Wednesday, September 4, 2013

కపిల రాంకుమార్ || నియో మాట్రిమోనియల్ సెర్చ్||

కపిల రాంకుమార్ || నియో మాట్రిమోనియల్ సెర్చ్||
( జస్ట్ ఫర్ ఫన్‌)
ఎవరైనా సరే
కట్నం యివ్వలేని వారు
తీసుకోమనే వారు 
ఉన్న డిగ్రీలు, 
పంచుకున్న ఆస్తులు
అనుభవించిన పస్తులు
ఎత్తు కొలుచుకోటాలు
బరువులు తూగటాలు
మా ప్రమాణాలకు సరితూగాలి
తదుపరి పరిణామాలకు వారే బాధ్యత!
దరఖాస్తు చేసుకోవచ్చు
దానితో పాటు
రక్త పరీక్షతో పాటు,
ఇతరేతర బంధాలు, అనుబంధాలు
స్నేహితుల, శత్రువుల
గురువుల తల్లిదండ్రుల,
తోడబుట్టిన వారి నుండికూడ
ధృవపత్రం జతచేయని వారు
వివాహ పరిచియవేదిక
ప్రవేశానికి అర్హులు కారు!
ఆవేశాలు, కావేశాలు
దరిరానివారు మాత్రమే
బయలుదేరండి!
పడమటి గాలి సోకినవారు
పబ్బులు, క్లబ్బులు
ఏదేని సప్తవ్యసనాలున్న వారు
బయటపడితే నిర్భయ శిక్ష అమలు!
సంబంధం కుదిరితే
మరునిముషంలో-దండ మార్పులు!
రిజిష్ట్రారు కార్యాలయంలో
నమోదు గారంటీ!
సమయం, తేదీ, స్థలం
తరువాత తెలుపబడును!
గమనిక: ఫేస్ బుక్ అసలు ఫొటో లేని వారు
దరఖాస్తు చేయడానికి అర్హులు కారు.
షరా:ఈ ప్రకటన వెలువడిన అరగంటలోగా
దాఖలు చేసుకోవలెను.
సిఫార్సులు, చెల్లవు!
3.9.2013

No comments: