Saturday, September 28, 2013

|| మన సంస్కృతి- బొడ్డేమ్మ పండుగ||

కపిల రాంకుమార్|| మన సంస్కృతి- బొడ్డేమ్మ పండుగ||
భాద్రపద మాసంలో బహుళ పంచమినాడుప్రారంభించి, మహాలయామవాస్యతో ముగించే ' బతుకమ్మ '
పండుగకు ముందు ఉత్సవంగా ' బొడ్డెమ్మ పండుగ ' తెలంగాణా సంస్కృతిలో ప్రసిద్ధమైనది.
_________________________________________________
మాలుమర్తి మేడ మీద చందమామ - వెండియ్య వేనగిరులు చందమామ
ఇత్తడి చేరలు చందమామ - ఇత్తడి చేరలకు చందమామ
రాగియ్య కడువలు చందమామ - రాగియ్య కడువలకు చందమామ 
ుత్యాల ముగ్గులు చందమామ - ముత్యాల ముగ్గులకు చందమామ
వజ్రాల వాకిండ్లు చందమామ -వజ్రాల వాకిండ్లకు చందమామ
పవడాల పందిళ్ళు చందమామ - పవిడాల పందిళ్ళకు చందమామ
మంచినీళ్ళ బావిబుట్టె చందమామ - మంచినీళ్ళబావి పక్క చందమామ
మంచిమల్లె తీగ బుట్టె చందమామ- మంచిమల్లె తీగకు చందమామ
కోసేవారు లేక పాయే చందమామ - కోసెవారు లేకపోతే చందమామ
కొండెత్తు పెరిగిపోయే చందమామ - కొండెత్తుపెరిగితే చందమామ
కోయించు చందప్ప చందమామ -కోయించి చందప్ప చందమామ
పంచిపెట్టు గౌరమ్మ చందమామ - పంచి పెట్టు చందమామ!

తొమ్మిదో రోజున పరమాన్నము వండి, పంచిపెట్టి, ఒక బావి వద్దకు గూడి

'' బొడ్డెమ్మ బొడ్డెమ్మ బిడ్డాలెందరె
బావిల పడ్డవారికి బారిద్దరమ్మ
చెర్లా బడ్డ వారికి చేరిద్దరమ్మ
కుంట్లబడ్డావారికి కోరిద్దరమ్మ
నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ
నిద్రకూ నూరేండ్లు నీకువెయ్యేండ్లు
నినుగన్న తల్లి నిండ నూరేళ్ళు ''
అని పాట పాడి బొడ్డెమ్మని ఆ నీళ్ళలో విడిచిపెడతారు.
____________________________________
జానపద గేయ సాహిత్యం -డా. బిరుదురాజు రామరాజు - పారమార్థిక గేయములు -
నుండిసేకరణ.
____________________________________
27.9.2013 ఉదయం.11.10

No comments: