Tuesday, June 25, 2013

కపిల రాంకుమార్|| గేయం - పాట ||
''వృత్తం, గేయం, వచన గేయం, - చందస్సుల పరిణమ క్రమమని, యే భాషలోనైనా
అక్షర గణ వృత్తాలకంటే ముందుగా మాత్రా చందస్సే పుడుతుందని, యే కవిత్వానిలైనా
పురుడుపోసుకునేది పాటతోనేనని, పాట, గేయం ఒకటేనని నా అభిప్రామని, గాన యోగ్యమైనదే గేయం '' అని సి.నారాయణరెడ్డి అంటారు.

'' చందో వ్యవస్థను దాదాపు రెండు భాగాలుగా విభజించి పరిశిలిస్తే, ఒకటి పద్య భాగంగా,
మరొకటి గేయ భాగంగా నిర్థారించాలి. పద్య భాగం ' అక్షర ' చందస్సుతోను రెండవ భాగం
' మాత్రా ' చందస్సు తోనూ గుర్తించాలి. పద్యంలో జాతులు, వృత్తాలు, అనే రెండు
వర్గాలున్నాయి. మాత్రా చందస్సును - వృత్త చందస్సుగా ప్రిగణించే క్రమంలోనే
జాతులుగ పేర్కొనటం జరిగిందని పరిశీలకుల అభిప్రాయం '' అని అంటారు డా.కోవెల
సంపత్కుమారాచార్య.

'' గేయం '' అంటే మాత్రా చందస్సని తాత్పర్యం. అవి పద్యంగా, వృత్తంగా రూపొందే
క్రమంలో్ సన్నిహితపూర్వ దశ ''జాతులు '' ఈ సహచర్యం వలననే తెలుగు పద్యాలలో
ద్విపద, సీస, గీత జాతులతో గేయం తాలూకు వెసులుబాటు వృత్తంలా పదాల బిగింపు
రెండు మనం చూడవచ్చును. జాతులు మాత్రా చందస్సులే కాని, జాతుల మధ్య పద్య
సాన్నిహిత్య కారణంగా, ఒకటి మాత్రాగణ పద్ధతి, రెండది సంఖ్యా గణ పద్ధతి అని స్థూలంగా
రెండు విభాగాలుగా చెప్పుకోవచ్చును. వీటిలో రగడాదులు చేరుతాయి. మరొక ముఖ్యమైనదే
మంటే '' చందస్సు కవిత్వానిఉకి తప్పనిసరి నియమం కాక పోయినా, కవితా సౌందర్యాన్ని
మరింత ఇనుమడింపచేయటానికి పనికివస్తుందని, కవిత్వానికి చందస్సు కావాలా? వద్దా?
అని పదేపదే పున:రాలోచించాలని '' డా. చిన్న కేశవ రెడ్డి అభిప్రాయపడ్డారు.

గురజాడ మాటల్లో : ' చందస్సుకోసం, యతి ప్రాసల కోసం నిరర్థక పదాలను ఫర్లాంగు రాళ్ళవలె నిలిపెయ్యాలి. ' కౌపీన సంరక్షణార్థమయం పటాటోప: ' అన్నది కీలకాంశం. ఒక్క నిరర్థక పదం లేకుందా అన్ని, యిన్ని కాదు యెన్నో పద్యాలను చూడవచ్చు.చందస్సు, యతి ప్రాసల కోసం యిబ్బంది పడటమనేది పద్యానికే కాదు, గేయానికి వర్తిస్తుంది. అందుకే వ్యవహార భాషా పదాలనుసులువుగా, యథేచ్చగా యిముడ్చుకునే చందస్సులను మనం సృష్టీంచుకోవాలి ''

కేవలం గతిననుసరించి,లయ బద్ధంగా పాడుకోటమే గేయ లక్షణం. దానికి రాగ, తాళాదులు
జోడించి పాడుకుంటే పాటవుతుంది. '' గేయం - పాట '' ఒక రచనను - రచనగా వస్తు పర
దృష్టితో గేయమా? పాటా? అనాలా అని స్పష్టీకరించడం కష్టమే. జాగ్రతగా గమనిస్తే రాగం
తీయటానికి అనుకూలంగా కొన్ని జాగాలు వదిలి, అది పాటగానో, గేయంగానో పేర్కొనవచ్చు.
దాని తయారీ విధానంతోనే అది గేయమో/పాటో తేలిపోతుంది.

గేయం వేరు, పాట వేరు అని, సంస్కృతంలో గేయమని, తెలుగులో పాటయని అంటున్నారు.
అయినా స్పష్టత రావలిసివుంది. రెండు రకాల్ భేదాలను గుర్తింఛటానికి రెండు వేరువేరు పదాలు ఆ భాషలో వున్నట్లు కనపడదు. అంటే సంస్కృతంలో పాటను యేమంటారు? తెలుగులో గేయాన్ని యేమంటారు - అని గుర్తింపులేదు.

అయితే కవులు గేయాన్ని యెందుకు యెక్కువగా స్వకరించలేదో, అందుకు కారణాలు యేమిటో పరిశోధించాల్సివుంది. అనుభూతి వాద కవులు గేయాన్నే కాక, పద్యాన్ని కూడ వదిలి ( రెంటినీ వదిలేస) కేవలం వచన గేయాన్ని (వచన కవిత - ప్రోజ్ పొయిట్రీ/ ఫ్రీవెర్స్ ) యెందుకూ రాస్తున్నారో విశ్లేషణ చేయవలసివుంది. కని మనం బాగా గమనిస్తే గద్దర్, వంగపండు ప్రసాద్ లాంటివారు ప్రధానంగా పాటను ప్రాధ్యానతాక్రమంలో వుంచతానికి కారణం బహుశ: అది జనానికి అందుబాటులోవుంటుందని, దగ్గరగా తీసుకువెళ్ళే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. వారు ప్రజా గాయకులుగా ప్రసిద్ధిపొందింది
అలాగేకదా! రేపు ఆధునిక సమాజం ఎంత మారినా గేయం మ్రోగుతూనేవుంటుంది. మానవ జీవితంలో ' లయ ' మిగిలివున్నంతవరకు, ఆ ' లయ ' ను నిలబెట్టే ప్రయత్నమే కవిత్వం, సాహిత్యాల ప్రముఖ లక్ష్యం ' అని డా.కోవెల సంపత్కుమారాచార్య అంటారు........

(మిగతా తరువాత)
25.6.2013

Tuesday, June 18, 2013

|\ శ్రీశ్రీ వర్థంతి నివేదిక |


కపిల రాంకుమార్|\ శ్రీశ్రీ వర్థంతి నివేదిక ||” శ్రీశ్రీ కొనసాగించిన సమసమాజాకాంక్షాయుత సాహిత్య మార్గాన్ని అనుసరించటమే అసలైన నివాళి ” కావూరి పాపయ్య శాస్త్రి ఉద్ఘాటన. ఆదివారం మీ కోసం – సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా కమిటి సంయుక్ల్తంగా నిర్వహించిన శ్రీశ్రీ వర్థంతి సభలో ముఖ్య ఆహ్వానితుడుగా డా. కావూరి పాపయ్య శాస్త్రి పాల్గొన్న సభలొ, డా. సిహెచ్. ఆంజనేయులు, రౌతు రవి (సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి) కె. ఆనందాచారి ( సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు) ఆదివారం మీ కోసం బాధ్యులు జోసఫ్ అధ్యక్షతన సందేశాలిచ్చారు. తొలుత వారంతా ఖమ్మం నగర ప్రారంభంలో రింగ్ రోడ్డు వద్ద గల మహా కవి శ్రీశ్రీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కె.హిమబిందు, జోసఫ్ (ఆదివారం మీకోసం) ఆనందాచారి, రౌతు రవి, ఎం. శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య, సునంద (సాహితీ స్రవంతి) కపిల రాంకుమార్ (బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు) డా. కావూరి పాపయ్య శాస్త్రి, (ఫ్రధాన అహ్వానితుడు)డా.సిహెచ్. ఆంజనేయులు, ( ఆహ్వానితుడు) యువకవులు రౌతు కడలి, తదితరులు ఘనంగా నివాళులిచ్చారు.
తాళ్ళూరి లక్ష్మి, రాధ, బండారు రమేష్, తోటకృష్ణారావు, బండారు రమేష్, మహతి (తేజశ్రీ)సునంద, దాసోజు శ్రీనివాస్, క్రాంతికార్,కపిల రాంకుమార్, కవితలు చదవగా, ఎం.శేషగిరి తన గాత్రంతో చక్కని శ్రీ శ్రీ గీతాన్ని ఆలపించి కవిసమ్మేళనం ప్రారంభించారు. ప్రధాన వక్త డా. కావూరి పాపయ్య శాస్త్రి మాట్లాడుతూ ” శ్రీశ్రీ స్పష్టమైన సాహితీ అవగాహన కలిగి, సంస్కృత, ఆంగ్ల, తెలుగు భాషాలలో గట్టి పట్టు కలిగివుండతమేకాక, ఎన్నో అనువాదాలకు, అనుసృజనకు, కొత్తకొత్త ప్రయోగాలకు ఆద్యుడై ఈ శతాబ్దం నాది అని నమ్మకంగా చెప్పకలిగాడంటే అది అతని చేవ కలిగిన సాహితి కృషికి నిదర్శనమని చెప్పవచ్చు. అప్పటిదాకా వున్న భావ కవితా ధోరణికి బిన్నంగా అభ్యుదయ భావాలను రంగరించి మొదట సంప్రదాయ సాహిత్యంలో వృత్తాలలో, కందాలతొ ప్రారంభించి, క్రమేణ మాత్రాచందస్సు పట్టుకుని గురజాడ వార్సత్వాని కొనసాగిచి ‘ అడుగుజాడ గురజాడది ‘ అనిపించాడు.వ్యాసం, సమీక్షలు, రేడియో నాటికలు, ఇతర భాషా చలన చిత్రాలకు తెలుగు అనువాదం చేయడం, పత్రికా రంగం,యిలా యెన్నో విభాగాలలో శ్రీశ్రీ తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించి అందరి మన్ననలను పొందాడన్నారు.” ”ఎంత సంక్లిష్టమైన పదాలనైనా, మరెంత సరళపదాలనైన తన కవితలో సహజంగానే పొందుపరిచే నైపుణ్యం ఆయనది. సినిమా పాటల్లో తనదైన ముద్ర కనిపించేలా మెళుకతీసుకున్న ఘనుడు. రాజకీయాలల్లో వామపక్షాన్ని సమ్ర్థించినవాడు. మద్రాసు శాసన మండలి సభ్యుడుగా పని చేసిన మహాకవి కమ్యూనిజాన్ని అతిగా ప్రేమించాడు, దాని కోసం అహరహం కృషిచేసినవాడు. కవి సామ్రాట్ విశ్వనాథ మెప్పును సంపాదించిన సౌమ్యుడుగా, విప్లవ రచయతల సంఘంలో పనిచేసిన అతివాద కవిగా, బహురూపాల్లో సాహిత్య, రాజకీయ, సామాజిక అంశాల్ను ప్రభావితం చేయటంలోను యెంతో మంది యువకవులను తన మార్గంలో నడిచేలా మార్గదర్శి కావటంలో, తదనంతర తెలుగు సాహితీ విస్తృతి పొందటానికి శ్రీశ్రీ కృషి అనిర్వచనీయము, అమూల్యము ”అని తన ప్రసంగంలో ఆనందాచారి వక్కాణించారు. ఆదివారం బాధ్యులు, కె. హిమబిందు, జోసఫ్, చావా వీరభద్రయ్య, స్వామి, జి.నాగేశ్వర రావు, ప్రజాసంఘాల నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు ఎ.జె.రమేష్, నున్నా నాగేశ్వరరావు, వాసిరెడ్డి వీరభద్రం, బి.వి.కె. మేనేజింగ్ కమిటీ భాద్యులు, ప్రసాద్, గోపాలరావు, బి.వి.కె. విద్యార్థులు పలువురు పాల్గొన్న ఈ సభలోనే ఖమ్మంకు చెందిన కవి డా. అఫ్సర్ కు ”మధురాంతం జానకిరాం – కథ 2012 అవార్డు ” కోదాడనుంచి ఈ సమావేశానికి వచ్చిన బంగారు రామాచారి అఫ్సర్ అమెరికాలో వున్నందున ఆయన తరఫున తమ్ముడు ఫసియుద్దీన్‌ కు అందచేయటం విశేషం.శేషగిరి వందన సమర్పణ చేసారు.>>>>
18.6.2013

