Monday, September 2, 2013

కపిల రాంకుమార్|| సబాల్ట్రన్‌ ఆర్తి, ఆక్రోషం '' అజా '' || సుంకిరెడ్డి నారాయణరెడ్డి|

కపిల రాంకుమార్|| సబాల్ట్రన్‌ ఆర్తి, ఆక్రోషం '' అజా '' || సుంకిరెడ్డి నారాయణరెడ్డి||

జాతి అణచివేతను ప్రశ్నిస్తున్న సంకలనం '' అజా'' -

అజా అనేది ఆర్తికాదు, పిలుపు కాదు, ధ్వంస రచనలో నిట్ట నిలువునా మునుగుతున్న
ఒక ఆక్రందన,ఒక అర్తనాదం, నిస్సహాయ ఆక్రోషం, గాయం నుంచి కారే కన్నీళ్ళు
గాయం నుంచి కారే కవిత్వం. ప్రేయసి చేసిన గాయంలోంచి, విధి చేసిన గాయం లోంచి ఒంటరి
ముస్లిం బాధే కవిత్వమై ప్రవహించినట్లు, మెజారిటి మతం చేసిన గాయం నుంచి, అమెరికా చేసిన గాయం నుంచి ముస్లిం ఒంటరితనమే విశాలంగా పరుచుకున్న కవిత్వం
ఇక్బాల్ : నాకేం కవిత్వ మొస్తది అంటూనే
'' నా తోటలో పూలే లేవు
నన్ను పువ్వడిగితే ఎట్లా తెచ్చేది.'' కవిత్వం రాదంటూనే కవిత్వంలో మాట్లాడాడు.
ఇదీ సైగల్ గొంతులోని మెలాంకలీ అంటే.
సోవియట్ రష్యా వున్నపుడు ప్రపంచం బొమ్మ, బొరుసు వున్న నాణెం, బొమ్మ పోయింది.
బొమ్మ వుండొద్దు. బొమ్మ వుంటే దానికి చీమూ నెత్తురు వుంటాయి. అది ప్రశ్నిస్తుంది
ప్రపంచంలో కమ్యూనిజం ఓడిన తరవాత మరో బొమ్మ ఇస్లాం మిగిలే వుంది.
అదీ పోవాలి. ఇప్పుడు ఇస్లాం ప్రాణమున్న వైధ్యమున్న బొమ్మ. మొమ్మలుండొద్దు,
బొరులొక్కటే వుండాలి. అది ప్రపంచమైనా, భారత్ అయినా! అందరూ నిద్ర పోవాలి.
డాలర్ రెక్కల కింద. కాషాయం కరవాలాల కింద. ' అజా' లుండొద్దు. అరఫత్ లుండొద్దు
**
' దేశాలు స్వతంత్ర్యాన్ని కోరుతున్నాయి
జాతులు విమ్నుక్తి కోరుతున్నాయి.'
ఏమైంది? ఇన్ని దశాబ్దాల తర్వాత? ఒక జాతి అణిచివేతను ప్రశ్నించిన ప్రపంచ కవుల
సంకలనం ఇంకా రాలేదు, కాని అదే ప్రశ్నతో అచ్చిన ఆంధ్ర దేశ ముస్లిం కవుల సంక
లనమిది. స్కైబాబ, అన్వర్ ల ముందుమాటలు ఈ సంకలనాన్ని తెరిచే ''సెషామ్‌ '':
''నీకు బురఖా అంటే తల్లో, చెల్లో, భార్యో, బంధువో
కాని కాషాయానికి బురఖా అంటే తురకదే!
...
అరే సాయిబూ!
పిల్లల్ని పుట్టిచ్చుడే కాదు
అప్పుడప్పుడు పిల్లల్ని కాపాడుకుందాం '' ...అన్వర్
నీళ్ళు నమలకూండా సూతిగా, స్పష్టంగా మొదలవుతుందీ సంకలనం.
' నబూత్ ' అనే కవితలో
ఇక్కడే
నా ఘర్ ఒకటివుండాలి
కిలకిలా నవ్వుతూ స్వాగతం పలికే
' దెహ్ లీజ్ ' ఒకటి వుందాలి!
ఇక్కడే ఎక్కడో తప్పిపోయిన
నా ' తకదీర్ ' కోసం వెతుక్కుంటున్నాను
' తన్‌హాయి' ని తలకు చుట్టుకొని.......' అంటూ సాగుతుంది.
గుజరాత్ ఘటనపై స్కైబాబ :''కుడికన్ను చూస్తుండగానే
ఎడమకన్ను పెరికివేత
భార్యల కను రెప్పలమీదే
భర్తల దహనం!
భర్తల పిచ్చి చూపులముందే
బరిసెలు దిగబడిన యోనుల రక్తం ''

ఇషాఖ్ మహమ్మద్ : ''అక్కడ మతోన్మాదం

రక్తపు హోళీ ఆడుతోంది
అది రక్తం కాదు
రంగు నీళ్ళని బుకాయిస్తోంది ''

గౌస్ మొహియుద్దీన్‌: ''ఆ చమేలీ నవ్వు
చమన్‌ లో పూసినందుకే
రెమ్మారెమ్మా విరచబడింది ''

జమీలా నిషాత్ : ' ఆ ఇళ్ళ బూడిద
మమ్మల్ని పిలుస్తోంది
విరిగిన తలుపులు
చప్పుడు చేస్తున్నాయి ''
మహమూద్ : '' తప్పిపోయిన బంతిలా
తన బాల్యాన్ని వెతుక్కుండున్నాడు
తల్లీతండ్రినీ వెతుక్కుంటున్నాడు
రెగిపడిన మాంసం ముద్దలతో
పోల్చుకుంటున్నాడు.''
యాకూబ్ : ' నేనేం చేసాను
నా శరీరంలో కోర్కెల్ని తీర్చే
ఒక మర్మాంగం కూడా ఉందని తెలియనిదాన్ని ''
షాజహానా: '' ఆకాశాన్ని చీరి
చందమాను లాగిపారేస్తే
చీకటి అమవాస్య
ఆ తల్లి కడుపులోంచి మాట్లాడుతున్నాను ''
.....కవుల పేర్లు తీసేసి చదివితే ఇది ఒక దీర్ఘ కవిత్గా కనిపిస్తుంది కదూ.
అవును అంద్రిలోనూ బీభత్సం, ఒకే రకంగా రక్తాన్ని మరిగిస్తున్నప్పుడు
అందర్లోంచి వెలువడిన ఒకే కావ్యమిది. ..
ఈ సమీక్షలో మొదట్లో కోట్ చేసినట్లు దేనీ అస్థిత్వం దానిదే, దేని గౌరవం,

దేని స్థానం దాని కివాల్సిందే. అలా కాకపోతే అది, వైవిధ్యంలేని, అంద విహీనమైన
శిలా సదృశమైన దేశమౌతుంది. ప్రపంచమౌతుంది.
అంత వికారమైన దేశమెందుకు? ప్రపంచమెందుకు??
_________________________________
పేజి 187-189 . ముల్కి - ముస్లిం సాహిత్య సంకలనం (వ్యాసాలు, రిపోర్ట్లు, కవితలు, సమీక్షలు )సంపాదకులు : స్కైబాబ, వేముల ఎల్లయ్య హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ జూలై 2005 వెల రు.65/- మా బి.వి.కె. గ్రంథాలయంలో ఈ పుస్తకమున్నది.
__________________________________
2.9.2013 9.51 am.

No comments: