కపిల రాంకుమార్ || తలనొప్పి! || ***
కొన్ని ఉద్యమాలు
అప్పుడే రెక్కలొచ్చిన పిట్టల్లాగ
ముందువెనకలు చూడకుండ
ధ్యేయమేమిటో తేల్చుకోకుండా
పర్వులిడితే గమ్యం ఆలస్యమౌతుంది!
వేటగాడి బాణపు గురి
తప్పితే తప్పనిసరిగా
తనకే ముప్పుగా పరిణమిస్తే
వర్తమానం భవిష్యత్తు గోడు వినదు!
తదుపరి కర్తవ్యం అగమ్యగోచరమై
భవిష్యత్తుకు తలనొప్పి కాకమానదు
ఉద్యమ కాకా చల్లారక ముందే
కొత్తయెత్తుగడ వేయకపోతే
అసలు లక్ష్యపుటునికే
ప్రమాదం పొంచివుంటుంది
పదును పెట్టి
అదును పట్టి
శరస్సంధానం కావించు!
లోచనాలోచనాలను సవరించు
14-12-2012.
(*** 40 ఏళ్ళ క్రితపు కవితను సవరించాను నేటికి తగ్గట్టుగా)
No comments:
Post a Comment