కపిల రాంకుమార్|| సమస్యలుంటే సాకులు వెతుకుతుంటారా??||
పరిస్థితులను అంచనావేసి
పరిష్కరించే బదులు
మరింత జటిలపరచటంలో
రాజకీయులు బహు దిట్టలు!
ఒకరినిమించొకరు ఎత్తులు వేస్తూ
చిత్తు బొత్తులాటలాడుకుంటూ
కాలయపనచేసి
ఎవరికెంత లాభమో యోచనే తప్ప
అస్తవ్యస్థ వ్యవస్థను సరిదిద్దకపోగా
మరింత అధ్వాన్నంచేయటంలో
సిద్ధహస్తులు!
రాజకీయ ప్రత్యర్థులపై కక్షతో
అమాయక ప్రజలపై
తీసుకుంటారు!
అకాల వర్షాలైనా,
గృహ దహనాలైనా
కుమ్ములాటలైనా
కలహాలేవైనా
కులపంచనామా చేసేందుకు
పావులు కదుపుతారు
బలగాలను మోహరిస్తారు!
అందుకే వారు సమస్యలు పొంగుతుంటే
సాకులు వెతుకుంటారు!
ఎవరైనా నోరెత్తితే దానికో రంగు పూస్తారు
ఎవరితోనో రంకు అట్టకడతారు!
ఎవరైనా ఎదురు తిరిగితే
అట్టడుక్కు అదిమేయచూస్తారు
ఆ సమాధులపునాదులపై కట్టడాలు నిర్మిస్తారు!
ఎంతసేపు ఓట్లు, సీట్ల లెక్కల్లో
నోట్ల ఫీట్లల్లో పడరాని పాట్లు పడతారే తప్ప
జనసామాన్యపు పాట్లు చూడరు!
గోడమీద పిల్లిలా అదునుకోసం చూస్తారే తప్ప
ఎవరికి ఆసరా యివ్వరు పైగా అసహనం చూపుతారు!
నిన్న పొగిడి, నేడు తిట్టి, రేపు గుట్టుగా కౌగలించుకుంటారు
పైపై మరమతులుచేసి తమ గరిసెలు నింపుకుంటారేకాని
శాశ్వత నిర్మాణాలు చేయరు
గుత్తేదారు పదికాలాలు బాగుంటేనే కదా
తమ పబ్బం గడిచేది!
వితరణలో తస్కరణలు చేస్తూ
పారితోషకాలు బొక్కుతారు
ముక్కిన బియ్యం పంచి,
చేతులు దులుపుకుంటారు
జేబులు నింపుకుంటారు!
బక్కజనం యేమైనా వారికి పట్టదు
రాజకీయ అరాచకీయానికి భరత వాక్యం పలికేదెన్నడు?
జనం యోచనతో సొంత బుర్ర పెట్టి
వాళ్ళ బుర్ర రామకీర్తన పాడించేదెన్నడు?
అందుకు ప్రజల సంసిద్ధం చేసే బాధ్యత
కవుల కలాలదే -కళాకారుల గళాలదే!
30,10.2013 ఉదయం 10.30
పరిస్థితులను అంచనావేసి
పరిష్కరించే బదులు
మరింత జటిలపరచటంలో
రాజకీయులు బహు దిట్టలు!
ఒకరినిమించొకరు ఎత్తులు వేస్తూ
చిత్తు బొత్తులాటలాడుకుంటూ
కాలయపనచేసి
ఎవరికెంత లాభమో యోచనే తప్ప
అస్తవ్యస్థ వ్యవస్థను సరిదిద్దకపోగా
మరింత అధ్వాన్నంచేయటంలో
సిద్ధహస్తులు!
రాజకీయ ప్రత్యర్థులపై కక్షతో
అమాయక ప్రజలపై
తీసుకుంటారు!
అకాల వర్షాలైనా,
గృహ దహనాలైనా
కుమ్ములాటలైనా
కలహాలేవైనా
కులపంచనామా చేసేందుకు
పావులు కదుపుతారు
బలగాలను మోహరిస్తారు!
అందుకే వారు సమస్యలు పొంగుతుంటే
సాకులు వెతుకుంటారు!
ఎవరైనా నోరెత్తితే దానికో రంగు పూస్తారు
ఎవరితోనో రంకు అట్టకడతారు!
ఎవరైనా ఎదురు తిరిగితే
అట్టడుక్కు అదిమేయచూస్తారు
ఆ సమాధులపునాదులపై కట్టడాలు నిర్మిస్తారు!
ఎంతసేపు ఓట్లు, సీట్ల లెక్కల్లో
నోట్ల ఫీట్లల్లో పడరాని పాట్లు పడతారే తప్ప
జనసామాన్యపు పాట్లు చూడరు!
గోడమీద పిల్లిలా అదునుకోసం చూస్తారే తప్ప
ఎవరికి ఆసరా యివ్వరు పైగా అసహనం చూపుతారు!
నిన్న పొగిడి, నేడు తిట్టి, రేపు గుట్టుగా కౌగలించుకుంటారు
పైపై మరమతులుచేసి తమ గరిసెలు నింపుకుంటారేకాని
శాశ్వత నిర్మాణాలు చేయరు
గుత్తేదారు పదికాలాలు బాగుంటేనే కదా
తమ పబ్బం గడిచేది!
వితరణలో తస్కరణలు చేస్తూ
పారితోషకాలు బొక్కుతారు
ముక్కిన బియ్యం పంచి,
చేతులు దులుపుకుంటారు
జేబులు నింపుకుంటారు!
బక్కజనం యేమైనా వారికి పట్టదు
రాజకీయ అరాచకీయానికి భరత వాక్యం పలికేదెన్నడు?
జనం యోచనతో సొంత బుర్ర పెట్టి
వాళ్ళ బుర్ర రామకీర్తన పాడించేదెన్నడు?
అందుకు ప్రజల సంసిద్ధం చేసే బాధ్యత
కవుల కలాలదే -కళాకారుల గళాలదే!
30,10.2013 ఉదయం 10.30
No comments:
Post a Comment