Tuesday, January 28, 2014

కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 6వ సమావేశం|| 19.1.2014-మూడవ ఆదివారం||

కపిల రాంకుమార్|| సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 6వ సమావేశం|| 19.1.2014-మూడవ ఆదివారం||

దండలో దారంగా ఉండి, నేర్పరితనం కలిగివుండటమే శిల్ఫం అని కన్నేగంటీ వెంకటయ్య సాహితీ స్రవంతి 6వ అధ్యయనవేదిక ప్రతీనెల మూడవఅదివారంలో భాగంగా ది.19.1.2014 సమావేశానికి తన అధ్యక్షోపన్యాసంలో అన్నారు. తొలుత ఇటీవల మరణించిన  ప్రముఖ కళాకారులు, చలన చిత్ర  ప్రముఖలకు సంతాప తెలుపుతూ ఒక నిముషం మౌనం పాటించారు. బి.వి.కె. విద్యార్థి ఆసు ప్రసాద్ గీతాలాపనతో కార్యక్రమం ఆరంభమయింది. ముఖ్యాంశం  '' కవిత్వం - శిల్పం '' - వాస్తవంగా ఆనందాచారి ప్రసంగించవలసివుంది. కారణాంతరాలవల్ల వారు హాజరు్కాలేకపోయారు. అదే అంశంపై డా.పి. సుబ్బారావు గారిని ప్రసంగించవలసినదిగా కన్నెగంటి వెంకటయ్య కోరారు. మరొక కవి జీవన్‌, కపిల రాంకుమార్ గార్లను కూడ  దానిపై మాట్లాడవలసినదిగా వేదికపైకి పిలిచారు. శిల్పంపై పట్టు సాధించిన వారు అద్భుత కవితా సృష్టికర్తలుగా పేర్కొంబడతారని, ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసములు ఎంతో సహకరిస్తాయని వివరించారు.డా.పి. సుబ్బారావు గారు మాట్లాడుతు కవిత్వ భాష ఒక ప్రత్యేక భాష అని, మన 20 శతాబ్ద కవులు అభిభాషించారని తెలిపారు. కవిత్వం శిల్పం పరస్పరాధారితాలని, పద్యం రాసేటప్పుడు కవి తన భాషనుంచి పక్కకు తొలుగుతాడని, దానికొక ప్రత్యేక శైలిలో నేర్పుగా సృజనచేస్తాడని అన్నారు. ,వ్యాకరణం మొదట సంస్కృతలో మొదట వ్రాయబడి, తదనంతరం తెలుగులోకి వచ్చింది. నన్నయ వ్యాకరణం అందుకుదాహరణ.  బాల వ్యాకరణం
ప్రౌఢ వ్యాకరణం, అప్పకవీయం, ఇలా పరిణామ క్రమం.  కాకువు - నిత్య జీవితంలో ఉపయోగించే భాషలోవాడబడేదని అన్నారు. ధని, రసం ప్రధానంగా కవిత్వం సాగాలని దానికి తోడుగా అలంకారాలు సొగసునిస్తాయని చెబుతూ ధ్వని ప్రధానంగా 1. డినొటేషన్‌ 2. కనొటేషన్‌ 3. సజెషన్‌ లపై అధారపదివుంటుందనిదీనికి అదనంగా ఉక్తి వైచిత్యం , సర్వకాలీనత (విశ్వజనీనత)....ఇప్పటికి చెప్పకోతగిన మంచి ఉదాహరణ యెండ్లూరి సుధాకర్  కొత్త గబ్బిలం .  ఛందస్సు -అంటే  (అంద చందాలకు దగ్గర సంబంధం) అందం అని అర్థం. సమాజం లేక పోతే (ప్రపంచం) కవిత్వం లేదు. ఒక్క అడుగు ముందుకు వేయించేదే కవిత్వం. లోక పరిశీలన లేక కవిత్వం మనజాలదు. కవితలో ఓక మెరుపు, ఒక ఉరుము, ఒక స్వాంతనం, ఒక వేదన, అలోచన మిళితమైవుండాలి. - '' బాలపు బస్తాలను మోస్తున్న ఆ స్త్రీలు - గ్లోబును  ఎత్తుకున్న  అట్లాసు '' అని సుధాకర్ అన్నారు తన కొత్త గబ్బిలంలో సందర్భానికి తగ్గ పద ప్రయోగం, చేసి శ్రోతను/ పఠితను ఆకట్టుకునేదే శిల్పం అది నింపునున్నదే కవిత్వం.ఓ తిక్కన, ఓ వేమన ఓ గురజాడ అంటే నాకిష్టం ఆధునిక కవిత్రయం అని శ్రీశ్రీ అన్నారని చెపారు. కవిత్వం ఒక ఆల్కెమీ అంటాడు ' తిలక్ ' నిజమే కదా! ..ఫిలాసఫీ ఆఫ్ కాంపొజిషన్‌ అనే గ్రంథం తప్పక చదవండి అని సలహా యిచ్చారు. భాస, పదజాలం, ఊహ కలిగివుండాలి.  పప్రబంధ, ఆశు, బంధ, చాటు కవిత్వాలు కవిత్వంలో వచ్చిన పరిణమాలనే తెలుసుకోండి. కావ్య పఠన పునాది కావాలి. అదే అధ్యయనం,అభ్యసనం, సృజనం గా మార్పుచెందాలి.  పురాణ, ఇతిహాస, చారిత్రిక, సాంఘిక, పద్య, వచన కవిత్వం పరిచయం చేసుకుంటేనే కొత్త పోకడలు కవిత్వంలో చూపించగలం. కొన్ని సోదాహరణలుగా పద్యాలు, కవితలు చదివివినిపించారు. సమావేశానికి హాజరయిన వారి కోరికపై ఇదే అంశం వచ్చే మూడవ ఆదివారం కొనసగించాలని తీర్మానించారు.
మరొక ప్రముఖ కవి జీవన్‌ దీర్ఘ ఉపన్యాసం జోలికి వెళ్ళక కొన్ని కవితలను ఉదహరిస్తూ ఆయా కవుల కవిత్వ శిల్ప చాతుర్యాన్నివివరించారు. తెలంగాణా రైతంగ సాయుధపోరాట కాలంలో ఎంతో అభ్యుదయ సాహిత్యం వచ్చింది కుందుర్తి ' తెలంగణా 'సోమసుందర్ ' వజ్రాయుధం ' ఆరుద్ర  ' త్వమేవహం' గంగినేని ఎర్రజెండాలు, అవేకాక వాటినేపథ్యంలో నవలా సాహిత్యంకూడ వచ్చింది. దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి లాటి వారు ప్రసిద్ధులు.వాటిలో కవిత్వం, శిల్పం, శబ్దం, ధ్వని, రసం,చక్కగా అలరించాయి.  దర్మిలా నేటి  తెలంగాణ ఉద్యమకాలంలో కూడ చక్కటి కవిత్వం ప్రపంచంలో ఎప్పుడూ రానంతవిరివిగానూ వచ్చింది. కవిత్వం ఒక హృదయంనుండు మరొక హృదయంలోకి ప్రవేశిస్తేనే - అది కవిత్వమై తీరుతుంది అని చలం అంటూండేవారని చెప్పారు అంటూ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది కొద్ది కవితలు, విశ్లేషణలు క్లుప్తంగా తనప్రసంగాన్ని ముగించారు జీవన్‌.
గ్రంథాలయ నిర్వాహకుడు, కవి కపిల రాంకుమార్ మాట్లాడుతూ కాలాన్ని హరించ కుండా, కొన్ని ముఖ్యమైన అధ్యయన చేయవలసిన పుస్తకాలుగా  హరగోపాల్ -''రూపం సారం '',  కె.కె.రంగనాథాచార్యులు ''సాహిత్యంలో విభిన్న ధోరణలు ''  సాహిత్య  శిల్ప సమీక్ష లాంటివి బాగా ఉపయోగపడతాయన్నారు. శ్రీశ్రీ కవితలను ఉదహరించినంతగా విమర్శకులు ఉదహరించే కవి అలిశెట్టి ప్రభాకర్, తెలంగాణకు చెందినవాడవటం గర్వించతగిన విషయమని తెలిపారు.హాజరైన కవులలో సునంద, శైలజ, బండారు రమేష్, షేక్ బషీర్ కవితలు చదివారు. రౌతురవి వందన సమర్పణ చేస్తూ మరల ఫిబ్రవరి నెల మూడవ ఆదివారం తిరిగి ఇదే అంశం కొనసాగుతుందని తెలిపారు..


24.1.2014 సాయంత్రం  2.50

No comments: