Sunday, September 22, 2013

|| త్రిశంకు స్వర్గం||

కపిల రాంకుమార్ || త్రిశంకు స్వర్గం||

భూమ్యాకాశాలు కలసినట్లు దృశ్యం భ్రమే కాని
నిజం చేసేలా ధరలాకాశాన చెట్టపట్టాలేసుకుంటే
నమ్మకతప్పటంలేదు
జేబులో డబ్బులకు సంచి నిండేదొకనాడు
ఇపుడంతా తారుమారు!
నియంత్రణ చేయాల్సిన
సర్కారు చేతులు కట్టుకుని
చోద్యం చూస్తోంది!
ధర్నాలు చేసినా, రస్తారోకో చేసినా
రాజ్య హింసకైనా సిద్ధమేకాని
రాజ్య క్షేమం పట్టకుంది!
సరఫరాచేసే సంస్థలన్నీ కట్టుకట్టి
గిట్టుబాటు ధర రాకుంటే
చందా నిలుపుదలచేస్తామన్నపుడుల్లా
మూల్యం పెందుకుంటూపోతోంది!
మూలిగేనక్కమీద తాటిపండు పడి
జనం గగ్గోలు పెడుతున్నా
తగ్గిపోతున్న రూపాయి వలువలకు
మాకేం రంకుకడతారేం అంటూ
ఎదురుదాడి చేస్తోంది సర్కారీ కుక్క!
వంటకు గాసూ లేదు గాసునూనె దొరకదు
వండని ప్రకృతి ఫలాలు తిందామంటే
వనాలు లేవు కాంక్రీటు భవనాలు తప్ప!
రెంటికి చెడ్డ రేవళ్ళనుచేసి
రోట్లో తలపెట్టిన తరువాత
రేట్ల పోటు తట్టుకోపోతేయెలా సామెతలేస్తోంది
ఇల్లెక్కి కోట్లకు కోట్లు తినమరిగి
అరిచే కోడిలా యుపియే పుంజు!
సుఖమెరిగిన ప్రాణాలు సౌకర్యాలొదుకోలేక
రేపటి రాజెవడో రెడ్డెవదో తేల్చే ఓట్ల సమరం వరకు!
త్రిశంకు స్వర్గంలో వేలాడటమే మన కర్తవ్యం!
21.9.2013__________________5.10 pm.

No comments: