Sunday, February 16, 2014

కపిల రాంకుమార్ || సాహితీ స్రవంతి ||

కపిల రాంకుమార్ || సాహితీ స్రవంతి ||

సారస్వత స్రవంతి - కవి గాయక విపంచి
వచన పద్య కవితల - గేయ వ్యాస కళాకేళి!

అదును పదును కల్పించి
అంకురాలుమొలకెత్త
సాహిత్యపువన సొబగులు
గుబాళించు పూదోట!

మత తత్వం - కుల తత్వం
ఉగ్రవాద విధ్వంసాలను
నిలువరించు సంకల్పం
నిలుపుకున్న దీరత్వం!

చిరుజల్లులా, వానలా
వాగులా, జీవ నదిలా
అనునిత్యం పారేందుకు
పచ్చదపు గీతంలా!

కవిత్రయ కరచాలన స్పర్శతో
గురజాడ శ్రీరంగం కాళోజిల
ఆదుగుజాడలలో బడుగులకై
మా నడకలు సాగిస్తూ!

కొత్త కొత్త వాదాలకు
వైరుధ్యపు భావాలకు
సమతుల్యం పాటిస్తూ
సంయమనం నెరపుతూ!

సహకారం పొందుతూ
సహజీవన సాగిస్తూ
'' సాహితీ స్రవంతి'' గా
ప్రస్థానం చేరేలా!

అంతరంగ విస్తరణతో
అంతర్జాల వ్యాప్తితో
కొనసాగుట మా లక్ష్యం
నూతన అరుణోదయం!

( ఖమ్మం జిల్లా సాహితీ స్రవంతి - ఆవిర్భవించి 15 వ వార్షికోత్సవానికి
సన్నిద్ధం అవుతున్న సందర్భంగా జయప్రదమైన 16.2.2014 నాటి విస్తృత
సమావేశానికి నా కవితాశంస ) సా.6.30

No comments: