కపిల రాం కుమార్|| చిల్లర పాట్లు ||
డబ్బులేని వాడు డుబ్బుకు కొరగాడు - నాడు
డబ్బుండీ కూడ బువ్వకు లోటే - నేడు !
**
ఎదురు చూసినా, కుదురు ఆడినా! ఫలితం ఒకటే!
అది నుదిటి రాతలే ( గీత గీసిన శాసనం )అంటారు!
**
కట్టుబడిలోనే వున్నాం. పెట్టుబడి లోటులోనే వున్నాం!
అడపాదడపా ఇలా నోట్ల ముట్టడికి గురి అవుతూనేవున్నాం!
**
జన పర్వం కాదు !
భనపరుల సోద్యం!
**
చిత్తు బొత్తుల బతుకులొ చితుకు, చితకిపో!
పెద్ద నోట్ల రోకటి పోటుకు బలైపో!
**
అల్లుడొచ్చేవరకు అమవాస ఆగదన్నమాట అటుంచండెహే
చిల్లరవచ్చేలోగా ఉపవాసం ఉట్టికేగేటట్టుంది చూడండహే
*********************************
15 నవంబర్ 2016
| చిల్లర పాట్లు -2 ||
చుక్కల్ని చూస్తే వినోదమే కాని.
చుక్కల్ని చూపిస్తేనే విషాదం!
దొడ్డిదారిన ఏనుగులు తప్పించుకున్నా పర్వాలేదు,
కళ్ళెదుట దోమకూడా తప్పించుకోకూడదన్నట్టు
మన వెనకాల బడిత వుంది,
కీలు చూసి వాతపెట్టేలా..మోదటానికి
పైవాళ్ళు వినోదించడానికి
ఇలా అర్థం చేసుకోవాలన్నమాట:
ఎన్నటికి రాని పద్దులు కదా!
అదే పద్ధతి రైతుల ఋణాలకు
వర్తించితే ఎంత బావుండు!
17.1.22016
డబ్బులేని వాడు డుబ్బుకు కొరగాడు - నాడు
డబ్బుండీ కూడ బువ్వకు లోటే - నేడు !
**
ఎదురు చూసినా, కుదురు ఆడినా! ఫలితం ఒకటే!
అది నుదిటి రాతలే ( గీత గీసిన శాసనం )అంటారు!
**
కట్టుబడిలోనే వున్నాం. పెట్టుబడి లోటులోనే వున్నాం!
అడపాదడపా ఇలా నోట్ల ముట్టడికి గురి అవుతూనేవున్నాం!
**
జన పర్వం కాదు !
భనపరుల సోద్యం!
**
చిత్తు బొత్తుల బతుకులొ చితుకు, చితకిపో!
పెద్ద నోట్ల రోకటి పోటుకు బలైపో!
**
అల్లుడొచ్చేవరకు అమవాస ఆగదన్నమాట అటుంచండెహే
చిల్లరవచ్చేలోగా ఉపవాసం ఉట్టికేగేటట్టుంది చూడండహే
*********************************
15 నవంబర్ 2016
| చిల్లర పాట్లు -2 ||
చుక్కల్ని చూస్తే వినోదమే కాని.
చుక్కల్ని చూపిస్తేనే విషాదం!
దొడ్డిదారిన ఏనుగులు తప్పించుకున్నా పర్వాలేదు,
కళ్ళెదుట దోమకూడా తప్పించుకోకూడదన్నట్టు
మన వెనకాల బడిత వుంది,
కీలు చూసి వాతపెట్టేలా..మోదటానికి
పైవాళ్ళు వినోదించడానికి
ఇలా అర్థం చేసుకోవాలన్నమాట:
ఎన్నటికి రాని పద్దులు కదా!
అదే పద్ధతి రైతుల ఋణాలకు
వర్తించితే ఎంత బావుండు!
17.1.22016
2 comments:
డబ్బు లేని వాడు డుబ్బుకు కొరగాడు అనగా అర్థవివరణ చెప్పండి సార్
పుటుక్కు జరజర డుబుక్కు మే
Post a Comment