Monday, December 31, 2012

వెనుకకు తిరిగి చూసుకో

కపిల రాంకుమార్ || వెనుకకు తిరిగి చూసుకో||
కొత్త సాలు సంబరాలు అంబరాలంటేలా
చేసుకుంటున్నావు సరే
నీ సాలు మార్చుకుని కొత్త నిర్ణయాలు తీసుకొని
గతంలోని పొరపాట్లు పునరావృతంకాకుండా
దిశ మొలవేసుకొని వెక్కిరిస్తున్న గతాన్ని
నెమరువేసుకో!
కండ కావరంతో నీ చేష్టలను బేరీజు వేసుకోకుండా
పున:పున: తప్పులుచేసుకుంటూ పోతే
పుట్టగతుల మాటటుంచి
పుట్టి మునిగే సందర్భం, సమయం
నీ కోసం పొంచివుంది!
వెనుకకు తిరిగి చూసుకో

Thursday, December 27, 2012

||ప్రణయ తత్వము |

కపిల రాంకుమార్ ||ప్రణయ తత్వము ||(అష్టావధాని వడ్డాది సీతారామాంజనేయులు- రచయిత )
మ|| సెలయేరులు నదింజేరు, వహినులొగింజేపటుల వారాశి గ
మ్రలసద్దివ్యసమీరణంబొలయు సౌరభ్యక్యమాధుర్యతా
కలిమిం, విశ్వనియంతృతం జగతి నేకాకిత్వమేలేదు, పొం
దలరుం, గావున నిన్నుజేరుటకు నేలానాకు శంకింపగన్ !
సీ|| పరికింపుమా! వియద్భాగంబు జుంబించు
ప్రాంచుదుత్తుంగ పర్వచయంబు
అవె తరంగంబులన్యోన్యసంశ్లేషాను
మోద పయోరాశి బొదలుచుండు
జంటపూవులు పరస్పరమనుజాతుల
క్రియనుండుదమి నేవగింపులేక
తిలకించువేయి చేతుల నంశుమంతుడే
యవనిబరీరంభమావరించు
గీ|| చంద్రకావళి ముద్దాడు సలిలరాశి
నిన్ని ముద్దుల మురువులవన్నియెన్న
నేమికొరయగును? నిప్పుడింపెసగ్ మెసగ
హర్షమున నీవు నన్ను ముద్దాడవేని!
అంగ్ల మూలము : షెల్లీ :27-12-2012 సా.6.23 (నౌడురి మూర్తిగారికి ధన్యవాదములతో)
ఆంగ్ల మూలము : షెల్లీ
The fountains mingle with the river
And the rivers with the Ocean,
The winds of Heaven mix for ever
With a sweet emotion;
Nothing in the world is single; _5
All things by a law divine
In one spirit meet and mingle.
Why not I with thine?–
2.
See the mountains kiss high Heaven
And the waves clasp one another; _10
No sister-flower would be forgiven
If it disdained its brother;
And the sunlight clasps the earth
And the moonbeams kiss the sea:
What is all this sweet work worth _15
If thou kiss not me?

Tuesday, December 25, 2012

ఆదిలాబాద్ అందాలు - నిర్మల్ సిటి వెబ్ సైట్ సౌజన్యంతో



















కవి గారి కాన్వాస్

కపిల రాంకుమార్||కవి గారి కాన్వాస్ ||

పేదరికపు పైట చిరిగి భారతమ్మ నిలబడితే
మదపుకళ్ళ వెధవలు లొట్టలేయచూస్తారు!

తల్లి, చెల్లి, వావి వరుస కానలేని కామాంధులు
మానవతా మనుగడను కాల్రాయచూస్తారు !

వెర్రి తలల ఉద్రేకం పుర్రెదొలిచే దాష్టీకం
పువ్వుల్లో గుంపాలు దిగవేసే ప్రావీణ్యం!
ఊదేస్తే యెగిరిపోవు పేలపిండి మాదిరిగ
కీచకు్ని సోదరులై ఆచరింపచూస్తారు!

'' గౌతము ' ని బోధనలు అధ్యయనం చేయరు
భద్రంగా జనాలను నిద్రకూడపోనివ్వరు!
కొంతమంది కుర్రవాళ్ళు నాజీలకు వారసులు
మధ్యయుగపుటలవాత్లను మానలేని వానరులు!

ముందుచూపున్నవాడు రెండు శ్రీల కళ్ళజోడు
కుర్రవాళ్ళ చేష్టలపై ''లిరిక్కులు "చెప్పినాడు
ఊపేసే బొమ్మలతో యువతరం నిర్వీర్యం
నిత్యకృత్య యాగీలతో అంతులేని కార్పణ్యం!

ముదనష్టపు బుద్ధులు మారాలని
మదమెక్కి భవితను తుంచుకోకండని
పశువుల కన్నా హీనంగా మారకండని
హెచ్చరిక! విన్నారా సరే! లేదా ..చెప్పం!
చేసే చూపిస్తాం - పదుగురికి తెలిసేలా
నలుగురిలో నిలేస్తామో- చీరేస్తామో! చీర లిస్తామో...

25.12.2012
10.14
ఇంత ఉవ్వెత్తున నిరసన వ్యక్తమౌతున్నా నిన్న, మొన్న అఘాయిత్యాలు జరుగుతూనే వున్నందుకు నిరసనగా.

Thursday, December 20, 2012

పదవీ విరమణుని వ్యధ

కపిల రాంకుమార్|| పదవీ విరమణుని వ్యధ ||

మామయ్యా! ఖాళీయే కదా,
యేడ్చు పాపను ఆడింపవయ్యా!
ఏమయ్యో! రైతు బజారునుండి
కూరలు తెచ్చిన నీ సొమ్మేమి పోవునయ్యా!
రావయ్యా! రచ్చబండ తగువులు తీర్ప
రాకుంటివదేమి సోద్యమయ్య
కోడలు, ఆలియు, స్నేహితులాట
పట్టింతురిల పదవీ విరమణుడగు నన్ను! -1

***

వింత చోద్యమదేమొగాని
ఉద్యోగం చేసినన్నాళ్ళు
ఎంత ప్రేమయొ, యెంత అభిమానమొ
చూపుదురెల్లరు,
గంతకు తగ్గ బొంతగు రీతి
తొలగింతురు ఇంతకు నీవు
పదవీ విరమణుడగుట వలననే! -2

***

తుమ్మిన, దగ్గిన అయ్యో అటంచు
జాలిపడరు!
పొమ్మనకనే పొగపెట్టు చందమున
చులకన కావింతురు
దిమ్మ తిరిగినట్లున్నదని
వాపోవ యేమి ఫలము
నీ సొమ్ములు తిన్న విశ్వాసము
లేని వారైరి ఆలును, బిడ్డలు
పదవీ విరమణుడగుట వలననే - 3

***

వచ్చు ఫించను చాలదు!
స్వచ్చతగల శాకములు
అమరవు,
నేడు పెచ్చరిల్లిన ధరాఘాతాన బలై
పచ్చడి మెతుకులె ముసలి బతుకుల్
పదవీ విరమణుడగుట వలననే -4

***

బాధ్యత తీరిన వారి సంగతి అటుంచు
బధ్యత తీరని వారి గతి అతిఘోరము
మిధ్యయగు లోకమున ఆడు పిల్లల
పెండ్లిచే్యగా, నీ బాధ్యతలందు ఆదుకొను
వారు లేరిల -పదవీ విరంనుడగుట వలననే - 5

***

అవశాన దశయందు ఆదుకొనుటకు
కొడుకేడని చూచుచున్నావా?
పరదేశాం మూటలు కట్టుకొను నెపమున
దాగి భవబంధములన్ని
ధన బంధములుగ మార్చుకొనుటకు
అవలేశ్ము సిగ్గులేక తల్లిదండ్రుల
చూడ ఇచ్చగించడు - పదవీ విరమణుడగుట వలననే - 6

____________________________________________
20.12.2012 (ఇది యెవరినీ నొప్పించడానికి కాదు. యిది చందస్సు అనుకొని దోష శోధన చేయ పనిలేదు.--సరదాగా లోక రీతిని వ్యక్తీకరించానంతే)

Wednesday, December 19, 2012

kavi sangamam: Krishna veni's Poem -Amma kodaka

kavi sangamam: Krishna veni's Poem -Amma kodaka

kavi sangamam: Varna Lekha Poem

kavi sangamam: Varna Lekha Poem

బివివి ప్రసాద్: మాతృభాష

బివివి ప్రసాద్: మాతృభాష: మాతృభాష మాట్లాడుతున్నపుడు ఎలావుంటుంది పసిదనంలో అమ్మ ఊయలలోవేసి జోల పాడుతున్నట్లుంటుంది ఆమె గారాబు చేస్తున్నట్టూ, ఆటళవేళల ఆతృతగా హెచ్చరిస్తున...

ప్రజ్ఞ: యాపిల్ తెలుగు కీబోర్డ్ వాడేవారికి ఒక మంచి చిట్కా

ప్రజ్ఞ: యాపిల్ తెలుగు కీబోర్డ్ వాడేవారికి ఒక మంచి చిట్కా: యాపిల్ తెలుగు కీబోర్డ్ అలవాటు ఉన్నవారికి కొత్తగా కంప్యూటర్‌లో ఆ సెటప్ పెట్టుకోవడానికి సాధారణంగా రెండు మార్గాలను అనుసరిస్తున్నాం. 1) అనూ ఫాం...

Monday, December 17, 2012

తెలుగు వెలగాలి

కపిల రాం కుమార్ ||తెలుగు వెలగాలి!

భాష అంతరించిపోతుందనేది
ఒక గ్లోబల్ ప్రచారమైంది!
దానికి కారకులం ప్రేరకులం మనమే!

కమ్మనైన అమ్మా అనే పిలుపును
మమ్మీగా విని ఆనందించడం!
నాన్నగారూ అని పిలిపించుకునే బదులు
డాడీ! పాతకాలపు సారాజాడీగానో
పిలిచినట్లున్నా యెంత ఆనందమో?

మనకు ప్రేమలెక్కువ,
హృదయవిశాలతాయెక్కువే
ఎవరొచ్చినా ఆదరిస్తాం
ఏ మాటనైనా కలుపేసుకుంటాం!
ఆంగ్లం కాని, పార్శీకాని,ఉర్దూ కాని,
తెలుగును పక్కకునెట్టి
అవి ఆక్రమించుకున్నాయి కాబట్టే
తెలుగు మరుగున పడిందని కొందరు
మురుగులో పడిందని కొందరు
అంటున్నారంటే మనమే దానికి బాధ్యులం!

భాషకోసం చదువుకాక,
మార్కులకోసం సంస్కృతం
రాసే వాళ్ళ జ్ఞానమెంతో
తెలియంది కాదు!

ఉభయ భ్ర్ష్టష్టత్వం - ఉప్పరి సన్న్యాసంలా
''న గర్ కా - న ఘాట్ కా" లాగ
ఆంగ్లము రాదు - తెలుగూ రాదు
త్రిశంకు స్ఫర్గంలోకి నెట్టుతుంది మనమే!

సుమతీ శతకం-వేమన శతకం
అటకెక్కించాం! పెద్దబాల శిక్ష
చదవటానికి వెనుకంజ వేస్తాం!
అప్పటి వారి జ్ఞానమంతా అక్కడిదేదని తెలు్సుకోం!

పాత చింతకాయ పచ్చడని నిరాకరించినా
పథ్యానికి మళ్ళీ అదే కావాలి సుమా!
మనం జ్వర పీడితులం
సంజీవనిలాంటి తెలుగు ఔషధం కావాలి

ఎయిడ్స్ కన్నా ఘోరంగా పరభాషా మోజు
మనల్ని కృంగదీస్తుంటే!
రకరకాల బలవర్థక మందులేవీ పనిచేయవు
ప్రాథమికమైం తెలుగును
పునరుద్ధ్రరించకుంటేనే
భావికి తెలుగు వెలుగును సజీవంగా అందించగలం
విశ్వవ్యాప్తంగా తలెత్తుకుని తిరగగలం!
పొరుగు రాష్త్రాల వారు తమ భాషాభివృద్ధికి కృషి చేస్తుంటే
మనం గుడ్లప్పగించి చూస్తున్నామే కాని
అణువంతైనా శ్రద్ధ తీసుకుంటున్నామా
ప్రశ్నించుకుందాం!
భాషాభివృద్ధికి నడుముకట్టుదాం!

కపిల రాం కుమార్

ఏం తినేటట్టు లేదు

...
సవ్వడి డెస్క్ Sun, 16 Dec 2012, IST ప్రజాశక్తి

ఏం తినేటట్టు లేదు 

 పాటగా బావుందని చప్పట్లు కొడతాం

డీజిల్‌ పెట్రోల్‌ రేట్లు పెరుగుతున్నా,

విద్యుత్‌ కోత చాలదన్నట్లు ధరల వాత పెడుతున్నా,

కిలో సరుకులు సగానికి తగ్గినా


ఖర్చు రెట్టింపైనా, జేబు చిల్లు పడినా,

కూలి పెరిగి, కూటికి చాలకపోయినా,

దోమ కాట్లకు జనం చస్తున్నా,

కాకుల తరిమి గద్దల్ని మేపుతున్నా,

ఎవరూ మాట్లాడరేం?

పీక తెగ కోస్తున్నా

స్పర్శలేని మౌనమేమటో!

ఎవరికి పుట్టినబిడ్డో వెక్కివెక్కి యేడ్చినట్లు

ధర్నాలు రాస్తా రోకోలు ప్రతిపక్షాలకేనా?

చానళ్ళకు చేతినిండా పనేనా?

చేతులతో గుద్ది

చేతులు కాలిం తరువాత

యే ఆకులు పట్టుకుని యేం లాభం!

