Wednesday, October 16, 2013

ఆశంస

కపిల రాంకుమార్||ఆశంస ||

నా మది గదిలో
అక్షర గరిమలెన్నో
ఎద గుడిసెలో
ఊసుల సరిగమలెన్నో

పరదాల మాటున
సరదా మాటలెన్నో
ఒకరినొకరిని కలిపే
స్నేహానుభూతులెన్నో

పయోముఖ విష కుంభాలకు దూరంగా
అమృతమయ సావాసం నిలుపుకోవాలి!
సంయమనం అందుకో
సంస్కారం పెంచుకో!

కలతల కలల కలుషాల కాసారంలో
కలవరాలకు దూరంగా
కవి ' తల ' లోని కవితల సౌరభాన్ని చేరుకో
సాహిత్య సౌధాన్ని కలకాలం కాపాడుకో!

16.10.2013 ఉదయం 11.45.

No comments: