Tuesday, November 22, 2016

కపిల రాంకుమార్|\ లేటెస్ట్‌ పోయెం ||

కపిల రాంకుమార్|\ లేటెస్ట్‌ పోయెం ||
బేస్‌లెస్‌ ఐడియాల
యూస్‌లెస్‌ విధానాల
బినామీల కాలంలో
సునామీలా నోట్లొచ్చి
తినేకంచంల మన్నువడి
నడిచేదారంట ముళ్ళై
ఎగదీస్తే ఒక ( గో ) హత్య
దిగదీస్తే మరో ( బ్రహ్మ )హత్య
మరణాలు తోరణాలై
నిరశన వెల్లువై
జనం ఘోషీంచినా
మన్ను తిన్నపామురా
సర్కారు - చెవులుండవ్‌ కదా!
గంతలు కట్టుకున్న న్యాయమూర్తిరా
నిజాలు చూడదు
తీర్పు చెప్పటానికిఎ
కూట సాక్ష్యాలే అధారం
న్యాయం జరగొచ్చు
న్యాయమే తొలగిపోవచ్చు
దేశం దాటి్పోయినవెలాగూ రావు
ఉన్నవాటిని ఉప్పు పాతరవేసి
ఊతప్పం ఆరగించే వాళ్ళకి
ఆకలి మంటలెలా తెలుస్తాయ్‌ కాని
జనాక్రోశపు సెగలో చలి కాచుకుంటూ
రోజుకో ప్రకటనతో కాలక్షేపం చేస్తూ
జవాబు చెప్పలేక
చట్ట సభల్లో సాకులెతుకుతున్నారా
తిరుగుబాటు రాకుండా
అధికారం తరిగిపోకుండా
ప్రజాస్వామ్యం నిలబెట్టేలా
భేషజాలు వీడి
మా కళ్లతో చూడకపోతే
పుట్టగతులుండవ్‌
తదుపరి మీ యిష్టం
వృద్ధులు లెక్కలేదు
శిశువులు లెక్కలేదు
మరణించే మహిళలు లెక్కలేదు
అంబానీల అప్పచెప్పే
లెక్కలే ముఖ్యమైతే
వచ్చే సమరంలో
ఈ అంబారీ దొరకదు తెలుసుకోండి
22 నవంబర్‌ 2016 ఉ. 9.19

No comments: