2012 జాషువా అవార్డుల కోసం నామినేషన్లకు ఆహ్వానం
హైదరాబాద్ Wed, 12 Sep 2012, IST
పద్మభూషణ్ డాక్టర్ గుర్రం జాషువా 117వ జయంతి సందర్భంగా సాహితీ రంగంలో విశిష్ట సేవలందించిన వారికి తెలుగు అకాడమీ '2012 జాషువా అవార్డులు' ప్రదానం చేయనుంది. ఈనెల 28న రవీంద్రభారతిలో జరిగే జాషువా 117వ జయంతి సభలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ మేరకు తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య కె యాదగిరి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశా

రు.
జాషువా పరిశోధనా కేంద్రం తరపున తెలుగు భాషా సాహిత్యాలలో విశేషంగా కృషి
చేసిన ముగ్గురికి ఒక్కొక్కరికీ రూ. రెండు లక్షల చొప్పున ప్రతి ఏటా
అవార్డుల్ని ప్రదానం చేస్తారు.
పురస్కారాల వివరాలు - అర్హతలు
జాషువా జీవిత సాఫల్య పురస్కారానికి 60 ఏళ్ళు పైబడిన వారై, తెలుగు భాషా సాహిత్యాలలో విశిష్ట కృషి చేసిన వారై ఉండాలి.
జాషువా సహిత్య విశిష్ట పురస్కారానికి దళిత సాహిత్యంపై విశేషంగా కృషి చేసినవారు అర్హులు. వీరు 50 ఏళ్ళ వయస్సు పైబడిన వారై ఉండాలి.
జాషువా విశిష్ట మహిళా పురస్కారానికి భాషా సాహిత్య రంగాలలో విశేషమైన కృషి చేసిన, 50 సంవత్సరాలు దాటిన మహిళలు మాత్రమే అర్హులు.
అవార్డు కోసం పేర్లను నామినేట్ చేసేవారు రచయిత పేరు, వయస్సు, సాహితీ వివరాలు, భాషా సాహిత్యాలపై వారు చేసిన కృషి, ప్రచురించిన పుస్తకాలు, దళిత సాహిత్యంపై చేసిన కృషి, పొందిన పురస్కారాల వివరాలు తెలుపుతూ నామినేషన్ పత్రాలను 'కన్వీనర్, జాషువా పరిశోధనా కేంద్రం, తెలుగు అకాడమీ, హిమాయత్‌నగర్, హైదరాబాద్' చిరునామాకు ఈనెల 21వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా అందజేయాలి.

No comments:
Post a Comment