Friday, December 7, 2012

చేవలేని సర్కారు

కపిల రాం కుమార్ // చేవలేని సర్కారు// **

జనపదాల మేలుకోరి జానపదుల మేలుకొలుపు!
వెతలులేని బతుకు కొరకు రాజిలేని పోరు సలుపు!!

నోరు తడప నీరడిగితే
నములు నీళ్ళు సర్కారు!
సేద్యానికి కొదువనీరు
మద్యానికి అదుపు లేదు!!
ఏందీ అన్నాయమని
అందమన్న అననీదు!

రోగమొస్తే దవాఖాన్ల
సర్కారీ మందుల్లేవు!
ఫుడ్ లేదు, బెడ్ లేదు
యిచ్చేటాంకి మనిషిలేడు!
సందుగొందులెందుచూడ
మందుపాత్రల యిందు!

తన తప్పులెంచనీదు
గొంతెప్పుడు పెగలనీదు!
మత్తుతప్ప మునగనీదు
బెల్టుషాపు మూయనీదు!
పాలకులు ఊక హోరు
కాటికి పంపే జోరు!

తిన్నోడికే తినబెట్టి
బోడినెత్తికి తలలంటు!
పిట్టల్ని పట్టేరు
గద్దల్ని వదిలేసి!

మంత్రాల యంత్రాంగం!
తంత్రాల మంత్రాంగం!!

7.12.2012. **( చైతన్య మానవి - త్రైమాస పత్రిక -అక్టోబర్ -డిసెంబర్ 2012 సంచికలో -పేజి 5 లో ప్రచురితం)

No comments: