కపిల రాంకుమార్|| సోమసుందర్ -వజ్రాయుధం ||
తొలికూర్పు (1949 విరోధి ఉగాది - మార్చి)
' ఒక వ్యక్తి యొక్క సాంఘిక జీవనమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది '' అని చెప్పాడు కారల్ మార్క్స్
సోమసుందర్ కవిగా పాడటానికి గొంతు సవరించుకుంటూన్న రోజుల్లో చరిత్ర భూస్వామ్య వ్యవస్థ నశిస్తూ,
బూర్జువా వ్య్వస్థ పరిపాలనాధికారాన్ని ఆశిస్తూన్న కాలమని చెబూంది. ఆనాటి కవిత్వం విరగబడి సనాతన
చైతన్యం తిరగబడి కొత్త కొత్త దారుల్ని త్రొక్కి త్రొక్కి విసిగి వేసారి చివరికి వెగటుగా, వికారంగా,విషాదంగా
ఆత్మఖండన వ్యాపారంగా తయారైంది. బూర్జువా వర్గపు ఉనికికి అనుకూల వాతావరణాన్ని వ్యక్తిగత
అహం కలిగిస్తుంది. కనుక ఆ రోజుల్లో కవితకదే నినాదమైంది. కవిత్వం పరిసర నగ్న వాస్తవికతను కళ్ళు
విప్పి చూడలేక నిరంజన కళకోసం ఆకాశపుదారులు పట్టి '' దిగిరాను గిగిరాను దివినుండిభువికి '' అంది.
దానితో ద్రష్ట అయిన కవి భ్రష్టుదయ్యాడు. అతని అనుభూతి కూడ నశించింది. దానితో అసంఖ్యాకమైన
ప్రజానీకం కవిత్వాన్నీ చదవటం మానేసింది. కవిత్వం తనకవసరమనే సంగతినే విస్మరించింది. కనీసం
దానిని అర్థం చేసుకోటానికి కూడ అది ప్రయత్నించలేదు. ఎందు చేతనంటే కవిత్వం జీవితానికి అంత
దూరమైపోయింది (అందనంత)కనుక. ఈ సత్యాన్ని కవిగా సోమసుందర్ గ్రహించాడు.
పెద్దాపురం తాలూకా శంఖవరం గ్రామంలో 1924 నవంబరు జన్మించి 1933 నుండి 1945 వరకు పిఠాపురం
రాజా హైస్కూల్ చదువు, కాకినాడ కాలేజి చదివాడు. 1944 నుంది రచనా వ్యాసంగం. అభ్యుదయ రచయితల
సంఘ ఉద్యమ ముఖ్య కార్యకర్తలలో ఒకడు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం స్థిర నివాసం.
అందుకే ఈ కవి '' తన చరిత్ర తనే పఠించి ఫక్కున నవ్వింది ధరణి, తన గాథను తనే స్మరించి భోరున
యేడ్చింది ధరణి ' అన్నాడు. అంతటితోనే అతను చెప్పదలచుకొన్నది పూర్తికాలేదు. యథార్థ జీవితాన్ని
సంగ్రహించి " బూర్జువా వర్గం " తమ దోపిడి, తమ పాలన, తమ వర్గస్వలాభాలను సుస్థిరంగా నిలపాలని
సర్వజనానీకంపై యేలుబడిని సాగిస్తున్నదనే పరమ సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. అంతేకాదు " రెండు ప్రపంచాల
మధ్య, రెండు స్వభావాల మధ్య, రెండే వర్గాల మధ్య సాగుతున్న సంఘర్షణ " ని గుర్తుపట్టి తన పాత్రను
పృచ్ఛించుకొన్నాడు. '' యుగధర్మం :చైతన్యం-జనహృదయం;పోరాటం '' అని తన అంతర్వాణి వినిపించింది.
'' ఉన్నదొక్క జీవితమే, మానవునిగ వీరునిగా బ్రతుకుము, నరుడా! చరిత్ర నీకోసం ప్రసవ బాధ పడుతున్నది;
భవిష్యత్తు నీ కోసం పడిగాపులు కాస్తున్నది, నీ త్యాగం వృధాకాదు.''..అని సంబోధించుకున్నాడు.దానితో
'' దినమంతా రక్తం ధారవోసి పరిశ్రమించే దీనుల ఒక్కటిగా సమీకరించుట కోసం నిర్దయగా పరాన్న భుక్కుల
హతమార్చుటకోసం '' ఉద్యమించాడు. '' వర్గ రహిత స్వర్గమ్మును స్థాపించుట తనలోపలి కోరిక; తన తీరని
తపస్సు '' కనుకనే ఆవేశంతో ఎలుగెత్తి పిలుస్తున్నాడు ' కదలండి కదలండి -కదలి పోరండి స్వేచ్ఛకై;-
తుది వెలుగు మానవుడు బ్రతుకు వీడిందాక! '' ముందుకురకమన్నాడు. తనకు ఆశ, నిరాశ లేదు కనుకనే
' ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు ...ఒక నెత్తురు బొట్టులోనే ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు '' నంటాడు.
అంతేకాదు '' ఈ యాగం ఫలిస్తుంది. రాక్షస సంహారోత్సవ మహా క్రతువు ఫలిస్తుంది. తెలుగు గడ్డ సుఖిస్తుంది.
నవ జీవనం సుమిస్తుంది!'' అంటాదు కవి. అవును తప్పదు!
'' రారాజు గాథలకు ఇదె స్వస్థి వాక్యం!
శత్రువుల చరితకిదె అంతిమస్కంధం!
కాల వాహినికిదే నూత్న ఘట్టం ''
'' కమ్యూనిస్తు కవిత్వం సంపూర్ణమైనది. మానవుడు తన ఆవసరాన్ని ఎంత చైతన్యంతో గుర్తిస్తాడో, అంత చైతన్యం
తోటే బాహ్య వాస్తవికతను గుర్తిస్తాడు కనక '' అంటాడి క్రిస్టోఫర్ కాడ్విల్ . ----రాంషా. (సామల్ కోట 2/1949)
1,సమధర్మం: (సమధర్మం, ధ్రువతార, ఖరార్ నామా, మౌనగోష, లోపలి కోరిక, భగత్సింగు, ఫ్యాక్టరీ,
బాడుగ గోడీలు, ఆకలి నాలుకలన్నీ ) 2.బానిసల దండయాత్ర, 3. మలయా ప్రభంజనం
వజ్రాయుధం - ఒక సమాలోచనం - మాదిరాజు రంగారావు విశ్లేషణ
లోపలి కోరిక ( తల్లి - కవి - సంభాషణ)
తల్లి:
నీ హృదయం / నెత్తురు చిందిన గెడ్డయి.తుఫానులో రాలిన/జీర్ణ పత్రమై/ఎగసి ఎగసి, పరితప్తమగుట
దేనికొరకు బిడ్డా?
కవి: నీ బిడ్డలు/దిక్కులేని పిట్టలవలె/చెట్టుకొకరుగా/చెల్లా చెదరీ/గూడులేక, కూడులేక/అల్లాడుట/
చూడలేక తల్లీ!
తల్లి: ఇంత భయోత్పాతంలో/గాఢ నిశాధ్వాంతంలో/ఏగెదవెలాగ బిడ్డా!
కవి: నలుబది కోట్లకు మించిన/సంతానం కన్న తల్లి/ నీ చల్లని దీవెనలో/పురోగమిస్తానమ్మా!
తల్లి: నాపై ప్రస్రించిన/ నీలోపలి కోరిక ఏదో/ చెపుతావా బిడ్డా!
కవి: అమ్మా, చెబుతా వినవమ్మా/ నీ చేతుల బంధించిన/సంకెళ్ళను త్రెంచాలని/నీ సంతతి స్వేచ్ఛలోన/
ఊపిరిపీల్చాలని/దినమంతా ర్క్తం ధారవోసి
పరిశ్రమీంచే దీనుల/ఒక్కటిగా.../సమీకరించుట కోసం తల్లీ!/నిర్దయగా పరాన్నభుక్కుల/హతమార్చుట
కోసం తల్లీ!/ వర్గ రహిత స్వర్గమ్మును/మిర్మించుటకోసం తల్లీ!/ఇది నా లోపలి కోరిక/ఇది నా తీరనీ
తపస్సు!
___________________________________________________
1.10.2013

No comments:
Post a Comment