Thursday, December 20, 2012

పదవీ విరమణుని వ్యధ

కపిల రాంకుమార్|| పదవీ విరమణుని వ్యధ ||

మామయ్యా! ఖాళీయే కదా,
యేడ్చు పాపను ఆడింపవయ్యా!
ఏమయ్యో! రైతు బజారునుండి
కూరలు తెచ్చిన నీ సొమ్మేమి పోవునయ్యా!
రావయ్యా! రచ్చబండ తగువులు తీర్ప
రాకుంటివదేమి సోద్యమయ్య
కోడలు, ఆలియు, స్నేహితులాట
పట్టింతురిల పదవీ విరమణుడగు నన్ను! -1

***

వింత చోద్యమదేమొగాని
ఉద్యోగం చేసినన్నాళ్ళు
ఎంత ప్రేమయొ, యెంత అభిమానమొ
చూపుదురెల్లరు,
గంతకు తగ్గ బొంతగు రీతి
తొలగింతురు ఇంతకు నీవు
పదవీ విరమణుడగుట వలననే! -2

***

తుమ్మిన, దగ్గిన అయ్యో అటంచు
జాలిపడరు!
పొమ్మనకనే పొగపెట్టు చందమున
చులకన కావింతురు
దిమ్మ తిరిగినట్లున్నదని
వాపోవ యేమి ఫలము
నీ సొమ్ములు తిన్న విశ్వాసము
లేని వారైరి ఆలును, బిడ్డలు
పదవీ విరమణుడగుట వలననే - 3

***

వచ్చు ఫించను చాలదు!
స్వచ్చతలేని శాకములు
అమరవు,
నేడు పెచ్చరిల్లిన ధరాఘాతాన బలై
పచ్చడి మెతుకులె ముసలి బతుకుల్
పదవీ విరమణుడగుట వలననే -4

***

బాధ్యత తీరిన వారి సంగతి అటుంచు
బధ్యత తీరని వారి గతి అతిఘోరము
మిధ్యయగు లోకమున ఆడు పిల్లల
పెండ్లిచే్యగా, నీ బాధ్యతలందు ఆదుకొను
వారు లేరిల -పదవీ విరంనుడగుట వలననే - 5

***

అవశాన దశయందు ఆదుకొనుటకు
కొడుకేడని చూచుచున్నావా?
పరదేశాం మూటలు కట్టుకొను నెపమున
దాగి భవబంధములన్ని
ధన బంధములుగ మార్చుకొనుటకు
అవలేశ్ము సిగ్గులేక తల్లిదండ్రుల
చూడ ఇచ్చగించడు - పదవీ విరమణుడగుట వలననే - 6

____________________________________________
20.12.2012 (ఇది యెవరినీ నొప్పించడానికి కాదు. యిది చందస్సు అనుకొని దోష శోధన చేయ పనిలేదు.--సరదాగా లోక రీతిని వ్యక్తీకరించానంతే)

No comments: