కపిల రాంకుమార్ || మనాది ||
బువ్వకే గతిలేదు
యిగ దివ్వెల పండుగొచ్చి మీదపడుటేంది!
మనాదితో ఏడుకండేల బావిలో
పునాది తవ్వుకున్నాట్టు బతుకు
కునారిల్లుతుంటే
కాకరపూల సోయగమేమెక్కుతాది?
పసికూనల ముఖాలువాడివత్తలైతావుంటే
తాగ పాలు లేవు, అయితే మాన్లే
గంజినీరు కరువాయే!
మతాబులు కాల్చే తీర్కేడిది
యింటి సుట్టు మురుగుతో
దోమలతోలేటందుకే సరిపోతుంటే
పైసలువెట్టి పండగేట్టా సేత్తాననుకున్నావు?
సర్రున తారాజువ్వలెగరేసే దమ్ములేదు
అవేమీ అంబరాన్ని తాకలేవు
భళ్ళున కిందవడుడేకాని,
పైకెళ్ళిన ధరల్ని దింపేటివి కావుకదా
కర్సుదండగ!
ఒక్కమాట సెప్పాలే
కుదిరితే విష్ణు చక్రాలు తిప్పాలనివుంది
లోకమంతా తలబిరుసునాయాళ్ళ తలలు నరకాలిగంద!
చిచ్చుపెట్టే బుద్ధులున్న జనాల మధ్య
తుస్ బుస్సుమని చిచ్చుబుడ్లు యేం సరిపోతాయి ?
మట్లాడితే గయ్‌గయ్‌మని పైకి ఎగరటమే కాని
ఆకాశాన్ని అందుకోలేరు,
ఆవకాశాల్ని దొర్కబుచ్చుకోలేరు
మనకుర్రకారు రవ్వల రాకెట్టు లాగా పైకి ఎగిరినట్టే
ఎగిరి కిందపడటమే కదా!
అప్పుడప్పుడు చిటపటమంటూ ధర్నాలు
బందులు సేసుడే కాని సీమటపాకాయంత విలువావుండది
అఁ.. సెవులు సిల్లులుపడేలా దేబురింతలు, డాబుసరి డప్పులా
కొద్ది ఔట్లు, మరొకొన్ని ఆటంబాబులు
ఆకాశరామన్న ఉత్తరల్లా డబాయించుడే కాని
ఒక్క రాయిని పగలకొట్టవు
ఒక్క రాజుని మార్చలేవు
వందలు వెచ్చించి టపాసులు ఎన్నైనా కాలుస్తారు కాని
చూస్తూ చూస్తూ పదిరూపాయల నోటును కాల్చమనుండ్రి చూదాం!
గద్దెనెక్కిన నాయాళ్ళ దిమ్మ తిరిగేలా
భూచక్రాలు తిప్పి,
ఆవుని అడ్డపెట్టుకునే రాచకీయం చేసేవాళ్ళను,
కుక్కకున్న విశ్వాసం లేకుండ గెలిపించినోళ్ళను కరిచేవాళ్ళను
కుళ్ళపొడవాలనివుంది!
తాటి బుర్రలో పటాసు మందు దట్టించి
తోలు లేచేలా దిష్టి యంత్రాలు పెట్టాల్నుంది.
ఎన్ని సట్టాలు సేసినా, ఎన్ని డేగకళ్ళు నిఘా కాసినా
ఆగని అత్యాచారాలమీద మన్నువడ
దాష్టీకం చేసేటోళ్ళ హంసలను లేపేయ్యాలనివుంది
కాని హింస మార్గం కాదు కాని
దుమ్మెత్తిబోసి శాపనార్థాలుకు తప్పులేదు
అప్పుడు కాని నా మనాది
కుదుటపడదు.!

No comments:
Post a Comment