Monday, February 10, 2014

|| సాహిత్యంలో ఇజాలు-నిజాలు ||

కపిల రాంకుమార్ || సాహిత్యంలో ఇజాలు-నిజాలు ||
'' అధునికత '' పదనిర్వచనానికి , '' సమకాలిక '' పద నిర్వచనానికి తేడా వుంది. ఆధుని క కాలవాచికా చెప్పుకునే అర్థం. ఒక కాలానికి ' ఆముక్త మాల్యద ఒక ఆధునిక గ్రంథం అని చిన్నయసూరి అంటారు. కొన్ని విలువల సంప్రదాయం, చారిత్రికనేపథ్యం మార్పులతొ మరికొన్నింటిని అభ్యుదయ కావ్యాలు అంటాము. సమకాలిక అంటే ఏక కాలంలోవచ్చిన కావ్యాలకు విశ్వనాథ, చలం,శ్రీశ్రీల రచనలను సమకాలిక సాహిత్యం అంటాం. రెండూ భిన్న ధోరణులను,వాదాలను, ప్రతిబింబిస్తూ సాహిత్య సృజనతో ముందుకొస్తాయి. సాహిత్య దృక్పథం దృష్ట్యా విశ్వనాథ ఆధునికుడు కాదు.
సమకాలీనత:- ఈ దృష్టితో చూస్తే ఆ కాలంలో వచ్చిన ఏ సాహిత్యమైనా సంప్రదాయం
గానీ, నవీనంకాని ఆధినికతే అనిపించుకుంటుంది.
ఆధినికత:- కాలంలో వచ్చే ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పులను గమనిస్తూ,
కాస్త దృక్కోణంలో కవితసృజనలో కావించడమే ప్రత్యేకతను సంతరించుకోవటంద్వారా
ఆఢునికతగా గుర్తింపబడుతుంది. కొన్ని విలువలు, తత్త్వాలు కలిగివుంటుంది. సామాజిక
ప్రయోజనం, హేతుబద్ధ శాస్త్రీయ దృక్పథం వాస్తవికతలపైఆధారపడటం అనే అంశాలను
ముడివేసుకుని సహిత్య దృక్పథం కలిగిన తాత్త్వికతతో నిలడేదే ఆధునికత.
***
అభ్యుదయవాదం, విప్లవ వాదం వాస్తవికతావాదాలు కొంతవరకు హేతు వాదాలు ఈ
కోవలోకే వస్తాయి.ఆధినికతాతత్త్వం పరకాష్ట చేరిన దశలో సింబాలిజం, ఇమేజిజం,
ఇంప్రెషనిజం, ఫ్యూచరిజం, డాడాయిజం, సర్రియలిజం, నేచురలిజం అనే ధోరణల
సమూహమే '' ఆధునికతకు '' మారుపేరులయ్యాయి.ప్రపంచంలో 1748 లో వచ్చిన వైజ్ఞానిక పారిశ్రామిక విప్లవం, 1780 లో వచ్చిన రాజకీయ ఫ్రెంచ్ విప్లవం 1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచయుద్ధ నేపథ్యాలలో ఈ సాహిత్య ప్రపంచంలో కవిత్వం కొత్తపుంతలు తొక్కింది. కాల్పనిక వాదం, సాంప్రదాయికతా వాదం, హేతువాదం లాంటివి 18, 19 శతాబ్దంలో మానవుడికీ ప్రకృతికి మధ్యగల సంబంధాలు, వైరుధ్యాల నేపథ్యంలోనే ఉద్భవించాయి. తదుపరి స్వేచ్ఛావాదం, ఫ్రాంస్‌ లోను, ఆదర్శవాదం జర్మనీలోనూ, సౌందర్యవాదం బ్రిటన్‌లోనూ పుట్టాయని తెలుస్తోంది.
***
మన తెలుగునాట కాల్పనిక వాదానికి ఆర్థిక పునాదులు లేవు. అర్థ ధనస్వామ్య, అర్థ భూస్వామ్య విధానాలు కొనసాగి భావ కవిత్వం పురుడుపోసుకుంది. పై పాశ్చాత్య ధోరణులు ప్రభావంతో, భిన్న ధోరణులతో భావ కవిత్వంలో చోటుచేసుకున్నాయి. స్వీయ నియంత్రణ ద్వారా అమలిన శృంగారం, విషాదం,నిరాశ, పునరుద్ధరణ, జాతీయోద్యమం, దేశభక్తిలాంటివి భావ కవిత్వంలో మార్పులు మనం గమనించవచ్చును.అలాగే సామ్యవాద వాస్తవికతకు, కాల్పనంకతను జోడించినపుడే సాహిత్యం ప్రజలకు చేరువౌతుంది అని విప్లవవాదుల భావన. తాత్వికంగా ఆధునికతలో భాగంగా తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్న ధోరణి వాస్తవికతావాదం సహజవాదం(నేచురలిజం)పేర అమెరికా రష్యాలలో 19 వ శతాబ్దం చివరిలో విరివిగా కనిపించింది. వాస్తవికతా వాదంలో (క్రిటికల్ రియలిజం) సవిమర్శక వాస్తవికత(సోషలిస్టు రియలిజం) సామ్యవాద వాస్తవికత ప్రధాన అంశాలుగా పేర్కొనవచ్చును. వాస్తవికతను ప్రతిబింబించడంతోపాటు సామాజిక జీవిత సమస్యలకూ పరిష్కారం సూచించడం ఒక భాగమని తెలుస్తుంది. సమాజ చరిత్ర దృష్టితో చిత్రీకరించడం కూడ వాస్తవికతలోని భాగమే. '' కమ్యూనిస్టు అన్విక్షకి విషయంలో అచంచల నిష్ట, ప్రజాసేవానిరతి, పాక్షికత,శ్రామికజన సమరశీల పోరాటాల సంబంధం, మానవీయ
సోషలిజం'' సామ్యవాద వాస్తవికతకి అద్దం. ఈ పరిస్థితిని వివరించేది మాత్రం గతితార్కిక
భౌతిక వాద సిద్ధాంతమే. ఆ సిద్ధాంతమే అభ్యుదయ సాహిత్యానికి పునాది. త్రిపురనేని రామస్వామి చౌదరి రచనల్లు రేషనలిజం ఆధారంగా వుంటాయి. పాశ్చాత్య దేశాలలో

17 వ శతాబ్దంలో ఆరంభమై మనదేశానికి 20 శతాబ్దానికి మాత్రమే యిది మొగ్గతొడిగింది. కాల్పనిక వాదానికి సమాంతరంగా హేతువాదం ఆరంభమైంది. ముద్దుకృష్ణ '' అశోకుడు ''- చలంగారి '' సావిత్రి ''- పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి '' మహాభారత విమర్శనం'' - నార్ల వారి '' జాబాలి '' - త్రిపురనేనివారి '' ఖూని. భగవద్గీత, '' లాంటివి ఉదహరించుకోవచ్చు.
***
తరువాతి పరిణామాలు అధివాస్తవికత, అస్తిత్వవాదం, అనుభూతివాదం, చైతన్య స్రవంతి, విప్లవ వాదం సంప్రయదాయవాదం, రూపవాదం, జనామోద వాదంలాంటీ ధోరణులు శాఖోపశాఖలుగా వాదాలు, వివాదాలు నినాదాలు ఉద్ధానకతనాలతో సాగింది. సాహిత్యోద్యమం దిగంబరకవిత్వం, దళిత వాదం, స్త్రీవాదం, అంటూ ఎన్నో రకాలుగానూ సాగింది. అరసం, విరసం, సరసం..ప్రరసం...అంటూ సంఘాలూ వచ్చాయి.సాహితీకృషి విరివిగా జరిగింది.
ఉపసంహారం:
దేవీప్రియ ఒక వ్యాసంలో '' రచయితలకేమైనా చెబితే లెక్చరిచ్చినట్టుంటుంది. జనామోదం కోసం యేదిపడితే అది రాయకండి. జనానికేమి అవరమో? ఎటువంటి జాగృతి అవసరమో? అది రాయటానికి మాత్రమే ప్రయత్నించండి! కె.వి.రమణారెడ్డి చెప్పినట్లు '' మార్క్సిజమే '' వల్లెవేయాల్సిన పనిలేదు. కాని, కావలసింది జీవిత వాస్తవాన్ని కాస్త చైతన్యవంతంగా అర్థంచేసుకుని, స్పష్టమైన అవగాహనతో సాహిత్య రూపంగా ( కథ/కవిత/పద్యం.గేయం/వ్యాసం/రూపకం)రూపమేదైనా దాన్ని లోకానికి చేరేలా చేయగలిగితే - ఆ సాహిత్యానికి అసలు సిసలు జనామోదం లభించి తీరుతుంది ''
Betrot Bretcht అభిప్రాయం ప్రకారం '' Popular means intelligible to broad
maasses, taking over their own forms of expression and enriching them (by adopting and consolidating their stand point) representing most progressive section of the people in such a way than it can take over to leadership.''

***
ఇవాళ కొత్త ధోరణి ప్రబలింది. మార్క్సిస్టు సిద్ధాంత నినాదాలు, విప్లవ అలంకారికత వాడే
రచయితల తెగ యింకొకటి పుట్టుకొచ్చి, '' కవిత్వ పదార్థం '' యెక్కడున్నా అస్వాద యోగ్యమే! మార్క్సిస్టు సిద్ధాంతం పోరాట ప్రవచనాలు తమకీ తెలుసు. అచరణకీ సిద్ధాంతనికీవున్న మార్క్సిస్టు నిబంధనని విస్తృతం చేయడమే వారి లక్ష్యం. ఆంధ్ర దేశంలో యీనాడు వెలువడుతున్న సాహిత్యాన్నీ పలాయనవాద సాహిత్యం, బూర్జువా సిద్ధాంత పునాది అధారంగా వున్న సాహిత్యం అతి '' వామ '' పక్ష సిద్ధాంత ప్రేరిత సాహిత్యంగా స్థూల విభజన చేసుకోవచ్చు.పై తరహాలన్నీ కూడ ప్రయోజనపుష్టమైన సాంస్కృతిక రంగాన్ని యేర్పాటు చేయవు. ఫెడ్రిక్ ఎంగిల్స్చెప్పినట్టు '' Freedom is recognition of necessity '' ఇదే అంశం మీద క్రిస్ట్‌ఫర్‌ కాడ్వెల్‌ అన్నమాట గుర్తు
తెచ్చుకుందాం '' Art is the expression of man's freedom in the world of feeling, just as science is the expression of freedom in the world of sensory perception, because both are conscious of the necessities of their worlds and can change them-art the world of feeling of inner reality, science the world of phenomena of outer reality'' (Illusion and reality - Christfer Caudwel)

(ఆర్వీఆర్ వ్యాాసాల నుండి సేకరణ )

10.2.2014 ఉ.7.30

No comments: