కపిల రాంకుమార్||తాంబూలాలిచ్చాం||
తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి
అన్న నానుడి సర్కారుకే చెల్లింది!
ఉపస్థ మినహా కన్యా దానం చేయటమూ
సర్కారుకే ఒప్పింది!
పట్టాలిచ్చి స్వాధీంపరచకుండా
కాలయాపనెందుకో?
మా భూమి చూపండని అడిగినందుకు
నిర్దాక్షిణ్యంగా పోలీసు కుక్కలనుసిగొల్పటమంటే
పరిష్కరించకుండ పారిపోవటం కాదా?
యిచ్చినమాట నిల్బెట్టుకోలేక
పలాయనవాదమెందుకు!
బీరాలు పలకటమెందుకు!
సగం పెట్టి మేనత్త
అనే తంతులాగ
ప్రవర్తించటమెందుకో
యేలికలకే తెలియాలి!
ఉట్టికెగరలేనమ్మ
స్వర్గానికెగిరే చందంగా
ప్రగల్భాలెందుకు!
ఆచరణ దగ్గరకొచ్చేసరికి
మీనమేషాలెందుకు?
కుంటిసాకులెందుకు?
ప్రతిపక్షాలపై కినుకెందుకు?
ముదిగొండ మరకలు
చెరిగిపోయాయా?
మదినిండ కుతంత్రాలు నిండాయా?
గంగవరం దృశ్యాలు, కారంచేడు కార్పణ్యాలు
మరుగున పడ్డాయా?
ముంత్కు మూకుడుకాని
ప్రజల నోళులు మూయగ
మూకుడుండదని తెలియదా?
ఎన్నికలప్పుడుపన్యాసాలు
గద్దెనెక్కిన తరువాత
వాగ్దానాలకు తిలోదకలా?
మతిమరపు వారికైతే
ప్రజలకనుకొని మూర్ఖ ప్రవర్తనెందుకు?
జనం కళ్ళు తెరవటం
కుళ్ళు ప్రభుత కిష్టముండదు!
జనం కళ్ళు తెరిస్తే కాని
కష్టాలకంతముండదు!!
దౌర్జన్యంతో రాజ్యమేలడమంటే
ప్రజాస్వామ్యాన్ని
అపహాస్యం చేయటమే
హక్కులకై, రక్షణకై
గొంతు ఎత్తుతారు
జనం సత్తా చూపుతారు!
16-12-2012 ఉ. 5.29
No comments:
Post a Comment