Sunday, October 6, 2013

|ఉర్దూ భాషా సాహిత్యాలు||

కపిల రాంకుమార్||ఉర్దూ భాషా సాహిత్యాలు||

భాష: ఉర్దూ  భారతదేశంలో రూపొందిన భారతీయ భాష.ఇది విదేశీ భాష కాదు.ఏదో ఒక జాతికి,
ఒక మతానికి చెందినది కాదు.ఈ  భాషలో భారతీయ భాషా శబ్దాలతో పాటు,ఫార్సీ,అరబ్బీ,తుర్కీ
శబ్దాలు విరివిగా చేరివుంటాయి.దీని కవితా రీతులు, కవితా సామాగ్రి చాలవరకు ఫార్సినుంచి దిగుమతి
అయింది.ముసల్మానుల సంపర్కంవలన, ఆక్రమణలవలన, మనదేశ రాజకీయ సామజిక పరిస్థితుల్లో
విశేషపరివర్తన కలిగింది. ఉర్దూ అనే పదాంకికి తుర్కీ భాషలోని URDU అనే పదం మూలం. ఇంగ్లీషు
లోని HORDE అనే పదాని జన సమ్మర్థం, సైన్యం, సైనిక శిబిరం అనే అర్థాలున్నాయి. సైనిక
సమూహాల సాంకేతిక భాషగా ఉర్దూ ఆవిర్భవించటానికి అవకాశం యేర్పడింది, తప్ప ఇది విదేశీ భాష
యెంతమాత్రం కాదు.18 శతాబ్ది ఉత్తరార్థానికి పూర్వం దీనిని చరిత్రకారులు,సాహిత్యకారులు హిందీ,
హిందునీ, హిందుస్థానీ, జబానె-హిందుస్తాన్‌,ఉర్దూయె-మొఅల్లా, రేఖ్తా అని అనెక్ పేర్లతో చలామణి
అయ్యేది. అనేక భాషల సమ్మేళనం వలన రేఖ్తా అని పిలిచేవారు.

దక్కనులో ఉర్దూ: ఖిల్జీ ఆదుషా కాలంలో దండయాత్ర జరిగిన తర్వాత మొహ్మద్ బీన్‌తుగ్లక్ రాజధానిని
ఢిల్లీ నుండి దేవగిరికి, తదుపరి అది దౌలతాబద్ అయింది. మళ్ళి దౌలత్ బాద్ నుండి ఢిల్లీకి మారింది.
1347 లో దక్కనులో బహమనీ వంశస్థాపన జరగటం చారిత్రిక పరిణామం వలన, పరిణితి చెందిన భాషగా
ఉర్దూ గుజరాతు మీదుగా దక్కనులో వ్యాపించింది.గుజరాత్ పదాలను కూడ కలుపుకొని ' గుజరీ '
అయుందని పరిశీలకుల అభిప్రాయం.  

భాషా వ్యాప్తిలో సూఫీ పకీర్ల పాత్ర యెంతగానో వుంది, ఖ్వాజా మసూద్ సాద్ సల్మాన్‌ (1046-1121)
ఖ్వాజా మొయీనుద్దీన్‌ చిష్తీ (1140-1268) బాబా ఫరీద్ గంజ్ షక్కర్ (1173-1265)
నిజాముద్దీన్‌ ఔల్యా (1238-1325) అమీర్ ఖుస్రూ(1253-1325) ఖ్వాజా బందా నవాజ్
గేసూదరాజ్ (1321-1422) మొదలైన సూఫీ యోగులు ముఖ్యులుగా పేర్కొంటారు.

వలీ దక్కం అహ్మద్ ను ఆదికవి అంటారుిఉర్దూ గజళ్ళకు ఓరవడి దిద్ది,దక్కనీ శబ్దాలు తగ్గించి పారసి
శబ్దాలకు పట్టంకట్టాడని, మన నన్నయ్య చేసిన పనే ( సంస్కృత పదాలు చేర్చినట్టు) ఇతను పార్సీ సంప్రదాయాలను,
భావాలను అందలమెక్కించాడు.చారిత్రకంగా చూస్తే మొదటివాడు కాకపోయినా, భాషకు ,కవిత్వశైలికి
కొత్తరూపాన్నివ్వటం వలన ఆదికవిగా గుర్తింపు పొందాడు. అతనిని అనుసరిస్తూ సిరాజ్ ఔరంగాబాదీ,
1160 పంక్తుల బూస్తానె-ఖ్యాల్ మస్నవీని రెండు రో్జులలో రాసాడు. బహరీ అనే కవి మస్ననీ మన్‌లగన్‌ వ్రాశాడు.

18 వ శతాబ్దిలో  ఉత్తరారిద్లో ఉర్దూ కవిత: సిరాజుద్దీం ఆలీఖాన్‌, షాహిహతిం, సౌదా,మీర్,దర్ద్
మీర్ తఖీమీర్ (1722-1810) మీర్సోజ్,  టేక్చంద్ బహార్,నందరాం ముఖ్లిస్, భికారీలాల్
మొదలైనవారు పేర్కొనవచ్చును.అయోధ్య నవాబులు కూడ సారస్వత పోషణ బాగా చేసారు.షేక్ ఇమాం
బక్ష్ నాసిఖ్ ( 1771-1838) హైదరలీ ఆతిష్ ( 1778-1847)

మస్నవీ = ప్రబంధ కావ్యాలు , మర్సియా = స్మృతి కావ్యాలు, గా ప్రసిద్ధిచెందాయి.ప్రముఖులుగా కొంతమందిని
పరిచయం చేస్తాను.  కవిత్వమంటే ప్రణయ భావాల గజల్ రచనే కాదని, ఏదైనా కవిత్వానికి
అనర్హం కాదని ఆనాడే భావించిన కవిసత్తముడు నజీర్ అక్బరాదీ (1735-1830) అయితే సంప్రదాయ
చాదస్తపు సాహిత్యకారులు ఇతనిని కవిగా గుర్తించలేదు. కాని ఈ నాటి సాహిత్యకారులు, విమర్శకులు ,సాహిత్య
చరిత్రకారులు నజీర్ అక్బరాదీని మహాకవిగా  గుర్తిస్తారు.ఢిల్లీకి చెందిన  మిర్జా సదుల్లా బేగ్ ఖాన్‌ గాలిబ్
(1797-1969) మోమిన్‌ ఖాన్‌, ముస్తఫాఖాన్‌ షేఫ్తా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాం(1817-98)
మౌలానా మొహమద్ హుసేన్‌ ఆజాద్ (1833-1910), ఖ్వాజా అల్తాఫ్ హుస్సేన్‌ హాలీ(1836-1914)

అభ్యుదయ రచనలు: కిషన్‌ చందర్, ఇస్మత్ చొగ్తాయ్, సాదత్ హసం మంటో, రాజేంద్రసింగ్ బేడీ,
రషీద్ జహా, రజియా సజాద్ జహీర్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఖురతుల్ ఐన్‌ హైదర్(1989)
షాయిర్ ఇంఖిలాబ్ గా పేరొందిన జోష్ మలీహాబాద్, ప్రొఫ్ఫెసర్ రఘుపతి సహాయ్ ,ఎహసాన్‌ దానిష్,
ఆదమ్‌, ఫైజ్ అహమద్ షైజ్,ఇస్రారుల్ హఖ్ మజాజ్, సికిందరలీ వజ్ద్, మఖ్దూమ్ మొహియుదీన్‌
సుల్తాంపూరి, కైఫీఅజ్మీ, నజీరలీ అదీల్,సామల సదాశివ, దామోదర్ జకీ, రాఘవేంద్రరావు జబ్జ్ ,
కాళోజీ రామేశ్వర రావు,

పాశ్చాత్య్ల కవులు: బెంజిమన్‌ షుల్జ్, జాన్‌గిల్ క్రయిస్ట్ (1759-1848) గిల్ క్రయిస్టు (లండన్‌)
రాబర్ట్ క్లార్క్, ఈ.హెచ్.ఎం.వాకర్, జోసఫ్ ఎవన్‌, మౌల్వీ ఇమాముద్దీన్‌, జె. అలీబక్ష్
......ఉర్దూ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వారెందరో మహానుభావులు అందరికీ వందనాలు.
_________________________________
భారత భారతి - గ్రంథం నుండి సేకరించినది. తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ
__________________________________   
4.10.2013 సాయంత్రం 6.30 

No comments: