'' మనం మనో మధనం చేయాలి
'' -మన్మథనామ ఉగాదినాడు కవి సమ్మేళనంలో కవుల
అభిప్రాయం!
గత పదిహేను సంవత్సరాలుగా ఖమ్మంలో సాహితీ
స్రవంతి యికనుండి తెలంగాణసాహితిగా యథవిధిగా సాహితీ కార్యక్రమాలు నిర్వహించుకుంటుందని,
అనన్య సామాన్యమైన సేవలనెలా చేసిందో అదే విధంగా మరిన్ని విస్తృత కార్యక్రమాలు, సెమినార్లు,
గోష్టులు, శిక్షణా తరగతులు నిర్వహించాలని తెలంగణా రాష్ట్ర బాధ్యులు కె. ఆనందాచారి,
ఖమ్మం బి.వి.కె. గ్రంథాలయంలో మన్మథ నామ ఉగాది కవి సమ్మేళనంలో సందేశమిచ్చారు. తెలంగాణ
సాహితి జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య ఆధ్వర్యంలో,
కార్యదర్శి రౌతురవి,ఖమ్మం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సంపటం దుర్గా ప్రసాద్, కంచెర్ల
శ్రీనివాస్, డా. పి.సుబ్బా రావు,డా.పాపయ్యశాస్త్రి, బాణాల కృష్ణమాచారి, వేదికపై ఆశీనులుకాగా
పట్టణంలోని కవులు, కళాకారులు సుమారు 36 మంది ఈకార్యక్రమంలొ పాల్గొన్నారు అధ్యక్షుడు కన్నెగంటి
మాట్లాడుతూ మన్మథనామ ఉగాదిని ప్రత్యేక పరిస్థితులలో ముఖ్యం అంధ్రప్రదేశ్ రాష్ట్రం
రెండు రాష్ట్రాలుగ విదివడి, ఈ తెలంగాణా రాష్ట్రంలో మొదటి సాహితీ సమవేశంగా కవి సమ్మేళనం నిర్వహించు కుంటు, కొన్ని ప్రత్యేకమైన, రాష్ట్ర
సమస్యలను, జాతీయ అంతర్జాతీయ సమస్యలను అవగాహనతొ పాటు అనుసంధానం చేసుకుంటూ సాహితీ కృషి
జరుపుకొవలసిన అవసరంవుందని అన్నారు. ఆగడాలు, అత్యచారాలు, మోసాలు, ద్వేషాలు, ఘోరాలు,
నేరాలు పెచ్చరిల్లుతున్న తరుణాలు కొనసాగుతూవున్న కాలంలో వాటిని ధీటుగా విశ్లేషించి
నివారించే ప్రాతిపదికలుగా కవిత్వం వుండాలని అన్నారు. ప్రజా జీవితంతో ముడిపడిన అంశాలే
మన కవితాంశాలు కావాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు ఆనందాచారిని వేదికపైకి అహ్వానించారు.
సన్నగిల్లి పోవటమే కాదు, మృగ్యమయ్యే స్థితికి
చేరుకుంటున్న సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకుంటూనే మూఢ నమ్మకాలకు, గ్లొబలీకరణకు,
ప్రపంచీకరణకు, మతోన్మాద ఉగ్రవాదాలని నిలువరించే దిశ, దశ నిర్దేశించేలాకవిత్వం రాయాలని.
విస్తృతంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని, అందరికి శుభాకంక్షలు తెలుపుతూ తన కవితతో
కవి సమ్మేళనం ప్రారంభంచేసారు. '' అరల్లో నిద్రించే
వాటిని బయల్పరచాలి / కలాలకు కొత్త బలాను అందించాలి – అంటూ తెరపై రంగులు దుమ్ములేపుతాయి
- కాలానికి సంబంధించిం స్పృహ వుండాలి - మన ఆలోచన ఆక్రమణకు గురౌతున్నది, పెట్టుబడి సామాజిక
బీభత్సం చేసి మానవతా హృదయాలను కూలుస్తున్నది....కవీ! నువ్వైనా అప్రమత్తుడవై చూడాలి
'' అని కొత్త ఆశంస వెలిబుచ్చారు తన కైతలో. కన్నెగంటివెంకటయ్య నవ్వులకు సంబంధించి వ్యంగ్య
గేయాన్ని పాడి వినిపించారు. సవ్వులలోని రకాలు, నవ్వు వెనకాల వున్న మానవ నైజాలు ఉర్రూతలూగే
కంఠస్వరాన్నందించి ముగ్ధుల్ని చేసారు. ప్రముఖ కవి, విమర్శకుడు జీవన్ సందేశం యిస్తూనే
తన కవిత ''యథాతధం ''లో - '' నల్లధనం మూలాలను,స్వరూపాలను
వివరించారు. పసలేని నాటకానికి మోత ఎక్కువ, నాందీ వాక్యంలోనే భరత వాక్యం పలికింది
'' ఈ వ్యవస్థపై తనదైన చురకలు వేసి అలరించారు. కటుకోజ్వల రమేష్ ఉగాది ఆశాగీతం అనే కవితలో '' భరోసాలేని భవితను ఎలా
పంచమంటావ్?'' అంటూనే '' కాలం చిలకొయ్యకు మాత్రం మమ్ములను తగిలించాఇ వెళ్ళావని
'' చురకలు వేశారు.తాళ్ళూరి రాధ '' నిజం '' అనే కవితలో '' మానవీయ సంబంధాలు, ఆర్థిక బంధాలయినాయ్,''
అంటూ - మనిషి ' మనీ 'కొరకు చేస్తున్న సంకుచిత ధోరణులను యెత్తిచూపారు. డా.పొత్తూరి సుబ్బారావు
: ఉగాది సందేశమిచ్చి, ఖమ్మం జిల్లా ప్రాశస్త్యాన్ని '' సితార '' నగారాలుగా ఆవిష్కరించి,
మన తెలంగాణా ఔన్నత్యాన్ని, అలనాటి బౌద్ధమత విరాజిల్లడాన్ని తన కవితలో శ్లాఘించారు.
నాగిరికతా సంస్కృతులకు ఖమ్మం జిల్లా ఉదాహరణ అంటూ జిల్లా గొప్పదనాన్ని ఆసాంతం ఆకట్టుకునేలా
వినిపించారు. కవిత్వాన్ని ఓ ధృక్కోణంలో చూడటంకాదు తెలంగాణా అస్థిత్వాన్ని చక్కని చమత్కృతులతో
వ్యక్తీ కరించారు. బండి ఉష: ఉషోదయం అనే కవితలో
మట్టికాళ్ళ మనిషి మౌనంగా మట్టిలోనే పొలి అవుతున్నాడు. అరిషడ్వర్గాల నుండి జయించే కొత్త
ఉషోదయం రావాలని అకాంక్షించారు. ప్రేమ శరాలను విసరాలి అంటూ ముగించారు. అడవికట్ల ఆదామ్: పద్య కవితలను ఆరు వినిపించారు. షడ్రుచులివేనన్నట్లుగా
అవి అందరిని అలరించారు. చక్కటి శ్రావ్యమైన
స్వరంతో రాగయుక్తంగా వీనులవిందు చేసారు. షేక్ జాకీర్ : మరణించిన సమాజాన్ని
మేల్కొనేవాడే కవి అంటు కవిత వినిపించారు.
తదుపరి సాహితీ స్రవంతి 15 సంవత్సరాల
ప్రత్యేక సంచిక -'' లోగిలి '' ( కపిల రాంకుమార్ ప్రధాన సంపాదకత్వంలో) బాణాల కృష్ణమాచారి
అవిస్కరించి, ఆ సందర్భంగా సందేశమిస్తూ బహుకొద్ది మందితో పదిహేనేళ్ళ క్రితం యేర్పడిన
సాహితీస్రవంతి అచిరకాలంలో శాఖోపశాఖలుగా విస్తరించడం, తద్వారా ఉమ్మడి రాష్ట్రంలో ఒక
బలమైన సాహితీ సంస్థగాను, ఒక సాహిత్య మాసపత్రిక ప్రస్థానం ఆవిర్భావానికి ప్రత్యక్షంగానో,
పరోక్షంగాను తాను తోడ్పడినందుకు ఆనందంగావుందని అన్నారు. యిప్పుడు కొత్త రాష్ట్రంలో
తెలంగాణా భాషను, సంస్కృతులను మరింత పరిపుష్టం చేయడానికి మరింత కృషిలో భాగంగా తన నాటక
రచనా వ్యాసంగాన్ని తెలంగాణా బాషలోనే సృజన చేస్తానని, యిన్నాళ్ళకు ఆ కల సాకార మవ్వబోతోందని
సంతోషం వెలిబుచ్చారు.డా. ఆంజనేయులు : మనవూరి చెరువు - గుర్తుకు తెచ్చారు. చిన్నతనంలోని
చిలిపి పనులు, చెరువు ఉపయోగం, బహుముఖాలుగా చెరువుకు ఊరికి వున్న బంధం చాకటి తెలంగాణా
పలుకుబడులు పండేలా మంచి కైత వినిపించారు. అందరిని అలరించారు.తాళ్ళూరి లక్ష్మి: తన కవితలో
నైతికంగా దిగజారిన మన సమాజాన్ని మనం జల్లెడ పట్టి, వ్యక్తి వర్తమానంలోబాటచూపించాలంటూ
ఆకాంక్షిస్తూ ముందు ముందు నీళ్ళ టాంకులకోసం యుద్ధ టాంకులవసర్మేమో అని వ్యంగ్యంగా నీటి
అవసరాన్ని తెలిపారు.గరికిపాటి మణీందర్:
'' ఏడిపించకండి దొర - బతికుండగానే చావు బాజా మోగించకండి '' అంటూ నేటి ఆసరాఅ
పథకాలలో జరుగుతున్న అవకతవకలు ఎత్తిచూపించారు. ఫించను రాక టెన్‌షన్‌కు గురువుతున్న అనాన్ని
పట్టించుకోమని కోరారు తన కవిత '' శిశిర గీతం ' లో. పొత్తూరి సీతారామారావు : హాస్య వ్యంగ్యోక్తులమిశ్రమైన
సంభాషణల్తో ఆద్యంతం రక్తికట్టించేలా తన అవితను వినిపించారు.దేవయ్య : తొలి ఉషస్సు అనే
కవిత, గొవిందు :
ఓ ఆత్మీయ అతిథి అనే కవిత,
వినిపించగా డా.కావూరి పాపయ్య శాస్త్రి '' కోకిల ''పేర పద్యాలను వినిపించి అందులో జాతీయాలు,
తెలుగు పలుకుబడులు, నుడికారాలు పొందుపరవటమే కాక చక్కటి వివరణలు తెలియచేసారు. కంచెర్ల
శ్రీనివాస్ '' కోయిలమ్మ కూస్తోందిరా ' అనే కవితలో '' బడుగు భారత జనుల ఉషస్సులకు, ఆటంకాలు
లేని ఇజాలు'' కావాలన్నారు. కపిలరాంకుమార్ : పెపంచానికి కాస్త బుద్ది సెప్పండి
అనే కవితలో ' కోయిల గొంతు మూగబోయింది, ' అంటూ కాకులు, కోకిలల మధ్య సారుప్యత లేకపోవడాన్ని
చిత్రికపట్టారు. మన మనస్సులను మథనం చేసుకూంటూ, మేథో మథనం చేసికోవాలి అంటూ మనుషులు మృగాలవటాన్ని
తీవ్రంగా ఆక్షేపించారు. కారు( వయసు) తేడాలేని బతుకులకు చితికిపోవడాలకు స్వస్తి పలకాలంటూ
ఆశాభావం వ్యక్తీకరించారు. పోతగాని సత్యనారాయణ '' కొన్ని యుగాలు తేల్చని సగాలు '' అనే
కవితలో అకృత్యాలు, అధికారాలు కవలలు, అసమానతలు హద్దులు దాటాయంటూ ఆక్రోసించారు.ఆర్థిక
స్వేచ్ఛ స్త్రీలకు లభించినపుడే, విశ్వంలో సగమై జయకేతనమెగురుతందని ముక్తాయింపునిచ్చారు.
ఉరిమళ్ళ సునంద: అంతా కొత్త యాదే అంటూ యుగాదిని, ఉగాదిగా తలవాలంటే '' అస్థిత్వానికి
తండ్లాడుతున్నాను, మట్టి పరిమళాలు పరివ్యాప్తం కావాలందుకే. అవనిపై జరుగుతున్న విశృంఖలత్వాన్ని అక్షరీకరించారు. సంపటం దుర్గా ప్రసాదరావు
తనదైన రీతిలో చిక్కని, చక్కని చిన్న కవిత చదివి అందర్ని అలరించారు. నారాయణ '' అది ఏరే
- ఇది ఏరే '' అనేకవితను ఆలపించారు. కన్నెగంటి వెంకటయ్య ' వైఫల్యాల గజనీ యాత్రలో నేనొక విశ్వాసంలేన్ని అశ్వాన్ని
కాలేను, కాలం బడిలో పాఠాలు నేర్చుకునే బడిపిల్లమౌదాం అంటు నవగీతాంజలి పాఠం అవుదాం అని
తన కవితలో ఆశించారు. ఈ సందర్భంగా మన్మథ నామ
సంవత్సరాన్ని పురస్కరించుకొని ముందుగానే కూసిన కోయిలలాగ ఖమ్మం సాహితీ స్రవంతి తెలంగాణా
సాహితీగా మారిన మొదటి కార్యక్రమంలొ గత15 సంత్సరాలుగా సాహితీకార్యక్రమాలలో బాధ్యతలు
స్వీకరించినవారు, వివిధ సందర్భాలలలో వెన్నుదన్నుగా నిలచి సలహలు, ఉపన్యాసాలు అందించిన
సీనియర్ కవులు, విమర్శకులను సన్మానించు కోవటం ఒక కొత్త ఒరవడికి సంప్రదాయానికి తెలంగాణా
సాహితి ఖమ్మం జిల్లా కమిటి తెరతీసింది: ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యంలో
అందెవేసిన చేయి, డా. పొత్తూరి వెంకట సుబ్బారావు గారిని, కవి, విమర్శకుడు డా.కావూరి
పాపయ్య శాస్త్రి గారిని, నటుడు ప్రయోక్త, దర్శకుడు, తెలంగాణా పడికట్టుపై పట్టున్న రచయిత,
బానాలకృష్ణమాచారి గారిని, మరొ తెలంగాణా పలుకుబడిని పెట్టుబడిగా కలిగిన కవి, కథా రచయిత,
జీవన్ గారిని, కవి, రచయిత, నటుడు, దర్శకు, బోడేపూడి విజ్ఞాకేంద్రం నిర్వాహకుడు, సాహితీ
స్రవంతికి తొలినాళ్ళలో ఐదు సంవత్సరాలు అధ్యక్షస్థానాం నిర్వహించి, తదుపరిసాహితీ స్రవంతి
అధ్యయన వేదిక నిర్వహిస్తున్న కపిల రాంకుమార్‌కు సన్మానం జరగటం. ఒక చారిత్రిక నిదర్శనంగా
ఈ తొలి సాహిత్య కార్యక్రమం నిలుస్తుంది . రౌతు రవి కవులందరికి నమస్కారం అంటూ వందన సమర్పణ
చేసారు.
సాహితీ స్రవంతి 15 సంవత్సరాల
ప్రత్యేక సంచిక -'' లోగిలి '' ( కపిల రాంకుమార్ ప్రధాన సంపాదకత్వంలో) బాణాల కృష్ణమాచారి
No comments:
Post a Comment