కపిల రాంకుమార్|| మనచేతిలోనే - మన చేతల్లోనే ||
మంత్రాలర్థంకాకపోయినా
సూత్రాలకు తలవంచే మగువ
సూత్రబద్ధ సంసారంలో
తగు పాత్ర పోషణ చేయడంలో
చెలికాని సహకారముంటే
గృహమే స్వర్గసీమవుతుంది!
ప్రేమైతేనేమి, పునాది లేకపోతే
పురిటిలోనే సంధికొట్టి
పురికొస విడిపోదా!
స్పర్థలు మొలకెత్తి
సౌధం పగుళ్ళు వారితే
పగలే చీకటై
పొగలు, పగలు కమ్ముకోదా
ఒప్పందాలు రద్దై నడిరోడ్డున సంసారం పడదా?
విచ్చిన్నాలకాలవాలమై
కుండ పగిలినట్లు
గుండె పొగిలిపొగిలి విలపించదా!
తెగిన గాలిపటమై
అగమ్యగోచరమై
అభాసుపాలు కాకుండా కాపాడుకోకపోతే
కుక్కలు చింపిన విస్తరి కాదా జీవితం?
ఊకగా మారిన ఊసులకు
చేసుకున్న బాసలకు
కాపుదల లేకపోతే
వృక్షం కూలిపోదా!
వేరు పురుగు చేరి కుళ్ళిపోదా!
అటు యిటు తరాల
అంతరాలు - అంతరంగాలు
బేరీజువేసే కొలమానం లేకపోతే
పర్వవసానం యిదేగా!
సాప్తపదీనం, ఐరేని కుండలు,
మోటైనా, మాట కట్టుబడి
సంబంధాలను కొనసాగించలేకపోతే
కొసలు పురి వీడినట్టే
వివాహబంధం విడిపోదా?
వైవాహిక విధానం యేదైనా
జతగా అడుగులు కలిస్తేనే
సంసారపు మనుగడ
నవ యువ దంపతుల చేతిలోనే
చేతల్లోనే వుందనేది
మాత్రం నిర్వివాదాంశం!
13.11.2013 సాయంత్రం 3.53
మంత్రాలర్థంకాకపోయినా
సూత్రాలకు తలవంచే మగువ
సూత్రబద్ధ సంసారంలో
తగు పాత్ర పోషణ చేయడంలో
చెలికాని సహకారముంటే
గృహమే స్వర్గసీమవుతుంది!
ప్రేమైతేనేమి, పునాది లేకపోతే
పురిటిలోనే సంధికొట్టి
పురికొస విడిపోదా!
స్పర్థలు మొలకెత్తి
సౌధం పగుళ్ళు వారితే
పగలే చీకటై
పొగలు, పగలు కమ్ముకోదా
ఒప్పందాలు రద్దై నడిరోడ్డున సంసారం పడదా?
విచ్చిన్నాలకాలవాలమై
కుండ పగిలినట్లు
గుండె పొగిలిపొగిలి విలపించదా!
తెగిన గాలిపటమై
అగమ్యగోచరమై
అభాసుపాలు కాకుండా కాపాడుకోకపోతే
కుక్కలు చింపిన విస్తరి కాదా జీవితం?
ఊకగా మారిన ఊసులకు
చేసుకున్న బాసలకు
కాపుదల లేకపోతే
వృక్షం కూలిపోదా!
వేరు పురుగు చేరి కుళ్ళిపోదా!
అటు యిటు తరాల
అంతరాలు - అంతరంగాలు
బేరీజువేసే కొలమానం లేకపోతే
పర్వవసానం యిదేగా!
సాప్తపదీనం, ఐరేని కుండలు,
మోటైనా, మాట కట్టుబడి
సంబంధాలను కొనసాగించలేకపోతే
కొసలు పురి వీడినట్టే
వివాహబంధం విడిపోదా?
వైవాహిక విధానం యేదైనా
జతగా అడుగులు కలిస్తేనే
సంసారపు మనుగడ
నవ యువ దంపతుల చేతిలోనే
చేతల్లోనే వుందనేది
మాత్రం నిర్వివాదాంశం!
13.11.2013 సాయంత్రం 3.53
No comments:
Post a Comment