కపిల రాంకుమార్|\ సాహితీ స్రవంతి అధ్యయన వేదిక 15-6-2014 నివేదిక - శ్రీశ్రీ వర్థంతి) సమావేశం||
విప్లవాన్ని కవిత్వీకరించిన వాడు, కవిత్వాన్ని విప్లవీకరించనవాడు శ్రీశ్రీ అని నేటి యువకవులకు స్పూర్తిదాయకమైన ఆందించాడని, సముద్రమంత ముద్ర వేసిన కవి శ్రీశ్రీ అని, చరిత్రకు అర్థాన్ని '' ఏ దేశ చరిత్ర చూసిన యేమున్నది గర్వ కారణం ' అనే గేయం ద్వారా ఋజువు చేసాడు. చరిత్రకు నిజమైన అర్థాన్ని తన కవిత్వంలో తెలిపిన మార్గదర్శి. అని కొనియాడారు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె. ఆనందాచారి. రౌతు రవి అధ్యక్షతన సాహితీ స్రవంతి ఆధయనవేదిక సమావేశం జూన్ నెల మూడవ ఆదివారం ప్రత్యేకంగా శ్రీశ్రీ వర్థంతి సమావేశంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి సభ్యులు ఉదయం 10గంటలకు ఖమ్మం బైపాస్ రోడ్‌లోని శ్రీశ్రీ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. పట్టణంలోని కవులు మొవ్వా శ్రీనివాసరావు, సంపటందుర్గా ప్రసాదరావు, కపిల రాంకుమార్, రౌతు రవి, కె. ఆనందాచారి, ప్రముఖ విద్యా సంస్థల అధిపతులు రమణారావు, వీరారెడ్డి, రాఘవరావు, ప్రముఖ వైద్యుడు డా. భారవి, ఇతర సాహితీ అభిమానులు, పాల్గొన్నారు. సాయంత్రం బోడేపూడి విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో సాహితీ స్రవంతి అధ్యయన వేదికలో భాగంగా సామావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశ్రీ గేయాలను ఎం.శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య, సంపటందుర్గా ప్రసాదరావు ఆలపించారు. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, ఖడ్గసృష్టి సంకలనంలోని కవితలు సునంద, శైలజ, . సునంద, శైలజ, టి.లక్ష్మి, జయప్రద మున్నగువారు చదివారు. శ్రీశ్రీపై నాగభైరవకోటేశ్వరావు రాసిన గేయాన్ని కపిల రాంకుమార్ చదివారుశ్రీశ్రీ సాహిత్య ప్రక్రియల అన్నింటిలోను ఆల్‌రౌండర్ అంటూ విమర్శ, అనువాదం, కవిత్వ, చందోరచన, వ్యాసాలు, కథలు, నాటికలు, అంతేకా విదేశీ భాషాలలో పట్టు, శాసనమండలి సభ్యుడిగా తన పాత్రను నిర్వహించాడని అన్నారు. కె.ఎల్.యూనివర్సిటి అనువాద విభాగంకు చెందిన మోహనాచార్యులు మాట్లాడుతు నేటి పాఠశాలల మరియు కళాశాల విద్యార్థులకు శ్రీశ్రీ కవిత్వాన్ని పరిచయం చేయవలసివుందని తెలిపారు. నేటి సాంకేతిక విజ్ఞాన సంపాదన మాటున సాహిత్యం, చరిత్ర, రాజకీయం, ఆర్థిక శాస్త్రాల అధ్యయనం లోపించిందని, దానిని అధిగమించేలా ఎంతో కృషిచేయాలిసివుందని అన్నారు. డా. పి. సుబ్బారావు గారు మాట్లాడుతూ కవిత్వాన్ని విశ్వజనీనం చేయటంలో అతని కృషి అనితర సాధ్యం, దానిని ఎవరూ అధిగమించలేదు. విశ్వనాధను గౌరవించినట్లే, గురజాడను, తిక్కనను, వేమనూ గౌరవించాడు. పద్య చందస్సు, మాత్రాచందస్సు, గేయం, వచన కవిత,అంతే కాక కవిత్వంలో విభిన్న ధోరణులను సృజించినవాడు. అధివాస్తవికత, సర్రలియజం, లాంటి ప్రక్రియలు, లిమరిక్కులు, ప్రాసక్రీడలు ఇలా చెప్పుకుంటేపోతే సమయం చాలదు. మహా ప్రస్థానం ఒక భగవద్గీతలా కొత్తగా కవిత్వం రాసేవారు చదవాల్సివుందని నొక్కివక్కాణించారు. డా.||కవితాంజనేయులు శ్రీశ్రీ కవితలలోని కొన్ని సోదాహరణగా వివరించారు. ఎం.శేషగిరి '' ఏ దేశ చరిత్ర చూసినా ''గీతాన్ని ఆలపించి వందన సమర్పణ చేసారు.
17.6.2014

No comments:
Post a Comment