శ్రీశ్రీ సమగ్ర సాహిత్య సంగ్రహ కరదీపిక కపిల రామ్‌కుమార్
మహా దార్శనికుడు, స్రష్ట, ద్రష్ట, సృష్టికర్త, యుగకవి, సవ్యసాచి అయిన శ్రీశ్రీని ఎవరో అల్పులు, అర్బకులు, మిడిమిడి జ్ఞానంతో విదూషకుడని(దురుద్దేశంతో) విమర్శించినంత మాత్రాన ఆ మహనీయుని వన్నె తరగదు, పైగా మరింత పెరుగుతుంది. వివాదంలోకి వెళ్ళటం నాకిష్టం లేదు. శ్రీశ్రీ అనగానే అందరికీ ఠపీమని గుర్తుకొచ్చేది మహాప్రస్థాన కావ్య నర్తనమే. అందులోని గీతాలు నాటి, నేటి, రేపటి తరాలకు, తరతరాలకు భగవద్గీతలాంటివని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
పద్యాన్ని, గద్యాన్ని, కవితను, గేయాన్ని, వ్యాసాన్ని, విమర్శని, పరామర్శలను, నాటికలను ఏ ప్రక్రియలోనైనా తన కలాన్ని నల్లేరుమీద బండిలా నడిపించి, ఊగించి, శాసించి, దీవించి, పెంచి భావి తరాలకు పంచి, సాహితీ లోకాన్ని సుసంపన్నం చేసిన శ్రీశ్రీ, తన ప్రారంభ కాలంలో పద్యాలను ఎలా నడిపించాడో తెలియచెప్పటానికి ప్రయత్నం చేస్తా. శ్రీశ్రీ సాహిత్య సముద్రాన్ని చిలకటానికి నేనేమీ పోటుగాన్ని కాదు. వారూ, వీరూ చెప్పగా విని వ్రాయగా చదివి నాకర్థమైనంత వరకు నేనో వాహికగా మాత్రమే just as a conveying belt అనుకోండి.
ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారి మాటల్లో '' ఆంధ్ర భారతి క్రొత్తగా ముత్యాల సరాలను అలంకరించుకొన్న రోజులివి. ప్రజల భాషలో సన్నగా సంగీతం సాహిత్యంలో వినిపించిన కాలమిది. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ గొంతుక విని సాహిత్య జగత్తులో మునిగి మేల్కొన్న తరుణమిది. పదేళ్ళ ఇరవైయో శతాబ్దం బాల్యావస్థను దాటి పది మందిలో తిరుగనేర్చిన పర్వమిది. భావ కవిత్వం ఒక శ్రీకారం చుట్టితే భవిష్యదభ్యుదయం మరో శ్రీకారంతో జంట కలిపి లిఖించిన చారిత్రిక ఘట్టం ఇది. శ్రీవాణితో ప్రారంభమైన ప్రాచీన మార్గం శ్రీశ్రీ వాణితో మహాప్రస్థానం సాగించటానికి మరో నాందిని పలికించే సూత్రధారున్ని కాలానికి సంకేతంగా నిలబెట్టడానికి శ్రీరంగం శ్రీనివాసరావుకు జన్మనిచ్చింది 1910 లో ''
ఇక శ్రీశ్రీ పద్యాన్ని ఆలంబనగా తీసుకొని తన కవితా వ్యవసాయం ఆరంభించారు. ఆ వ్యవసాయానికి గీత పద్యం మాధ్యమం అయింది.
'' ఒక అనిర్వచనీయ మహోన్నతమగు - హాయియున్నది గీత పద్యముల
యందు దరులొరసి పారుగాంగ నిర్ఝరణి కరణి - చెంగు చెంగునగీసి తురంగలించు''
శబ్దంపైన పట్టును చూపించే గీత పద్యం మరొకటి
'' ఈ నిశీధిని ప్రబల ఝంఝానిల ప్ర - సార విదళిత వృక్ష సంచక కలితము
కులిశఘాతప్రతారణ, కుశల కుధర - పంక్తి సన్నిభ ఘన పయోవాహయుతము'' (అభిసారికలోనిది)
గీత పద్యం ఎలా ఉంటుందో / ఉండాలో శ్రీశ్రీ పద్యంలో చూద్దాం
'' ఆధునిక దివ్యఖండ కావ్యముల యందు - ప్రాణసన్నిభమై గీతి పరుగులాడు
విస్తృత వనాంతరోదగ్ర వీధులందు - గ్రేళ్ళురుకు లేడివలె గీతి తుళ్ళులాడు ! ''
1929 ప్రాంతంలో '' సుప్తాస్థికలు '' అనే కవితా ఖండిక వెలువడింది. అందులో దీర్ఘయామిని, అగమ్యతమో రహస్యాంగణము, నిశాశ్మశానశయ్య, నిరవాహ్వానము లాంటి పదచిత్రాలు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కవిత్వాన్ని గుర్తుకు తెస్తాయి.
1933లో విద్యున్మాలికల ప్రచురణ ద్వారా శ్రీశ్రీ కవిత్వంలో కొంత మార్పు
'' బారులు బారులుగ తీరిన - మబ్బు గుబ్బులుల దారుల
దారితప్పి చలించే - ఆ రేయి తరళ సరళేరమ్మదములు .... ''
'' వేలుకాని కోలలకు కూలి -వేదనల తూలు హరిణాల కండ్లు
జాలికి పురిటిండ్లు - దిక్కు దిక్కులకంపిన దీనంపు చూపులే
ఆనాటి ప్రళయతాండవ భయంకర సౌదామినులు ''
అలా వచన గేయం అవతరించిందని సి. నారాయణరెడ్డి గారి పరిశోధనల వల్ల తెలుస్తోంది. శ్రీశ్రీ రచనకు స్వేచ్ఛ ప్రధాన గుణం. పద్యమైనా, గేయమైనా ఆయన చేతిలో వింత పోకడ పోయింది. కొత్త పుంతల్ని తొక్కింది.
అర్థాన్ని అధ్వాన్నపు అడవిలో వదలి గద్యానికి పద్యానికి పెళ్ళి చేదాం
కాదన్న మాదన్న యెవడన్నా వుంటే వేమన్న యేమన్నాడో చూడమందాం.అధివాస్తవిక ధోరణిలో అధిక్షేపానికి అభిమానం చూపించాడు తన కవిత్వంలో నిక్షేపించాడు అడుగడుగునా, అణువణువునా. ''నాలాగ కందబంధ - జ్వాలా జ్వాలాగ్ర సంవసత్ సద్గీతాలాలపించే కవితా -శ్రీలోలుడు నహి నహీతి సిరిసిరిమువ్వా'' అనే వీరవాక్యాలు
''కోయకువిూ సొరకాయలు-వ్రాయకువిూ నవలలని అవాకుచెవాకుల్డాయకువిూ అరవ '' ఫిలిం '' - చేయకువిూ చేబదులు సిరిసిరిమువ్వా'' - అనే పేరడీ నీతి వాక్యాలు
రామాయణంనే మళ్ళీ మళ్ళీ దెచ్చి మ్రుచ్చలించే కన్నా
ఆ మోస్తరు రచనల్లో క్షేమం కద రామకోటి సిరిసిరిమువ్వా
అని వేడి ఛలోక్తులు విసిరాడు శ్రీశ్రీ
ఇక విశాఖ యాసలోని వచన గీతం
'' యిప్లవం యాడుందిరా - ఆడనే నీ కూడుందిరా,
నీ గూడుందిరా - గోడు గోడున యేడుస్తుంటే - యాడు (ఎవడు) నీవొంక రాడింకరా ''
అందుకే అంటాడు శ్రీశ్రీ
'' నేను ముసలివాణ్ణి కాను - అసలువాణ్ణి
పడగెత్తిన తాచు బుసలువాణ్ణి పీడితుల వెంటేసుకు మసలువాణ్ణి
అందుకున్న ఆకాశపు కొసలువాణ్ణి '' శ్రీశ్రీ ది
'' రంగు ఎరుపు - ద్రోహుల గుండెల్లో కురుపు
ఆరాటానికి ఆట విడుపు-పోరాటానికి పిలుపు దానిదే గెలుపు ''
మహాప్రస్థానం - మార్క్సిజం - దేశ చరిత్రలు
“In the first place it considers that the real science of history must deal with the people and only with individuals in so far as they represent something which wider than themselves some movement of the people “Emile Burns - మార్క్సిజం అంటే ఏమిటి? ని చదవండి. సమన్వయం దొరుకుతుంది, కుదురుతుంది. The History of all hitherto existing Society is a history of class struggles. ఊనీలి
'' ఇతిహాసపు చీకటి కోణం - అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు - దాచేస్తే దాగని సత్యం ''
వాటిని వెతుకుదాం రండి ! అందులోని దుర్మార్గాన్ని చెరుగుదాం పదండి.
'' రావద్దు రావద్దు లోనికి - రాస్తున్నానొక గీతం
రావద్దు రావద్దు లోనికి - నను చూడ కాదిదివేళ
నా మనః కార్మికశాల - క్రక్కేది చండాగ్నిసెగలు ... ''
'' వాకిట్లో చీకట్లో - ఎవరో కేక ...నేనేలే నేనేలే - నేనే - లే .....
''ప్రజల భాషలో వ్రాయటం తన హోదాకు తక్కువ అనుకునేవాడు (కవిత్వం) వ్రాసే శ్రమను తీసుకోనక్కరలేదు. '' అంటారు మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్.
అభ్యుదయ కవిత్వానికి ప్రధాన లక్షణం శిల్ప సరళత, శబ్ద సరళత అదే క్రిష్టొఫర్ కాడ్వెల్ మాటల్లో "This art (proletarian art) has a simplicity and openness of theme which goes with a certain credity and clumsiness in handling the technique, rather like a proletarian occupying for the first time a role in administration which hitherto has been peculiarly the prerogative of bourgeois" (Illusion and Reality; Page 291 - 1956).
రవిగాడి కంటె పైరవీగాళ్ళకే చైతన్యం ఎక్కువట. ఎమో ఎవరి మేథస్సు వారి వారి మేతను బట్టి (ట)! మరో ప్రపంచ కవితావేశం ప్రారంభించిన శ్రీశ్రీ మహాప్రస్థానం కదం త్రొక్కుతోంది.. పదాలు పాడుతోంది ... క్రొత్త క్రొత్త సంకేతాలనందిస్తోంది ... పాపకాలపు (పాత) లోకపుటన్యాయాలను చీల్చిచెండాడుతూ విజృంభిస్తోంది !
ఒక్కొక్క శీర్షిక ఒక్కొక్క ప్రత్యక్ష దృశ్యమై మన మనో:ఫలకంపై తారాడుతోంది ... గమ్యం లేదు - ఆశయం లేదు. బ్రతకాలనే కోరిక ఉంటే మాత్రం ఏం? ఆ బాటసారి దారి తప్పటం ఖాయం ... ఎంత కష్టం . ఎంత కష్టం ! - ఒక గమ్యంతో ... ఒక లక్ష్యంతో బయలుదేరిన సామాజిక వాదికి కూడ మార్గం కష్టంమే ... అయితే ధ్యేయం, లక్ష్యం గీటురాళ్ళు కాబట్టి అతడు నిర్భీతిగా ... కొండలు - కోనలు - కష్టాల్, నష్టాల్ ఎదుర్కొంటూ ముందుకు పోతాడు. విరామమెరుగక, దీక్షా కంకణుడవై ముందుకు పో ... అనే సందేశం ఉంది. ప్రజా ప్రతినిధుల్లా ..
ప్రజల ప్రతీనిధిని భోంచేసేవాడ్ని నెత్తివిూద మొట్టుతూ అవినీతిని, అన్యాయాన్ని ఏరిపారేస్తూ ... గుండె నెత్తురుల ఆవిరితో నిట్టూర్పు విడకుండా, ధారాపాతంగా, వజ్ర సంకల్పంతో ద్విగుణీకృతమై సామాజిక క్షాళనకు ఉపక్రమించేందుకు - అండచూపె అభ్యుదయ వెలుగుకొండగా శ్రీశ్రీ నిలిచాడు ఎప్పటికీ!
'' తరానికి - అంతరానికి తెరలులేని - పొరలులేని యువతరానికి - త్వరపడండని - శంఖారావాన్నూదే నవయుగ సారథి శ్రీశ్రీ ... అందుకే ... '' ప్రపంచాగ్నికి సమిధనొక్కటి - ఆహుతిచ్చి ; విశ్వ సృష్టికి అశ్రువొక్కటి ధారవోసి ; భువన ఘోషకు వెర్రిగొంతునిచ్చి మ్రోసిన '' - కవియతడు ... అంతేనా '' చండ్ర గాడ్పులు, మబ్బు తునకలు, మంచు సొనలను కవితా వస్తువుల్ని చేసి, '' ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవించాడు ... విశ్వవీణ తంత్రియై మూర్ఛిల్లి ... భువన భవనపు బావుటాలా పైకి పైపైకి లేచాడు ... అంతేనా ... ఏవో ఘోషలు - మరేవో భాషలు గుండెలదరగ వినిపిస్తున్నప్పుడు, నినదిస్తున్నప్పుడు ... ఎవరో తల విరబోసుకుని నగ్నంగా నర్తిస్తున్నప్పుడు ... ఏదో తెగి ... ఆరిన క్రొన్నెత్తురు క్రొత్త గీతికలా రూపం సంతరించుకుంటున్నప్పుడు - విప్లవ విపంచికలు చూపి, యువ యోధుల్ని తలచి, పరుగు పరుగున అభ్యుదయం అడుగిడిందంటాడు శ్రీశ్రీ ... - అందుకేనేమో పుడమి తల్లికి పురిటి నెప్పులు - క్రొత్త సృష్టిని విస్ఫురించాయట ... నవ కవితా నినాదమిస్తూ ... '' ఘనంగా పులి చంపిన లేడి వేడి నెత్తురు ... జనం ఎగరేస్తే నిరాఘాటంగా ఎదనురకలు పెట్టించే చైతన్య సంకేతమైన ఎర్రజండా - కలకత్తా కాళిక నాలిక ... కావాలోయ్ నవ కవనానికి ... అని సిద్ధాంతీకరించాడు ... కవితంటె పాతకాలపు ఛాందసభావాల సరఫరా విభాగం కాదు - తప్పొప్పుల విభాజకం కావాలన్నాడు. కదిలేది - కదిలించేది పాలకవర్గ దివాళాకోరు ఆర్థిక విధానాల పెను నిద్దర వదిలించేది - నియంతృత్వ నగ్న నృత్యానికి వందన సమర్పణ పలికేది - మారేది - నిరంతరం సమాజాన్ని మార్చేది ..సామ్యవాదంవైపు నడిపించేదిగా ఉండాలన్నాడు శ్రీశ్రీ !
అవును '' యదార్ధవాది లోక విరోధి - నిజం ఎప్పుడూ చేదు - నైజాము మారినా పాలకుల నైజాలు మారలేదు కద ! చేదు మాత్రతోగాని ఉన్న రోగం పోదు ! అప్పుడుగాని పరిపూర్ణ బ్రతుకునివ్వదు కవిత. చైతన్యానికి, చేతనైనతనానికి ప్రతీక కవిత ... కదలిక అన్నంతమాత్రాన అటు కొందర్ని, యిటు కొందర్ని ఉరికించకూడదు ! అవకాశవాదం అసలొద్దు ఆశావాదం తప్ప ! మతవాదం - మితవాదం - అతివాద పెడ ధోరణులను పొడసూపొద్దు - వాటిని (షుప్త భుజంగాలను) కదిలించవద్దు ... అరుస్తాయి ... కరుస్తాయి ... - వాటిని వదిలించుకోవాల్సిందే. పోతేపోని ధ్యేయ సాధన కొరకు సుతుల్, హితుల్ - బాంధవ్యం పేరుతో నీ ఆశయాలను మట్టుపెట్టకు - ఆదర్శం దూరం చేయకు - ఆచరణకు నీ చరణాలను కదిలించు - రానీ వస్తే రాని కార్యక్రమ నిర్వహణలో కష్టాల్, నష్టాల్, లాటీలు - తూటాలు, శాపాల్ - పాపాల్ ... అవునలా దారిపొడుగునా ఎదురయ్యే సంఘటనలు తెలియపరుస్తున్నాడు తన కవితలో '' శ్రీశ్రీ ''. '' పాలకవర్గ ప్రజా వ్యతిరేక కార్యక్రమ నిరోధక దీక్షా కంకణుడ '' వైన నీకు యివి తప్పవు సుమా అని హెచ్చరిస్తున్నాడు ... అందుకు మొక్కవోని ధైర్యం కావాలని నొక్కి నొక్కి వక్కాణిస్తున్నాడు ... తిట్టారాడ్లు, పోట్లు - సూటిపోటి విసుర్లు ... ఎదుర్కొమంటున్నాడు ... జగతిలో ప్రతీది ఆదర్శమైనదే - శ్రీశ్రీ దృష్టిలో ...
కుక్కపిల్ల : ముద్దుగా ఉంటుంది - బొద్దుగా ఉంటుంది. దాని మనస్తత్వాన్ని కనిపెట్టాలి - ఆరోగ్యాన్ని కాపాడాలి గజ్జికుక్కపిల్ల కాకుడదుగా - అది నిలువెల్ల విశ్వాసాన్ని ఉంచుకుంటుంది. మనుషుల వలె విషాన్ని కాదు ...
సబ్బుబిళ్ళ : వాసనలు విరజిమ్ముతూ ... తాను అరిగిపోతుంది - నీటిలో కరిగిపోతుంది. విసుక్కోకుండ కొంతమంది నర్సుల వలె కసురుకోకుండ మన దేహాల మలినాన్ని హృదయపు మాలిన్యాల్ని పోగొడుతుంది. కంపు దేహాలకు గుబాళింపునిస్తుంది . అందులోని త్యాగ గుణం అలవర్చుకో - కాని అవతలవాళ్ళని నీ స్వార్థం కొరకు అరగకొట్టకు! - అందుకే శ్రీశ్రీ కాదేది కవితకనర్హం - అవునౌను శిల్ప మనర్థం అన్నాడు ఊసుపోక కాదు - నిశిత పరిశీలనతో ! అందమైన సుందర రమ్య హర్మ్యాలలో విహార (విరహ) గీతం కాదు కవిత ! విషయ సౌఖ్యాలకు నివేదిక నిలయం కాదు కవిత ! మరేమిటి ? మరి దేనికి ? ... చిర దీక్షా శిక్షా తపస్సమీక్షణలో, నిశ్చల సమాధిలో, మస్తిష్కంలో అలజడులు - ఆందోళనలు - ఏయే ఘోషలు వినవస్తవో ... వాటి ఝంఝ కవిత ! ఫిరంగిలో జ్వరం ధ్వనించె శబ్దం ! శిశువు నిద్రలో పాత స్మృతులు నెమరువేసే తప్పనిసరి సవ్వడులు - వైద్యుని ప్రయోగశాలలో చావు బ్రతుకుల సంధ్యారాగంలో కన్నులు మూసే రోగార్తుని హృదయాంతరాళ రక్తనాళ స్పందన - విన్నావా ? పోనీ విన్నావే అనుకో ... వింటే నీకేమనిపిస్తున్నదని ప్రశ్నిస్తున్నాడు శ్రీశ్రీ మన ''స్పందన'' తెలుసుకోవటానికి.
పోని కాలువ నీళ్ళలో కాలు జారిపడి కాలపు కోలాహలం లాంటి నిప్పులాంటి '' సారా '' అప్పుచేసైనా త్రాగి, వ్యక్తావ్యక్త ప్రేలాపనలో కరువు మంటల వెలుగు జిలుగులను కళ్ళారా చూసావా ? - ఏం అర్థమంయింది ? ... బీరులాంటి వాటిని త్రాగే మీలో కొందరికి అర్థం కాదు కదూ ? సమ్మె చేస్తున్న కూలీల కడుపులపై '' లాకౌటుతో '' యాజమాన్యపు సమ్మెట పోటులలో ... జీతం - జీవితాన్ని ఖూనీ చేస్తుంటె ... శ్రమ జీవుల ఎర్రని జండా వెలుగు - రక్తంచిందిన సంఘటితశక్తిగా నిలిచి నినాదం చేసి ప్రత్యామ్నాయ విధానం చూపిస్తుంటె ... యింకా యీ సమాజంలో అలంకార చందోబద్ధ అనుయాయీల అనునయ కావ్యాలు ; రంభా ఊర్వశి నృత్యహేలలు ; సంభోగ శృంగార వర్ణనల సమాస ప్రవాహాలు ప్రస్తుత కాలమానంలో - కవిత్వంలో చోటు చేసుకునే వీలుందా ? లేదు. పరిస్థితుల రొంపిలో దిగబడ్డ ప్రగతి కన్యతో పోలీసు వ్యవస్థ బలవంతంగా రాక్షస రతి జరిపేస్తుంటె ... పాలకవర్గ తోకవై, తొత్తువై యింకా ఎన్నాళ్ళు వందిమాగధస్తోత్రాలు వల్లిస్తావు? ... కళ్ళు తెరచి, నోళ్ళు విప్పి..సంకెళ్ళు త్రెంచు! - లే - లెమ్ము ... అనే శ్రీశ్రీ పిలుపు వినబడటం లేదా ? - శతకోటి దరిద్రుల ఆకటిచిచ్చుల ఆహాకారాల మధ్య పలావు భోంచెయ్యకు ! మధ్య మధ్య మద్యపానం చేయకు. ఏం సగటు మనిషి జీవితం అధ్వాన్నంలో మునిగిఉంటె ... మృష్టాన్నం నీకు ఎలా వంటబడుతున్నదని - ఊపిరి సలుపని సూటి ప్రశ్నలు కురిపించాడు శ్రీశ్రీ.
ఊపిరి తీయడు కాని మనకు క్రొత్త ఊపిరి - ఊపును కల్గిస్తాడు. అందుకే నిర్వికల్ప సమాధిలో అతనా ప్రాణం నిర్వాణం పొందిందట - ఎంతటి ఉత్కృష్ట తపస్సు చేసాడో ఏమొ - అంతటి మహోన్నతస్థానం - ప్రస్థానం - మహాప్రస్థానం! అతనిది !
'' పొలాలనన్ని హలాలు దున్నగ - ఇలాతలంలో హేమం నిండగ, కర్షకవీరుల కాయం నిండ - పొగలు సెగలు క్రక్కే శ్రమను '' ఎవడైనా ఖరీదు కట్టగలడా ? అని సవాలు విసిరాడు... కౌలుదారుల కష్టం కామందుల పాలుబడి ... ఘర్మ జలం కాలువలై ప్రవహిస్తున్నది. భూ సంస్కరణల బూటకపు నిరాఘాటపు ఘోటక ప్రచారంలో ఫలితాలెలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం ప్రత్యక్ష ప్రేక్షకులమై... కాదంటారా ? - గనిలో, పనిలో ఈ అవనిలో కొండలు / కండలు కరిగించే కార్మికలోకపు స్వేద బిందువులు ఎర్ర (రక్త) లిక్కరుగా చేసుకొని విందులారగించే పెట్టుబడిదారీ వ్యవస్థ బలంగా వ్రేళ్ళూనుకున్నప్పుడు... మన స్వాతంత్య్ర భారతి నేడు సిగ్గుతో ఎలా కుంచించుకుపోతున్నదీ - మనం చూడడం లేదూ? - మరి అలాంటి పాలకవర్గాన్ని మట్టు పెట్టాలి ! ప్రగతి కాముక ఉద్యమాలకి వెలుగు కావాలి. - శ్రమ నిష్ఫలమైనప్పుడు కార్మిక కళ్యాణం ఎప్పుడు? కాల్చే ఆకలి కూల్చే ఆవేదనకు తోడై దీర్ఘ శృతిలో - తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారోయ్ అన్నాడు శ్రీశ్రీ బల్లగుద్దినట్లు ! అందుకే ఈ దారిద్య్రం - ఈ దౌర్జన్యం ప్రతిఘటింపబడే లక్ష్యంతో '' కవిత '' లుదయించాలన్నాడు !
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు అతనిచే వినుపింపచేసే గీతానికి - నవీన రీతికి ప్రాణం - సకల దేశ శ్రామికులారా ఏకం కండి '' అనే విశాల విశ్వమానవ శ్రామిక నినాదం యిందులో ప్రాతినిధ్యం వహిస్తున్నది - గమనించలేదూ ?
ఆరిన కుంపటి విధాన - మూల్గుతున్న ముసలి దాన్ని గూర్చిన కవిత మనకు స్పష్టమైన అవగాహన కల్గిస్తుంది. ఆ '' ఎంగిలాకు తప్పు ఎవరిది ? '' అని మనల్ని ప్రశ్నించి ఆ పాపం దానిది కాదు అని చెప్పుకుందని ముక్కువిూద వేలు వేసుకోండని అంటాడు ! -బొమికలున్న ప్రోవులా - కాగితంలా పల్చబారిన ఈ వర్గ సమాజంలో - ఏనాటికైనా - ఆర్థిక వ్యవస్థపై - తిరుగుబాటు - ఏది ? ... యిక మరి రావాల్సి ఉంది ! అవును నిజం ! మనమంతా బానిసలం -గానుగలం- పీనుగులం ! పెద్ద మనుషులు పన్నులు ఎగ్గొడితే - ఆ భారం అధిక శాతపు అధిక ధరల రూపంలో చెల్లిస్తూ పీనుగులం అయ్యాం కదా ! వింత భయం వద్దు - ఇంత కొండంత అభయం యిస్తానన్నాడు - ఈ రాత్రికి మాత్రం '' అవతలి గట్టుకు పోతా '' అనతని సమాధానం ఎక్కడికి పోతావంటే - నిజంగానే అవతలిగట్టుకు చేరుకున్నాడు - కవిత్వాన్ని మాత్రం యిక్కడ మనకు వదిలిపెట్టి !
ఎందుకో తెలుసా ... గుండెలలో కొండలలో మ్రోగును మార్మోగ్రును –
హుటాహుటి పరుగెత్తిన
నవయుగపురథనినాదం వినిపించేందుకు –
విను వీధిని స్వంతం చేసుకుందుకు !
మరోచోట ''పేదల గుండెలు - అశ్రువు నిండిన కుండలు
తెరువెరుంగని దీర్ఘరాత్రిలో - తల పగిలెడు తలపులు ''
అంటూ తన అనువాద గీతంలో అందరి ఆమోదయోగ్య ప్రవచనం అందించాడు - బాధల మోపుల్ని ఆ వీపులు మోస్తున్నాయి ... పిడికెడు మెతుకులకూ నోచుకోక పస్తులుంటున్నాయి!
ఖర్మ : '' కష్టపడి పదిమంది పండించిన ఫలాన్ని ఒక్కడివే
తింటూ - మాకు కొంచెం పెట్టవేం '' - ప్రశ్న
సమాధానం : ''విూ ఖర్మ !''
ఆచారం : ''బలవంతులు బలహీనుల్ని దోచి, దూరంగా త్రోసి - బానిసలుగా అంటరానివారుగా చేసి కులుకు
తున్నారేమిటి ? - ప్రశ్న
సమాధానం : ''అస్పృశ్య ఒక ఆచారం'' (అంధకార మతహంకార అగ్రకులతత్వాన్ని వెక్కిరింపుగా పుక్కిలించాడు
'' శ్రీశ్రీ'')
దౌర్జన్యం : యజమాని కర్కశత్వానికి బలై - ఎదురు తిరిగి పనిమాని సమ్మెచేస్తె - చెప్పుతీసి, దౌడ పేలగొట్టి యింకాపోతే తపాకితో కాల్చి (కాల్పించి) - ఎన్కౌంటర్లకు ఎన్నో కౌంటర్లు తెరిచి దౌర్జన్యానికి
దౌర్జన్యమే మందు అంటుంది. పెట్టుబడిదారి పాత్రలో భూస్వామ్యవర్గ స్వభావం, అందుకే వర
పోరాటం అనివార్యం కదూ - కవి ఎల్లప్పుడు ప్రజల మనిషి అందుకే శ్రీశ్రీ ప్రజాకవి .
..
వడ్డించిన విస్తరిగాళ్ళంటె శ్రీశ్రీకి రోత ... విూకేం - మారాజులు - మాగతి చూడండి. మా వంట మేమే వండుకోవాలి - ఓసారి విస్తరో - వండుకునేందుకు బియ్యమొ - ఉడికేందుకు పొయ్యో - ఏదో ఒకటి ఉండదు ... మాకన్నీ సమస్యలే ... కన్నీటి సమస్యలే - అని పీడిత ప్రజానీకపు గొంతుతో వంత పాడుతాడు
'' మాకంతా చీకటి –
అలజడి మా జీవితం
ఆందోళన మా ఊపిరి –
తిరుగుబాటు వేదాంతం ''
'' దారుణ ద్వేషం పెంచే –
వేషం వేసే పాలకవర్గ దానవత్వం నశిస్తుందా ?
బానిస సంకెళ్ళు బిగించే పాడు కాలం
మృత్యువాత పడుతుందా ? '' అని ప్రశ్నిస్తు సమాధానం మనలనే తయారు చేయమన్నాడు యువతరాన్ని తట్టి లేపుతూ ...
సకల దేశ చరిత్రలు చూస్తే - గర్వ కారణం ఏవిూలేదు ! యుద్ధాలు - రక్తాలు - రాణి గారి ప్రేమ పురాణాలు ... నరజాతి చరిత్ర సమస్తం - దరిద్రనారాయణత్వం చల్లారిన సంసారాలు - అసహాయుల - హాహాకారాలు కాలానికి కత్తుల వంతెన కట్టిన పిండారులు థక్కులు,- అజ్ఞానపు అంధకారయుగంలో ఆకలిలో - ఆవేశంలో - తీవ్ర శక్తులేవో నడిపిస్తె నడిచిన మనుష్యులు ... స్థాపించిన సామ్రాజ్యాలు, కట్టడాలు కట్టిన శిల్పుల చేతులు నరికిన రాజుల పరస్పరం సంఘర్షణల్లో ... చరిత్ర పుట్టింది. ఇతరేతర శక్తులు విజృంభిస్తే పేకమేడల్లా కూలిపోయింది ... ఇతిహాసపు చీకటి కోణపు అట్టడుగున పడి, కనిపించని కథలన్ని కావాలి ! దాచేస్తే దాగని సత్యం - చిరకాలం జరిగిన మోసం
బలవంతుల దౌర్జన్యం - ధనవంతుల పన్నాగాలు-పాలకవర్గ ఆగడాలు యింకానా ... యికపై చెల్లవు !
ఒక వ్యక్తిని - మరొక వ్యక్తి - ఒక జాతిని - వేరొక జాతి, పీడించే - సాంఘిక ధర్మం - యింకానా-ఆయ్... ఇకపై సాగదు సాగనీయరాదు ... అదే శ్రీశ్రీ విప్లవ ఆశంస.
'' పతితులార - భ్రుష్టులార -
ఏడవకండేడవకండి - నేనున్నా అన్నాడు. ఆకాశపుదారులెంట అరుచుకుంటూ పోయే
'' జగన్నాథ రథచక్రాల్ భూమార్గం పట్టిస్తాన భూకంపం తెప్పిస్తాన్ ''
అంటూ గీతోపదేశం చేసిన '' శ్రీశ్రీ '' నిజంగానే రథచక్ర గమనాన్ని భూమార్గం పట్టించడానికి, నమ్మిన ఆశయసిద్ధికి బయలుదేరి వెళ్ళాడు - కవితా బీజాన్ని మనకు వదలి !
- చివరగా ... తనెంతో ప్రేమించే మిత్రుడు కొంపెల్ల జనార్థనంకు '' మహాప్రస్థానం '' అంకితమిస్తూ ... అతని మరణాన్ని నెమరువేసుకుంటూ తన కవితా హృదయార్ధ్రతతో - మనకళ్ళు చెమర్చేలా చేసాడు '' శ్రీశ్రీ ''.
'' ఎవరు దు:ఖించారులే నేస్తం - నువ్వుపోతే ఏదో నేనూ - ఆర్గురు స్నేహితులు తప్ప ! ఆఫీసులకు సెలవు లేదు - సారా దుకాణాల వ్యవహారంలో మార్పులేదు. ''
మహాకవుల నిష్క్రమణల పిదప ఎవరో కొద్దిశాతం తప్ప - వారికోసం అశ్రు తర్పణం ఎంతమంది వదులుతున్నారు ? - మహాకవి శ్రీశ్రీ వర్థంతి సందర్భంగానైనా ఓ మహాకావ్య స్పర్శను '' శాంపిల్ పిల్ '' గా ఆవిష్కరించే అవకాశం వచ్చినందుకు - అది నాకు కలిగించినంద్కు - మహాకవి శ్రీశ్రీ కి ఎల్లవేళలా ఋణపడి ఉంటాను.
వర్థమాన యువకవులు అధ్యయనం చేయటానికి శ్రీశ్రీ సాహిత్యంలో మచ్చు చూపించడమే నాపని. సమగ్రంగా ఆయన సాహిత్యాన్ని భగవద్గీతలా భావించి ఆపోసన పట్టడం అందరికీ మంచిది.
ంంం
ఇతర వివరాలు కడుజాగ్రత్తగా అధ్యయనం చేయాల్సివుంటుంది! పదండి! మహా కవిశ్రీశ్రీ అంటే ''మహాప్రస్తానం'' మాత్రమే కాదు! ఆయన చేతిలో ఎన్ని సాహిత్యరూపాలు జిలుగులు దిద్దుకున్నాయో, వాటిని స్థాలీపులాకన్యాయంగా ఒక ఆవలోకనచేసే ప్రయత్నమే ఈ వ్యాసముఖ్యోద్దేశము. కావ్య,వచన, నాటిక, రేడియో నాటిక, సాహిత్య విమర్శ, ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాల ఆనువాదాలు ఎన్నో, ఎన్నెన్నో! ఈ శతజయంతి సంత్సర సందర్భంగా శ్రీశ్రీ సాహిత్యాన్ని మొత్తంగా అధ్యయనంచేయటం ఎంతోఅవసరం ఉందని నొక్కి వక్కాణించడమే
నా వ్యాస ముఖ్య ఉద్దేశం!
'' ప్రకృతి గీతం '' తో ప్రారంభిస్తాను
'' ఇది మనోజఞప్రకృతిధామమిచటజేరి
అమృతపేశం నవమాధురిమముగూర్చు
విహంగ కలకూజిత ధ్వనీ విధములందు
స్వీయ కంఠారవము మేళవించుకొందు ''
అందుకే '' ప్రణవ గీతంలో ''
'' దుర్గమ భయంకరారణ్య దుర్గములను
ప్రళయకాల సమాన విభావరులను
ప్రణయ రాజ్యత రమా ప్రాణపతికొరకై
తరలియరిగెడు నా కవాంతరములగునే?''
అనేసి ఊరుకోకుండ ప్రకీర్ణగీతాన్నొకటి యిలా వ్రాసాడు శ్రీశ్రీ
'' చిందర వందరలుగనై
చిందిన జ్యోతిశ్శకలము
లేక మహాతేజస్సున
నే కవియున్ గదా! ''
సంప్రదాయ పద్ధతిననుసరించి 'ప్రభవ కావ్యాన్ని' పెంచిన తల్లికి : అంకితమిచ్చాడు శ్రీశ్రీ.
కన్నతల్లి : తిప్పన్నకొండ - పెంచిన తల్లి : 'సుభద్ర'
1924లో (పినతల్లి - మరణం)
''నవ వసంత పాతరంజిత
భువన మోహన కుసుమవల్లరి
గ్రీష్మ కాలాతప భవమ్మున
గీటడంగినది -
ఇపుడు నీవు గతించినంతట
నెచట తెలియని లోప మొదవెడు
ఇవి నీతాంతాజ్ఞత నిష్ఠూర
దివస నిచయములు
త్రివిధ ధామ ప్రధిత గాయక
మధుర రుతముల నడుమనించుక
మామ కీనాలసరవమ్ముల
మనసు నిల్పగదే....
స్వేచ్చ, మేఘశకలం, ప్రకృతి గీతం, మయూరనర్తనము, రజనీగానము, మాతృగీతి, సముద్రఘోష, మృత్యు ప్రబోధము, ప్రభాత గీతము, అభిసారిక, వియోగశాంతి నిరీక్షణము ప్రణయ నర్తనము, గీత పద్యాలు, అంతిమయాత్ర, మత స్వీకృతి... మొదలగునవి సంప్రదాయ చంధోరచనలు.
ప్రభవలో 16 ఖండ కావ్యాలున్నాయి. క్రౌన్ సైజు 54 పేజీలు, 1928లో ప్రచురించబడినది. శైలి యందు సార్ధకత కంటే సమాస తత్పరత యొక్కువ గోచరిస్తున్నది. ఇంకనూ విషయానుగుణ్యంగా శైలియందు మార్పులు కనపడవలెను. తెలుగు వాడకం చాలా తక్కువగా ఉన్నది. ఒక్కొకచో బదిలించు సమాస భూయిష్టత ఉన్నననూ, మొత్తం మీద శైలి బాగుగా నున్నది. భావము నందు గాంభీర్యమునున్నది. భావములకును, భాషకును సామరస్యము సంధించుట లేక ఇంకనూ ప్రయత్నింపదగును. ఇది చదివిన వారి కాలక్రమమున ఈ కవిత యింకనూ సంపన్నం కాగలదా అను ఆశ పొడమును. భావ స్వాతంత్య్రమును, భాషా సౌష్టవమును మెచ్చదగినది. ప్రకృతి పథముల తత్వానేషణము సలుప సమకట్టిన ఈ కవి కిషోర మానసము ఉత్సాహ రంజితమై మొప్పుచున్నదని శ్రీ కొంపెల్ల జనార్ధనరావు 1929లో ''భారతి'' సాహిత్య పత్రికలో వెల్లడించారు.
కథా రచయితగా శ్రీశ్రీ :
ఆగస్టు 1928 : భారతి : చిత్ర రహస్యం (సశేషం) : మూలం : సర్ఆర్ధర్ కానన్ : డాయల్షర్లాక్హోమ్స్
ఆగస్టు 1929 : భారతి : సోములు చెప్పిన కథ : మూలం : చార్లెస్ డికెన్స్ : పిక్నిక్ పేపర్స్
చిన్నబాబు : మూలం : హివైర్ చెలక్ వ్రాసిన .........
నవంబర్ 1931 : గృహలక్ష్మి :
జూన్ 1938 : భారతి : సీతయ్య : A Convesation with a Cat గుర్తుకాబోలు అని
శ్రీ ఆండ్ర శేషగిరిరావు అభిప్రాయపడ్డారు.
ఇవికాక ఎన్నో వ్యాసాలు, ఉపోద్ఘాతాలు.
తొలి రచన : : 1944 అక్టోబర్ భారతి
కన్యాశుల్కంలో స్త్రీల పాత్రలు : 1932 సమదర్శిని ఉగాది సంచిక
శ్రుతి : 1934 తెలుగువీణ
(ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి కావ్యానికి పరిచయం)
అశ్రుతర్పణం : 1938 వీణ (కొంపెల్ల జనార్ధన్ మరణానికి)
గ్రంథ సమీక్షలు :
కళ్యాణ రాధామాధవం : రచయిత చల్లా లక్ష్మీనారాయణ : 12 / 1928 భారతి
విజయ ప్రతిజ్ఞ నాటకం : తంగిరాల జగన్నాధ శాస్త్రి : 12 / 1928 భారతి
ఏకలవ్యుడు : బి.టి. నరసింహాచార్యులు, దీనదయాళ్ అండ్ కం. మద్రాస్
అచ్చయమ్మ : అడ్డం మృత్యంజయశాస్త్రి, రిప్లై అండ్ కం. కాకినాడ
మల్లిఖార్జునశతకం : కడివెండి రామబ్రహ్మాచార్యులు
హనుమచ్ఛతకం : ఎర్రమల్లి సూర్యప్రకాశ కవి : 3 / 1929 భారతి
భారతీ నారీమణులు : (1వ తరగతి ప్రత్యేక పుస్తకములు)
శ్రీమతి కోకా కృష్ణమ్మ : వెంకట్రామా అండ్ కం. 3 / 1929 భారతి
పదార్థ విజ్ఞానశాస్త్రం 3 భాగాలు : వేమూరి శ్రీరాములు , నరసరావుపేట : 8 / 1929 భారతి
పతిత నళిని : కోడూరి రామచంద్రరావు
సరస్వతి గ్రంధమాల, కాకరపర్రు. : 1 / 1930 భారతి
నిష్కర్షగా కుండబద్దలు కొట్టినట్లుగా, సరుకు ఉంటే ఉందని, లేకపోతే ఏమీ పసలేని సాహిత్యమని సమీక్షలు వ్రాసి విమర్శకు న్యాయం చేశాడు శ్రీశ్రీ.
శ్రీశ్రీపై నాగభైరవ కోటేశ్వరరావు రాసిన గీతం :
ఆకాశపుదారులంట - అడావుడిగా వెళ్ళిపోయే
జగన్నాధరధచక్రాల్ - జగతికి దించినవాడా!
మార్క్స్ మహర్షి దృక్పథాన్ని మన కవితకు తెచ్చియిచ్చి
మరో ప్రపంచం కోరిన మహాకవి మరో రవీ
ఈ శతాబ్ది నీదేనని లేశమైన అనుమానం
లేనేలేదన్నావు - క - లేజాగల మొనగాడవు!
నీయనంతరపు కవులకు నీవిచ్చిన వారసత్వ
మేదీ! మహాప్రస్థానము మా అందరి వేదము.
ఎవరిచుట్టూ వెలుగులు ప్రసరించగలవో అతడే రవి
ఎవరివెంట కవుల గుంపులవుతారో అతడే కవి
నీ చూపినదారులందు నిలిచి సాగినారు కవులు
దానిని నిర్ధేశించిన దార్శినికత గొప్పది కదా!
జగతిలోన తెలుగు కవిత జే గంటలు మ్రోయువరకు
శ్రీశ్రీ నీ పేరు చిరంజీవిగా రూపొందగలదు. (చినుకు, జూన్ 2009 సంచిక పేజి : 57)
''ప్రభవ'' ప్రతాపాలను - స్థాలీపులీక న్యాయంగా పరిశీలిద్దాం.
గరళపు ముద్దలోహ మన గాఢ మహాశనికోట్లు సమ్మెటల్
హరునయనాగ్ని కొల్మి ఉరగాధిపు కోరల పట్టుకార్లు,
ధిక్కరణ శిరమ్ముదాయ లయకాలుడు కమ్మరివైరి వీర సం
హరణ గుణాభిరాముడగు మైలమభీమన ఖడ్గ సృష్ఠికిన్
తెలుగువాడికి అంకింతం.
''రెండు రెళ్ళు నాల్గన్నందుకు
గుండాలు గుండ్రాళ్ళు విసిరే సీమలో
క్షేమం అవిభాజ్యం అంటే
జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో''
అనే కవితతో ఆరంభమయి
''అహింస ఒక ఆశయమే కాని
ఆయుధం ఎప్పుడూ కాదు
ఆశయం సాధించాలంటే
ఆయుధం అవసరమే మరి''
అంటూ నొక్కిచెపుతూ
''బూజుపట్టిన భావాలకు
పునర్జయం యివ్వడానికి కాదు
కుళ్ళిపోతున్న సమాజ వృక్షాన్ని
సమూలచ్చేదనం చేయడానికి''
ఈ ఖడ్డ సృష్టి జరిగిందంటాడు.
''పగలు రెక్కలు ముడిచి
ఎగురుటాపగానే
రాత్రి రాక్షసిలాగు
రాత్రిని పూసుకుంది''
అంటూ
రాత్రి రాక్షసకన్య
కాలంతో వ్యభచరిస్తే
రాత్రికి భూకంపాలు
భూమికి మహామారి
విశూచి, మశూచికాలు
- జ్వాల, డిశంబర్ 1934
వికిరనృత్యములో
''అదిగో నిలువబడియున్న అమాయకపు కన్య
సుడితిరుగుతున్నవామె సకలేంద్రియములు
వేచికొనె సిద్ధముగా హుషారై రక్తంమంట రగిలి
నేత్రాల నుండి ఉద్రిక్త జీవననాంభ''
మూలం : డాన్సె మకొచ్రె ''అలెగ్జాండర్ బ్లాక్'' - వీణ (పత్రిక) 11-10-1937
రుబాయత్ - ఇంగ్లీష్ పదాలెక్కువ తెలుగు తక్కువ - ప్రతిభ
కథాకళి, కూచిపూడి
జావా నాట్యం - రష్యన్ బ్యాలెట్
జార్జ్, రుంబా, కారియోకా
హుసారిస్తాయ్, నిషా చేస్తాయ్ డికంపోజిషన్ - ఇంగ్లీషు శీర్షిక
తురాయి కంటె - ఆ
కురాయి కంటె - కీ
చురాయి కంటె - హిమాంసు
రాయి గొప్ప వాడు.
1940 గిడుగువారి స్మారక సంచిక, ప్రతిభ
విదూషీకుని వికటహాసంలో కపాలం పకాలన్నది
ఆకలి అన్నం వండుకుంది హంస ఆకాశం అందుకుంది
టాంటాంలో
కాని నువ్వు పురుగువని, నురుగువని ఏమి యెరుగవని
తొట్టి చేట పెయ్యవని, కొయ్యవని, గుడ్డిగవ్వ చేయవని
గోడమీద నీడవని, చేతకాని వాడివని
పెద్దలక్క బొమ్మవని, వాజమ్మవని
జీబ్రాకి ఆల్జీబ్రా చిహ్నల
లంకోటు పాంకోళ్ళు .....
సాహిత్య పౌరహిత్యం ఇస్తే
వెర్రికాదు సర్రియలిజం సోదరా!
కొంటెకోణాల శీర్షికలో
పడుచుదనానికి జడుపులేదు
సంకేతం నా సరస్సు
వెళ్ళకు వెళ్ళకు చస్తావు
నాచునిండిన కోనేరు
ఏమిటి దంతపుచర్మం మీద
ఎర్రని పచ్చనిదేదే మచ్చ
లోతు లోయలో భూతాలు
కొలివి నిప్పులో గుర్రాలు
అభిసారికకి కడసారి గీతం - ప్రతిభ, జూలై 1940
ఆదివాస్తికుల ప్రవేశంలోని పద్య, గమనించండి
''మ్రింగి తిమింగలాంగల తమిస్ర గుహాంతర మీనమేష పా
రంగతులైన బంగరములార యెరిగిన తెల్పుడా పరి
ష్వంగము పాడుటెందుకు? విపంచికి కంచికి దూరమెంత? వ
డ్రంగులరంగుల గులకరాళ్ళగు గుడిలోని లింగముల్''
కాగడా 1940-41
మంటల మూట - ఆంధ్రత్రిక 11-12-1940
మహా కవికి ఆశ్చర్యం ,, 29-01-1941
మంచి ముత్యాల సరాలు
నేను వెళ్ళిన నాటినుంచి
నీడలోపలి మేడదిగదట!
కోడిగుడ్డు ప్రమాణకంగా
కృష్ణశాస్త్రి చదవలేదట!
నన్ను తిట్టిన తల్లితోనే
మల్లెపూలమాలకట్టను
నాకువ్రాసిన ప్రేమలేఖలు
పోస్టుచేయుట మానివేసెను
--3/1943 - భారతి
శ్రీశ్రీ మార్కు పద్యాలనే వాడుడు! -ఒకసారి పరికిద్దాం
''రెండు జగన్నాధరధ రథŠ రధాధర
ధరాధర రసాతల(జల)పాతాళాలు
రెండు స్వయంశమంవరంతకం
ప్రకంపమాన లోకాలోక విలోకనాలు
రెండు భ్రమాభ్రమమరభ్రమణభ్రమరణ
భ్రమావరణ బ్రహ్మవైవస్వతమన్వంతరాలు''
ఢండా 1944
మంజీర 1954 (పునర్ముద్రణ)
భ్రమర గీత:
''ఝణ ఝణ ఝంఝణ ఝణాఝణానిక్వణం
అది నా నయనంలో ప్రథమారుణ కిరణం
రణ సిసృహణం
వదా విధాన చరణం
నాలో లోలోపల భ్రమాభ్రమర సంచరణం
రణ నిస్సహణం
వధా విధాన చరణం
నాలో లోలోపల భ్రమాభ్రమర సంచరణం
రణద్రనిస్సహణ ప్రణవం
అది నా హృదయంలో రుధిర జ్వలనం గీత జననం''
ఆఖరి మాట, మొదటి మాట కవితలో అతిశయోక్తులు -ఉపమానాలు, వ్యంగ్యాలు ఎన్నో కూర్చబడ్డాయి.
''నాకేమున్నాయిలే, ఆసులా రాజులా, రాణీలా
జాకీలా క్షణకాలం జెండా ఎగిరీంచేస్తా
ఆ కొంచెం చాలదంటె సైనైడ్కూడ కొంచమే, కా
దా కాదంటే కాదనండయ్యా అన్నయ్యలా!
పరమాణువు నా ప్రపంచం
నాతో గుణకారం!ఆఖరి మాట మొదటిమాట 1 .హిస్టెరోన్ - ప్రొటెరోన్
అసలకే ఆనంతం 2. నోవెల్వే స్వేన్స్ వే
అప్పారావు నా నేస్తం 3. కెమారడారి
ఆంధ్రత్వం నా శాపం! 4. డిఫీటిజం
మహాసంకల్పం 8-5-1944 -అశాంతి నికేతనం-ఖడ్గమేఘ్రంలోంచి
''కోయీ హస్రహాహై -కోయీ రోరహాహై'' అనే కథలో
శిష్యుడు: '' అండజ భీముడండ డడ
డండడ డండడ డండ........స్వామి దీనికంతమెప్పుడు?
గురువు: ''ఇది అనంతం!'' --శ్రావణి
''ఎన్నాళ్ళు యింకా కళపెళ కాగుతుంది రక్తం
బిగుసుకుపోతున్నాయి సంకెళ్ళు
పిడికిలి పట్టి ఆకాశాన్ని బెదిరించాను
వికటంగా నవ్వింది మెరుపు
ఊరుము నన్ను ఓదార్చింది -
ఎన్నాళ్ళు అంది వాన..''
కప్ప వైద్యుడు -
''అనగా అనగా ఒక కప్ప
అది తానొక గొప్ప
వైద్యుడని భావించింది
వైద్యం చేస్తానని చాటించింది.
అడవికెళ్ళిందా కప్ప
అమాంతంగా గొప్ప
వైద్యుడైనట్టు తన మెప్పు
చాటింది బెకబెకల డప్పు''
ఇలాగా ఆ కథ అంత్యప్రాసతో సాగుతోంది. - 1945 ఢంకా
'' సింహకన్యలు''
''వెలుతురు కిరణాల జూలు
జాబితాలేస్తూ (ఔను అందుకే అందుకే ఆ సుఖం చివరకే)
కళ్ళసందులోని
ఇరుకు కాలువప్రక్క లాంతరు స్తంభం
చీకటి ఏనుగు పిల్లల్ని
చీల్చుకుతింటోంది'' - ఆనందవాణి ముద్రణ
'' తులం వృశ్చికం''
''గొలుసు గొలుసుల బొమ్మ
కుట్టు యంత్రములోన
కవులనల్ల మందు
కళల సందుల్లోన
ఆంధ్రజాతికి
నేడుగాది పండుగ కాదు
ఆంధ్రరాష్ట్రం నిద్రయందలి వసూలు కాదు'' - ఆనందవాణి
''26'' పేరుతో వివిధ కవుల కావ్యాలలోని 26 పేజీలో కవితల మొదటి పంక్తిని (పాదాన్ని) తనకు తోచిన వరుసల్లో వ్రాసాడు శ్రీశ్రీ. ఆనందవాణిలో ప్రచురణ, సంపాదకుడిగా తన పేరు, పద్య రచనకు పెట్టాడు.
''కర్రుమంటూ యింజన్లు''
''కాకలీ కాకలీ''
''ఎవరో నా హృదయనాళ''
''తరళ తారకా మండితాంబర పధాన''
''ముడుకుకొని తమ ముఖాల వస్తున్నారు మునికాళ్ళపై''
''టాల్‌స్టాయ్'' తన ''వాట్ ఈజ్ ఆర్ట్'' లో అప్పటి నవ కవుల గ్రంధాల 20 పుటల గీతాలను ఉధృతం చేసిన మాట సాహిత్య డిటెక్టివ్లకు చర్విత చర్వణమే.
పబ్లిక్ కోటాలో
''చలికాలం శాఖోపశాఖలతో
శవంవలె కఠినాతి కఠినం
సందొకటి జనసమ్మర్ధం నుంచి
సన్నగా తప్పించుకుపోయింది
సందునిండా ఏకాంతం
అందులో ఒక బల్ల మీద మనిషి
దాచివేస్తుంది సందు
దారుణ వేదనా కఠోర యంత్రాలకు
వెల్లుల్లి (జాబిల్లి) పాయలకు
కంకర రాళ్ళ కాలువలకు''.... యిలా కొనసాగుతుంది. - పాల్ ఎల్వార్డ్, ఢంకా ప్రచురణ
ఆ కవిదే ఇంకోగీతం
కత్తులు వాడిగా బలంగా
వాటి బరువే వేరు
కత్తులు వెనుకనే జనసమూహాల్ని చీల్చుకుంటూ
అలిసిపోయినవి కొన్ని
ఊహలో దర్పంగా పోయేవి కొన్ని...
- అనుక్షణ నవీన మోహిని పేరుతో పత్రికలో ఇది మొదట అచ్చు పడింది.
మూలం : పాల్ ఎల్వార్డ్
''జేముని జాయిసీ, ఆన్డ్రే, బ్రెటన్, చార్లెన్ బాడి క్లియర్'' లాంటి వారి కవితలను తెలుగు వాతావారణం ఉట్టిపడేలా అనువదించారు శ్రీశ్రీ. అటువంటి వాటిలో ప్రముఖమైనది, మరిచిపోలేనిది, ఫ్రెంచి రచయిత ఎఫ్. విలన్ (1431-63) వ్రాసిన ''ది స్నోస్ ఆఫ్ ఈస్టర్ ఇయర్'' కి అనుసరణే ఇది.
''చక్రవర్తి అశోకుడెక్కడ-జగద్గురు శంకరుండెచ్చట
ఏవి తల్లి! నిరుడు కురిసిన-హిమ సమూహములు
కాళిదాస మహా కవీంద్రుని-కవన వాహినిలో కరంగిని
ఉజ్జయి నేడెక్కడమ్మ-ఉంది చూపించు..!
షాజహాన్ అంతఃపురంలో-షడ్పదీ శింజాన మెక్కడ
ఝాన్సీ లక్ష్మిదేవి ఎక్కిన-సైంధవ్యం నేడేది తల్లి
రుద్రమాంబ భద్రకాళి-లోచనోజ్వల రోచులేవి
ఖడ్గతిక్కన కదనకాహల-కహ కహ ధ్వనులెక్కడమ్మా
ఎక్కడమ్మా కృష్ణరాయని-బాహుజాగ్రద్బాడబాగ్నులు
బాలచంద్రుని బ్రహ్మనాయుని-ప్రాణవాయువు లేవి తల్లి
జగద్గురువులు చక్రవర్తులు-సత్కవీశులు సైన్యనాధులు
మానవతులకు మహారాజ్ఞుల-కానరారేమీ?
పసిడిరెక్కలు విసిరికాలం-పారిపోయిన జాడలేవి
ఏవితల్లి నిరుడు కురిసిన-హిమ సముహములు!
1. ఆంధ్రశిల్పి - 1సం. సంచిక 6
2. తెలుగు స్వతంత్ర - 1.4.1952
జోన్ (యుద్దరంగం) దీర్ఘ కవిత
గిల్లాయిమ్ అపొల్లినెయర్ (1880-1918)ఫ్రెంచి కవితకు అనువాదం
''స్వాతంత్య్రాన్ని నా స్కూలు కాపీ బుక్కుమీద,నా బల్ల మీద, చెట్ల మీద, ఇసుక మీద,మంచు మీద రాస్తానని'' పాల్ ఎల్యూడ్ కవితకు అనుసరణగా ఆంధ్రశిల్పి 1947లో ప్రచురించింది.
హెచ్.డబ్ల్యు. ఆడెన్స్ ''ది ఆరేటర్ '' బుక్ నెం. 1, స్టేట్మెంట్ అనురసణను తెలుగు నుడికారంతో వ్రాసిన దాన్ని 25.4.48లో నవోదయ ప్రచురణ వారు వారం వారం లో ప్రచురించారు.
''ఒక్కరో పలువురో పేర'' కవితను 1948 డిసెంబర్లో ఢంకా ప్రచురించింది. పాల్ ఎల్యూట్స్ కవితకు అనువాదం.
''విషాదనగరం'' కూడా అదే రచయిత కవితకు అనువాదం.
చిన్న పిల్లలు, సర్కస్‌లో ''గుండె లేని శవానికి'',
గాయానికి బాధలేనట్లు గుడ్డివాడు మాత్రమే జాస్తిగా చూస్తాడని అంటాడు. దీనికి మూలం. డైలాన్ థామన్ కవిత - ఫిబ్రవరి 25న తెలుగు స్వతంత్రలో ప్రచురించబడింది.
''పిచ్చి దానిమ్మ చెట్టు'' - ఒడిన్యూలెటిస్ గేయానికి అనువాదం, 15 ఏప్రిల్ 1949 తెలుగు స్వతంత్ర ప్రచురణ.
''నౌకాయానం తర్వాత'' పాల్ ఎల్యూర్డ్స్ రచనకు అనువాదం.
ద్వేషగీతంలో ''అసలు నేను వ్రాసిన కావ్యాలన్నింటిలో
ఈ ద్వేషగీతం చాల బావుందని
ఎవడైతే అనడో
ఆ దొంగ తొత్తు కొడుకు
మొగం మీద ఉమ్ముతాను''-- -- ఇదీ పాల్ ఎల్యుర్డ్స్ '' క్రిటిక్డిలా పొయిసి''కి అనువాదం (కావ్య విమర్శ అని అర్థం)
''గీతం'' కి పాల్ ఎల్యుర్డ్స్ మూలం 1955 ఏప్రియల్ - విశాలాంధ్ర ప్రచురణ
మరీ ముఖ్యంగా ''ఒక మాఘమాసపుగాలి'' దైలన్ థామస్ కు కవిత-2 అనువాదం –
జయ, పుష్య సంచికలో ప్రచురణ
ఆ రచయితదే మరో కవితకు అనువాదం '' కాగితం మీద సంతకం చేసిన చెయ్యి''
'' స్వర్గాన్ని శాసించే హస్రంలాగ
జాలిని పరిపాలిస్తుంది చెయ్యి
హస్తాలకశ్రువులు లేవు
ప్రవహించడానికి'' -- కవిత, జయ - భాద్రపద సంచిక
గీ. నీ. ఆడెన్ మూలానికి అనువాదం ''ఆవాహన''
హెన్రీ మైచాక్య అనువాదం ''దిగుమతి చేసిన గీతాలు''
తెలుగు స్వతంత్ర 1953 నవంబర్ 6 లో ప్రచురణ
అదె కవి మరో అనువాదం ''వికారి'' - ముద్రణ మాలి...
''బండి సున్న కావటం వల్ల,
ప్రయత్న పూర్వకంగా
పనికిమాలి పోవటం వల్ల
నవ్వులపాలు కావటం వల్ల''
సాల్విడర్ డాలి కవితకు అనువాదం అసంపూర్ణంగా లభ్యం. అది ఆంధ్రపత్రికలో ప్రచురణ పొంది
ప్రణయం, సంస్మరణం పేర
''తాళపు చెవి కరిగి లేక
అనేక సదుపాయాలు కలిసి లేక
మా అక్కయ ఫోటోగ్రాఫ్ పక్కది
సూదిదారం కలిగి అడుగుబడ్డ
అన్నం మెతుకులు కలిగి...
''పుట్టని పాప ప్రార్ధన''
నేనింకా పుట్టలేదు
నా ప్రార్ధన వినండి
గాలి, ధూళి మహామ్మారి
బాలారిష్టాల్లేని
గద్ద, గుడ్లగూబ రాని
గబ్బిలాలు జడిపించని
బతుకునివ్వండి'' అంటూ సాగుతుంది. దీనికి మూలం లూయీ మేక్నిస్ గీతం. (ముక్కస్య ముక్కానువాదం)
ఆనందవాణి ప్రచురణ
క్రిష్టఫర్ లోన్ గేయానువాదంగా ఫ్రొఫెసర్ గారి రిపోర్టు
(భూమి నుండి మానవజాతి తుడిచిపెట్టుకపోయిన తరువాత)
''మానవుడు రాజకీయ జీవి
ముఠాలుగా తిరిగేవాళ్ళు
ఒక గుంపు ఇంకో గుంపును ద్వేషించేది
అబ్బో ఎన్నెన్ని విద్వేషాలు
అన్నింటిలో ప్రధానమైనది దేశాభిమానం''
''పాలు తప్ప మరేమీ తాక్కుండా
అప్పుడప్పుడు ఉపవాసాలంటూ
నిజం కనబడితే జడుసుకొని
నీడల్లా బతుకుతారేం'' అంటూ విప్పండి మీ వికారపు వేషం అనే కవిత విశాలాంధ్ర మార్చి 1948 లో ముద్రణ
పొందింది..
సిరిసి మువ్వ శతకం
1. అందంగా మధురరస ని
ష్యందంగా, పఠిత హృదయ స్పందంగా
కందాలొక వంద రచిం
చిందికి మనసైయ్యే నాకు సిరిసిరిమువ్వ
2. ఖగరాట్ కృషి ఫలితంగా
పొగాకు భూలోకమందు పుట్టెనుగానీ
పొగ చుట్టకులెన్నియైనను
సిగిరెట్టుకు సాటిరావు సిరిసిరిమువ్వ
3. అవురా శ్రీరంగం శ్రీ
నివాసరావూ, భలే మనిషివే, ఇక నీ
కవితా వాద్యం చాలిం
చి, వెళ్ళిపొమ్మనకు నన్ను సిరిసిరిమువ్వ
4. ఏడీ కవిగాడీ భువి
గాడిద ఏడుపును పాడగలిగినవాడో
చౌడప్పకీడు... కర ని
ష్పడన కరుండు లేడు సిరిసిరిమువ్వ
5.ఓ అంతా కవులే, అ
ఆఇఈలైన రాని యం బ్రహ్మలే, మే
ము ఋషులం అని, ఛీ
ఛీ ఎంత నవ్వుబాటు సిరిసిరిమువ్వ
6. బండెడు చెత్తను చండ
శండముగా పోగుచేసి సారస్యము చూ
డండనీ కోతలు కోస్తే
చెండాడెదనట్టి వారి సిరిసిరిమువ్వ
7. పాతబడి కుళ్లిపోయిన
నీతులనే పట్టుకొని మనీసులమంటూ
నూతన జీవితలహరికి
సేతువు నిర్మించుటేల సిరిసిరిమువ్వ
8. మీసాలకు రంగేదో
వేసేస్తే యవ్వనం లభించడం నిజమే
సీసా లేబులు మార్చే
స్తే సారా బ్రాందీ అగునే సిరిసిరిమువ్వ
9. ఉగ్గేలా త్రాగుబోతుకు
ముగ్గేలా తాజ్‌మహల్ మునివాకిటిల్లో
విగ్గేలా కృష్ణశాస్త్రికి
సిగ్గేలా భావ కవికి సిరిసిరిమువ్వ
10. ఈ రోజుల్లో ఎవడికి
నోరుంటే వాడే రాజు, నూరుచు మిరియాల్
కారాలు తెగ బుకాయి
స్తే రాజ్యాలేలవచ్చు సిరిసిరిమువ్వ
11. పెద్ద బాలశిక్ష చదివి
చదవడమే తడవుగాక సాహిత్య విశా
రదులయినట్లుగా భావిం
చెదరు గదా! సిరిసిరిమువ్వ
12. దయ్యాలను చూపిస్తా
నయ్యారమ్మనచు నొక్క ఆసామి నా
కయ్యెతన కూతుళ్ళను
చేయూపుతు పిలిచి చూపే సిరిసిరిమువ్వ
13. వ్యవహారాంధ్రం జీవ
త్ప్రవాహ మది వదిలిపెట్ట పాతదైన స్థా
ణువయిన గ్రాంధిక భాషను
చెవినెవ్వడు పెట్టు నేడు సిరిసిరిమువ్వ
14. కోయకు మీ సొరకాయలు
వ్రాయకు నవలలని అవాకు చెవాకుల్
డాయకు మీ అరవఫిలిం
చేయకు మీ చేబదుళ్ళు సిరిసిరిమువ్వ
15. ''బార్ ఎట్లా'' అయితే సాం
బారెట్లా చెయ్యగలడు, భార్యయెదుట తా
నోరెట్లా మెదులించును
చీరెట్లా బేరమాడు సిరిసిరిమువ్వ
16.నాలా కందబంధ
జ్వాలా జాలాగ్ర సంవసత్సద్గీతా
లాల లిపించే కవితా
శ్రీలోలుడు నహి నహీతి సిరిసిరిమువ్వ
17. కోట్ల కొలది ప్రజలను చీ
కొట్లోపల వదిలి నేటి కాంగ్రెస్ రాజ్యం
కొట్లాటల పొట్లాటల
చీట్లాటగా మారిపోయే సిరిసిరిమువ్వ
18. దేవుడి పేర ఏవే
వో వెధవ పనుల్ పోనర్చుటన్నదెకద, హిం
సా వాదం గాంధీజీ
సేవకులు చేయలేదె సిరిసిరిమువ్వ
19. అసలు సమస్యలు గ్రాసం
వసనం వాసం అలాంటి వాటిని చూచే
పసలేక గింజుకొని చ
చ్చి సున్నమవుతోంది ప్రతిభ సిరిసిరిమువ్వ
ఇలాంటివే మరెన్నో మనల్ని పలకరిస్తాయి. మనసులను పులకరింపచేస్తాయి.
జిలాయుద్దీన్ రూమీకి రుక్కాయ్ (రుక్కు)! అందించిన శ్రీశ్రీ అందరికి సన్మానాలు చేస్తున్నాము. నీకు మెమెందుకు చేయకూడదు అంటూ అందించినదే రుక్కుటేశ్వర శతకం.
- గోల్డ్వ్యామోహం చెడ్డది (GOLD)
- మైల్డియాకి మామం శరీరమాధ్యం ఖలుడా (MILD)
- చైల్డ్స్పాతం కూడదు (CHILD)
- ఓల్డ్వ్యులను హోల్డు చేయకుండుము జరు (OLD VIEW) - (HOLD)
సింహాలకు ........(జూ) లుండును
సంహారమె సృష్టియగును సామన్యముగా
అంహిస్సెయౌవును పుణ్యము
సంహౌ మన కవనమిట్లె స్రవియించు జరు
జట్కాలకి, సైకిళ్లకీ
రిక్షాలకీ, మోటార్లకీ, రైలుబళ్ళకీ
ఇత్యాది శకటాలకి
చక్రాలుంటాయే ప్రమాణ పూర్తిగ జరు
వెళ్ళిరి దొరలనుకుంటే
కోళ్ళు తినే వాళ్ళ బదులుగా గొర్రెలు తినే
వాళ్లొచ్చినట్లు కాంగ్రెస్
కుళ్ళీయుల వాళ్ల వల్ల ఘోరాలు జరు
దోచేసే వాళ్ళను ఏ
దోచేస్తుందని శివాశతో చూస్తుంటే
దోచేస్తుంది కదా కం
చె, చేను మేసినట్టు లీ ప్రభుత జరు
- 1948 విశాలాంధ్ర పక్ష పత్రికలో శ్రీశ్రీ, ఆరుద్ర పేర్లతో ప్రచురణ
కథలు:
చరమ రాత్రి కథలో: నరకం, భూమి స్వర్గం మూడు కాలాలలో ఆలాపన
కోనేటిరావు కథలలో: (కోనేటి దినం, రాత్రి, కోనేటి జన్మ) జటావల్లభుల కోనేటిరావు పంతులుగారి దినచర్య
హేమంతం: (చలం కొత్త చిగుళ్ళు చదివిన తర్వాత స్పందించి రాసిన కథ)
అశ్వమేథయాగం: కథావీథి 1945
ఒసే! తువ్వాలందుకో
నేటి హిరణ్యాక్షుడు
క్షణంలో సగం
కవి సన్మానం
పంచపాండవులు నవోదయం 31-10-1948
అనామిక ,,
ప్రారంభం పెంకిపిల్ల 1945 సెప్టెంబర్
శూర్పణకామానసంరక్షణం: రూపవాణి 1945 మార్చి
బొమ్మ: ఆంధ్రపత్రికలో వారంవారంలో చేరింది
ఒక్కల /ఒక కల/ ఓ కల: అరుణరేఖ: 1949 అక్టోబర్
అనువాద కథలు:
కుర్రాడు చుంచెలుక
గొల్లవాడి కూతలు
దేవతార్చన మూల రచయిత: విలియం సారోయన్
చలికాలపు రాత్రి ఢంకా - 1944 అక్టోబరు ప్రచురణ
డియర్ గ్రేటాగాల్బో
నీ యుద్ధం నువ్వే చేసుకో - - కిన్నెర ప్రభ 1949 ఏప్రియల్
కపేశ్వరుడు -- - వియనంప్రిట్ఛెవ్ (ది ఏప్ హూ లాస్ట్ హిజ్ టెయిల్)
అలవాటు బలిమి : బ్రెటిన్ ఎల్యుయర్డ్ (ది ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్) ఢంకా 1945 - మే
హంతకుడు: ఫ్రెంచ్ రచయిత జి.డి. మావుపెజెంట్ - సూర్యప్రభ 1945 జూన్
వింత జంతువు: ఫ్రాంజ్ కఫ్కా - 1947 జ్యోతి డిసెంబర్
'' అనంతం ''(1)
ఆత్మచరిత్రాత్మ చరిత్రాత్మక కథ - ఎంత ద్వర్థం, సృష్టి క్రమేణా
''ఆనందవాణి'' 1945 జనవరి
'' అనంతం ''(2) దై రెట్రోస్పెక్టివ్ హర్రర్స్ - కథావీథి 1946 - నవంబర్
'' అనంతం ''(3) ధనం ధరించే రూపాలు అనంతం: వేశ్యమాత, వ్యాఘ్రం, మేఘం, టోపీ (వేసే శక్తి)
త్యాగం, ముక్కాలి వేలు - ఎన్ని రకాలట?
సుదర్శనం: లోకం (ఆదర్శజీవులు)--ఆలిండియా రేడియో
కొ.కు./పా.ప./ము.న.రావు/గోపీచంద్/శ్రీశ్రీ/చిం.దీ. ఆరగురూ రాసిన నవాల ఆలిండియా రేడియో
కోసం - లోకం - శ్రీశ్రీ ది. -- నవోదయ 1947 మే 25
రేడియో నాటికలు :
మరో ప్రపంచం :
1.యుద్ధంలో యుద్ధం
2.భాగ్యలక్ష్మి (యక్షగానం) - ''రుడ్యార్డ్ కిప్లింగ్'' రాసిన
''ది మాస్క్ ఆఫ్ ప్లెంటీ'' కి అనువాదం మరోప్రపంచం:
గవేషణ
అనంతరయాత్ర - భారతి 1951 మార్చి
విదూషకుని ఆత్మహత్య
గ్రామఫోను రికార్డుల తిరుగుబాటు
గుమాస్తాకల
జడభరతుడు
ఒంటరి బావి (వచన కవితా నాటిక)
భూతాల కొలిమి( వచన కవితానాటిక - ఆంగ్లం నుండి అనువాదం)
బలి: నాటిక (పోతన భాగవతమలో వామనమూర్తి ఆవిర్భావఘట్టానికి కృతజఞతతోవ్రాసినది)
చరిత్ర చెప్పని సందేశం: (ఏ దేశ చరిత్ర గేయంతో +అల్లసాని పెద్దన దీర్ఘ పద్యం ''పూత మెరుంగులు'' -
ఆంధ్రశిల్పి సం.2సం.2 1946
శిరస్సు చెప్పిన రహస్యం : సమీక్ష - 19439 అక్టోబర్ (ఆలిండియా రేడియో మద్రాసు 1949 ఆగస్టు 31న ప్రసారం)
సంపెంగ తోట - మూలం ఆంటన్ చెకోవ్ - ది క్లోజింగ్ ఆర్కడ్ - ప్రజసాహిత్య పరిషత్, తెనాలి, 1947
వారంవారం (వ్యాసాలు) ఆనందవాణి:
తోక కథలో కథ
సద్య:స్పూర్తి
కాళ్ళు చేతులు లేని కథ
మంచు స్వప్నాల త్రివర్ణ చిత్రం
ఆనందమయజీవితం (చెఖోవ్ రచనకు మూలం)
పొంగరంగరంగరాలు
నగర దృశ్యాలు
సలహా
కన్యాశుల్కం
సెల్యూలాయిడ్‌లో కన్యాశుల్కం
యెంకిపాటల రంగులు
సానితల్లులు
సంగ్రామాలు - సమావేశాలు
యంత్రయుగం
ఫ్రిస్కాలజీ
కొత్త పత్రికలు - ఒకాటయిద్దరాడగలరు - అప్పుడూ యిప్పుడూ, అభ్యుదయం -(నవోదయ)
ద్వితీయ ప్రారంభం 31-8-1947
పరిచయం 04-9-1947
అద్దంముందు ప్రార్థన 21-9-1947
కథకథ 28-9-1947
మద్యపాన నిషేధం మంచిదే 5-1-1947
పాపం రేడియో 12-10-1947
తృ.ప్ర.మ. యుద్ధం 18-10-1947
ఆగ్రహం 26-10-1947
గిరాంమూర్తి 27-10-1947
గాంధీజీ/స్వామీజీ 8-1-1948
ఒక ఉత్తరం 22-2-1948 (హెన్రీ ముల్లర్ 1946)
సాహితీ సమితి 14-3-1948
బైరాగి 21-3-1948
కానికాలం 28-3-1948
అవాక్కులు 11-4-1948
వస్తాడే మా బావ 18-4-1948
విశాఖ పట్నపు జాఞపకాలు 2-5-1948
కవుల బాధలు 9-5-1948
కన్యాశుల్కంలో లోపాలు 23-5-1948
చంద్రలేఖ 30-5-1948
ఒక కార్టూన్ చిత్రం
ఆస్థాన కవులు
మథనం
జీర వచన రచన
రచయితల గురించి
తెలుగుతనం
మరికొన్ని వ్యాసాలు: తెలుగు స్వతంత్ర:
ప్రయాణం 29-10-1948
వాడేవీడు 5-11-1948
ప్రవాహం 12-11-1948
టాగూరు నా ఎల్లెరీనా 31-12-1948
అవనీ మాతవలె 11-3-1949
వ్యాసాలు/ఉపన్యాసాలు:
ఒక సంభాషణ శకలం ప్రబుద్ధాంధ్ర: 1935 జనవరి
ముత్యాల సరాలు ఉదయిని: 1935 ఫిబ్రవరి
శ్రుతులు వీణ సం.1 సం.1 ధాత/జ్యేష్టం
పరిచయం ,, సం.7 సం.1 ధాత, 1936
ఆధునిక గద్య వాఙ్మయ ప్రవర్తకుడు (ఆలిండియా రేడియో ప్రసారం)
గురజాడ ఆధిక్యానికి కారణాలు ,,
నేటి తెనుగు కవిత - కొత్త పోకడలు - (రేడియో ప్రసంగ పాఠం) భారతి 2/1939
సంక్షుబ్ద సౌందర్యం - ఢంకా - 4/1945
దాలీచిత్రాలు ,, -11/1945
అధివాస్తవికత - ( విజయవాడ రామమోహన లైబ్రరీహాలులో
20-9-1945న జరిగిన గోష్టిలో ప్రసంగం)-తెలుగు తల్లి 11/1945
నరకంలో 11/1945 - తెలుగు తల్లి
జేమ్స్ జాయిస్ చైతన్య స్రవంతి: (ఆలిండియా రేడియో) ఆంధ్ర శిల్పి 1947 (ఆక్టోబర్/సెప్టెంబర్)
నా కవిత్వం -1 ,, 1947 (జనవరి/ఫిబ్రవరి)
నా కవిత్వం -2 ,, 1947 (మార్చి/ఏప్రియల్)
ఆంధ్రప్రదేశ్ సాహిత్య సంఘాలు -- కిన్నెర 1949 అక్టోబర్
ఆరంభం పెద్ద అవస్థ (ఆలిండియా రేడియో) - పరిశోధన 6/1954
గ్రంధ సమీక్షలు: పీఠికలు:
కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి(విశ్వనాథ రచనలు): జ్వాల / 16-12-1934
ఇల్లరికం: - భారతి / జూన్ 1939
బుచ్చిబాబు కథలు - ,, ,,
జెక్ రాజ్య విచ్ఛేదం/ పాలస్తీనా - ,, ,,
సైడ్ లైట్స్ - ఆనందవాణి
యువ (మాసపత్రిక) - భారతి / ఆగస్టు 1939
బిందుగారబ్బాయి - ఢంకా 2/1945
(సంక్షిప్త పాఠం)
కథానిక రచన - భారతి / సెప్టెంబర్ 1946
లేఖలు:
ఉదయిని సంపాదకులకు మే 1935 10-6-1935
జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 2/1942 వసుమతి 3-10-1939
అశాంతి ( పత్రిక ప్రకటన - వ్యంగపూర్వకం) ఆనందవాణి 1949
శ్రీశ్రీ - ఆరుద్ర లేఖలు: ఆరుద్ర 7-10-1943
శ్రీశ్రీ 19-10-1943
ఆరుద్ర 9-11-1943
,, 5-12-1943
పై లేఖలు --మార్చి 1948లో ముద్రణ ?
చింతాదీక్షితులు సన్మాన పత్రం - ప్రతిభ 8-4-1945
శ్రీరంగం నారాయణ బాబు - శ్రీశ్రీకి నవోదయ 1/1948 ?
అబ్బూరి - శ్రీశ్రీకి ,, 8-4-1948
ప్రబుద్ధాంధ్ర సంపాదకునికి ముద్రణ 1934
(శ్రీశ్రీ అనువాద వ్యాసంలో మూల రచయిత పేరు వ్రాయలేదని ఎత్తిపొడుస్తూ వ్రాసినది)
శ్రీశ్రీ జీవితంలో కొన్ని ముఖ్య సందర్భాలు
మహాసంకల్పం గేయాలు 15-8-1947
సినీరంగ ప్రవేశం 1948 ?
ఆనందవాణిలో అరవ చాకిరి 1948-50
ఆహుతి - దబ్బింగ్ 1949-50
పెంపుడు కూతురు ప్రవేశం 1949
మహాప్రస్థానం ప్రచురణ 1950
అమ్మ ప్రచురణ 1952
ఆంధ్రరాష్ట్ర శాంతి సాంస్కృతిక మహాసభ -ఏలూరు అధ్యక్షత 30-8-1952
మద్రాసు విధాన మండలి సభ్యుడు (ఎం.ఎల్.సి.) 4/1953
మరో ప్రపంచం ప్రచురణ 1953
మేమే 1954
విశాలాంధ్ర సదస్సు అధ్యక్షత 13-6-1954
ప్రపంచ శాంతి మహాసభకు విదేశీయానం మాస్కో నవంబర్ / జనవరి 1954-55
జనరల్ ఎన్నికలలో ఆంధ్రపత్రిక దుమారం జనవరి / ఫిబ్రవరి 1955
మతిచలనం - చికిత్స - స్వాస్థ్యం ఫిబ్రవరి / మార్చి 1955
అరసం ద్వితీయసభ విజయవాడ అధ్యక్షత 7 / 1955
త్రీ ఛీర్స్ ఫర్ మెన్ 1956
ద్వితీయ కళత్ర ప్రాప్తి 1957
సాహిత్య అకాడమీ సభ్యత్వం 1957
ఆఫ్రో ఆసియన్ రైటర్స్ మీటింగ్, ఢిల్లీ 1957
మానవుడి పాట్లు 1958
గురజాడ 1959
ప్రధమ పుత్రికా జననం 1959
చెవిలో రహస్యం చిత్ర నిర్మాణం 1959-60
సిపిఐ మహాసభల సాంస్కృతికోత్సవాలలో ప్రారంభోపన్యాసం ఏప్రిల్, 1961
కాకినాడలో శ్రీశ్రీపై అత్యాచారం డిసెంబర్, 1961
పుత్రోదయం 1962
మూడు ఏభైలు 1964
పౌరహక్కుల మహాసభ అధ్యక్షత 20 జూన్, 1965
ఖడ్గసృష్టి గేయ రచన 1 / 1966
ఖడ్గసృష్టి సంకలనం 1966
సోవియట్ భూమి నెహ్రు అవార్డు 1966
''సాహిత్యాచార్య'' బిరుదు 11-09-1966
ఆంధ్రప్రదేశ్ యువజన సభలో ఉపన్యాసం 20,21 అక్టోబర్ 1966
మహాసంకల్పం (సంకలనం)
1. గాంధీజీ : మరిచిపోయిన సామ్రాజ్యాలకు
చిరిగిపోయిన జెండా చిహ్నం ఆంధ్రజ్యోతి. 2 / 1946
2. మహాసంకల్పం :
మనుష్యుడే నా సంగీతం
మానవుడే నా సందేశం ఆలిండియా రేడియో 15.08.1947 అభ్యుదయ 9 / 1947
3. ఓ మహత్మా :
ఏది సత్యం ఏదసత్యం
ఏది నిత్యం ఏదనిత్యం
ఏది ఏకం ఏదనేకం
ఏది కారణ మేదికార్యం తెలుగు స్వతంత్ర. 20-08-1948
4. అవలీలగా :
నిజం బరువైంది అన్నా
అబద్దం నిజమైంది అన్నా
నిజాన్ని దాచినా దాగదన్నా
నిజాన్ని బయటపెడుతున్నా
5. సామాన్యుని కామన :
ఈ రోజు సామాన్యుడు
సగం దేవతాంశ సగం
రాక్షశాంస, సగటున ఈ
సామాన్యుడు - మానవుడు తెలుగు స్వతంత్ర.
6. ఎఏఐ, ఒఓఔ :
ఎక్కడ ఎప్పుడు
ఎవరైనా చెప్పుడు
ఈ చిక్కు విప్పుడు
ఏదైనా గీతం చేదైనా
మైమరపించేదైనా
మది కదిలించేదైనా
ఎదరగిలించేదైనా
నేడైనా రేపేనా
ఏమైనా నా గానం
ఐక్యం ఎప్పుడో కాదిప్పుడే
ఎక్కడో కాదు అదిక్కడే
మాట చేతగా మారి
మనిషి మనిషితో చేరి
స్వప్నం సత్యం ఐతేనే స్వర్గం
ఒకానొక అనగా అనగాల వేళ
(అది కృతయుగం / కాదు మృతయుగం)
అదే మన కథలకీ, కవిత్వాలకీ డోల
ఓహో విహంగమా
ఎగురు ఎగురు
నీ రెక్కల విసురులో
మన్వంతరాలు
తరలు తరలు
ఔను వాహనం మారింది
దూరానికి పూర్వపుటర్థం పోయింది
పూర్వం దూరం పోయింది
వెనుకటి వాహనం మారింది
ఆ సూర్యుడే నేడు
ఆ చంద్రుడీనాడో
అవే నక్షత్రాలు ఐనా కాలం మారింది తెలుగు స్వతంత్ర. 11-09-1953
(సామ్యవాదము, భారతము - అనునాసికము)
తెలుగుతల్లి :
అదేవో తెలుగుతల్లి
అందాల నిండు జాబిల్లి
ఆనందాల కల్పవల్లి
అదే నీ తెలుగు తల్లి 1-12-1948 ఆలిండియా రేడియో 17-12-1948 తెలుగు స్వతంత్ర
విశాలాంధ్ర :
మనలో కొంతమంది కవులు మధురంగా నిస్వాస్తారు. యతిప్రసాలు సరిపోతాయి. పదాలు మజాగా పడతాయి. పౌరుషానికి లోటు లేదు. ప్రశస్తికి కూడా డిటో. పద్యాలకు పండ్లు రాలవు. చింతకాయలు చెట్లమీదనే ఉన్నాయి.
కొంగల్లారా జపం చేయండి
పిల్లి పఠించు మంత్రాలు
ఎలుకల్లారా సభ జరపండి
ఎవరు గంట కొట్టాలని
ఇంకోమారు ఎగురలేనక్క
ఈసారి అందవచ్చు ద్రాక్షపళ్ళు
కోతి తీసుకురా
త్రాసు పంపకం తెగటం లేదు. తెలుగు స్వతంత్ర. 25-07-1949
తెలుగు స్వతంత్ర. 19-12-1952
ఇదే దారి :
మూడు కోట్ల జనం మనం
ముమ్మాటికి గెలవగలం
సాటిలేని తెలుగుబలం
మేటిదనుచు చాటగలం
చీల్చబడిన పరగణాలు
చేర్చి వొకటి చేయువరకు
విశాలాంధ్ర వచ్చు వరకు
విరామమే లేదు మనకు తెలుగు స్వతంత్ర. 12-12-1952
సద సత్సంశయం :
ఆలోలము ఆలోచన
వేవేవో నా లోపల
ప్రాలేయచ్ఛాయల వలె
తారడగ కోరాడగ
కవి హృదయపు కనుమలలో
గర్జించిన పర్జన్యం
పెనుచీకటి తిరుగుబాటు
భీభత్సపు మెరుపుదాడి తెలుగు స్వతంత్ర. 18-09-1953
జపం వల్ల తపం వల్ల
ప్రపంచాన్ని మరిచిపోయి
భగవంతుని ధ్యానంలో
పడిపొమ్మని పలికినారు
ఏతదాత్మ సర్వేషా
సర్వత్రా ఆవరించి
సర్వస్యం తానే ఐ
శాసిస్తుందట జగతి..
మనుజులలో మరణభీతి
మదిలో దుఃఖానుభూతి
ఆలోచనలన్నిటికి
ఆంతర్యంలో పునాది...
ఇంకా చెప్పాలంటే
ఎందరో మహానుభావులు
బ్రతుకునుంచి పారిపోయి
తమ వెనుకనే దాగువారు
ఔను - అహింసను పోలిన
పరమోధర్మమ్ము లేదు
(పరమో-ధర్మం విరువకు
పరమ - అధర్మం అంటూ..)
కలడు కలండనేడువాడు
కలడో లేడో అంటూ
లోగడ ఒక్క ఏనుగు ఆ
లోచనలో పడిందట...
అందుచేత చేతులెత్తి
లొంగిపొమ్ము భేషరతుగా
అప్పుడాతని కృప చేత స
మస్తం సౌఖ్యాంతమగును..
పిరికితనం నూరిపోయు
పిట్టకథలతో బానిస
మానసికత నగ్గించె
మన పూర్వులనేమనాలి...
కాషాయం ట్రేడు మార్కు
గా దేవుని ఏజంటుగా
పెంచిన గడ్డంతో జన
వంచనలే ఎంచువాడు
సన్యాసం వైరాగ్యం
సద్గుణాలుగా వచించి
ధనస్వామ్య వర్గాన్నే
వెనకేసుక తిరుగుతాడు...
శ్రీశ్రీ చెప్పేదానిని
శిరస్సా వహించు వేళ
రావడినికింకా ఒక
ఆమడదూరం ఉన్నది
భగవద్గీత, ఖురాన్,
జిందావెస్థా, బైబిల్
మానవ పరిణామపు సో
పానాలను గ్రహించాలి...
భాషలెన్నియైనా మరి
ప్రశ్నమంత్ర మొకటేలే
ఆ ఒకటే రెండెంచగ
అవును కాదు, కాదు అవును.. సంవేదన. 4/1965
సుదూరాన... ధనగర్వం తగదని - కుటిలత్వం చెరుపనీ
జనులంతా ఒకటనీ - జగమంతా చాటవోయి .... విశాలంధ్ర 1-10-1953
ఒకటీ పది:
అదో పదోనెల చాల - హాస విశాల
పుట్టింటికొస్తోంది - పూర్ణ గర్భిణి
రైలుబండి లేటయిందా
వంతెన చుట్టు వరదలా
ఇంజన్ సరగ్గా లేదూ?
ఎందుకదంతా పోదూ!
ఆంధ్రరాష్ట్రం ఆగమనం
అసత్యం కాజాలని చారిత్రిక వాగ్దానం
మన చరిత్రాత్మక నిరంతరాందోళన
చరితార్థమయిందీనాడు!
సంతోషం సంరంభం నేడే నేడే!
సౌమార్గం -సౌభాగ్యం రేపే రేపే!
1-10-1953 ఆంధ్రరాష్ట్ర అవతరణదినం ''ఫస్ట్ లవ్'' .. తెలుగు స్వతంత్ర 2-10-1953
బొమ్మ లాంతరు:
తనచుట్టూ తాను తిరుగుతూ
సూర్యుని వుట్టు పరిభ్రమించే భూమిలాగ
ఆశయం చుట్టు తిరుగుతోంది
ఆవేశం! .... తెలుగు స్వతంత్ర 4-12-1953
(చీట్లాటలో ఒక చేతిని అన్ని పొడిముక్కలే అయి ఒక్కబొమ్మ లేకపోవడం బొమ్మలాంతరు.
అప్పుడు ఆట కలిపి మళ్ళీ ముక్కలు కలపడం ధర్మం.)
నగరంలో వృషభం
నగరం నడివీధిలో
నాగరికతా గమనాన్ని నిరోధిస్తూ
ఇలా యంతసేపయినా సరే
యీ ఎద్దు నిలబడగలదు
ఎద్దుకు లేకపోతే బుద్ధి మనిషికేనా ఉండొద్దా? ... కవిత .. జయ .. భాద్రపద సంచిక -1954 వర్గరహిత ధనస్వామ్యం:
..కాని యింతట్లోనే
ఇదేం స్వప్న భయం?
అమెరికాలో ఆర్థిక మాంద్యం
ప్రారంభమయిందంటాడేమీ బట్లర్
వాడెవడో కమ్యూనిస్టు
దుర్మార్గుడు కాబోలు?
కాదయ్యా సాక్షాత్తు బ్రిటీష్
కన్సర్వేటివ్ ఖజానా మంత్రి .. .. విశాలాంధ్ర 7-2-1954
శరచ్చంద్రిక: దీర్ఘ కవిత (అదుగో మళ్ళీ కవిత్వం అనుకునాన్నను మొదటె నేను వెన్నెల పేరెత్తితే చాలు వెరెక్క్రిపోతుంది మనస్సు)
యింతకీ యీ భూమికి ఏ మాత్రం యీడొచ్చిందని
సగటు మనిషి వయస్సు పదకొండో పన్నెండో!
అంతా బాగానేఉంది అంతా సుఖంగానే ఉన్నారని
అన్నానంటే మాత్రం అది అబద్ధమే అవుతుంది!
చంద్రునికో నూలుపోగన్న సామెత ఊండనే ఉంది
తీసుకో ఈ దారంలాంటి తేలికైన గీతాన్ని!
ఎలాగైనా నువ్వు మాకు ఏకరక్త బంధువుడివి
నీకు కాకపోతే ఎవరితో మా ఘోషలు చెప్పుకోవాలి?
ఇదుగో జాబిల్లి నువ్వు సముద్రంమీద సంతకం చేసేటప్పుడు
గాలిదాన్ని చెరిపెయ్యకుండ కాలమే కాపలా కాస్తుందిలే! ఆలిండియా రేడియో - కృష్ణా పత్రిక 23-10-1854
కప్పెట్లు
ప్రభుత్వం ముద్రించిన పద్మశ్రీలు
ముట్లుడిగిన ముత్తవ్వలు, ఛద్మ స్త్రీలు
సినిమా రచన సులువనుకుంటారు కొంతమంది
అది పొరపాటు లక్షల జనాన్ని మెప్పించాల్సియుంది!
ఢంకా 1955
పేరడీ - శ్రీశ్రీ
ఏవి తల్లి నిరుడు మురిసిన ఇనపరచయితలు?
కృష్ణశాస్త్రపుటుష్ట్రపక్షీ దారితప్పిన నారిబాబూ
ప్రైజుఫైటరు పాపరాజు పలకరెంచేత?
ప్రజాస్వామ్యపు పెళ్ళికోసం
పండితానారాధ్యుడాడిన
వందకల్లల పందిపిల్లల
ఆంధ్రపత్రిక ఎక్కడమ్మా
పిలకశాస్త్రుల పనికిమాలిన
తలకుమించిన వెలకు తగ్గిన
రణగొణధ్వనులు! ..ఢంకా 1955-56
(తన కవితకు తానే పేరడీ వ్రాసుకున్న కవి శ్రీశ్రీ. సాధారణ కవితాభిమానులకు శ్రీశ్రీ కవిత్వానికి పేరడీ వ్రాసిన జరుక్శాస్త్రి గురించి బాగ గుర్తుండివుంటుంది - ''నేను సైతం కిళ్ళీ కొట్లో బాత బాకి నెగరకొట్టా'' )
నోట్: ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు! ది స్నోస్ ఆఫ్ ఈస్టర్ ఇయర్ కు అనువాద గీతమునకు
అపహాస్యగీతము)
''కవితా ప్రయోజనం''
ఆరుద్ర-శ్రీశ్రీల సంయుక్త సంభాషణపూర్వక దీర్ఘ కవిత
శ్రీశ్రీ:
'' న్యాయం గెలుస్తుందన్నమాట, నిజమేకాని-గెలిచిందంతా న్యాయంకాదు
బాగా ఆడి ఓడిపోయిన ''టీం''కి - ప్రజల సానుభూతి ఎప్పుడూ ఉంటుంది''
'' స్పర్థసే వర్థతేగా విద్య - అర్థమైన, స్పర్థ
అనర్థకమైన సస్పర్థ - అంటూ ఉండనే ఉన్నాయి''
అంటూ సాగిన అరుద్ర కవితకు మాధానం పై కవిత
ఆరుద్ర:
పల్లెపదం మంచిది విన్నప్పుడు - ఝల్లుమంటుంది విదేశీయుని గుండె
ప్రబంధం గొప్పది చదువుతున్నప్పుడు - చుర్రుమంటుంది పాఠకుని మెదడు
సంప్రదాయం తెలియాలి మొదటిదానికి - సంస్కారం కావాలి రెండోదానికి
ఏది మహాకావ్యం - ఏది పూజనీయం!
శ్రీశ్రీ
మహాకావ్యానికి క్రెటీరియా -సైజు, బరువూ కాదయా
నిన్నటి మహా కావ్యం 18 పర్వాలైతే - నేటి మహా కావ్యం 18 పేజీలే!
-- 10-2-1957
వీళ్ళే నా వాళ్ళు
వీళ్ళే నా వాళ్ళు
వాళ్ళే నా కళ్ళు
వీళ్ళ బతుకులోంచి నేను
విశ్వాన్నే వీక్షిస్తా
వీళ్ళకపాయం రాకుం
డా వీళ్ళని రక్షిస్తా!
- తెలుగు సంక్రాంతి 12/1957
అరుణ చరణాలు:
అయినా గోవాకన్నా గొప్పది
భారతీయాత్మ
పందికొక్కుకు ఆత్మవుంటుందా
పనికొచ్చేమాటేదైనా చెప్పండి!
ప్రయోజనానికి
ప్రయోజనం లేదు
ప్రయోజనంలేనిదాన్ని
పరిత్యజిస్తుంది లోకం! --1960 - వాణి
కేరళలో శెగట్లు:
నాకు తెలుసు నాకు తెలుసు - చదరంగం నాకు తెలుసు
కేరళ చదరంగం - నాకు తెలుసు నాకు తెలుసు
ఆఖరి పోటీ జరిగే - ఆ దినానదేవునాన
ఎర్రబంటు తోసిరాజు - వెర్రిరాజు ఆటకట్టు --విశాలాంధ్ర 1959
లుముంబా కోసం:
అనుకున్నదంతా అయింది - నీ కొమ్మలు కోసేవారు
నిన్ను చంపేసారు - చంపిన గ్రామానికి 8 వేల డాలర్లు
ఖకుమానం చేసేసారు!
'యల్'లు మొలుస్తాయి - యల్ ఫర్ 'లెనిన్'
యల్ ఫర్ లుముంబా - గుడ్ మార్నింగ్ ఆఫ్రికా
- విశాలాంధ్ర 1961
మున్నుడి:
చెవులు విప్పి మనసు విప్పి-కనులు విచ్చి వినవయ్యా
కేథలిక్కు కెన్నడీ బోల్షవిక్ మున్నుడి!
అరువులిచ్చి, కరువు తెచ్చి-ఋణంపెట్టి, రణంతెచ్చి
జనంధనం ఇంధనమై-చరణ కరాబంధనమై ..
నీ మతాన్ని నీ హితాన్ని-నీ గతాన్నికెలుకుతాం
చీకట్లనుతరుముతాం-నీ హిట్లరు పాతదనం
చావాలని కసురుతాం-విన్నావా కెన్నడీ
శ్రీశ్రీశ్రీ మున్నుడి ... విశాలాంధ్ర 1962
దీర్ఘాలు:
ఈనాడూ ఏనాడూ
నీనేను - నానీవు
తాజాగా రోజాలా
ఆడాలే పాడాలే
నాదానా ఓచానా! ... 11/1963 నవత
వసంతం: యుగళగీతం
కలలు కనే నీ కన్నుల సన్నల
వలపుల వెలుగులు విరిసేను
సంతసమొసగు వసంతవిభావపు
తలపులు నిన్నే పిలిచేను ..ఆలిండియా రేడియో వాణి 22-2-1964
ఉగాది వేళ:
అదేమిటి ప్రవేశమెంతో సరదా నాకు
అలాగనే పలాయనాలు ఘబరానాకు
సమాధిమీదకార్చలేను నక్రాశ్రువులు
ఉగాది మీదజల్లగలను ఊహాంశవులు
ఉగాది దేవరా .. ..
వీర వియత్నాం విముక్తి సైన్యాలకు అంకితం ఆలిండియా రేడియో-మద్రాసు -1964? వాణి
ఏవరిదీ ఉగాది?
అతడు: ఇదిగో ఇంకో ఉగాది - ఎవరిదీ ఉగాది?
ఆమె: అడగాలా? ఇదనీదీనాదీ - మన భవితల సుఖాల పునాది
అతడు: కాలం మనదే-లోకం మనదే!
ఆమె: అవి తెచ్చే రుచులన్నీ మనకే!
.ఆలిండియా రేడియో మద్రాసు వాణి 1965 మార్చి 22 - ఫునఃప్రచురణ: ఆంధ్రజ్యోతి 1967 ఏప్రయల్ 2
జవాబు రాని ప్రశ్న:
అదికాదు నాకు తెలియకడుగుతున్నాను
ఏవిటీఘోరం?
అబద్ధాలు ప్రచారం ప్రకటించడంలో
అలవాటి పడిపోయిన - కాదు
అంకితమైపోయిన
ఓ దుర్వార్త పత్రికూరా? చెప్పండిఈ వార్త నిజమేనా?
బహుశః నిజమే అనుకోవాలి
(అప్పుడప్పుడో భయంకర సత్యం ప్రకటిస్తారు - అప్పుడే మీ అబద్ధాలకు విలువ)
--దేవరకొండ బాల గంగాధర్ తిలక్ 44వ యేట 30-6-1966న చనిపోయిపుడు ఆ వార్తను చదివి శ్రీశ్రీ స్పందించిన తీరు -- విశాలాంధ్ర జూలై 1966
మళ్ళీ రష్యాకు వెళ్ళుతున్నాను .2
మరోమారు భవిష్యత్తులోకి పయనిస్తున్నాను
మహీతత స్వర్గం వైపు
మహాయాత్ర సాగిస్తున్నాను
...కానీ నాకు తెలుసును
ఈ మాటంటే అందరూ
విరుచుపడతారు నామీద
శ్రీశ్రీగాడు గప్పాలు కొడుతున్నాడంటారు
కవిత్వాలు కడుతున్నాడంటారు.. - విశాలంధ్ర - 1967
యువ కవిత:
కవనానికి వచనానికి నడుమగల
సరిహాద్దులు చెరిగిపోయిన యీనాడు
శబ్దాన్ని నిశ్శబ్ధంతో తర్జుమా చేయగల
శక్తివంతమైన యంత్రాలున్న యీనాడు
శవత్వం పాశవత్వం పెరిగి
నవత్వం తరిగి/దానవత్వం సర్వత్రా/
ద్రంష్ట్రలు కొరుకుతున్న నేడు
యువత్వం వెనుకంకవేస్తున్న యీరోజున
కిత్వం చెప్పడమంటే మజాకాలా? -- నవత - జూలై1967
సౌమ్యవాణి మానిఫెస్టో:
పగలు వెనుక చీకటులు –
రేయి గడిచి వెల్తురులూ
వస్తాయనడానికి - జ్యో
తిష్కులతో పనేలేదు.
శాస్త్ర జా ఞనంమధ్యను
చాదస్తం నిండవచ్చు
మూడుకాళ్ళ కుందేళ్ళకు
మూఢభక్తులుండవచ్చు
మానవులంతా ఒకటని
మనిషి గ్రహించే సుదినం
యింతట్లో వచ్చే సూ
చనలేవి కానరావు!
రాష్ట్రాల్లో రాజకీయ
మర్కటాలక్కుటాల
సర్క్స్ ఫీట్లు పందెపు
కుక్కుటాల పోట్లాటలు
భాషలవారీ సేనలు
ప్రజారక్షకొరకేనట!
శివాల సేనలు చేసే
సవాలు సుస్పష్టం కద!
అసలు సమస్యల జోలికి
ససేమిరా పోనివాళ్ళు
స్వప్రయోజనాలకు, భే
షైన రంగు పులుముతారు! ఆలిండియా రేడియో 19-3-1969
జన్మదినోత్సవం:
అమ్మకి చాల సుస్తీగా ఉందంటె
రెక్కలు కట్టుకుని ఎగిరివచ్చాను
ఛఛ! దొంగ టెలిగ్రాం!
అమ్మ బాగానే ఉంది-
అయినా పత్రికల్ని నమ్మకూడదు
గోరింతలు కొండంతలు చేస్తాయి!
ఫ్రెంచి త్రివర్ణ పతాకం
లిబర్టీ,ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీలకి
ప్రతీక
అలాగే మన మువ్వన్నెల జెండామీద
అజాఞనం, అనారోగ్యం, నిరుద్యోగం
అక్షరాలు కనబడతాయి నాకు! 10/1969
అనువాదాలు:
నా మీది ఫిర్యాదు - వాల్టే విట్మన్ (అమెరికన్ కవి) - అరుణరేఖ మే/జూన్ 1949
కామ్రేడ్ -- -- ,,
జాఞనోదయం ఇ.ఇ. కమ్మింగ్స్ ,,
లెనిన్-1 ధారాళానువాదం విశాలాంధ్ర పక్షపత్రిక 12/1948
లెనిన్-2 '' ఈ నిర్జీవపు గుడ్లలోంచి
భావాలను పొదగ లేక
మమూలు ఊహలతో
మహత్వాన్ని కొలువలేము
చేతలు మెదడు చాలవు
అతణ్ణి తెలుసుకోడానికి
ఈ కొలతల్తో నా ''లెనిన్''
ఎవరని నిర్ణయించేది? విశాలాంధ్ర పక్షపత్రిక 12/1949
సింహగర్జన: ప్లాబో నెరుడా అరుణరేఖ, మే/జూన్ 1949
ఎలమర్రు - కాటూరు:
అణగారిన ప్రజలగుండెలాగవులెముమ్మాటికి
దిగజారిన తిరుగుబాటు తిరిగిలేచునొకనాటికి
చెలరేగిన ప్రకలయెదలజ్వాలదుగ్రమాహాగ్రహార్చి
జాఞపకములుగా నేస్తం-చరిత్ర చెప్పే సత్యం! (హరీంద్రనాథ్ చటోపాధ్యాయ) - 1-12-1951
శాంతిదూత: పుబెలో నెరుడా
స్సామవేదం:
కాంగ్రెస్ యుద్ధం - రూల్స్ ప్రకారం
కాగితాలతో - నామకార్థకం
అడపాదడపా అంతఃకలహం
అయితే బిల్కుల్ అహింసాత్మకం!
(గురజాడ అప్పారావు 1908లో ఆంగ్లంగీతానికి పేరడీ అనువాదం)
13-11-1953 తెలుగు స్వతంత్ర
విశాలాంధ్రలో ప్రజారాజ్యం
శక్తి కోసమే నడు - ముక్తి కోసమే మను
విముకి ్తకోసమే మను
విశ్వశాంతి క్రాంతికోసమే మనస్సులేకమై
నడూనడూ - భయం గియం వీడు!
(శక్తికేలియే చలో - అనే హిందీగీతానికి అనువాదం)
విశాలాంధ్ర 1955
గృహోన్మూలంగా - వ్లాదిమిర్ మయకోవస్కీ - విశాలాంధ్ర 17-4-1955
చలికాలపు ఉదయం: అలెగ్జాండర్ పుష్కిన్ - సోవియట్ భూమి
పునః ప్రచురణ: తెలుగు స్వతంత్ర: 25-1-1957
హేమంతం: నికలాయ్ సెక్రసోవ్
గీతం: అలెగ్జాండర్ ఫ్లెషిన్ - సోవియట్ భూమి 3/1968
దృశ్యం: లాలిసా వాసిల్సేవా - సోవియట్ భూమి 3/1968
ఈ రోజు విసుగ్గా ఉంది: కోన్‌స్తాంతిన్‌వాన్ షెంకిన్ - సోవియట్ భూమి 3/1968
నిరాడంబర సుందరకాలం కోన్‌స్తాంతిన్‌వాన్ షెంకిన్ - సోవియట్ భూమి 3/1948
పని విలువ:
కష్టాలు మరచు వేళ
వస్తాయి జాఞపకాలు
గర్మాగరం కర్మాల
యాల పరిమళాలు
అఖండ మేఘమాల
నాగేటి మేటి చాలు
రోదించు గూడ్సు రైలు
నరజాతి పనులవల్ల
సుఖశాంతులనుభవించు
పని జీవితావృతము
పనిచీల్చు సందియమ్ము
శ్రమియించి దినము దినము
జీవించవలెను మనము
ద్మిత్రీకవలియోన్ - సోవియట్ భూమి
పువ్వు పేరు చంపకం: మూలం ఒరియా - ఆలిండియా రేడియో 1968 జనవరి 26 వాణి 1968 మార్చి 7
నవ వర్ష సుందరి: ,, (కుమారితులసీదాస్) - విశాలాంధ్ర
వి.ఐ.లెనిన్: సోవియట్ భూమి 11/1969
లెనిన్ పేరిట సెకోయా చెట్టు: ఆంద్రేవోజ్నెసెన్స్కీ సోవియట్భూమి 11/1969
లఘు కావ్యాలు:
1. మేమే (శ్రీశ్రీ, అబ్బూరి, ఆరుద్ర) -- '' ఏల్చూరి సుబ్రహ్మణ్యానికి ''
రాసిందేదో రాసేసాం
తీసుకొనుము తోచినంత తీపో, చేదో
సీసాపయినేగా మన
ధ్యాస - హమేషా, గళాసుదాల్చిన ఏసూ!
( యిలాంటివి 29 కవితలున్నాయి)
18. చిరిగిన చెడ్డీలం - చెరలో కడ్డీలం
మృత్యువు రవికలో - పగిలిన పాలబుడ్డీలం
భగవంతుని కన్నీళ్ళం - ముచ్చటగ మూణ్ణాళ్ళం
వాగలేని బాజాలం -వెన్కిమరిపోజాలం
29. చెరబట్టిన భయాన్ని నరుకుదాం
చెదబట్టిన గేయాన్ని కొరుకుదాం
వెర్రి మొహాలను గుర్తుపట్టటం
మర్రి చెట్లకు నామాలు పెట్టటం
ప్రారంభించి గులాబీపూల
ముళ్ళు పెరకుదాం - జూలై 1954 త్రిలింగ
ప్రాస క్రీడలు
ఏక్ దో తీన్ చార్
పాంచ కడీదేవు
వాడేవీడు వీడేవాడు
శ్రీనివాసరావు!
పొడిచేస్తామని చెప్పిన
మన కాంగ్రెసు వారు
''తడి'' రాష్ట్రాలన్నిటినీ
''పొడి''చేస్తున్నారు!
ప్రజా జీవితపుదారుల - పయనించేవారలు
రకరకాల విమర్శలకు - తలయొగ్గక తీరదు
వ్యక్తులకు ప్రైవేటు బ్రతుకు - వారివారి సొంతం
పబ్లిక్‌లో నిలబడితే - ఏమైనా అంటాం!
అరెయార్ యిదరావ్ - దేఖో
ఆంధ్ర దిన పత్రిక
పెట్టుబడికి కట్టుకథకి
పుట్టిన విషపుత్రిక
పతకాల తలరాతలు
పసందైనా బాకా
ప్రజాస్వామ్య పార్టీలకు
పదేపదే కాకా!
కొంతమంది కుర్రవాళ్ళు - పుట్టుకతో వృద్ధులు
పేర్లకి పకీర్లకి/పుకార్లకీ - నిబద్ధులు
నడిమి తరగతికి చెందిన - అవగుణాల కుప్పలు
ఉత్త మొద్దురాచ్చిప్పలు - నూతిలోని కప్పలు
తాతగారి నాన్నగారి - భావాలకి దాసులు
నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు!
కాంగ్రెసు కింకా యెందుకు కాయకల్ప చికిత్స
దానిపేరు చెపితేనే మేరలేని జుగుప్స
మేలుకొన్న ప్రజలకెవరు
మేలుచేయతలంతురు?
వారలకే అధికారం
వారే జయింతురు!
14-11-1954 విశాలాంధ్ర
లిమరిక్కులు
క్విన్వన్ -
కొత్త మంగళం సబ్బు
పాత చింతకాయపచ్చడి రుబ్బు
మనకదంతా తబ్బిబ్బు
అయినా కవిత్వం కొట్టదుగబ్బు
అది చదివితే హృదయం ఉబ్బు
పాపనాశనం -
గంగ
లో మునుగంగ
పాపాలు పోతాయని ఒక దొంగ
కాశీకి వెళ్ళి గంగలో బుడుంగ
ని మునింగి చనిపోయాడు చల్లంగ
మెదళ్ళకి కళ్ళు -
ఆలోచించడం
అంటే ఊకని దంచడం
కాదు ఊహల్ని పెంచడం
వ్యధల్ని తుంచడం
సుధల్ని పంచడం!
RIP for a VIP
అమెరికా ప్రెసిడెంటుకు కూడ
రక్షణ లేదోరి బుల్లోడ!
నీ యిల్లు ఒక చిల్లి ఓడ
నీ స్వేచ్ఛ సుడిగాలిమేడ
వదిలించుకో యింక ద్వేషాల పీడ
గద్యపద్య చింతామణి:
పద్యం
ఎక్కువా లేక గద్యం
ఎక్కువ అనే సమస్య అభేద్యం
అయినా ఘంటావాద్యం
గానే నంటూ నీ రెండూ నాకే నైవేద్యం!
CRED
నా యింటి పేరు ప్రపంచం
ప్రజలే నా కుటుంబం
వెదజల్లుతా దిగ్ధిగంతం
అభ్యుదయ సుగంధం
అప్పుడు నా జీవితమే ఒక ప్రబంధం
సినిమా పాటలు
ఆహుతి ''హంసవలె నా పడవా-ఊగుచురావే
ఊగుచు రావే'' 1949
నిర్దోషి ''హృదయమె నీతి
ఈ జాతికి జ్యోతి
ఇదే హారతి - మా భారతి'' 1951
మరదలు పెళ్ళి '' నరుడా-జడుడా
పామరుడాడడడా
నిజం దాచడం నీతరమా
నీతరమా నీ తరమా 1952 '' అనురాగం
అంబరమైతే
ఆనందం సాగరమైతే
స్వర్గానికి నిచ్చెన వేస్తాం
మరణానికి ప్రాణం పోస్తాం! '' ,,
అక్కా చెల్లెళ్ళు వినరాని మాటలే విన్నావా?- కనరాని చేతలే కన్నావా?
అనుకోని ఆరడికి అదిరపోయావా?-యిలువీడి జాలిగా కదిలిపోయావా? 1953
లోకం అమతా గారడీ - అల్లిబిల్లి గారడీ
బతకాలంటే ప్రత ఒక్కడు - కావాలయ్యా కిల్లాడి! 1953
పెంపుడు కొడుకు: ఉన్నవారికె అన్ని సుఖాలోరయ్యోరయ్యో
లేనివారి గతి యీలోకంలో నుయ్యో గొయ్యో! 1953
కన్నతల్లి: డేగలాగ వస్తా - తూరీగలాగ వస్తా
నేనూగీతూగీ వస్తా -మజా చూపిస్తా! 1953
ప్రపంచం: కళయే నవ కళయే
మంగళమవు రసానంద సామ్రాజ్యము
మధుర మాధురీ సలలితము 1953
అమరసందేశం మానస లాలస సంగీతం
మధుమయ జీనన సంతోషం
నూతన చేతన సంగీతం 1954
తోడి కోడళ్ళు నలుగురు కలసి పరపులు మరిచి
చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం .. 1957
మాంగల్య బలం వాడిన పూలే వికసించెనె -చెర
వీడిన హృదయాలు పులకించెనే 1959
తెలియని ఆనందం నాలో
కలిగినదీ ఉదయం
పరవశమై పాడె నా
హృదయం ! 1959
గాంధారీ గర్వభంగం : (డబ్బింగ్ చిత్రం)
పదునాలుగు లోకముల ఎదురేలేదే
పదునాలుగు లోకముల ఎదురన్నదేలేదే! 1959
చెవిలో రహస్యం: ఆ చెవిలో రహస్యం - ఈ చెవిలో రహస్యం
అన్నికి సిద్ధపడదాం - యిదే అవసరం అవసరం
వెలుగు నీడలు: (ఆణి ముత్యమనతగ్గ పాటల/మాటల తూటాలు పొదిగిన విలవైన,
కలకాలం విశ్వసనీయత కలిగిన గీతమిది!)
'' పాడవోయి భారతీయుడా-ఆడి-
పాడవోయి భారతీయుడా
నేడే స్వాతంత్య్ర దినం - వీరుల త్యాగ ఫలం
నేడే నవోదయం - నీదే ఆనందం! 1961
ఓ రంగయో - పూల రంగయో
ఓర చూపు చాలించ సాగిపోవయో
పొద్దు వాలిపూతున్నదోయ్ -యింత
మొద్దు నడక నీకెందుకోయ్ .... 1961
కలకానిది విలువైనది బ్రతుకు
కన్నీటి ధారలలోనే బలిచేయకు! .... 1961
చిట్టి పొట్టి పొన్నారి పుట్టినరోజు
చేరిమనం ఆడిపాడె పండుగరోజు
వేడుకగా యీ పూట
ఆడుదమా దొంగాట! .... 1961
చల్లని వెన్నెల సోనలు - తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసి నవ్వులే - మంచి ముత్యముల వానలు! 1961
ఇంటికి దీపం యిల్లాలే:
వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అదిమరి ఎవరు తెలియరాని మధుర రహస్యం! 1961
బావా మరదళ్ళు
పయనించే మన వలపుల
బంగరు నావ
శయనించవే హాయిగ
జీవిత తార! నా జీవిత తార! 1961
భార్యా భర్తలు: మధురం మధురం - ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం - ఈ సమయం 1961
ఏమని పాడెదనో యీ వేళ
మానస వీణ -మవునముగా నిదురించేవేళా
ఏమని పాడెదనో ....
జోరుగ హుషరుగా - షికారు పోదమా
హాయి హాయిగా - తీయ తీయగా .....
పదండి ముందుకు
పదండి ముందుకు పదండి తోసుక
కదంతొక్కుతూ కదలండి
స్వరాజ్యమే మనజన్మ హక్కనీ
సమస్త జగతికిక చాటండీ .. 1962
ఆరాధన:
నా హృదయంలో - నిదురించె చెలి
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై
నటనమాదే నీవె - నన్ను దోచినావా .. 1962
వెన్నలలో వికాసమే - వెలగించెద నీ కనుల
వేదన మరచి ప్రశాంతిగ- నిదురించుము ఈ రేయి .. ,,
కులగోత్రాలు:
మామా శత్రు భయంకరనామా
అందానికి చందమామా
బలమున గామా నీవే కదా మా ధీమా
గోధామా - విశ్వదాభిరామా మామా! .. 1962
పునర్జన్మ:
ఓ సజీవ శిల్ప సుందరీ
నా జీవన రాగ మంజరీ
ఎవరివో నీవెవరవో
ఎవరివో ఎవరివో .. 1963
బొబ్బిలియుద్ధం:
సొగసు కీల్జడదానా
సోగ కన్నుల దాన
వజ్రాలవంటి పల్వరుసదానా! ---
మురిపించే అందాలే - అవి నిన్నె చెందాలె
నాదానవు నీవేలే - నీవాడను నేనేలే! ---
నిను చేర మనసాయెరా - నా స్వామి
చనువార దయసేయరా!
విడిదికి రమ్మని చాల వేడితిరా
బిడియము నీకేలరా దొరా! --- 1964
రాముడు - భీముడు:
ఉందిలే మంచికాలం ముందుముందున
అందరూ సుఖపడాలి నందనందనా -- 1964
డాక్టర్ చక్రపాణి
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ- అదే స్వర్గమూ -- 1964
నర్తనశాల
ఎవరి కోసం ఈ మందహాసం
ఒక పరి వివరంచవే సొగసరి!
చెలిమి కోసం - చెలి మందహాసం
ఏమని వివరంతునో గడుసరి! -- 1964
దేవత: బ్రతుకంత బాధగా - కలలోని గాధగా
కన్నీటి ధారగా - కరిగిపోయె
తలచేది జరుగదు - జరిగేది తెలియదు
బొమ్మను చేసి - ప్రాణము పోసి
ఆడేవు - నీకిది వేడుక --- 1965
పంతాలు పట్టింపులు
ఇనుకోరా - ఇనుకోరా
ఈ మల్లన్న మాట యినుకోరా --- 1969
మానుషులు మారాలి:
సత్యమే దైవమని - అహింసయె పవిత్ర
ధర్మమని వచింపచిన ప్రవక్తవు - సమస్త
మానవాళికి సుజాఞన మార్గదర్శి -- 1969
అరుణ పతాకం ఎగిరింది
కార్మికలోకం గెలిచింది
మానవులంతా ఒకటనిచాటె
మరోప్రపంచం పిలిచింది! -- 1969
మారాలి - మారాలి
మనుషులుమారాలి-అందరి
మనసులు మారాలి -- 1969
యిలా ఎన్నో శ్రీశ్రీ కీర్తిని దిగంతాలు వ్యాపించిన ఆణిముత్యాలు 'పాటన్నది బ్రతికున్నంత కాలం' ఆ గీతాలు మారు మ్రోగుతుంటాయి. జాతీయ అవార్డు సాధించిన ''తెలుగు వీర లేవరా దీక్షబూని సాగరా'' (అల్లూరి సీతారామరాజు చిత్రం) ముఖ్యమైనదిగ పేర్కొనాలి.
విప్లవ గీతాల సరసన సరస లలిత శృంగార పాటలలో తన ప్రత్యేక ముద్రని చూపించారు శ్రీశ్రీ. సినిమాల అనువాద కథకుడుగా పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థికంగా కుదేలయిన సంఘటనలెన్నో. అయినా అన్నిటిని తట్టుకున్నారు.
కథకుడుగా శ్రీశ్రీ
ఆ గుండెల చప్పుడు:
నిజం! భయపడ్డాను! భయపడుతున్నాను. ప్రచందమైన భయంతో వణికిపోతున్నాను...
అంటూ ప్రారంభమైన కథ...
వినండి వెధవల్లారా! నిజం చెప్పేస్తున్నాను. ఈ బల్లచెక్కలు ఎత్తండి.
యిక్కడే యిక్కడే వెధవగుండెలు అరుస్తున్నాయి. అని గంతులు చించుకొని కేకలు వేసాను'' అంటు
ముగుస్తుంది.
ఎడ్గార్ అబ్లాన్పో - అమెరికన్ కథకుడు రాసినకథకు శ్రీశ్రీ అనువాదం - 1945 మే సూర్యప్రభ
బాధ కవిత్వానికి పర్యాయ పదం:
చక్కని పద్యాలు రాసినీకువినిపించాడే చవితినాడు, ఆ కుర్రాడు చాల బాధపడుతున్నాడని వినీవనగానే
నాకేదో వేదన, అణులేశం ఆవేశం. ఆమట్టునే ఆవేశం, ఆగ్రహం వచ్చి అటువంటి వాళ్ళ అవస్థల మీద ఖర్చు
పెట్టడానికి నా దగ్గర కన్నీళ్ళు లేవన్నాను. అంటూ మొదలై ..
రెందో రకం పద్యంలో కూడ బాధవుంది కాని బతికే బాధకాదు! బతికించే బాధకాదు.అంటూ ముగుస్తుంది.
3-1-1954 ఆంధ్రపత్రిక - 1963 నవత (ద్వితీయ సంచిక శోభకృతు(సం) - ఫాల్గుణ(మా)
ఐశ్వర్యం ఎదుట దారిద్య్రం:
సాయంకాలం వీపు మీద సవారిచేస్తూ వచ్చిన కుంటి బిచ్చకుర్రవాడు యిరుకు సందులో బాడుగ తీసుకున్న ఈస్ట్ అండ్ వెస్ట్ ఎగుమతి దిగుమాతల కంపెనీ గుమ్మం ముందు నిలబడి ''అంబా'' అని అరిచాడు.
అంటూ మొదలై .... తాళం కప్ప యిచ్చే సందేశాన్ని అర్థమచేసుకోకలఫలే అయ్యా అని అరచిన నోరు అయ్యో అని నిరశన ప్రకటిస్తే, ఆ యింటిముందు నిలబడి లాభమలేదని, ఆఖరికికతనికి కాళ్ళుబాధపడితే అప్పుడే కథ అంతమవుతుంది. --- 8-101954 - తెలుగు స్వతంత్ర
నాటికలు( కొన్ని):
అమ్మ: (కారల్ చాపెల్ -చెకొస్లోవాక్ రచయిత ''అమ్మ''కు తెలుగీకరణ (1939)( ది మదర్) ఇందులో బ్రతికున్నవారు, చనిపోయినవారు రంగంమీదకు వస్తారు.అయితే చనిపోయిన వాళ్ళు దెయ్యాలుకాని, ప్రేతాత్మలుకాని కారు. అమ్మ దృష్టిలో వారంతా బ్రతికే ఊన్నారు. అమ్మ రంగస్థలం మీదున్నపుడే వళ్ళు మామూలు మనుషుల్లా వస్తారు. అమ్మకాక వేరే బతికున్నవారున్నపుడు వారు రారు. దీనిని ప్రదర్శించడానికి ఆధునిక సాంకేతిక సదుపాయాలవసరం. నటీనటుల సామర్థ్యంతో యిది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యిది మూడు అంకాల నాటకం.
-- 1. 1952 లో అరుణరేఖ ప్రచురణ -నెల్లూరు.
-- 2. 1967 ఏప్రియల్ - సోషలిస్టు పబ్లికేషన్స్, విజయవాడ.
సుప్తాస్థికలు:(నాటిక)
నిద్రపోతున్న ఎముకలు. ఎముకలు నిద్రపోతాయనుకొందాము. నిద్రించడంతప్ప మరేమీ చెయ్యలేవనే అనుకుందాం. కాబట్టి కలలు కూడ కంటాయా? ఏమో ఒక కవి యిలా అన్నాడు.
కవి: అవి ధరా గర్భమున
మానవాస్థికా పరంపరల
సుప్త నిశ్శబ్ద సంపుటములు
అటనొకే దీర్ఘయామిని
ఆ నిశా శ్మశాన శయ్యకు
ప్రాతః ప్రసక్తిలేదు....
ప్రయోక్తతో పాటు కవి, సంధ్య, అంధకారం, నక్షత్రాలు, కొన్ని గొంతులు .... కవితలతో, సంభాషణలతో, ప్రకటనలతో... యిది రేడియో నాటిక. ఆలిండియా రేడియో/ అభ్యుదయ లో 2/1948 ప్రచురణ
కొక్కొరోకో: (రాజకీయ కుక్కుటేశ్వరం!) - రాజకీయ, వ్యంగ్య, హాస్య నాటిక:
పాత్రలు: రాముడు
లక్ష్మణుడు
హనుమంతుడు
తొలికోడి
డవారికోడి
తెలుగు
ఇంగ్లీషు స్వతంత్ర కోళ్ళు
కృషికార్లోకో కోడి
ప్రజాసోషలిస్టు కోడి
అరవ కోడి
ఎర్ర కోడి
గడ్డాల కోడి
టైపిస్టు కోడి
సంతకం కోడి .. యిలా మొత్తం 14 పాత్రలతో వర్తమాన రాజకీయ పరిస్థితులను తిలకించవచ్చును. 14-12-1952 - విశాలాంధ్ర
చతురస్రం:
ఎ: జ్ఞానం - 70 సం/ పు
బి: రాజ్యం - 50 సం/ స్త్రీ
సి: కళ - 10 సం/ ,,
డి: సిరి - 30 సం/ కవి
(1999 డిసెంబర్ 31న ప్రారంభమై 20 శతాబ్దంతో అంతమయ్యే కథ)
చతురస్రం ఎప్పుడో వ్రాయవలసిన నాటిక. శ్రీశ్రీని నిరీశ్వరవాదిగ చిత్రించేవారు కొందరున్నారు.అలాంటివారికి తెలియపరచేందుకు శ్రద్ధతీసుకుని ఈ నాటిక రాసినట్లు శ్రీశ్రీ అంటారు.
మూడుసార్లు మృత్యువును జయించాననిచెప్పారు. మరణమంటే తనకి భయంలేదని మానవుడు మరణం మీద విజయం సాధిస్తాడని నమ్మకం దానికి మూలమే యీ నాటిక - శ్రీశ్రీ
కావ్యరంగం - 6/1945 తెలుగు తల్లి
థాంసకాణి - 30-11-1947 - నవోదయ
ఒక కావ్య నాయక 07-12-1847 - ,,
ఏదో పర్వాలేదు ఆలిండియ రేడియో మద్రాసు 25-06-1954 - తెలుగు స్వతంత్ర
20 శతాబ్దం తెలుగు సాహిత్యం
(1900-1959) 4-1960 - ఆరధ్రదర్శిని
పాషాణకాకి (విశ్వనాథ వారి విమర్శకు జవాబు)-ఆంధ్రపత్రిక సారస్వతానుబంధము -5-11-1962
నా కాలం గురించి, నా గురించి, నేనే చెపుతున్నా: (అలెగ్జాండర్ నెస్తరెంకో వ్యాసానికి అనువాదం)
సోవియట్ భూమి ప్రచురణ
కొడవటిగంటికుటుంబరావు (కొ.కు.) - ఒక ప్రశంస:
(షష్ఠిపూర్తి సందర్భంగ పత్రికద్వారా అభినందన) - 1969 అక్టోబర్ సంవేదన
వాసిరెడ్డి భాస్కరావు - నాటకకర్త మరణానికి సంతాపం: 8-11-1957 విశాలాంధ్ర
సాహిత్య మహాత్ముడు - మల్లాది రామకృష్ణశాస్త్రి-కథకులు: 9/1965 మరణం వారి సంస్మరణ వ్యాసం
ఆనందవాణి - మ.రా.శాస్త్రి సంచిక
లోకబాల్యతిలక్ (దేవరకొండ బాల గంగాధర్ తిలక్) ఆమృతం కురిసిన రాత్రిరచయిత మరణానికి స్పందన
ఆనందవాణి ముద్రణ చివరకు మిగిలేది రచయిత బుచ్చిబాబు (20-9-1967 మరణం) సంస్మరణవ్యాసం -నవత 1968 జనవరి-మార్చి సంఘం సాహిత్యం -అరసం(మద్రాసు)ప్రారంభోత్సవోపన్యాసం - ప్రజాశక్తి 21-11-1945 సాహిత్యంలో విప్లవం - తెలుగు తల్లి - 1946 మార్చి ( 31-12-45 నుండి 2-1-46 వరకు రాజమండ్రిలోజరిగిన తృతీయ అరసం సభల ప్రారంభోపన్యాసం శ్రీశ్రీ. సభకు దేవులపల్లి కృష్ణశాస్త్రి
మహాసభలకు అధ్యక్షుడు
సాహిత్యం ఎందుకు? ఎవరికి?: (పై సభలో చర్చలో శ్రీశ్రీ)
ఏది విప్లవ పంథా?: 10/1946 - అభ్యుదయ
సాహిత్య విమర్శ: గతితార్కిక భౌతిక దృక్పథం ((dialectical Materialistic Criticism)
మనస్తత్వ పరిశీలన ((psycho analytical outlook-{Technique, Form, Content )
వివరణలతో వ్యాసం
సినిమాలో రచయితల స్థానం: - కృష్ణా పత్రిక 25-8-1952
సాహిత్యంలో పాత/కొత్తా మంజీర జనవరి 1954
తెలుగు రచయితల సంఘం హైదరాబాద్ ప్రథమ వార్షికోత్సవం
-సాహిత్య గోష్ఠి, అధ్యక్షోపన్యాసం -1953 డిసెంబర్ 12, 13 అరుద్ర, పుట్టపర్తి, ఇంద్రగంటి పాల్గొన్నారు.
అరసం 5వ మహాసభ -ముఖ్యోపన్యాసం - విజయవాడ ''షాహిన్షామహల్''లో - జూలై 1955 -అభ్యుదయ
(అరసం అధ్యక్షుడుగా శ్రీశ్రీ, ప్రధాన కార్యదర్శిగా తుమ్మల)
ఆధునిక సాహిత్యం: 1956లో రాజమండ్రిలో జరిగిన విశాలాంధ్ర సంస్కృతీ సభల సందర్భంగా
14-12-1956
చైనా కళావేత్తలతో శ్రీశ్రీ - 5/1956 అభ్యుదయ
సంస్క తి: అఖిలభారత కమ్యూనిస్టు పార్టీ 6వ మహాసభ - 4/1961 విజయవాడ - సాంస్క తిక ప్రదర్శనల
అధ్యక్షుడుగా సజ్జద్జహీర్ ఉపన్యాసానికి శ్రీశ్రీ తెలుగు అనువాదం చెప్పారు.
నాట్యకళ - మార్చి/మే 1961
విశాలాంధ్ర - 9-4-1961
ఆధునిక కవిత్వం :
విఆర్ కాలేజి - ఆంధ్రసారస్వత సంఘంలో ఉపన్యాసం - జమీన్రైతు - 29-11-1968
కవిత్రయం:
''తిక్కన'' - నెల్లూరులో వర్థమాన సమాజం తరఫున జరిగిన కవిత్రయ జయంఇలో ప్రసంగం 16-2-1969
జమీన్రైతు 21,28 సంచికలు 2/1969
నన్నయ్యది: పాటకు అనువైన సంగీతమైన కవిత్వం - శ్రీశ్రీ
తిక్కనది: మాట్లాడే కవిత్వము/సంభాషణాత్మకశైలి - శ్రీశ్రీ
కవిత్వము - ఛందస్సు:
అనంతపురంలో జరిగిన నాటకోత్సవాలకు శ్రీశ్రీ వెళ్ళినపుడు సంప్రదాయ ఛందస్సును పాడుచేసినారనే నిందగు చీటీ పంపగా చెప్పిన సమాధానం - తెలుగు వెలుగు 24-10-1969
సామాజిక కవిత:
విద్వాన్ విశ్వం-శ్రీశ్రీల రేడియో చర్చ: మద్రాసు - రసమయి - వాణి జూలై 1954
శ్రీశ్రీ: చూడండి విశ్వంగారు మనం చర్చించబోయేవిషయం ''సామాకిక కవిత'' చమాజంలో
సంబంధంలేనటువంటి కవిత్వం అంటూ ఏ కాలంలోనెయినా ఉంటుందా? ప్రత్యేకించి ఈ విశేషం
చేర్చుకోవటం అవసరమంటారా?
వి.వి: అవసరమే అనుకుంటాను శ్రీశ్రీగారూ. ముఖ్యంగా నేటి పరిస్థితులలో ఒక్కొక్క కాలంలోను కవిత్వం
ఏదో విశష్టతను వెలువరిస్తూనే ఉంటుంది. కాని ఆ సంగతి స్పష్టంగా తెలియడంకోసమే పురాణ
కవిత్వమనీ, ప్రబంధకవిత్వమనీ, భావకవిత్వమనీ, అభ్యుదయ కవిత్వమనీ అనుకుంటూనే
ఉన్నాంకదా!
అంటూ ఆరంభమయి .....
శ్రీశ్రీ: మన యువ కవులు ఆ బాధ్యత తప్పకుండా నిర్వహిస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది
కొత్తగా రాస్తున్నవారిమీద వజ్రాయుధాలు నూరకుండ సానుభూతితో వారిరచనలను సమీక్షించి
ప్రోత్సహిస్తే కావలసినంత వైవిధ్యం మన యువ కవులనుండి ఆశించవచ్చు. క్షణక్షణం
మారిపోతున్న నేటి సామాజిక జీవితం నుంచి ఎప్పటికప్పుడు కొత్త కవులు పుట్టుకొస్తూనే
ఉంటారు. వారి కవితాంకురాలకు దోహదమిచ్చి పెంచడమే విమర్శకుల విధి. అప్పుడు మన
సాహిత్యం సర్వతోముఖంగా వికసించగలదు.
వి.వి. తథాస్తు!
ఆకాశం తెర చీల్చి - ఉష కన్యక దుహళించి
శ్రీకారం చుట్టుతోంది నీకు నాకూ మనకూ
వేకువ కాబోతున్నది తేకువ తెంపు సొంపు
చేకూర్చగ గొంతెత్తి కేకవేయి.
స్వస్తి సమస్తాఖిల బాధిత జనతా సఖ్యానికి,సుఖానికి!
స్వస్తిశ్రీరస్తు చిరంజీవులై సప|న మానవులకు!
శ్రీశ్రీ: తథాస్తు!
కవిత్రయం: అనే రేడియో ప్రసంగంలో '' ఏక కాలంలోనే పండిత పామరులుభయులనీ రంజింపచేసే గొప్ప కవిత్వం! ఈ ప్రామాణ్యం చూపించి ఇప్పటికీ, ఎప్పటికీ నేను తిక్కన, వేమన, గురజాడలు మహాకవులని చూడడం మానలేదు ''
-- ఆలిండియా రేడియో - హైదరాబాద్- తెలుగు దేశం 1954 25 అక్టోబర్
సజీవ రచన: సర్వధారిసంవత్సరం ''ఉగాది''కి ఏర్పాటు చేసిన రేడియో కవి సమ్మేళనంలోను, చర్చ కార్యక్రమంలో శ్రీశ్రీ పాల్గొన్నారు. ఆ భాగపు అంశాలిందులో ప్రచురణ 1-15 సంచిక - వాణి -ఆలిండియా రేడియో 1959
ఎందుకురాయాలి? ఆలిండియా రేడియో ప్రసంగం - జనశక్తి నవంబర్ 18/ ? లో ముద్రణ
సాహిత్యము/ప్రక్రియలు ఆలిండియా రేడియో ప్రసంగం - 7-12-1965 - వాణి ముద్రణ
ప్రబంధాల్లో శృంగారం: ఆలిండియా రేడియో ప్రసంగం - 7-12-1966 - వాణి ముద్రణ
నాకు నచ్చిన వచన శైలి: ఆలిండియా రేడియో ప్రసంగం - సృజన - ఫిబ్రవరి/ ఏప్రియల్ 1967
జనశక్తి ఇంటర్వ్యూ: '' మానవజాతి ప్రభాత గీతం'' - '' కమ్యూనిజం'' 25-1-1964
( సామ్యవాదమే మానవ సుప్రభాతము )
ప్రజారథం ఇంటర్వ్యూ; శ్రీశ్రీని గూడపాటి సాంబశివరావు 10-10-1969
సృజన ఇంటర్వ్యూ; శ్రీశ్రీని నవీన్ - సృజన ప్రత్యేక సంచిక 11/1969
ముందడుగు నాటకం:
ధనస్వామ్యం పరిణితిపొంది నేటి రంగ స్థలం మీదకూడ తన ప్రభావాన్ని ముద్రించింది. రాబోయే సామ్యవాద వ్యవస్థలో రంగస్థలం గోళాకారం వహించబోతున్నది. ఎక్కడ కూర్చున్న కనబడే నాటకం. అదీ అందుకోవలసిన ఆశయం. ఈ నాటకం పల్లెటూరి జీవితాన్ని చక్కగా తెలుపుతుంది. రైతులు ఏ విధంగా ముందడుగేస్తున్నారో నిరూపిస్తుంది. ఆకృతిలోనూ, అంతస్తులోను పురోగమనతత్వాన్ని ప్రదర్శించడమే యీ నాటకం విజయానికి కారణమనుకుంటాను నేను - శ్రీశ్రీ.
--ముద్రణ - ప్రతిభ ''చాలనీ'' 1945 ఏప్రియల్/సెప్టెంబర్
యోగి వేమన(చిత్ర సమీక్ష) : వాహినీవారి చిత్రం యోగివేమన 1947 జనవరిలో విడుదలయింది. ప్రివ్యూ చూచి వ్రాసినదిది.
'' వాహినీవారు వేమన జీవితాన్ని కథావస్తువుగ తీస్తున్నారంటే నేను కొండంత ఆశ పెట్టుకున్నాను. కాని తీరా చూస్తే చిత్రంలో వేమన లేడు జీవితం లేదు. ఒకరిద్దరి నటనా నైపుణ్యం (మోహనాంగి తల్లి, వేమన స్నేహితయడూ తప్ప) ఒకటి రెండు చోట్ల దర్శకత్వ ప్రతిభ (వేమన హృదయజ్వాలలు, అభిరామయ్య కొలొమి మంటలు) ఒకేఒక్కటి అదీ కపాలంలో శైశవాది వివిధావస్థలు మాత్రం ఆయా శాఖలో అద్వితీయంగా వున్నాయి.
ఇవి ఇండియన్ తీసిన ఏ చిత్రానికి తీసిపోదు. ఇవే వాహినీ వారి ట్రేడ్‌మార్క్ గల ప్రతిష్టకి కారణం.''
మాలి - 1947
మా భూమి:
ఈ ఒక్క విషయం సాధించినందుకే ప్రజానాట్య మండలివారిని ఎంతైనా అభినందించవచ్చు. కాని ''మాభూమి'' ప్రదర్శన ప్రాముఖ్యత అక్కడితో ఆగిపోలేదు. ముందు తరగతులనుండి చివరిదాక కూర్చున్న ప్రేక్షకులందరిలోనూ ఒక తన్మయత్వాన్ని కలిగించేదే నాటకం. నాటకాన్ని సరిగ చూడకలగటం నాగరికతకొక లక్షణం. మన ప్రజల నాగరికత ఈ నాటకమండలి వారి చేతిలో సురక్షతంగా ఉండగలదు. యిందుకు నేపథ్యం మొదలు నాటక కళాశాల ద్వారందాకా నిలచిన వివిధ బాధ్యతాపరుల ఏకాగ్ర సహకారానికి నా ధన్యవాదాలు..
1948 నవోదయ
మనుషులు మారాలి: 24-11-1969 - విజయభాను
జెమినీ వారి మనుషులు మారాలి చిత్రం గురించి వచ్చిన విమర్శలను పురస్కరించుకొని విశాఖలో
విజయభాను సంపాదకునికి శ్రీశ్రీ వ్రాసిన లేఖ. ఒక మళయాళ భాషాచిత్రాన్ని ఆధారం చేసుకొని కొన్ని మార్పులతో తెలుగులోకి ''రీటేక్'' చేసారు దర్శకుడు వి.మధుసూదనరావు. కథ, సంభాషణలు బొలిల్లముంత శివరామకృష్ణ, పాటలు శ్రీశ్రీ.....
''టి.ఎస్. ఇలియట్ శిల్పం'' రచన; హెలెన్ గార్డినర్ - క్రెసెట్ ప్రెస్- లండన్:
''ఇలియట్లో ఉన్న ఈ 'బాగా చెప్పడం' అనే గుణానికి ఎంతో మూర్చపోతారు'' శ్రీశ్రీ
కిన్నెర -1950 జూన్
1984: జార్జ్ఆర్వెల్ - సెకర్ అండ్ వార్బర్గ్ ప్రచురణ - బ్లూమ్స్బరీ - లండన్ -వ్యంగనవల - శ్రీశ్రీ అనువాదం
కిన్నెర -సెప్టెంబర్ 1950
త్వమేవా2హం: (లఘు టిప్పణి)
ఎ) భారతదేశం అంతట్లోకి రాజకీయంగా ఎక్కువ చైతన్యం చూపించే ప్రదేశం ఆంధ్రభూమి.
బి) నవ్య కవిత్వానికి ఈనాడు ఇండియా అంతటికీ అగ్రస్థానం తెలుగుభాషది
1) మొదటి విషయం - తెలంగాణా విప్లవంవంటి సంఘటనలు ఋజువు చేస్తాయి.
2)అరుద్ర వ్రాసిన ''త్వమేవా2హం''వంటి కావ్యాలు తార్కాణాలు.
పైథాగరస్ సిద్ధాంతాన్ని బోధిస్తుంది. దాన్ని ఆరుద్ర మార్క్సీయ వాదానికి అన్వయించాడు.
'' ఈ/కాంతను
చెరపట్టగ/రాకాసులు/తలపెట్టిరి
నక్కలు తిరిగే తో(కో)టలో
రాకాసిరాజొకడుండెరా''
కావ్యానికి ఆరుద్ర పెట్టిన పేరు ''తెలంగాణా''. దాన్ని మార్చమని సలహా యిచ్చింది నేనే. త్వమేవాహం అయింది.-శ్రీశ్రీ
త్వమేవాహం- 1949/జూలై కళాకేళిలో ప్రచురణ
దానికి శ్రీశ్రీ వ్రాసిన విమర్శ ముందుగానే 18-2-1949 తెలుగు స్వతంత్రలో అచ్చయింది.
''అందాక'': అబ్భురి వరదరాజేశ్వరరావు )1923) - చెరకాలం కావ్యంలో ఒక భాగం - అందాక - 1952లో
1954లో వరుస ముద్రణ పొందింది.
అందులో అచ్చు కాని పద్యం:
'' చెరకాలం ఔనని నీ
కరవాలం, ఒట్టు!లేదు కవితకు బిరడా
అరసీసా ఖాళీ చే
సి, రాచిస్తే కావ్యముల్ నశించవు వరదా!''
నా గొడవ:
కాళోజీ నారాయణరావు రాసిన నా గొడవ గేయ సంకలనావిష్కరణ సందర్భంగా ఆలంపురం సభలో శ్రీశ్రీ
చెప్పిన ప్రశంసావాక్యాలు: 12-1-1953
'' కాళోజీ లూయీ ఆరగాన్ (ఫ్రాన్స్ కవి)లాంటివారు. అలా ఎవరికి తెలియకుండ, అజాఞతంగానే ఉండి రచన సాగించారు. తెలంగాణా మూగజీవాల హృదయాల్ని ప్రతిబింబించే నా గొడవని ఆవిష్కరించడానికి నాకు ఎంతో సంతోషంగావుంది.
విశ్వశాంతి: రచన: ఆత్రేయ: (పూర్వయవనిక) ఒక విచిత్రమైన నాటకము. పాత్రలు వ్యక్తులు కాదు. సంకేతాలు నాటకరంగమనే వైద్యశాలలో ఒక చికిత్సా విధానమే యీ విశ్వశాంతి.దీనికి శ్రీశ్రీ ఉపోద్ఘాతం అందించారు.
అరుణాపబ్లికేషన్, నెల్లూరు వారి ముద్రణ 23-1-1953
సర్పయాగం:
రెంటాల గోపాలకృష్ణ రెండవగేయ సంకలనం యీ సర్వయాగం. నిస్సంధిగ్ధమైన సంకల్పబలం ఈ గీతాల్లో స్పందిస్తూ ఉన్నకారణమచేత వీటినక గ్రంథరూపంలో సంతరించవలసిన ఆగత్యం ఏర్పడుతోందని, శ్రీశ్రీ అభిప్రాయపడ్డారు. నవోదయ పబ్లిషర్ 1957
ముత్యాల సరాలు:
విశాలాంధ్ర వారి ''ముత్యాల సరాలు'' 21-7-1958న విడుదలయింది. దానికి పీఠిక శ్రీశ్రీ రాస్తూ
'' తెలుగు భాషకు ఖందాంతర ఖ్యాతి తీసుకురాగల సృజనాసామర్థ్యం ప్రదర్శించే మహాకవిగ ''గురజాడకి''
నా నమోవాక్కాలు అర్పిస్తున్నాను.
'' మంచి చెడ్డలు మనుజులందున - యెంచి చూడగ రెండు కులములు
మంచియన్నది మాలయైతే - మాలనేయగుదున్'' ఆన్నారంటే గాంధీజీ హరిజనోద్యమం ప్రారంభించడానికి ముందే గురజాడ ఎన్నడో ఈ విషయాన్ని ప్రస్తావించడం గమనించతగ్గది.
''కన్నుల కాంతులు కలువల చేరెను -మేలిమి చేరెను మేని పసల్
హంసలచేరెను నడకల బెడగులు -దుర్గను చేరెను పూర్ణమ్మ!
ఒక మహా కావ్యాన్ని చదివి ముగించిన అనుభూతి ఈ చరణంలో మనకి లభిస్తుంది! - ముత్యాలసరాల సొగసుకు పీఠికలో పొందు పరిచాడు శ్రీశ్రీ.
అంగార వల్లరి:
డా.కె.వి.రమణారెడ్డి 'అంగారవల్లరి' ని 31-8-1959 లో శ్రీశ్రీ పరిచయం చేస్తూ '' సంఘంలో మార్పుని సహించలేనివాళ్ళు, మార్పుని ఆహ్వానించేవాళ్ళున్నట్లే కవులలోనూ ఈ రెండు తెగలకు చెందిన వారుంటారు. రెండో తెగకు చెందిన కవులలో మొదటి శ్రేణికి చెందినవారిలో కె.వి.రమణారెడ్డి ఒకరు. అడగండి రమణారెడ్డిని ''నీవు విశ్వసిస్తున్న సత్యాలకోసం, సాంఘిక వ్యవస్థకోసం, సాంస ్కృతిక జీవనంకోసం పోరాడిన వీరులను అనుసరిస్తావా?''అని. ఏం సమాధానమొస్తుందో తెలుసా? '' ఓ తప్పకుండా! వారిలాగే జీవించడానికి సిద్ధం! వారిలాగే మరణించడానికీ సిద్ధం!'' అని రమణారెడ్డి సమాధానంచెప్తాడనడంలో నాకు సందేహంలేదు!
అందుకే మళ్ళీఅంతున్నాను రమణారెడ్డి కవిత్వమ నవ్య మానవుడి అభ్యుదయానికి దివ్యనీరాజనం!
ఆరు సారా కథలు:
సారాని రా.వి.శాస్త్రి సృష్టించలేదు. దాన్ని తాగిన నూకాలమ్మ, కుంచలమ్మలనుగాని, వాళ్ళని పట్టుకున్న పోలీసువాళ్ళనిగాని శిక్షించిన న్యాయాధికార్లనుగాని అతడు సృష్టించలేదు. మద్యనషేధం (పాపం శమించుగాక) విశ్వనాథసాస్త్రి సృష్టించాడని అతని విరోధలుకూడ అంటారనుకోను! నీలయ్య, గురవయ్య, అప్పారావు,మూర్తీ మీకు ఏరోజయినా కనబడతారు. ముత్యాలమ్మా, పోలమ్మా ఏ రాత్రయినా కనబడతారు.
అందుచేత రా.వి.శాస్త్రి సృష్టికర్తకాదు.
యువకులతరానికి చెందిన నేటి తెలుగు కథారచయితలలో రా.వి.శాస్త్రి రచనలే నేను ఆశించే రచనను సమృద్ధిగ ఆవిష్కరించగలుగుతున్నాయి.
రావి శాస్త్రి కథల సంపుటి ''ఆరు సారా కథలు'' 1962 మేలో విశాలాంధ్ర వెలువరించినప్పుడు
శ్రీశ్రీ రాసిన పరిచయమిది. -- 14-5-1962
నవత:
'' ఏదో ఫలానా కవిత, ఫలానా భాషలో కవిత్వం, ఆగిపోయిందనుకోవడం పొరపాటు. కవనఝరి జీవనది. వ్యక్తులు మరణిస్తారు. లేదా వారి వ్యాపకాలు స్తంభిస్తాయి. ఆయా కొత్త శక్తులు ఒకదాని తరువాత ఒకటిగ పుట్టుకొస్తూనే వుంటాయి.'' - నవత అనే త్రైమాసిక పత్రకను 'నక్షత్ర సప్తకం' అనే సంస్థ (1959) ద్వారా విద్యాధికులైన యువకులు హైదరాబాదులో ప్రారంభించారు. దానికి శ్రీశ్రీ ప్రధాన సంపాదకుడుగా రాసిన ప్రారంభసంచికలో వాక్యాలు:
కూనాలమ్మ-ఆరుద్ర:
ఆరుద్రగారి కూనాలమ్మ పదాలు గేయసంపుటికి శ్రీశ్రీ రాసిన గేయ ప్రశంస
15-1-1964(బెజవాడలో) దీన్ని రాసాడు. ప్రచురణ: జ్యోతి బుక్స్ 1964 జనవరి
ముమ్మాటికి: కూనాలమ్మ పదాలు
వేనవేలు రకాలు
ఆరుద్రదేవ్రాలు
అంటాడు శ్రీశ్రీ
కూనాలమ్మ పదాలు
లోకానికి సవాలు
ఆరుద్రచేవ్రాలు
అంటాడు శ్రీశ్రీ
కూనాలమ్మ పదాలు
కోరుకున్న వరాలు
ఆరుద్ర సరదాలు
అంటాడు శ్రీశ్రీ
మల్లారెడ్డి గేయాలు/శంఖారావం:
మల్లారెడ్డి గేయాలు చదివి దానిపై శ్రీశ్రీ బహిరంగ లేఖ రాసాడు:
'' ఈ పాతికేళ్ళలో నేను కూడబెట్టుకున్న కీర్తిని నువ్వు పాతిక కన్న తక్కువ కావ్యాలలో తస్కరించావని నీ మీద కేసుపెడుతున్నాను..... నీకు ఫ్రెంచి రాదు, ఇంగ్లీషు రాదు, సంస్కృతం రామరామ రానేరాదు. యిలాంటివాడివి నువ్వు కవిత్వం రాయడమేమిటి చెప్పు? - అంటూ అభినందన ప్రకటించాడు. - సవ్యసాచి (కడప) వారపత్రికలో అచ్చయింది. తర్వాత మల్లారెడ్డి గేయాలు ద్వితీయ ముద్రణలో ఈ లేఖ చోటు చేసుకుంది.
''హలో పాఠకుడా! మట్టిలోంచి మాణిక్యంలా కమ్యూనిజంలోంచి కవులు పుట్టుతారనటానికి దాఖలా మల్లారెడ్డి''
''మల్లారెడ్డి కవిత్వం యిప్పటికే బహుజనాదరన పొందింది. యివాళ నేను ప్రత్యేకంగా సిఫారసు చేయవలసినపనిలేదు. మంచికవిత్వం తనను తానే రికమెండు చేసుకుంటుంది. హాలో పాఠకుడా! యిక పుట తిప్పు, మల్లారెడ్డి కావ్య మాధుర్యాన్ని ఆస్వాదించు''..
1-2-1968 బెజవాడలో రాసియిచ్చాడు శ్రీశ్రీ - శంఖరావం-విశాలాంధ్ర ప్రచురణ
జీవితమధురిమ
డా. చిట్టూరి సత్యనారాయణ - చెవి, గంతు, ముక్కు ప్రత్యేక నిపుణులు మరదాసులో ప్రముఖ వైద్యులుగ స్థిరపడ్డారు. 1969 వారి కావ్యానికి శ్రీశ్రీ పీఠిక: ఆయన వృత్తి రీత్యా వైద్యుడు. అనగా మృత్యువుకి శత్రువు. జూవితం ఎంత మధురమయినదో ఆయనికి బాగ తెలుసును. దానిని ఈ రచన ద్వారా మనకు రుచి చూపించారు. అందుకు మనం సదా కృతజఞతచూపించితేచాలు.
ఆనందభిక్షువు:
సౌందరనందనం సరసన నిలపదగిన కావ్యం - వి.వి.యల్. నరసింహారావు కావ్యానికి ప్రశంసాత్మకమైన అభిప్రాయం
లేఖలు: శ్రీశ్రీ - పురిపండా అప్పలస్వామికి
9-7-1947 మద్రాసునుండి
30-5-1946 పెద్దపూడి నుండి
4-1-1946 హైదరాబాదు నుండి(ఎకాడమి ప్రెస్-103.అలెగ్జారోడ్, సికందరాబాద్)
(ఈ లేఖలో పేర్కొన్న జనాబ్ మొహమ్మద్ ఖాసింఖాన్: పశ్చిమ గోదావరి జిల్లా
కొవ్వూరుకు చెందినవారు. ఆంధ్రాయూనివర్శిటీలో చదివేరోజుల్లో శ్రీశ్రీకి
పరిచయం, స్నేహము. హైదరాబాద్ సంస్థానంలో ఉద్యోగం సంపాదించి,
శ్రీశ్రీకి, అవసరాల రామకృష్ణారావుకి ఊద్యోగాలిప్పించారు. ఆంధ్రసారస్వత్
పరిషత్‌కు పోటీగా తెలుగు ఎకాడమీ స్థాపించారు. (1943)
10-8-1947 మద్రాసు నుండి పు.అ.స్వామికి (దానిపై ఆరుద్ర చేవ్రాలు చేసారు)
21-10-1949 మద్రాసు నుండి(158 వి.ఎం.స్ట్రీట్, మీరషిబ్పేట, రాయపేట్)
ఈ లేఖలో ''నీల్ అవుర్ నందా'' హిందీ సినిమాని ఆహుతగా తెలుగులో తర్జిమా
చేసానని తెలిపారు శ్రీశ్రీ. వాసిరెడ్డి నారాయణరావు, నిర్మాతలు మరొకరు దర్శకుడు
జగన్నాథ్.
24-12-1949: మద్రాసు నుండి పు.అ.స్వామికి
23-6-1950 ,, ,,
28-8-1950 ,, ,,
20-9-1950 10-అరుణగిరి ముదలిస్ట్రీట్-మందవళి - పు.అ.స్వామికి
24-2-1952 విజయవాడనుండి - పు.అ,స్వామికి. (గ్రాడ్యుయేట్ కవున్సిల్కు నిలబడుతున్నట్లు
తెలిపిన ఉత్తరం 1953 లో మదరాసు విధాన మండలి సభ్యుడుగ కమ్యూనిస్టు
పార్టీ తోడ్పాటుతో శ్రీశ్రీ ఎన్నిక
11-10-1954 మద్రాసు నుండి పు.అ.స్వామికి
7-11-1954 ,, ,,
9-1-1958 ,, ,, (ఈ లేఖ ద్వారా - ధనార్జన విషయంలో మాత్రం ఈ
కాలం శ్రీశ్రీ మొత్తం జీవితంలోనే ఉచ్ఛథ. డబ్బింగ్ కింగ్ అనిపించుకొని
చాల ధనం గడించాడు. - అయితే ''కరి మింగిన వెలగ పండు కరణి'' ఆ సిరి
కరిగిపోయింది
11-12-1967 ,, ,, ( ఈ లేఖ ద్వారా 6-5-1926 లో శ్రీశ్రీ, వడ్డాది
సీతారామాంజనేయులు, పు.అ.స్వామి నెలకొల్పిన సాహితీ సంస్థ ''కవితాసమితి''
1967 నాటికి 41వ వార్షికోత్సవం జరుపుకుంటోందనే సమాచారం
తెలుస్తున్నది.)
13-11-1954 బొంబాయి నుండి తుమ్మల వెంకటరామయ్యకు. ఈ లేఖ ద్వారా శ్రీశ్రీ ప్రపంచ
శాంతి మహాసభకు ప్రతినిధిగా స్టాక్‌హోం వెళ్ళినట్లు, అది నవంబర్ 1954
నెలాఖరులో జరిగిందని. అప్పుడే మాస్కో, పారిస్, లండన్ కూడ చుట్టివచ్చినట్లు
తెలుస్తుంది.
23-12-1954 మద్రాసు నుండి తుమ్మలకు ఇంగ్లీషు లేఖ
08-03-1955 ,, ,,
ఈ లేఖ ద్వారా శాంతి మహాసభ సందర్భంగా రష్యా నుండి తిరగొచ్చిన
తర్వాత ''ఆంధ్రపత్రిక'' లేపిన కమ్యూనిస్టు వ్యతిరేక ఉన్మాదంతో శ్రీశ్రీ మీద
గాలిదుమారంరేగింది. 1955 ఎన్నికల ప్రచార సంరంభంలో తిరుగుతుండగ
హనుమాన్ జంక్షన్లో ఆయనకు మతిచలించిన సూచన ముదటిసారి
కన్పించింది. మద్రాసులో ఒక మెంటల్ హాస్పిటల్లో చేరి చికిత్సపొందాడని తెలుస్తున్నది)
20-5-1955 మద్రాసు నుండి తుమ్మలకు ఇంగ్లీషు లేఖ
8-7-1955 ,, ,,(జూలై 30,31లో ఆరధ్ర అ.ర.సం. 5వ
మహాసభ విజయవాడ)
3-05-1956 మద్రాసు నుండి తుమ్మలకు ఇంగ్లీషు లేఖ
23-2-1957 ,, ,,
12-6-1958 '' ''
19-6-1958 '' ''
24-4-1959 ,, (11 కెనాల్ బాంక్రోడ్) ,,
30-6-1959 ,, ,,(సినిమా ప్రకటన జతచేస్తూ లేఖ)
చెవిలో రహస్యం - డబ్బింగ్చిత్రం విడుదలయి, చాల నష్టపోయాను.
మాటలు, పాటలు శ్రీశ్రీ, దర్శకత్వం పి.శ్రీధరరావు,నిర్మాత వి.సి.సుబ్బరామన్
03-07-57 మద్రాసు నుండి తుమ్మలకు ఇంగ్లీషు లేఖ
21-07-59 మద్రాసు నుండి తుమ్మలకు ఇంగ్లీషు లేఖ
23-07-59 మద్రాసు నుండి తుమ్మలకు ఇంగ్లీషు లేఖ
20-02-61 మద్రాసు నుండి తుమ్మలకు ఇంగ్లీషు లేఖ
-1966 మద్రాసు నుండి తుమ్మలకు ఇంగ్లీషు లేఖ
16-3-1957 మద్రాసు నుండి ''హరి'' గారికి
(కిందటి ఎన్నికలలో దైవం (అనగా ఛాన్స్) మన ఆంధ్రులకి
మొట్టమొదటిసారి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది.
కాని దాన్ని మనం జారవిడుచుకున్నాం. ఇక కేరళలోనో, వంగ రాష్ట్రంలోనో
సామ్యవాద ప్రభుత్వాలు ఏర్పడింతర్వాత మనవాళ్ళ కళ్ళు తెరుచుకుంటయి అనే
ఆశ వ్యక్తం అవుతున్నది...)
16-9-1965 మద్రాసు: విశాలాంధ్ర సంపాదకులకు గురజాడ కన్యాశుల్కంలోని ఒక
ఘటనకార్టూన్గా వేయగా చిన్న స్కిట్ పంపించారు శ్రీశ్రీ.
ఆవంత్స సోమసుందర్ కు వ్రాసిన లేఖ కళాకేళి 9-10 నెల పత్రిక 1969లో ముద్రణయింది.
ప్రాణహాని కన్నా దుస్సహం - మానహాని: విశాలాంధ్ర ఆగస్టు 1-1949
1948లో కలకత్తా కాంగ్రెస్ తరువాత భారత కమ్యూనిస్టు పార్టీ సాయుధపోరాట మార్గాన్ని అవలంబించింది. తెలంగాణా పోరాటం సాంఘిక విప్లవంగా పరిణమించింది. ఆ పరిస్థితులలో సర్కారు జిల్లాలో కమ్యూనిస్టులను ఏరిపారెయ్యాలని కమ్యూనిస్టు పార్టీని నిషేధించి, అజాఞతంలో ఉన్న కమ్యూనిస్టులను హింసింస్తు, కాల్చివేస్తు, పోలీసు బలగాలవేత కాంగ్రస్ ప్రభుత్వం నరకయాతనలను అమలుపెట్టింది. 14-7-1949 కృష్ణా జిల్లా ' ఎలమర్రు ' గ్రామంలో అనుమానంకొద్దీ పురుషులనదరిని పట్టుకుని, గుడ్డలూడదీసి తమస్త్రీలముందు గాంధీ విగ్రహంచుట్టూ త్రిప్పించడం జరిగింది. అవమానకరమైన ఈ అసభ్య సంఘటన పురస్కరించుకొని వెలువరించిన ఈ ప్రకటన ''ఎలమర్రు - కాటూరు''సంఘటనలపై దర్యాప్తి జరగాలని మేధావుల హెచ్చరిక:
శ్రీశ్రీ, కొ.కు., తాపీ ధర్మారావు,
మ.రా.కృ.శాస్త్రి,గోపీచంద్,ఆరుద్ర, సెట్టి రాజేశ్వర రావు పేర ప్రకటించబడింది.
ప్రజాశక్తి!రా! ప్రజాశక్తి 21-11-1951 (వార పత్రిక)
1948లో కమ్యూనిస్టు పార్టీపై విధించిన నిషేధం తొలగించిన దర్మిలా ''ప్రజాశక్తి'' వారపత్రికగ పునః ప్రారంభిస్తున్నప్పుడు
శ్రీశ్రీ పంపిన సందేశం ముద్రించింది.
ఎన్నికల ప్రణాళిక - ప్రజాశక్తి 27-02-1952
ఉదయిని (పక్షపత్రిక) 15-3-152
1. ఆంధ్రరాష్ట్రం
2.నిరుద్యోగం
3.విద్యా, విజాఞనం
4.జీవన ప్రమాణం
5.లలిత కళలు --
మద్రాసు విధాన మండలి (ఎం.ఎల్.సి.) ఎన్నికకు కమ్యూనిస్టు పార్టీమద్దతుతో శ్రీశ్రీ విశాలాంధ్ర 3-6-1954
హైదరాబాదులో విశాలాంధ్ర సదస్సుకు శ్రీశ్రీ అధ్యక్షులు.
ఆంధ్రోద్యమ సమీక్ష,
అతివాద ఉద్యమంలొ ఆంధ్రులు ,
సామ్యవాద సిద్ధాంతాలు,
విశాలాంధ్ర ఆవశ్యకత,
సరిహద్దు సమస్య,
విశాలాంధ్ర వలన దేశానికి కలిగే మేలు
ఐకమత్యసాధన
మనమహా సంకల్పం, ఉపసంహారం - శీర్షికలతో సాగుతుంది వారి ప్రసంగం.
నా మాస్కోయాత్ర అభ్యుదయ -మే 1956:
వరల్డ్ పీస్ కవున్సిల్ ఆహ్వనంపై ''హెల్సంకీ'' జరుగనున్న విశ్వశాంతి మహాసభకు (1954) పోయి, అటునుంచి
మాస్కో వెళ్ళినపుడు, తన అనుభవాలను ఈ వ్యాసంలో శ్రీశ్రీ ప్రకటించారు(4-1-55 ఆంధ్రపత్రిక సంపాదకునికి లేఖ వ్రాస్తే శ్రీశ్రీపై 7-1-1955న పెద్ద దుమారం లేపింది. వెంటనే సమాధానంగ 11-1-1955 ఘాటయిన లేఖ వ్రాసారు శ్రీశ్రీ. )
5-4-1957 నంబూద్రిపాద్ కేరళ రాష్ట్ర కమ్యూనిస్టు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగ తొలిసారి పదవినలంకరించినందుకు అభినందన విశాలాంధ్రలో ముద్రణయింది.
పుచ్చలపల్లి సుందరయ్య 17-8-1960 ఆంధ్రపత్రిక
తెలుగు వెలుగులు శీర్షిక క్రింద ఆంధ్ర ప్రముఖలగురించి వ్రాస్తూ పుచ్చలపల్లి సుందరయ్యగారిని కర్ణుడితో పోల్చి జాలివలకపోసినపుడు సంపాదకునికి దీటయిన లేఖ వ్రాసారు. సుందరయ్యగారిని ధర్మరాజుగానో, కనీసం
వర్ణించితే సరైన ఉపమానం ఆయ్యుందేదని శ్రీశ్రీ ఉద్దేశం.
16-12-1963 వ్రాసిన స్టాలిన్‌కు విప్లవాంజలి 21-12-1963 జనశక్తిలో ప్రచురణయింది.
16-12-1963 లో హె|దరాబాద్ విద్యార్థియూనియన్ 4వ వార్షికోత్సవ సమావేశానికి శ్రీశ్రీ యిచ్చిన ప్రారంభోత్సవ ఉపన్యాసం 17-12-1963 విశాలాంధ్రలో ప్రచురణ
18-19 జనవరి 1964 విజయవాడలో ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ 29వ మహాసకు శ్రీశ్రీ యిచ్చినపారంభోత్సవ ఉపన్యాసం 15-1-1964 జనశక్తి ప్రచురించింది.
20-6-1965 పౌరహాక్కుల మహాసభను ప్రారంభించుతూ కమ్యూనిస్టు కార్యకర్తలపై నిర్బంధ విధానాన్ని నిరసిస్తూ వ్రాసిన వ్యాసం జనశక్తి ప్రచురించింది.
21-6-1965 విజయవాడలో వ్రాసిన సందేశాన్ని 22-6-1965 విశాలాంధ్ర పత్రిక 14వ జన్మదిన సంచికలో ప్రచురించింది.
జనశక్తి, విశాలాంధ్ర పత్రికలో కొనసాగిన కమ్యూనిస్టు పార్టీల వాదోపవాదాల దృష్ట్యా కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యతావశ్యకతను వ్యాసంగా వ్రాసారు. అది 25-6-1965 విశాలాంధ్రలో అచ్చయింది. ''నేను ఏ పక్షం అన్నప్రశ్న పక్కన పెట్టితే మొత్తం కమ్యూనిస్టు ఉద్యమాన్ని అభిమానించే వ్యక్తిని. ఈ సోదరకలహాలు తాత్కాలికమే. ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టు ఉద్యమం ఏకం కాకతప్పదు. అది నా నమ్మిక. హితము కోరే వారందరు ఈ దిశగా గట్టి కృషి చేయాల్సివుంది'' అనేది అమదులోని సారాంశం.
మే 1-1965 ఒంగోలు తాలూక పేర్నమిట్టలో జరిగిన యువజన మహాసభకు ప్రారంభోపన్యాసం చేసారు.
22-5-1965 జనశక్తిలో అచ్చయింది.
22-9-1965 జనశక్తి పత్రికలో డిటెన్యూల విడుదలపై వ్యాసం.
1-9-1966 జనశకి ్త వార పత్రికను దిన పత్రికగా (సి.పి.ఐ(మా) మారినప్పుడు అభినందిస్తూ రాసిన
సందేశం అచ్చయింది.
11-9-1966 సాహిత్యాచార్య బిరుదును హిందీ ప్రచారసభ హైదరాబాద్ శ్రీశ్రీకి అందించింది.
వారితో మద్రాసు మాజీన్యాయమూర్తి పి.వి.రాజమన్నారు, మైసూరు విశ్వ విద్యాలయ
ఉపకులపతి వి.కె.గోకక్ ఉన్నారు.
20,21-10-1966: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆంధ్రప్రదేశ్ యువజన మహాసభలో జరిగిన
భహిరంగ సభలో శ్రీశ్రీ యిచ్చిన ఉపన్యాసం. 22-10-1966 జనశక్తిలో ఆచ్చయింది. ఈ
సభలో రా.వి.శాస్త్రి పాల్గొని అధ్యక్షత వహించారు.
ఖద్గ సృష్టికి సోవియట్ నెహ్రూ బహుమానం వచ్చిన సందర్భంగా విజయవాడ హనుమంతరాయ
గ్రంథాలయంలో 11-12-1966 న భారత్ సోవియట్ సాంస్క ృతిక సంఘంవారు శ్రీశ్రీని
సన్మానించారు.విశ్వం,జరుక్ శాస్త్రి, రెంటాల, శశాంక, తుమ్మల, గజ్జల మల్లారెడ్డి,నాగళ్ళ
గురుప్రసాదరావు, యిస్మాయిల్ పాల్గొన్నారు. 12-12-1966 విశాలాంధ్రలో
ప్రచురణయింది.
ప్రతివారం విశాలాంధ్ర ప్రచురణాలయంలో మేడపైన సాహిత్య గోష్టి జరుగుతూండేది. ఒకానొక గోష్టిలో శ్రీశ్రీ
పాల్గొన్నారు. సాహిత్య గోస్టి కాస్తా రాజకీయగోష్టిగా పరిణమించింది. 14-12-1966
జనశక్తిలో '' చైనా సాంస్క ృతిక విప్లవంగా'' ఆచ్చయింది.
సామ్యవాద విశాలాంధ్ర: శ్రీశ్రీతో ఇంటర్వ్యూ జ్వాల పత్రిక 1969 మార్చి 28న ముద్రించింది. అది ఒక
సంచలనం లేపింది. జనశక్తిలో పనిచేసే యాదాటి కాశీపతి వఒచేసిన ఇంటర్వ్యూ నివురు
కింద నిప్పులా అమాయకత్వం కింద దాగున్న శ్రీశ్రీ హృదయం వెల్లడయింది. పలు
ప్రశ్నలకు యిచ్చిన జవాబులు పలు అంశలకు సంబంధించియున్నాయి.
లఘు రచనలు:
తాడూ బొంగరం పేరుతో వ్యంగరచన చేసారు శ్రీశ్రీ. వార్త-వ్యాఖ్యలా ఊంటుంది. వివిధ
పత్రికలలో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, విజయప్రభ, జనవాణి, యిల ఎన్నో పత్రిపకు, వ్యక్తుల ప్రకటనలకు
వ్యంగ్య వ్యాఖ్యనాలు, వ్యాపార ప్రకటనలకు పారడీలు......
-ఆనందవాణి లో 21-5-1950, జూన్ 1950 సంచికలలో ముద్రణ:
చమత్ కారాలు:
''రాళ్ళబండి, తాపీ, సున్నంగార్లుండగా - విశాఖ కవితా సమితికి స్వంత భవనం సాధ్యమే!''
విశ్వనాథ: ''నాలాంటి కవి మరో వెయ్యేళ్ళదాకా పుట్టడు!''
శ్రీశ్రీ : '' వెయ్యేళ్ళ కిందటే పుట్టి యిప్పుడు మమ్మల్ని అవస్థ పెడుతున్నారు''
యిలా సమయస్ఫూర్తితో కూడిన వ్యంగ్య, హాస్య రచనలు ఎన్నో......
జాబు - జవాబు:
గుత్తికొండ సుబ్బారావు, హైదరాబద్ వారికి, క్రొత్తపల్లి క్రాంతికుమార్ అమృతలూరు వారికి..
ప్రశ్నలకు పదునైన, చమత్కారమైన, వ్యంగ్య, హాస్య, సూటి జవాబులు అందిచ్చారు శ్రీశ్రీ.
యివి ప్రగతిలో మే 9 నుండిజూలై 4 సంచికల్లో లభ్యం.
50 ప్రశ్నలు - 50 జవాబులు:
'' వాదానికి వాదముంది
బాణానికి బాణం
యంత్రానికి మంత్రముంది
మవునానికి గానం''
ప్ర: రామాయణమా? భారతమా?ఇవాళ మనకేది దారి?
జ: భారతం!
ప్ర: గాంధీని చంపిందెవరు?
జ: భారతీయుడు!
ప్ర: గాంధీయిజం ఎవర్ని చంపింది?
జ: భగత్‌సింగ్, నేతాజీ, సీతారామరాజు!
ప్ర: పొట్టి శ్రీరాముల్ని ఎవరు చంపారు?
జ: నెహ్రూ!
24-1-1955 -- విశాలాంధ్ర
శ్రీశ్రీ
''పాలు'' నుత్య బహువచనం
కొంత మంది అదృష్టవంతులకి
''ఆలు'' నిత్య బహువచనం
కా,కి: షష్ఠీ విభక్తి
మార్కి ్సస్టు ముదిరితే ఎనార్కిస్టు,
''తెలుగు'' ''కనడం'' ''అరవం''
టి.టి.కృష్ణమాచారి అంటే టాక్స్ అండ్ టాక్స్
కుసుమహారనాథ్ భక్తులంటే కు.హ.నా.భక్తులే
జెయిల్ అన్నా ప్రిజన్ అన్నా ఒకటే కాబట్టి
జెయిలర్ అన్నా ప్రిజనర్ అన్నా ఒకటే!
రెండు రకాల మాలవాళ్ళలో 1) సిని-మాలవాళ్ళు
2) డ్రా-మాలవాళ్ళు
ప్రపంచంలో 5 గ్రెయిన్ల రేడియం
ఒక్క శ్రీశ్రీ ఉన్నారు
ప్రశంసా పత్రం!
రాచకొండ విశ్వనాథ శాస్త్రి 23-1-1970
అవును శ్రీశ్రీ మహాకవి! మహా మనిషి అంటూ ముగించిన ప్రశంసా పత్రం చాల విలువైనది!
''అనంతం'' - ఆత్మకథ/స్వీయ చరిత్ర/ఆటోబయోగ్రఫీ/తెరచిన జీవిత గ్రంథము.....ఎన్ని రకాలుగానో
నిర్వచించుకోవచ్చును.
ప్రారంభం
మరో ప్రారంభం
విశాఖపట్నం జాఞపకాలు
సినిమా సరదాలు
సెక్స్ సరదాలు
ఏమిటి? ఎందుకు?
కృష్ణశాస్త్రి జాఞపకాలు
నా దరిద్రపు రోజులు
జీవితంలో గురువులు
కవిత్వంలో నా ప్రయోగాలు
సర్రయలిజం
కవిత్వం ఆరంభం
శ్రీరంగం శ్రీనివాసరావు
నా విదేశయాత్రానుభవాలు
మృత్యువుతో నా మూడో యుద్ధం
మత్తు మాటలు (ఉలిరీ ఖళిశిరీ |ఖీలిజీరీ)
1970-85
రాక్షస రాత్రులు
అద్దంలో శ్రీశ్రీ
ఇవాళనుంచీ
ఎవరిష్టం వారిది
నా నాస్తికత్వం
మద్రాసులో ఇవాళ
మనలో మనం
విరసంలొ వీర శైవులు .....26 అంశాలున్నాయి.
''(ఇది శ్రీశ్రీ అమాయకత్వాన్ని, నిజాయితీని, కుండబద్దలు కొట్టినట్టుండే వాస్తవాలు, దాపరికంలేని నిజాలు,
జీవితంలో ఆన్ని మలుపులు, కుర్రకారు చేష్టలు, తప్పులు-ఒప్పులు, స్వయంగా బేరీజు వేసుకున్న తన
జీవనగమనవైచిత్రి, ఒక తెరిచిన పుస్తకం--నికార్సయిన శ్రీశ్రీ తత్వానికి కొలబద్ద--మొత్తానికి ''అనంతం''-
శ్రీశ్రీకి బింబం కాదు, సజీవ ప్రతిబింబం.)'' -
(ఉటంకింపు - కపిల రామ్‌కుమార్ - సంకలనకర్త)
'' ఏ ముసుగులు, దాపరికాలు లేనిది - అనంతం!
చాల మందికి నచ్చనవి, నచ్చినవి, ఉన్నాయి.
అక్కరలేనివీ ఉన్నాయి.
వినలేనివి, చూడలేనివి, సంగతులు, దృశ్యాలు, ఉన్నాయి.
శ్రీశ్రీ అనంతం - సాహిత్యం అనంతం''
చలసాని ప్రసాద్ 15-6-1986 - అనంతం( ఆత్మచరితాత్మచరిత్రాత్మక నవల)కు
కూర్పు లో వ్రాసారు. - శ్రీశ్రీ ప్రచురణలు 1-సవుత్ బాంక్ రోడ్, మందవల్లి,
చెన్నై-600 028-మే 2000
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - సంకలనానికి ఈ తోడ్పడిన గ్రంథాలకు, ప్రచురణకర్తలకు నా కృతజఞతలు.
1. విరసం - శ్రీశ్రీ సాహిత్య సంపుటాలు
2. విశాలాంధ్ర ప్రచురణలు, పత్రికలోని వ్యాసాలు.
3. మాట బాట- నా వ్యాసం
4. ప్రజాశక్తి వ్యాసాలు
5. తెలకపల్లి రవి, ఆద్దేపల్లి రామ్మోహానరావు, ఎం. నరహరి, మేడేపల్లి విజయకుమార్, డా.కె.శివారెడ్డి, గార్ల
సాహిత్య వ్యాసాలు, ప్రసంగాలు.
6. వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు.
ఇది సమగ్రం కాదు. మచ్చు మాత్రమే. దీనిని అందుకొని శ్రీశ్రీ సమగ్ర సాహిత్యాన్ని ఒక్కొక్కదాన్ని సంపూర్ణంగా చదివి ప్రభావితులు కావాలనే కొండంత ఆశతో మనసారా కోరుకుంటున్నాను
.
ప్రత్యేక కృతజ్ఞతలు: బోడేపూడివిజ్ఞాన కేంద్రం నిర్వాహకులకు, కీ.శే.డా. కానూరి హరీష్ కుటుంబ సభ్యులకు.
పోస్టు స్క్రిప్ట్: 1958లో మదరాసునగరంలో నా చేతిని పట్టుకుని అక్షరాలు దిద్దించిన ఇద్దరు మహాకవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి మరియు శ్రీరంగం శ్రీనివాసరావు గార్లకు జీవితాంతం కృతజఞతలు తెలుపుకుంటున్నాను.
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు
కపిల రామ్‌కుమార్