Tuesday, June 18, 2013

|\ శ్రీశ్రీ వర్థంతి నివేదిక |


కపిల రాంకుమార్|\ శ్రీశ్రీ వర్థంతి నివేదిక ||” శ్రీశ్రీ కొనసాగించిన సమసమాజాకాంక్షాయుత సాహిత్య మార్గాన్ని అనుసరించటమే అసలైన నివాళి ” కావూరి పాపయ్య శాస్త్రి ఉద్ఘాటన. ఆదివారం మీ కోసం – సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా కమిటి సంయుక్ల్తంగా నిర్వహించిన శ్రీశ్రీ వర్థంతి సభలో ముఖ్య ఆహ్వానితుడుగా డా. కావూరి పాపయ్య శాస్త్రి పాల్గొన్న సభలొ, డా. సిహెచ్. ఆంజనేయులు, రౌతు రవి (సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి) కె. ఆనందాచారి ( సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు) ఆదివారం మీ కోసం బాధ్యులు జోసఫ్ అధ్యక్షతన సందేశాలిచ్చారు. తొలుత వారంతా ఖమ్మం నగర ప్రారంభంలో రింగ్ రోడ్డు వద్ద గల మహా కవి శ్రీశ్రీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కె.హిమబిందు, జోసఫ్ (ఆదివారం మీకోసం) ఆనందాచారి, రౌతు రవి, ఎం. శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య, సునంద (సాహితీ స్రవంతి) కపిల రాంకుమార్ (బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు) డా. కావూరి పాపయ్య శాస్త్రి, (ఫ్రధాన అహ్వానితుడు)డా.సిహెచ్. ఆంజనేయులు, ( ఆహ్వానితుడు) యువకవులు రౌతు కడలి, తదితరులు ఘనంగా నివాళులిచ్చారు.
తాళ్ళూరి లక్ష్మి, రాధ, బండారు రమేష్, తోటకృష్ణారావు, బండారు రమేష్, మహతి (తేజశ్రీ)సునంద, దాసోజు శ్రీనివాస్, క్రాంతికార్,కపిల రాంకుమార్, కవితలు చదవగా, ఎం.శేషగిరి తన గాత్రంతో చక్కని శ్రీ శ్రీ గీతాన్ని ఆలపించి కవిసమ్మేళనం ప్రారంభించారు. ప్రధాన వక్త డా. కావూరి పాపయ్య శాస్త్రి మాట్లాడుతూ ” శ్రీశ్రీ స్పష్టమైన సాహితీ అవగాహన కలిగి, సంస్కృత, ఆంగ్ల, తెలుగు భాషాలలో గట్టి పట్టు కలిగివుండతమేకాక, ఎన్నో అనువాదాలకు, అనుసృజనకు, కొత్తకొత్త ప్రయోగాలకు ఆద్యుడై ఈ శతాబ్దం నాది అని నమ్మకంగా చెప్పకలిగాడంటే అది అతని చేవ కలిగిన సాహితి కృషికి నిదర్శనమని చెప్పవచ్చు. అప్పటిదాకా వున్న భావ కవితా ధోరణికి బిన్నంగా అభ్యుదయ భావాలను రంగరించి మొదట సంప్రదాయ సాహిత్యంలో వృత్తాలలో, కందాలతొ ప్రారంభించి, క్రమేణ మాత్రాచందస్సు పట్టుకుని గురజాడ వార్సత్వాని కొనసాగిచి ‘ అడుగుజాడ గురజాడది ‘ అనిపించాడు.వ్యాసం, సమీక్షలు, రేడియో నాటికలు, ఇతర భాషా చలన చిత్రాలకు తెలుగు అనువాదం చేయడం, పత్రికా రంగం,యిలా యెన్నో విభాగాలలో శ్రీశ్రీ తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించి అందరి మన్ననలను పొందాడన్నారు.” ”ఎంత సంక్లిష్టమైన పదాలనైనా, మరెంత సరళపదాలనైన తన కవితలో సహజంగానే పొందుపరిచే నైపుణ్యం ఆయనది. సినిమా పాటల్లో తనదైన ముద్ర కనిపించేలా మెళుకతీసుకున్న ఘనుడు. రాజకీయాలల్లో వామపక్షాన్ని సమ్ర్థించినవాడు. మద్రాసు శాసన మండలి సభ్యుడుగా పని చేసిన మహాకవి కమ్యూనిజాన్ని అతిగా ప్రేమించాడు, దాని కోసం అహరహం కృషిచేసినవాడు. కవి సామ్రాట్ విశ్వనాథ మెప్పును సంపాదించిన సౌమ్యుడుగా, విప్లవ రచయతల సంఘంలో పనిచేసిన అతివాద కవిగా, బహురూపాల్లో సాహిత్య, రాజకీయ, సామాజిక అంశాల్ను ప్రభావితం చేయటంలోను యెంతో మంది యువకవులను తన మార్గంలో నడిచేలా మార్గదర్శి కావటంలో, తదనంతర తెలుగు సాహితీ విస్తృతి పొందటానికి శ్రీశ్రీ కృషి అనిర్వచనీయము, అమూల్యము ”అని తన ప్రసంగంలో ఆనందాచారి వక్కాణించారు. ఆదివారం బాధ్యులు, కె. హిమబిందు, జోసఫ్, చావా వీరభద్రయ్య, స్వామి, జి.నాగేశ్వర రావు, ప్రజాసంఘాల నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు ఎ.జె.రమేష్, నున్నా నాగేశ్వరరావు, వాసిరెడ్డి వీరభద్రం, బి.వి.కె. మేనేజింగ్ కమిటీ భాద్యులు, ప్రసాద్, గోపాలరావు, బి.వి.కె. విద్యార్థులు పలువురు పాల్గొన్న ఈ సభలోనే ఖమ్మంకు చెందిన కవి డా. అఫ్సర్ కు ”మధురాంతం జానకిరాం – కథ 2012 అవార్డు ” కోదాడనుంచి ఈ సమావేశానికి వచ్చిన బంగారు రామాచారి అఫ్సర్ అమెరికాలో వున్నందున ఆయన తరఫున తమ్ముడు ఫసియుద్దీన్‌ కు అందచేయటం విశేషం.శేషగిరి వందన సమర్పణ చేసారు.>>>>
18.6.2013

No comments: