Saturday, September 7, 2013

కపిల రాంకుమార్ || బఠాణీలు||2||

కపిల రాంకుమార్ || బఠాణీలు||2||

పాప కైనా - కను
పాప కైనా
ప్రాపకమున్నంతవరకే!
**
ధనమైనా - ఇం
ధనమైనా
దగ్ధం కానంతవరకే
**
కారైనా (వయసు)
నీరైనా
కారితే బేకారే!
**
మాటైనా
కోటైనా (భవంతి)
ఓటిపోనంతవరకే!
**
చేతలైనా
నేతలైనా
పాతకాలు కానంతవరకే!
**
చేయి ఇవ్వటానికి
చేయి అందివ్వటానికి
చేంతాడంత బేధంవుంది!
**
7.9.13...ఉ . .10.04

No comments: