30, అక్టోబర్ 2016, ఆదివారం

కపిల రాంకుమార్ |||దీపాళైతది గాదె ||

కపిల రాంకుమార్ |||దీపాళైతది గాదె ||
చిటచిటపటలాడుతూ కాకరొత్తిలా
కోరికల చిట్టావిప్పిన మా ఆవిడకు
నా సమాధానం నచ్చనందుకే 
ఆ చిరుశబ్దాలు సుమీ!
సరదా సునామీలు లేకపోతే
సంసారమే కాదు కదా!
కొత్త బట్టల పండుగ యీనాం
యివ్వలేదని
ఆముదమెక్కువై ఆచి తూచి వెలిగే
మతాబు మా పెద్దోడు!
రేపు యింటి బాధ్యత వాడు చూసుకోవాలి కదా
కడు నెమ్మదస్తుడేనండోయ్‌!
ఆకాశానికి సైతం నిచ్చెన వేసి
చిచ్చుబుడ్డిలా కాసేపు
నెక్లెస్‌ కొనివ్వలేదని
నెక్లస్‌రోడ్‌లో ధర్నా చేస్తనని బెదిరించే
లక్ష్మీ టపాసు లాంటి మా పుత్రికా రత్నం!
నా ఓపికకు పరీక్ష పెడ్తుందన్నమాటే గాని
అసలు అలగని జాతిరత్నం కదండీ
అసలేమి కోరికలు కోరకుండా
అత్తవారింట్లో హాయిగా పెట్టింది తిని,
అందరిలో కలసిపోయే మా అల్లుడుగారంటే
పక్కింటావిడికి యెంత కుళ్ళో!
అయ్యయ్యో! ఆ రోజుల్లో అల్లుళ్ళే వేరంటూ
సన్నాయి మేళంలా చరిత్రలన్నీ తిరిగేసి
చిన్న సైజు కచేరి వినిపిస్తుంది
తారాజువ్వలా ఆ యింటికి యీ యింటికి
దూసుకుపోతూండే మా పని మనిషి కబుర్లతోనూ
ఊళ్ళో జరిగే చాటు భాగోతలన్నీ నాకే తెలుసంటూ
మొక్కుబడికోసం అందరికీ శుభాకాంక్షలేగాని
ఆశలు అణగారిన తెలంగాణ అందించిన సర్కారీ తీరుకు
ఆకాశ వీధిలో విహరించే సరుకులు సంచెడు పైసలకు
గుప్పెడెంత కూడ రాకపోతే గెట్టనయ్యా నెట్టుకొచ్చేటిది!
కాలి, బూడిదవుడు మాటటుంచి దుమ్ము, ధూళి
వున్న కశ్మలానికి మరికొంత జత జేసుడెందుకు?
బుకార్ల వడుడెందుకు?
ఫక్తు కాల బెడ్తానికి వందలు కర్సు వెడ్తరుకాని
గదే వందనోటు కాల్సమనుండ్రి సూద్దాం!
మడిసిలోని అహం కాలబడాలె!
సోచాయించుడెదగాలె!
దీపం వెలుగిస్తనేవుంటది కాని కింద సీకటుంటది
సమురు వున్నంతవరకే గదా!
చేతి సమురెందుకు వదిలియాలే
కడుపుకింత తినుడు
పక్కోనికింత వెట్టుడు
చల్లని మనసుతో ముచ్చట్లు వెట్టి
పసందుగుండాలంటే
బడుగులు బతుకుల్ల సీకటి తొలగి వెలుగెన్నడొస్తదో
గదేనే వరుసగ కాంతులిచ్చే దీపాళైతది గాదె
వెళ్ళొస్తా!
30.10.2016

10, అక్టోబర్ 2016, సోమవారం

John Graham-Cumming: Long range WiFi antenna from Illy coffee can

John Graham-Cumming: Long range WiFi antenna from Illy coffee can: I have a stack of half finished projects that I'm trying to complete. Happily, the first one was finished late last night: a long rang...

22, జులై 2016, శుక్రవారం

కపిల రాంకుమార్ || అమ్మ ||

కపిల రాంకుమార్ || అమ్మ ||

అదే అదే తరతరాల పదేపదే కోరుకునే
చిరకాల మనుగడలో చిత్రమైన తల్లి సేవ

బిడ్డపుట్టినపుడు, బొడ్డుకోయునపుడు
జాగ్రత్తలు తీసుకుని సంరక్షణనీయాలి

తనపాలు త్రావించగ తరిఫీదులి యివ్వాలి
సమయాలు పాటించి బిడ్డకడుపు నింపాలి

కోరింతలు, పోలియోల వివిధమైన రోగాలను
అరికట్టేవిధంగ అరకులన్ని యీయాలి

తప్పటడుగు వేయురోజు ముద్దుమాటపలుకునాడు
దగ్గరుండి తల్లియే మొదటిగురువవ్వాలి

అయిదేండ్లు నిండినాక ఆలస్యంచేయకుండ
చదువుకోను బిడ్డను బడికి పోవతోలాలి

ఎదుగుతున్న బిడ్డను అదుపుపెట్ట సరికాదు
పదిమందిలొ గెలిచేలా బహదూరుగ పెంచాలి

రెండో బిడ్డ పుట్టగానె తృప్తినొంది హాయిగ
రెండుకళ్ళమాదిరిగ ప్రేమనెపుడుపంచాలి

పాఠాలను పట్టుకోని పోటీలను తట్టుకోని
ఫస్టుక్లాసు మార్కులతో చదువుల నిధి కావాలి

ఇంటిపేరు ఊరిపేరు నిలబట్టే రీతులలో
అభిరుచులు గౌరవించి తల్లిమించువారు లేరు!

ఇలలోన కలలోన పెంపకాల అంపకాల లోన
అడుగడుగున తనముద్ర కనుపింపచేయు ''నమ్మ''!

(ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కుటుంబ సంక్షేమ (ఆరోగ్య & వైద్య)  శాఖ,
 రాష్ట్ర స్థాయి పోటీలలో ఎంపికైన గీతం నవంబర్‌ 2005
హైదరాబాద్‌

6, జులై 2016, బుధవారం

కపిల రాంకుమార్‌|| రండి - కదలిరండి||

కపిల రాంకుమార్‌|| రండి - కదలిరండి||
అవినీతి, అత్యాచారం
ఆక్రమణ, స్వైరవిహారం
లేని రోజుంటే చూపించు నేస్తం!
రోజూవారి వార్తలతో
అశాంతి భరించలేను
మౌనంగా వుండలేను
కలాన్ని
గళాన్ని
నాకు తోడుగా మిమ్మల్ని
పిలుస్తున్నాను
రండి, కదలండి
బిగించిన పిడికిళ్ళమై
అరుణారుణ కొడవళ్ళమై
నినదిద్దాం
దైనిందిక దారుణాలపై
సమైక్య విధానంతో
రండి - కదలిరండి

22, జూన్ 2016, బుధవారం

కపిల రాంకుమార్‌ || పోడుపోరు ||

కపిల రాంకుమార్‌ || పోడుపోరు ||
ఆదివాసి గూడేలకు
ఆనుకున్న అడివి వారికి జీవాధారమై
అక్కున చేర్చుకుంటుంది
సహజాతమైన హక్కుతోనే
పోటకత్తి, గడ్డపలుగు
చేతపార, చెంగున గింజలు
చెట్టు చెరిగి, పుట్ట తవ్వి
చదునుచేసి మోడు కాల్చి
విషజంతువుల తరిమి
ఋషిలా సేద్యతపమాచరించే
నేతల్లి బిడ్డలపై కర్కశత్వమా!
మేకల పుల్లరి, గొడ్లపుల్లరి
మెక్కుతూనే అధికారపు
జులుంలా అణిచితివేతలెందుకు?
జంగిల్‌ జమీన్‌ జల్‌ నినాదాల కొమరం భీం వారసులు
శ్రీకాకుళపు పాణిగ్రాహి పాటల కోరసులు
మా ఖమ్మం గిరిజన నేత సోయం గంగుల అడుగుజాడలు
నమ్మిన నేలను వదలరు
గిరిపుత్రుల గురి తప్పదు
బరితప్పి నర్తించిన ఉరితప్పదు
ఆవిడిపడగానే జొన్న, సజ్జలాంటి
ధాన్యాలను జల్లి ప్రాణపదంగా పెంచి
చేలోనే మంచెపైన కావలివుంటూ
పగటి పిట్టలను, రాత్ర్రి జంతువులను
పంటపైకి రాకుండా కాపాడి
కైలు చేసుకొని పొట్ట పోషించుకునే వాళ్ళే గాని
భూబకాసురుల్లా కబ్జాలు చేసి
రియలెస్టేటు వ్యాపారులు కారు కదా!
కనిపించే వాస్తవాలు చూడలేని
పాలకవర్గాల కొమ్ముకాసేలా
బడుగులపైనా మీ ఆక్రోశం, దాష్టీకం?
విప్పసారా, తాటికల్లు,పందిమాసం
రుచుల కక్కుర్తికై వారితో
విందులు చేసుకుంటూనే
గుబులు పుట్టినప్పుడల్లానో
వాతావరణమార్పులు చోటుచేసుకున్నట్లు
తాకీదుల అలజడికి
తాబేదార్ల లంచాలకి మరిగి
విశ్వ రూపం చూపించాలనుకుంటే
నిరశనాగ్నికి మసికావల్సిందే
ఎన్నికలవాగ్దానాలను తుంగలో తొక్కి
నది దాటిన పిదప బోడమల్లయ్యలను చేయాలనుకుంటే
పప్పులో కాదు నిప్పులో కాలేసినట్లే కబడ్దార్‌!
పోడు రైతుల తీవ్రాగ్రహానికి శలభాలవ్వాల్సిందే !
పిడికిళ్ళు బిగించి కొడవళ్ళు పట్టినవాళ్ళే
తమను తాము కాపాడుకునే ఎర్రజండాలౌతారేకాని
నమ్మిన నేల తల్లిని మాత్రం వదలరు!
అమ్మకోసం ప్రాణాలనైనా ఫణంగా పెట్టి
అటవీహక్కును కాపాడుకుంటారేకాని
అధికారపక్ష అహంకారానికి సమాధికట్టి
సాగనంపక పోరు జాగ్రత!
ఇది మీ ''పోకడ''లకు అద్దంపట్టే పోడు పోరు
ఇది మీ ''పోకదల''కు అద్దంపట్టే పోడు పోరు

17, జూన్ 2016, శుక్రవారం

కపిల రాంకుమార్‌ \\ వృక్షో రక్షతి \\

కపిల రాంకుమార్‌ \\ వృక్షో రక్షతి \\
పూల చెట్లు పండ్ల చెట్లు యింటికేమొ అందం
సామాజిక అడవులు రాష్ట్రానికి అందం
గులాబీల అందం మరుమల్లెల మకరందం
ఆనందం విల్లివిరియ బృందావన జీవనం
చెట్టునీడ విశ్రమించ వేపచెట్టు మెరుగు
ఆరోగ్యం సంతరింప అరటి జామ మేలు!

నీలగిరి సుబాబులు ఈ నేలలోన యెదుగు
వంటచెరుకు పశుగ్రాసం ప్రతియింట మిగులు
డబ్బులోటు సర్దుబాటు - గిట్టుబాటు కాగలదు
గట్ల కోయు మట్టినింక జారకుండ కాపాడు!
గాలిపీల్చి ఆరోగ్యం - పూలు ముడిచి ఆనందం
ఆడుకునే పిల్లలకు చెట్టునీడ ఉయ్యాలలు
చెట్లు నరికి, కాల్చి వేసి - కాలుష్యం పెంచబోకు
రాబోవు కాలానికి వర్షాలే దూరమగును
సమతుల్యం కాపాడగ - పచ్చదనం విప్పారగ
యింటి చుట్టు ఊరు ఊరంతా ముచ్చటగ చెట్లు పెంచు!

6, జూన్ 2016, సోమవారం

'' కవిత్వంలో కొత్త అంశంపై మూడో స్వరం ఆహ్వానించతగినదే ''


'' కవిత్వంలో కొత్త అంశంపై మూడో స్వరం ఆహ్వానించతగినదే ''

థర్డ్‌జెండర్‌ పై తెలుగు సాహిత్యంలో కవితా సంకలన రూపంలో ఇంతవరకు ఎవరూ ప్రాచుర్యం చేయలేదు. బహుశ: రచించివుండరేమో కూడ .అటువంటిది ఖమ్మానికి చెందిన   కంచర్ల శ్రీనివాస్‌, సుభాషిణి తోట సంయుక్తంగా ఒక సంకలనం '' థర్డ్‌ వాయిస్‌ '' పేర వెలువరించడం, అహ్వానించతగ్గది. ఆ సంకలనం నేను పరిచయం చేయటం ఒక కవిత్వంలో  కొత్త  ఒరవడికి పెద్ద పీఠం వేసినట్లే నని ప్రముఖ కవి, సాహితి
విమర్శకుడు డా. సీతారాం పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా తెలంగాణ సాహితి నెలనెలా నవకవనం ప్రథమ సమావేశం స్థానిక మంచికంటి భవన్‌లో అధ్యయన వేదిక నిర్వాహకుడు కపిల రాంకుమార్ అధ్యక్షతన జరిగింది. మువ్వా శ్రీనివాసరావు , డా. సీతారాం, కె. ఆనందాచారి,కెన్నెగంటి వెంకటయ్య, పాల్గొన్న సమావేశ ప్రారంభంలో ఇటీవలే మే 24 న మరణించిన ప్రముఖ అభ్యుదయ వాది, అనువాదకుడు నీరుకొండ హనుమంతరావు మృతికి సంతాపం ప్రకటించారు. కిషన్‌ చందర్‌ నవలను తెలుగు పాఠకలోకానికి పరిచయం చేసిన గొప్ప కవిగా వారిసేవలను స్మరిస్తూ వక్త్రలు మాట్లాడారు.

ఈ సాహితీ సమావేశంలో కంచర్ల శ్రీనివాస్‌, సుభాషిణితో సంయుక్తంగా వెలువరించిన ''థర్డ్‌ వాయిస్‌ '' కవితల సంకలనాన్ని  మువ్వా శ్రీనివాసరావు ఆవిష్కరించగా, డా. సీతారాం పరిచయం చేస్తూ '' ఎన్నో రకాలుగా భిన్నమైన కవితలు క్లుప్తంగా, ఆప్తంగా, ఆర్దంగా ఆలోచింపచేసేవిగా వున్నాయన్నారు. ఇలాంటి కవిత్వాన్ని కాని, ఇలాంటి వ్యక్తుల గురించిగాని తలచేవారు చాల తక్కువ.  సమాజంలో పాతుకుపోయిన వివిక్ష వలన  ఈసడింపబడే  వారి జీవన విధానం, బాధలు, గాథలు, ఆర్తిని చిన్న చిన్న కవితలుగా మలచి రెండు పార్శ్వాలుగా ఇద్దరు కవులు మనముందుంచడానికి సఫలమయినట్టే. అందరూ చదవండి వారిగురించి తెలుసుకోండి. ఆరికి సమాజంలో ఒక గౌరవ స్థానం వుందని గుర్తించండని అంటూ
రచయితలు ఇంకా కొద్ది శ్రద్ధ తీసుకుంటే ఇదిగొప్ప కావ్యమనడానికి సందేహంలేదని అన్నారు. అసలు ఈ ప్రయత్నమే అభినందనీయమని అన్నారు. కవితలలో ఒక ధర్మాగ్రహం వుంది. అది పలు ప్రాంతాలలోకి విస్తరించాలి. అన్నారు. మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకరి కవిత్వం స్త్రీ సమస్యలపైన, ఒకరి కవిత్వం అణిచివేతకు గురై ఆ మగవారి సమస్యలపైన, కవనం పంచుకుని రాసినట్లు అనిపించింది అన్నారు. సానుభూతికి,సహానుభూతికి ఒక స్పష్టమైన రేఖ ఈ కవిత్వంలో కనిపిస్తుందని అంటూ  కంచెర్ల శ్రీనివాస్‌ కవిత్వంలో కవితాగ్రహావేశం కొట్టొచ్చినట్టు కనబ్డుతోందని, సుభాషిణి కవిత్వం కూడా ఆ స్థాయికి ఎదగాటానికి చేసిన ప్రయత్నం హర్షించతగినదేనని, మరింత కృషి చేయగలరనే నమ్మకంతో మనస్పూర్తిగా అబినందనలు తెలిపారు. ముందుమాటలో ప్రస్థాఇంచినట్లుగానే ఇది కొత్త ఒరవడిని సృష్టిస్తుందని, బహుళ ప్రచారం అందిస్తామని, హైదరా్బాద్‌లో కూడ ఈ పుస్తక ఆవిష్కరణ పరిచయ సభ నిర్వహిస్తామని, తెలంగాణ సాహితి రాష్ట్ర కన్వీనరు కె. ఆనందాచారి కవులిద్దరిని అభినందించారు.   తదుపరి ఇల్లందుకు చెందిన  బైరి ఇందిర రాసిన తెలంగాణా గజల్‌ కావ్యం కన్నెగంటి వెంకటయ్య పరిచయం చేసారు. తెలంగాణ చరిత్ర నేపథ్యంగా కవిత్వంలో యిమడ్చటం కష్టమీన ప్రక్రియ అని, అందునా గజల్‌ రూపంలో తేవడం మరింత క్లిష్తమైనదని, అలాంటి ప్రక్రియను ఆసాంతం విజయవంతమయేలా   మహిళా గజల్‌ రచయిత్రిగా ఒక చరిత్రను గ్రంథస్థం చేసిన ఘనత తెలుగు రాష్ట్రాలలో ఇందిరకే ఆ స్థానం దక్కుతుందని అన్నారు. తెలంగాణ సాహితి ప్రతినెల నెల నెలా నవకవనం పేర నిర్వహించే కార్యక్రమంలో కవితా పఠనం, విశ్లేషణ, కొత్త పుస్తకం పరిచయం, విశ్లేషణ,   సాహిత్య ప్రసంగాలు క్రమం తప్పకుండా ప్రతి నెల మూడవ ఆదివారం జరుగుతాయని, ఈ ఆవకాశాన్ని వినియోగించుకోవాలని కె.ఆనందాచారి అన్నారు. చివరిగా సుభాషిణితోట, ఇందిర, కంచర్ల శ్రీనివాస్‌లు రచయతలుగా ప్రతిస్పందించారు. ఈ కార్యక్రమంలో
కటుకోజ్వల రమేష్‌,ఇబ్రహీం నిర్గుణ్‌, తాళ్ళూరి రాథ, సంపటం దుర్గా ప్రసాదరావు, రాచమళ్ళ ఉపేందర్‌. ఎం. సుబ్బారావు, జిగీష, తదితర సాహితీ అభిమానులు,పాల్గొన్నారు.  కంచర్ల శ్రీనివాస్‌ వందన సమర్పణ చేసారు.

 

17, ఏప్రిల్ 2016, ఆదివారం

కపిల రాంకుమార్ || క్షమించు ||

కపిల రాంకుమార్ || క్షమించు ||
యావత్తు లోకం విస్తుపోయేలా
ఢిల్లీ సంఘటన గుండె ఝల్లుమనిపించింది!
మగాళ్ళంటేనే మగాళ్ళకు అసహ్యం కలిగేలా
పేట్రేగిన కామాంధుని చర్య
పసికందని కూడ కనికరంలేక
కోరికల గునపాలతో
పోటు పొడవాలనే నికృష్టపు చేష్ట
సభ్య సమాజం తలదించికునేలా
నన్నెవడేంపీకలేడనే మొండి ధైర్యమా?
మూర్ఖత్వమా?
పరాకాష్టకొచ్చిన క్రౌర్యమా?
రావణ కాష్టాన్ని మించిన యీ అకృత్యాగ్ని
నిత్యకృత్య దినచర్యా?
యీ మంటలకంతమెపుడు?
యీ వెధవలకు అంగఛేదనమే సరైన శిక్ష
ముద్దాడాల్సిన ముద్ద మందారాలాను
రక్తపు ముద్దచేసే వ్యవహారం
యెంత అత్యంత ఘోరమెంత నీచమెంత శోచనీయమెంత దారుణమో
భరించలేని మానసిక వ్యధగా
మగాళ్ళంతా యింతేనా అన్న
నా పదేళ్ళ మనుమరాలి ప్రశ్నకు
నా వద్ద సమాఢానం లేదు!
అమ్మా, చెల్లీ, భారత మాతా,
విశ్వ మాతా సమాధానం చెప్పలేని
మగాడి నయినందుకు!

11, ఏప్రిల్ 2016, సోమవారం

|| కపిల రాంకుమార్ || రచ్చబండ ముచ్చట్లు ||

|| కపిల రాంకుమార్ || రచ్చబండ ముచ్చట్లు ||

1.''ఓరి ముత్తాలు పేపరు సదవమంటే గట్ల నోరెల్లబెట్టినావేందిరా!''
అన్నానంతె, యిక సూస్కో వాడు బారతం మొదలెట్టిండు!
2.''యేం కావాల్నే నీకు ముస్తాద కట్టుకొని తాళ్ళు గీసొచ్చేదానికి యవారం గావల్నా ! నీ తల్లి పనేంలేదనుకుంట!''
వాడట్టంటే నే నూకుంటనా
1.''నీ నోరుబడ పోరగాళ్ళేందో ముచ్చట్లాడుకూంటాంటే అది సమజ్‌కాక నిన్నడిగితే గట్ల వర్లుతుండవ్‌!బాడ్‌కావ్‌ సెప్పితే సెప్పు ! లేదా మెల్ల కుండు!
అట్ల అరవబడితే, బడిత తీస్తినా వెన్ను యిరగాలే,''
నా యెంక సూస్తా.
2.''ఆఁ గదే ముచ్చటి యిగ సెబుతా యినుకోమంటూ
మొదలేసిండు రాములోరి మందిరంలా పంచాంగం సదివే బాపనోన్లా!     
యేంలేదే నరసిమ్మా కోయిల పిట్ట కూతపెట్టిందో లేదో,గా నల్లకాకొకటొచ్చి గూట్లకెల్లీ దాని కిందకు పడదోసె! పడమటి ముసాంబరం తగిలిన సర్కారుతీరు!''    
1.''అదేందిరో? ''
నే నడగబడ్తే -
2.''ఈ మద్దెల ఎవలైనా నోరెత్తినా, గలాటా చేసినా వూర్కునేదిలేదంటూ ఫర్మానా చేయబట్టె కాదె సర్కారు నోరునొక్కుడు, బొక్కలోకేసుడు షురూ సేస్తరన్నమాట!''
1.వానికడ్డుతగలకుంట : ''అదేం పొయ్యకాలమొచ్చెరా! ''
2. ''చిన్నప్పుడు యెమర్జెన్‌సీ పెట్టిండ్రెరకలే ! గసుమంటిదన్నమాట!
అదటుంచితే జెండా పాటలు, దేసభక్తి అంటూ కొత్త లొల్లి మొదలూకాబట్టే!
మరిదేం మతలబురో?   నేనూకోక వైనం అడగబడ్తి!
యోగాలు, యాగాలు సేస్కునేటోడు ఊకుండక ఒర్లిండులే ముంజకాయలు తెగ్గొట్టినట్టు తలలు నర్కుతాడంట!''
1.''వానికేం మాయరోగంరో వారి జనాల్ని మంచిగ మననీడా!''
2.''కంపెనీలువెట్టి సంపాందించిందరక్క పోటుగాని లెక్క మాలావు ఫోజులెడతాండులే! పండగలన్ని దండగమారివయి ముంచుతున్నాయి కాదె కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి లెక్కగా తీరున ఎలచ్చనల  కక్కినకూటికాసపడి యిర్గబడి వోట్లేస్తిరిగాదె, గా ముచ్చటకి అయిదేళ్ళసంది గిదేవరస! గంజికి దిక్కులేదని వొర్లితివా! గుంజకేసి కట్టి గుదిబండ తగిలిస్తరే! సప్పడుసేయకుంట గా రెండు మూస్కోవల్సిందే, మందిని ముంచి దాపిన డబ్బు గీడకాకూండ, సప్తసముద్రాలావల మాయల ఫకీరు పానం దాచిన చిలకల్ని వలవేసి పట్టిండ్రట...యెవరెవరివో పేర్లొస్తన్నాయి. కాని దేశం దరిందరం మాత్రం పోతల్లే! గీ ముచ్చ ట్లెందుకుగాని,   పోయి తాల్లల్ల పనిచూస్కునిరా! మస్తు దూపయితాంది, కాస్త కడుపు సల్లబర్చుకోవాల్నే!''
1.'' గట్టనే కాని యిళ్ళ తలాలిచ్చే గిరదావారెన్నడొస్తడో''
2. ''యిండ్లనుండేవాళ్ళను బయటకెల్ల గొట్టి తలాలమ్మకచూసే సర్కారు
దా బుజ్జీ అని నిన్ను పిలిచీస్తదా!. అడిగినవనుకో టాట్‌ వీలుకాదు పొమ్మనక నీమీదే కేసువెట్టి ఊచలులెక్కపట్టిస్తది యెరకైందా! '' 
వాడు యెచ్చరిక చెప్పిండు
1.''నిజమేన్రో! ఆఁ సర్లే నీతో ముచ్చటవెడితే పొద్దెక్కి పోతే కల్లుకూడ పులవబడ్తది, పోయొస్తరో! యింటికాడ మీ అత్త పిలస్తాంది
యేం కావాల్నో చూడు! పైలం పోయొస్తబిడ్డా ''
అని తాళ్ళకెల్లి నేను, వాడు యింటికెల్లి .

|కపిల రాంకుమార్|| పండుగ కషాయం ||

|కపిల రాంకుమార్|| పండుగ కషాయం ||

1.కోకిల చానపై
పడమటిగాలి కన్నెర్ర చేసినట్టు
గూటిలోని పిల్లల్ని గెంటేసే కాకిరా
సర్కారు!
**
2.భక్తిముసుగులో
కాలచక్రం తిప్పే
సన్నాసులు
కార్పొరేటికరణ విలాసాల కార్యకలాపాలలో
దేశభక్తిపై వివర్ణులై
తలకాయలు కోస్తారట
కోస్తాకెళ్ళిపోదామా?
**
3. పండగలంటే
దండగమారివని
ఋజువులక్కరలేని
శాశ్వత ముద్ర లేసుకున్నాయ్‌!
**
4. రాజకీయాలన్నీ వ్యాపార సూత్రాల్లో
జనాలను మభ్యపెట్టడంలో
ఆస్కారు అవార్డ్‌ కోసం తంటాలుపడే
సినీ నిర్మాతలే!
**
5.ఓటేసినప్పుడు లేని యింగితం
యిపుడు కళ్ళు తెరిస్తే యేం లాభం
కుళ్ళిపోయినా, మళ్ళిపోయనా
అవకాశం కోసం అయిదేళ్ళు ఆగాల్సిందే
నోట్లో వేళ్ళెట్టుకుని చూడాల్సిందే!
**
6. బడులు పెట్టుబడులైనాక
విశ్వవిద్యాలయాలలో
చౌకగా సర్టిఫికేట్లు దొరుకుతుంటే
చదువెందుకు చంకనాకిందో
యిప్పటికి సమజ్‌కాకపోతే
నేనేం చేద్దును! పలుకి బడి వుంటే
దొరుకే సరుకు కదరా!
******************
షడ్రుచుల పచ్చడి! రెండురోజులముందుగా అందుకోండి! ఆరు ఏప్రియల్‌ 2016 సాయంత్రం 4.45     

18, మార్చి 2016, శుక్రవారం

మిన్నేటి పొంగులు || (కవితపై శ్రీ వాచవి ముందుమాట)

Photo: కపిల రాంకుమార్ ||మిన్నేటి పొంగులు ||
(కవితపై శ్రీ వాచవి ముందుమాట)
పొన్నేటి పొంగులు (కవిత ) రచయత - హీరాలాల్ మోరియా రాయ్ -ఖమ్మం
జిల్లా రచయితల సంఘం  1961 లో ప్రచురించింది.  దానిని ప్రముఖ రచయిత
దాశరథి తెలుగులో అనువదించారు. 

దానికి శ్రీ వాచవిముందుమాట : ఉత్తమ  కవితకు కావలసినవి ఉత్సాహము, ఉద్రేకము, ఉక్తి,  చమత్కృతి. ఇవి పదముల ఇంద్ర జాలముతో రావు. శబ్దాల పోహళింపుతో సమకూడవు. అలంకారాల బిగింపుతో అలవి కావు. ఇవి సాధించే ప్రధాన సాధనలు చిత్తశుద్ధి, శైలి, వ్యక్తి ముద్ర. అది ప్రబంధ కవిత అనండి, భావ కవిత్వనండి, ప్రగతిశీల  కవిత్వమనండి,  దేనికైన యీమూడు లక్షణాలూ వుంటేనే ఉత్తమ కవిత కాగలదని  లాక్షణికులు చెప్పారు.  '' మిన్నేటి పొంగులు " రచించిన హీరాలాల్  మోరియా రాయ్ కి ఈ లక్షణాలున్నాయి. ముఖ్యంగా చిత్తశుద్ధివుండటంచేతనే వీరకవితావేశం ఆవహించి, యీ రచన చేయించింది, ఉద్రేక భావాలు పొంగిపొర్లేటట్టూ చేసింది. తెలంగాణా విమోచన సమరం ప్రారంభమైనపుడు 1947 ఆగస్టు 15 వ తేదీ తుపాకులకు ఎదురొడ్డీ నిలచున వాడు, దౌర్జన్యాన్ని యెదిరించడంలో తెగువచూపి కారాగారవాసం చేసిన నిజాయితీ కల దేశభక్తుడు. ఈయన తొలి కావ్యం ' అమృత పథమే " - మృత్యోర్మా అమృతంగమయ అనే ఉపనిషద్ వాక్యం ఆచరణ్లో తేకలిగిన కర్మయోగి. అందుచేత  ''' మిన్నేటి పొంగులు "  వియత్గంగా ప్రవాహంనుండి జాలువారిన వీచికాపరంపరలు.  అభ్యుదకవిత్వం పేరున 20, 30 యేళ్ళనుండి శ్రీశ్రీవంటివారు రాసే '' అవును సుమా, నీవన్నది నిజం - నిజం మనమంతా గానుగులం;
పీనుగులం, చదువువృధా, బ్రతుకు వృధా '' అనే చేదు పాట మార్కు పద్యాలు ఒరవడిలో కాక అనుభవాల నిశ్రేణులనుండి ఆవేశపు తారాపథంలో విహరిస్తూ, ఆదర్శమనోభావాలతో అంతరిక్షానికి ఎగిసిపోయే ' 
మిన్నేటి పొంగులు క్రుమ్మరించిన కవి మనల్ని ఆకర్షించటంలో  ఆశ్చర్యంలేదు. తన జీవితానికి, జాతికి, సంఘానికి, దేశానికి ఇతని  భావాలు సీమితం కావు. తెలంగాణా స్వాతంత్ర్య సమరంగాని, భారత దేశ ప్రజాస్వామ్య విప్లవం కాని, 
విశ్వమానవ శాంతియుద్ధం కాని, వీనిలో యీ కవికి గోచరించే సర్వమానవ సమానత్వం సకలలోక కళ్యాణం, సర్వజగతీ శ్రేయస్సు కోరే జనశాంతి, విశ్వమానవ సమత. 
'' ధర్మచక్ర పతాకమెత్తి
రాత్రి చుక్కల కెంపుదేరిన
నయన వీధులు జ్వాలలెత్తిన
నగ్న ఖడ్గం, అగ్నికీలిక
హద్దులన్నీ అంతరించిన
విశ్వమానవ విశాలత్వం
మంటలార్పీ మింటికెగసిన
మహాభారత ప్రజాస్వామ్యం '' యీ కవి మతం హ్యూమనిజం, తత్వం  మానవత్వం. అందుకే యుద్ధ కారకులైన
నాయకుల్ని చీదరించుకుంటాడు.
'' నాయకాగ్రణులు వాయి కదిపితే
చేయి కదిపితే మహాయుద్ధములు
వీళ్ళ ప్రసాదమె జగన్నాశనము
వీళ్ళప్రసాదమె జాతి వినాశము. '' యీయనకు ముత్యాల సరాలు, ముక్త చ్చందస్సులో ఒకేలాగ పలుకుతాయి.
ఈ మహాయానంలో సైన్యం '' గగన సీమలనంటి చెదరిన సిగలతో,
శివమూర్తులట్టుల హిమ గిరీంద్ర మహోచ్చ శిఖరాగ్రమును దాటే జాంఘికత్వం '' అని సైన్య గీతం పాడుకుంటాడు.
''' ఏటి అవతల లోకంలో మ్రోగుతోది మృత్యువు,
చప్పబడ్డ బ్రతుకు కన్న ధ్వనిస్తున్న మృత్యువునయం ""
అచంచలుడైన ఆశావాది.  '' గగనమందున క్రొత్త చుక్కలు
క్రొత్తకాంతులు, క్రాంతి యాత్రలు సాగుతుంటీ '' ఈయన చూచిన మహా ప్రస్థానంలో ''
'' యాత్రికులు, , నిరుపేదవారలు  '' క్రొత్త ఆశలు, క్రొత్త కాంతులు, క్రొత్త శక్తి, క్రొత్త ముక్తి మృత్యువుకు ప్రర్యాయపదమీ జీవితం; మారాలి లోకం '' అంటూ పయనిస్తాడు.
'' ఫెను తుపానుల్ కన్న వేగం వేగమున పోతున్న
యాత్రికులరుగో! జ్వాలాముఖులు వారలు
విజయమే నిజం, పరాజయమన్న యెరుగరు! '' అటువంటి యాత్రికుల్ని ముందుకు సాగమని ప్రబోధిస్తూ 
'' తూరుపు నీవెరా
పడమరలు నీవెరా
దిక్కు దిక్కులు గెలిచి
దిక్కై వెలుగరా! "" అని ఆశావాదంతో ఆశీర్వదిస్తాడీ కవి హీరాలాల్ మోరియా రాయ్
'' విప్లవం వర్థిల్లుతుంది
విజయపతాకం ఎగుర వేస్తుంది
విశ్వ శాంతి వెదజల్లుతుంది "" ఈ విశ్వాసమే  ''  మిన్నేటి పొంగులు. యిలంటి గీతాలు హీరాలాల్ కంఠస్వరం నుండి
ఉర్దూనుండి తెనుగులో రికార్డ్ చేసిన కలం దాశరథి గారిది. ఏ శ్రుతిలో అగ్నివీణకు  సరిచేసిన రుద్రవీణలాగ మారుమ్రోగు
తుంది. వినండి యీ విప్లవ స్వరాలు. .........శ్రీవాత్సవ - విజయవాడ 16-1-1961 


హీరాలాల్ మోరుయా - దాశరథి కల ఫొటొ హీరాలాల్ మోరియా - దాశరథి కల ఫొటొ 

కపిల రాంకుమార్ ||మిన్నేటి పొంగులు ||
(కవితపై శ్రీ వాచవి ముందుమాట)
పొన్నేటి పొంగులు (కవిత ) రచయత - హీరాలాల్ మోరియా రాయ్ -ఖమ్మం
జిల్లా రచయితల సంఘం 1961 లో ప్రచురించింది. దానిని ప్రముఖ రచయిత
దాశరథి తెలుగులో అనువదించారు.

దానికి శ్రీ వాచవిముందుమాట : ఉత్తమ కవితకు కావలసినవి ఉత్సాహము, ఉద్రేకము, ఉక్తి, చమత్కృతి. ఇవి పదముల ఇంద్ర జాలముతో రావు. శబ్దాల పోహళింపుతో సమకూడవు. అలంకారాల బిగింపుతో అలవి కావు. ఇవి సాధించే ప్రధాన సాధనలు చిత్తశుద్ధి, శైలి, వ్యక్తి ముద్ర. అది ప్రబంధ కవిత అనండి, భావ కవిత్వనండి, ప్రగతిశీల కవిత్వమనండి, దేనికైన యీమూడు లక్షణాలూ వుంటేనే ఉత్తమ కవిత కాగలదని లాక్షణికులు చెప్పారు. '' మిన్నేటి పొంగులు " రచించిన హీరాలాల్ మోరియా రాయ్ కి ఈ లక్షణాలున్నాయి. ముఖ్యంగా చిత్తశుద్ధివుండటంచేతనే వీరకవితావేశం ఆవహించి, యీ రచన చేయించింది, ఉద్రేక భావాలు పొంగిపొర్లేటట్టూ చేసింది. తెలంగాణా విమోచన సమరం ప్రారంభమైనపుడు 1947 ఆగస్టు 15 వ తేదీ తుపాకులకు ఎదురొడ్డీ నిలచున వాడు, దౌర్జన్యాన్ని యెదిరించడంలో తెగువచూపి కారాగారవాసం చేసిన నిజాయితీ కల దేశభక్తుడు. ఈయన తొలి కావ్యం ' అమృత పథమే " - మృత్యోర్మా అమృతంగమయ అనే ఉపనిషద్ వాక్యం ఆచరణ్లో తేకలిగిన కర్మయోగి. అందుచేత ''' మిన్నేటి పొంగులు " వియత్గంగా ప్రవాహంనుండి జాలువారిన వీచికాపరంపరలు. అభ్యుదకవిత్వం పేరున 20, 30 యేళ్ళనుండి శ్రీశ్రీవంటివారు రాసే '' అవును సుమా, నీవన్నది నిజం - నిజం మనమంతా గానుగులం;
పీనుగులం, చదువువృధా, బ్రతుకు వృధా '' అనే చేదు పాట మార్కు పద్యాలు ఒరవడిలో కాక అనుభవాల నిశ్రేణులనుండి ఆవేశపు తారాపథంలో విహరిస్తూ, ఆదర్శమనోభావాలతో అంతరిక్షానికి ఎగిసిపోయే '
మిన్నేటి పొంగులు క్రుమ్మరించిన కవి మనల్ని ఆకర్షించటంలో ఆశ్చర్యంలేదు. తన జీవితానికి, జాతికి, సంఘానికి, దేశానికి ఇతని భావాలు సీమితం కావు. తెలంగాణా స్వాతంత్ర్య సమరంగాని, భారత దేశ ప్రజాస్వామ్య విప్లవం కాని,
విశ్వమానవ శాంతియుద్ధం కాని, వీనిలో యీ కవికి గోచరించే సర్వమానవ సమానత్వం సకలలోక కళ్యాణం, సర్వజగతీ శ్రేయస్సు కోరే జనశాంతి, విశ్వమానవ సమత.
'' ధర్మచక్ర పతాకమెత్తి
రాత్రి చుక్కల కెంపుదేరిన
నయన వీధులు జ్వాలలెత్తిన
నగ్న ఖడ్గం, అగ్నికీలిక
హద్దులన్నీ అంతరించిన
విశ్వమానవ విశాలత్వం
మంటలార్పీ మింటికెగసిన
మహాభారత ప్రజాస్వామ్యం '' యీ కవి మతం హ్యూమనిజం, తత్వం మానవత్వం. అందుకే యుద్ధ కారకులైన
నాయకుల్ని చీదరించుకుంటాడు.
'' నాయకాగ్రణులు వాయి కదిపితే
చేయి కదిపితే మహాయుద్ధములు
వీళ్ళ ప్రసాదమె జగన్నాశనము
వీళ్ళప్రసాదమె జాతి వినాశము. '' యీయనకు ముత్యాల సరాలు, ముక్త చ్చందస్సులో ఒకేలాగ పలుకుతాయి.
ఈ మహాయానంలో సైన్యం '' గగన సీమలనంటి చెదరిన సిగలతో,
శివమూర్తులట్టుల హిమ గిరీంద్ర మహోచ్చ శిఖరాగ్రమును దాటే జాంఘికత్వం '' అని సైన్య గీతం పాడుకుంటాడు.
''' ఏటి అవతల లోకంలో మ్రోగుతోది మృత్యువు,
చప్పబడ్డ బ్రతుకు కన్న ధ్వనిస్తున్న మృత్యువునయం ""
అచంచలుడైన ఆశావాది. '' గగనమందున క్రొత్త చుక్కలు
క్రొత్తకాంతులు, క్రాంతి యాత్రలు సాగుతుంటీ '' ఈయన చూచిన మహా ప్రస్థానంలో ''
'' యాత్రికులు, , నిరుపేదవారలు '' క్రొత్త ఆశలు, క్రొత్త కాంతులు, క్రొత్త శక్తి, క్రొత్త ముక్తి మృత్యువుకు ప్రర్యాయపదమీ జీవితం; మారాలి లోకం '' అంటూ పయనిస్తాడు.
'' ఫెను తుపానుల్ కన్న వేగం వేగమున పోతున్న
యాత్రికులరుగో! జ్వాలాముఖులు వారలు
విజయమే నిజం, పరాజయమన్న యెరుగరు! '' అటువంటి యాత్రికుల్ని ముందుకు సాగమని ప్రబోధిస్తూ
'' తూరుపు నీవెరా
పడమరలు నీవెరా
దిక్కు దిక్కులు గెలిచి
దిక్కై వెలుగరా! "" అని ఆశావాదంతో ఆశీర్వదిస్తాడీ కవి హీరాలాల్ మోరియా రాయ్
'' విప్లవం వర్థిల్లుతుంది
విజయపతాకం ఎగుర వేస్తుంది
విశ్వ శాంతి వెదజల్లుతుంది "" ఈ విశ్వాసమే '' మిన్నేటి పొంగులు. యిలంటి గీతాలు హీరాలాల్ కంఠస్వరం నుండి
ఉర్దూనుండి తెనుగులో రికార్డ్ చేసిన కలం దాశరథి గారిది. ఏ శ్రుతిలో అగ్నివీణకు సరిచేసిన రుద్రవీణలాగ మారుమ్రోగు
తుంది. వినండి యీ విప్లవ స్వరాలు. .........శ్రీవాత్సవ - విజయవాడ 16-1-1961  


23, జనవరి 2016, శనివారం

కపిల రాంకుమార్‌ ||హెచ్చరిక కావాలి||

కపిల రాంకుమార్‌ ||హెచ్చరిక కావాలి||
ఎందెందు వెతికినా అందందె కలదు వివక్ష
నిత్య కృత్యమై - నగ్న సత్యమై
వికటాట్టహాసం చేస్తూ
దక్షయజ్ఞంనాటి సతిని 
నరికిన బీభత్స తాండవ శివుడిలా
కరాళనృత్యమై
బడుగులును బడితపూజచేసి
అడుక్కి తొక్కాలనే దమనకాండ
అనునిత్యం పతాకశీర్షికై
ఎగురుతూనేవుంది!
మనం తిప్పికొట్టిన ప్రతీసారి
మరోరూపంలో
భూతంలా,ప్రేతంలా
నిశీథిలోనేకాదు
పట్టపగలే పగపట్టి
పిచ్చికుక్కలా స్వైర విహారం చేస్తూ
బూజుపట్టిన ధర్మాలను వల్లెవేస్తూ
కుంటిసాకులు చెబుతూ
అభూతకల్పనల ఘనాపాఠీలై
పలకవర్గ కొమ్ముకాసే బాకాలే కాదు
కొలువవున్న బాబాలు సైతం
మనువును వకల్తాపుచ్చుకుని
దాడిచేస్తూనేవున్నారు!
నిత్యాగ్నిహోత్రంలా
దహనకాండ నెరపుతూ
దమననీతి పాటిస్తూ
ఈ దగుల్బాజీలు
జబ్బలు చరుచుకుంటూ
మమ్మల్ని మీరేమీ పీకలేరన్నట్లు
గప్పాలు కొడుతూనేవున్నారు!
శవాలుగా మారుతున్న మనవాళ్ళసాక్షిగా
ప్రతి సవాలు విసరటమే మన ధ్యేయంకావాలి!
మనతిండి తిననివ్వని
మనం మనంగా బతకనివ్వని
చదువుకోనివ్వని
పుండాకోరునాయాళ్ళని
ఎలా వూరుకుందాం?
మనమేమైనా ఓట్లుమాత్రమే కాసే చెట్లమా?
అదిని చూచు కాటేసే బుల్లట్లవ్వాలింక!
చులకనచేసే బట్టేబాజుగాళ్ళ భరతం పట్టాలంటే
చదువు  పట్టాలేకాదు - కొలువు పట్టాలే సాధిద్దాం!
మనలోని వైషమ్యాలను
వాళ్ళు వాడుకోకుండా సమిష్టిగా గళమెత్తాలి
పిడికిలి బిగించాలి!
కదం తొక్కాలి!
మరో స్వతంత్ర్యపోరాటం మాదిరి
వాళ్ళ పుచ్చెలదిరేలా
మోగించే యీ నగారా
హెచ్చిరిక  కావాలి! 

12, జనవరి 2016, మంగళవారం

కపిల రాంకుమార్‌|| కల చెదిరింది ||

కపిల రాంకుమార్‌|| కల చెదిరింది ||
అదాటుగా నెత్తిమీదబడ్డ
కొబ్బరికాయదెబ్బకి
అబ్బా అన్న నన్ను
కలవరిస్తున్నారా! అంటూ
మా ఆవిడ తట్టిలేపింది!
కళ్ళు నులుముకుంటూ
ఇన్నేళ్ళుగా క్యాంపులో వుండి
అపురూపంగా పెంచుకున్న
చెట్లు చేమల్ని తలుచుకుంటు
పడుకున్న నాకు
ఇలా స్వప్న విఘాతం కలిగింది!
నిత్యం పూచే నందివర్థనం, నూరువరహాలు
ఎర్రమందారచెట్టు
శాపనార్థాలుపెడుతున్నట్టు
నాలుగు  రకాల గులాబీపూలు
గుబాళించటం మానేసి
గుర్రుగా చూస్తున్నట్టు
ఆకాశమంత యెత్తు ఎదిగిన అశోక వృక్షాలు
అవకాశమొచ్చినప్పుడల్ల కసురుతున్నట్టు
దోరకాయలుకోసుకుతిన్నజోరు
మమ్మల్ని విడిచిన పిదప యేమయిందంటున్న జామ చెట్టు
అలిగినట్టున్నాయి కామోసు
కొబ్బరికాయను నాపైకి వుసికొల్పి వుంటాయి!
అందుకే నెత్తిమీద విన్యాసం చేసి
పీడనపు తాడనం కలిగించింది!
క్యాంపువాళ్ళ పుణ్యమా అని
ఖాళీ చేసిన మర్నాడే
కూలిపోతున్న యింటి ఆక్రందన వినలేకనో
ఏ మూలో పేగుల్ని మెలిపెట్టి పిండినట్టుంటుందని తీపో
తెలియదుకాని తిరిగి కన్నెత్తి చూడకపోవటం
నా ఘోరతప్పిదమన్నట్టుగా
మమతల సంకెళ్ళలా వదలవు కామోసు
ఇలా యిలలో కలను ఆసరా చేసుకుని
నాపై చేసిన దాడికి 
చెప్పొద్దూ కళ్ళు చెమర్చాయ్ సుమా!
సర్కారుని
దాని కాపలా కుక్కల్ని
కసితీర తిట్టుకున్నాను!
మౌనంగా యిలా అక్షరాలను ఒంపేసాను !
నేను నిర్దయుడ్నని
దుర్మార్గుడని,
విశ్వాసంలేనివాడినని
తీర్మానించాయి
ఒకప్పుడు నేను పెంచుకున్న చెట్లు !
12.1.2016

10, జనవరి 2016, ఆదివారం

'' ఇళ్ళ గోష ''

కపిల రాంకుమార్‌ || '' ఇళ్ళ గోష '' ||
ఉద్యోగంలో చేరగానే
కొద్దిపాటి సౌకర్యాలతో
ప్రభుత్వ వసతిగృహం
కేటాయించడం
కడుపులో చల్ల
కదలకుండా
విధులు నిర్వహించుకోటంలో
సాగిన ప్రయాణం
ఒకటా రెండా ముప్పై మూడు
పదవీ విరమణైనాకూడా
అద్దె చెల్లించే ప్రాతిపదికపై
హాయిగ జీవనం సాగిస్తున్నాం!
ప్రభుత్వ ఉద్యోగికి
పదవి విరమణ నాటికి
స్వంత గృహం ఏర్పాటుచేయడం
మా విధానమని
గత పదేళ్ళుగా ప్రభుత్వాలు
తమ విధానాల్ని
యధావిధంగా నినదిస్తూ
ఆశలు రేపుతూనే వచ్చాయి!
అరచేతి వైకుంఠాల్ని చూపిస్తూనేవున్నాయి!
పట్టణ పరిథిలో ఎక్కడా
స్వంత యిల్లు లేదు
సంఘాలవాళ్ళెవరు యిళ్ళస్థలమూ
చూపలేదు సరికదా పైపెచ్చు
పదవి విరమణ చేసిన వాళ్ళలో
ముక్కుకు సూటిగాపోయే
కొందరి పేర్లు తొలగించారు.
గడ్డివాము కాడ కుక్క తను తినదు
ఇంకొకరిని తిననీయదూ అంటూ కుంటిసాకులు చెప్పారు
శాఖాపరమైన నిర్వహణ బాధ్యతలనుండి
తప్పించుకునేందుకే నిధుల కొరతతో
వసతిగృహాల గదులు నలతచెందితే
నివాసముంటున్నావారికి తప్పదుకదా
సొంత ఖర్చులతో మరమత్తులు చేసుకుని
కాపురముంటున్న దశలో
సర్కారుకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా
సచివాలయంలో కదలని ఫైలు
రిమార్కులతో కిందికి
సమాధానాలతో పైకి పరుగులే తప్ప
ఉరిమే మేఘం వర్షించనట్ట్లు
నీరుకార్చే ప్రయత్నాలు కొందరివి.
ఇలా జరుగుతున్న సమయంలో
ఒకటో రెండో నివాసమెవరూ వుండని
ఇండ్లనుండి తలుపులు, కిటికీలు
ఎవరికి అందినవి వారు
నొక్కేస్తే బలంలేనివి వానాకాలం నాని కూలిపోతే
వంక లేనమ్మకు డొంక దొరికిందన్న చందంగా
ఇవి ఎప్పటికైనా కూలిపోయేవి కాబట్టి
రక్షణలేని ఇళ్ళు ఖాళీ చేయాలంటూ
గత మూడేళ్ళుగా తాకీదులిస్తూనే
అవసరమైన వారికి గృహాలుమాత్రం కేటాయిస్తూనే
ద్వంద్వ వైఖరి పాటించి
ఒక్కసారి ఉపద్రవం ముంచుకొచ్చినట్ట్లు
ఓ తెల్లవారు ఝామున బుల్డోజర్లు తెచ్చి
రెవిన్యూ, పోలీసు, ఇరిగేషన్‌
అప్రకటిత యుద్ధం
ప్రకటించి కూలగొట్టే యాగం మొదలెడితే
చెట్టుకొకరు. పుట్టకొకరు అన్నట్లు
గత అనుబంధాలు, ఆప్యాయతలు
విడిచి చెల్లాచెదురైన ఆ నేల చూస్తే
కళింగయుద్ధం తరువాత
వైరాగ్యంతో బౌద్ధం పుచ్చుకున్న అశోకుడిలా
భారత్‌లో ఓ వెలుగు వెలిగి
మాయమైపోయినట్లు
లెక్కా పత్రం లేకుండా
హీనకాచి నక్కలపాలైనట్లు
రాజుల సొమ్ము రాళ్ళపాలన్నట్లు
పాత యినుము బడుగుజీవుల కూటికి ఆసరా అవుతుంటే
శాఖాపరమైన నిబంధనలు ఎటుపోయినట్లు?
మరి పైకి రాలేని ఏ అవినీతి బావిలో కూరుకుపోయారో
మరొకపక్క ఎప్పుడో కట్టిన గృహకల్ప భవనాలు
అమ్ముడుకాకపోగా వాటినేదో అంటగట్టాలని యత్నం
విసిరేసినట్లుండే ఆ భవనాల ధర ఆకాశంలోనే
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ధరలకంటే ఎక్కువే
అమ్మ పెట్టదు, అడుక్కు తిన నివ్వదన్నట్టుగా
ప్రవర్తిస్తూ చదును చేసిన స్థలాన్ని వేలంద్వారా
అమ్ముకోవాలనే యత్నంలో
ఆ స్థాయికి పోటిపడలేని పదవీ విరమణ ఉద్యోగి
సొంతయింటికల నిరాశే కదా!
=================

22, డిసెంబర్ 2015, మంగళవారం

||కర్రుకాల్సి వాతెయ్యాలిరా తమ్మీ!!



కపిల రాంకుమార్
||కర్రుకాల్సి  వాతెయ్యాలిరా తమ్మీ!!||

ఉద్యమం మాంచి-కాకమీదున్నపుడు
కుర్ర్కారుకు వెర్రెక్కించి
అరసేతి ఐకుంఠ పదవుల
పందేరం వెట్టి
తీరా ఒడ్డుచేర్నంక
దుడ్డుతిరగేసే
చెర్నకోలమోతేందిరా బాయ్‌!
సేతులూపుడు, తలూపుడుతో,మనం సేతులు ముడువబట్టే
ఆ బాడ్కావునాకొడుకులు,
యిప్పుడు మాయమాటల్త
బోర్లాకొట్టిస్తున్నరుగదా            
గారడీవోనిలెక్క మోళీ చేసి బెదిరిస్తున్నరేందే,
తాయాత్తు కొనమంటూ!



యింటనున్న నలుగురికి
పీటేసి మస్తుగా కుశాలుచేసుకుంట
చుట్టాపోల్లకి మాత్రం చెట్లకింది కాపురమెట్టమంటున్నరు
గదేమి యిచిత్రమోగాని,
శాటువు సెప్పినట్టు 
కాకులకొట్టి గద్దలకేసిన తీర్ల
గోడదూకొచ్చినోన్ని
గద్దెమీద కూకోవెట్టి
పుట్టినసంది జెండామోసి
బుజం తీపుపెట్టి
అలమటించే మూగ జీవుల్ని
గడ్డికూడ విదల్చక
గదిమి తరిమికొట్టుడేంది?
అయినా నాకు తెల్వకడుగుతా
మన జనం మరీంత పిచ్చోళ్ళైతన్నరేందే?



నారుకూ నీటైన గింజలేకపోయినా,
నోటికాడికొచ్చేలోగా
గంజి దాకలి బళ్ళుమన్నా
దొరక్కదొరికిన ఆందానితో
అప్పు తీర్చేలోంగా
మిత్తి ఆసాంతం కట్టలేదని
కత్తిపెట్టి జులుంచేస్తావుంటే
రైతన్న  దీపమైతన్నాడేందే?
కడకంటా సాగాల్సిన ఎవసాయం
మద్దెలోనే బుడగ మాదిరి పేల్తావుంటే
పల్లెల్లో సావు డప్పులు జాతరమాదిరి కొనసాగుతుంటే
కళ్ళుండి సూడలేని,
చెవులుండి యినలేని
సర్కారిదిల్చే సాయానికీ
యెగనామమెట్టడానికెన్ని సాకులో
దీనమ్మ రైతు బతుక్కిదా నాయళ్ళిచ్చే యిలువ?
సకలం యిచ్చిన్నమై మట్టిపాలౌతుంటే యాగాలంటరేందివారి!
యెనకటికెవడో నీరోరాజుమాదిరి ఫిడేలు సంబురాలెంది...
గిసుమంటివి
మతుండిచేసే పనులేనా?
అందుకే యీయేల పతోడికి
కిందపైనా తెగకాల్తోంది వారి!
ఒకరినుండి ఒకరికి బుకారోలె
రాజుకుంటేకాని బడబాగ్నివుట్టదు!
మనమిప్పుడు కేకలేసుడుకాదు
గద్దెకిందకాకవెట్టాలె!
నేల తల్లి దద్దరిల్లెలా, 
కూష్మాండం బద్దలయ్యేలా
కొమ్ము బూర, డోలు డప్పు,కంజీర మద్దెల
మిర్మిట్ట్లుకొలొపేలా మోగాల మార్మోగాల!
తిండి మీద ఆనంటడొకడు!
ఉండనీకి నీడలేదంటడొకడు!
ఊర్కుంటే కాదు
ఉరికించి గదమాలె!
వూరిపొలిమేరల్ల పోరుజెండాలెత్తాలె!

3, డిసెంబర్ 2015, గురువారం

|| యాభై వసంతాల '' దిగంబర ''కవిత్వోద్యమం ||

|యాభై వసంతాల '' దిగంబర ''కవిత్వోద్యమం ||'శ్రీ పగిడిపల్లి వెంకటేశ్వర్లు - పరిశీలన వ్యాసం నుండి||
***రచయితలలో అగ్రాసనం కవిది. ఇటీవల వాడుకలోకి వచ్చిన మాట రచయిత, పూర్వం కవిగానే సర్వత్ర వ్యవహారితం. సాహిత్య ప్రక్రియలలోకవిత ఆద్యం, సర్వ సాహిత్యాలలో తొలిపూత కవితే అని చరిత్ర తెలుపుతోంది. కావ్యాస్వాదన పాఠకుని సహృదయతను మెరుగుపెట్టి, నాగరికుణ్ణి చేస్తుంది. మనసుపైన సత్కవిత వేసే ముద్ర ఎన్నటికి చెరగనిది. దాని తావి తరుగులేనిది.2015 మే 6 నాటికి దిగంబర కవిత్వోద్యమం యాభై వసంతాలు పూర్తి చేసుకుంటోంది. అంటే దిగంబరకవుల మొదటి సంపుటి 1965 మే 6న తెలుగు సాహిత్య రంగంలో ప్రవేశించింది ఈ సందర్భంగా ప్రపంచ సాహిత్య రంగంలో కూడ యిలాంటి ధోరణులు, లేదా తీక్షణమైన కవితాసృజన జరిగిందేమోనని గమనిస్తే ఈ క్రింది విషయాలు దృష్టికి వచ్చాయి. మన దిగంబరకవిత్వానికి దాదాపుసమకాలీన సాహిత్యం సృజన చేసిన వారిలో 1. సాన్ఫ్రాంసిస్కోలో ని బిట్నిక్కులు, 2. బ్రిటన్కు చెందిన యాంగ్రీ యంగ్మన్ 3. హంగేరికి చెందిన - గాయపడిన యువకులు 4. రష్యాకు చెందిన ఎతుషెంకో అనూనాయులు 5. హాలెండ్లోని - ప్రోవో ఉద్యమం, ఇక మన దేశంలోనే '' కలకత్తా లో ఆకలితరం కవులు '' ఉత్తర ప్రదేశ్లో అనామ కవిత్వోద్యమకారులు, మహారాష్టలోని ఆఫ్వర్గం వారి సాహిత్య ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో దిగంబర కవులపై ఉండివుండవచ్చునని ఆచార్య కాకర్ల వెంకట్రామ నరసింహ్వం గారు తమ ''ఆధునికాంధ్ర కవితా సమీక్ష'' లో పేర్కొన్నారు. ఈ ఆరుగురిలో చెరబండరాజు, జ్వాలాముఖి దివగంతులుకాగా, కొన్ని కారణాంతరాల వలన 1971 తరువాత సాహిత్య ప్రపంచాన్నుంచి తప్పుకుని మహాస్వప్న నెల్లూరు జిల్లా లింగ సముద్రంలోనూ, భైరవయ్య విజయనగరంలోను స్థిరపడ్డారు. నిఖిలేశ్వర్, నగ్నముని హైదరబాదులో వుంటూ సాహిత్య లోకంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.. మిగతా కవులకు భిన్నంగా వారి పేరుమీద వారాలని: స్నేహ వారం, విశృంఖల వారం, క్రాంతివారం, సృజన వారం వికాసవారం, అనంత వారంగా పేర్కొన్నారు. ఋతువులను ఆశఋతువు, తపన ఋతువు, అశ్రుఋతువు మదిర ఋతువు, విరహ ఋతువు, విషాద ఋతువులుగాను, సంవత్సరాలను నగ్న నామ సంవత్సరం నిఖిలేశ్వరనామ సంవత్సరం, జ్వాలాముఖినామ సంవత్సరం, చెరబండనామ సంవత్సరం, భైరవ నామ సంవత్సరం మహాస్వప్న నామ సంవత్సరాలుగా ప్రకటించడంద్వారా సాహిత్యంలో ఒక నూతన ఒరవడిగా మొదలైనట్లు భావించవచ్చు. వాటి క్రమంలో 6 సంపుటాలుగా వెలువరించాలని వారు మొదట భావించినా మూడు సంపుటాలను మాత్రమే పరిచయంచేసి అర్థంతరంగా అనివార్య కారణాల వల్ల ఆపివేయటం కొంత నిరాశ కలిగించినదని చెప్పవచ్చు.
** మొదటి సంపుటం ''ఇతి శాసనం'' లో దిగంబరశకం, నగ్ననామ సంవత్సరం ఆశఋఉతువు (సరిగ్గా క్రీ.శ.1965 మే)న ఆంధ్రప్రదేశ్ రాజధానీ నగరం హైదరాబాద్న ప్రప్రధమంగా తాము దిగంబర కవిలమని ప్రకటిస్తూ ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని కొత్త రక్తాన్ని ఇంజెక్ట్ చేయడానికొస్తున్న నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, భైరవయ్య, చెరబండరాజు, మహాస్వప్నల గుండెల్లోంచి ధైర్యంగా, స్థైర్యంగా దూసుకొచ్చిన కేకల్ని పేజీల్లో పట్టుకోవడానికి ప్రయత్నించిన దిగంబర కవితా ప్రచురణ సమర్పణ అంటూ వాళ్ళ ఆగమనాన్ని తెలియచేసారు.
రెండవ సంపుటం '' దిక్లు-30'' దిగంబరశకం, నిఖిలేశ్వరనామ సంవత్సరం, మదిర ఋతువు (సరిగ్గా క్రీ.శ.1966 డిసెంబర్) లో ఇంకా భయంభయంగా బానిసత్వంగా దుర్భరంగా, హేయంగా, ఛండాలంగావున్న ఆంఢ్రదేశమనే మురిగ్గుంటలోంచి నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్నలు పలికిన కవిత దిగంబర కవితాప్రచురణ సమర్పిస్తున్నది అని దిగంబరశకాన్ని తెలియచేసారు.
మూడవసంపుటం: ప్రజల అవిద్యని, అజ్ఞానాన్ని, అశక్తతని, ఆసరాగా తీసుకుని దేశాన్ని దోచుకు తినడం మరిగిన పరిపాలకులు, సంఘంలోని వివిధ వర్గాలవాళ్ళు నేడు ప్రజలపై రుద్దుతున్న '' కుష్టు వ్యవస్థ''ని ఎదుర్కొంటూ దిగంబరకవులు పలికిన జ్వాలానామ సంవత్సరం, విషాద ఋతువు (సరిగ్గా క్రీ.శ. 1968 జూన్) లో దిగంబర కవితా ప్రచురణ వినిపిస్తున్న్నది అని తెలియచేసారు. ఈ దేశంలో ఈ ఇరవైయేళ్ళ స్వాతంత్ర్యంలో భయంకరంగా, విజృంభించిన కులమత దురహంకారానికి, ధనమదంతో యధేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటున్న గుండాయిజానికి సినిమా రొంపిలో ఈదులాడుతున్న యువతరం బలహీనతకి, స్తోత్రపాఠాల కుడితిలో పడిపోయిన పత్రికాలోకం పడుపు జీవనానికి, అతీత జీవనంతో తప్పించుకు బతుకుతున్న మేథావుల అనాసక్తతకి, నాయకుల ఊసరవెల్లి ఆదర్శాలకి, పదవీ వ్యాపారాలకి, నేటి ఈ కుష్టువ్యవస్థకి క్రూరంగా బలైన కంచికచర్ల కోటేశు స్మృతికి ఈ మూడో సంపుటం అంకితం చేసారు. ( ఇది హర్షించదగ్గది) దిగంబరకవులు తమ మొదటి సంపుటిలో ఒక విషయాన్ని స్పష్టం చేసారు. తమ కవితా ప్రక్రియని వచన కవిత్వం అనమని, అననివ్వమని అన్నారు. ఇకనుండి దిగంబరకవులు తమ కవితా ఖండికను 'దిక్' అనే ఖండికలను దిక్కులనీ వ్యవహరిస్తారు. జబ్బుపొరల్ని చీల్చి కాస్మిక్ మార్గాన్ని నిర్దేశించేవి దిక్‌లు . మానవత్వపు విలువలే వీటిహద్దులని చాటారు…
**…
( ఇంకా వుంది - స్థలాభావం చేత సంక్షిప్త సమాచారం తీసుకున్నాను)
6-5.2015/3.12.2015

2, డిసెంబర్ 2015, బుధవారం

కపిల రాంకుమార్‌ || అస్తవ్యస్తమైన మనోచిత్రం ||

కపిల రాంకుమార్‌ ||  అస్తవ్యస్తమైన మనోచిత్రం ||
అక్కడకెళ్ళిన తరువాత
ఎందుకొచ్చానానని ఏడ్చాను,
మరుక్షణమే నిబ్బరించుకున్నాను
గతకాలపు మైలురాళ్ళను పాతిన
జిగినీదోస్తులెవరైనా
మాటల మరమరాలందిస్తారని!
నాలుగడుగులేసాను
నివ్వెరపోవటమే నా అంతు!
మామిడి చెట్టు కూలిపోయెంది
కొబ్బరిచెట్టు మాడిపోయింది!
శ్మశానంలో సమాధిలా పాత పెంకుటిల్లు!
తెలిసందప్పుడే కాలానికి ద్యాదాక్షిణ్యం లేదని
గొంతెత్తి ఆందోళన చేసినందుకు
కఠినచట్టపు చట్రంలో నలిగిపోయుంటారని
గ్రహించడానికి దాదాపు అర్థగంట పట్టింది!
ఎప్పుడూ కబుర్లాడుకునే చోట కాక
మస్తాను భాయ్‌ చాయడ్డాకాడికెళ్తేకాని
గతంలోని జెండా దిమ్మ పక్కనే
మరొక ఎర్రజెండా దిమ్మ కన్నీళ్ళెట్టుకున్న సవ్వడి
డికాషన్‌ బాయిలర్‌లో కుతకుత చప్పుడుకు
భిన్నంగా పలకరించింది!
అప్పుడుకాని లోకంలోకి రాలేదు!
అస్తవ్యస్తమైన మనోచిత్రాన్ని తొలగిస్తూ,
స్మారక స్థూపాన్ని చూసి విలపించడం కాదు
వారిలా మనమూ స్వరం వినిపించాలని
దిక్కులు పగిలేలా నినదించాలని
సందేశమిస్తున్నట్లనిపించి
పిడికిలి బిగించి, వందనం కావించి
కర్తవ్యం యేమిటో కనులముందు ఆవిష్కరించుకుని
కలానికిలా కలకలం సృష్టించే పనిపెట్టాను.
ప్రశ్నించడం
సమాధానం రాబట్టమే
మన లక్ష్యం కావాలి!
2.12.2015

24, నవంబర్ 2015, మంగళవారం

డా. వై.ఆర్.కె.సాహితీ పురస్కారాలు - దీపావళి సందర్భంగా సామాజిక దిక్కారస్వరంగా జరిగిన కవిసమ్మేళనం

కపిల రాంకుమార్‌ ||నివేదిక ||దీపావళి సందర్భంగా సామాజిక దిక్కారస్వరంగా జరిగిన కవిసమ్మేళనం

డా. వై.ఆర్.కె. సాహితీపురస్కారాలందుకుంటున్న ఈ సభ ఒక ప్రత్యేకత సంతరించుకున్నదని, దేశమంతటా కవులు సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి యిచ్చివేస్తున్న సందర్భంలో, ఒక సాహిత్య అభిమాని, ప్రజావైద్యుడు కీ.శే. డా. వై.ఆర్.కె. గారి పేర అవార్డులు ఖమ్మం జిల్లాకు చెందిన వారు అందుకోవటమంటే, ఇవి  ప్రజా అవార్డులని తెలంగాణా సాహితి రాష్ట్ర కన్వీనర్ కె. ఆనందాచారి అన్నారు.

తెలంగాణ సాహితీ ఖమ్మ జిల్లా ఆధ్వర్యంలో 10.11.2015న దీపావళి కవి సమ్మేళనం మరియు సాహితీ పురస్కారాల సభకు తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షుడు  కన్నెగంటి వెంకటయ్య అధ్యక్షతన స్థానిక బోడేపూడి  విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో పలువురు వక్తలు మాట్లాడారు. డా. రాధాకృష్ణమూర్తి వ్యక్తిత్వం, ప్రజాసేవా, అధ్యయన శీలత, సాహితి అవగాహన పలు అంశాలను ప్రముఖులు తమ జ్ఞాపకాలను  గుర్తు చేసుకున్నారు. అత్యంత ఉత్సాహ వాతావరణంలో నిర్వహించబడింది.  ప్రముఖ కథా రచయిత శిరంసెట్టి కాంతారావు, విద్యావేత్త, కవి, మువ్వా శ్రీనివాసరావు, విశ్రాంత ఆచార్యుడు డా. పి.వి.సుబ్బారావు,
జన విజ్ఞావేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వీరభద్ర రావు, తెలంగాణ సాహితి రాష్ట్ర కన్వీనరు కె. ఆనందాచారి వేదికపైఆశీనులయ్యారు.

తన అధ్యక్షోపాన్యాసంలో కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ ఒక ప్రత్యేక సందర్భంలో జరుపుకుంటున్న  సభ, ఒక తాత్త్విక కవితా విశ్లేషణను కలిగించి,వక్తగా, ప్రజా వైధ్యుడుగా, నడయాడే గ్రంథాలయంగా, ప్రజల మనిషిగా, పరిణితి చెందిన రాకజీయ వేత్తగా, అంతకంటే సామాజికవేత్తగా గొప్ప మానవహక్కుల పోరాట నేతగా, సామాజిక దార్శినికునిగా పేరొందిన మహా మనిషి కీ.శే.డా. వై.రాధాకృష్ణమూర్తిని స్మరించుకుంటూ ప్రథమ వర్థంతిజరిగిన సందర్భంలో పురస్కారాలు అందుకోవటం, మిగతా ప్రభుత్వ పురస్కారాలకు  భిన్నమైనదని చెప్పవచ్చునన్నారు.తెలంగాణసాహితి రాష్ట్ర కన్వీనరు కె.ఆనందాచారి మాట్లాదుతూ పురస్కారాలు అందుకుంటున్న కవులకు మొదటగా అభినందనలు తెలిపారు.గతంలో ఖమ్మం సాహితీ గుమ్మంలో సాహితీ సేద్య చేసిన మహామహులతో మహా కవి శ్రీశ్రీ స్మారక సభను నిర్వహించిన తీరు అద్వితీయమైనదని,దాని నిర్వహణలో అంతా తానై డా. వై.ఆర్.కె. ప్రత్యేక సంచికలో ఒక వ్యాసం  రాస్తూ '' చంద్రునికో నూలుపోగు '' శీర్షికలో  శ్రీశ్రీ బహుముఖ కోణాల్లో వర్ణించిన వారి వ్యాస శైలి వారి మేథోపాఠవానికి తార్కాణమని, ఎందరినో ఆలోచింపచేసిన వ్యాసమని కొనియాడారు.ప్రస్థుత సమాజంలో సర్కారు వైఖరిపై నిరసనగా కవి ద్రష్ట కాబట్టి 100 మంది కవులు తమ అవార్డులు వాపసి యిచ్చేయడంలో '' కవులంటే ఏమనుకుంటున్నారు - కవులకు వేయి కళ్ళుంటాయి '' అనే కవితను చదివి రసజ్ఞులను ఉర్రూతలూగించారు.

డా.పొత్తూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ తనకు డాక్టరుగారికివున్న అత్యంత సాన్నిహిత్యంగురించి ఎన్నో విషయాలుతెలియచేసారు.క్రిటిక్ డాక్టర్ వై.ఆర్.కె ను ప్రస్థుతిస్తూ ఎల్లపుడూ, కవి ధర్మాగ్రహాన్ని ప్రదర్శించకలగాలని ఉద్బోధించారు. 1645 లో జాన్మిల్టన్ రాసిన పుస్తకం పత్రికా స్వేచ్ఛకు ఒక బైబిల్ లాంటిదని. కవికి వశ్యవాక్కుంటుంది. కేవలం కవులు, కళాకారులు మాత్రమే ప్రతీపశక్తులను
ఎదుర్కొంటారనేది అక్షర సత్యమని తెలిపారు.

జనవిజ్ఞానవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వీరభద్రరావు ప్రజాసైన్స్ ఉద్యమంతో డాక్టరుగారికున్న నిబద్ధత, నిజాయితీని గుర్తుచేసారు.సమాజం ఎల్లపుడు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పథంవైపే చూస్తూవుంటూందని, దాని నుండే ప్రజాహితం ఆశిస్తుందని. తిరుగులేని విజ్ఞానమే ప్రగతికి సోపానమని డాక్టరుగారు నొక్కి చెప్పేవారని తెలిపారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మతోన్మాదుల ఆగడాలు,
దుశ్చర్యలు ఎక్కువైనాయని, కాని ప్రజలే చరిత్ర నిర్మాతలనేదిచరిత్ర చెప్పే వాస్తవమని, యదార్థమని ఉటంకించారు.

ప్రముఖ కథా రచయిత శిరంసెట్టి కాంతారావు మాట్లాడుతూ తన పుస్తకావిష్కరణ సభే డాక్టరుగారితో అఖరిదవటం కొంచెం బాధకలిగించినా, వారిచ్చిన ప్రోత్సాహం నేనెన్నటికి మరువజాలనని, వారి సూచనలతోనే నా కథలను ఎక్కువగా క్షేత్రపరిశీలన పిదపే ఆరంభిస్తుంటానని. ఈ మధ్యనే 
హంపీ వెళ్ళటం తటస్థించిందని, ఆ నేపథ్యంలో త్వరలో ఓ కథకు రూపకల్పన చేస్తున్నానని, పరిసరాల అవగాహన కవులకు అవసరమని తెలిపారు.

ప్రముఖ విద్యావేత్త, కవి, మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ 1989 నుండి 2000 వరకు వై.ఆర్.కె.తోనున్న అవ్యాజానుబంధాన్ని నెమరు వేసారు. ఎన్నో రాత్రుళ్ళు ఇద్దరం సుదీర్ఘ సాహిత్య, రాజకీయ, సామాజిక అంశాలపై గంటలతరబడి చర్చించుకునేవారమని తెలిపారు. నేను  రాసిన ' సమాంతర
ఛాయలు ' వై.ఆర్.కె. గారి చివరి రోజుల్లో అందించాను. వారిసాహచర్యంలోనే నాకీ హృదయస్పందన అలవదిందని అన్నారు. వస్తువుని నిజ దర్శనం చేయకలిగినవాడు మంచి కవి అవితాడం, ప్రతిపక్షం లేకపోయినా, కవులుంటే చాలని అంటూ, '' నాకు నమ్మకమివ్వండి '' అనే ఆలూరి బైరాగి
కవితను ఉటంకించారు.
డా. పిల్లలమర్రి సుబ్బారావు మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురియయ్యారు. కొడుకులా ఆదరించి, వైద్యవిధానంలో మెళుకువలు నేర్పి, ఒక వైద్యుడిగా ఇలా నిలబెట్టిన మహానుభావుని సాహచర్యం జన్మ జన్మలకు మరువలేనిదని గద్గద స్వరంతోతన బాధను అందరితో పంచుకున్నారు.  30 సంవత్సరాలు పైగా వారితో నడిచాను కాబట్టే, వారన్నట్టు  నేను కింద పడినా జెండాను కిందపడనివ్వనని, పైకేవుంచుతానని వారికి మాటిచ్చాను. అది నిలబెట్టుకుంటానని, వారి పేర సాహితి వార్డులు వారి పరోక్షంలో నేను అందించే కార్యక్రమాన్ని తలెత్తుకున్నందుకు కొంత మనశ్శాంతిగావుందని తెలిపారు. కవులకు అభినందనలు తెలిపి ముగించారు. 

కథా రచయిత శిరంసెట్టి కాంతారావు,  కథా రచయిత రాచమళ్ళ ఉపేందర్, సంపటం దుర్గా ప్రసాదరావు, గద్దపాటి శ్రీనివాసారావు, కవయిత్రులు  శ్రీమతి సునంద, సుభాషిణి తోట, నవతెలంగాణా ఖమ్మ జిల్లా అక్షరం సారథి, పాత్రికేయ కవి నామాపురుషోత్తం, కటికోఝ్వల రమేష్, కపిల రాంకుమార్లకు అమరజీవి డా. వై.ఆర్.కె. సాహితీ పురస్కారాలు అందచేసారు.
మేడగాని శేషగిరి, సంపటం దుర్గా ప్రసాదరావుల సమన్వయంలో దీపావళి కవి సమ్మేళనం ఆద్యంతం ఆసక్తికరంగా, దీపావళి టపాసుల్లా, ఆటంబాంబుల్లా, మార్మ్రోగి రసజ్ఞులైన శ్రోతలను అలరించింది. కవిసమ్మేళనం సినారె గజల్ తో శేషగిరి ఆరంబించి తన గాత్ర మాధుర్యంతో అందరిని మంత్ర ముగ్ధుల్ని చేసారు. దీపావళికీ కవుత్వం రాయొచ్చు అనే కవితలో గద్దపాటి శ్రీనివాసరావు '' పెరిగిపోతున్న పాపాలమీద,సంఘాలమీద, సంఘ్పరివార్లమీద, రాని పరిహారాలమీద,రాజకీయ పరిహాసాలమీద '' కవిత్వం రాయొచ్చంటారు. చిరునామా ఎక్కడ అనే కవితలో తాళ్ళూరిరాధ - మానవత్వాన్ని ప్రతిబింబించే స్త్రీమూర్తి వర్ణన చేసారు.  జనం అనే కవితలో పొత్తూరి సీతారామారావు అమృత హృదయాల్లో
నేడలజడులు రేగుతున్నాయని మదనపడ్డారు. తిరగబడ్డ అక్షరం అనే కవితలో సుభాషిణీ తోట  గంగాయమునలంత పవిత్రం మన సాహిత్యమన్నారు. ఆటవికయుగపుటంచులనే కైతను ఆరంభించిన జీవన్ కూరుకుపోతున్న సంక్షుభిత సందర్భాన్ని ఆవిష్కరించారు. డా. వై.ఆర్.కె.తో అనుబంధాన్ని
శ్రోతలకు పంచారు. ఏ సభలోనైనా మాట్లాదవల్సివస్తే అంశాలన్నీ గుదిగుచ్చుకుని, ప్రసంగం పక్కదారి పట్టకూండా చెప్పవలసింది అందరికి స్పష్టంగా చేరేలా తయారయివచ్చే పద్ధతి అందరూ  అలవర్చుకుంటే మంచిదన్నారు.  దీపావళి పర్వదినమనే కవితను జయప్రద '' మన మధ్య నరకాసురులెందరో ఇంకా మిగిలేవున్నారని ఆవేదనవ్యక్తం చేసారు. హేతువాద ఉద్యమనాయకుడు క్రాంతికార్  తన కవితలో మతోన్మాదాన్ని నిరశిస్తూ చెణుకులు విసిరారు.అక్షరం అనే గేయంలో రౌతురవి '' రంగు పూస్తే అక్షరకిరణం మసగబారిపోదురా'' శ్రావ్యంగా వినిపించి శ్రోతలను ఉత్తేజితులను చేసారు. బ్రతుకు వెలుగుల బాట అనే కవితలో కె. రమేష్  బతుకులను దోపిడి చీకటి గుహల్లోకి నెట్టేసే విధానాన్ని
తన ముద్రతో ఆకట్టుకున్నారు. సత్యభామ అనే కవితలో నందిగామ నిర్మలాకుమారి పౌరాణిక అంశానికి సామాజిక స్పృహ కలిగించే కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ యిప్పుడు సత్యభామల అవసరం యెంతైనా వుందనేలా చదివి వినిపించారు. ఖమ్మం జిల్లా ఆధునిక కవిత్వంపై పరిశోధన చేస్తున్న తెలుగు జూనియర్ లెక్చరర్ నిజామాబాద్, పరిశోధనకు సంబంధించి తన అనుభవాలను కొన్నింటిని  శ్రోతలతో పంచుకున్నారు. అమ్మా నీకోఉత్తరం అంటూ దేవయ్య తన కవితలో భ్రూణ హత్యలను గర్హిస్తూ ఆర్ద్రత కలిగించారు. అవసరం అనివార్యమై అనే కవితలో వురిమళ్ళ సునంద  కోట్లాది ప్రశ్నలకు కొడవళ్ళే సమాధానాలి మొలవాలన్నారు. సరికొత్త దీపావళి అనే కవితలో రాచమళ్ళ ఉపేందర్ '' నేడు నరకాసురనికి నకలుగా మనిషి తయారవుతున్నాడని నేటి మనిషిపై చురకత్తులాంటి పదాలు విసిరారు.  కలం గొప్పదనమనే గీతాన్ని ఆవుల వీరభద్రం ఆలపిస్తూ '' పెన్నుమీద మన్ను పొయ్యద్దురా - అది గన్నై మొలుస్తుందిరా '' అంటూ అందరిని ఉత్తేజపరిచారు. భూప్రకంనల్లో అనే కవిత ఆలపిస్తూ ముచ్చర్ల ఇబ్రహీం '' పాటై పోటెత్తుతున్నాయి - భూ కంపనలన్నారు '' ఛాందసం సింహాసనమెక్కితే అనే శీర్షికతో  బండారు రమేష్  '' బుద్ధి జీవాలను శుద్ధి చేయడం కుదరదని, మట్టి పెళ్ళలా సంకెళ్ళను తెంచుకుంటాయని '' ఆక్రోశించారు. హెచ్చరిక అనే కవితతో జయరాజ్ తీవ్ర నిరసన స్వరాన్ని వినిపించారు '' వాడిపొట్ట అబద్ధాల పుట్ట '' ఏలికలని పీలికలను చేయాలన్నారు. మధ్యలో విజయ కళాశాల ప్రధానాచార్యుడు జంపాల మధుసూదనరావు మాట్లాడుతూ '' ఆవేశం లేకపోతే కవిత్వం రాదని, కవులు ఇతరులతో అనుభవాలను పంచుకోవాలని, ఆవేశంతో పాటూ ఆలోచన ఎంతో అవసరం అని వక్కాణించారు.   దివ్వెలు అనే కవితలో కపిల రాంకుమార్ ''రాయిని పగలకొట్టవు/ ఒక్క రాజుని మార్చలేవు/వందలు వెచ్చించి  టపాసులు ఎన్నైనా కాలుస్తారు కాని/చూస్తూ చూస్తూ పదిరూపాయల
నోటును కాల్చమనుండ్రి చూదాం!/గద్దెనెక్కిన నాయాళ్ళ  దిమ్మ తిరిగేలా భూచక్రాలు తిప్పి,ఆవుని అడ్డపెట్టుకునే రాచకీయం చేసేవాళ్ళను, /కుక్కకున్న విశ్వాసం లేకుండ గెలిపించినోళ్ళను కరిచేవాళ్ళను కుళ్ళపొడవాలనివుంది!'' వర్తమానసమాజాన్ని తన సహజమైన స్వరంతో  దీపావళితో అనుసంధానంచేస్తూ బాణసంచాలంటి పదాలతో పోల్చటం వాటిని కాల్చినంత ఆనందం కలిగింది.
 శ్రోతలకు. శ్రీమతి ఉరిమళ్ళ సునంద వందన సమర్పణ కావించారు.
- 24-11-2015