మిని కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మిని కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, నవంబర్ 2016, మంగళవారం

కపిల రాంకుమార్‌ || ఆంక్షలా ||

కపిల రాంకుమార్‌ || ఆంక్షలా ||
వివాహాల ఖర్చుల విత్‌ డ్రాపై ఆంక్షలా ?
గత జల సేతు బంధనాలా ?
వాస్తవాలు గ్రహించరా! వడ్డనలు మానరా!
జనాలమీద వృత్తి పన్ను బాదుడా?
మోడీ మోతల్లో కొత్త ఆయుధాలెన్నెన్నో!
క్యూలో నిలబడ్డా ఫలితం శూన్యాలా!
కొంతమందికి యింటివద్దకే మాన్యాలందేలా సేవలా?
ఆన్నీ ఆన్‌ లైన్లోనే
మోసాలకు తెరంగేట్రాలా!
22.11.2016

3, ఏప్రిల్ 2015, శుక్రవారం

కపిల రాంకుమార్ || మిని ||

కపిల రాంకుమార్ || మిని ||
పట్ట పగలు
పుట్టే పగలు
కట్టె సెగలు
మట్టి గుబులు

2.04.2015

14, జూన్ 2014, శనివారం

కపిల రాంకుమార్ || చమక్‌||

కపిల రాంకుమార్ || చమక్‌||

గరుకు కాగితం
చిట్లిన పాళీ
చిద్రమైన బతుకు!

14.6.2014 ఉదయం 5.51

27, డిసెంబర్ 2013, శుక్రవారం

- ||అంకురం ||

కపిలరాంకుమార్ - ||అంకురం ||

'' ప్రణయాంకురం - మోదం ''
'' ప్రళయాంకురం - ప్రమాదం '' -

27.12.2013

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

|| మినీలు -2 ||

కపిల రాంకుమార్ || మినీలు -2 ||

పౌరుషం అనేది
రక్తంలోనే వుంటుంది కాని
పప్పుభోజనం గాడనో, ఉప్పు కారం తినడనో
అనుకుంటే యెలా?
హింసను ప్రేరేపిస్తే
రుధిరయాగమౌతుంది
మా రాతలు సంస్కరణలై
మమతల పూదోటౌటలౌతాయ్!

**

మీసాలకి రంగేస్తే మాత్రం
వంటికి లేని హుందా వస్తుందా?
మీ '' సాలు '' వారసత్వమే కదా
అది మోసాలు చేయకుంటుందా!
తాడిని తన్నేవాడుంటే
వాని తలదన్నే వాడుంతాడని
తెలిసి మసలండి !
లేదా మా క్రోధాగ్నిలో మాడి మసవుతారు!
మమ్మల్ని ఉసికొల్పకండి!
ఉశిళ్ళై మాడి చస్తారు.!
నీ చేతిలో నిప్పు
కొంపలు తగలెట్టడానికే కాదు
కుంభం మెక్కడానికీ ఉపయోగమే
పిచ్చోడి చేతిలోని రాయిలా
అది నిన్నే తన్ని తగలేస్తుంది !
నిప్పుతో తల గోక్కుంటే
యెప్పటికైనా అదేనీ
చివరి స్నేహితురాలు!

**

తిరగబడటానికి దమ్ములేక కాదురా
హింస మా మార్గం కాదు కనుక!
అలా అని చేత ' కాని '' లేనివాళ్ళమైనా
'' చేతకాని వాళ్ళం '' కాదు!
చావుని నవ్వుతూ కూడ
కౌగలించుకోగలవాళ్ళం!
నీలా పారిపోయేవాళం కాదురా!
మా మంచితనాన్ని
అలసత్వం అనుకుంటే పొరపడ్డట్టే!
సామ దాన బేధ దండోపాయాలు
మాకు తెలుసు!
ఊరికే పేట్రేగకు - మరీ పేట్రేగితే
ఆవగింజంత పేడు కూడ నీ పుర్రెలో మిగలదు!
మా ధాటికి - ఖబడ్దార్ !
____________
26.2.2013 సా.4.00

23, ఫిబ్రవరి 2013, శనివారం

|| వీల్ చైర్ టు - గోని సంచి ||

కపిల రాంకుమార్ || వీల్ చైర్ టు - గోని సంచి ||

ఇప్పుడే అందిన వార్త
మొబైల్ లో
మా ఫ్రెండ్ బాంబు దాడికి
ఆపరేషను జరిగి గురై వీల్ చైర్లో
అర్జంటు కబురొస్తే
పోస్ట్ మార్టం గదికి,
చని చూస్తే
గోనిసంచిలో తన సగ భాగం
గుర్తు పట్టలేని మాంసం ముద్ద
ముద్దుగా అరగంట క్రితం
కొన్న గోల్డ్ వాచీ
గుర్తు పట్టీందట నేనూ ఆంటూ!

23.2.2013 సా 4.30

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

||మినీలు ||

కపిల రాంకుమార్ ||మినీలు ||

కుక్కతోక వంకర
పాలక వర్గాల తీరుర!
కాగ్ లు, కోర్ట్లు తిట్టినా
బే ఖాతరురా!

***

చిన్నప్పటి కథలో
రాళ్ళువేసి పైకొచ్చిన
నీరు తాగిందిఒక కాకి!
కాని రాళ్ళు నిండుతాయే కాని
నీళ్ళొస్తాయా పైకె? ఆలోచించకుండానే
ఊ కొట్టీసాం!

***

అనుబంధాలు కొరవడితే
సంబంధాలు తెగిపోతాయి!
అందుకే
అనురాగాలు శ్వాసించక పోతె
అభిమానాలు శ్వాస విడుస్తాయి!

***

సంయమనం లోపిస్తే
రాయబారాలు విఫలం
ఆచారాలు మౌఢ్యమైతే
సంస్కారాలకు తిలోదకాలే!

***

చర్యకు ప్రతి చర్య
అనివార్య లక్షణమైనా
ప్రతీ దానికి చర్య
లక్ష్యం కాకూడదు!

***

ప్రేమకి - కోపానికి
అనుసృజన యెక్కువ
కామానికి - కార్యానికి
ఆలోచన బహు తక్కువ!

***

పట్టుదల దక్షత
కొరవడితే
మొండితనం వివక్షగా
రూపొందుతుంది!

***

ఇచ్చి పుచ్చుకోటం
సజీవ ప్రక్రియ
అది విలోమమైతే
మనిషి జీవచ్చవమే!

****
10 ఫిబ్రవరి 2013 సా. 3.10

4, జనవరి 2013, శుక్రవారం

ఫాయిదా???

కపిల రాంకుమార్

రేపు మాపు అని
రేపు మాపని
వాయిదా వేయకు
ఫాయిదా వుండదు!

4.1.2013

31, డిసెంబర్ 2012, సోమవారం

వెనుకకు తిరిగి చూసుకో

కపిల రాంకుమార్ || వెనుకకు తిరిగి చూసుకో||
కొత్త సాలు సంబరాలు అంబరాలంటేలా
చేసుకుంటున్నావు సరే
నీ సాలు మార్చుకుని కొత్త నిర్ణయాలు తీసుకొని
గతంలోని పొరపాట్లు పునరావృతంకాకుండా
దిశ మొలవేసుకొని వెక్కిరిస్తున్న గతాన్ని
నెమరువేసుకో!
కండ కావరంతో నీ చేష్టలను బేరీజు వేసుకోకుండా
పున:పున: తప్పులుచేసుకుంటూ పోతే
పుట్టగతుల మాటటుంచి
పుట్టి మునిగే సందర్భం, సమయం
నీ కోసం పొంచివుంది!
వెనుకకు తిరిగి చూసుకో

27, డిసెంబర్ 2012, గురువారం

||ప్రణయ తత్వము |

కపిల రాంకుమార్ ||ప్రణయ తత్వము ||(అష్టావధాని వడ్డాది సీతారామాంజనేయులు- రచయిత )
మ|| సెలయేరులు నదింజేరు, వహినులొగింజేపటుల వారాశి గ
మ్రలసద్దివ్యసమీరణంబొలయు సౌరభ్యక్యమాధుర్యతా
కలిమిం, విశ్వనియంతృతం జగతి నేకాకిత్వమేలేదు, పొం
దలరుం, గావున నిన్నుజేరుటకు నేలానాకు శంకింపగన్ !
సీ|| పరికింపుమా! వియద్భాగంబు జుంబించు
ప్రాంచుదుత్తుంగ పర్వచయంబు
అవె తరంగంబులన్యోన్యసంశ్లేషాను
మోద పయోరాశి బొదలుచుండు
జంటపూవులు పరస్పరమనుజాతుల
క్రియనుండుదమి నేవగింపులేక
తిలకించువేయి చేతుల నంశుమంతుడే
యవనిబరీరంభమావరించు
గీ|| చంద్రకావళి ముద్దాడు సలిలరాశి
నిన్ని ముద్దుల మురువులవన్నియెన్న
నేమికొరయగును? నిప్పుడింపెసగ్ మెసగ
హర్షమున నీవు నన్ను ముద్దాడవేని!
అంగ్ల మూలము : షెల్లీ :27-12-2012 సా.6.23 (నౌడురి మూర్తిగారికి ధన్యవాదములతో)
ఆంగ్ల మూలము : షెల్లీ
The fountains mingle with the river
And the rivers with the Ocean,
The winds of Heaven mix for ever
With a sweet emotion;
Nothing in the world is single; _5
All things by a law divine
In one spirit meet and mingle.
Why not I with thine?–
2.
See the mountains kiss high Heaven
And the waves clasp one another; _10
No sister-flower would be forgiven
If it disdained its brother;
And the sunlight clasps the earth
And the moonbeams kiss the sea:
What is all this sweet work worth _15
If thou kiss not me?

17, డిసెంబర్ 2012, సోమవారం

అంకురాలు

కపిల రాంకుమార్|| అంకురాలు||

రాజకీయ వికారమా - భాజనీయ వివేకమా!
రోజువారీ విధానమా - రాజుకున్న వివాదమా!
కారణాల పునాదిలో - కీరవాణీ సరాగమా!
మారుతున్న కాలానికి మౌనమైన కలమా!

17.12.2012

14, డిసెంబర్ 2012, శుక్రవారం

పీడ

చేనుకు పట్టిన గొంగళిలా
వ్యవస్థకు అవినీతి పీలుస్తున్నది!
క్రిమి సంహారం కల్తీ కాబడి
చేతకాక మొరాయిస్తున్నది!!
14.12.2012
** (1969 లో రాసిన మినీ కవిత)

13, డిసెంబర్ 2012, గురువారం

వ్యాప్తి|

కపిల రాంకుమార్ || వ్యాప్తి||

పట్టణాలలోని సెగ పల్లెలకూ పొగ పెట్టింది!
రావణ కాష్టంలా
ఆడపిల్లల జీవితాలు తాలు చేయ!

13.12.2012 ఉ.5.30