18, మార్చి 2016, శుక్రవారం

మిన్నేటి పొంగులు || (కవితపై శ్రీ వాచవి ముందుమాట)

Photo: కపిల రాంకుమార్ ||మిన్నేటి పొంగులు ||
(కవితపై శ్రీ వాచవి ముందుమాట)
పొన్నేటి పొంగులు (కవిత ) రచయత - హీరాలాల్ మోరియా రాయ్ -ఖమ్మం
జిల్లా రచయితల సంఘం  1961 లో ప్రచురించింది.  దానిని ప్రముఖ రచయిత
దాశరథి తెలుగులో అనువదించారు. 

దానికి శ్రీ వాచవిముందుమాట : ఉత్తమ  కవితకు కావలసినవి ఉత్సాహము, ఉద్రేకము, ఉక్తి,  చమత్కృతి. ఇవి పదముల ఇంద్ర జాలముతో రావు. శబ్దాల పోహళింపుతో సమకూడవు. అలంకారాల బిగింపుతో అలవి కావు. ఇవి సాధించే ప్రధాన సాధనలు చిత్తశుద్ధి, శైలి, వ్యక్తి ముద్ర. అది ప్రబంధ కవిత అనండి, భావ కవిత్వనండి, ప్రగతిశీల  కవిత్వమనండి,  దేనికైన యీమూడు లక్షణాలూ వుంటేనే ఉత్తమ కవిత కాగలదని  లాక్షణికులు చెప్పారు.  '' మిన్నేటి పొంగులు " రచించిన హీరాలాల్  మోరియా రాయ్ కి ఈ లక్షణాలున్నాయి. ముఖ్యంగా చిత్తశుద్ధివుండటంచేతనే వీరకవితావేశం ఆవహించి, యీ రచన చేయించింది, ఉద్రేక భావాలు పొంగిపొర్లేటట్టూ చేసింది. తెలంగాణా విమోచన సమరం ప్రారంభమైనపుడు 1947 ఆగస్టు 15 వ తేదీ తుపాకులకు ఎదురొడ్డీ నిలచున వాడు, దౌర్జన్యాన్ని యెదిరించడంలో తెగువచూపి కారాగారవాసం చేసిన నిజాయితీ కల దేశభక్తుడు. ఈయన తొలి కావ్యం ' అమృత పథమే " - మృత్యోర్మా అమృతంగమయ అనే ఉపనిషద్ వాక్యం ఆచరణ్లో తేకలిగిన కర్మయోగి. అందుచేత  ''' మిన్నేటి పొంగులు "  వియత్గంగా ప్రవాహంనుండి జాలువారిన వీచికాపరంపరలు.  అభ్యుదకవిత్వం పేరున 20, 30 యేళ్ళనుండి శ్రీశ్రీవంటివారు రాసే '' అవును సుమా, నీవన్నది నిజం - నిజం మనమంతా గానుగులం;
పీనుగులం, చదువువృధా, బ్రతుకు వృధా '' అనే చేదు పాట మార్కు పద్యాలు ఒరవడిలో కాక అనుభవాల నిశ్రేణులనుండి ఆవేశపు తారాపథంలో విహరిస్తూ, ఆదర్శమనోభావాలతో అంతరిక్షానికి ఎగిసిపోయే ' 
మిన్నేటి పొంగులు క్రుమ్మరించిన కవి మనల్ని ఆకర్షించటంలో  ఆశ్చర్యంలేదు. తన జీవితానికి, జాతికి, సంఘానికి, దేశానికి ఇతని  భావాలు సీమితం కావు. తెలంగాణా స్వాతంత్ర్య సమరంగాని, భారత దేశ ప్రజాస్వామ్య విప్లవం కాని, 
విశ్వమానవ శాంతియుద్ధం కాని, వీనిలో యీ కవికి గోచరించే సర్వమానవ సమానత్వం సకలలోక కళ్యాణం, సర్వజగతీ శ్రేయస్సు కోరే జనశాంతి, విశ్వమానవ సమత. 
'' ధర్మచక్ర పతాకమెత్తి
రాత్రి చుక్కల కెంపుదేరిన
నయన వీధులు జ్వాలలెత్తిన
నగ్న ఖడ్గం, అగ్నికీలిక
హద్దులన్నీ అంతరించిన
విశ్వమానవ విశాలత్వం
మంటలార్పీ మింటికెగసిన
మహాభారత ప్రజాస్వామ్యం '' యీ కవి మతం హ్యూమనిజం, తత్వం  మానవత్వం. అందుకే యుద్ధ కారకులైన
నాయకుల్ని చీదరించుకుంటాడు.
'' నాయకాగ్రణులు వాయి కదిపితే
చేయి కదిపితే మహాయుద్ధములు
వీళ్ళ ప్రసాదమె జగన్నాశనము
వీళ్ళప్రసాదమె జాతి వినాశము. '' యీయనకు ముత్యాల సరాలు, ముక్త చ్చందస్సులో ఒకేలాగ పలుకుతాయి.
ఈ మహాయానంలో సైన్యం '' గగన సీమలనంటి చెదరిన సిగలతో,
శివమూర్తులట్టుల హిమ గిరీంద్ర మహోచ్చ శిఖరాగ్రమును దాటే జాంఘికత్వం '' అని సైన్య గీతం పాడుకుంటాడు.
''' ఏటి అవతల లోకంలో మ్రోగుతోది మృత్యువు,
చప్పబడ్డ బ్రతుకు కన్న ధ్వనిస్తున్న మృత్యువునయం ""
అచంచలుడైన ఆశావాది.  '' గగనమందున క్రొత్త చుక్కలు
క్రొత్తకాంతులు, క్రాంతి యాత్రలు సాగుతుంటీ '' ఈయన చూచిన మహా ప్రస్థానంలో ''
'' యాత్రికులు, , నిరుపేదవారలు  '' క్రొత్త ఆశలు, క్రొత్త కాంతులు, క్రొత్త శక్తి, క్రొత్త ముక్తి మృత్యువుకు ప్రర్యాయపదమీ జీవితం; మారాలి లోకం '' అంటూ పయనిస్తాడు.
'' ఫెను తుపానుల్ కన్న వేగం వేగమున పోతున్న
యాత్రికులరుగో! జ్వాలాముఖులు వారలు
విజయమే నిజం, పరాజయమన్న యెరుగరు! '' అటువంటి యాత్రికుల్ని ముందుకు సాగమని ప్రబోధిస్తూ 
'' తూరుపు నీవెరా
పడమరలు నీవెరా
దిక్కు దిక్కులు గెలిచి
దిక్కై వెలుగరా! "" అని ఆశావాదంతో ఆశీర్వదిస్తాడీ కవి హీరాలాల్ మోరియా రాయ్
'' విప్లవం వర్థిల్లుతుంది
విజయపతాకం ఎగుర వేస్తుంది
విశ్వ శాంతి వెదజల్లుతుంది "" ఈ విశ్వాసమే  ''  మిన్నేటి పొంగులు. యిలంటి గీతాలు హీరాలాల్ కంఠస్వరం నుండి
ఉర్దూనుండి తెనుగులో రికార్డ్ చేసిన కలం దాశరథి గారిది. ఏ శ్రుతిలో అగ్నివీణకు  సరిచేసిన రుద్రవీణలాగ మారుమ్రోగు
తుంది. వినండి యీ విప్లవ స్వరాలు. .........శ్రీవాత్సవ - విజయవాడ 16-1-1961 


హీరాలాల్ మోరుయా - దాశరథి కల ఫొటొ హీరాలాల్ మోరియా - దాశరథి కల ఫొటొ 

కపిల రాంకుమార్ ||మిన్నేటి పొంగులు ||
(కవితపై శ్రీ వాచవి ముందుమాట)
పొన్నేటి పొంగులు (కవిత ) రచయత - హీరాలాల్ మోరియా రాయ్ -ఖమ్మం
జిల్లా రచయితల సంఘం 1961 లో ప్రచురించింది. దానిని ప్రముఖ రచయిత
దాశరథి తెలుగులో అనువదించారు.

దానికి శ్రీ వాచవిముందుమాట : ఉత్తమ కవితకు కావలసినవి ఉత్సాహము, ఉద్రేకము, ఉక్తి, చమత్కృతి. ఇవి పదముల ఇంద్ర జాలముతో రావు. శబ్దాల పోహళింపుతో సమకూడవు. అలంకారాల బిగింపుతో అలవి కావు. ఇవి సాధించే ప్రధాన సాధనలు చిత్తశుద్ధి, శైలి, వ్యక్తి ముద్ర. అది ప్రబంధ కవిత అనండి, భావ కవిత్వనండి, ప్రగతిశీల కవిత్వమనండి, దేనికైన యీమూడు లక్షణాలూ వుంటేనే ఉత్తమ కవిత కాగలదని లాక్షణికులు చెప్పారు. '' మిన్నేటి పొంగులు " రచించిన హీరాలాల్ మోరియా రాయ్ కి ఈ లక్షణాలున్నాయి. ముఖ్యంగా చిత్తశుద్ధివుండటంచేతనే వీరకవితావేశం ఆవహించి, యీ రచన చేయించింది, ఉద్రేక భావాలు పొంగిపొర్లేటట్టూ చేసింది. తెలంగాణా విమోచన సమరం ప్రారంభమైనపుడు 1947 ఆగస్టు 15 వ తేదీ తుపాకులకు ఎదురొడ్డీ నిలచున వాడు, దౌర్జన్యాన్ని యెదిరించడంలో తెగువచూపి కారాగారవాసం చేసిన నిజాయితీ కల దేశభక్తుడు. ఈయన తొలి కావ్యం ' అమృత పథమే " - మృత్యోర్మా అమృతంగమయ అనే ఉపనిషద్ వాక్యం ఆచరణ్లో తేకలిగిన కర్మయోగి. అందుచేత ''' మిన్నేటి పొంగులు " వియత్గంగా ప్రవాహంనుండి జాలువారిన వీచికాపరంపరలు. అభ్యుదకవిత్వం పేరున 20, 30 యేళ్ళనుండి శ్రీశ్రీవంటివారు రాసే '' అవును సుమా, నీవన్నది నిజం - నిజం మనమంతా గానుగులం;
పీనుగులం, చదువువృధా, బ్రతుకు వృధా '' అనే చేదు పాట మార్కు పద్యాలు ఒరవడిలో కాక అనుభవాల నిశ్రేణులనుండి ఆవేశపు తారాపథంలో విహరిస్తూ, ఆదర్శమనోభావాలతో అంతరిక్షానికి ఎగిసిపోయే '
మిన్నేటి పొంగులు క్రుమ్మరించిన కవి మనల్ని ఆకర్షించటంలో ఆశ్చర్యంలేదు. తన జీవితానికి, జాతికి, సంఘానికి, దేశానికి ఇతని భావాలు సీమితం కావు. తెలంగాణా స్వాతంత్ర్య సమరంగాని, భారత దేశ ప్రజాస్వామ్య విప్లవం కాని,
విశ్వమానవ శాంతియుద్ధం కాని, వీనిలో యీ కవికి గోచరించే సర్వమానవ సమానత్వం సకలలోక కళ్యాణం, సర్వజగతీ శ్రేయస్సు కోరే జనశాంతి, విశ్వమానవ సమత.
'' ధర్మచక్ర పతాకమెత్తి
రాత్రి చుక్కల కెంపుదేరిన
నయన వీధులు జ్వాలలెత్తిన
నగ్న ఖడ్గం, అగ్నికీలిక
హద్దులన్నీ అంతరించిన
విశ్వమానవ విశాలత్వం
మంటలార్పీ మింటికెగసిన
మహాభారత ప్రజాస్వామ్యం '' యీ కవి మతం హ్యూమనిజం, తత్వం మానవత్వం. అందుకే యుద్ధ కారకులైన
నాయకుల్ని చీదరించుకుంటాడు.
'' నాయకాగ్రణులు వాయి కదిపితే
చేయి కదిపితే మహాయుద్ధములు
వీళ్ళ ప్రసాదమె జగన్నాశనము
వీళ్ళప్రసాదమె జాతి వినాశము. '' యీయనకు ముత్యాల సరాలు, ముక్త చ్చందస్సులో ఒకేలాగ పలుకుతాయి.
ఈ మహాయానంలో సైన్యం '' గగన సీమలనంటి చెదరిన సిగలతో,
శివమూర్తులట్టుల హిమ గిరీంద్ర మహోచ్చ శిఖరాగ్రమును దాటే జాంఘికత్వం '' అని సైన్య గీతం పాడుకుంటాడు.
''' ఏటి అవతల లోకంలో మ్రోగుతోది మృత్యువు,
చప్పబడ్డ బ్రతుకు కన్న ధ్వనిస్తున్న మృత్యువునయం ""
అచంచలుడైన ఆశావాది. '' గగనమందున క్రొత్త చుక్కలు
క్రొత్తకాంతులు, క్రాంతి యాత్రలు సాగుతుంటీ '' ఈయన చూచిన మహా ప్రస్థానంలో ''
'' యాత్రికులు, , నిరుపేదవారలు '' క్రొత్త ఆశలు, క్రొత్త కాంతులు, క్రొత్త శక్తి, క్రొత్త ముక్తి మృత్యువుకు ప్రర్యాయపదమీ జీవితం; మారాలి లోకం '' అంటూ పయనిస్తాడు.
'' ఫెను తుపానుల్ కన్న వేగం వేగమున పోతున్న
యాత్రికులరుగో! జ్వాలాముఖులు వారలు
విజయమే నిజం, పరాజయమన్న యెరుగరు! '' అటువంటి యాత్రికుల్ని ముందుకు సాగమని ప్రబోధిస్తూ
'' తూరుపు నీవెరా
పడమరలు నీవెరా
దిక్కు దిక్కులు గెలిచి
దిక్కై వెలుగరా! "" అని ఆశావాదంతో ఆశీర్వదిస్తాడీ కవి హీరాలాల్ మోరియా రాయ్
'' విప్లవం వర్థిల్లుతుంది
విజయపతాకం ఎగుర వేస్తుంది
విశ్వ శాంతి వెదజల్లుతుంది "" ఈ విశ్వాసమే '' మిన్నేటి పొంగులు. యిలంటి గీతాలు హీరాలాల్ కంఠస్వరం నుండి
ఉర్దూనుండి తెనుగులో రికార్డ్ చేసిన కలం దాశరథి గారిది. ఏ శ్రుతిలో అగ్నివీణకు సరిచేసిన రుద్రవీణలాగ మారుమ్రోగు
తుంది. వినండి యీ విప్లవ స్వరాలు. .........శ్రీవాత్సవ - విజయవాడ 16-1-1961  


19, ఫిబ్రవరి 2016, శుక్రవారం

అరుణ్‌ సాగర్ స్మరణలో

23, జనవరి 2016, శనివారం

కపిల రాంకుమార్‌ ||హెచ్చరిక కావాలి||

కపిల రాంకుమార్‌ ||హెచ్చరిక కావాలి||
ఎందెందు వెతికినా అందందె కలదు వివక్ష
నిత్య కృత్యమై - నగ్న సత్యమై
వికటాట్టహాసం చేస్తూ
దక్షయజ్ఞంనాటి సతిని 
నరికిన బీభత్స తాండవ శివుడిలా
కరాళనృత్యమై
బడుగులును బడితపూజచేసి
అడుక్కి తొక్కాలనే దమనకాండ
అనునిత్యం పతాకశీర్షికై
ఎగురుతూనేవుంది!
మనం తిప్పికొట్టిన ప్రతీసారి
మరోరూపంలో
భూతంలా,ప్రేతంలా
నిశీథిలోనేకాదు
పట్టపగలే పగపట్టి
పిచ్చికుక్కలా స్వైర విహారం చేస్తూ
బూజుపట్టిన ధర్మాలను వల్లెవేస్తూ
కుంటిసాకులు చెబుతూ
అభూతకల్పనల ఘనాపాఠీలై
పలకవర్గ కొమ్ముకాసే బాకాలే కాదు
కొలువవున్న బాబాలు సైతం
మనువును వకల్తాపుచ్చుకుని
దాడిచేస్తూనేవున్నారు!
నిత్యాగ్నిహోత్రంలా
దహనకాండ నెరపుతూ
దమననీతి పాటిస్తూ
ఈ దగుల్బాజీలు
జబ్బలు చరుచుకుంటూ
మమ్మల్ని మీరేమీ పీకలేరన్నట్లు
గప్పాలు కొడుతూనేవున్నారు!
శవాలుగా మారుతున్న మనవాళ్ళసాక్షిగా
ప్రతి సవాలు విసరటమే మన ధ్యేయంకావాలి!
మనతిండి తిననివ్వని
మనం మనంగా బతకనివ్వని
చదువుకోనివ్వని
పుండాకోరునాయాళ్ళని
ఎలా వూరుకుందాం?
మనమేమైనా ఓట్లుమాత్రమే కాసే చెట్లమా?
అదిని చూచు కాటేసే బుల్లట్లవ్వాలింక!
చులకనచేసే బట్టేబాజుగాళ్ళ భరతం పట్టాలంటే
చదువు  పట్టాలేకాదు - కొలువు పట్టాలే సాధిద్దాం!
మనలోని వైషమ్యాలను
వాళ్ళు వాడుకోకుండా సమిష్టిగా గళమెత్తాలి
పిడికిలి బిగించాలి!
కదం తొక్కాలి!
మరో స్వతంత్ర్యపోరాటం మాదిరి
వాళ్ళ పుచ్చెలదిరేలా
మోగించే యీ నగారా
హెచ్చిరిక  కావాలి! 

12, జనవరి 2016, మంగళవారం

కపిల రాంకుమార్‌|| కల చెదిరింది ||

కపిల రాంకుమార్‌|| కల చెదిరింది ||
అదాటుగా నెత్తిమీదబడ్డ
కొబ్బరికాయదెబ్బకి
అబ్బా అన్న నన్ను
కలవరిస్తున్నారా! అంటూ
మా ఆవిడ తట్టిలేపింది!
కళ్ళు నులుముకుంటూ
ఇన్నేళ్ళుగా క్యాంపులో వుండి
అపురూపంగా పెంచుకున్న
చెట్లు చేమల్ని తలుచుకుంటు
పడుకున్న నాకు
ఇలా స్వప్న విఘాతం కలిగింది!
నిత్యం పూచే నందివర్థనం, నూరువరహాలు
ఎర్రమందారచెట్టు
శాపనార్థాలుపెడుతున్నట్టు
నాలుగు  రకాల గులాబీపూలు
గుబాళించటం మానేసి
గుర్రుగా చూస్తున్నట్టు
ఆకాశమంత యెత్తు ఎదిగిన అశోక వృక్షాలు
అవకాశమొచ్చినప్పుడల్ల కసురుతున్నట్టు
దోరకాయలుకోసుకుతిన్నజోరు
మమ్మల్ని విడిచిన పిదప యేమయిందంటున్న జామ చెట్టు
అలిగినట్టున్నాయి కామోసు
కొబ్బరికాయను నాపైకి వుసికొల్పి వుంటాయి!
అందుకే నెత్తిమీద విన్యాసం చేసి
పీడనపు తాడనం కలిగించింది!
క్యాంపువాళ్ళ పుణ్యమా అని
ఖాళీ చేసిన మర్నాడే
కూలిపోతున్న యింటి ఆక్రందన వినలేకనో
ఏ మూలో పేగుల్ని మెలిపెట్టి పిండినట్టుంటుందని తీపో
తెలియదుకాని తిరిగి కన్నెత్తి చూడకపోవటం
నా ఘోరతప్పిదమన్నట్టుగా
మమతల సంకెళ్ళలా వదలవు కామోసు
ఇలా యిలలో కలను ఆసరా చేసుకుని
నాపై చేసిన దాడికి 
చెప్పొద్దూ కళ్ళు చెమర్చాయ్ సుమా!
సర్కారుని
దాని కాపలా కుక్కల్ని
కసితీర తిట్టుకున్నాను!
మౌనంగా యిలా అక్షరాలను ఒంపేసాను !
నేను నిర్దయుడ్నని
దుర్మార్గుడని,
విశ్వాసంలేనివాడినని
తీర్మానించాయి
ఒకప్పుడు నేను పెంచుకున్న చెట్లు !
12.1.2016

10, జనవరి 2016, ఆదివారం

'' ఇళ్ళ గోష ''

కపిల రాంకుమార్‌ || '' ఇళ్ళ గోష '' ||
ఉద్యోగంలో చేరగానే
కొద్దిపాటి సౌకర్యాలతో
ప్రభుత్వ వసతిగృహం
కేటాయించడం
కడుపులో చల్ల
కదలకుండా
విధులు నిర్వహించుకోటంలో
సాగిన ప్రయాణం
ఒకటా రెండా ముప్పై మూడు
పదవీ విరమణైనాకూడా
అద్దె చెల్లించే ప్రాతిపదికపై
హాయిగ జీవనం సాగిస్తున్నాం!
ప్రభుత్వ ఉద్యోగికి
పదవి విరమణ నాటికి
స్వంత గృహం ఏర్పాటుచేయడం
మా విధానమని
గత పదేళ్ళుగా ప్రభుత్వాలు
తమ విధానాల్ని
యధావిధంగా నినదిస్తూ
ఆశలు రేపుతూనే వచ్చాయి!
అరచేతి వైకుంఠాల్ని చూపిస్తూనేవున్నాయి!
పట్టణ పరిథిలో ఎక్కడా
స్వంత యిల్లు లేదు
సంఘాలవాళ్ళెవరు యిళ్ళస్థలమూ
చూపలేదు సరికదా పైపెచ్చు
పదవి విరమణ చేసిన వాళ్ళలో
ముక్కుకు సూటిగాపోయే
కొందరి పేర్లు తొలగించారు.
గడ్డివాము కాడ కుక్క తను తినదు
ఇంకొకరిని తిననీయదూ అంటూ కుంటిసాకులు చెప్పారు
శాఖాపరమైన నిర్వహణ బాధ్యతలనుండి
తప్పించుకునేందుకే నిధుల కొరతతో
వసతిగృహాల గదులు నలతచెందితే
నివాసముంటున్నావారికి తప్పదుకదా
సొంత ఖర్చులతో మరమత్తులు చేసుకుని
కాపురముంటున్న దశలో
సర్కారుకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా
సచివాలయంలో కదలని ఫైలు
రిమార్కులతో కిందికి
సమాధానాలతో పైకి పరుగులే తప్ప
ఉరిమే మేఘం వర్షించనట్ట్లు
నీరుకార్చే ప్రయత్నాలు కొందరివి.
ఇలా జరుగుతున్న సమయంలో
ఒకటో రెండో నివాసమెవరూ వుండని
ఇండ్లనుండి తలుపులు, కిటికీలు
ఎవరికి అందినవి వారు
నొక్కేస్తే బలంలేనివి వానాకాలం నాని కూలిపోతే
వంక లేనమ్మకు డొంక దొరికిందన్న చందంగా
ఇవి ఎప్పటికైనా కూలిపోయేవి కాబట్టి
రక్షణలేని ఇళ్ళు ఖాళీ చేయాలంటూ
గత మూడేళ్ళుగా తాకీదులిస్తూనే
అవసరమైన వారికి గృహాలుమాత్రం కేటాయిస్తూనే
ద్వంద్వ వైఖరి పాటించి
ఒక్కసారి ఉపద్రవం ముంచుకొచ్చినట్ట్లు
ఓ తెల్లవారు ఝామున బుల్డోజర్లు తెచ్చి
రెవిన్యూ, పోలీసు, ఇరిగేషన్‌
అప్రకటిత యుద్ధం
ప్రకటించి కూలగొట్టే యాగం మొదలెడితే
చెట్టుకొకరు. పుట్టకొకరు అన్నట్లు
గత అనుబంధాలు, ఆప్యాయతలు
విడిచి చెల్లాచెదురైన ఆ నేల చూస్తే
కళింగయుద్ధం తరువాత
వైరాగ్యంతో బౌద్ధం పుచ్చుకున్న అశోకుడిలా
భారత్‌లో ఓ వెలుగు వెలిగి
మాయమైపోయినట్లు
లెక్కా పత్రం లేకుండా
హీనకాచి నక్కలపాలైనట్లు
రాజుల సొమ్ము రాళ్ళపాలన్నట్లు
పాత యినుము బడుగుజీవుల కూటికి ఆసరా అవుతుంటే
శాఖాపరమైన నిబంధనలు ఎటుపోయినట్లు?
మరి పైకి రాలేని ఏ అవినీతి బావిలో కూరుకుపోయారో
మరొకపక్క ఎప్పుడో కట్టిన గృహకల్ప భవనాలు
అమ్ముడుకాకపోగా వాటినేదో అంటగట్టాలని యత్నం
విసిరేసినట్లుండే ఆ భవనాల ధర ఆకాశంలోనే
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ధరలకంటే ఎక్కువే
అమ్మ పెట్టదు, అడుక్కు తిన నివ్వదన్నట్టుగా
ప్రవర్తిస్తూ చదును చేసిన స్థలాన్ని వేలంద్వారా
అమ్ముకోవాలనే యత్నంలో
ఆ స్థాయికి పోటిపడలేని పదవీ విరమణ ఉద్యోగి
సొంతయింటికల నిరాశే కదా!
=================

22, డిసెంబర్ 2015, మంగళవారం

||కర్రుకాల్సి వాతెయ్యాలిరా తమ్మీ!!



కపిల రాంకుమార్
||కర్రుకాల్సి  వాతెయ్యాలిరా తమ్మీ!!||

ఉద్యమం మాంచి-కాకమీదున్నపుడు
కుర్ర్కారుకు వెర్రెక్కించి
అరసేతి ఐకుంఠ పదవుల
పందేరం వెట్టి
తీరా ఒడ్డుచేర్నంక
దుడ్డుతిరగేసే
చెర్నకోలమోతేందిరా బాయ్‌!
సేతులూపుడు, తలూపుడుతో,మనం సేతులు ముడువబట్టే
ఆ బాడ్కావునాకొడుకులు,
యిప్పుడు మాయమాటల్త
బోర్లాకొట్టిస్తున్నరుగదా            
గారడీవోనిలెక్క మోళీ చేసి బెదిరిస్తున్నరేందే,
తాయాత్తు కొనమంటూ!



యింటనున్న నలుగురికి
పీటేసి మస్తుగా కుశాలుచేసుకుంట
చుట్టాపోల్లకి మాత్రం చెట్లకింది కాపురమెట్టమంటున్నరు
గదేమి యిచిత్రమోగాని,
శాటువు సెప్పినట్టు 
కాకులకొట్టి గద్దలకేసిన తీర్ల
గోడదూకొచ్చినోన్ని
గద్దెమీద కూకోవెట్టి
పుట్టినసంది జెండామోసి
బుజం తీపుపెట్టి
అలమటించే మూగ జీవుల్ని
గడ్డికూడ విదల్చక
గదిమి తరిమికొట్టుడేంది?
అయినా నాకు తెల్వకడుగుతా
మన జనం మరీంత పిచ్చోళ్ళైతన్నరేందే?



నారుకూ నీటైన గింజలేకపోయినా,
నోటికాడికొచ్చేలోగా
గంజి దాకలి బళ్ళుమన్నా
దొరక్కదొరికిన ఆందానితో
అప్పు తీర్చేలోంగా
మిత్తి ఆసాంతం కట్టలేదని
కత్తిపెట్టి జులుంచేస్తావుంటే
రైతన్న  దీపమైతన్నాడేందే?
కడకంటా సాగాల్సిన ఎవసాయం
మద్దెలోనే బుడగ మాదిరి పేల్తావుంటే
పల్లెల్లో సావు డప్పులు జాతరమాదిరి కొనసాగుతుంటే
కళ్ళుండి సూడలేని,
చెవులుండి యినలేని
సర్కారిదిల్చే సాయానికీ
యెగనామమెట్టడానికెన్ని సాకులో
దీనమ్మ రైతు బతుక్కిదా నాయళ్ళిచ్చే యిలువ?
సకలం యిచ్చిన్నమై మట్టిపాలౌతుంటే యాగాలంటరేందివారి!
యెనకటికెవడో నీరోరాజుమాదిరి ఫిడేలు సంబురాలెంది...
గిసుమంటివి
మతుండిచేసే పనులేనా?
అందుకే యీయేల పతోడికి
కిందపైనా తెగకాల్తోంది వారి!
ఒకరినుండి ఒకరికి బుకారోలె
రాజుకుంటేకాని బడబాగ్నివుట్టదు!
మనమిప్పుడు కేకలేసుడుకాదు
గద్దెకిందకాకవెట్టాలె!
నేల తల్లి దద్దరిల్లెలా, 
కూష్మాండం బద్దలయ్యేలా
కొమ్ము బూర, డోలు డప్పు,కంజీర మద్దెల
మిర్మిట్ట్లుకొలొపేలా మోగాల మార్మోగాల!
తిండి మీద ఆనంటడొకడు!
ఉండనీకి నీడలేదంటడొకడు!
ఊర్కుంటే కాదు
ఉరికించి గదమాలె!
వూరిపొలిమేరల్ల పోరుజెండాలెత్తాలె!

3, డిసెంబర్ 2015, గురువారం

|| యాభై వసంతాల '' దిగంబర ''కవిత్వోద్యమం ||

|యాభై వసంతాల '' దిగంబర ''కవిత్వోద్యమం ||'శ్రీ పగిడిపల్లి వెంకటేశ్వర్లు - పరిశీలన వ్యాసం నుండి||
***రచయితలలో అగ్రాసనం కవిది. ఇటీవల వాడుకలోకి వచ్చిన మాట రచయిత, పూర్వం కవిగానే సర్వత్ర వ్యవహారితం. సాహిత్య ప్రక్రియలలోకవిత ఆద్యం, సర్వ సాహిత్యాలలో తొలిపూత కవితే అని చరిత్ర తెలుపుతోంది. కావ్యాస్వాదన పాఠకుని సహృదయతను మెరుగుపెట్టి, నాగరికుణ్ణి చేస్తుంది. మనసుపైన సత్కవిత వేసే ముద్ర ఎన్నటికి చెరగనిది. దాని తావి తరుగులేనిది.2015 మే 6 నాటికి దిగంబర కవిత్వోద్యమం యాభై వసంతాలు పూర్తి చేసుకుంటోంది. అంటే దిగంబరకవుల మొదటి సంపుటి 1965 మే 6న తెలుగు సాహిత్య రంగంలో ప్రవేశించింది ఈ సందర్భంగా ప్రపంచ సాహిత్య రంగంలో కూడ యిలాంటి ధోరణులు, లేదా తీక్షణమైన కవితాసృజన జరిగిందేమోనని గమనిస్తే ఈ క్రింది విషయాలు దృష్టికి వచ్చాయి. మన దిగంబరకవిత్వానికి దాదాపుసమకాలీన సాహిత్యం సృజన చేసిన వారిలో 1. సాన్ఫ్రాంసిస్కోలో ని బిట్నిక్కులు, 2. బ్రిటన్కు చెందిన యాంగ్రీ యంగ్మన్ 3. హంగేరికి చెందిన - గాయపడిన యువకులు 4. రష్యాకు చెందిన ఎతుషెంకో అనూనాయులు 5. హాలెండ్లోని - ప్రోవో ఉద్యమం, ఇక మన దేశంలోనే '' కలకత్తా లో ఆకలితరం కవులు '' ఉత్తర ప్రదేశ్లో అనామ కవిత్వోద్యమకారులు, మహారాష్టలోని ఆఫ్వర్గం వారి సాహిత్య ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో దిగంబర కవులపై ఉండివుండవచ్చునని ఆచార్య కాకర్ల వెంకట్రామ నరసింహ్వం గారు తమ ''ఆధునికాంధ్ర కవితా సమీక్ష'' లో పేర్కొన్నారు. ఈ ఆరుగురిలో చెరబండరాజు, జ్వాలాముఖి దివగంతులుకాగా, కొన్ని కారణాంతరాల వలన 1971 తరువాత సాహిత్య ప్రపంచాన్నుంచి తప్పుకుని మహాస్వప్న నెల్లూరు జిల్లా లింగ సముద్రంలోనూ, భైరవయ్య విజయనగరంలోను స్థిరపడ్డారు. నిఖిలేశ్వర్, నగ్నముని హైదరబాదులో వుంటూ సాహిత్య లోకంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.. మిగతా కవులకు భిన్నంగా వారి పేరుమీద వారాలని: స్నేహ వారం, విశృంఖల వారం, క్రాంతివారం, సృజన వారం వికాసవారం, అనంత వారంగా పేర్కొన్నారు. ఋతువులను ఆశఋతువు, తపన ఋతువు, అశ్రుఋతువు మదిర ఋతువు, విరహ ఋతువు, విషాద ఋతువులుగాను, సంవత్సరాలను నగ్న నామ సంవత్సరం నిఖిలేశ్వరనామ సంవత్సరం, జ్వాలాముఖినామ సంవత్సరం, చెరబండనామ సంవత్సరం, భైరవ నామ సంవత్సరం మహాస్వప్న నామ సంవత్సరాలుగా ప్రకటించడంద్వారా సాహిత్యంలో ఒక నూతన ఒరవడిగా మొదలైనట్లు భావించవచ్చు. వాటి క్రమంలో 6 సంపుటాలుగా వెలువరించాలని వారు మొదట భావించినా మూడు సంపుటాలను మాత్రమే పరిచయంచేసి అర్థంతరంగా అనివార్య కారణాల వల్ల ఆపివేయటం కొంత నిరాశ కలిగించినదని చెప్పవచ్చు.
** మొదటి సంపుటం ''ఇతి శాసనం'' లో దిగంబరశకం, నగ్ననామ సంవత్సరం ఆశఋఉతువు (సరిగ్గా క్రీ.శ.1965 మే)న ఆంధ్రప్రదేశ్ రాజధానీ నగరం హైదరాబాద్న ప్రప్రధమంగా తాము దిగంబర కవిలమని ప్రకటిస్తూ ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని కొత్త రక్తాన్ని ఇంజెక్ట్ చేయడానికొస్తున్న నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, భైరవయ్య, చెరబండరాజు, మహాస్వప్నల గుండెల్లోంచి ధైర్యంగా, స్థైర్యంగా దూసుకొచ్చిన కేకల్ని పేజీల్లో పట్టుకోవడానికి ప్రయత్నించిన దిగంబర కవితా ప్రచురణ సమర్పణ అంటూ వాళ్ళ ఆగమనాన్ని తెలియచేసారు.
రెండవ సంపుటం '' దిక్లు-30'' దిగంబరశకం, నిఖిలేశ్వరనామ సంవత్సరం, మదిర ఋతువు (సరిగ్గా క్రీ.శ.1966 డిసెంబర్) లో ఇంకా భయంభయంగా బానిసత్వంగా దుర్భరంగా, హేయంగా, ఛండాలంగావున్న ఆంఢ్రదేశమనే మురిగ్గుంటలోంచి నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్నలు పలికిన కవిత దిగంబర కవితాప్రచురణ సమర్పిస్తున్నది అని దిగంబరశకాన్ని తెలియచేసారు.
మూడవసంపుటం: ప్రజల అవిద్యని, అజ్ఞానాన్ని, అశక్తతని, ఆసరాగా తీసుకుని దేశాన్ని దోచుకు తినడం మరిగిన పరిపాలకులు, సంఘంలోని వివిధ వర్గాలవాళ్ళు నేడు ప్రజలపై రుద్దుతున్న '' కుష్టు వ్యవస్థ''ని ఎదుర్కొంటూ దిగంబరకవులు పలికిన జ్వాలానామ సంవత్సరం, విషాద ఋతువు (సరిగ్గా క్రీ.శ. 1968 జూన్) లో దిగంబర కవితా ప్రచురణ వినిపిస్తున్న్నది అని తెలియచేసారు. ఈ దేశంలో ఈ ఇరవైయేళ్ళ స్వాతంత్ర్యంలో భయంకరంగా, విజృంభించిన కులమత దురహంకారానికి, ధనమదంతో యధేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటున్న గుండాయిజానికి సినిమా రొంపిలో ఈదులాడుతున్న యువతరం బలహీనతకి, స్తోత్రపాఠాల కుడితిలో పడిపోయిన పత్రికాలోకం పడుపు జీవనానికి, అతీత జీవనంతో తప్పించుకు బతుకుతున్న మేథావుల అనాసక్తతకి, నాయకుల ఊసరవెల్లి ఆదర్శాలకి, పదవీ వ్యాపారాలకి, నేటి ఈ కుష్టువ్యవస్థకి క్రూరంగా బలైన కంచికచర్ల కోటేశు స్మృతికి ఈ మూడో సంపుటం అంకితం చేసారు. ( ఇది హర్షించదగ్గది) దిగంబరకవులు తమ మొదటి సంపుటిలో ఒక విషయాన్ని స్పష్టం చేసారు. తమ కవితా ప్రక్రియని వచన కవిత్వం అనమని, అననివ్వమని అన్నారు. ఇకనుండి దిగంబరకవులు తమ కవితా ఖండికను 'దిక్' అనే ఖండికలను దిక్కులనీ వ్యవహరిస్తారు. జబ్బుపొరల్ని చీల్చి కాస్మిక్ మార్గాన్ని నిర్దేశించేవి దిక్‌లు . మానవత్వపు విలువలే వీటిహద్దులని చాటారు…
**…
( ఇంకా వుంది - స్థలాభావం చేత సంక్షిప్త సమాచారం తీసుకున్నాను)
6-5.2015/3.12.2015

2, డిసెంబర్ 2015, బుధవారం

కపిల రాంకుమార్‌ || అస్తవ్యస్తమైన మనోచిత్రం ||

కపిల రాంకుమార్‌ ||  అస్తవ్యస్తమైన మనోచిత్రం ||
అక్కడకెళ్ళిన తరువాత
ఎందుకొచ్చానానని ఏడ్చాను,
మరుక్షణమే నిబ్బరించుకున్నాను
గతకాలపు మైలురాళ్ళను పాతిన
జిగినీదోస్తులెవరైనా
మాటల మరమరాలందిస్తారని!
నాలుగడుగులేసాను
నివ్వెరపోవటమే నా అంతు!
మామిడి చెట్టు కూలిపోయెంది
కొబ్బరిచెట్టు మాడిపోయింది!
శ్మశానంలో సమాధిలా పాత పెంకుటిల్లు!
తెలిసందప్పుడే కాలానికి ద్యాదాక్షిణ్యం లేదని
గొంతెత్తి ఆందోళన చేసినందుకు
కఠినచట్టపు చట్రంలో నలిగిపోయుంటారని
గ్రహించడానికి దాదాపు అర్థగంట పట్టింది!
ఎప్పుడూ కబుర్లాడుకునే చోట కాక
మస్తాను భాయ్‌ చాయడ్డాకాడికెళ్తేకాని
గతంలోని జెండా దిమ్మ పక్కనే
మరొక ఎర్రజెండా దిమ్మ కన్నీళ్ళెట్టుకున్న సవ్వడి
డికాషన్‌ బాయిలర్‌లో కుతకుత చప్పుడుకు
భిన్నంగా పలకరించింది!
అప్పుడుకాని లోకంలోకి రాలేదు!
అస్తవ్యస్తమైన మనోచిత్రాన్ని తొలగిస్తూ,
స్మారక స్థూపాన్ని చూసి విలపించడం కాదు
వారిలా మనమూ స్వరం వినిపించాలని
దిక్కులు పగిలేలా నినదించాలని
సందేశమిస్తున్నట్లనిపించి
పిడికిలి బిగించి, వందనం కావించి
కర్తవ్యం యేమిటో కనులముందు ఆవిష్కరించుకుని
కలానికిలా కలకలం సృష్టించే పనిపెట్టాను.
ప్రశ్నించడం
సమాధానం రాబట్టమే
మన లక్ష్యం కావాలి!
2.12.2015

24, నవంబర్ 2015, మంగళవారం

డా. వై.ఆర్.కె.సాహితీ పురస్కారాలు - దీపావళి సందర్భంగా సామాజిక దిక్కారస్వరంగా జరిగిన కవిసమ్మేళనం

కపిల రాంకుమార్‌ ||నివేదిక ||దీపావళి సందర్భంగా సామాజిక దిక్కారస్వరంగా జరిగిన కవిసమ్మేళనం

డా. వై.ఆర్.కె. సాహితీపురస్కారాలందుకుంటున్న ఈ సభ ఒక ప్రత్యేకత సంతరించుకున్నదని, దేశమంతటా కవులు సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి యిచ్చివేస్తున్న సందర్భంలో, ఒక సాహిత్య అభిమాని, ప్రజావైద్యుడు కీ.శే. డా. వై.ఆర్.కె. గారి పేర అవార్డులు ఖమ్మం జిల్లాకు చెందిన వారు అందుకోవటమంటే, ఇవి  ప్రజా అవార్డులని తెలంగాణా సాహితి రాష్ట్ర కన్వీనర్ కె. ఆనందాచారి అన్నారు.

తెలంగాణ సాహితీ ఖమ్మ జిల్లా ఆధ్వర్యంలో 10.11.2015న దీపావళి కవి సమ్మేళనం మరియు సాహితీ పురస్కారాల సభకు తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షుడు  కన్నెగంటి వెంకటయ్య అధ్యక్షతన స్థానిక బోడేపూడి  విజ్ఞాన కేంద్రం గ్రంథాలయంలో పలువురు వక్తలు మాట్లాడారు. డా. రాధాకృష్ణమూర్తి వ్యక్తిత్వం, ప్రజాసేవా, అధ్యయన శీలత, సాహితి అవగాహన పలు అంశాలను ప్రముఖులు తమ జ్ఞాపకాలను  గుర్తు చేసుకున్నారు. అత్యంత ఉత్సాహ వాతావరణంలో నిర్వహించబడింది.  ప్రముఖ కథా రచయిత శిరంసెట్టి కాంతారావు, విద్యావేత్త, కవి, మువ్వా శ్రీనివాసరావు, విశ్రాంత ఆచార్యుడు డా. పి.వి.సుబ్బారావు,
జన విజ్ఞావేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వీరభద్ర రావు, తెలంగాణ సాహితి రాష్ట్ర కన్వీనరు కె. ఆనందాచారి వేదికపైఆశీనులయ్యారు.

తన అధ్యక్షోపాన్యాసంలో కన్నెగంటి వెంకటయ్య మాట్లాడుతూ ఒక ప్రత్యేక సందర్భంలో జరుపుకుంటున్న  సభ, ఒక తాత్త్విక కవితా విశ్లేషణను కలిగించి,వక్తగా, ప్రజా వైధ్యుడుగా, నడయాడే గ్రంథాలయంగా, ప్రజల మనిషిగా, పరిణితి చెందిన రాకజీయ వేత్తగా, అంతకంటే సామాజికవేత్తగా గొప్ప మానవహక్కుల పోరాట నేతగా, సామాజిక దార్శినికునిగా పేరొందిన మహా మనిషి కీ.శే.డా. వై.రాధాకృష్ణమూర్తిని స్మరించుకుంటూ ప్రథమ వర్థంతిజరిగిన సందర్భంలో పురస్కారాలు అందుకోవటం, మిగతా ప్రభుత్వ పురస్కారాలకు  భిన్నమైనదని చెప్పవచ్చునన్నారు.తెలంగాణసాహితి రాష్ట్ర కన్వీనరు కె.ఆనందాచారి మాట్లాదుతూ పురస్కారాలు అందుకుంటున్న కవులకు మొదటగా అభినందనలు తెలిపారు.గతంలో ఖమ్మం సాహితీ గుమ్మంలో సాహితీ సేద్య చేసిన మహామహులతో మహా కవి శ్రీశ్రీ స్మారక సభను నిర్వహించిన తీరు అద్వితీయమైనదని,దాని నిర్వహణలో అంతా తానై డా. వై.ఆర్.కె. ప్రత్యేక సంచికలో ఒక వ్యాసం  రాస్తూ '' చంద్రునికో నూలుపోగు '' శీర్షికలో  శ్రీశ్రీ బహుముఖ కోణాల్లో వర్ణించిన వారి వ్యాస శైలి వారి మేథోపాఠవానికి తార్కాణమని, ఎందరినో ఆలోచింపచేసిన వ్యాసమని కొనియాడారు.ప్రస్థుత సమాజంలో సర్కారు వైఖరిపై నిరసనగా కవి ద్రష్ట కాబట్టి 100 మంది కవులు తమ అవార్డులు వాపసి యిచ్చేయడంలో '' కవులంటే ఏమనుకుంటున్నారు - కవులకు వేయి కళ్ళుంటాయి '' అనే కవితను చదివి రసజ్ఞులను ఉర్రూతలూగించారు.

డా.పొత్తూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ తనకు డాక్టరుగారికివున్న అత్యంత సాన్నిహిత్యంగురించి ఎన్నో విషయాలుతెలియచేసారు.క్రిటిక్ డాక్టర్ వై.ఆర్.కె ను ప్రస్థుతిస్తూ ఎల్లపుడూ, కవి ధర్మాగ్రహాన్ని ప్రదర్శించకలగాలని ఉద్బోధించారు. 1645 లో జాన్మిల్టన్ రాసిన పుస్తకం పత్రికా స్వేచ్ఛకు ఒక బైబిల్ లాంటిదని. కవికి వశ్యవాక్కుంటుంది. కేవలం కవులు, కళాకారులు మాత్రమే ప్రతీపశక్తులను
ఎదుర్కొంటారనేది అక్షర సత్యమని తెలిపారు.

జనవిజ్ఞానవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వీరభద్రరావు ప్రజాసైన్స్ ఉద్యమంతో డాక్టరుగారికున్న నిబద్ధత, నిజాయితీని గుర్తుచేసారు.సమాజం ఎల్లపుడు శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పథంవైపే చూస్తూవుంటూందని, దాని నుండే ప్రజాహితం ఆశిస్తుందని. తిరుగులేని విజ్ఞానమే ప్రగతికి సోపానమని డాక్టరుగారు నొక్కి చెప్పేవారని తెలిపారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మతోన్మాదుల ఆగడాలు,
దుశ్చర్యలు ఎక్కువైనాయని, కాని ప్రజలే చరిత్ర నిర్మాతలనేదిచరిత్ర చెప్పే వాస్తవమని, యదార్థమని ఉటంకించారు.

ప్రముఖ కథా రచయిత శిరంసెట్టి కాంతారావు మాట్లాడుతూ తన పుస్తకావిష్కరణ సభే డాక్టరుగారితో అఖరిదవటం కొంచెం బాధకలిగించినా, వారిచ్చిన ప్రోత్సాహం నేనెన్నటికి మరువజాలనని, వారి సూచనలతోనే నా కథలను ఎక్కువగా క్షేత్రపరిశీలన పిదపే ఆరంభిస్తుంటానని. ఈ మధ్యనే 
హంపీ వెళ్ళటం తటస్థించిందని, ఆ నేపథ్యంలో త్వరలో ఓ కథకు రూపకల్పన చేస్తున్నానని, పరిసరాల అవగాహన కవులకు అవసరమని తెలిపారు.

ప్రముఖ విద్యావేత్త, కవి, మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ 1989 నుండి 2000 వరకు వై.ఆర్.కె.తోనున్న అవ్యాజానుబంధాన్ని నెమరు వేసారు. ఎన్నో రాత్రుళ్ళు ఇద్దరం సుదీర్ఘ సాహిత్య, రాజకీయ, సామాజిక అంశాలపై గంటలతరబడి చర్చించుకునేవారమని తెలిపారు. నేను  రాసిన ' సమాంతర
ఛాయలు ' వై.ఆర్.కె. గారి చివరి రోజుల్లో అందించాను. వారిసాహచర్యంలోనే నాకీ హృదయస్పందన అలవదిందని అన్నారు. వస్తువుని నిజ దర్శనం చేయకలిగినవాడు మంచి కవి అవితాడం, ప్రతిపక్షం లేకపోయినా, కవులుంటే చాలని అంటూ, '' నాకు నమ్మకమివ్వండి '' అనే ఆలూరి బైరాగి
కవితను ఉటంకించారు.
డా. పిల్లలమర్రి సుబ్బారావు మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురియయ్యారు. కొడుకులా ఆదరించి, వైద్యవిధానంలో మెళుకువలు నేర్పి, ఒక వైద్యుడిగా ఇలా నిలబెట్టిన మహానుభావుని సాహచర్యం జన్మ జన్మలకు మరువలేనిదని గద్గద స్వరంతోతన బాధను అందరితో పంచుకున్నారు.  30 సంవత్సరాలు పైగా వారితో నడిచాను కాబట్టే, వారన్నట్టు  నేను కింద పడినా జెండాను కిందపడనివ్వనని, పైకేవుంచుతానని వారికి మాటిచ్చాను. అది నిలబెట్టుకుంటానని, వారి పేర సాహితి వార్డులు వారి పరోక్షంలో నేను అందించే కార్యక్రమాన్ని తలెత్తుకున్నందుకు కొంత మనశ్శాంతిగావుందని తెలిపారు. కవులకు అభినందనలు తెలిపి ముగించారు. 

కథా రచయిత శిరంసెట్టి కాంతారావు,  కథా రచయిత రాచమళ్ళ ఉపేందర్, సంపటం దుర్గా ప్రసాదరావు, గద్దపాటి శ్రీనివాసారావు, కవయిత్రులు  శ్రీమతి సునంద, సుభాషిణి తోట, నవతెలంగాణా ఖమ్మ జిల్లా అక్షరం సారథి, పాత్రికేయ కవి నామాపురుషోత్తం, కటికోఝ్వల రమేష్, కపిల రాంకుమార్లకు అమరజీవి డా. వై.ఆర్.కె. సాహితీ పురస్కారాలు అందచేసారు.
మేడగాని శేషగిరి, సంపటం దుర్గా ప్రసాదరావుల సమన్వయంలో దీపావళి కవి సమ్మేళనం ఆద్యంతం ఆసక్తికరంగా, దీపావళి టపాసుల్లా, ఆటంబాంబుల్లా, మార్మ్రోగి రసజ్ఞులైన శ్రోతలను అలరించింది. కవిసమ్మేళనం సినారె గజల్ తో శేషగిరి ఆరంబించి తన గాత్ర మాధుర్యంతో అందరిని మంత్ర ముగ్ధుల్ని చేసారు. దీపావళికీ కవుత్వం రాయొచ్చు అనే కవితలో గద్దపాటి శ్రీనివాసరావు '' పెరిగిపోతున్న పాపాలమీద,సంఘాలమీద, సంఘ్పరివార్లమీద, రాని పరిహారాలమీద,రాజకీయ పరిహాసాలమీద '' కవిత్వం రాయొచ్చంటారు. చిరునామా ఎక్కడ అనే కవితలో తాళ్ళూరిరాధ - మానవత్వాన్ని ప్రతిబింబించే స్త్రీమూర్తి వర్ణన చేసారు.  జనం అనే కవితలో పొత్తూరి సీతారామారావు అమృత హృదయాల్లో
నేడలజడులు రేగుతున్నాయని మదనపడ్డారు. తిరగబడ్డ అక్షరం అనే కవితలో సుభాషిణీ తోట  గంగాయమునలంత పవిత్రం మన సాహిత్యమన్నారు. ఆటవికయుగపుటంచులనే కైతను ఆరంభించిన జీవన్ కూరుకుపోతున్న సంక్షుభిత సందర్భాన్ని ఆవిష్కరించారు. డా. వై.ఆర్.కె.తో అనుబంధాన్ని
శ్రోతలకు పంచారు. ఏ సభలోనైనా మాట్లాదవల్సివస్తే అంశాలన్నీ గుదిగుచ్చుకుని, ప్రసంగం పక్కదారి పట్టకూండా చెప్పవలసింది అందరికి స్పష్టంగా చేరేలా తయారయివచ్చే పద్ధతి అందరూ  అలవర్చుకుంటే మంచిదన్నారు.  దీపావళి పర్వదినమనే కవితను జయప్రద '' మన మధ్య నరకాసురులెందరో ఇంకా మిగిలేవున్నారని ఆవేదనవ్యక్తం చేసారు. హేతువాద ఉద్యమనాయకుడు క్రాంతికార్  తన కవితలో మతోన్మాదాన్ని నిరశిస్తూ చెణుకులు విసిరారు.అక్షరం అనే గేయంలో రౌతురవి '' రంగు పూస్తే అక్షరకిరణం మసగబారిపోదురా'' శ్రావ్యంగా వినిపించి శ్రోతలను ఉత్తేజితులను చేసారు. బ్రతుకు వెలుగుల బాట అనే కవితలో కె. రమేష్  బతుకులను దోపిడి చీకటి గుహల్లోకి నెట్టేసే విధానాన్ని
తన ముద్రతో ఆకట్టుకున్నారు. సత్యభామ అనే కవితలో నందిగామ నిర్మలాకుమారి పౌరాణిక అంశానికి సామాజిక స్పృహ కలిగించే కొత్త కోణంలో ఆవిష్కరిస్తూ యిప్పుడు సత్యభామల అవసరం యెంతైనా వుందనేలా చదివి వినిపించారు. ఖమ్మం జిల్లా ఆధునిక కవిత్వంపై పరిశోధన చేస్తున్న తెలుగు జూనియర్ లెక్చరర్ నిజామాబాద్, పరిశోధనకు సంబంధించి తన అనుభవాలను కొన్నింటిని  శ్రోతలతో పంచుకున్నారు. అమ్మా నీకోఉత్తరం అంటూ దేవయ్య తన కవితలో భ్రూణ హత్యలను గర్హిస్తూ ఆర్ద్రత కలిగించారు. అవసరం అనివార్యమై అనే కవితలో వురిమళ్ళ సునంద  కోట్లాది ప్రశ్నలకు కొడవళ్ళే సమాధానాలి మొలవాలన్నారు. సరికొత్త దీపావళి అనే కవితలో రాచమళ్ళ ఉపేందర్ '' నేడు నరకాసురనికి నకలుగా మనిషి తయారవుతున్నాడని నేటి మనిషిపై చురకత్తులాంటి పదాలు విసిరారు.  కలం గొప్పదనమనే గీతాన్ని ఆవుల వీరభద్రం ఆలపిస్తూ '' పెన్నుమీద మన్ను పొయ్యద్దురా - అది గన్నై మొలుస్తుందిరా '' అంటూ అందరిని ఉత్తేజపరిచారు. భూప్రకంనల్లో అనే కవిత ఆలపిస్తూ ముచ్చర్ల ఇబ్రహీం '' పాటై పోటెత్తుతున్నాయి - భూ కంపనలన్నారు '' ఛాందసం సింహాసనమెక్కితే అనే శీర్షికతో  బండారు రమేష్  '' బుద్ధి జీవాలను శుద్ధి చేయడం కుదరదని, మట్టి పెళ్ళలా సంకెళ్ళను తెంచుకుంటాయని '' ఆక్రోశించారు. హెచ్చరిక అనే కవితతో జయరాజ్ తీవ్ర నిరసన స్వరాన్ని వినిపించారు '' వాడిపొట్ట అబద్ధాల పుట్ట '' ఏలికలని పీలికలను చేయాలన్నారు. మధ్యలో విజయ కళాశాల ప్రధానాచార్యుడు జంపాల మధుసూదనరావు మాట్లాడుతూ '' ఆవేశం లేకపోతే కవిత్వం రాదని, కవులు ఇతరులతో అనుభవాలను పంచుకోవాలని, ఆవేశంతో పాటూ ఆలోచన ఎంతో అవసరం అని వక్కాణించారు.   దివ్వెలు అనే కవితలో కపిల రాంకుమార్ ''రాయిని పగలకొట్టవు/ ఒక్క రాజుని మార్చలేవు/వందలు వెచ్చించి  టపాసులు ఎన్నైనా కాలుస్తారు కాని/చూస్తూ చూస్తూ పదిరూపాయల
నోటును కాల్చమనుండ్రి చూదాం!/గద్దెనెక్కిన నాయాళ్ళ  దిమ్మ తిరిగేలా భూచక్రాలు తిప్పి,ఆవుని అడ్డపెట్టుకునే రాచకీయం చేసేవాళ్ళను, /కుక్కకున్న విశ్వాసం లేకుండ గెలిపించినోళ్ళను కరిచేవాళ్ళను కుళ్ళపొడవాలనివుంది!'' వర్తమానసమాజాన్ని తన సహజమైన స్వరంతో  దీపావళితో అనుసంధానంచేస్తూ బాణసంచాలంటి పదాలతో పోల్చటం వాటిని కాల్చినంత ఆనందం కలిగింది.
 శ్రోతలకు. శ్రీమతి ఉరిమళ్ళ సునంద వందన సమర్పణ కావించారు.
- 24-11-2015



18, నవంబర్ 2015, బుధవారం

BHASKAR: కవి పరిచయం -1

BHASKAR: కవి పరిచయం -1: శిష్ ట్లా ఉమామహేశ్వర రావు ( 1912 – 1953) మారో మారో – మారో మారో ఒకటి రెండూ – మూడు నాలుగు మారో మారో – మారో మారో .................

10, నవంబర్ 2015, మంగళవారం

కపిల రాంకుమార్‌ || మనాది ||

కపిల రాంకుమార్‌ || మనాది ||
బువ్వకే గతిలేదు
యిగ దివ్వెల పండుగొచ్చి మీదపడుటేంది!
మనాదితో ఏడుకండేల బావిలో
పునాది తవ్వుకున్నాట్టు బతుకు
కునారిల్లుతుంటే
కాకరపూల సోయగమేమెక్కుతాది?
పసికూనల ముఖాలువాడివత్తలైతావుంటే
తాగ పాలు లేవు, అయితే మాన్లే
గంజినీరు కరువాయే!
మతాబులు కాల్చే తీర్కేడిది
యింటి సుట్టు మురుగుతో
దోమలతోలేటందుకే సరిపోతుంటే
పైసలువెట్టి పండగేట్టా సేత్తాననుకున్నావు?
సర్రున తారాజువ్వలెగరేసే దమ్ములేదు
అవేమీ అంబరాన్ని తాకలేవు
భళ్ళున కిందవడుడేకాని,
పైకెళ్ళిన ధరల్ని దింపేటివి కావుకదా
కర్సుదండగ!
ఒక్కమాట సెప్పాలే
కుదిరితే విష్ణు చక్రాలు తిప్పాలనివుంది
లోకమంతా తలబిరుసునాయాళ్ళ తలలు నరకాలిగంద!
చిచ్చుపెట్టే బుద్ధులున్న జనాల మధ్య
తుస్‌ బుస్సుమని చిచ్చుబుడ్లు యేం సరిపోతాయి ?
మట్లాడితే గయ్‌గయ్‌మని పైకి ఎగరటమే కాని
ఆకాశాన్ని అందుకోలేరు,
ఆవకాశాల్ని దొర్కబుచ్చుకోలేరు
మనకుర్రకారు రవ్వల రాకెట్టు లాగా పైకి ఎగిరినట్టే
ఎగిరి కిందపడటమే కదా!
అప్పుడప్పుడు చిటపటమంటూ ధర్నాలు
బందులు సేసుడే కాని సీమటపాకాయంత విలువావుండది
అఁ.. సెవులు  సిల్లులుపడేలా దేబురింతలు, డాబుసరి డప్పులా
కొద్ది ఔట్లు, మరొకొన్ని ఆటంబాబులు
ఆకాశరామన్న ఉత్తరల్లా డబాయించుడే కాని
ఒక్క రాయిని పగలకొట్టవు
ఒక్క రాజుని మార్చలేవు
వందలు వెచ్చించి  టపాసులు ఎన్నైనా కాలుస్తారు కాని
చూస్తూ చూస్తూ పదిరూపాయల నోటును కాల్చమనుండ్రి చూదాం!
గద్దెనెక్కిన నాయాళ్ళ దిమ్మ తిరిగేలా
భూచక్రాలు తిప్పి,
ఆవుని అడ్డపెట్టుకునే రాచకీయం చేసేవాళ్ళను,
కుక్కకున్న విశ్వాసం లేకుండ గెలిపించినోళ్ళను కరిచేవాళ్ళను
కుళ్ళపొడవాలనివుంది!
తాటి బుర్రలో పటాసు మందు దట్టించి
తోలు లేచేలా దిష్టి యంత్రాలు పెట్టాల్నుంది.
ఎన్ని సట్టాలు సేసినా, ఎన్ని డేగకళ్ళు నిఘా కాసినా
ఆగని అత్యాచారాలమీద మన్నువడ
దాష్టీకం చేసేటోళ్ళ హంసలను లేపేయ్యాలనివుంది
కాని హింస మార్గం కాదు కాని
దుమ్మెత్తిబోసి శాపనార్థాలుకు తప్పులేదు
అప్పుడు కాని నా మనాది
కుదుటపడదు.!

 

7, నవంబర్ 2015, శనివారం

కపిల రాంకుమార్‌ || తెగింపు కావాలి!||

కపిల రాంకుమార్‌ || తెగింపు కావాలి!||
'' ఆడది అంటే
అలుసా
ఆడించినట్టు ఆడుతుందనా?
కాని
నేటి
ఆడది
'' ఆడ '' ది కాదు ఇక్కడిదే,
ఇప్పటిదే!
నీ జాఢ్యం వదిలించే
పెద్ద బాడిశవుతుంది
మదాన్ని చిత్రిపట్టి పొరలుగా చెక్కుతుంది
అతిచేస్తే
ఉత్తుత్తిగా కాదు
తిత్తితో సహా
కత్తిరిస్తుంది ''
తెగించిన వాడికి తెడ్డే లింగమయితే
తెగింపు కలిగినదానికి అరచేయే
ఖడ్గంమవుతుంది! ''
ఈ నాకల నిజంకావాలని
కలాన్ని, గళాన్ని
మహిళలన్ని కోరుకుంటాను!
7.10.2015

3, అక్టోబర్ 2015, శనివారం

కపిల రాంకుమార్ ||తెలంగాణా దూర్జటి కాళోజీ||

కపిల రాంకుమార్ ||తెలంగాణా దూర్జటి కాళోజీ||
మొహమాటంలేకుండా
ఏకిపారేసుడులో పెద్దన్న
తప్పుడు పాలకులెవరైనా
తన మాటల వేటుకు తప్పించుకోలేరన్న!
రాజుల్ మత్తులు వారిసేవ నరక ప్రాయమన్న,
దూర్జటికి కంటే నాలుగాకులు మస్తుగ సదివిండు!
పోతనకుమల్లే రాచరికపు భజన కాదని
ప్రజాస్వామ్యమే వంటపట్టించుకున్నోడు గనుకే
ప్రజా కైతల సేద్యం చేసిండు!
శిశుపాలుని తప్పులలెక్కపెట్టి
సర్కారుచెవుల సిల్లువడాల్సిందే కాని
గిసుమంత కూడ వెనుకడుగేయలేదు!
సప్పుడు ఎక్కువే - ఘాటైన మాటలతో
ముక్కు సూటిదనం చూపుకూడా సూదంటిరాయే!
ప్రజల సోయి యాదమరిస్తే
బొందపెట్టేది నిక్కమన్నాడు
కౌన్సిల్లో సర్కారుకు చాకిరేవు పెట్టిండు
బొక్కసానికి చిల్లుపెడితే
డొక్క చించుతానన్నాడు
కాళమునకు ఖలేజా అద్దినట్టుండే
కైతల రైతుబిడ్డ కాళోజి!
నోరెత్తటం ఏ సర్కారుకీ యిష్టముండదు
నోరెత్తకపోతే కాళోజి కలం నడువదు!
రెంటికెపుడూ గొడవే
పోరాటంచేయకతప్పదు
పోయేవి బానిస సంకెళ్ళు అన్నట్టు
రాష్ట్ర, దేశ పాలకవర్గాలపై
పదునెక్కన పాటలా
అదునుచూచి పేలే తూటాలా
ఎందరికో స్ఫూర్తినిచ్చిండు!
బడుల యిజ్జతు, దవఖాన్ల తీరు,
చట్టసభల తగువులాట
నీటికాడ, కూటికాడ
బతుకుతెరువు పాకులాట
పెత్తనాల తగాదాల గొడవెలెన్నో
నీ, నా గొడవగా చేదీపమందించి
దోపిడి చేస్తే దోస్తానాలుండవు
తోటోడైనా సంజోతాలుండవ్
ఏ పార్టీ వాడైనా వాడు ఏ పాటివాడో
తీరుమానం చేయాలంటాడు!
మంచి సబ్బరిలేకుండా
పాలన చేసేటోడు
మావోడైనా, మీవోడైనా
మావో చెప్పినా మార్క్స్ చెప్పినా
మంచి మంచే, చెడు చెడే
బేరీజువేసుకోమన్నాడు!
గసుమంటోడు కాబట్టే
తాను బతికున్నన్నాళ్ళు
మూడోనేత్రంతోనే లోకాన్ని చూసాడు!
మనలనీ చూడమన్నాడు!
ప్రజల పక్షం వహించమన్నాడు!.
9849535033

అల్విదా || కౌముది ( కీ.శే.||షంషుద్దీన్‌-ఖమ్మం ]

అల్విదా || కౌముది ( కీ.శే.||షంషుద్దీన్‌-ఖమ్మం ] ||
గీత శిల్పి వెళ్ళిపోయాడు - గీతం తెగిపోయింది
ఏ సంకేతమూ లేకుండా - ఎవ్వరికీ చెప్పకుండా
అనుకోకుండా తెగి గాలిలో - కరిగిపోయే నక్షత్రంలా
అకస్మాత్తుగా జారి - మట్టిలో కలిసిపోయే కన్నీటి చుక్కలా
ఉన్నట్టుండి హఠాత్తుగా - సభలో మధ్యలో తలవంచుకొని
షాయర్‌ వెళ్ళిపోయాడు - ముషాయరా ఆగిపోయింది
పరువం పోయింది - పరిమళం పోయింది
కవి హృదయం పోయింది - కవి ఉదయం పోయింది
సొగసు పోయింది - సోయగం పోయింది
ఆదమరచి నిద్రపోతున్న బీదరాలి వక్షస్థలం మీద
సామాన్యుడు భద్రంగా దాచుకున్న
చిర రుచిర స్వప్నాల కెంపుమీద కవిత్వం సొంపు మీద
తిలంగన్‌మీద తెలుగువాడిమీద -
భాగమతిమీద అభాగ్యులందరి నడినెత్తిమీద
మొన్న రాత్రి హఠాత్తుగా మిన్ను విరిగి పడిపోయింది.
గీత శిల్పి వెళ్ళిపోయాడు - జ్యోతి ఆరిపోయింది
జైళ్ళను, కన్నీళ్ళను, రైఫిళ్ళను, రాపిళ్ళను
సోదరులందరితో కలిసి - సాదరంగా పంచుకున్నవాడు
రాళ్ళను కవ్వించినవాడు - మోళ్ళను నవ్వించినవాడు
పరిస్థితుల కఠిన శిలా వర్షాలకు -
పగిలిపోనిమాదర్శాల గాజుమేడ కట్టినవాడు
వర్గాలు, వర్ణాలు వైషమ్యాలులేని - స్వర్గాలకోసం కలగన్నవాడు
అరుణధ్వజానికి అరుణోషస్సుకని -
ఎర్ర ఎర్రటి ఆశలకు - ఎర్రటి కలలకు
అంకితమైనపోయిన దీన బంధువు -
బిందువులో ఇమిడిపోయిన సింధువు
అవనిని ఆకాశానికి ఎత్తినవాడు -
ఆకాశాన్ని అవనిమీదకు దింపినవాడు
నిప్పులో మంచును - మంచులో నిప్పును పుట్టించినవాడు
ఆడవాళ్ళ చొల్లులో అబద్ధాలలో - సానివాడల్లో సారాయి కంపుల్లో
నగ్నంగా చివికిపోయిన కవిత్వానికి - అగ్ని భిక్ష పెట్టినవాడు
ఉడుగనాల చెక్కిళ్ళమీది ఉజ్వలమైన వెలుగును
వసంతాలకాంతినీ, క్రాంతినీ మేళవించి
సంధ్యారాగసలిలాన్నీ జ్యోత్స్నాద్రవాన్నీ కలిపి
అపురూపమైన శిల్పాలకు రూప సృష్టిచేసినవాడు
శబ్దాలకు ప్రాణంపోసి సమరాలకు నడిపించిన కవి
అపరాత్రి ఆకాశంమీద పొడచూపిన అర్ణఛవి
కలంవిడిచి, కలల్ని విడిచి, కలకలం విడిచి
రక్తం కక్కుతున్న క్షోభనూ, క్షామాల్నీ విడిచి
అట్టకట్టిన చెక్కిళ్ళానూ, క్రక్కటిల్లుతూన్న పెదవుల్నీ విడిచి
ఆకాశాన్ని చిల్లులు పొడిచే నిట్టూర్పుల్ని విడిచి
దు:ఖాల కొండల్నిమోస్తూ తిరిగే చిన్నచిన్న గుండెల్ని విడిచి
ఉదయాల్ని విడిచి
సాహిత్యపదాల్ని విడిచి
వెన్నెల పువ్వుల్నీ, పువ్వుల నవ్వుల్నీ విడిచి
ఇంద్ర ధనుస్సుల్నీ, మందమారుతాల్నీ, తోటల్నీ, తూనీగల్నీ విడిచి
సొంతగుండెలు దగాచేసే సంఘాన్ని విడి
స్వరాన్నీ, సంగీతాన్నీ జీవిత సర్వస్వాన్ని విడిచి
గీత శిల్పి వెళ్ళిపోయాడు!
గీతం తెగిపోయింది.
********************************
స్మృతికవిత - తెలంగాణా మహాకవి మఖ్దూం మొహియిద్దీన్‌ మృతికి
స్పందన)
( కాకతీయ యూనివర్శిటి డిగ్రీ - తెలుగు పాఠ్యాంశం )
----------------------------------------------------

22, ఆగస్టు 2015, శనివారం

కపిల రామ్‌కుమార్‌|| ఘర్షణ||

కపిల రామ్‌కుమార్‌|| ఘర్షణ||
ఊహ కళ్ళు తెరిచేలోగా
ఒళ్ళు విరుచుకుంటోంది కుతంత్రం!
లోచనాల ఆలోచనలను
రక్షించుకునేలోగానే
అంధత్వం పురుడుపోసుకుంటోంది!
గోడలకున్న రహస్యనేత్రాలు మాత్రమే
ఇలాంటి ఛిద్రాలకు ఒడికట్టుతాయ్‌!
అమాయకంగా ప్రతీసారి
ప్రజాస్వామ్యం
మోసగించబడుతూనేవుంటుంది!
నిర్బంధాలనెన్నో సహిస్తూనే
ఉద్యమం కొత్తదారి వెతుక్కుంటూవుంటుంది!
నిఘా కుక్కలుకూడ
తేనెపూసిన కత్తులవుతూ
అదును చూచి దెబ్బకొట్టడానికి
రెచ్చకొట్టే క్రీడానైపుణ్యం పెంచుకుంటూంటాయి!
నిబ్బరంగావుంటేనే నిజాయితి
బట్టకట్టి తలెత్తుకోకలుగుతుంది!
లేదా అన్యాయం వంచనా పథంలో
మిడతలదండునాదర్శంగా
పంటచేల నాశన కార్యం మొదలెట్టుతుంది!
నిరంతర ఘర్షణల్లో తలమునకలువేస్తూ
ఎత్తుగడల పంథా అనుసరించకపోతే,
అన్ని వర్గాలను సమకట్టకపోతే
గమ్యం గగనకుసుమమే అవుతుంది!
వైరుధ్యాల పొత్తుల పోటాపోటీలో
సమైక్య గమనమే అక్షర క్షిపణుల సాయంతో
సాంస్కృతిక విప్లవ చైతన్యంతో
పావులు కదిపితేనే
ప్రగతిశీల పావురం
స్వేచ్ఛగా ఎగరకలుగుతుంది!
సరళీకృత పడమటిగాలిని
నివారించకలుగుతుంది!
దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై
మనమే కొత్తరూపమెత్తాలి !
================
22 ఆగష్టు 2015 ఉదయం 9.45

20, ఆగస్టు 2015, గురువారం

కపిల రాంకుమార్‌||స్వప్నీకరణం||

కపిల రాంకుమార్‌||స్వప్నీకరణం||
--------------------------------------
శబ్ద చిత్రాలు
నిశ్శబ్దపు పరుగులతో
భావచిత్రాల్లా సింగారించుకుని
పాపిడి పిందెలతో పోటీగా
ముంగురులు సవరించుకుంటూనే
పద చిత్రాల లేజిగుర్లకై
వెంపర్లాడే కోకిలచానలౌతుంటే
రెండువేళ్ళ మధ్య ఓ కలం
కూచిపూడినాట్యం చేస్తూ
ఆరంగ్రేట్రం మొదలెట్టినపుడు
సుష్టుగా భుక్తాయాసం తీర్చుకుని
తాపీగా కుదుటపడ్డ కవి మానసిక స్థితికి
సాహిత్యపు సాయంకాలపుతెర
సీతమ్మవారి చీరలా అంబరాన
రంగులతో మురిపుస్తూ
మెరుస్తూ అందమైన
అపరంజి పద్యమై,హృద్యంగమమై
ఆహ్లాదపరుస్తున్నప్పుడు
కొంపలంటుకున్న రీతిలో
భీకర తుఫానులా
సమస్యల తోరణాలను తెగ్గొట్టే
నిబద్ధత తలకెత్తుకుని
నిమగ్నతతో
ధిక్కారస్వరమొకటి
సర్కారీ దివాళాకోరుతనంపై
సంధించిన కవితాశరంలా
విప్లవస్వరాలతో ఉత్తేజాన్నిస్తూ
నినాదమై, విధానమై గానమౌతున్నప్పుడు
అరుణారుణ కిరణాలకు
తక్షణ ప్రేరణపొందిన
పద్మాలన్ని శిరమెత్తిన కంఠంతో
జయహో కవిత్వంగా నినిదిస్తాయ్‌
రాబోయే మార్పును స్వప్నీకరణం చేసుకుంటూ!
-------------------------------------------------

17, మే 2015, ఆదివారం

కపిల రాంకుమార్‌ \\ అగాధం పూడ్చాలంటే \\

కపిల రాంకుమార్‌ \\ అగాధం పూడ్చాలంటే \\
పథకాలు ఊరిస్తున్నాయ్‌
ఫలితాలు నీరుకారుతున్నాయ్‌
హెచ్చరికలు జారీ అవుతున్నాయ్‌
అవినీతి పర్వాలు పెచ్చరిల్లుతున్నాయ్‌
వాగ్దానాలు గాలిబుడగలై పేలుతున్నాయ్‌
స్వచ్ఛత డాంబికమై
అన్నిట పందులు కుక్కలు కాపురాలుంటాయి!
యోచనవుంటే శౌచాలయం మాట అటుంచి
విద్యా,వైద్యాలయాల్లో
శిథిలమైన  వాటిని సంస్కరించండి!
అభివృద్ధికి - అథోగతికి
మధ్య అడ్డుగోడై
నిబద్ధత నిజాయితీ మరిచి  నిద్రపోయేందుకు
కంకణం కట్టుకుని నిమగ్నమైనపుడు
ఆదర్శాలు వల్లెవేయటానికే తప్ప
ఎందుకూ కొరగానివౌతుంటాయి
అందనంత ఎత్తులో ధరలో ధరలు
స్వైరవిహారం చేస్తుంటే
అందుకోలేని సామాన్యం
అగాథంలోకి కూరుకుపోతుంటే
ఏలికలకు పట్టదు సరికదా
పట్టించికోండని ప్రతిపక్షం గోలచేస్తే
నిర్బంధాలు తెరమీదకొస్తాయి
లాఠీలు, తూటాలు రోడ్లపై నగ్ననృత్యం చేస్తుంటాయ్‌!
పెదాలపై చిరునవ్వే ప్రగతికి దర్పణం అంటూ
గ్లోబలులతో కరచాలనంచేస్తూ
జనాల క్షుద్బాధను గమనించక
ఊబకాయం పెంచుకుంటారేకాని
ఊపిరిపోసే సంగతి మర్చిపోతారు
ఇప్పుడు
ముక్తాయింపు పలుకులు, కులుకులు కాదు కావలిసింది
ఎవరో ఒకరు పచ్చ జెండా వూపి
పలుగులతో తవ్వి మూలాలతో సహా
పెకిలిస్తే కాని ఆ అగాథం పూడదు
బండి గాడిలో పడదు.!

16.5.2015

26, ఏప్రిల్ 2015, ఆదివారం

కాళ్ళ క్రింద కృంగిన నేల

కపిల రాంకుమార్‌ \\ కాళ్ళ క్రింద కృంగిన నేల \\ ----
'' గత కాలంలో జరిగిన  గుజరాత్‌ భూకంప స్పందన కవిత యాదికొచ్చిందీ సందర్భంలో ''

భూకంపపు కౌగిలిలో-దీర్ఘనిద్ర నిర్యాణం
విశ్వరూప నర్తనలో-ప్రకృతెంత కాఠిన్యం!

గుండెపగిలి అండచెదరి-మండుచున్న ప్రళయాగ్ని
చరితలోన మరువలేని-శవ యాత్రల త్రేతాగ్ని!

తల్లిలాంటి నేలతల్లి-తల్లక్రిందులాయె
తల్లిలేని పసికందులు-తల్లడిల్లిపోయె

చెట్టుకొకరు పుట్టకొకరు-తోడులేని పక్షులాయె
పొట్టమాడి బట్టలేక-వీథిలోన బతుకులాయె

వితరణలో వివక్షతో- ఆలస్యం విషమాయె
ఆదరణకు నోచుకోక-ప్రతి యెదలో గుబులాయె

ప్రపంచాన మంచితనం కొంచమైన బతికున్నది
పంచదొరకు ఆశతో బాధిత జనమున్నది
మత రహితం కులరహితం సహాయాల ఆశయం
తోటివారినాదుకొనుట మనుగడకది నిలయం!