Tuesday, October 1, 2013

|| గాయబ్ అవుతుంది!||

కపిల రాంకుమార్ || గాయబ్ అవుతుంది!||

తలపులు-తలుపులు
తెరిచినపుడు - వలపులు
తలపులతొ - జతగూడుతాయి

పలికిన - మరులుగ
కులుకులు - మరలుతాయి

పెళసరి - కబురులకు
దళసరి - విరుపులవుతాయి
మరులిక వెడలును
మరలి రావెపుడును!

విసురులు - ఉసురులగు
పరుషపదములగు
సరసము విరసమై
అలకల - ములుకుల
మొలకలగు

మరి అపసవ్యము - హాస్యమైన
చిరలాస్యము - కొరవగు!
చిలువలు - పలువలుగా
పుకారులు - షికారులు చేయ
పడిపోవును - తెగిపోవును!
బంధం యిక  - కనుమరుగై
విరహగీత - ప్రవాహమగు!

కాయమున - గాయము
పూతల మానును
ఎదకు  - గండిపడిన
ఎండినమానై కూలును!

చివురించాలని - అనుకున్నా
త్రుంచాలని  - అనుకున్నా
నీ పైనే ఆధారం
నిలుపుతావో? - నలుపుతావో?
నీ యిష్టం!
నిర్ణీత సమయంలోనే!
నిర్ధిష్ట పర్థిలోనే!
మించితే గాయబ్ అవుతుంది!
________________
30.9.2013 -----సాయంత్రం 5.45

No comments: