కపిల రాంకుమార్|| యాదృచ్ఛికం||
రోజూ బస్కీలు తీసే వాసు
వెలుగురాకముందే
లంగోటి కట్టి
అంగవస్త్రంతో
దోడ్లో సాధన చేస్తుంటే
తూర్పు వెలుగురేఖలు
బద్ధకంగా శ్వేత వర్ణం వదిలి
మంకెనపూరంగేసుకుని
పలుకరించేవేళ
కిలకిలరావాలు
సన్నాయి వాయించే గుడిగంటలకు
తోడిరాగమవుతున్నవేళ
లంగావోణీలో మంగ
చల్లని పచ్చికపై అంగలువేసుకుంటూ
పూలకోసం బావి వెంపు కదులుతున్నవేళ,
పాలేరు వెంకన్న పాలుపితికి
వంటింటి గుమ్మంలో పెట్టి
గడ్డిమోపుతేవటానికి
వాము వెంపు వడివడి నడుస్తున్నపుడు
మువ్వల సవ్వడిచేస్తూ చెంగుచెంగుమనే
లేగదూడ అదాటుగా బావి అంచుకు వస్తున్నపుడు
ముగ్గురి దృష్టి దానివైపే మరలింది
క్షణంలో పడబోయే దూడని
కాపాడే ఆత్రంలో దూడను గెంటారే కాని
వారు మాత్రం బావితో మమేకమయ్యారు!
జీవ ప్రాణరక్షణలో స్వయంరక్షణ మరచి
తామరాకులా బావిలోనే తేలారు!
యాదృచ్ఛికంగా జరిగిందే
కాని మనసును నలిపేసింది.
20.09.2013 ఉదయం 5.59...
రోజూ బస్కీలు తీసే వాసు
వెలుగురాకముందే
లంగోటి కట్టి
అంగవస్త్రంతో
దోడ్లో సాధన చేస్తుంటే
తూర్పు వెలుగురేఖలు
బద్ధకంగా శ్వేత వర్ణం వదిలి
మంకెనపూరంగేసుకుని
పలుకరించేవేళ
కిలకిలరావాలు
సన్నాయి వాయించే గుడిగంటలకు
తోడిరాగమవుతున్నవేళ
లంగావోణీలో మంగ
చల్లని పచ్చికపై అంగలువేసుకుంటూ
పూలకోసం బావి వెంపు కదులుతున్నవేళ,
పాలేరు వెంకన్న పాలుపితికి
వంటింటి గుమ్మంలో పెట్టి
గడ్డిమోపుతేవటానికి
వాము వెంపు వడివడి నడుస్తున్నపుడు
మువ్వల సవ్వడిచేస్తూ చెంగుచెంగుమనే
లేగదూడ అదాటుగా బావి అంచుకు వస్తున్నపుడు
ముగ్గురి దృష్టి దానివైపే మరలింది
క్షణంలో పడబోయే దూడని
కాపాడే ఆత్రంలో దూడను గెంటారే కాని
వారు మాత్రం బావితో మమేకమయ్యారు!
జీవ ప్రాణరక్షణలో స్వయంరక్షణ మరచి
తామరాకులా బావిలోనే తేలారు!
యాదృచ్ఛికంగా జరిగిందే
కాని మనసును నలిపేసింది.
20.09.2013 ఉదయం 5.59...
No comments:
Post a Comment