెత్తు పెదవి విరిచిన యిక చిత్తు!
గోడమీది పిల్లి మాదిరి గోడ దాటె అదును కోసం
నోట్ల సంచుల రాక కోసం యెదురు చూచు వెంగళాయిలు!
పరువు సైతం మదుపు పెట్టి ఓటువేసె క్షణంలోనే
అనుభవాల నేర్పు తోన పిచ్చివాళ్ళుగ చేయగలరు!
నిన్న తిట్టి నేడు పొగిడి
రేపు ముంచి రేవు దాటి
ప్రభుత పేరున డబ్బు పొంది
జనత నోటిన మట్టి గొట్టి
పారిపోయె దొడ్డ దొరలకు
దొడ్డిదారిని పీఠమెక్కగ
గడ్డిసైతం మింగటంలో
గోల్డ్ మెడలు బోలెదొచ్చాయి
ప్రజల చేతికి చిప్పలొచ్చి
తిప్పలెన్నో దెబ్బ తీసాయి!  

(కవిత్వంలో ఓనమాలు దిద్దుతున్న రోజుల్లో 1968)

Monday, January 21, 2013

|| ఆ నలుగురు ||

కపిల రాం కుమార్ || ఆ నలుగురు ||

వెర్రితలల వికృత చేష్టలకు
సభ్యసమాజం తలదించుకుంటే
ఓ నలుగురి విధినిర్వాహణా
రాహిత్యమే కారణం!

మనోక్షీరంలో వికృతపుటాలోచన
విషపు చుక్కై మైకంతో
పడమటి గాలి వాటుకు
చంకలెగరేసుకుంటూ
నాగరీకులమంటూ
తందనాలాడే వారిని సత్పౌరులుగా
మలచలేని ఆ నలుగురే బాధ్యులు!

కమ్మనైన మాతృభాషలో
ముద్దు మురిపాలతోపాటు
మచ్చికతీర గోరుముద్దలతో పాటు
బుద్ధు నేర్పని తల్లి -
ఒకటో ముద్దాయి!

తడబడే అడుగులు
తప్పటదుగులు కాకుండా
అడ్డాల్లో బిడ్డకాని గడ్డాలప్పుడు బిడ్డలా
సమర్థించుకోచూచి,
నిఘావుంచని తండ్రి
రెండో ముద్దాయి!

దండం దశగుణం భవేత్ - అన్నరని
అతి చేస్తేనో - అసలు మిన్నకుంటేనో
గోడలుదూకి, చదువులెగ్గొట్టి
స్నేహితులవలయంలో
చిక్కుకునే విధ్యార్థికి
మార్గమేయలేని ఉపాధ్యాయుడూ
మూడో ముద్దాయి!

వ్యక్తిత్త్వం దిగజార్చి
అవ్యక్త ప్రేలాపనలు
ఉచితానుచితాల తేడా
గమనించక ప్రవ్రించే వాణ్ణి
సరిదిద్దలేని స్నేహ సమాజమూ
నాలుగో ముద్దాయి!

వీరి నిర్లక్ష్యాని తోడు
ఇంగితం యిసుమంతలేని
వాడు భావి క్రౌర్యుడు కావటానికి
ఆ అవలక్షణాలు పునికిపుచ్చుకోవటానికి
ఆ నలుగురేగా కారణం!

మనమూ ఆ నలుగురిలో ఒకరం
మన పద్ధతి మార్చుకొని
మరొక క్రౌర్యం జరుగకుండా
జాగ్రత పడక తప్పదు!
ముద్దాయిగా మారొద్దు!

జంట కవుల పరిచయం: వేంకట పార్వతీశ్వరులు

జంట కవుల పరిచయం: వేంకట పార్వతీశ్వరులు
ముద్దుకృష్ణ సంకలనం - వైతాళికులు --(మొదటి ముద్రణ 1935)విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ -విజయవాడ ఏడవ ముద్రణ్ 1969 నుండి - కవులు - కవితా పరిచయం: వేంకట పార్వతీశ్వరులు .) పేజి -186:

ఆశ - నిరాశ
పెరటిలోనున్న యేడాకులరటి చెంత
బెద్ద బావి జలంబుల బెంచికొన్న
మావిమోకకు గనవయ్యె గావిచిగుర
కావిచిగురున కాసించి గళమునెత్తి
గండుకోయిల పాడె రాగంబు లొలయ !

చివురు వెట్టని కొమ్మల జిన్నిపూలు
తావులింపార వికసించె; దానజేసి
మేలుకొలుపుల్ బాడ్చు నాలితేటి
యొక్కరీతినె చిందులు ద్రొక్కదొడగె!

కాంచుచుండగ నాకస్మికంబుగాగ
నెట్టిపాటుననొ మరేమొకాని
చిగురు నశియించె, బూవులు చిందిపోయె
జిన్నికోకిల యంతలో జిన్నవోయె
దుమ్మెదకుగూడ నేమియు దోచదాయె
విషమవిశ్వంబునకు నిది వింత పనియె!

>>>>21.01.2013 ఉ.9.39
__________________________________+
వేంకట పార్వతీశ్వరులు : వీరు ఒక విధంగా యుగ సంధిలోనివారు. భక్తీ పట్టున మహాపరవశులు. వీరి వాణీ కొండయేరువలె మంజుగానంతో అతిత్వరితంగా ప్రవహిస్తుంది. వైష్ణవగీతాలలోని ప్రేమోన్మాదం వీరి భావోద్రేకాన్ని ఎక్కువగా రగిల్చింది. భాష కూర్పులొ, పలుకు విధానంలో నూఝ్తనత్వాన్ని కల్పించారు.
ఓలేటి పార్వతీశం 1882 -1956 బాలంత్రఒఉ వేంకటరావు 1881 -
కృతులు 1. కావ్యకుసుమావళి, 2.ఏకాంత సేవ. 3. రత్నహారము

Sunday, January 20, 2013

ధాన్య లక్ష్మీ విలాపం -(గజ్జల మల్లారెడ్డి కవిత)

కపిల రాంకుమార్ || ధాన్య లక్ష్మీ విలాపం -(గజ్జల మల్లారెడ్డి కవిత)

నన్ను వలచిన పల్లెపట్టుల
కన్నియలు అందాల బరిణలు
కూర్మితో నన్నెత్తి కొంగుల
కూరి పొలముబు తీర్చి చక్కగ
దిద్ది వసుధ గర్భమందున
ముద్దుముద్దుగ నిద్రబుచ్చిరి!

పొరలు పొరలుగ నేలనంతా
తొలచి నాకై వెతికి మృత్యువు
అలసి సొల్సెను నన్ను కానక
ఎల్లలెరుగని బ్రతుకు కోరంక
పెల్లలను పెకిలించిలేచితి
పచ్చ పచ్చని సస్యములు నా
రక్షణకు అరచేతులొడ్డెను
మృత్యువుకు దూరాన అది కడు
మొద్దు నిద్దుర మునిగి నంతట
నవ వసంత స్మీరణమ్ములు
నన్ను లెమ్మని తట్టిలేపెను
మొగ్గలన్నీ విచ్చి పొలముల
నిగ్గుతేలెను యవ్వన శ్రీ
అచ్చరలు తమ కప్పుకొప్పుల
మెచ్చి నను ధరియించి మురిసిరి
అలలు లలలుగ సాగుగాలుల
వుయ్యెలల్లో వూగి తూగితి
పళ్ళెరమ్ముల చషకములలో్
పరిమళమ్ముల విరియజిమ్మితి
అరుణ కిరణాంకూరములతో
మెరిసి మిలమిలలాడె వక్షం!

తళుకు జెక్కుల చిగురువాతెర
నిలువనీడగ వెలయవలెను
కోర్కె తప్ప మరొక్క వరమును
కోరమన్న కోరజాలను
నన్ను వలచిన పల్లెపట్టుల
కన్నియల అందాల్ బరిణల
అంకతలమునుంచి బలిమిని
అపహరించిరి నన్ను కొందరు
పణ్య వీధుల నిలిపి వేలము
పాట పాడిరి కొన్ని చోట్లను
ఇనుప చువ్వల, రాతి గోడల
ఇరుకు గుహలను దాచిరొక్చో
ఒక్కయెడ గోడౌను లనబడు
నట్టి గోరీల్లోన దూర్పిరి
గోతముల్లో కట్టిమూతులు
కుట్టి పాతాళాన త్రోసిరి
వల్లమాలిన నల్లవర్తక
ముల్లమును కంపింపజేసెను
నన్ను తలచే వారికోసం
నన్ను పిలిచే వారికోసం
హలము కొనతో బ్రతుకు నిచ్చిన
ఆ పునీతుల చెలిమికోసం
నేను సైతం కుములుచుంటిని
ఎదురుతెన్నులు చూచుచుంటిని
ఎచట దాగిరి గింజ గింజగ
ఎత్తి నన్నొడి నించువారలు
ఎవ్వరీ దాస్యాంధకారము
నుంచి నను రక్షించు వారలు?

(ఆలీ సర్దార్ జాఫ్రీ రాసిన '' అనాజ్ ''( ఉర్దూ కవితకు అనువాదం)
ఇది శంఖారావం (గేయ సంపుటి లోనిది పే.37-39) ముందుమాట శ్రీశ్రీ '' హలో పాఠకుడా!..అంటూ చక్కటి విశ్లేషణ్ రాసాడు) ఈ పుస్తకం విశాలాంధ్ర పబ్లికేషను -విజయవాడ - 2 ( మే 1968 ప్రచురణ) మా బి.వి.కె. గ్రంథాలయంలో వున్నది)

20/01/2013 సా. 4.26.

తెలుగు కవిత్వంలో వస్తు పరిణామ క్రమం

కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. దీన్ని బట్టి కవిత్వానికి ఏదైనా వస్తువు అవుతుంది. కవిత్వానికి వస్తువు అనుభూతి కావచ్చు. ఒక వర్గానికి, మరో వర్గానికి మధ్య శత్రుపూరిత సంబంధం కావచ్చు, కవికీ సమాజానికీ మధ్య జరిగే సంఘర్షణ కావచ్చు, కవిలో జరిగే అంతస్సంఘర్షణ కావచ్చు, ఒక సామాజిక వర్గానికి, మరో సామాజిక వర్గానికి మధ్యగల సామాజిక అంతరాలు కావచ్చు. వస్తువు లోకాధీనం, కాలాధీనం, రచయిత హృదయ భావన. అంటే కవితా వస్తువు అనంతమైందనేదిగా మనం అర్థం చేసుకోవాలి. వస్తువుకు, ఇతివృత్తానికి మధ్య తేడా తెలియక చాలామంది కొట్టుమిట్టాడుతుంటారు. వస్తువు ముడిసరుకు అయితే, దాన్ని శిల్పంగా మార్చడానికి వాడే ఇతరేతర కవిత్వ పరికరాలతో కలిపి అది ఇతివృత్తమవుతుంది. వస్తువు కేంద్రమైతే, దాన్ని కళాత్మకంగా వ్యక్తం చేయడానికి అవసరమైన సామాగ్రి, వాతావరణం మొదలైనవి కలిపి ఇతివృత్తమవుతుంది.
కాగా, వస్తుగత బాహ్య వాస్తవికతకు సంబంధించిన మన భావనను ప్రముఖ విమర్శకుడు త్రిపురనేని మధుసూదనరావు వస్తువుగా చెప్పారు. కవి భావన అంటే కవి దృక్పథమని చెప్పుకోవచ్చు. ప్రముఖ పాశ్చాత్య విమర్శకుడు క్రిస్ట్ఫర్ కాల్డ్వెల్- వస్తుగత బాహ్య వాస్తవికతను సైన్స్ అన్నాడు. అంతర్గత వాస్తవికత కళ అవుతుందని చెప్పాడు. అంటే, ఇతివృత్తాన్ని కూడా కలిపి కాల్డ్వెల్ వస్తువుగా భావిస్తున్నాడని అనుకోవచ్చు. అలా చూసినపుడు వస్తువు అంటే మనకు కనిపించే పదార్థమే కాదు, దాన్ని కళాత్మకంగా వ్యక్తం చేసే కవి దృక్పథం కూడా అని ప్రస్తుత కాలంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా చూసినప్పుడు తెలుగు కవిత్వంలో వస్తువు పరిణామక్రమాన్ని బేరీజు వేయడానికి వీలవుతుంది.
ప్రాచీన కవిత్వం నుంచీ భావకవిత్వం నుంచీ అభ్యుదయ వస్తువువైపు కవి దృష్టి మళ్లడం శ్రీశ్రీతో ప్రారంభమైందని అనుకున్నా దానికి ముందు కొంత కసరత్తు జరిగింది. ఒక వస్తువును వెనక్కి నెట్టి మరో వస్తువు కేంద్రంగా మారడానికి పాత వస్తువును నెగేట్ చేసే కవిత్వం వస్తుంది. అలాంటి సందర్భాల్లో అకవిత్వం కూడా కవిత్వంగా చెలామణిలోకి వస్తుంది. నిజానికి, అకవిత్వమే కవిత్వమవుతుంది. భావ కవిత్వాన్ని నెగేట్ చేస్తూ పఠాభి కవిత్వం వచ్చింది. భావ కవిత్వాన్ని తన వచన పద్యాలనే దుడ్డుకర్రలతో కొడతానన్నాడు. నేను భావకవిని కాను, నేనహంభావ కవిని అని ప్రకటించుకున్నాడు. అశ్లీలం అనుకునే పదాలతో కూడా అతను ప్రయోగాలు చేశాడు. అదే క్రమంలో శిష్ట్లా, నారాయణరావు కవిత్వాలు వచ్చాయి. శ్రీశ్రీ చేతిలో అభ్యుదయ కవిత్వం పూర్తిగా రూపుదిద్దుకుంది. అయితే, శ్రీశ్రీ కూడా పాత వస్తువును నెగేట్ చేసే పని పెట్టుకున్నాడు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణమంటూ పాత వస్తు స్థితిని వ్యతిరేకించాడు. ఈ కవిత వస్తు మార్పిడి సూచిస్తుంది. మహాప్రస్థానం కవితలు అభ్యుదయ కవిత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
సామాజిక పరిణామక్రమాలు కవిత్వంలో వస్తు మార్పిడికి దోహదం చేస్తాయి. అప్పటివరకు ఉన్న సామాజిక పరిస్థితులు, విలువలు మారినప్పుడు, మొత్తంగా సంపూర్ణ సామాజిక మార్పునకు అప్పటివరకు జరిగిన ఉద్యమాలు, పరిణామాలు సరిపోవనే భావన ఏర్పడినపుడు, లేదంటే కొత్త సామాజిక పరిణామాన్ని ఆధిపత్య వర్గాలు సంలీనం చేసుకున్నప్పుడు కవిత్వం వస్తువు మారాల్సి వస్తుంది. ఆ సంఘర్షణ నుంచి కొత్త వస్తువు రంగం మీదకి వస్తుంది. ముందే చెప్పినట్లు ఈ సంధి దశలో వస్తు మార్పిడికి ధిక్కార కవిత్వం దోహదం చేస్తుంది. అభ్యుదయ కవిత్వానికి ఆలంబనగా మారిన మార్క్సిస్టు ఉద్యమాలు నెహ్రూ సోషలిజాన్ని ఆలింగం చేసుకున్నాయి. పోరాట మార్గాన్ని వదిలేసి రాజీ మార్గాన్ని అనుసరించాయి. ఈ పరిణామం మనకు సాహిత్యంలో కన్నా తెలుగు సినిమాల్లో బలంగా కనిపిస్తుంది. మంచి జమీందారుకు, రైతు కూలీకి మధ్య సమన్వయాన్ని, సామరస్యాన్ని నెలకొల్పిన సినిమాలు అప్పట్లో చాలా వచ్చాయి. ఇటువంటి సందర్భంలో తెలుగు కవిత్వంలో వస్తు మార్పిడి అవసరం ఏర్పడింది. తెలంగాణ సాయుధ పోరాట వైఫల్యం ఆ అవసరాన్ని మరింత తెలియజేసింది. ఆంధ్ర, హైదరాబాద్ విలీనంవల్ల తెలుగులో ఆ దశను చాలా ఆలస్యంగా పసిగట్టారని చెప్పవచ్చు. విశాలాంధ్ర ఏర్పాటుతో కలలోనైనా వాస్తవం కనిపించకుండా పోయే పరిస్థితి వచ్చింది. అభ్యుదయవాదం పూర్తిగా పార్లమెంటరీ పంథాకు తీసిపోని రీతిలో ముందుకు రావడం తెలుగు కవిత్వాన్ని తీవ్రంగానే ప్రభావితం చేసింది. తెలుగు ప్రజలు భౌగోళికంగా కలిసిపోవడంవల్ల అభివృద్ధి, సాంస్కృతిక వికాసం, సామాజిక సమానత్వం సిద్ధిస్తుందనే భావనకు సామాన్య ప్రజానీకంతోపాటు మేధావులు, కవులు కూడా గురయ్యారు. అందుకే, తెలంగాణకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, కాళోజీ వంటివారు కూడా రెండు విభిన్న సమాజాల విలీనానికి సముఖంగా వ్యవహరించారు. అలాంటి సమాజం వస్తుందనే ఆశ తెలుగు కవిత్వంలో పాత వస్తువును నెగేట్ చేసే ప్రక్రియను జాప్యం చేసింది.
కలలూ ఆశలూ ఆశయాలూ కరిగిపోతున్న విషయాన్ని పసిగట్టి వారు ఈ సందర్భంలో దిగంబర కవులు మిగతా కవులకన్నా ముందుచూపున్నవారు మాత్రమే సంధి దశలోదాన్ని బద్దలు కొట్టడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తారు. అలాంటి పాత్రను పోషించినవారు దిగంబరకవులు. నన్నయ్యను నరేంద్రుడి బొందలో తోసియండి వంటి తీవ్రమైన వాక్యాలు దిగంబర కవిత్వంలో చోటుచేసుకున్నాయి. అభ్యుదయ కవిత్వాన్ని ప్రశ్నించే కవిత్వం నగ్నముని నుంచి వచ్చింది. వీరిలో కాస్తా దారి దొరికినవాడు చెరబండరాజు. వందేమాతరం కవితలో అది వ్యక్తమైంది. అది దారి కాదనుకున్నవారు ఆ సమయంలో బలమైన కవిత్వం రాసిన మహాస్వప్న తర్వాతి కాలంలో నిష్క్రియాపరుడు కావడానికి కవిత్వం సామాజిక పరిణామక్రమంలో ఉత్ప్రేరక పాత్ర వహిస్తుందని నమ్మకపోవడమే. దిగంబర కవిత్వం వినిపించిన ధిక్కార స్వరం నుంచి విప్లవ కవిత్వం ముందుకు వచ్చింది.
ఆ తర్వాత విప్లవ కవిత్వం జోరందుకుంది. అభ్యుదయ కవిత్వం బరిలో నిలచిన శ్రీశ్రీ విప్లవ కవిత్వ యుగంలోనూ అలానే నిలబడాలని ప్రయత్నించాడు. మహాప్రస్థానం, మరో ప్రస్థానం ద్వారా ఆయన విప్లవ కవిగా ముందుకు వచ్చాడు. ఇక్కడ దాదాపుగా నిబద్ధతకు, నిమగ్నతకు మధ్య విభజన రేఖ ఏర్పడింది. దీర్ఘకాలిక సాయుధ పోరాటం ద్వారా విప్లవాన్ని సాధించాలనే కవులు ఈ వైపు నిలిచారు. రాజకీయ నిర్మాణం కూడా ఏర్పడింది. దానికి ఆలంబనగా విప్లవ కవిత్వం మైదాన ప్రాంతం నుంచే కాకుండా అజ్ఞాతం నుంచి కూడా వెలువడింది. శ్రీశ్రీ విప్లవ కవిత్వానికి కూడా నాయకుడు కావాలని అనుకున్నాడు. కానీ విప్లవ కవిత్వానికి నాయకుడిని ఎంపిక చేయాలంటే శివసాగర్ మొదటి వరుసలో ఉంటాడు. శివసాగర్, అజ్ఞాతసూరీడు, కౌముది వంటి కవుల్లో విప్లవ సారం సృజనాత్మకంగా, కళాత్మకంగా వ్యక్తమైంది. వస్తువు అత్యంత బలమైన కళగా రూపుదిద్దుకుందని చెప్పాలి. ఈ రెండు కవిత్వాల హద్దులను చెరిపేయాలనే ప్రయత్నం చెరబండరాజులో కనిపిస్తుంది. విప్లవ కవిత్వంలో రెండు బలమైన పాయలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించి, విశే్లషించాల్సిన పని ఇంకా జరగాల్సే ఉంది. విప్లవ కవిత్వంలో పాట ఒక ప్రధాన ఆయుధంగా ఉంది. ఈ వ్యాసం వచన కవిత్వానికి మాత్రమే పరిమితమైంది కాబట్టి దాని గురించి ప్రస్తావించడం లేదు.
విప్లవ కవిత్వ వస్తువు ఒక సామాజిక పరిణామ దశలో మారాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సందర్భంలో విపశ్యనకవులు ఆ అవసరాన్ని గుర్తించారు. ఫలితంగా అభ్యుదయ, విప్లవోద్యమాలు అందించినంత చైతన్యం స్ర్తిలలో, దళితుల్లో, ముస్లిం మైనారిటీల్లో కొత్త ఆలోచనలకు దారితీశాయి. లైంగిక, కుల వివక్షలను ప్రశ్నిస్తూ కొత్త వస్తువును ఇవి అందిపుచ్చుకున్నాయి. తొలుత ఈ కవిత్వాలు విప్లవ కవిత్వాన్ని ప్రశ్నించడంతో ప్రారంభమయ్యాయి. పాతదాన్ని తీవ్రమైన స్థాయిలో నెగేట్ చేస్తే తప్ప కొత్త వస్తువును స్థాపించడానికి వీలు కాదు. అందుకే, ఈ కవిత్వాలు తీవ్ర స్థాయిలో ముందుకు వచ్చాయి. తిట్లు, శాపనార్థాల రూపంలో వ్యక్తమయ్యాయి. దళిత కవిత్వంలో మనువు నోట్లో ఉచ్చ పోస్తా వంటి వ్యక్తీకరణలను కూడా మనం చూస్తాం. అలాగే, పైటను తగలెయ్యాలి వంటి వ్యక్తీకరణలుస్ర్తివాద కవిత్వంలో చూస్తాం. అటువంటి వ్యక్తీకరణలను వాచ్యార్థంలో తీసుకోవడంవల్ల అపార్థాలకు దారిశాయి. విప్లవం కవిత్వంలో తనను గుడికి రానీయకపోవడమే మంచిదైందంటూ సలంద్ర వంటి దళిత కవులు చేసిన వ్యక్తీకరణలు, ఆచరణలు దళిత కవిత్వంలో, దళిత ఉద్యమంలో మారిపోయాయి. అగ్రవర్ణాలవారిలాగే అన్ని చోట్లా, అన్ని సందర్భాల్లో సమాన హక్కులు, హోదా కావాలనే గుర్తింపు నుంచి, పోరాటం నుంచి దళిత కవిత్వం భిన్న పద్ధతిలో వ్యక్తమైంది. వస్తువు మార్పిడి స్పష్టంగా జరిగిపోయింది. స్ర్తివాద కవిత్వంలో కూడా పురుషుడితో సమానమైన హక్కులు, హోదా కావాలనే వ్యక్తీకరణలను చూస్తాం. ఒక రకంగా దళిత, స్ర్తివాద కవిత్వాలు రాజకీయోద్యమాలను సాంస్కృతికోద్యమం వైపు తిప్పే ప్రయత్నం చేశాయని చెప్పవచ్చు. రాజకీయోద్యమం మాదిరిగానే సాంస్కృతికోద్యమం స్వతంత్రం, సమాన స్థాయిలో జరగాలనే గ్రహింపు ఈ కవిత్వోద్యమాల్లో వ్యక్తమైనట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సమానత్వం ఒక్కసారిగా సమకూరుతుందనే భావన నుంచి ముందుగానో, సమాంతరంగానో వర్గ వైరుధ్యాలతో పాటు లైంగిక, కుల వైరుధ్యాలు రూపుమాసిపోవాలనే ఆంతర్యంగా దాన్ని చెప్పుకోవచ్చు.
తెలుగు కవిత్వంలో మరోమారు వస్తు మార్పిడికి తెలంగాణ కవిత్వం అంటే స్థానీయ కవిత్వం కొండ గుర్తు అవుతుంది. తెలంగాణ నుంచి వచ్చేదంతా తెలంగాణ కవిత్వమని చెప్పకూడదనేది కొత్త నిర్వచనాన్ని తెలంగాణ భౌగోళిక ఉద్యమం ఇచ్చింది. ప్రాంతీయతను లేదా స్థానికతను ఆలంబనగా చేసుకుని ఈ కవిత్వం వచ్చింది. సామాజిక పరిణామక్రమాన్ని మలుపు తిప్పే లక్ష్యంతో ఈ కవిత్వం వచ్చింది. రెండు భిన్న తెలుగు సమాజాల మధ్య అసమానహోదాలు, అసమానావకాశాలు, వివక్ష తెలంగాణ కవిత్వానికి వస్తువులయ్యాయి. అంటే వాటికి సంబంధించిన భావనలు వస్తువుగా ముందుకు వచ్చాయని చెప్పాలి. అయితే, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ కవిత్వానికి భౌగోళిక తెలంగాణా రాష్ట్ర సాధన ఒక పార్శ్వంకాగా, ప్రపంచీకరణ వ్యతిరేకత దాని ప్రాపంచిక దృక్పథం. భౌతిక ఆధిపత్యం అవసరం లేకుండానే సాంస్కృతిక ఆధిపత్యం ద్వారా సామ్రాజ్యవాదం పెత్తనాన్ని వ్యతిరేకించే లక్షణం తెలంగాణ ప్రాంతీయ ఉద్యమంలో ఉంది, అదే కవిత్వంలోనూ వ్యక్తమవుతోంది. స్థానికోద్యమాలు మాత్రమే సామ్రాజ్యవాదానికి అత్యున్నత రూపమైన ప్రపంచీకరణకు సమాధానం చెబుతుందనే ఎరుక తెలంగాణ సాహిత్యకారులకు ఉంది. తద్వారా ఇది సాంస్కృతిక ఉద్యమ అవసరాన్ని గుర్తుచేస్తుంది. దళిత ఉద్యమం నిజానికి ఈ దిశలో సాగాల్సి ఉండింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం ఆ దారి పట్టింది. దానివల్ల వివక్షను ప్రశ్నించడం, ఆధిపత్య వర్గాలపై విమర్శలు చేయడం నుంచి తెలంగాణ ప్రాంతీయ కవిత్వం తన సాంస్కృతిక, సామాజిక ఔన్నత్యం గురించి మాట్లాడుతోంది. స్ర్తి, దళితవాద కవుల మాదిరిగానే ఆత్మగౌరవం గురించి, సమాన హోదా గురించి, సమాన హక్కులగురించి మాట్లాడుతూనే సామ్రాజ్యవాదులకు, వలస పాలకులకు నడుమ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సెక్షన్లను ప్రశ్నిస్తోంది. తెలుగు కవిత్వంలో వస్తు పరిణామక్రమాన్ని పరిశీలించినపుడు శిల్పం కూడా మారినట్లు మనం గమనిస్తాం. వస్తువు దానంతటదే శిల్పాన్ని నిర్ణయిచుకుంటుందనే మాటలోని అర్థం అదే. వస్తువు మారినప్పుడు తప్పకుండా నిర్మాణం, పాత వ్యక్తీకరణ పద్ధతులు, అభివ్యక్తి మారాల్సి వస్తుంది. అలాంటప్పుడు తప్పకుండా శిల్పం మారి తీరుతుంది. అంటే, వస్తువును కళాత్మకంగా వ్యక్తం చేయడానికి అవసరమైన పనిముట్లను కొత్తగా తెచ్చుకుంటుంది.
9848956375, January 22nd, 2012  

కుందుర్తి ఆంజనేయులు – చిన్న పరిచయము:

కుందుర్తి ఆంజనేయులు – చిన్న పరిచయము: వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడైన కుందుర్తి ఆంజనేయులు అభ్యుదయ కవి మరియు ప్రముఖ తెలుగు రచయిత. ఆంధ్ర దేశములో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. రగిలించే తమ కవిత్వంతో తెలంగాణా సాయుధ పోరాటానికి అజ్యం పోసిన కవులలో ప్రముఖుడు.[1]
ఆంజనేయులు 1922, డిసెంబర్ 16న గుంటూరు జిల్లా కోటవారిపాలెం గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈయన వినుకొండలో చదువుకున్న కాలములో గుర్రం జాషువా ఈయనకు తెలుగు మాష్టారుగా ఉన్నాడు. 1936 నుండి 1941 వరకు విజయవాడ పురపాలకసంఘ ఉన్నత పాఠశాలలో చదివాడు. అక్కడే 1937లో కవిత్వం వ్రాయటం ప్రారంభించాడు. విజయవాడ ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో ఈయన విశ్వనాథ సత్యనారాయణ వద్ద శిష్యునిగా ఉన్నాడు. ఆ తరువాత గుంటూరు ఆంధ్రా కైస్తవ కళాశాల నుండి బి.ఏ పట్టా పుచ్చుకున్నాడు.[2]
ఆంజనేయులు నరసరావుపేటలో నవ్యకళా పరిషత్తు స్థాపించాడు. ఆ కాలంలోనే ఆయన కమ్యూనిష్టు భావాలకు ఆకర్షితుడైనాడు. దేవేంద్రపాడు గ్రామములోని రెసిడెన్షియల్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా, ప్రిన్సిపాలుగా పనిచేశాడు. ఆ తరువాత కొన్నాళ్ళు గుంటూరు పొగాకు మార్కెట్టులో పనిచేశాడు. 1956లో కర్నూలులో సమాచార ప్రసారశాఖలో అనువాదకునిగా చేరాడు. ఆ తరువాత హైదరాబాదుకు బదిలీ అయ్యాడు. 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించాడు.[3] 1967లో యువతలో వచన కవిత్వాన్ని ప్రోత్సహించడానికి ఉత్తమ వచన కవిత్వానికి ఒక బహుమతి ప్రారంభించాడు.[4] 1977లో ఈయన ఉద్యోగ జీవితమునుండి విరమణ పొందాడు.
1944లో కందుర్తి అంజనేయులు ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసులతో కలిసి మొట్టమొదటి కవితా సంకలనం నయగారా ప్రకటించాడు. ఈ ముగ్గురూ నయగారా కవులుగా ఆధునిక తెలుగు సాహిత్యములో ప్రసిద్ధి చెందారు. అంజనేయులు సమగ్ర రచనలు 1974లో ప్రచురించబడినవి. కందుర్తి అనేక పురస్కారాలు అందుకున్నాడు. వాటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు 1969లో అందుకున్న సోవియట్ లాండ్ నెహ్రూ పురస్కారము ప్రతిష్టాత్మకమైనవి.[5]
ఈయన రచనలలో సౌప్తికం, రసధుని, అమవాస్య, నా ప్రేయసి, నయాగర, తెలంగాణ, దండియాత్ర, ఆషా, నగరంలో వాన, నాలోని వాదాలు, హంస ఎగిరిపోయింది, తీరా నేనుకాస్త ఎగిరిపోయాక, మేఘమాల, ఇది నా జెండ, కుందుర్తి పీఠికలు, కుందుర్తి వ్యాసాలు, బతుకు మాట మొదలైనవి ముఖ్యమైనవి. వచనాన్ని సాహిత్యముగా పరిగణించని రోజులలో కందుర్తి వచన కవిత్వాన్ని ప్రోత్సహించాడు. కవిత్వము గతమని, వచన కవిత్వము వర్తమానమని చాటాడు.http://te.wikipedia.org/wiki/
కుందుర్తి ఆంజనేయులు – వికీపీడియా
te.wikipedia.org
వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడైన కుందుర్తి ఆంజనేయులు అభ్యుదయ కవి మరియు ప్రముఖ తెలుగు రచయిత. ఆంధ్ర దేశములో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. రగిలించే తమ కవిత్వంతో తెలంగాణా సాయుధ పోరాటానికి అజ్యం పోసిన కవులలో ప్రముఖుడు.[1]

వికీపీడియా
te.wikipedia.org

| గాలి బుడగ ||

కపిల రాంకుమార్ || గాలి బుడగ ||

పవిత్ర గోదావరి మెట్ల దగ్గర
స్నానాలు బట్టలుతుక్కోవటాలు
యింకొన్ని వెధవ పనులు చేసి
పానీయపు పవిత్రత
పోగొట్టుతున్నరు జనాలు!
***
స్నానమాడే అతివల
అవయవసొంపులు వీక్షిస్తూ
మగాళ్ళు గంటలకొద్ది
దొంగ కొంగ జపాలు!
***
మరి అక్కడేవుంటూ రోజూ
బిచ్చమడుక్కునే కుష్టువాడు
ఓ రోజు శవమయ్యాడు!
గాలి బుడగ ప్రేలినట్లు పుండ్లలోంచి కారిన
రక్తపు రసి,చీముతో మెట్లకు పూసి
పసుపు కుంకమ పూజ చేసాడు!
***
ఇలాంటి చోట్లలో - అలాంటి
సంఘటనల వైవిధ్య భావ చిత్రం
యెదపై కరుణామయ ముద్ర వేయదా!
మానవ ద్వంద్వ ప్రకృతిని
చిత్రంగా చూపి కలానికి,
కుంచెకు పని చెప్పదా!!

20-1-2013 ఉ.5.19

( 5వ రోజు మా అమ్మ  అస్థికలు గోదావర్లో కలపటానికెళ్ళినపుడు
కనిపించిన దృశ్యం - జూలై 2012)

Friday, January 18, 2013

|| పులిపంజా - పురిపండా రచన||

కపిల రాంకుమార్ || పులిపంజా - పురిపండా రచన||

బురుజుమీద బొల్లి గద్ద - బురుజు క్రింద కృకలాపం
ఉల్లి పాము తలపాగా - ఊరినిండ పులిపంజా!

చీకటి చిందిన రక్తం - క్విస్లింగుల విష్కంభం
పాడలేని పడుకోట - పణ్యాంగన పరిహాసం!

రణ రణ రణ -ఝణ ఝణ ఝణ
కనక దుర్గ కాలి అందె -కపాల పాత్రిక నిండా
అపార మీపానీయం!
పగిలి పగిలి రగిలి రగిలి
ఇది విప్లవ సంకేతం
చిర వాంచిత సంక్షోభం!

ఓహో సైనికులారా
మీ హయహేషల చెదరిన
ఆరదమ్ములు నీరదాలు
గజ గజ గజ గజ గజ గజ
వృద్ధ వసుంధర స్వాహా!

నా గేయం మీ కవచం
మీ ఖ్డ్గం నా గేయం
కుబుసం వదలిన సర్పం
నా గీతం పులిపంజా!

1961 - శ్రీశ్రీ యుగం సంపుటం పే.47.

18.1.2013- ఉ.11.17

||శ్రీశ్రీ యుగం ||అరుదైన పుస్తక పరిచయం

|శ్రీశ్రీ యుగం ||అరుదైన పుస్తక పరిచయం

ImageImage
(ఆధునిక కవితా సంపుటి) చిత్ర భారతి పబ్లికేషను 10-ఎ. పిళ్ళయార్ కోయిల్ స్ట్రీట్ , మద్రాసు 78
వెల :రు.1-25 సంపాదకుడు-నిర్వాహకుడు : కాపుగంటి వి. రమణరావు
1-10-1961
ఇందులో మొదట ఆరుద్ర – యుగక్ర్త చరిత్ర రాయగా,శ్రీశ్రీ, -శరచ్చంద్రిి దీర్ఘ కవిత రాసాడు. అంజలిని – ఎస్.వి.జోగారావు, తర్వాత పుస్తకాన్ని శ్రీశ్రీకి అంకితం చేస్తూ అక్షర లక్షాధికారి మాటల కోటీశ్వరుడు అని పేర్కొన్నారు. ఎర్ర మందారాలు – ఆదుర్తి వెంకటనరసింహమూర్తి మొదటి కవిత, వరుసగా తిలక్, సంపత్, నారాయణ్రెడ్డి, దాశరథి, సోమసుందర్, శశాంక, ఏల్చూరి, ఒఉరిపండా, కాళోజీ, ఆనిసెట్టి, కుందుర్తి, రెంటాలం బెల్లంకొండ, పఠాభి, ్బైరాగి, కె.వి.రమణారెడ్డి, అజంతా, రాజశ్రీ, పాంచాలి, తెన్నేటి సూరి, తెన్నేటి హేమలతాదేవి, మాదిరాజు రంగారావు, చిరంజీవ్, సారథు, మధుబాబు మున్నగు వారి కవితలు చోటు చేసుకున్నాయి, ఇది అరుదైన పుస్తకం. దొరికితే చదవండి జిల్లా గ్రంథాలయాల్లో.
18.01.2013 (ఇది మా గ్రంథాలయంలో ఉన్నది) ఉ.10.50
కపిల రాంకుమార్ || ఏమని చెప్పుదు?||***

ఏమని చెప్పుదు నేనేమ్ని చెప్పుదు
తల్లి వేదనను కానరాని కామందుల
కామాంధుల దౌష్ట్యం!
తొట్టిలోన బుజ్జి తండ్రి
పాల కోసం గుక్కపడితే
పైటేలకు గుండె సలుపుడు
పోదమంటె సేటు వదలడు!

నొసట రాసిన కాయ కష్టపు
ముదనష్టపు బతుకు మాది
రేయింబవ్లు రెక్కలాడినా
బుక్కెడన్నా దొరకబోదు.!

బిడ్డకేకకు కళ్ళు చెమరె
రైక బిగువుకు వొళ్ళు తూలె
లేని వారి కడుపు తీపిది!
కలిగ్నోదు కానలేడు మరి!

కన్నబిడ్డ కడుపునింప దొడ్డిదారిన వస్తవుంటె
దారికడ్డంవచ్చినాడు దొర్-కుక్కలాగ పట్టినాడు!
శక్తికొలది పెనుగులాడి నడుము నొక్కిన చేయి కొరికి
వంగినాను - పాలబరువుకు కుంగినాను కుప్పమాదిరి!

కిందబడ్డ నన్ను చూచి ఆబగాను మీదకొస్తే
లేని సత్తువ తెచ్చుకోని ఊరువుపైన తన్నినాను!
అయ్యో మంట - అతడు - అమ్మో అంటూ నేను
ఒకరినొకరు వెంబడించ సజ్జపైనే పరుగు పరుగు!

హోరు గాలికి కొమ్మ విరిగి
తొట్టిలోని బిడ్డజారి
తూలిపడెను - ఒడిని చేరెను
బిడ్డనవ్వుతు యెదను తాకెను!

పుచ్చె పగిలిన కాయ మాదిరి
పుచ్చ కాయ దొరలినట్లు
నేల గుచ్చిన గడ్డపలుగుకు
తేలకళ్ళు 'దొర ' వేసినాడు!
కూటికోసం పల్లెలొదలి
పట్నమొచ్చిన కూలివాళ్ళం
మాయదారిుమోతుబరుల
కుతంత్రాలకు బలైయ్యే పశువులం
ఇప్పుడైనా ఒక్కటౌదాం -జులాయి కుక్కల తరుమ
కూలి బతుకున వెలుగుకై బక్కటోళ్ళకు దారి యేదాం!

*భవన నిర్మాణంలో మహిళా కార్మికులవెతలపై వాస్తవ సంఘటనకు స్పందన!
(18.11.2001) - యిది ఫిబ్రవరి జనకవనం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో చదివినది)<<<18-01-2013 >><< ఉదయం 5.46>>

Wednesday, January 16, 2013

కొయ్యగుర్రం : ప్రకృతి – ప్రభుత – ప్రజలు

కొయ్యగుర్రం : ప్రకృతి – ప్రభుత – ప్రజలు

koyya011.jpgది 1977వ సంవత్సరం. ప్రకృతి దివిసీమపై కన్నెర్ర చేసింది. నవంబర్ 19న పోటెత్తిన ఉప్పెన ఒక్కసారిగా వందలాదిమందిని మృత్యువాతన పడేట్టు చేసింది. తుపాను కరాళనృత్యంలో కోట్లాది రూపాయల ఆస్తి సముద్రంలో కరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే అంతా జరిగిపోయింది. ఇదంతా దివిసీమ ఉప్పెనగా తెలుగు వారందరికీ చేదు జ్ఞాపకం. ప్రకృతి మనిషిపై కన్నెర్ర చేస్తే నోరు తెరుచుకుని చూడడమే సాధారణ మానవుడెవడైనా చెయ్యగలిగేది. తుపాను హెచ్చరికల వ్యవస్థ మన దగ్గర వున్నప్పటికీ ఉప్పెనను గుర్తించలేకపోవడం మన శాస్త్రవేత్తల వైఫల్యం. విపత్తు సంభవించిన చోట హుటాహుటిన జనజీవనాన్ని ప్రతిష్టించే కార్యక్రమాలు (డిజాస్టర్ మేనేజ్ మెంట్) చేపట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యం. గూడూ గుడ్డా సమస్తం సముద్రంలోకి కొట్టుకుపోయాక మోడుల్లా మిగిలిన మనుషులను ఆదుకోకపోవడం అధికార యంత్రాంగపు వైఫల్యం.  ఇదంతా ఓ సృజన కళాకారుడికి కవితా వస్తువయింది. ఆ కవిత తెలుగు భాషలో ఆధునిక రాజకీయ కావ్యమైంది. అదే కవిత సాహిత్యాభిమానులకు నిత్య మననీయ ఆధునిక గానమైంది. ఆ కవిత పేరు ‘కొయ్యగుర్రం’. ఈ వారం దీన్ని పరిచయం చేస్తున్నాను. 
మానేపల్లి హృషీకేశవరావనే కవి ‘ఉదయిచని ఉదయాలు ‘ కవితా సంకలనం వెలువరించారంటే ఆహా అనుకుంటాం. ఆ పేరుతో ప్రసిద్ధుడైన కవిని మనం ఎరుగం. విరసం ఏర్పడక అర్థ దశాబ్ద కాలానికి ముందర 1965లో ఇదే కవి మరో అయిదుగురు కవులతో దిగంబర కవితోద్యమాన్ని ప్రారంభించారు. అప్పుడే తన పేరును ‘నగ్నముని ‘గా మార్చుకున్నారు. తెలుగు సాహిత్య లోకంలో సంచలనం సృష్టించారు. 1977లోనే కొయ్యగుర్రాన్ని రచించారు. ఇప్పుడు నగ్నముని కొయ్యగుర్రం అంటే ఓహ్ అంటాం. ‘కొయ్యగుర్రం’ వస్తూనే అనేక ప్రభంజనాలు, దుమారాలు రేపింది. ఈ కవిత వెలువడి నేటికి మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంలో ప్రజాస్వామ్య ప్రచురణలు ‘కొయ్యగుర్రం’ కొత్త ఎడిషన్ ప్రచురించింది. ముప్పై ఏళ్లకిందట వెలువడిన కావ్యానికి మనోహర్ దత్ ముఖచిత్రాన్ని అందిస్తే, తాజా ప్రచురణకు రమణ జీవి ముఖపత్రాన్ని చిత్రించారు. దేశ విదేశాల్లోని అనేక భాషల్లోకి అనువాదం పొందిన ఈ ‘కొయ్యగుర్రం’ కవిత వర్తమాన సందర్భంలో చదవడం అదో రకమైన అనుభూతి.
జరిగిన విపత్తు దాచేస్తే దాక్కునేది కాదు. అరచేతుల్తో ఆపలేనిది. భయంకర వాస్తవం. కేవలం ముందస్తుగా తుపాను రాకను పసిగట్టలేక, చెల్లాచెదురైన బాధితుల్ని ఆదుకోలేక, పునరావాస కార్యక్రమాలు చేపట్టక ఉదాసీనంగా వుండిపోయింది ప్రభుత్వం. కాబట్టి ఈ దురాగతంలో హంతకి మరెవరో కాదు ప్రభుత్వమే. హతులు ‘అలగాజనం’. కాని జరిగిన ఘోరాన్ని కవిత్వీకరించాలి కదా – కళ్లకు కట్టినట్టుగా చెప్పాలి కదా! అందుకే కవి పదే పదే నెపం వేరేవాళ్లమేదకి తోసేస్తారు. నాలుగో భాగం లో తొలిసారిగా-
చివరి విందులో
చివరికి తననెవరు మోసం చేస్తారో
జీసస్ కి తెలుసు
హంతకులెవరో నాకు తెలుసు
నెపం కాసేపు సముద్రం మీదకి తోస్తాను

ఈ మాటంటారు. వెంటనే వచ్చిన ఐదోభాగంలో “నెపం కాసేపు కాలం మీదకు నెట్టేస్తాను “అంటూనే “నెపం కాసేపు ప్రకృతి మీదకి తోసేస్తాను ‘అని రెండుసార్లు చెప్తారు. ఎనిమిదో భాగంలో మళ్లీ “అయినా నెపం కాసేపు సముద్రం మీదకి తోసేస్తాను “అనంటారు. ఇక చివరిదైన పన్నెండో భాగంలో “నెపం నా మీదనే వేసుకుంటా“నంటారు. నెపం తోసింది ఎవరిమీదకో కవి చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ పాఠకులకు కవి అసలు ఉద్దేశాలు అర్థమవుతున్న కొద్దీ అసమర్థ ప్రభుత్వంపై నెమ్మది నెమ్మదిగా కోపం పెంచుకుంటూ పోవడంలో రచయిత సఫలమయ్యారు.
కావ్యంలో మొదటి మూడు అధ్యాయాలలో ఒక కవి తత్వాన్ని వర్ణించిన నగ్నముని మూడో అధ్యాయంలో కవిగా తన ప్రత్యేక తత్వాన్ని స్పష్టపరుస్తారు. తన పొట్టలోంచి ఒక పేగును బయటకు పీకి ఏకతార వాయిస్తూ కవితను గానం చేయడానికి కవి పూనుకున్నాడు. ఈ నగ్న సత్యాన్ని వినగల, విని భరించగల ధీరులకోసం కవి గాలింపు మొదలవుతుంది. అసలు కవిత ప్రారంభించడమే పాతను తూలనాడడంతో మొదలవుతుంది. జీవితం మిథ్యంటారు వేదాంతులు. అది అబద్దమని పొలికేక పెడుతూ ‘కొయ్యగుర్రం’ ప్రారంభమవుతుంది. నీచమైన కాకులు మాత్రమే మిథ్య మాటలు మాట్లాడుతాయంటారు. పాత పురాణాల పద్ధతిని పరిహసిస్తారు. కొత్త జీవితపు ఎరుకను ఏర్పరుచుకోమంటారు. దీనిద్వారా తాను చెప్పబోయే విషయానికి పాఠకులను మానసింగా సంసిద్ధులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చేయకపోవడం వల్లనే భావ కవిత్వాన్ని (రొమాంటిక్ పొయట్రీ) తొలిసారి రాసిన ఎస్.టి.కోల్ రిడ్జి తన ‘లిరికల్ బాలాడ్స్ ‘కు సవివరమైన పీఠిక (ప్రిఫేస్) రాసుకోవాల్సి వచ్చింది. ఆ తప్పు మళ్లీ తెలుగు కవి చేయలేదు. కవితలోనే మొదటి మూడు అధ్యాయాల్లో పాఠకులను  సన్నద్ధపరుస్తారు. 
నాలుగో అధ్యాయంలో నవంబర్ 19న వచ్చిన దివిసీమ ఉప్పెన దుర్ఘటనను ప్రస్తావిస్తారు. ఉప్పెన ముఖ్యాంశం కాదు. ఉప్పెన దివిసీమను తాకిన తేది ముఖ్యాంశం కాదు. అందుకే అంటారు-
కేలండర్ కి రక్తమాంసాలుండవు కేవలం కాలం కుక్క నోటిలోని ఎముకముక్క
గోడకు బల్లిలా కరుచుకుపోయిన వుత్తి
కాగితం ముక్క
తారీకులు ముద్దాయిల్లా బోనుల్లో నిలుచునుంటాయి
అది ఏ తారీకన్నా కావొచ్చు
అది నవంబర్ 19 కావడం యాదృచ్చికం కావొచ్చు
.” అయిదో అధ్యాయంలో జరిగిన ప్రకృతి బీభత్సాన్ని కవి చాలా నేర్పుగా వర్ణిస్తారు. జరిగిన ఉత్పాతానికి కారణం మరెవరో కాదు సముద్రుడే. అంటే బతకడానికి అవసరమైన నీరే బతుకును కడతేర్చింది. దాన్నే కవి ఎలా చెప్తున్నారో చూడండి:
మనిషి ఊపిరి కొయ్యడానికిkoyya02
కత్తే కానక్కర్లేదు
జీవితాల్ని చెరచడానికి
మరుక్షణం మృతకళేబరం చెయ్యడానికి
తుపాకులూ యుద్ధాలే రానక్కర్లేదు
నూరేళ్లు నవ్వుతూ తుళ్లుతూ వేయిరేకలతో
వెలుగులు వెదజల్లుతూ పుష్పించవలసిన బతుకుల్ని
భగ్గున మండించెయ్యడానికి పెట్రోలే అక్కర్లేదు
ఉప్పు నీళ్లు చాలు
దాహం తీర్చి ప్రాణం నిలబెట్టవలసిన నీరే
గొంతు పిసగ్గలదు
.”
అంతే. నీరు అలగాజనం ఉసురు తీసుకుంది. పోయినవారు పోగా మిగిలినవారిని పరామర్శించడానికి అధికారులు, రాజకీయ నాయకులు వచ్చారు. వెళ్లారు. ప్రకటనలు చేశారు. కానీ ఒరిగిందేమీ లేదు. ఒకప్పుడు సస్యశ్యామలమైన ఆ ప్రాంతం ప్రమాదం తర్వాత శవాల పోగులతో నిండింది.
బలహీనుడు సంపద సృష్టిస్తాడు
బలవంతుడు సంపద మింగి దరిద్రం పంచుతాడు.
చరిత్ర నిండా దరిద్రుల శవాల గుట్టలే
” అని చెప్తూ ఈ భాగాన్ని ముగిస్తారు.
ఆరో అధ్యాయం చాలా కీలకమైనది. రెండే పదచిత్రాలు ఉన్నప్పటికీ కవి ప్రణాళికలో ముఖ్యమైన భాగమిది. ఈ విషయం చెప్పడం ద్వారా నగ్నముని పాఠకులను స్వయంగా చెయ్యి పట్టుకుని తన ప్రపంచంలోకి లాక్కుపోవడానికి వీలైంది. బ్రహ్మాండమైన ఎత్తుగడ. బుద్ధుడిగా మారనున్న సిద్ధార్థుని సాగనంపిన అశ్వమింకా అతడి ఆగమనం కోసం నాగార్జున కొండలో ఎదురుచూస్తూనే వుంది. కానీ మనిషిలో మహాబోధి మిగల్లేదు. ఎప్పుడో కూలిపోయింది. మానవీయత అడుగంటింది. ఆధునిక మానవుడు మనసులేని చెక్క (డ్రై వుడ్) అయ్యాడు. ఆ చెక్కతో చెయ్యబడిందే కొయ్యగుర్రమనే పాలన మంత్రాంగం – ప్రభుత్వం. ఈ కష్టాలన్నీ స్వతంత్ర ఫలాలు పొందిన తరం తన భవిష్య దేశాన్ని తయారుచేయడంలో విఫలమవ్వడం వల్ల వచ్చినవి. నగ్నముని తన కవితలో ఇవేమీ చెప్పలేదు. కేవలం గుర్రం ఇంకా బుద్ధుడి కోసం చూస్తున్నా, మనిషిలోని మహాబోధి కూలిపోయిందంటారు.  తర్వాతిదైన ఏడో అధ్యాయంలో తాను కొయ్యగుర్రాన్ని దేనికి ప్రతీకగా ఈ కవితలో వాడుకుంటున్నారో స్పష్టపరుస్తారు. ఎనిమిదో భాగంలో జరిగిన నేరంలో దోషులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు.
నిద్రపోతే కలలు కళ్లను కుడతాయి
కదిపితే తేనెటీగలు ఒంటిని వెంటాడి మరీ కుడతాయి
 కదపకపోయినా నోరు మెదపకపోయినా
క్షుద్ర రాజకీయాలు
నిండు జీవితాల్ని కుడతాయి
.” అని సూటిగా అనడానికి ముందర ఈ విషయంలో పాఠకుని బుర్రలో పుట్టబోయే చిల్లరమల్లర సందేహాల్ని ఇలా నివృత్తి చేస్తారు.
తీరమతటా గుడిశె వుందని తెలుసు
పాలుపోసే చేతినే అదను చూసి పడగకెరటాల కోరలు
కాటేస్తాయని తెలుసు

అంటే అన్నీ తెలిసినా ఏమీ చెయ్యకుండా నిశ్శబ్దంగా వుండడంద్వారా ఈ దురాగతానికి సహకరించిన రాజ్యవ్యవస్థ పాత్రను బహిర్గతపరుస్తారు.
తొమ్మిదో అధ్యాయంలో నగ్నముని ఆ భీకర రాత్రిని వర్ణిస్తారు. ఆదమరిచి అంతా నిద్రపోతున్న వేళ సముద్రం తన కెరటాల బాహువుల్తో దివిసీమను బంధించి ఉక్కిరిబిక్కిరి చేసేసింది. కవి మాటల్లో చెప్పాలంటే…
నదుల మంచినీళ్లని కౌగిలిలోకి
తనివితీరా తాగితాగి తెగబలిసిన కొండచిలువలాkoyya03
మెలికలు తిరిగి
కాలంపై భూగోళంపై ‘అలగాజనం’ ముఖాలపై
వృక్షాలపై పక్షులపై సమస్త జంతుజలంపై
చీకటి ముసుగు హఠాత్తుగా కప్పి
నీటితో పేనిన తాళ్లతో గొంతులు బిగించి
కెరటాల్తో కాటేసి వికటాట్టహాసంతో బుసలు కొడుతూ
పరవళ్ళు తొక్కింది
మనిషి బతికుండగా దాహం తీర్చలేని
ఉప్పునీటి సముద్రం
మిగిలింది కెరటాలు కాదు
శవాల గుట్టలు
శరీరాల్నుండి తెగిపోయి గాలికి ఊగుతున్న
ఊపిరి దారాలు
.”
ఇది ఇలా జరుగుతుందని మన నిస్తేజపు పాలక వర్గానికి తెలియదా? తెలుసు. కాని, నిర్లక్ష్యం. సముద్రం పక్కనే ఎలాంటి రక్షణాలేని అలగాజనం ప్రాణాలు ఉంటే ఎంత, పోతే ఎంత అనే భావజాలమున్న వారే అధికారంలోకి వస్తూ వుండడం మానవ దౌర్భాగ్యం. దాన్నే పదో అధ్యాయంలో చెప్తారు:
బతుకుల్ని నిలబెడతామని బుజాలెక్కి కూచున్న వాళ్ల
అలక్ష్యానికీ అహంకారానికీ సాక్ష్యాలుగా
మిగిలిపోయాయి
అయినా మరేం పర్వాలేదు
కంకాళం సంజాయిషీ కోరదు
.”
కొయ్యగుర్రాన్ని దేనికి ప్రతీకగా వాడారో ఆ భావాన్నంతటినీ పదకొండో అధ్యాయంలో నగ్నముని వివరిస్తారు. కవి హృదయంలోని ఆవేదన, ఆక్రోశం ఇందులో వాడిన ప్రతిమాటా చాలా ఖచ్చితంగా బయటపెడ్తాయి.
ఇప్పుడు కొత్తగా సముద్రం చంపేదేమిటి
ఇప్పుడు కొత్తగా కొయ్యగుర్రం చంపేదేమిటి
మరేం పర్వాలేదు
ప్రజాసేవ చెయ్యడానికి కావలసినంతమంది
పోటీలుపడే నాయకులున్నారు
శవాల్ని ఖాళీ చెయ్యడానికి కాకులూ గద్దలూ రాబందులూ
లేకపోయినా పర్వాలేదు
కాంట్రాక్టర్లున్నారు
జాతికి సేవ చేస్తారు

అలా ధ్యానంలో మునిగిన కవికి నిస్సత్తువ ఆవహిస్తుంది. ప్రజల బాగు చూడాల్సిన ప్రభుత్వపు చేతగానితనం నిరాశ కలిగిస్తుంది. అందుకే…
ఈ వ్యవస్థలో
పుట్టడం మోసపోవడానికే
పెరగడం మోసపోవడానికే
ప్రేమించడం మోసపోవడానికే
నమ్మడం మోసపోవడానికే

అంటూ అందులోంచి పుట్టిన కోపాన్ని ప్రజలమీదకి మళ్లిస్తారు. కొయ్యగుర్రం లాంటి వ్యవస్థను తయారుచేస్తూ భరిస్తూ తరిస్తున్న అలగాజనాన్ని విసుక్కుంటారు.
రోడ్లపక్క ప్లాస్టిక్ చెట్లు నాటుదాం
ప్లాస్టిక్ కొమ్మలపై ప్లాస్టిక్ పక్షుల్ని కూచోబెడదాం
ప్లాస్టిక్ కంకులు నాటి
పొలాలు బంగారం పండినట్లు చూపుదాం
……
ప్లాస్టిక్ ఆవుల ప్లాస్టిక్ గేదెల ప్లాస్టిక్ పొదుగులు

పితుక్కుని ప్లాస్టిక్ పాలు తాగుదాం
కొయ్యగుర్రాన్ని ఒహోం ఒహోం అంటూ
జీవితాంతం మెడలమీద మోద్దాం

చివరిదైన పన్నెండవ అధ్యాయంలో దీనికి విరుగుడుగా కవి తనదైన దృక్పథంలో ముగింపునిస్తారు. ఇదీ కొయ్యగుర్రం కథ.
1965లో దిగంబరగా కవిగా ఒక వెలుగు వెలిగిన నగ్నముని, 1970లో విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. మరి 1977లో రచించిన “కొయ్యగుర్రం” ఎందుకంత వివాదాస్పదమైందన్నది ప్రశ్న. దానికి సమాధానం ఈ కావ్యంలో పాక్షికంగానే లభిస్తుంది గాని, నగ్నముని సాహిత్యాన్నంతటినీ అధ్యయనం చేస్తే సంపూర్ణ జవాబు దొరుకుతుంది. అయితే ఆ క్రమ పరిణామాన్ని మార్క్సిజపు వ్యతిరేకతగా కొట్టిపారేయకూడదు. ఈ కవికి కవితావస్తువును అందించింది సమాజం కావచ్చునే గాని, ఆ వస్తువును పరికించవలసిన దృష్టినిచ్చింది మాత్రం మార్క్సిజమే. ఆ చూపునిచ్చింది ఆ తత్వమే. ’75 తర్వాత రాస్తున్న కవిత్వంలో క్రమంగా విశ్లేషణలో, సమస్యలకు పరిష్కారం సూచించడంలో ఈ దృక్పథం నుంచి కవి వైదొలుగుతుండడాన్ని గమనిస్తాం. ఇక ‘కొయ్యగుర్రం’లో మాత్రం ఎనిమిదో అధ్యాయంలో కవి తొలిసారి బయటపడతాడు.
మనిషిని మనిషిచేసే మోసం కాలానికి తెలుసు
కారణాలు కార్ల్ మార్క్స్ కు తెలుసు
రోడిన్
మ్యూజియంలో శిల్పంగా మారి
గడ్డానికి చేతులు ఆంచి
ఆలోచిస్తూనే ఉంటాడు
ఆలోచనకీ మనిషికీ వున్న సంబంధం ఏమిటి
” అలా అని ఊరుకుంటే సరే మార్క్సును ఏమైనా అనొచ్చుగాని, సిద్ధాంతాన్ని ఏమనలేదు కదా అని సరిపెట్టుకోవచ్చు. ముగింపు వద్దకొచ్చేసరికి కవి మరింత పదును తేలుతారు. మార్క్సిజం ఇచ్చే ఆశావహ దృక్పథాన్ని పక్కనపెట్టి, సమాజంపై కోపంతో, మారని విలువలపై ఏహ్యతతో నిస్పృహలోకి జారిన కవి నిరాశావహ దృక్పథంలో పడిపోతారు. పెసిమిస్టిక్ ధోరణి అలవరచుకుంటారు. అందుకే కావ్యం ముగింపులో-
నాకు రాకెట్లొద్దు చంద్రమండలం వద్దు
విమానయానాలొద్దు
కాలాన్నీ జీవితాన్నీ కలుషితం జేసే
రాజకీయ కార్యకాలాపాలొద్దు
రైళ్లొద్దు బస్సులొద్దు యీ నాగరికత రద్దీ వద్దు
పాత రాతియుగం పనిముట్టు పట్టుకుని
చరిత్ర చీకటి కోణాల గుహల్లోకి
వెళ్లిపోతాను
” అంటారు. అయితే ఇదంతా కేవలం పరిస్థితినంతటినీ అవలోకించిన కవి మానసిక పరిస్థితిగానే మనం భావించాలి.
ఇప్పుడు వెలువరించిన “కొయ్యగుర్రం” కొత్త ఎడిషన్ లో చేకూరి రామారావు రాసిన పీఠిక, నికీతా గూరోవ్ రాసిన పరిచయం, వేగుంట మోహనప్రసాద్ రాసిన ‘జార్జ్ మాండెల్ / నగ్నమునీ’ అనే ఇంటీరియర్ డైలాగ్ చదవడం గొప్ప అనుభూతి. ఇవి కావ్యాన్ని మరింత విస్తృతంగా అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. 25 పేజీల చిన్న కవిత, మరో 50 పేజీల విశ్లేషణ చదవడం సమాజంపట్ల మనకు కొత్త చూపు లభించడం కోసమే. “కొయ్యగుర్రం” తప్పక చదవదగ్గ పుస్తకాల్లో ఒకటి.

మరకల సంక్రాంతి!

కపిల రాంకుమార్ ||మరకల సంక్రాంతి! ||

మకర సంక్రాంతి మరకల భ్రాంతి
గ్రహ భ్రమణాల్ సాదాసీదాయానంలో
వ్యవసాయాధారిత సంబరంగా మాత్రమే చూడు!
పంట యింటికి చేరి కొత్త బియ్యపు పొంగలి
తిని ఆనందించే దినాలు పోయి
ఆ ఆనందం తుంచే దినాలౌతున్నాయి!
రైతులకు దినవారాలౌతున్నాయ్!
కాలువలలో నీరు పారక కైలు కాక
పొలం కాకెక్కి వట్టిపోయింది!
చెరువులు మాత్రం అలుగు పారాయన్నమాటే కాని
కలుగులెక్కువై కరకట్టకు బుంగలు పడి
సాగుకు కటకట తెచ్చింది!
ఆరంభంనుండి అడంగులు చేరే దాకా అన్నీ కష్టాలే
కాష్టాల సెగలే భోగిమంటైనపుడు
విత్తు నకిలీ-మొలకెత్తని చేను
పురుగులు మందు కొడితే, పెరిగింది కలుపే కాని,
మొక్క మాత్రం బొక్క బోర్లపడింది!
క్రమం తప్పిన వానలు చీడలు పెంచాయి!

విద్యుత్ సరఫరాలో లోపాలు బాధలు పంచాయి
ముందుచూపులేని సర్కారీ నిర్వాకంతో!
తమకుర్చీ కిందకు నీళ్ళు రాకుండ తంటాలు పడుతోది కాని
ప్రజల కన్నీళ్ళు ఆపలేక పోటోంది!
బిల్లులతో తడిస్ మోపెడయ్ిందే కాని
పశువులమేతకు పొడి గడ్డి మోపులు లేవు
మెడకు తడి గుడ్డలే దిక్కు!
తిండికి గింజలేదు - గంజిలోకి ఉప్పుకూడ పుట్టదు

అదిలావుంటే మరో పక్క యీడొచ్చిన అమాయకపు పిల్ల
బూటకపు ప్రేమకాటుతో (కామపు) వైద్యమందే దశలోనే
ఠపీమని టపా కట్టితే, ఉన్మాది ' పెరోల్ "పై జల్సాగా
కాలరెగరేసుకుని తిరుగుతున్నాడు!

యింకొక పక్క కొలువులేక తిరిగి తిరిగిన సుపుత్రుడు
విసిగి వేసారి సవిత్రుడ్ని చేరి యింటిని చీకటి చేసాడు!
సర్కారీ కిరణాలు అందకపోగా మరణాలేలుతున్నాడు!

ఇప్పుడు ఇళ్ళల్లో యెవరూ లేరు!
రోడమీదే వంటా వార్పూ
ఉద్యోగులైనా, వ్యాపారులైనా, రైతులైనా, బైతులైనం
నిరసనల యాగం చేస్తున్నారు!

రహదారులేమో రక్త సిక్తాలౌతున్నాయి
విద్యాలయాలేమొ రిక్త చదువులౌతున్నాయి
కుంభకోణాల పూర్ణకుంభ స్వాగతాలతో
ఉక్కిరి బిక్కిరతున్నారు పాలకులు
పావులు కదిపే మిషతో దిసమొలలెగరేసుకుంటూ
పావురాలను బలికొంటూ కిరాతకులౌతుంటే
పండుగ - దండగనిపిస్తోంది!

డబ్బు గజ్జి గబ్బు కుర్రాళ్ళు, పబ్బులంటూ, క్లబ్బులంటూ
' జీను ' వస్త్రాల మోజులో తమ జీంస్ కలుషితం చేసుకుంటూ
దిగుమతి చేసుకున్న పడమటిగాలి వడదెబ్బ కొట్టిందని
కుదేలైన పిదప తెలుసుకుని యేంలాభం!
చే్తులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి కాని!
యెవరూ బేరీజు వేసుకోటంలేదు!
మనకెందుకని నిర్లిప్తతో -
జోగుతున్నారు కష్టాల కడలిలో!
నావకు కన్నమెవడు పెట్టినా
పుట్టి మునిగేది తమదేనని గ్రహించేలోగా
అనర్థాలు జరిగిపోతున్నాయి!

సమాజ రుగ్మతలకు సపర్యలు కాదు - నివారణ ముఖ్యం!
ప్రతీది రాజకీయం చేసే వారికి ప్రజల సమస్య
అప్రిష్కారంగావుంటె అది మ్రింత జటిలమై
తలకు బొప్పి కట్టి తమ వునికికే ప్రమాదమని
తెలుసుకోలేని వాజమ్మలని
రేపు యే జేజెమ్మ కాపాడదు!

మనమే ఓటు ద్వారా మార్చుదాం!
ఆ లక్ష్యంగా, నిర్లక్ష్యం వదిలి
అడుగులు వేద్దాం!
నాతో చేతులు కలపండి!
నాతో గొంతులు కలపండి!
సంక్రాంతి నాడు కొత్త కాంతిని
వెలిగిద్దాం! కొత్త క్రాంతిని స్వాగతిద్దాం!

13-01-2013 ఖమ్మం సంక్రాంతి కవిసమ్మేళనంలో చదివినది

16-01-2013 ఉ.5.56

Monday, January 14, 2013

పాల్కురికి ఆదికవేనా!? – ముత్తేవి రవీంద్రనాథ్

                      క్రీ.శ.1300 ప్రాంతంలో ‘పండితారాధ్య చరిత్రము’ రాసిన పాల్కురికి సోమన తెలుగులో ఆదికవి అంటున్నారు కేసీఆర్. మరి తేనెలొలికే తేటతెలుగులో ‘సుమతీ శతకం’, ‘నీతి శాస్త్ర ముక్తావళి’ అనే రాజనీతి గ్రంథం రాసిన బద్దెన కూడా వారి దృష్టిలో ఆదికవి గౌరవానికి నోచుకోలేదా? పోనీ చాళుక్య యుగానికే చెందిన తెలుగు కవులు వేములవాడ భీమకవి, అమృతనాథుడు వీరి కంటికి ఆనలేదా? ఇటీవల ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ చరిత్ర వక్రీకరణకు కూడా పూనుకోవడం దారుణం. నన్నయ్య తెలుగులో ఆదికవి కాడనీ, ఆయన సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం మాత్రమే చేసినందున ఆయన కేవలం అనువాదకవి మాత్రమేననీ ఆయన మాట్లాడారు. ‘బసవపురాణం’ రాసిన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ఆదికవి అని తేల్చారు. ‘ఈ ముచ్చట కూడా ఆంద్రోల్లు అబద్ధం చెప్తరు. నేను ఇట్లా అంటే వాల్లు కొట్లాటకు వస్తరు. పక్కన ఓ కవి (నందిని సిధారెడ్డి) ఉండడం వల్ల ఈ మాట ధైర్యంగా చెబుతున్నా’నని కూడా సెలవిచ్చారాయన. అలా కేసీఆర్ అలనాటి మహాకవులకు కూడా నేటి మన ప్రాంతీ య తత్వపు బురదను అంటించాలని చూడడం క్షమించరాని నేరం. పాల్కురికి సోమనాథుడు నేడు తెలంగాణ అని పిలువబడుతున్న ప్రాంతానికి చెందినవాడనే నమ్మకంతోనే, మితిమీరిన ప్రాంతీయ అభిమానంతో ఆయన అలా సోమనాథ కవిని ఆదికవిని చేయబూనారనేది స్పష్టం. నన్నయ్య నేడు ఆంధ్ర ప్రాంతంగా పిలువబడుతున్న ప్రాంతానికి చెందినవాడనేది నిర్వివాదాంశం. అయితే మహాభారత అనువాదాన్ని ఆరంభించిన నన్నయ్య భట్టు (క్రీ.శ. 1026 ప్రాంతం) కంటే ‘కుమార సంభవం’ కావ్యం రాసిన నన్నెచోడుడు ముందరివాడని మానవల్లి రామకృష్ణ కవి వంటి ప్రముఖ విమర్శకులు వాదించినా, నన్నయ్యే ఆదికవి అని హెచ్చుమంది సాహిత్య చరిత్రకారులు తేల్చారు.

                      అందుచేతనే తెలంగాణకు చెందిన మహాకవి సినారె ‘ఆదికవి నన్నయ్య అవతరించిన నేల’ అంటూ ఓ సినీ గీతంలో కూడా రాశారు. ఇక ఇప్పుడు, క్రీ.శ.1300 ప్రాంతంలో ‘పండితారాధ్య చరిత్రము’ రాసిన పాల్కురికి సోమన తెలుగులో ఆదికవి అంటున్నారు కేసీఆర్. పోనీ భారతం అనువదించిన నన్నయ్య లాగానే ‘కుమార సంభవం’ అనే సంస్కృత కావ్యాన్ని అనువదించిన నన్నెచోడుడు, ‘గణిత సార సంగ్రహం’ అనే అనువాద గ్రంథం రాసిన పావులూరి మల్లన్నలు కూడా అనువాద కవులే కనుక కేసీఆర్ లెక్క ప్రకారం వారిరువురూ కూడా ఆదికవి గౌరవానికి తగినవారు కాదనుకుం దాం. తేనెలొలికే తేటతెలుగులో ‘సుమతీ శతకం’, ‘నీతి శాస్త్ర ముక్తావళి’ అనే రాజనీతి గ్రంథం రాసిన బద్దెన కూడా వారి దృష్టిలో ఆదికవి గౌరవానికి నోచుకోలేదా? పోనీ చాళుక్య యుగానికే చెందిన తెలు గు కవులు వేములవాడ భీమకవి, అమృతనాథుడు వీరి కంటికి ఆనలేదా? నేటి తూర్పు గోదావరి జిల్లా దాక్షారామానికి చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు (జననం క్రీ.శ.1140) ‘శివ తత్త్వ సారం’ అనే తెలుగు శతకం రాసినట్లు కూడా కేసీఆర్‌కు తెలియకపోవడం చిత్రం! మరీ విచిత్రమేమిటంటే ఆ మల్లికార్జున పండితారాధ్యుని అనంతరం ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర’ పేరుతో క్రీ.శ.1300లో కావ్యం రాసిన పాల్కురికి సోమనాథుడు తెలుగులో ‘ఆదికవి’ అని శ్రీవారు తీర్మానించడం!! ఇక కేసీఆర్‌చే ‘ఆదికవి’గా గుర్తించబడిన పాల్కురికి సోమన వాస్తవంగా ఏ ప్రాంతానికి చెందినవాడో విచారిద్దాం. ‘బసవపురాణం’, ‘మల్లికార్జున పండితారాధ్య చరిత్ర’ అన్న కావ్యాలు రాసిన పాల్కురికి సోమన ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుని సమకాలికుడని కొందరి భావన. దీనికి ఆధారం పిడుపర్తి సోమన అనే కవి రాసిన ‘బసవ పురాణం’లో పాల్కురికి సోమన ప్రతాపరుద్రుని కాలంలో ఉండేవాడని చెప్పడం. అతడు బహుశా క్రీ.శ.1296- 1323 మధ్యకాలంలో ఓరుగల్లును పాలించిన రెండవ ప్రతాపరుద్రుడికి సమకాలికుడని మనం భావించినా, అతడు ఓరుగల్లుకు చెందినవాడని నిర్ధారించడం కష్టం.
ఓరుగల్లుకు 70 మైళ్ళ దూరంలో ఉన్న పాలకుర్తే ఒకనాటి సోమనాధుని స్వస్థలం అయినట్టి పాలకురికి అని కొందరి భావ న. కాని ఈ సిద్ధాంతం సర్వజనామోదం పొందలేదు. సువిశాలమైన కాకతీయ సామ్రాజ్యంలో నాడు దక్షిణ భారతదేశంలోని పలు ప్రాం తాలు అంతర్భాగాలు. ఆ సువిశాల సామ్రాజ్యంలో ప్రతాపరుద్రునికి సమకాలికునిగా సోమనాథుడు ఉన్నాడని అంటే, వరంగల్ జిల్లా పాలకుర్తే సోమనాథుని స్వస్థలం పాలకురికి అని నిర్ధారించబూనడం తొందరపాటు కాగలదు. పాలకుర్తి, పాలకురికి గ్రామనామాలు వేర్వే రు. ఇక ఇప్పుడు నాటి కాకతీయ సామ్రాజ్యంలో పాలకురికి గ్రామం ఎక్కడ ఉన్నదో పరిశీలిద్దాం.
                    నిజాం రాష్ట్రపు గ్రామ నామాల పట్టికను నిశితంగా పరిశీలించిన విఖ్యాత పరిశోధకులు డా.చిలుకూరి నారాయణరావు వరంగల్ జిల్లాలో అసలు పాలకురికి అనే పేరుగల గ్రామమే లేదని తేల్చారు. మరో పరిశోధకులు ఆర్.నరసింహాచార్యులు గోదావరి జిల్లాలోని పాలకురికి గ్రామమే సోమనాథుని జన్మస్థలమని పేర్కొన్నారుగానీ, వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పాలకురికి పేరుతో గ్రామమేదీ లేదు. కిట్టెల్ పండితుడు దక్షిణ మహారాష్ట్రలో పాలకురికి పేరుగల ఒక గ్రామముందని పేర్కొన్నారు. అయితే సోమనాథుని భాష, శైలి వగైరాలను పరిశీలిస్తే అతడు దక్షిణ మహారాష్ట్రకు చెందినవాడయ్యే అవకాశమే లేదు.

                    కన్నడ భాషలో ‘కురికి’, ‘గురికి’ శబ్దాలు గ్రామానికి పర్యాయపదాలు. మన తెలుగులో కుర్రు (కసుకుర్రు, బోడసకుర్రు మొ.), కుచ్చి (పోతుకుచ్చి మొ.), తమిళభాషలో కురిచ్చి (పాంచాల కురిచ్చి మొ.) శబ్దాలు ఇలాంటివే. కుర్రు శబ్దం కొన్ని గ్రామనామాలలో కాల క్రమంలో ‘కుర్తి’ (పాలకుర్తి, చీమకుర్తి మొ.)గానూ, మరికొన్ని గ్రామనామాలలో ‘కూరు’ (నిమ్మకూరు, పొదలకూరు)గా నూ రూపాంతరం చెందింది. అలా పాలకుర్తి గ్రామనామం పూర్వరూపం ‘పాలకుర్రు’ అవుతుందే కానీ ‘పాలకురికి’ అయ్యే అవకాశమే లేదు. పైపెచ్చు కురికి, గురికి శబ్దాలతో అంతమయ్యే గ్రామనామాలు కన్నడ దేశంలోనే ఉన్నాయి. సోమనాథుడు తెలుగులో మహాకవి. కన్నడ భాషలోనూ కొన్ని రచనలు చేసాడు. ఉభయ భాషలు మాట్లాడే ప్రజలు ఆయన్ని అమితంగా గౌరవిస్తారు. అతడి భాష, శైలి వగైరాలు కూడా అతడు కన్న డ భాషా ప్రభావం ఉన్న ప్రాంతానికి చెంది ఉంటాడని సూచిస్తున్నా యి. కర్నాటక రాష్ట్రం తుమ్కూరు తాలూకాలో పాలకురికి పేరు గల ఓ గ్రామం ఉంది. ఇది మన అనంతపురం జిల్లా మడకసిరకు కేవలం ఇరవై మైళ్ళ దూరంలో ఉంది. కన్నడిగులు దీనినిప్పుడు హాలకురికి అంటున్నారు. ఇదే సోమనాథుని జన్మస్థలమని డా.చిలుకూరి అభిప్రాయపడ్డారు. ఇది సమంజసమే. ఎందుకంటే- కన్నడ భాషలో ‘ప’ శబ్దం ‘హ’గా పలుకబడుతుంది. పల్లిని వారు ‘హళ్లి’ అంటారు. పులిని ‘హులి’ అంటారు. మనం ‘పాల పరిమి’ అనే గ్రామాన్ని వాళ్లు ‘హాల హరివి’ అంటారు. అలానే పాల కురికి గ్రామ నామం కన్నడిగుల పలుకుబడిలో ‘హాల కురికి’గా మారిందనేది సుస్పష్టం. ఇంత చర్చించిన తరువాత, భాషా సరిహద్దులు లేని నాటి కాకతీయ రాజ్యంలోని (నేటి కర్నాటక రాష్ట్రంలోని) పాలకురికి కి చెందిన ఓ మహాకవిని, తనకు తాను నేటి తెలంగాణ ప్రాంతానికి చెందినవాడని భావించేసి, ఆ కారణంగా ఆయన్ని కూడా తన ప్రాంతీయ దురభిమానపు కళ్ళద్దాలలోంచి చూస్తూ, నన్నయ్య స్థానంలో ఆదికవిని చేయబూనే కేసీఆర్ చర్య ఎవరికైనా జుగుప్స కలిగించక మానదు. ఒకవేళ ఆ మహాకవి నిజంగా తెలంగాణకు చెందినవాడే అనుకున్నా, ఏ రకంగా చేసినా ఆయన తెలుగులో ఆదికవి కాబోడనేది సుస్పష్టం.
నేటి కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందినంత మాత్రం చేత నన్నయ్య తెలుగులో ఆదికవీ, తెలుగు ప్రజల ఆరాధ్యకవీ కాకుండా పోతాడా? భాషకు రాష్ట్ర, ప్రాంతీయ ఎల్లలు విధించడం సమంజసమేనా? నేటి తెలంగాణ ప్రాంతానికి చెందిన సురవరం, వానమామలై, పల్లా దుర్గేశ్వర శర్మ, కాళోజీ, దాశరథి సోదరులు, సినారె, బిరుదురాజు రామరాజు వంటి గొప్ప సాహితీవేత్తలను ఎటువంటి సరిహద్దులు లేకుం డా ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన తెలుగువారైనా అభిమానిస్తారు. ఇందుకోసం ఆ అభిమానులు కూడా తప్పనిసరిగా నేటి తెలంగాణ ప్రాంతంలో పుట్టాల్సిన అవసరమేమీ లేదు కదా! ‘ఆంధ్రమాత స్థానంలో ఆంద్రోల్లు తెలుగుతల్లిని కొత్తగా ముందు కు తీసుకువచ్చా’ రంటూ మరో పచ్చి అబద్ధం పలికారు కేసీఆర్. నిజానికి ఆంధ్రము, తెలుగు- ఈ రెండు పదాలనూ తెలుగువారు ఒకే అర్థంలో ప్రయోగించారు. ‘మాతా నీకిదే వందనం. ఆంధ్ర మాతా నీకిదే వందనం’ అనీ, ‘మా తెలుగుతల్లికీ మల్లెపూదండ’ అనీ, ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి కలవోడా’ అనీ తెలుగు ప్రజలు ఇష్టంగా పాడుకునే పాటలన్నీ తెలుగు కవులు ఇంచుమించుగా ఒకే కాలంలో సృష్టించారు. ఇంతకాలం విభజనవాదులు తెలంగాణ పది జిల్లాల్లో ‘ఆంధ్ర’ అనే శబ్దం మీద వ్యతిరేకత కలిగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో ఏకంగా ‘తెలుగు’ అనే శబ్దంపైనే వారు కత్తి కట్టారు. ప్రజల్ని ఇంకా ఎక్కడికి తీసుకుపోదలచారో వారు? ‘తెలుగు’, ‘ఆంధ్ర’ శబ్దాలను ఒకే అర్థంలో వాడారు కనుకనే మెదక్ జిల్లా జోగిపేటలో తెలుగువారిని ఏకం చేసే ఉద్దేశంతో జరిపిన సభను ‘ప్రథమ ఆంధ్ర మహాసభ’ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణలోని తెలుగువారు స్థాపించుకున్న గ్రంథాలయానికి ‘శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయం’ అని పేరు పెట్టుకున్నారు. బొగ్గుల కుంటలో ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’ వెలిసింది. ‘ఆంధ్ర మహిళా సభ’ స్థాపించుకున్నారు. మాడపాటి హనుమంతరావుని ‘ఆంధ్ర పితామహ’ అని పిలుచుకున్నారు. తెలుగువారిని ఒక్కటి చేసి, భాషాభివృద్ధి ద్వారా వారి మధ్య సాంస్కృతిక సమన్వయం సాధించే ఉద్దేశంతో ఏర్పరచిన తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం సంగతి సరేసరి. అప్పుడు పనికొచ్చిన ‘ఆంధ్ర’, ‘తెలుగు’ పదాలు ఇప్పుడెందుచేత గిట్టనివిగా అయ్యాయో శ్రీవారే సెలవివ్వాలి. అంతేకాదు; ‘ఆణెము’ అంటే దేశము అనే అర్థం ఉన్న కారణంగానే ‘తెలుగు మాట్లాడే ప్రదేశము’ అనే అర్థంలో తెలంగాణ అనే శబ్దం ఏర్పడితే, తీరా ఇప్పుడు ‘మా ప్రజలు మాట్లాడేది తెలుగు కాదు; మా తల్లి తెలుగుతల్లి కాదు’ అని నొక్కి వక్కాణిస్తున్న కేసీఆర్ తన మాటల వెనుక ఆంతర్యమేమిటో కూడా సెలవివ్వాలి. ఆత్మలు ఉండడమే కనుక నిజమే అయితే ‘తెలుగువాడవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడేదవు సంగతేమిటిరా; అన్య భాష లు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా?’ అని చురకలు అంటించిన కాళోజీ ఆత్మ కేసీఆర్ తీరు చూసి ఘోషిం చి తీరుతుంది.
– ముత్తేవి రవీంద్రనాథ్
సౌజన్యం: ఆంధ్రజ్యోతి (12-9-12)http://books.vasantam.net/2012/09/12/
——————————————————————————————

పాల్కురికి ఆదికవేనా!? – ముత్తేవి రవీంద్రనాథ్ | పుస్తకాలు | వసంతం
books.vasantam.net
క్రీ.శ.1300 ప్రాంతంలో ‘పండితారాధ్య చరిత్రము’ రాసిన పాల్కురికి సోమన తెలుగులో ఆదికవి అంటున్నారు కేసీఆర్. మరి తేనెలొలికే తేటతెలుగులో ‘సుమతీ శతకం’, ‘నీతి శాస్త్ర ముక్తావళి’ అనే రాజనీతి

కావ్యరకాలు

కావ్యరకాలు
కావ్యాలలో రెండు రకాలు: అవి శ్రావ్య కావ్యాలు మరియు దృశ్య కావ్యాలు. నాటకాలు మనకు తెలిసిన దృశ్య కావ్యాలు. ఇవి ప్రేక్షకులను ఎక్కువగా రంజింపజేస్తాయి. రంగస్థలం మీద నాటకం ప్రదర్శింపబడుతున్నప్పుడు ప్రేక్షకులు సంపూర్ణమైన రసాస్వాదన చేస్తారు. కానీ శ్రావ్య కావ్యాలలో వాటిని చదువుకొని, అర్థం చేసుకొని, ఊహించి, భావించి దానిని దర్శించడానికి కష్టపడవలసి వస్తుంది. అయితే శ్రావ్య కావ్యంలో నాటకీయ లక్షణాన్ని ప్రవేశపెడితే నాటకంలోని సౌలభ్యాన్ని కొంతవరకు సాధించవచ్చును.
కావ్య నిర్వచనాలు
కవి శబ్ధం మొదటగా వేదాల్లో పరమాత్మ పరంగా వాడారు. కవి ఋషి, ద్రష్ట, సృష్ట, అందువల్లనే "నానృషి కురుతే కావ్యం" అన్నారు. కవి క్రాంత దర్శికావ్యానికి పరమ ప్రయోజనం ఆనందం. ఆనందంతో పాటు ఉపదేశం ఉండాలి. అందువల్లనే విశ్వశ్రేయస్సే కావ్యం అన్నారు.
ప్రాచీన సంస్కృత కవుల నిర్వచనాలు
సంస్కృత అలంకారికులు కావ్యాన్ని నిర్వచించారు
1. భరతుడు - నాట్య శాస్త్రం - ఇతివృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితం, అనగా ఇతివృత్తము కావ్యమునకు శరీరమని చెప్పవచ్చును
2. దండి - కావ్యాదర్శం - ఇష్టార్థ వ్యవచ్చిన్న పదావళీ కావ్యం అనగా మనోహరమగు అర్థముతో అలంకృతమైన పదసముదాయము కావ్యము
3. భామహుడు -భామహాలంకారం - శబ్దార్థౌ సహితౌ కావ్యం
అనగా శబ్దార్థములుతో కూడినది కావ్యము
భామహుడి ఇంకో నిర్వచనం -కావ్యంతు జాయతే జాతకస్య చిత్ప్రతిభావతః
అనగా ప్రతిభావంతుడగు ఒకానొకకవికి మాత్రమే కావ్యనిర్మాణము సాధ్యమగును
4. రుద్రటుడు - రుద్రటాలంకారం - శబ్ధార్థౌ కావ్యం
5. మమ్మటుడు - కావ్య ప్రకాశం - తదదోషౌ శబ్ధార్థౌ సగుణావనలంకృతీ పునః క్వాపి అనగా దోషరహితములును, గుణసహితములును,సాలంకారములును అగు శబ్దార్థములు కావ్యము.ఎచతనైనా అలంకారములు ఉండకపోవచ్చును
6. విశ్వనాథుడు - సాహిత్య దర్పణం - వాక్యం రసాత్మకం కావ్యం
అనగా రసాత్మకమైన వాక్యము కావ్యము
7 జగన్నాథ పండిత రాయలు - రస గంగాధరం - రమణీయార్థ ప్రతిపాదక శబ్ధః కావ్యం అనగా రమణీయమైన అర్థమును ప్రతిపాదించు శబ్దము కావ్యము
8. విద్యాధరుడు-కవయతీతి కవిః అనగా వర్ణించువాడు కవి
9. అభినవగుప్తుడు-కవనీయం కావ్యం అనగా వర్ణింపదగినది కావ్యం
10. ఆనందవర్థనుడు -అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః అనగా అంతులేని కావ్యప్రపంచమునకు కవియే బ్రహ్మ
11. భర్తృహరి-సుకవితా యద్యస్తి రాజ్యేన కిం అనగా మంచి కవిత్వం ఉన్నచో సామరాజ్యమెందుకు?
పాశ్చాత్య కవుల నిర్వచనాలు
అయితే పాశ్చాత్యులు కావ్యాన్ని కాకుండా కవిత్వాన్ని నిర్వచించారు.
1. అరిస్టాటిల్ : కవిత్వమంటే అనుకరణమే, అనుకరణమంటే సృజన వ్యాపారమే కానీ కేవలానుకరణం కాదు.
2. శామ్యుల్ జాన్సన్ : Poetry is metrical composition. It is the art of uniting pleasure with truth by calling forth imagination to the help of reason. కవిత్వమంటే అంటే చందో బద్ద రచన. అది బుద్దియు , భావనం సాధనాలుగా ఆనంద సత్యాల ఐక్యాన్ని సంఘటించే కళ.
3. జే. ఎస్. మిల్ : What is poetry but the thought and words in which emotion spontaneously embodies itself. కవిత్వం అంటే భావావేశం. తనంత తాను దాల్చెడి సహజ శబ్ధార్థ స్వరూపం
4. వర్డ్స్ వర్త్ : For all good poetry is the spontaneous overflow of powerful feelings. Poetry is the emotion recollected in tranquility. ఉత్తమ కవిత్వం ఎల్లప్పుడు పొంగి పొరలి వచ్చే శక్తిమంతాలైన అనుభూతులతో నిండి ఉంటుంది.
5. షెల్లీ : Poetry in a general sense may be defined as the expression of the imagination. భావనా వ్యక్తీకరణమే కవిత్వము
6. హేజ్ లిట్ : Poetry is the language of imagination and emotion. భావావేశ భావనల శబ్ధ స్వరూపమే కవిత్వం 7. కార్లైల్ : Poetry we will call musical thought. కవిత్వం లాయాత్మకమైన భావన
8. కోలరిడ్జ్ : Best words in their best order is the poetry. ఉత్తమమైన శబ్ధాలు, ఉత్తమమైన రీతిలో అమరివుండడమే కవిత్వం
9. మాత్యూ ఆర్నాల్డ్ : Poetry is the criticism of life. జీవిత విమర్శనమే కవిత్వం
10. ఏడ్గార్ ఏలంపో : Poetry is the rhythmic creation of beauty. కవిత్వం అంటే సౌందర్యాన్ని లయాత్మకంగా సృష్టించడం.
వికిపీడియా సౌజన్యంతో...14.1.2013 ఉ.4.44

Saturday, January 12, 2013

దాశరధి రంగాచార్య కథల్లో స్త్రీ పాత్రలు

దాశరధి రంగాచార్య కథల్లో స్త్రీ పాత్రలు

టి. అన్నపూర్ణ 9912776182
    దాశరధి రంగాచార్య మలితరం కథా రచయితలల్లో ఒక్కరు. వారి జీవితం – సాహిత్యం వేరుకాదు. ఒకే రంగానికి పరిమితం కాకుండా సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో ఎప్పటికప్పుడు మార్పును తీసుకరావడానికై కృషిచేశారు.
    దాశరధి సామాజిక దృక్కోణం నుండి వెలువడిన కథల సంపుటి ”నల్లనాగు” ఈ సంపుటిలో మొత్తం 21 కథలున్నాయి. ఈ కథల నిండా సామాజిక వాస్తవికతే ఉంది.
    ”నల్లనాగు” కథా సంపుటిని పరిశీలించినప్పుడు కొన్ని (ఎనిమిది) కథల్లో చూస్తే అందంగా లేక ఆత్మన్యూనతతో బాధపడుతూ వివాహం విషయంలో సర్ధుబాటుతత్వాన్ని అవలంభించే స్త్రీలు, కన్నపిల్లల మీదనే కాదు పిచ్చుకలు, కుక్కలు, మూగజీవాల మీద ప్రేమను కురిపించే భూతదయగల స్త్రీలు, కొడుకును యుద్ధానికి పంపించే వృద్ధ స్త్రీ, ఆకలికోసం శరీరాన్ని అమ్ముకున్నా మరొకరి ఆకలిని చూసి సహాయం చేసే యువతులు, స్వతంత్య్ర వ్యక్తిత్వం గల స్త్రీలు, ఆర్ధిక లేమితో బాధపడినా వ్యక్తిత్వాన్ని కోల్పోని పనిమనుషులు, ఆకలిముందు అమ్మతనం అమ్ముడుపోయి మనస్థాపానికి గురైన తల్లులు, ఎలాగైనా జీవితాన్ని గెలుచుకోవాలనుకునే ఛాలెంజ్‌ మనస్తత్వం గల విద్యావంతులు, నమ్మినవారు వంచిస్తే ప్రతీకారం తీర్చుకున్న భార్యలు, రంగాచార్య కథల్లో కనిపిస్తారు.
    ”ప్రేమకథ”లో తల్లిదండ్రులు లేని మేరి నల్లగా ఉన్న కారణంగా యుక్తవయస్సు దాటినా కూడా వివాహానికి నోచుకోదు. తనను ఇష్టపడే ఏ మగవాడైనా ఫరవాలేదని సర్ధుకు పోగలనని తోడు కోసం ఎదురుచూస్తున్న మేరి జీవితంలోకి రమేష్‌ అనే నిరుద్యోగి ప్రవేశిస్తాడు. రమేష్‌ మేరి నెలజీతాన్ని చూసి ఆమెతో జీవితం పంచుకోవాలనుకుంటాడు. రమేష్‌ కారణాలతో నిమిత్తం లేకుండా తనతో జీవితం పంచుకోవడానికి అతన్ని మనస్ఫూర్తిగా మేరి ఆహ్వానిస్తుంది.
    స్త్రీ ఎప్పుడు పురుషుడు ఎవరని చూడదు. అతని నేపథ్యం ఆమెకు అవసరం లేదు. తనని ప్రేమిస్తే చాలు సొంతంగా జీవితాన్ని అర్పించే లక్షణముంటుందని మేరి ద్వారా రచయిత మనకు తెలియజేశాడు.
    ”జై జవాన్‌!”లో దేశం ఆపదలో ఉన్నప్పుడు దేశాన్ని కాపాడటం దేశభక్తుల బాధ్యత. జవాన్‌కైతే ఈ బాధ్యత మరింత ఉంటుంది.
    ”జై జవాన్‌” కథలో దేశభక్తుడైన జవాన్‌కు తల్లిగా ఉన్న వృద్ధ స్త్రీ మనో పరివర్తనను తెలుపుతుంది. వృద్ధాప్యంలో తనకు ఆసరగా, బాలింతగా ఉన్న కోడలుకు తోడుగా ఉండాల్సిన కొడుకు యుద్ధానికి వెళ్తానంటే మొదట నివారించింది. కానీ గ్రామంలోని దేశభక్తులు తన కొడుకు కర్తవ్యాన్ని గుర్తించి నినాదాలు చేస్తుంటే తన కొడుకు సేవలు కుటుంబానికే కాదు, దేశానికి మరింత అవసరమని భావించి యుద్ధానికి పంపిస్తుంది.
    జవాన్‌ ఎంతటి దేశభక్తుడో ఆయనను కన్నతల్లి కూడా అంతటి దేశభక్తురాలే అని ఈ కథలోని వృద్ధ స్త్రీ పాత్ర ద్వారా తెలుస్తుంది.
    ”నవల” కథలో ఆకలి తీరడానికి అనివార్యంగా వేశ్యా వృత్తిని ఆశ్రయించే స్త్రీలో ఎంత మానవీయత ఉంటుందో ”నవల” కథలోని వేశ్యా పాత్ర నిరూపిస్తుంది. తనతో గడిపితే వచ్చేరూపాయితో ఆకలి తీర్చుకోవచ్చని ప్రయత్నించిన వేశ్యకు ఎదురుగా ఉన్న రచయిత నుండి నిరుత్సాహమే ఎదురవుతుంది. కారణం రచయిత కూడా కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తూ, ఆకలితో బాధపడుతున్న వాడే కనుక. వేశ్య మరొకనితో గడిపి తనకొచ్చిన సొమ్ములో చిన్న మొత్తాన్ని ఆకలి తీర్చుకో అంటూ రచయిత కివ్వడంతో ఆమె మానవీయత అతిశయిస్తుంది. సభ్య సమాజంలో బతుకుతున్నామనుకునే వ్యక్తుల కంటే నిరాపేక్షంగా ఎదుటివారి ఆకలిని తీర్చేందుకు సిద్ధపడిన వేశ్య మానవీయతలో ఎంతో ఎత్తుకు ఎదిగిందనిపిస్తుంది.
    కటిక దారిద్య్రంలో కూడా ఇతరులకు సహాయం చేయాలనే మనస్తత్వం కల్గిన వేశ్యలను ఉద్దేశించి ఈ కథలో తెలిపారు.
    ”పిచ్చుకలు”, ”కుక్కపిల్ల” ఈ రెండు కథల్లో సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలోని స్త్రీలు, పిల్లలతో పాటు పిచ్చుకలను ప్రేమగా చూసుకునే స్త్రీలు, అదే విధంగా కుక్కలను ప్రేమించే స్త్రీలు కుక్కలకు అన్ని పనులు చేస్తూ ఆనందించే స్త్రీలు, భూతదయ కల్గిన స్త్రీలు కనబడతారు.
    మధ్యతరగతి కుటుంబంలోని పిల్లలకు ఆహారం సరిగ్గా ఉండక తిండికే ఇబ్బందిగా ఉన్నా మూగజీవాలను ప్రేమించే స్త్రీలు కూడా సమాజంలో ఉన్నారని ఈ రెండు కథల ద్వారా రచయిత తెలియజేశారు.
    భార్య దగ్గర ఏకపత్నీవ్రతుడుగా ఫోజులిచ్చే భర్త, ముసుగులు ధరించి సంఘంలో పెద్ద మనుషులుగా  ఫొజులు కొట్టే పురుషుల వికృత లక్షణాన్ని తెలిపే కథ నల్లనాగు. విశ్వనాధం తన పి.ఏ శర్మిల వైపు కన్నెత్తి కూడా చూడనని భార్యతో చెప్పి ఆమె హృదయంలో వ్యక్తిత్వం ఉన్న భర్తగా స్థానం సంపాదించాడు. భార్య ఇంట్లో లేని సమయంలో, ఏకాంతంలో పనిమనిషి నీలమణిపై మనస్సు పారేసుకొని దిగజారడానికి ప్రయత్నిస్తాడు. ఒక దశలో ఆమెతో పశువులా ప్రవర్తిస్తాడు. కానీ ఆమె పేరుకే పనిమనిషి. ఆర్థిక లేమితో ఉన్న నీలమణి పవిత్రమైన వ్యక్తిగా తనకు తాను నిరూపించుకుంటూ విశ్వనాధం ఎలాంటి సంస్కార హీనుడో వీధిలోకి గుంజి నలుగురి ముందు ధైర్యంగా బుద్ధిచెబుతుంది.
    ఈ కథలో అమాయకంగా భర్త మాటలు నమ్మే భార్యగా సుజాత కన్పిస్తే, పేదరికంలోనైనా ఆత్మగౌరవంతో బతకాలని నిరూపించిన స్త్రీగా పనిమనిషి నీలమణి కనబడుతుంది.
    ”విలువలు వలువలు” కథలో ఆకలి ముందు అమ్మతనం అమ్ముడుపోయింది. కటిక దారిద్య్రంతో పసికూన అయిన కొడుకుని భూస్వామికి తాకట్టుపెట్టింది. భర్త అకాల మరణానికి గురికావడంతో ఒంటరిదైన స్త్రీ తిరిగి దొరకమ్మిన కొడుకును తనకు వృద్ధాప్యంలో తోడుంటాడని ఆశపడింది. కానీ ఈ ఆశ అడియాశ అయిన స్థితి ”విలువల వలువలు”లో కనబడుతుంది.
    వీరను బాల్యంలోనే వెంకటయ్య దొరకు తల్లి అమ్మేస్తుంది. వెంకయ్య దొర దగ్గరనే కట్టుబానిసగా ఉన్న వీర యుక్త వయస్సుకు వచ్చాడు. తండ్రి మరణించాక తల్లి తిరిగి తనను తీసుకెళ్ళడానికి వస్తే దొర దగ్గర నుండి తిరిగి తల్లి దగ్గరకు వెళ్ళితే అన్నం దొరకదని భావించిన వీర తల్లి దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడడు.
    ఈ కథలో వీర తల్లి పేదరికం వల్ల పేగుబంధాన్ని తెంచుకోవల్సిన అవసరం ఏర్పడిందని రచయిత తెలిపారు.
    ”అర్థరాత్రి అరుణోదయం” కథలో ధన వ్యామోహంలో పడి  ప్రేమ పేరుతో యువతులను వంచించి పెళ్ళి చేసుకొని తర్వాత భార్యనే అమ్మాలని చూసే వంచనా పూరితమైన భర్త, మోసపూరిత మనస్తత్వమున్న కొడుకుకు సహాయం చేసే తల్లి వృత్తాంతాన్ని తెలిపే కథ అర్థరాత్రి అరుణోదయం.
    ఈ కథలో రమణి అనే యువతి చిన్నతనంలో తండ్రిని కోల్పోయి తల్లి పెంపకంలో ఎదిగింది. శరత్తు అనే యువకుడు తాను ఒంటరినని, అనాథనని రమణిని నమ్మించి వివాహం చేసుకోవాలనుకుంటాడు. వీరి వివాహానికి అంగీకరించని రమణి తల్లిని బలవంతంగా ఒప్పించి కట్నకానుకలిచ్చి శరత్తును వివాహం చేసుకుంటుంది రమణి. కాపురం పెట్టాక శరత్తుకు ఓతల్లి ఉందన్న  వాస్తవం రమణికి తెలుస్తుంది. మొదటి నుండి శరత్తు తనను వంచిస్తున్నాడనే వాస్తవాన్ని చెబుతున్నా, తల్లిమాట విననందుకు రమణి బాధతో ఏడ్చింది. భర్త అత్తల వేధింపులకు తట్టుకోలేక తల్లి ఉంటున్న ఇల్లు కూడా అమ్మి డబ్బు తెచ్చి భర్త, అత్త చేతుల్లో పెట్టాక కూడా రమణి వేధింపులకు గురౌతూనే ఉంది. ధన పిశాచాలైన భర్త, అత్తలు తనను గృహంలో నిర్భంధించి తనకు కావలిగా చిత్తమ్మను ఉంచారు. అర్థరాత్రి అరబ్బుషేక్‌కు తనను అమ్ముతున్నారని చిత్తమ్మ ద్వారా తెలుసుకున్న రమణి తీవ్ర మనస్థాపానికి గురౌతుంది. నరరూప రాక్షసులైన భర్త, అరబ్బు నుండి తనను తాను రక్షించుకోవలసిన అవసరం ఉందని రమణి అనుకుంటుంది.
    తనను కొనడానికి అర్థరాత్రి ఇంటికి వచ్చిన అరబ్బును, అమ్మడానికి సిద్ధపడ్డ భర్తను తలుపుతీసి లోపలికి వస్తుండగా తలుపుచాటున ఉన్న రమణి సాహసంతో రోకలితో తలలు పగలగొడుతుంది. ఆ దుర్మార్గుల ఎర్రని రక్తపు మడుగులోంచే ఈ అర్థరాత్రి అరుణోదయం అయిందని తన చీకటి జీవితానికి ఇదే సూర్యోదయం అని రమణి భావించింది.
    ఈ కథలో ఆపదలో ఉన్న స్త్రీ తనను తానే ఉద్దరించుకునే సాహస నారీమణి కావాలని రచయిత ఉద్భోదించాడు.
    ఈ కథల్లో రచయిత ప్రధానంగా స్త్రీ సమస్యలను చిత్రించకపోయినా కథలో అంతర్భాగంగా స్త్రీ స్థితి, గతిని చెబుతూ వచ్చాడు. అయితే వస్తు ప్రాధాన్యాన్ని బట్టి సంఘటన, నిర్మాణాన్ని బట్టి శిల్ప చాతుర్యాన్ని బట్టి ఈ కథల్లో స్త్రీ పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలిపినట్లుగా మనం భావించవచ్చు.

http://www.prasthanam.com/node/11


ఖాళీలను పూరించడమే సాహిత్యం పని: బాలగోపాల్‌

ఖాళీలను పూరించడమే సాహిత్యం పని: బాలగోపాల్‌

Tributes to K. Balagopal, tireless activist for human rights and for justice

ఖాళీలను పూరించడమే సాహిత్యం పని: బాలగోపాల్‌

without comments
ఇంటర్వ్యూ: కె.శ్రీనివాస్‌
( ‘ప్రజాతంత్ర’ సాహిత్య ప్రత్యేక సంచిక-మార్చి 2001 నుంచి పునర్ముద్రితం)
మార్క్సిజంపై అసంతృప్తితో తాను మొదలు పెట్టిన తాత్విక అన్వేషణ ఒక కొలిక్కి వచ్చిందనీ, తనకు సంతృప్తినిచ్చే ప్రాపంచిక దృక్పథం ఏర్పడిందనీ బాలగోపాల్‌ ఈ ఇంటర్వ్యూలోనే ప్రకటించారు. ఆ దృక్పథం ఏమిటో సాహిత్యాంశాల అన్వయంతో ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఎనిమిదేండ్ల కిందట జరిగిన ఈ సంభాషణ- బహుశా బాలగోపాల్‌ ఇచ్చిన చివరి పూర్తి సాహిత్య ఇంటర్వ్యూ…
చైతన్యయుతంగా బతకాలనే ‘శాపం’ మనిషికి లేనట్టయితే జీవితంలో ఖాళీలు ఉండవు… ఖాళీలు కల్పించే దాహం సాహిత్యానికి గొప్ప దోహదకారి అయింది… సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవిత మంత విస్తృతమైనది.
చరిత్ర, మనిషి, మార్క్సిజం- అన్న మీ సుప్రసిద్ధ వ్యాసం (అరుణతార, సెప్టెంబర్‌ 1993) ‘రాగో’ అన్న నవలకు సమీక్షగా రాశారు. ప్రధానంగా సాహిత్య విమర్శ వ్యాసంగా వచ్చిన ఆ రచనలో రాజకీయ అంశే సంచలనాన్ని, వివాదాన్ని సృష్టించిం ది తప్ప, దానిలోని సాహిత్య చర్చనీయాంశాలను ఎవరూ పట్టించుకోలేదు. మీరు ప్రతిపాదించిన లేదా చర్చించిన సాహిత్య అంశాలు కూడా ‘రాజకీయ’ అంశాలం త వివాదాస్పదమైనవి. ప్రతిస్పందనలోని ఆ విశేషాన్ని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు?
అది సమీక్షగా రాసింది కాదు. ముందుమాటగా రాసింది. రచయిత విశ్వాసాలకు పూర్తిగా భిన్నమైన రచనను ముందుమాటగా వేయడం భావ్యం కాదనిపిం చి, ‘రాగో’కు ముందుమాటగా కాకుండా విడిగా వ్యాసంగా అచ్చు వేయదలుచుకుంటే వేయమని చెప్పాను.అందువల్ల అది’అరుణతార’లో వ్యాసంగా అచ్చయింది. స్పందన మాటకొస్తే, రచనకు తాత్వికంగా స్పందించి ఉంటే అన్ని అంశాలు చర్చకు వచ్చేవేమో. కానీ తమ రాజకీయ విశ్వాసాలపైన దాడిగా దానిని భావించి స్పందించినవారే ఎక్కువ కాబట్టి చర్చ ఆ విధంగా జరిగిందనుకోవాలేమో. అయినా ఆ వ్యాసం నా అభిప్రాయాల సమగ్ర వ్యక్తీకరణ కాదు.
అప్పటికి దాదా పు మూడేళ్లుగా నా తాత్వికవిశ్వాసంగా నేనప్పటిదాకా భావిస్తూ వచ్చిన మార్క్సి జంపట్ల నాకు అసంతృప్తిగా ఉండింది. దానికి సమాధానం చెప్పగలగడం సంగ తి అటుంచి, ఆ అసంతృప్తిని స్పష్టంగా నాకు నేను వివరించుకోలేకపోవడం వల్ల రాయడమే మానేసాను (పౌరహక్కుల రిపోర్టులు తప్ప). ఆ దశలో నేను చేసిన మొదటి రచన ఆ వ్యాసం. ముందుమాట కుండే పరిమితులే కాక ఈ పరిమితి కూడా దానికి ఉంది. అందువల్ల ఆ వ్యాసంలోని అభిప్రాయాలను వివరించే పద్ధతిలో కాకుండా మీ ప్రశ్నలకు విడిగానే జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను.ఆనా డు నేను మొదలుపెట్టిన తాత్విక అన్వేషణ ఒక కొలిక్కి వచ్చిందనీ నాకు సంతృప్తి ఇచ్చే ప్రాపంచిక దృక్పథం నాకిప్పుడుందనీ అనుకుంటున్నాను.
సోషలిజం, సమ సమాజం అన్న ఆదర్శాలే సంక్షోభంలో పడిన కాలంలో, ఆ ఆదర్శాల ఆధారంగా నిర్మించుకున్న అనేక సాహిత్య భావనలు, సిద్ధాంతాలు తెలుగు సాహిత్య రంగంలో చర్చకు ఎందుకు రావడంలేదు?
ఇతర సోషలిస్టు సాహిత్య భావనలు, సిద్ధాంతాల సంగతి పోనిచ్చి కనీసం మార్క్సిస్టు సంప్రదాయంలోని సాహిత్య సిద్ధాంత భావనలు సహితం అన్నీ చర్చకు రాలేదు. మన దగ్గర ‘అరసం’తో మొదలుపెట్టి ‘విరసం’వాళ్లు కొనసాగించిన సాహిత్య సంప్రదాయం కంటే చాలా భిన్నమైన ఆలోచనలు మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంత సంప్రదాయంలోనే ఉన్నాయి. రేమాండ్‌ విలియమ్స్‌, అడార్నో వంటివారు చారిత్రక భౌతికవాదం ప్రాతిపదికన వివరమైన సాహిత్య సిద్ధాంతా లు రూపొందించారు. వాటితో మన దగ్గరున్న వామపక్ష సాహిత్యకారులకు పరిచయం ఉంటే రెండు రకాలుగా ప్రయోజనం ఉండేది.
ఒకటి ప్రామాణిక మార్క్సిస్టు సాహిత్య విమర్శగా మనదగ్గర చలామణిఅయ్యే విమర్శ ఆమోదించని కొన్ని సాహిత్య ప్రయోగాలకు వస్తు సంబంధమైనవీ శిల్ప సంబంధమైనవీ కూడా మార్క్సిస్టు సంప్రదాయంలోనే ఆమోదమే కాక ప్రశంస కూడా ఉందని తెలిసేది. సాహిత్యానికి, ప్రజలకు విప్లవోత్తేజం కలిగించడం అనే ఒకే ఒక కర్తవ్యానికి పరిమితమైన పాత్ర కాక, విస్తృతమైన పాత్ర కల్పించే సాహిత్య సిద్ధాంతాలు మార్క్సిస్టు సంప్రదాయంలోనే ఉన్నాయని తెలిసేది. రెండు మన దగ్గర ప్రచారంలో ఉన్నదాని కంటే సంపన్నమైన సాహిత్య సిద్ధాంతాలకు చారిత్రక భౌతికవాదంలో స్థానం ఉన్నప్పటికీ మార్క్సిజం ప్రాతిపదికన పరిపూర్ణమైన సాహిత్య సిద్ధాంతం రూపొందించడం సాధ్యం కాదని కూడా అర్థమై ఉండేది.
ఈ సిద్ధాం తాలు మనదగ్గర చర్చకు రాకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు. జీవిత మూలాలకు సంబంధించిన సత్యాన్వేషణ ఇంకా బాకీ ఉందని మన దగ్గర మార్క్సిస్టులు అనుకోవడంలేదు. అది ప్రాథమికంగా ముగిసిందనీ దానిని ఆచరించడం, అన్వయించడం, మెరుగులు దిద్దడం మాత్రమే మిగిలివుందనీ అనుకుంటున్నారు. కనీసం 20వ శతాబ్దపు చివరి దశకంలోనయినా ఈ అభిప్రాయం మారవలసి ఉండింది. మారి ఉంటే సోషలిజానికి సంబంధించిన అన్ని ఆలోచనలనూ తిరిగి అధ్యయనం చేయడం జరిగి ఉండేది. అది తత్వశాస్త్రంలో జరగలేదు. రాజకీయాలలో జరగలేదు. సాహిత్యంలోనూ జరగలేదు.
రచయిత లేదా కవి తన రచనలో ఎటువైపు నిలబడ్డాడు అన్న కొలమానం గొప్ప సాహిత్యాన్ని గ్యారంటీ చేయలేదని మీరు అన్నారు. మరి ఆ కొలమానానికి ఎటువంటి ప్రయోజనమూ సార్థకతా లేవా?
ఎటువైపు నిలబడ్డారనేది గొప్ప సాహిత్యాన్ని గ్యారంటీ చేయలేదని నేను చెప్పనవసరం లేదు. అది అందరికీ తెలిసిన సత్యమే. మరి పక్షపాతానికి ఏ ప్రయోజనమూ లేదా అంటే, పూర్తిగా అన్యాయాన్ని సమర్థించే దృక్పథం నుండి గొప్ప సాహిత్యం పుట్టదు అని చెప్పవచ్చు. న్యాయానికి కంకణబద్ధమైన దృక్పథం నుండి పుట్టే సాహిత్యం ఒకవేళ సాహిత్యంగా రాణించకున్నా సాధారణంగా ఏవగింపు కలిగించదు. అన్యాయానికి (దీనికి కూడా మినహాయింపులు లేకపోలేదు) కంకణబద్ధమైనది ఏవగింపు కలిగిస్తుంది కాబట్టి సాహిత్యంగా రాణించదు.
అన్యాయాన్ని పూర్తిగా భుజానికెత్తుకునే రచయితలు చాలా కొద్దిమందే ఉంటారు. కాబట్టి ఇది పెద్దగా జ్ఞానదాయకం కాదు. ఏ విషయంలోనయినా ఏది న్యాయం ఏది అన్యాయం అనేది కచ్చితంగా తెలుసుకోగలమనీ, న్యాయంవైపు ఉన్నావా లేక అన్యాయం వైపు ఉన్నావా అన్న ప్రశ్నకు అన్ని సందర్భాలలోనూ కచ్చితమైన జవాబు చెప్పగలమనీ, సాహిత్యంతో సహా అన్ని విషయాలలోనూ ఈ జవాబే ప్రధాన (నిర్ణయాత్మక) విషయమనీ నమ్మినట్టయితేనే మీరు వేసినది సాహిత్య విమర్శకు కీలకమైన ప్రశ్న. లేకపోతే అది ఒకానొక ప్రశ్న మాత్రమే.
రచన ఎందుకోసం చేస్తారు? కళ కళకోసమా, ప్రజల కోసమా అన్న ప్రశ్నకు ఇప్పుడు అర్థముందా? సాహిత్యానికి దాని కర్తకూ ఉండే సంబంధం ఏమిటి? రచయిత సాహిత్యాన్ని మరేదయినా ఆశయం కోసం రాయడం సరిఅయినదేనా? సాహిత్యానికీ దాని పాఠకులకూ ఉండే సంబంధం ఏమిటి? సాహిత్యం బోధించాలా, జనాన్ని సమీకరించాలా, వినోదాన్నో ఆహ్లాదాన్నో ఇవ్వాలా? ఆయా సంబంధాలకు స్థిర నిర్వచనం ఇవ్వగలమా?
కళకూ సాహిత్యానికీ ఒక కర్తవ్యాన్ని నిర్దేశించే ముందు అవి మానవ జీవితంలో ఏ పాత్ర నిర్వహించాయో చూడడం ఉచితంగా ఉంటుంది. ఇది కామన్‌సెన్స్‌ విషయమేగానీ సాహిత్యం పాత్ర ఇది అది అంటూ తాఖీదులు జారీచేసే వాళ్లకిది తోచినట్టు కనిపించదు. కళా సాహిత్యాలు నాగరికత అంత ప్రాచీనమైనవి. సైకిల్‌ తొక్కడంలాగ, క్రికెట్‌ ఆడడం లాగ కళా సాహిత్య సృజన మనిషి చేయగల ఒకానొక పనికాదు.
అది మానవ అస్తిత్వ నైజంతో సన్నిహితంగా ముడిపడిన ప్రక్రియలు. మనిషి ఉనికిలో అంతర్భాగమైన ప్రక్రియలు. రాళ్ల నుండి పనిముట్లు తయారు చేసుకోవడం మొదలుపెట్టిననాడే రాతి గోడలపైన బొమ్మలు వేయడం, రాళ్లతో కళాత్మకమైన వస్తువులు తయారుచేయడం మనుషులు మొదలుపెట్టారు. మనిషి రాత నేర్చిననాడే సాహిత్యం కూడా పుట్టింది. గానం అంతకంటే ముందే పుట్టింది. మానవ జీవితంతో ఇంతగా పెనవేసుకున్న కళాసాహిత్యాలకు ఆ జీవితంలో ఉన్న పాత్ర ఏమిటో అర్థం చేసుకోకుండా వాటికి నియమాలూ తాఖీదులూ జారీ చేయడం ఎంతవరకు సబబు?
కళ సంగతి పక్కనపెట్టి సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. దేనికయినా ఒక్క వాక్యంలో నిర్వచనం ఇవ్వడంలో సమస్యలున్నాయి గానీ సాహిత్యం పాత్రను ఒక్క వాక్యంలో నిర్వచించమంటే, జీవితంలోని ఖాళీలను పూర్తిచేయడం సాహిత్యం పాత్ర అని చెప్పవచ్చు. దానికి వేరే ఏ కర్తవ్యాన్ని అప్పగించడంలోనూ అర్థంలేదు. ఆ కర్తవ్యాన్నే సమసమాజ లక్ష్య సాధన దిశగా మలచుకునే ప్రయత్నం చేయొచ్చు. జీవితంలో ఖాళీలు ఎందుకుంటాయి? చైతన్యయుతంగా బతకాలనే ‘శాపం’ మనిషికి లేనట్టయితే జీవితంలో ఖాళీలు ఉండవు. ఇతర జంతువులు ఒక జంతు జాతిగా తమకు ఉండే జన్యు లక్షణాలననుసరించి బతుకుతాయి. వాటికి తెలివి లేదనీ రోబోట్‌ల వంటివనీ కాదు.
ఎంత చురుకయిన మెదడున్న జంతువయినా తన పరిసరాలతో తాను ఏవిధంగా వ్యవహరించాలన్న నిర్ణయాన్ని చేసిపెడుతుంది. మనిషిలో జన్యు నిర్ణాయకత చాలా తక్కువ. తన పరిసరాలతో- అందులో భాగంగా ఇతర మనుషులతోనూ- ఏ విధంగా వ్యవహరించాలన్న నిర్ణయాన్ని నూటికి తొంభై తొమ్మిదిపాళ్లు మనిషి చైతన్యయుతంగానే తీసుకోవాలి. ఇది మనిషి అస్తిత్వ నైజంలోని ప్రధాన అంశం. ప్రతీ మనిషీ తనలో పుట్టిన ‘స్వంత’ చైతన్యంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటారని కాదు. ఆ చైతన్యం అప్పటికే ఒక సామాజిక ఆలోచనారీతి చేత ప్రభావితమయి ఉంటుంది. అయినప్పటికీ నిర్ణయం చైతన్యయుతమైనది.
చైతన్యయుతంగా వ్యవహరించడమంటే ఏది చేయాలో ఎంచుకోవడం. ఏ విధంగా వ్యవహరించాలన్న ఎంపిక చేసుకోవడం. మనం వ్యవహరించే వస్తువులు, విషయాల గురించి కూడా అభిప్రాయాలు ఏర్పరచుకోవడం. అందులో భాగంగా మన గురించి కూడా అభిప్రాయాలు ఏర్పరచుకోవడం. అప్పుడు సహజంగానే ప్రమాణాలు ఏర్పడతాయి. ఇది మనిషి అస్తిత్వ నైజంలోని రెండవ అంశం.
ప్రామాణికతా భావన మనిషి చైతన్యానికి ఉండే స్వాభావిక లక్షణం. నైతికత (తప్పొప్పులు, మంచి చెడుల భావన) అందులో ఒక భాగం మాత్రమే. దానితోపాటు అన్నిటికీ ప్రమాణాలు ఏర్పడతాయి. సౌందర్యం, సంతోషం, సుఖం, సంతృప్తి మొదలైన అన్నిటికీ ప్రమాణాలు ఏర్పడతాయి. ప్రామాణికతా భావన వెంటనే పరిపూర్ణతా భావన కూడా ఉంటుంది. ఇది దానిని వెన్నంటి ఉంటుంది. సంపూర్ణమైన మంచి, సంపూర్ణమైన సుఖం, సంపూర్ణమైన సౌందర్యం, సంపూర్ణమైన సాహసం మొదలైనవన్నీ పరిపూర్ణతా భావనలో భాగమైనవే.
నిజ జీవితానికీ ఈ పరిపూర్ణతా భావనకూ మధ్యనున్న అంతరం జీవితంలోని ఖాళీలలో ఒకటి. అది కల్పించే దాహం సాహిత్యానికి గొప్ప దోహదకారి అయింది. అయితే పరిపూర్ణతా భావన ఒక్కటే కాదు, అన్ని రకాల ప్రామాణికతా భావనలను జీవితం వెక్కిరిస్తుంది. ఈ అంతరం మనిషిలో కలిగించే ఆందోళన, ఆవేదన, వెలితి అన్ని భాషలలోనూ సాహిత్యానికొక ముఖ్య వస్తువు.
జీవితంలో వేరే రకమైన ఖాళీలు కూడా ఉంటాయి. చైతన్యయుతంగా జీవించక తప్పని మనిషికి జ్ఞానం చాలా అవసరం. మన కళ్లముందు ఉండీ మనం చూడని, చూడజాలని విషయాలనేకం ఉంటా యి. కొన్ని భయంవల్ల చూడము. కొన్ని అభద్రత వల్ల చూడము. కొన్ని ఒక బలమైన భావజాలం ప్రభావం వల్ల మన ఎదుట ఉండీ మనకు కనిపించవు. ఒక్కొక్కసారి మనకు అలవడిన దృక్కోణం వల్లగానీ మనం ఎంచుకున్న దృక్కోణం వల్లగానీ కొన్ని విషయాలు కళ్లముందే ఉండీ కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే కావు, సామాజిక క్రమాలు కూడా ఉంటాయి.
వీటిని మనకు చూపించడం సాహిత్యం చేసే పనులలో ఒకటి. చూపించే క్రమంలో ఏ భయం, లేక ఏ అభద్రతా భావన, లేక ఏ భావజాలం, లేక ఏ పాక్షిక దృక్కోణం దీనిని మనం చూడలేకుండ చేసిందో కూడా సాహిత్యం చెప్పకుండానే చెప్తుంది. ‘అరె! ఇది నాకు తెలిసిన విషయమే గానీ చూడలేకపోయానే’ అనుకునేటట్టు చేస్తుంది. మంచి సాహిత్యమెప్పుడూ ఆ అనుభూతి కలిగిస్తుంది. మానవ అస్తిత్వంలోని ఈ రకరకాల ‘ఖాళీలు’ సాహిత్యం జన్మస్థలం, దాని కార్యక్షేత్రం.
అటువంటి ప్రక్రియ మనిషి అస్తిత్వ నైజం వల్లనే అవసరమయింది. సాహిత్యానికి ఉండే ఈ నైజాన్ని గుర్తించి దానితో సమసమాజ ఆదర్శానికి అనుగుణంగా వ్యవహరించడం నేర్చుకోగలిగితే- దానికి ఏమైనా ప్రమాణాలు రూపొందించుకోగలిగితే- అది ప్రజాసాహిత్య సిద్ధాంతం కాగలదు. సోషలిస్టు సాహిత్య సిద్ధాంతం కాగలదు. ‘కళ ప్రజల కోసం’ అనే నినాదానికి వేరే ఏ కార్యరూపం ఇచ్చే ప్రయత్నం చేసినా అది సాహిత్యానికిగానీ ప్రజలకుగానీ మేలు చేయదు.
నిలిచిపోయే సాహిత్యానికి-సమర్థవంతంగా రాయడం, సామాజిక పరిణామంలో కీలక స్థానంలో ఉన్న చారిత్రక సందర్భం నేపథ్యంగా ఉండడం-అన్న లక్షణాలను మీరు ప్రతిపాదించారు. ఎటువంటి బాహ్య పరిస్థితుల మధ్య అయినా తన సమర్థత, పక్షపాతాల ఆధారంతో రచయిత గొప్ప రచనలు చేయగలడని ఇంతకాలం నమ్ముతూ వచ్చాం. చారిత్రక సందర్భానికి మీరు ఎక్కువ వెయిటేజి ఇవ్వడం వల్ల నిలిచిపోయే రచనల సాధన నుంచి రచయితలను నిరుత్సాహపరుస్తుంది కదా?
సమర్థవంతంగా రాయడం సంగతి పక్కన పెట్టండి. అదెట్లాగూ అవసరమే. ఇక్కడ సామర్థ్యం అనేది శిల్పానికి సంబంధించినది. శిల్పం గురించి మాట్లాడితే వస్తువు మీదనుండి దృష్టి తొలగిపోతుందనే కృత్రిమమైన భయం నుండి బయటపడగలిగితే, సాహిత్యానికి ‘సాహిత్యం’ లక్షణం ఇచ్చేది శిల్పమే తప్ప వస్తువు కాదనే విషయం స్పష్టమే. సాహిత్యానికీ జర్నలిజానికీ తేడా సాహిత్య శిల్పమే. సాహిత్యాన్ని శిల్పమే రూపొందిస్తుంది. (Form is constitutive of literature) అని అడార్నో అంటాడు. అతను వర్గపోరాటం మీద అచంచల విశ్వాసం ఉన్న మార్క్సిస్టే మళ్లీ.
కీలకమైన సామాజిక పరిణామాల మాటకొస్తే, అటువంటి సందర్భాలు చరిత్రలో ఎక్కడ తలెత్తినా గొప్ప కథా వస్తువులు అందించడానికి ఒక కారణం ఉంది. అటువంటి సందర్భాలలో ఒక్కొక్కసారి మానవ ఆలోచనారీతికి స్వాభావికమైన పరిపూర్ణతాభావన, ప్రామాణికతా భావన అత్యున్నత స్థాయిని అందుకుంటాయి. అతి గొప్ప ఆదర్శాలు ముందుకొస్తాయి. ఒక్కొకసారి మానవ ఆచరణ అతి నీచ స్థాయికి పడిపోతుంది. ఒక్కొకసారి రెండూ జరుగుతాయి. అన్ని సందర్భాలలోనూ ఉన్నత ప్రవర్తనకూ నీచమైన ప్రవర్తనకూ మధ్యనున్న ఎడం మరింత ఎక్కువవుతుంది.
చూడగలిగి ఉండీ చూడలేకపోవడం, కళ్ల ముందుండీ కళ్లు మూసుకుపోయి కనిపించకపోవడం అటువంటి చారిత్రక సందర్భాలలో మరింత స్పష్టంగా తెలుస్తాయి. సాహిత్యం కార్యక్షేత్రమైన మానవ అస్తిత్వ నైజంలోని అన్నిరకాల సందిగ్ధాలూ తీవ్ర పరిమాణం తీసుకుంటాయి. అందుకే నిలిచిపోయే సాహి త్యం పుడుతుంది. దీనికీ, బాహ్య పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు కూడా మంచి సాహిత్యం రాయడం రాయలేకపోవడం అనే సమస్యకూ సంబంధమేమీ లేదు.
మీ మాటలలోని అర్థాన్ని మరింత విస్తరిస్తే – ఒక స్థిర నిశ్చయం కంటే – భయం, కుతూహలం, ఆందోళన- వంటి అస్థిర ఉద్వేగాల నుంచే గొప్ప సృజన వస్తుంది. ఈ ప్రతిపాదనకు అపవాదులు లేవా? ఆధునికతను మనస్పూర్తిగా ఆహ్వానించిన గురజాడ అప్పారావును ఎలా లెక్క వేస్తారు? విశ్వనాథ సత్యనారాయణలో ఆధునికత మీద భయందోళనలు మాత్రమే ఉన్నాయా, స్థిర నిశ్చయంతో కూడిన వ్యతిరేకత లేదా? పాశ్చాత్య సాహిత్యం నుంచే తప్ప తెలుగు సాహిత్యం నుంచి ఒక్క ఉదాహరణ కూడా ఎందుకు ఇవ్వలేదు?
‘ఆధునికతను మనస్పూర్తిగా ఆహ్వానించిన గురజాడ అప్పారావు’ కన్యాశుల్కం హీరోగా ఆధునికతను నిజాయితీగా ఆహ్వానించిన వ్యక్తిని ఎంచుకోలేదు. విరసం వంటి సాహిత్య సిద్ధాంతకారుల మాటలు విని ఉంటే ఆ పని చేసి ఉండేవాడు. అప్పుడు కన్యాశుల్కాన్ని ఈరోజు ఎవరూ చదివేవారు కాదు. ఆయన ఆధునికతను తన స్వంత ప్రయోజనాలకోసం వాడుకున్న యాంటి హీరోను ఎంచుకున్నాడు. సంప్రదాయానికి కూడా మంచికో చెడుకో దానిని నిజాయితీగా ఆచరించిన బ్రాహ్మణులను కాక గిరీశంను పోలిన దగుల్బాజీలనే ప్రతినిధులుగా ఎంచుకున్నాడు.
ఆధునికతకూ సంప్రదాయానికీ మధ్యనున్న వైరు ధ్యం రెండు మహత్తరమైన విలువల ప్రపంచాలకు మధ్య ఘర్షణ. ఆ విషయం కన్యాశుల్కం దాచిపెట్టదు. అందులో మనల్ని ఆధునికత వైపే రమ్మంటుంది. అదే సమయంలో ఆ విలువల అట్టహాసానికీ వాటి పేరు మీద కొట్లాడుకునే మనుషుల నేలబారుతనానికీ మధ్యనున్న అంతరాన్ని చూపిస్తుంది. కొత్త నవ్వు, కొంత ఆందోళన, నవ్యత పట్ల సానుభూతి, దానికి సాధనాలయిన మనుషులను చూసి కొంత నిస్పృహ కలిగిస్తుంది.
‘నాజీవాదానికి అనుకూలంగా గొప్ప సాహిత్యం రాయడం సాధ్యం కాదనేది నిస్సందేహమే’నని ఫ్రెంచి తత్వవేత్త సార్త్ర్‌ అంటాడు. బ్రాహ్మణవాదాన్ని గురించి కూడా అదేమాట అనొచ్చు. కానీ ప్రశ్నను ఆ విధంగా వేసుకోవడంలోనే పొరబాటు ఉంది. ఆ విధంగా వేసుకుంటే నిస్సందేహమైన జవాబులే వస్తాయి. ‘నాజీవాదాన్నీ బ్రాహ్మణవాదాన్నీ జయించడం అభ్యుదయవాదులు ఊహించినంత సులభమా అన్న సందేహం గొప్ప సాహిత్యాన్ని సృష్టించగలదా?’ అన్న రూపంలో ప్రశ్న వేసుకుంటే అంతటి ‘నిస్సందేహమైన’ జవాబు రాదు.
ఈ వాదాలను జయించడానికి ఎంచుకుంటున్న పద్ధతులు ఒక కొత్త నియంతృత్వానికి, లేక ఒక కొత్త అణచివేతకు దారి తీస్తాయేమోనన్న సందేహం గొప్ప సాహిత్యాన్ని సృష్టించగలదా అన్న రూపంలో వేసుకున్నా కూడా అంతే. విశ్వనాథ సత్యనారాయణలో ఉన్నది ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకతే తప్ప ఇటువంటి భయసందేహాలు కావు కాబట్టి ఆయన రాసినదేదీ నిలిచిపోతుందని అనుకోను. అయితే నేను ఆయన రచనలన్నీ చదవలేదు కాబట్టి కచ్చితంగా చెప్పలేను.
స్థిర నిశ్చయం-భయం అన్న వర్గీకరణ కంటే మనిషిలోని అభ్యుదయ శక్తి పట్ల ఆశాభావం, దానికి ఉండే అవరోధాలపట్ల ఆందోళన అనేది ప్రస్తుత సందర్భంలో ఉపయోగకరమైన వర్గీకరణ అనుకుంటాను. ఆ శక్తి తమలో ఉందని తెలియకుండ మనుషులు నిద్రలో ఉన్నప్పుడు దానిని వారికి చూపించి మేల్కొలపడం మంచి సాహిత్యం సాధారణంగా నిర్వహించే పాత్ర అవుతుంది. అటువంటి సాహిత్యం అన్ని భాషలలోనూ ఉంది.
అయితే ఆ శక్తిని తప్ప దానికి ఉండే పరిమితులనూ అవరోధాలనూ వాటిని గుర్తించకపోతే రాగల విపత్తునూ గుర్తిస్తుంది, వ్యక్తీకరిస్తుంది. నిజానికి మానవ జీవితంలో ఈ రెండు పరిస్థితులూ ఎప్పుడూ కలిసే ఉంటాయి కాబట్టి రెండు కర్తవ్యాలు సాహి త్యం నిర్వర్తిస్తూనే ఉంటుంది. ఎటొచ్చీ ఉద్యమాలకు అనుబంధంగా కాక ‘కాంప్లిమెంటరీ’గా ఉంటుంది. అయితే సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవిత మంత విస్తృతమైనది.
మానవ స్వభావంలో అభ్యుదయ కాముకులు గుర్తించడానికి భయపడే ఆగాధాలను అసాధారణ ప్రతిభతో-ప్రగతివాదుల పట్ల కచ్చతో-డాస్టయవ్‌స్కీ వెలికితీసి వర్ణించాడని మీరు రాశారు. తెలుగు సాహిత్యంలోని కమ్యూనిస్టు వ్యతిరేకుల రచనలకు అంతటి స్థాయి ఉందంటారా?
దస్తాయవ్‌స్కీ మనిషిమీద ప్రేమతో ఆధునికతను చూసి భయపడ్డాడు. మనిషి మీద ద్వేషంతో కాదు. ఆధునికత- బూర్జువా ఆధునికత అయినా సోషలిస్టు ఆధునికత అయి నా- మనిషిలోని మానసిక శక్తిని మాత్రమే చూస్తుంది. దానిని ప్రాతిపదిక చేసుకొని తన వ్యూహాలను రచించుకుంటుంది. అది బలహీనమైన మనిషిని తన రథ చక్రాల కింద తొక్కేస్తుందని భయపడిన రచయితలు 19, 20 శతాబ్దాల పాశ్చాత్య సాహిత్య చరిత్రలో చాలామంది ఉన్నారు. 20వ శతాబ్దాపు చరిత్రను సమీక్షించుకుంటే ఇది అవాస్తవికమైన భయం కాదని అర్థం అవుతుంది.
తెలుగు సాహిత్యంలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు మనిషి మీద ప్రేమతో- మనిషి బలహీనతపట్ల సానుభూతితో- కమ్యూనిస్టులను చూసి భయపడ్డారా? లేక మనిషిమీద ద్వేషంతో కమ్యూనిజాన్ని ద్వేషించారా? రెండవదే నిజమేమో. అయితే నాకు తెలుగు సాహిత్యంతో ఉన్న పరిచయం తక్కువ కాబట్టి కచ్చితంగా చెప్పలేను.
ఇంటర్వ్యూ: కె.శ్రీనివాస్‌
‘ప్రజాతంత్ర’ సాహిత్య ప్రత్యేక సంచిక-మార్చి 2001 నుంచి పునర్ముద్రితం

వివేచనాత్మక సాహిత్యాన్ని కొత్త దృష్టితో చూపించే వ్యాసాలు

వివేచనాత్మక సాహిత్యాన్ని కొత్త దృష్టితో చూపించే వ్యాసాలు

Pictureనోబెల్ బహుమతి గ్రహీత, స్విస్ భాషా రచయిత హెర్మన్ హెస్ తన “సిద్ధార్థ” నవలలో నదిని వినడం ద్వారా సమస్తం తెలుసుకోగలుగుతామని బోధిస్తాడు. అయితే అంతకు చాలాకాలం ముందునుంచే బైబిలు భూమితో మాట్లాడితే మరిన్ని విషయాలపట్ల వివేచన కలుగుతుందని చెప్తుంది. విప్లవకవి వరవరరావు తన విమర్శ వ్యాస సంపుటికి అదే పేరు “భూమితో మాట్లాడు...” అనే ఖాయం చేశారు. ఆ పుస్తకాన్ని ఈ వారం పాఠకులకు పరిచయం చేస్తున్నాను. వరవరరావు అనగానే ఈ తరం పాఠకులకు విప్లవకవిగానే తెలుసు. కానీ వరవరరావు మరిన్ని రంగాలలో కూడా సునిశితమైన కృషి చేశారన్న విషయం వీరికి తెలియదు. ఉపన్యాసకుడు, పాఠకుడు, అనువాదకుడు, కథకుడు, విమర్శకుడు, ఉద్యమకారుడు అయిన వివి దాదాపు దశాబ్దం పాటు ‘సృజన’ మాసపత్రిక వెలువరించారు. పత్రిక సంపాదకునిగా ఎన్నోసార్లు ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. సమకాలీన సాహితీ చరిత్రలో ఉద్యమ సమానంగా సాహిత్య కృషి చేస్తోన్న వ్యక్తి వివి. తను మాత్రం గద్దర్ ను లివింగ్ లెజెండ్ అని వినమ్రంగా పేర్కొంటారు గానీ, ఆ ఉపమానానికి వరవరరావు జీవితం కూడా చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

సాహిత్య విమర్శలో ప్రశంసనీయమైన కృషి సలిపిన వరవరరావు .కల్పన సాహిత్యంలో ముఖ్యంగా కథాసాహిత్యంలో ఇటీవల వెలువడిన అనేక సంపుటాలకు రాసిన ముందుమాటలు, పరిచయాలు ఒకచోట చేర్చి వెలువరించిన పుస్తకమే ఈ “భూమితో మాట్లాడు…”. ఒక పుస్తకాన్నో, రచయితనో, ప్రక్రియనో వ్యాస రచయిత పరిచయం చేసిన తీరు సాహిత్య విద్యార్థులు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయదగ్గది. అల్లం రాజయ్య ‘కొలిమంటుకున్నది‘ నవలలో ప్రారంభమై ఎన్. వేణుగోపాల్ ‘కథాసందర్భం‘పై రాసిన వ్యాసంతో ముగిసిన ఈ వ్యాస సంపుటిలో 23 వ్యాసాలున్నాయి. సృజన మాస పత్రికలో ఒక నవల ప్రచురణ ఎంత కష్టసాధ్యంగా జరిగేదో మొదటి వ్యాసంలో చూచాయగా మనకు అర్థమవుతుంది. అల్లం రాజయ్యతో రాసిందే రాయించి, మళ్లీమళ్లీ తిరగ రాయించి, అప్పుడు గానీ దానిని ప్రచురించే వారు కాదన్నమాట. అందుకే ఆ నవల అప్పట్లో తెలంగాణ పల్లె ప్రాంతాలలో రేడియోలో వార్తలు వినేట్టుగా అందరూ గుమికూడి ఒక్కరిచేత చదివించుకుని వినేవారట. అలాంటి ప్రచురణలు ఇప్పుడు పూర్తిగా కరువైపోతున్నాయి. అదే సృజనలో వెలువడిందే నవీన్ ‘అంపశయ్య‘ కూడా. ‘ప్రజలమనిషి‘, ‘గంగు‘ అనే నవలలను పరిచయం చేస్తూ వట్టికోట ఆళ్వారుస్వామి రచనా జీవితాన్ని అంచనా వేస్తారు.

‘ఉత్పత్తి శక్తులకు ఉత్పత్తి సంబంధాలకు మధ్య వైరుధ్యాలు పరిష్కారం కావడమన్నది సాఫీగా, శాంతియుతంగా జరిగే పనికాదు. ఉత్పత్తి శక్తులమీద, ఉత్పత్తి సాధనాల మీద, ఉత్పత్తి మీద నియంత్రణ చేసే వర్గాలు పాలక వర్గాలుగా, ఉత్పత్తి శక్తులు పాలిత వర్గాలుగా జీవిస్తూ నిరంతరం అనివార్యంగా ఘర్షణ పడుతున్న వ్యవస్థ యిది’ (పే. 19). ఇలాంటి సూత్రీకరణలు అంతగా మనకెదురవని మార్క్సిస్టు సిద్ధాంతపు అన్వయ విమర్శ అధ్యయనం చేయాలనుకున్నవారికి ఈ “భూమితో మాట్లాడు…” వ్యాస సంకలనం ఎంతగానో సహకరిస్తుంది. ఉదయం దినపత్రికలో ‘మానవి’ శీర్షికలో డాక్టర్ కరుణ రాసిన వ్యాసాలు, కథలూ, కవితలూ కలిపి ‘తర్జని’గా సంకలనపరచగా దానికి రాసిన ముందుమాట అశ్రురశ్మి చదివినప్పుడు మాత్రమే కరుణ రచనలను ఎంతో చక్కగా ఆస్వాదించగలుగుతాము. ఆర్ కె పబ్లికేషన్స్ ప్రచురించిన రెండు కథా సంపుటాలు ‘శ్వేతరాత్రులు’, ‘రుతుపవనాలు’కు వివరంగా రాసిన ముందుమాటలు చదివి అర్థం చేసుకోవడం కేవలం సమకాలీన సాహిత్యాన్ని ఎంత జాగరూకతతో అవగాహన చేసుకోవాలో తెలుసుకోవడానికే. భూపాల్ రాసిన “అంబల్లబండ’ కథలకు ముందుమాట రాస్తున్న సమయంలోనే తుమ్మేటి రఘోత్తమ రెడ్డి ‘పనిపిల్ల’ కథ ప్రచురణైంది. ఆ కథలో వున్న గూఢత్వాన్ని, గొప్పతనాన్ని చూచాయగా వివి ప్రస్తావిస్తారు. తరువాత తెలుగు సాహిత్య రంగంలో ‘పనిపిల్ల’ కథ పెను దుమారం రేపి, ఎంతో చర్చకు తెరతీసింది.

ఈ వ్యాసాల్లో నాకు బాగా నచ్చిన వ్యాసాలు కాళీపట్నం రామారావు సాహితీ జీవితాన్ని అంచనా వేసేదొకటి. మరొకటి జి, కళ్యాణరావు నవల “అంటరాని వసంతం” మీద రాసింది. కారా మేష్టారి కథలమీద వ్యాసం చదివాక మళ్లీ మరోసాతి మేష్టారి కథలన్నీ చదవాలనిపించింది. “సేనాపతి వీరన్న”, “వీరడు-మహావీరుడు”, “ఆర్తి”, యజ్ఞం”, “కుట్ర”, “హింస” లాంటి కథలు మళ్లీ ఈ తరం యువ రచయితలనుంచి ఆశించడం అత్యాశేనేమో. బీజరూపంలో వుండే ఆనాటి సమస్యల స్వరూపం మారిందే కానీ ఇవ్వాళ అవే సమస్యలు వటవృక్షం మాదిరిగా వేళ్లూనుకుని అందరి బతుకులను శాసిస్తూ, అవే కొత్తకొత్త రూపాలలో మన జీవన విలువలను తలకిందులు చేస్తున్నాయి. నిజానికి ఆనాటి కథలు చదువుతుంటేనే ఆ సమస్యలను అంత విశ్లేషణాత్మకంగా చిత్రించడంలో కారా, రావిశాస్త్రిలాంటి వారు ప్రదర్శించిన అత్యున్నత స్థాయి నైపుణ్యానికి ఎక్కడలేని ఆశ్చర్యం కలుగుతుందే, మరి ఇవ్వాళ్టి సంక్షుభిత సమాజాన్ని చిత్రించడానికి మరెంత పదునైన సాహిత్యం కావాలో కదా!

అలాగే ఇటీవల వెలువడిన జాన్ పెర్కిన్స్ రచన ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ చదివాక సామ్రాజ్యవాదుల చేతుల్లో కొందరు దేశాధినేతలు ఎలా కీలుబొమ్మలుగా మారుతున్నారో తేటతెల్లమైంది గానీ, 1999లోనే శేషు రచనలు “శేషవాక్యం”కు ముందుమాట రాస్తూ వివి ఇలా అనడం అతనికే చెల్లింది. ‘జానెడు కడుపుకు ఆదరువు లేకుంటే అడుక్కుంటే అది బిచ్చమెత్తడం. ప్రపంచబ్యాంకు దగ్గర అప్పుతెచ్చి అడవులు సర్వే చేయడానికి హెలికాప్టర్లు కొని, ప్రపంచ మార్కెట్ కోసం ఫ్లైఓవర్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మిస్తే అది విజన్. ఆ అంతర్జాతీయ బిచ్చగాని పీడకలల్ని పెంగ్విన్ వాళ్లు పుస్తకంగా ప్రచురిస్తారు’. ఇవి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుద్దేశించి అన్న మాటలు. ఆ పుస్తకాన్ని రాయడాంలో సాయం చేసింది సేవంతి నైనన్ అనే రచయిత్రి. ఆమె ఈ గ్లోబలైజేషన్ రహస్యాలు విప్పి చెప్పే పత్రిక (ది హిందూ)లో మీడియా డొల్లతనం విశ్లేషించే మీడియా పల్స్ అనే కాలమ్ రాస్తుంటుంది! ఈ విషయాలు అర్థం చేసుకునే కొద్దీ మతిపోతుంది కదా.

ఈ పుస్తకాన్ని టైటిల్ గా పెట్టిన పేరు కళ్యాణరావు రచించిన “అంటరాని వసంతం” నవలను సమీక్షిస్తూ వివి అన్న మాటలు. నిజానికి ఈ నవల ఏ అంతర్జాతీయ స్థాయి సాహిత్యంతోనైనా పోటీపడగలిగేది. అలెక్స్ హేలీ రాసిన “ది రూట్స్” నవలకంటే నిజంగా గొప్ప నవల. అపార్తీడ్ ల కంటే నీచమైన అంటరాని సంస్కృతి మనదేశంలో తప్ప మ్హూమ్మీద మరెక్కడా కనిపించదు. ఆ వివక్ష విషస్వభావపు విశ్వరూపాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రించడంలో కళ్యాణరావు నూటికి నూరుపాళ్లు సఫలమయ్యారు. ఇది నిజానికి చదివే నవల కాదు. ఊరూరా గానం చేస్తూ చెప్పుకోవాల్సిన నిజమైన భారతీయ కథానిక్ ఈ ”అంటరాని వసంతం”. ఈ నవల చదవడం ఒక దుఖం తెప్పించే, ఒళ్లు గగుర్పొడిపించే, సిగ్గుతో చితికిపోయేలాచేసే అనుభూతి కాగా, దీనికి వివి ముందుమాట నవలంతా చదివాక చదవడం మరో అద్భుతమైన అనుభూతి. ఖచ్చితంగా నవలసారం మన రక్తంలోకీ మూలుగుల్లోకీ ఇంకిపోతుంది.
కారాతోపాటు ఈ పుస్తకంలో విశ్లేషణకు చోటు దక్కించుకున్న మరో ఇద్దరు ఉత్తరాంధ్ర కథకులు అట్టాడ అప్పల్నాయుడు, బమ్మిడి జగదీశ్వరరావు. సాహిత్య విద్యార్థులు తప్పక చదవాల్సిన ఈ 150 పేజీల “భూమితో మాట్లాడు…” వ్యాస సంకలనం ఖరీదు 35 రూపాయలే. మరి మీరూ చదువుతారుగా!

“భూమితో మాట్లాడు...” కల్పనా సాహిత్యం – వస్తు వివేచన

వరవరరావు

యుగ ప్రచురణలు 2005

పేజీలు 147, వెల. 35 రూ.లుhttp://chaduvu.wordpress.com/2009/07/24/varavararao/
Like · · Promote ·