Saturday, June 15, 2013

|| ఆగంతకుడు||

కపిల రాంకుమార్|| ఆగంతకుడు||

ఆ ఆగంతుకుడు
యేన్‌ అన్‌నోన్‌ ఆర్ యు.ఎఫ్.ఓ లాగ
ఆరడుగులుంటాడు.
ముఖం చాటేసుకుని
ముచ్చట్ల పేర కామశాస్త్రాన్ని
నిత్యపారాయణంలా స్తోత్రం చేస్తుంటాడు!
చతుర్దశ విద్యలు చదువుకున్నాటంటాడు కాని
సంస్కారం మాత్రం బొత్తిగా లేదు
ఉప్పులేని కూరలాంటోడు!
ఎన్నిసార్లు గెంటేసినా కుంటిసాకులతో
చిన్నోడి మంచితనాన్ని బుట్టలో పడేసి
భుజాలెక్కి కూర్చుంటాడు దిగనంటూ!
సిగ్గులేక మన గడపముందే
ఆంధ్ర నాట్యంచేస్తానంటాడు
ఆరంగేట్రంనాడే బూతు చిందులేస్తూ
అదే తన జాతి గౌరవమంటాదు
రెచ్చగొడతాడు,
చిచ్చుపెడతాడు,
చూపులో క్రౌర్యం, భాషలో కాఠిన్యం
గుండె మెత్తగావుంటే
బలమైన గుండుతో
గునపంలా ఒదేస్తాడు!
కవిత్వమంటే , కొత్త భాష్యం చెప్పచూస్తాడు
చెంపదెబ్బలు తాకినా - దులుపుకుపోతాడు,
జంకులేకుండా - రంకుకట్టే సంకుచిత ధోరణితో
సాత్విక వేషంతో - ఘాతుకాలు సలుపుతాడు,
అమాసకి, పున్నానికి - పిచ్చిలేచి
విరుచుకుపడుతూ
విశ్వవిఖ్యాత నటసార్వభౌముని వారసుడనని,
చౌడప్పని, ముద్దుపళనిని ఆదర్శంగా
కొక్కోకం బోధింపచూస్తాడు
కనపడితే కాలిచివేత ఉత్తర్వులున్నా
ఖాతరుచేయడు!
అప్రమత్తత లేకపోతే - మిమ్మల్నే కాటేస్తాడు,
వాడు సైకో కన్నా, ఉగ్రవాది బిన్‌లాడెన్‌ కన్నా మిన్న!
ఇక మీ చేతిలోని పెన్ను - గన్‌లా మారాల్సిందే!
లింగధారుడ్నంటూ లింగోద్భవవేళకి
కామకేళికి ఆడదైతేచాలు
వయసుతో వరసతో నిమిత్తంలేదు
చొంగకార్చినంత తేలిగ్గా, కళని దిగకార్చేస్తాడు
సంస్కృతీ యోనుల్నికాల్చి, నేనో యోగిపుంగవుణ్ణంటాడు
వాడి మూలాలతో సహా
ఆనవాళ్ళేమీ మిగలకుండా
పెకిలించితేనే మనకు మనశ్శాంతి
లేదా మనలనే బలిచేస్తాడు!
జాగో !యారో!...మారు వేషాలతో తిరుగుతుంటాడు
తస్మాత్ జాగ్రత! జాగ్రత!

Monday, June 10, 2013

సాహిత్యంలో కవయిత్రుల చురకలు

కపిల రాంకుమార్||  సాహిత్యంలో కవయిత్రుల చురకలు||
రాజుల కాలంలో పుట్టినదైనా, నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో , దుష్పరిపాలనలకు
అధికార వ్యామోహాన్ని, అధికారంతమున యెలావుండగలదో అని చెప్పేచాటు పద్యం
'' విధి సంకల్పమునచె నాకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువచూపు తక్కువ సదా భాషల్ దురుక్తుల్ మనో
వ్యథతో మత్తతతోడ దుర్వ్యసన దుర్వ్యాపారతన్‌ జెందు, న
య్యధికారాంతమునందు చూడవలదా యాయయ్యసౌభాగ్యమున్‌''

కవి ఎవరైనా, కాలం యెప్పటిదైనా, నిత్య ప్రయోజనంగల పద్యమొకటి
'' వాసనలేని పువ్వు, బుధవర్గలేని పురంబు, నిత్య వి
శ్వాసములేని భార్య, గుణ్వంతుడుగాని కుమారుడున్‌, సదా
భ్యాసములేని విద్య, పరిహాసములేన్మి ప్రసంగవాక్యమున్‌
గ్రాసములేని కొల్వు, కొఱగానివి, పెమ్మయ సింగ ధీమణి! ''

మరొక మచ్చుతునకను పరిశీలిద్దాం.
'' ఆడిన మాటలు దప్పిన
  గాడిదకొడకంచందిట్టగా, విని, యయ్యో
  వీడా, నా కొడుకని,
  గాడిదయేడ్చెందగదన్న ఘనసంపన్నా''
తిట్టులో హాస్యం - హాస్యంలో లౌకికం ప్రతిబింబించడం చాటువుల
లక్షణంగ చూడచ్చును.వ్యంగ్యం, కోపం, హాస్యం, తిరుగుబాటు తత్వ
కవిత్వ ధోరణి, అటు స్త్రీవాద కవిత్వంలొనూ మనము చూడవచ్చు.
మచ్చుకుకొన్ని మీ ముందుంచుతాను.

శ్రీమతి కె. సీతాపిరాట్టమ్మ వ్రాసిన ఈ కవితను చూడండి.
యజ్ఞయాగాది నిత్యాగ్నిహోత్రములెల్ల జుట్ట్ బీడిల్లో చుట్టబడియె
వేదపురాణముల్ విపరీతములటంచునండఱి భావంబులమరియుండె
భక్తివిజ్ఞానముల్ పరిపూర్ణమై తలన్‌ గ్రాపు రూపంబుతోగ్రాలుచుండె
నేయింటిపైజూడ '' నింగ్లీషు'' భాషలో బేర్లను చెక్కించిపెద్దలైరి ''
అన్యభాషపై మోజు ప్రభావం యెలావుంటుందొ వివరించిన ఈ కవయిత్రి
1934 నాటి సామాజిక చిత్రాన్ని మనకు చూపారు.
స్వాతంత్ర్య కాలంలోనో, తరువాతి యితర ప్రజాఉద్యమాలలో, సామాజికచైతన్యం
కోసం కలాలతో నిరసన తెలిపిన మరి కొందరి కవిత్వాన్ని ని రేఖా మాత్రంగా తడుముతాను.

'' రండదొరల రజాకార్ల జూసారూ!
  ప్రజలు నడుంకట్టి రణ్మందు దూకారూ
 ముసలమ్మలు, ముసలయ్యలు లేచారూ
 వారిచేతికందిన కర్రబడితెలే బట్టారూ ''
తెలంగాణా రైతాంగ సాయుధపోరాటకాలంలో ' కమల' అన భర్త అప్పన్నతో కలసి రాసి,
పాడిన గీతంలోనిదీ భాగం.

'' వృత్తి విభజనజేసి - ఊడిగము మనకిచ్చి
పురుషవర్గము వారు బులిపొంచివేసారు
ఆర్థికముగాస్త్రీల, ఓ సోదరి - అణగదొక్కేసారూ'' అంటారు వట్టికొండ  విశాలాక్షి  తన తిరుగుబాటు
స్వరం వినిపిస్తూ.

'' మేలుకో మేలుకో చెల్లెలా - మేలుకోకుంటే చిట్టి చెల్లెలా
ఉన్నవాళ్ళ యిళ్ళలోనా - ఊడిగాలే చేసుకుంటూ
పరులకోసం సొంత సుఖముల మరిచిపోయున చెల్లెలా
అమ్మగారీ కానుపైనా - అయ్యగారి పానుపైనా
అన్నిపనులు నెత్తినేసుక అణిగిపోయిన చెల్లెలా ''
అంటూ శ్రామిక మహిళల లైంగిక దోపిడిపై గళమెత్తిన గుజ్జుల సరళాదేవి కవిత చురకత్తిలా దూసుకెళ్ళింది.

'' నా దేశం బూర్జువాలని భుజాలమీద మోస్తూ
అమ్మమెరుగని వెర్రిజనాన్ని కాళ్ళకింద కసాబిసా తొక్కేస్తూ
ప్రగతిప్రగతంటూ పొలికేకలు  పెడుతోంది '' అని అత్తలూరి రాజ్యలక్స్మి పాలకవర్గాన్ని తూర్పారబట్టారు

'' కాంతను చూడగానే కన్నుగీటే
కామాంధులకు కారుచిచ్చునునేను
ఆడవారంటె ఆటబొమ్మలనుకునే
వారికి తోకచిచ్చునునేను '' అని తోకలంటించారు వాసా ప్రభావతి

'' పీడిత ప్రజా పోరులో సగాన్ని కదనంలో నిలిచిన కామ్రేడ్ ని
ఆదిమ గణాలకు నాయకత్వం నెరపిన ఆదిమానవిని ''
 అంటూనే...'' ఒళ్ళంతా కళ్ళుండాల్సింది
అహల్యకు, వరూధినులకే
ఇంద్రుళ్ళకి, చంద్రుళ్ళకి కీచకులకీ కాదు ''  అంటూనే
'' ఒళ్ళంతా కళ్ళే కాదు, మూళ్ళుండాలి
రోమరోమాన సిస్కాగ్రాఫులుందాలి '' అని తనదైన ఉద్యమ ధోరణిలో, వైప్లవ్య
చేతనాపూరిత కవితను  తీక్షణమైన ప్రతీకలతోపూరించారు రత్నమాల!

'' తొలిపొద్దు చీకట్లో, వాల్ పోస్టర్ల్ అతికించివచ్చి
నువ్వు తలుపు మీటిన జ్ఞాపకం
తలుపు తెరచిన నుదుటిమీద
ఉద్యమానికిపట్టిన చెమటను
చీరకొంగుతో అద్దిన జ్ఞాపకం '' ..స్త్రీవాద విప్లవ తత్వాన్ని పుణికిపుచ్చుకున్న
ముస్లింవాద కవయిత్రి  మహజెంబీన్‌ అంటారు. ఆవిడే ,మరో కవితలో
'' రాజ్యం తల్లి లాంటిది
అన్నలు తోడపుట్టినవాళ్ళు
అణిచివేత
యే రాజ్యానికి శోభనివ్వదు!..''

అంతటితో వూరుకోక మరొక చోట '' మాటలు రానపుడు యేమోగాని
పోరాటంచేయ కలసినపుడు
చేతులు కట్టుకు కూర్చోడం యికపై నా వల్లకాదు '' అని కూడ నొక్కి చెప్పింది మెహజన్‌బీ.

'' రంగుల్ని (వర్ణలను)చీపురు కట్టతో ఊడ్చి
రోడ్డవతల పారబోస్తా!
ఈ పుండు పగలకోసి మందేసి  కట్టి కట్టడమే,
యిపుడు నా కర్తవ్యం '' అంటారు ఎం.సీతాలక్ష్మి   అంబేద్కర్ కులనిర్మూలన దిశవైపు పయనిస్తూ.

'' అమ్మకి సేవ చేసినప్పుడు,
అమ్మవంటిదే అయిన జన్మ భూమి కోసం పనిచేసినపుడు
డబ్బులు ( ఫించన్‌)తీసుకుంటావా?  '' అని ప్రశ్నిస్తారు - కళాసహాని ఒక కవితలో

'' ప్రేమ యిపుడొక అంటువ్యాధి
నాగరికుల నెత్తురు  తోడుతున్న క్యాన్‌సర్,
నిన్నటి బానిస యివాళ నాగరికాత్మ కోసం వెంపర్లాడుతున్నాడు
ఓ రాబందు నీడ భూతలంపైన గిరికీలు కొడుతోంది '' - అని జమీలా నిషాత్  కవితాగ్రహం వెళ్ళకక్కారు.

'' వంటింటి సామ్రాజ్యానికి
మా అమ్మే మహారాణి,
అయినా వంటింట్లొ గిన్నెలన్నిటిపైనా
మా నాన్నపేరే? ' పురషాధిక్యతను వ్యంగ్యంగా నిలదీసారు కొనకంచి శారదాదేవి.
'' నేను పుట్టిన దేశంలో
రాజ్యాలేలిన రమణులున్నారు
రాళ్ళల్లే బతికిన రమణులూ వున్నారు
అసిధారపై అడుగులు అలవోకగా వేయనేర్చిన వాళ్ళున్నారు
మా యిళ్ళ అడపడుచులు సమస్యలే
తొలిశ్వాసగా వుపిరి తీయ నేర్చిన వాళ్ళున్నారు '' అని వివరణ్నిచ్చారు సి. వేదవతి తన కవితలో

తనదైన తీవ్ర నిరశన స్వరంతో శీలా సుభద్రాదేవి ఒక కవితలో యేమన్నారో చూడండి
 '' నన్ను ఆడదాన్నని అనకు!
నేను యెక్కడదాన్ని కావాలనుకోటం లేదు
అంతా నిండివుండే దాన్ని!
సంపూర్ణమైన వ్యక్తిగా మాత్రమే గుర్తించు!
నన్ను నారీ అని మురిపించకు!
ఆదర్శాల కిరీటం ధరించి శిరో భారంతో

నీముందు తలవంచుకు నిల్చోలేను '' ఖరాఖండిగా స్త్రీని నిలబెట్టాలని కలాన్ని ఝళిపించారు.

జ్యోతిరాణి ఓక సవాలు
'' అబలను నేనా? సబలనని నిరూపించుకోలేనా?
ఆపదలకు దడిసానా? మానవతను మరిచానా?
నాటికి, నేటికి - నేనే ఆరని జ్యోతిని '' అంటారు.

సమయం, విస్తరణ, సంక్షిప్తత, దృష్టిలో పెట్టుకొని,  కవితా అనంత సాగరంలో ఓక చెంచాడు
తీసుకుని రుచి చూడమనాను, శుచినిపొందమన్నాను.  యిలాంటి  సాగరాన్ని మరింత మథించి,
యెందరో మన వర్థమాన కవయిత్రులు చక్కటి, చిక్కటి పదసంపదను
సమకాలీన సమస్యలపై తూణీరాలను సంధిస్తూనేవున్నరు. యెందరో యెన్నిరకాలుగానో తమ వాణిని
బాణిని నిత్యం వినిపిస్తూనేవున్నారు. వారందరికి కవితాభినందనలు తెలుపుకుంటున్నాను.
అటువంటిని వారిని వెతికి వారి కవితాపాదాలను పరిచయం చేసుకోవాలని కోరుకుంటూ....
10-6-2013 ....ఉదయం 10.35




   




Saturday, June 8, 2013

అరసున్న [ ( ], బండి ' ఱ 'లు ఎందుకు?

Sunday, June 2, 2013

సాహితీ సంక్షిప్త ప్రసంగం

సాహితీ సంక్షిప్త ప్రసంగం

కపిల రాంకుమార్|| సంక్షిప్త సాహితీ ప్రసంగం||
ఆంధ్రప్రదేశ్ టైపిస్ట్స్ & స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్‌ , ఖమ్మం , జిల్లాపరిషత్ సమావేశమందిరంలో జరిగిన సభలో అతిథిగా హాజరై పాల్గొన్నపుడు మిత్రుల కోరిక మేర చేసినసస్ సాహితీ ప్రసంగంలోని సంక్షిప్త పాఠం: (1991-92 నాటి ప్రసంగంలోని భాగం)
కామ్రేడ్స్ & ఫ్రెండ్స్ !
నిత్యం ఉద్యోగ నిర్వహణలో తీరికలేని మీముందు కాసేపు ఈ చల్లని ససాయంకాలం సాహిత్య ముచ్చట్లు మాట్లాడలని నన్ను కోరినంద్కు ధన్యవాదాలు చెపుతూ నా వద్దకు వచ్చిన ప్రశ్నలను క్రోడీకరించి నాలుగ్ మాటలు ముచ్చటిస్తాను.
” వక్రోక్తి: కావ్యజీవితం” అని, ” వాక్యం రసాత్మకం కావ్యం” అని (విశ్వనాథుడు) ” రమణియార్థ ప్రతిపాదక శబ్ద: కావ్యం ” అని
విశ్వనాథుడు, ” కావ్యే యశసే, అర్థకృతే, వ్యవహారయుజే, కాంతా సమ్మతతయా ఉపదేశయుజే ” అని, ‘ కవయ: క్రాంతి దర్శిన: ‘
‘ మంద: కవియశ్: ప్రార్థీ ‘ అని (కాళిదాసు) అనే నిర్వచనాల మధ్య ‘ what is poetry, but the thoughts and words in
shich emotion spontaneously embodies itself – Mill ” ‘ Poetry is to language of imagination and the passions – Hazlit” ‘ poets are un-aknowledged Legislatures ‘ ఇవికూడ మన సాహిత్యాభిలాషకు ప్రేరణనిస్తాయి. కవితా హేతువు ‘ ప్రజ్ఞ ‘ త్రైకలికము అంటారు లాక్షణికులు ‘ స్మృతిర్వ్యతీవ విషయా, మతిరాగామిగోచరా, బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయా, ప్రజ్ఞా త్రైకాలికీమతా ‘ అని కూడ తెలియబగును. జరిగిన దానిని చెప్పుట – ‘ స్మృతి, సంస్మరణ’, జరుగనున్న దానిని చూపునది ‘ మతి ‘ , తాత్కాలిక వ్యక్తమును ‘ బుద్ధి ‘ అని, భావి పిరాతనాద్యతనములుగ సర్వ విషయములను స్పష్టీకరించునది ‘ ప్రజ్ఞ ‘ అని తెలిస్తున్నది. ” సంగీతమపి సాహిత్యం సర్స్వత్యా స్తనద్వయం – ఏకమాపాత మధురమన్యదాలోచనామృతం ‘ అని పెద్దలు వివరించారు.
మరొక విదేశీయుని నిర్వచనమిలావుంది ” ప్రతిభ మనముందు కనిపించినపుడల్లా మనం దానిని గురించకలిగి లిట్మస్ కాగితంలా నీలంగానో, ఎర్రగానో మారకలిగితే యెంత ఆనందకరంగా వుంటుంది కాని, నిజమైన కవిత్వం చదువుతుంటే వెన్నెముకలో విద్యుత్తు ప్రసరించాలి కాని పొత్తి కడుపులో బాధపెట్టీ, వాంతి చేసుకునే ప్ర్యంతం కాకూడదు ” అంటాడు.

కవుల పద చిత్రాలు కొన్ని పరిచయం చేస్తాను మరో గెర్నికా రచయిత రవీంద్ర సాగర్ వాళ్ళవూరు గురించి ” ఊరు మీద జెండాలు యెగరనంత కాలంం గూండాలు తిరగనంత కాలం – నా ఊరు లుంబినీ వనంలావుంది / నేడేమో – నెత్తుర్లో పొర్లుతూ, శ్వాల మధ్య దొర్లుతూ మరో జాఫ్నా అయింది ” ఫాక్షన్‌ రాజకీయ కక్షలకి పల్లెటూరు యెలా మారుతోందో కవిత్వీకరించారు.
ఇంకో కవితలో ‘ రేకల్లో ఉయ్యాళ్ళ ఉరితీసిన బాల్యం, అమ్మనుచూసి బావురుమంటె శుష్కించిన స్తనం బిడ్డను చూసి బావురుమంటుంది ” శ్రామిక మహిళ స్థితి దృస్యీకరించారు కవి. కాటికాపరి అనే కవితలో ” రామ రాజ్యాలు – స్వర్ణ యుగాలు, వెలివాడల బతుకులో వెలుగులు నింపలేదు, స్వాతంత్ర్య ఫలాలు అందని ద్రాక్షలైనాయి, బేసిక్ ఇంక్రిమెంటు, పియ్ఫ్స్ లేని వెట్టి ఉద్యోగం – వల్లకాటి సెక్రటేరియట్లో
యే గర్నమెంటూ గుర్తించని ఎంప్లాయి ”
మరొక కవయిత్రి శీలా సుభద్రా దేవి ” ఒప్పులకుప్ప ” అనే కావ్యంలో ” ఇంటర్నెట్ లో ప్రపంచాన్ని దర్శించే కళ్ళు/ రేచీకటి వచ్చీనట్లు ఆధారం కోసం వెతుక్కూంటాము, కంప్యూటర్ వైరస్ వెతికి తీయకలిగిన మేథస్సు జీవితాల్లోని వైరసును తీసిపారేయలేక, మళ్ళీ అతీత శక్తులనే నమ్ముకుంటున్నాము.” అమెరికా అనే కవితలో ” రెక్కలొచ్చిన పిట్టలై/ కన్నవారిని, జన్మ భూమిని వదిలిపెట్టి/ డాలర్లు యేరుకునేందుకు/దూరపుకొండలనీడల్లో వాలుతారు ” నేటి పిల్లల డాలరు ప్రేమ గురించి , చేనేత అనే కవితలో ” మేం బట్టలు నేసేటోళ్ళమే – అందుకే కద / అగ్గి పెట్టిలో ఆరు గజాల చీరను దాచినట్లుగా/ అవమానాల్ని స్వర పేటికలో మడిచి పెట్టాం ” చేనేత బ్రతుకును వివరించారు. ‘ చైతన్యం ‘ అనే కవితలో ” ఆలోచనాక్షరం దిద్దిన వాళ్ళెపుడు/సోమరిగా కాలాన్ని బఠాణీల్లా చప్పరించరు!/ నుప్పుని యెగదోసినట్లు చైతన్యాన్ని మేల్కొల్పుతారు ” మరొక కవితలో ” తూనిగల్లా, తోటల్లో, తోపుల్లో పరుగులు తీయాల్సిన, ని్న్నటి బాల్యంలో బారెడు ఆకాశాన్ని చూడలేని ఆకుచాటు మొగ్గలం/నేడు నిలువెల్లా దాచేసే వటవృక్షం నీడలో దోసెడు పత్ర హరితాన్ని హత్తుకోలేని పాలిపోయిన మొక్కలం” బాల్యం మీద ఛెమర్చే పదాలెన్నో వున్నాయి
నగారా అనే సంపుటంనుండి ” స్వాతంత్ర్యం సాధించుటలో / సాగించిన సమరాలెన్నో/లక్ష్యాలను నెరవేర్చుటలో అడుగడుగున గండాలెన్నో ‘ అని ” వేదరాణి ఖురాన్‌ రాజు వీధిన పడుటెందుకు, వెన్నవంటి పసికూనల మనసు విరుచుటెందుకు? ” అని ” పావురాల నెగరేసిన పావుగంటలోనే, పావులుగా మారిపోయి విధ్వంసం జరుపుటేల? వేదికపై వేదాలు, వేయిగొంతు నాదాలు, యెదకుదిపే దృశ్యాలు, మనసుకేమొ గాయాలు ” అని ” నేతలో తేడా వుంటే బట్టకట్టలేం / నేతల్లో తేడావుంటే బతికి బట్ట కట్టలేం” అంతేకాదు ‘ ఏ నేతతో విందు జాతర వుందో, యే నేలలో మందు పాతరవుందో ” కనిపెట్టలేని సంఘటనలు కవిత్వీకరించాను నేను. చివరగా ” మతరహితం – కులరహితం/ సహాయాల ఆశయం, తోటివారి నాదుకొనుట /మనుగడకదినిలయం ” …ముక్తాయింపు కవితా పాదంతో ముగిస్తాను ” మతము జపము తపము కంటే/ కూడు, గుడ్డ, గూటి కోసం/ యెల్ల వేళల సమరశీలత/ పెంచుకొనుటే భారతీయత ”నా పలుకులను ఆనందంగా ఆస్వాదించిన వారికి ధన్యవాదాలు
శెలవు.

Saturday, June 1, 2013

3 Years programme and progress of Bodepudi Vignanakendram


3 Years programme and progress of Bodepudi Vignanakendram

Bodepudi Vignana Kendram is a purely voluntary organisation which was constituted in the memory of Late Bodepudi Venkateswara Rao in the year 2007.This was started to promote the aims and ambitions of the deported veteran leader who stood for the welfare of poor people and fought in freedom struggle.
The following are the activities of BVK since last three years.
ACTIVITIES OF 2010
1. Library: This Research oriented library which is useful for the development of comprehensive knowledge for the students in all the subjects. The access to the library is free to all. It is also used as a referral library for the research scholars of surrounding universities and P.G colleges. Daily 100 to 150 patrons visit and use the library facilities. Around 40,000 people used the library during the year 2010.
2. Students Hostel: 150 poor students studying from Intermediate to PG level including Technical Students were accommodated during the year 2010. Meritorious students who could not afford the education have been given accommodation.
3. Prajaa-Vaidhya Saala: Many poor and common people received free medical services from this hospital. Daily 40 to 75 patients are treated. Around 20,000 patients were treated during the year 2010.
4. Music School: Free Music lessons for the children under 14years age are offered by this program. The school offers free training classes in singing patriotic songs and sociological songs along with traditional music. 58 students are trained during this year.
5. Sunday-Adhyayanam: This is running as a study circle since 294 Sundays continuously conducted in the morning scheduled uninterruptedly. This program aims at helping students who are preparing for competitive examinations. This year 6000 students had utilised this program.
6. Sunday – For you (Aadivaaram – meekosam): Conducting
7. Uninterruptedly since 260 Sundays in the evenings. This program aims purely entertainment and recreation oriented.
18000 people participated in this program and appreciated very well.
8. Family legal cell: Aims to solve the disputes in-between Wife and husband. 30cases were solved during this year.
9. Blood Donation camp: The organisation has conducted 4 camps in the same year. We have conducted two camps to help the needy during this year.
ACTIVITIES OF 2011
In continuation to the previous year experience, during the year 2011, we have introduced some new programs which are very useful to the common people.
1. Library: In addition to the 9 daily news papers, 15 periodicals both in English and Telugu which are useful for the student’s comprehensive development. This year the patrons have increased from 40,000 to 50,000.
2. Students Hostel: Again 150 poor and merit students were admitted. Seminars and symposiums are arranged to them with skilled and experienced intellectuals.
3. Prajaa-Vaidhya Saala: The patients are increased from 20000 to 25000 during this year.
4. Music School: The training in using Tabala, Harmony and Keyboard are introduced in addition to the last year program. This year 60 students were trained.
5. Sunday-Adhyayanam: During this year, 7000 students utilised the lectures given by the eminent scholars.
6. Sunday – For you (Aadivaaram – meekosam): This program entertained 20000 people through cultural programs. Particularly 6000 ladies enjoyed the programs like cooking and games.
7. Family legal cell: During this year, 20 husband and wife family disputes taken and solved.
8. Blood Donation camp: 80 BVK students donated their blood. One donation camp and one medical camp are arranged.
9. NRI Parents Association: During this year a new program was introduced for Senior Citizens especially for citizens who are feeling lonely and whose children are abroad. BVK conducted some recreational activities to overthrow their loneliness. Three hundred families are in touch with this association.
ACTIVITIES OF 2012
1. Library: 10 new writers and authors are encouraged. Two thousand books are collected. Fifty thousand people visited the library during this year. For meritorious students and talented children special programs were conducted.
2. Students Hostel: This year also 150 poor students were given the admission. Out of them one is deaf and dumb and one is physically handicapped. Ten previous students got employment in various fields.
3. Praja Vaidya Sala: Health and medical awareness programs, cardiology diabetic and orthopaedic camps were conducted. Around twenty five thousand common people took free treatment during this year.
4. Music School: One of our music school students stood first in KHAMMAM district technical college’s songs competition. Many of our students got prizes in various competitions. This year Painting and Chess training also started. Fifty students were trained this year.
5. Sunday-Adhyayanam: On Central and State budgets and on the financial crisis of National and International level, round table discussions were conducted. Around 8000 attended these programs during this year.
6. Sunday-For you(Aadivaram- meekosam): Two science fairs , One Science Exhibition and four Songs competitions were conducted for the students. 3000 students participated in these programs. 22000 people enjoyed these program during this year. Out of them 8000 were Senior Citizens.
7. Family Legal Cell: In addition to 15 family dispute cases, 10 general disputes were also taken and solved.
8. Blood Donation: 50 BVK students gave their blood to the patients. Two blood donation camps and one medical camp were conducted.
9. NRI Parents Association: In addition to 300 families of last year, another 200 families have come into contact with this association during this year.
10. Donation of Body Organs: This is a specialised program of BVK during these seven years. We the 10 members of the managing committee along with our family members, totally 46 members had donated entire body organs after death. We all have given stamped agreement to Mamatha Medical College for this. Our aim is to make this number 100 by the end of 2013.