Monday, December 17, 2012

ఏం తినేటట్టు లేదు

...
సవ్వడి డెస్క్ Sun, 16 Dec 2012, IST ప్రజాశక్తి

ఏం తినేటట్టు లేదు 

 పాటగా బావుందని చప్పట్లు కొడతాం

డీజిల్‌ పెట్రోల్‌ రేట్లు పెరుగుతున్నా,

విద్యుత్‌ కోత చాలదన్నట్లు ధరల వాత పెడుతున్నా,

కిలో సరుకులు సగానికి తగ్గినా


ఖర్చు రెట్టింపైనా, జేబు చిల్లు పడినా,

కూలి పెరిగి, కూటికి చాలకపోయినా,

దోమ కాట్లకు జనం చస్తున్నా,

కాకుల తరిమి గద్దల్ని మేపుతున్నా,

ఎవరూ మాట్లాడరేం?

పీక తెగ కోస్తున్నా

స్పర్శలేని మౌనమేమటో!

ఎవరికి పుట్టినబిడ్డో వెక్కివెక్కి యేడ్చినట్లు

ధర్నాలు రాస్తా రోకోలు ప్రతిపక్షాలకేనా?

చానళ్ళకు చేతినిండా పనేనా?

చేతులతో గుద్ది

చేతులు కాలిం తరువాత

యే ఆకులు పట్టుకుని యేం లాభం!

ఐదేళ్ళు ఆగాల్సిందేగా!

కత్తిలాంటిది చేతులో వుంచుకొని

ఉపయోగించలేని ఓటరును ఆపుతున్నదేమిటి?

పైగా ప్రజాలు చైతన్యవంతులంటారేం

ఏది ఆ చేతనైనతనం???

మొలబంటిలోతులో దిగబడ్డా బుద్ధిరాదా!

నిండా మునిగిన తరువాత చలేమివుండకపోవచ్చు, కాని

మునిగే వుంటే శ్వాసే ఆగుతుంది కదా!

ఆ మాత్రం ఇంగితం లేదా?

తిగుబాటు ధ్యాస కలుగదా?

శ్వాసే ఆపుకుంటారా?

- కపిల రామ్‌కుమార్‌.

No comments: