కపిల రాంకుమార్
||ఎన్ని ఇష్టాలో అన్ని
కష్టాలు||
ఇంత దూరం వచ్చాక నాకేమిష్టమో
చెప్పకపోతే పక్క రాష్ట్రం నుండి
లగెత్తుకెందుకొచ్చావనగలరు!
అయినా భయమేమిలేదు
యేం చెప్పాలనిదాంట్లో
స్పష్టతావుంది!
వేదికచేరుకునేటప్పపడే
గౌరు నాయుడోపక్క
రామతీర్థో పక్క అగబడ్డారు!
కుశాలయింది.
మరింక శివాలెత్తే ఎర్ర
కవి గీడనేవుండె!
కాకినాడ అద్దేపల్లి
, తిరుపతి మేడేపల్లి
నిండుగా నవ్వుతున్నట్లనిపించి
నా కైత పరుస్తున్నానిలా!
నాకు గాంధీయిజం యిష్టమే
కాని అప్పుడప్పుడు
హింస అన్నవార్యం కదా!
నాకు మావోయిస్టులు యిష్టమే
కాన్న కొన్ని చేష్టలు
మాత్రం అయిష్టం!
ఆస్వాదనీయమైన పానీయాలన్ని
యిష్టమని
విషం తాగలేము కదా!
దృశ్యాలన్ని కనువిందు
చేస్తాయని
అత్యాచారాలను చూసి ఆనందించలేం
కదా!
నినదించకుండ వుండలేం
కదా!
కుహనా వాదంతో చూసిన కళ్ళు
చెప్పలేవని,
చెప్పే నోరు చూడలేదని
చెరువుకట్ట మీంచి వచ్చాను
కాని
నీళ్ళున్నాయో లేవో చూడలేదనే
కూట సాక్ష్యం చెప్ప లేం
కదా!
నిజం ఎప్పుడూ చేదు అనుభవాలనే
పంచుతుంది!
కొండకచో నిర్బంధాలను
పెంచుతుంది!
నిజమంటే ఉన్నోడికి కోపం!
డబ్బు జబ్బుతో జబ్బలువాచినోడికి
తాపం!
కక్కసులోదాచిన మర్మాల్
నిజం
ఎక్కడ వెలుగులోకి తెస్తుందోనని
రాజకీయ మన్మథులకు కోపమే
వారి నిలువెత్తు రాసలీలన్నీ
ఏ సూక్ష్మ దుర్భిణి తెరాడిస్తుందేమోనని
పొలాలను, సామాన్యుని
స్థలాలను,
వారసత్వ బిలాలను
గ్లోబలవుతున్నాయనేది
యెంత సత్యమో
సకల జనుల కలలను,
కథలను, కళలను, కవులను
సైతం
బలయ్యే అంత్య దశ చేరుకున్నాయని,
నిర్భయంగా చెప్ప దలచుకున్నాను!
అప్పుడు వాటిని చూచి భరించలేక
చిన్ని చితక ఆందోళనలు చేసే
ఎర్ర పక్షులన్నీ ఏకమై
కలుగులో దాక్కుని దొంగదెబ్బతీసే
నల్ల త్రాచును నరికి
పోగులుపెట్టాలంటే
పాణిగ్రాహి జముకులాడాలి!
తెలంగణా సాయుధరైతాంగ
పోరాట అయిలమ్మ
తుపాకి మోగాలి!
శ్రీరాములయ్య నిరంతరపోరాట గరిమ
అనంతనుండి విశాఖకు రావాల్ల!
విశాఖ నుండి విశాల ఆశయాల
విప్లవ భారతావనికి వెన్నుదన్నుకావాలి!
ముక్దుం, రావెళ్ళ దాశరథి, ఆరుద్ర, రాచకొండ,
కాళోజీ, శ్రీశ్రీ, శివసాగర్,
ఛాయారాజ్‌ల
విప్లవ సాహిత్య
పరిమళాలు పునర్వికసించాలి!
ఎన్ని ఇష్టాలో అన్ని
కష్టాలు!
అయినా ఇన్ని యిష్టాలు
నెరవేరాలంటే ఎన్ని కష్టాలెదురైనా!
అన్ని కమ్యూనిస్టు శ్రేణులేకమవాలి!
మార్క్సిజం అజేయం –
ఆ విజయాన్నందుకోవటమే
మన లక్ష్యమ్ని చెప్పటానికి
మీ ముందుకొచ్చాను!
ఇక్కడి బుగుత గారికి
కోపం వచ్చినా,
భుక్తి కోసం పోరాడే జనావళికోసం
ఈ నాలుగు మాటల ముచ్చటించి,
పిడికిల్ల బిగిస్తున్నాను!
రేపటి పోరుకోసం సన్నద్ధంకమ్మని
విన్నవిస్తున్నాను!
**
No comments:
Post a Comment