Friday, November 15, 2013

కపిల రాంకుమార్|| మొగ్గలు ||

కపిల రాంకుమార్|| మొగ్గలు ||
పిల్లి మొగ్గలు వేస్తుంటే సరదానే
కాని ( ఆడ) పిల్లకి మల్లె  మొగ్గలిస్తే
బుగ్గలు వాస్తాయిరోయ్!

పిల్లలూ అల్లరి వారు కాకండి
నలుగురిలో పేరు తెచ్చుకునే మెలగండీ!
చదువు, జ్ఞానం యిచ్చే వెలుగులో
పదుగురికి ఆదర్శంగా ఎదగండి!

**
అమ్మా నాన్న లేని అనాథలకు
ఆశ్రయం కల్పించే ఆశ్రమాల
నిర్వహణలో అలసత్వం వహిస్తే
జాతికి ద్రోహం చేసే వారవుతారు!

క్రమశిక్షణపేరుతో క్రమంగా
ప్రమాణాలు దిగజార్చకండి
నిబద్ధత, నిమగ్నత గాలికొదిలి
బిక్షగాళ్ళుగా, సోమరులుగా చేయకండీ

**

బతికే నైపుణ్యం నేర్పండి
బరువుల మోత తగ్గించండి
పరువుగా పేరు నిలిపేలే
పాదుచేసి, నీరుపోసి పెంచండి!

పోకిరీలుగా, దొంగలుగా
జూదరులుగా చేయకండి
అమ్మ, నాన్న, గురువు,
సమాజం ఉమ్మడి బాధ్యత!

**
పసిమొగ్గలను వికసించనివ్వండి
మసిబొగ్గులు కానివ్వకండి
నేటి బాలలే రేపటీ పౌరులు
ఉత్తమ ఉన్నత విలువలందించండి!

కుప్పతొట్టిపాలై
మురికి కూపపు స్నేహంతో
క్రూర నేర లోకంలోకి 
జరకుండా జారులు కాకూడదని కోరుకుందాం!

**( ఇదో పిచ్చి  కోరిక - నెరవేరాలని తపన )

14.1.12013 ఉదయం  10.30

No comments: