Sunday, June 2, 2013

సాహితీ సంక్షిప్త ప్రసంగం

సాహితీ సంక్షిప్త ప్రసంగం

కపిల రాంకుమార్|| సంక్షిప్త సాహితీ ప్రసంగం||
ఆంధ్రప్రదేశ్ టైపిస్ట్స్ & స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్‌ , ఖమ్మం , జిల్లాపరిషత్ సమావేశమందిరంలో జరిగిన సభలో అతిథిగా హాజరై పాల్గొన్నపుడు మిత్రుల కోరిక మేర చేసినసస్ సాహితీ ప్రసంగంలోని సంక్షిప్త పాఠం: (1991-92 నాటి ప్రసంగంలోని భాగం)
కామ్రేడ్స్ & ఫ్రెండ్స్ !
నిత్యం ఉద్యోగ నిర్వహణలో తీరికలేని మీముందు కాసేపు ఈ చల్లని ససాయంకాలం సాహిత్య ముచ్చట్లు మాట్లాడలని నన్ను కోరినంద్కు ధన్యవాదాలు చెపుతూ నా వద్దకు వచ్చిన ప్రశ్నలను క్రోడీకరించి నాలుగ్ మాటలు ముచ్చటిస్తాను.
” వక్రోక్తి: కావ్యజీవితం” అని, ” వాక్యం రసాత్మకం కావ్యం” అని (విశ్వనాథుడు) ” రమణియార్థ ప్రతిపాదక శబ్ద: కావ్యం ” అని
విశ్వనాథుడు, ” కావ్యే యశసే, అర్థకృతే, వ్యవహారయుజే, కాంతా సమ్మతతయా ఉపదేశయుజే ” అని, ‘ కవయ: క్రాంతి దర్శిన: ‘
‘ మంద: కవియశ్: ప్రార్థీ ‘ అని (కాళిదాసు) అనే నిర్వచనాల మధ్య ‘ what is poetry, but the thoughts and words in
shich emotion spontaneously embodies itself – Mill ” ‘ Poetry is to language of imagination and the passions – Hazlit” ‘ poets are un-aknowledged Legislatures ‘ ఇవికూడ మన సాహిత్యాభిలాషకు ప్రేరణనిస్తాయి. కవితా హేతువు ‘ ప్రజ్ఞ ‘ త్రైకలికము అంటారు లాక్షణికులు ‘ స్మృతిర్వ్యతీవ విషయా, మతిరాగామిగోచరా, బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయా, ప్రజ్ఞా త్రైకాలికీమతా ‘ అని కూడ తెలియబగును. జరిగిన దానిని చెప్పుట – ‘ స్మృతి, సంస్మరణ’, జరుగనున్న దానిని చూపునది ‘ మతి ‘ , తాత్కాలిక వ్యక్తమును ‘ బుద్ధి ‘ అని, భావి పిరాతనాద్యతనములుగ సర్వ విషయములను స్పష్టీకరించునది ‘ ప్రజ్ఞ ‘ అని తెలిస్తున్నది. ” సంగీతమపి సాహిత్యం సర్స్వత్యా స్తనద్వయం – ఏకమాపాత మధురమన్యదాలోచనామృతం ‘ అని పెద్దలు వివరించారు.
మరొక విదేశీయుని నిర్వచనమిలావుంది ” ప్రతిభ మనముందు కనిపించినపుడల్లా మనం దానిని గురించకలిగి లిట్మస్ కాగితంలా నీలంగానో, ఎర్రగానో మారకలిగితే యెంత ఆనందకరంగా వుంటుంది కాని, నిజమైన కవిత్వం చదువుతుంటే వెన్నెముకలో విద్యుత్తు ప్రసరించాలి కాని పొత్తి కడుపులో బాధపెట్టీ, వాంతి చేసుకునే ప్ర్యంతం కాకూడదు ” అంటాడు.

కవుల పద చిత్రాలు కొన్ని పరిచయం చేస్తాను మరో గెర్నికా రచయిత రవీంద్ర సాగర్ వాళ్ళవూరు గురించి ” ఊరు మీద జెండాలు యెగరనంత కాలంం గూండాలు తిరగనంత కాలం – నా ఊరు లుంబినీ వనంలావుంది / నేడేమో – నెత్తుర్లో పొర్లుతూ, శ్వాల మధ్య దొర్లుతూ మరో జాఫ్నా అయింది ” ఫాక్షన్‌ రాజకీయ కక్షలకి పల్లెటూరు యెలా మారుతోందో కవిత్వీకరించారు.
ఇంకో కవితలో ‘ రేకల్లో ఉయ్యాళ్ళ ఉరితీసిన బాల్యం, అమ్మనుచూసి బావురుమంటె శుష్కించిన స్తనం బిడ్డను చూసి బావురుమంటుంది ” శ్రామిక మహిళ స్థితి దృస్యీకరించారు కవి. కాటికాపరి అనే కవితలో ” రామ రాజ్యాలు – స్వర్ణ యుగాలు, వెలివాడల బతుకులో వెలుగులు నింపలేదు, స్వాతంత్ర్య ఫలాలు అందని ద్రాక్షలైనాయి, బేసిక్ ఇంక్రిమెంటు, పియ్ఫ్స్ లేని వెట్టి ఉద్యోగం – వల్లకాటి సెక్రటేరియట్లో
యే గర్నమెంటూ గుర్తించని ఎంప్లాయి ”
మరొక కవయిత్రి శీలా సుభద్రా దేవి ” ఒప్పులకుప్ప ” అనే కావ్యంలో ” ఇంటర్నెట్ లో ప్రపంచాన్ని దర్శించే కళ్ళు/ రేచీకటి వచ్చీనట్లు ఆధారం కోసం వెతుక్కూంటాము, కంప్యూటర్ వైరస్ వెతికి తీయకలిగిన మేథస్సు జీవితాల్లోని వైరసును తీసిపారేయలేక, మళ్ళీ అతీత శక్తులనే నమ్ముకుంటున్నాము.” అమెరికా అనే కవితలో ” రెక్కలొచ్చిన పిట్టలై/ కన్నవారిని, జన్మ భూమిని వదిలిపెట్టి/ డాలర్లు యేరుకునేందుకు/దూరపుకొండలనీడల్లో వాలుతారు ” నేటి పిల్లల డాలరు ప్రేమ గురించి , చేనేత అనే కవితలో ” మేం బట్టలు నేసేటోళ్ళమే – అందుకే కద / అగ్గి పెట్టిలో ఆరు గజాల చీరను దాచినట్లుగా/ అవమానాల్ని స్వర పేటికలో మడిచి పెట్టాం ” చేనేత బ్రతుకును వివరించారు. ‘ చైతన్యం ‘ అనే కవితలో ” ఆలోచనాక్షరం దిద్దిన వాళ్ళెపుడు/సోమరిగా కాలాన్ని బఠాణీల్లా చప్పరించరు!/ నుప్పుని యెగదోసినట్లు చైతన్యాన్ని మేల్కొల్పుతారు ” మరొక కవితలో ” తూనిగల్లా, తోటల్లో, తోపుల్లో పరుగులు తీయాల్సిన, ని్న్నటి బాల్యంలో బారెడు ఆకాశాన్ని చూడలేని ఆకుచాటు మొగ్గలం/నేడు నిలువెల్లా దాచేసే వటవృక్షం నీడలో దోసెడు పత్ర హరితాన్ని హత్తుకోలేని పాలిపోయిన మొక్కలం” బాల్యం మీద ఛెమర్చే పదాలెన్నో వున్నాయి
నగారా అనే సంపుటంనుండి ” స్వాతంత్ర్యం సాధించుటలో / సాగించిన సమరాలెన్నో/లక్ష్యాలను నెరవేర్చుటలో అడుగడుగున గండాలెన్నో ‘ అని ” వేదరాణి ఖురాన్‌ రాజు వీధిన పడుటెందుకు, వెన్నవంటి పసికూనల మనసు విరుచుటెందుకు? ” అని ” పావురాల నెగరేసిన పావుగంటలోనే, పావులుగా మారిపోయి విధ్వంసం జరుపుటేల? వేదికపై వేదాలు, వేయిగొంతు నాదాలు, యెదకుదిపే దృశ్యాలు, మనసుకేమొ గాయాలు ” అని ” నేతలో తేడా వుంటే బట్టకట్టలేం / నేతల్లో తేడావుంటే బతికి బట్ట కట్టలేం” అంతేకాదు ‘ ఏ నేతతో విందు జాతర వుందో, యే నేలలో మందు పాతరవుందో ” కనిపెట్టలేని సంఘటనలు కవిత్వీకరించాను నేను. చివరగా ” మతరహితం – కులరహితం/ సహాయాల ఆశయం, తోటివారి నాదుకొనుట /మనుగడకదినిలయం ” …ముక్తాయింపు కవితా పాదంతో ముగిస్తాను ” మతము జపము తపము కంటే/ కూడు, గుడ్డ, గూటి కోసం/ యెల్ల వేళల సమరశీలత/ పెంచుకొనుటే భారతీయత ”నా పలుకులను ఆనందంగా ఆస్వాదించిన వారికి ధన్యవాదాలు
శెలవు.

No comments: