కపిల రాంకుమార్|| మచ్చ ||
ఒంటరి గది, చిన్న కిటికి
రెండో మనిషికి నిలబడె చోటులేని
ఇరుగు గది...
ఆ గదిలో దాదాపు ఐదేళ్ళు బందీని!
అదీ పెళ్ళయ్యే వరకు!
తలచుకుంటేనే భయం! భయం!
రజస్వలైన 12 ఏటనుండి
తిండికి స్నానానికి తప్ప - బయటిలోకం తెలియకుండా
నిర్బంధానికి గురిచేసిన - సంప్రదాయపు సంకెళ్ళు!
మరువలేని కరాళ నృత్ర్యం! కళ్ళల్లో శూలాల్లా గుచ్చుకుంటూ
కంటి నిండా నిద్రలేని రోజులెన్నో
కన్నీటి చారికలతో చెంపలు - బిగిసిన విషాదపు ఘాతాలెన్నొ!
చదువు చంకనాకి - గుణింతాలు మరిచిపోయే
మైమరుపు ఆవహించినట్లు - అక్షరాలు తడుముకుంటూ
పనికిరాని కాగితాలపై - కాటుకలో ముంచిన చీపురుపుల్లతో
రాసుకున్న పిచ్చి భావనాగీతాలెన్నో!
***
ముక్కు మొహం యెరుగని
కొత్త వ్యక్తితో ముడిపడేవరకు లభించని విముక్తి
అది స్వేచ్చ మాత్రం కాదు
మరో బందిఖానాకు బదిలీ మాత్రమే
అక్కడా ఎన్నో నిబంధనలు,
నియమాలు కట్టుబాట్లు ....
చదువుకు మాత్రం పుల్‌స్టాప్ పెట్టిన వైనం!
కోరిక కొంత కాలనాళికలో స్థాపితం కాబడిన కొత్త కారాగారం
అత్తవారిల్లు!
***
ఒక రోజు పెద్ద ఉరుము మీద పడ్డట్టు మా వారి గొంతు
ఎవరో చెప్పితే, విని ముక్కోపంతో
రాక్షసుడిలా ఘర్జన...
'' చదువురాదను కుంటే
కవితలు, కథలు కూడానా....అదీ
పురుషాహంకారాన్ని సవాలు చేసేలానా? ''
అంటూ తన నడుము బెల్టుతో
విశ్వరూపం నా వీపుమీద!
కళ్యాణమైన తదుపరి సుఖపడింది లేదు
పైపెచ్చు ఆంక్షలు! పాబందీలు!
పెళ్ళికాకముందు చిత్తుకాగితాలపై రాసిన భావనలు
మా తమ్ముడు జాగ్రతగా వివిధ పత్రికలు పంపినట్టున్నాడు
నా కర్మకాలి అచ్చవటం - మా యముడి దృష్టికి రావడం!
ఈ రసాభాసకు ఆజ్యం అయింది!
మళ్ళీ నాలుగేళ్ళు మౌనం!
మా యమునిలో మార్పు వస్తుందేమోనని
అదీ ఒక కొడుకుపుట్టిన తరువాతనైనా
అడియాసే మిగిలింది.....
ఆంక్షలు యథాస్థితే కొనసాగింది!
రెండో సంతానం ఆడపిల్ల కలగగానే
నాలో పట్టుదల ఎక్కువైంది!
నాలా నా బిడ్డ నిర్బంధాలకు గురికాకూడదనుకున్నా!
గట్టి నిర్ణయం తీసుకున్నా
యముడ్ని సమధానపరచాలని చూశా! -
ఊహూఁ . ససేమిరా అన్నాడు!
నా అత్త మామలు అదే దారి
తీవ్ర సంఘర్షణానంతరం విడాకుల వరకువెళ్ళింది!
కొంత కాలానిలి మా ఆమ్మ, నాన్న గతించారు,
ఇక నాకు పెద్ద దిక్కుగా ఒకే ఒక వితంతు సోదరి,
తను మాత్రం నా భావాలకు విలువిచ్చి
ప్రోత్సహించింది కాబట్టి
మీ ముందు ఓ రచయిత్రిగా, కవయిత్రిగా, కాలమిస్టుగా
ఒక తల్లిగా, ఒక ఉద్యమ కార్యకర్తగా ...నిలబడ్డాను.!
అందుకు నా లాగే మచ్చలనుభవించిన మా అక్క
నన్ను ఇంత దానిని చేసింది....ఆమెకు ఎల్లపుడూ
ఋణపడివుంటా నేనెల్లపుడూ.....
నా బిడ్డ, నాకొడుకు ఇద్దరు చదువుకుంటున్నందుకు
ఆనందం, సంతోషం,
నేపుట్టిన 33 సంవత్సరాలనంతరం
నాలో కొత్త సమరోత్సాహం !
వంటి మీద మచ్చలుగా మిగిలినా,
మనసుమీది మచ్చను తొలగించాలని
మచ్చరాలిక రాకుండా నిలువరించాలని!
***.....
ఒకానొక దృశ్యం దీనికి ప్రేరణ .....
1.2.2014 సాయంత్రం 4.10

No comments:
Post a Comment