|| కపిల రాంకుమార్ || రచ్చబండ ముచ్చట్లు ||
1.''ఓరి ముత్తాలు పేపరు సదవమంటే గట్ల నోరెల్లబెట్టినావేందిరా!''
అన్నానంతె, యిక సూస్కో వాడు బారతం మొదలెట్టిండు!
2.''యేం కావాల్నే నీకు ముస్తాద కట్టుకొని తాళ్ళు గీసొచ్చేదానికి యవారం గావల్నా ! నీ తల్లి పనేంలేదనుకుంట!''
వాడట్టంటే నే నూకుంటనా
1.''నీ నోరుబడ పోరగాళ్ళేందో ముచ్చట్లాడుకూంటాంటే అది సమజ్‌కాక నిన్నడిగితే గట్ల వర్లుతుండవ్!బాడ్‌కావ్ సెప్పితే సెప్పు ! లేదా మెల్ల కుండు!
అట్ల అరవబడితే, బడిత తీస్తినా వెన్ను యిరగాలే,''
నా యెంక సూస్తా.
2.''ఆఁ గదే ముచ్చటి యిగ సెబుతా యినుకోమంటూ
మొదలేసిండు రాములోరి మందిరంలా పంచాంగం సదివే బాపనోన్లా!
యేంలేదే నరసిమ్మా కోయిల పిట్ట కూతపెట్టిందో లేదో,గా నల్లకాకొకటొచ్చి గూట్లకెల్లీ దాని కిందకు పడదోసె! పడమటి ముసాంబరం తగిలిన సర్కారుతీరు!''
1.''అదేందిరో? ''
నే నడగబడ్తే -
2.''ఈ మద్దెల ఎవలైనా నోరెత్తినా, గలాటా చేసినా వూర్కునేదిలేదంటూ ఫర్మానా చేయబట్టె కాదె సర్కారు నోరునొక్కుడు, బొక్కలోకేసుడు షురూ సేస్తరన్నమాట!''
1.వానికడ్డుతగలకుంట : ''అదేం పొయ్యకాలమొచ్చెరా! ''
2. ''చిన్నప్పుడు యెమర్జెన్‌సీ పెట్టిండ్రెరకలే ! గసుమంటిదన్నమాట!
అదటుంచితే జెండా పాటలు, దేసభక్తి అంటూ కొత్త లొల్లి మొదలూకాబట్టే!
మరిదేం మతలబురో? నేనూకోక వైనం అడగబడ్తి!
యోగాలు, యాగాలు సేస్కునేటోడు ఊకుండక ఒర్లిండులే ముంజకాయలు తెగ్గొట్టినట్టు తలలు నర్కుతాడంట!''
1.''వానికేం మాయరోగంరో వారి జనాల్ని మంచిగ మననీడా!''
2.''కంపెనీలువెట్టి సంపాందించిందరక్క పోటుగాని లెక్క మాలావు ఫోజులెడతాండులే! పండగలన్ని దండగమారివయి ముంచుతున్నాయి కాదె కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి లెక్కగా తీరున ఎలచ్చనల కక్కినకూటికాసపడి యిర్గబడి వోట్లేస్తిరిగాదె, గా ముచ్చటకి అయిదేళ్ళసంది గిదేవరస! గంజికి దిక్కులేదని వొర్లితివా! గుంజకేసి కట్టి గుదిబండ తగిలిస్తరే! సప్పడుసేయకుంట గా రెండు మూస్కోవల్సిందే, మందిని ముంచి దాపిన డబ్బు గీడకాకూండ, సప్తసముద్రాలావల మాయల ఫకీరు పానం దాచిన చిలకల్ని వలవేసి పట్టిండ్రట...యెవరెవరివో పేర్లొస్తన్నాయి. కాని దేశం దరిందరం మాత్రం పోతల్లే! గీ ముచ్చ ట్లెందుకుగాని, పోయి తాల్లల్ల పనిచూస్కునిరా! మస్తు దూపయితాంది, కాస్త కడుపు సల్లబర్చుకోవాల్నే!''
1.'' గట్టనే కాని యిళ్ళ తలాలిచ్చే గిరదావారెన్నడొస్తడో''
2. ''యిండ్లనుండేవాళ్ళను బయటకెల్ల గొట్టి తలాలమ్మకచూసే సర్కారు
దా బుజ్జీ అని నిన్ను పిలిచీస్తదా!. అడిగినవనుకో టాట్ వీలుకాదు పొమ్మనక నీమీదే కేసువెట్టి ఊచలులెక్కపట్టిస్తది యెరకైందా! ''
వాడు యెచ్చరిక చెప్పిండు
1.''నిజమేన్రో! ఆఁ సర్లే నీతో ముచ్చటవెడితే పొద్దెక్కి పోతే కల్లుకూడ పులవబడ్తది, పోయొస్తరో! యింటికాడ మీ అత్త పిలస్తాంది
యేం కావాల్నో చూడు! పైలం పోయొస్తబిడ్డా ''
అని తాళ్ళకెల్లి నేను, వాడు యింటికెల్లి .

No comments:
Post a Comment