ఐదేళ్ళు ఆగాల్సిందేగా!

కత్తిలాంటిది చేతులో వుంచుకొని

ఉపయోగించలేని ఓటరును ఆపుతున్నదేమిటి?

పైగా ప్రజాలు చైతన్యవంతులంటారేం

ఏది ఆ చేతనైనతనం???

మొలబంటిలోతులో దిగబడ్డా బుద్ధిరాదా!

నిండా మునిగిన తరువాత చలేమివుండకపోవచ్చు, కాని

మునిగే వుంటే శ్వాసే ఆగుతుంది కదా!

ఆ మాత్రం ఇంగితం లేదా?

తిగుబాటు ధ్యాస కలుగదా?

శ్వాసే ఆపుకుంటారా?

- కపిల రామ్‌కుమార్‌.

అంకురాలు

కపిల రాంకుమార్|| అంకురాలు||

రాజకీయ వికారమా - భాజనీయ వివేకమా!
రోజువారీ విధానమా - రాజుకున్న వివాదమా!
కారణాల పునాదిలో - కీరవాణీ సరాగమా!
మారుతున్న కాలానికి మౌనమైన కలమా!

17.12.2012

Speach of Siva Reddy Garu at Kavi Sangamam Poetry Festival | బ్లాగిల్లు —తెలుగు బ్లాగులు & వార్తలు : Telugu Blogs and News Aggregator

Speach of Siva Reddy Garu at Kavi Sangamam Poetry Festival | బ్లాగిల్లు —తెలుగు బ్లాగులు & వార్తలు : Telugu Blogs and News Aggregator

Sunday, December 16, 2012

తాంబూలాలిచ్చాం

కపిల రాంకుమార్||తాంబూలాలిచ్చాం||

తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి
అన్న నానుడి సర్కారుకే చెల్లింది!
ఉపస్థ మినహా కన్యా దానం చేయటమూ
సర్కారుకే ఒప్పింది!

పట్టాలిచ్చి స్వాధీంపరచకుండా
కాలయాపనెందుకో?
మా భూమి చూపండని అడిగినందుకు
నిర్దాక్షిణ్యంగా పోలీసు కుక్కలనుసిగొల్పటమంటే
పరిష్కరించకుండ పారిపోవటం కాదా?
యిచ్చినమాట నిల్బెట్టుకోలేక
పలాయనవాదమెందుకు!
బీరాలు పలకటమెందుకు!

సగం పెట్టి మేనత్త
అనే తంతులాగ
ప్రవర్తించటమెందుకో
యేలికలకే తెలియాలి!
ఉట్టికెగరలేనమ్మ
స్వర్గానికెగిరే చందంగా
ప్రగల్భాలెందుకు!
ఆచరణ దగ్గరకొచ్చేసరికి
మీనమేషాలెందుకు?
కుంటిసాకులెందుకు?
ప్రతిపక్షాలపై కినుకెందుకు?

ముదిగొండ మరకలు
చెరిగిపోయాయా?
మదినిండ కుతంత్రాలు నిండాయా?
గంగవరం దృశ్యాలు, కారంచేడు కార్పణ్యాలు
మరుగున పడ్డాయా?
ముంత్కు మూకుడుకాని
ప్రజల నోళులు మూయగ
మూకుడుండదని తెలియదా?

ఎన్నికలప్పుడుపన్యాసాలు
గద్దెనెక్కిన తరువాత
వాగ్దానాలకు తిలోదకలా?
మతిమరపు వారికైతే
ప్రజలకనుకొని మూర్ఖ ప్రవర్తనెందుకు?

జనం కళ్ళు తెరవటం
కుళ్ళు ప్రభుత కిష్టముండదు!
జనం కళ్ళు తెరిస్తే కాని
కష్టాలకంతముండదు!!

దౌర్జన్యంతో రాజ్యమేలడమంటే
ప్రజాస్వామ్యాన్ని
అపహాస్యం చేయటమే

హక్కులకై, రక్షణకై
గొంతు ఎత్తుతారు
జనం సత్తా చూపుతారు!

16-12-2012 ఉ. 5.29

Saturday, December 15, 2012

విన్నపం|| ***

కపిల రాంకుమార్ || విన్నపం|| ***

పురాణాల పాత కతను
వెలికితీసి ప్రతీకగా వాడి
వెక్కిరిస్తున్నందుకు
యేమి అనుకోరని ఆశిస్తా!
సరమైం విన్నపం
సవినయంగా విన్నవిస్తా!

రావణసురిని (రావణ బ్రహ్మ)

కుక్షిలో నిక్షిప్త భాండంలా
యీ భూస్వామిక వ్యవస్త బలంగా వున్నపుడు
వ్యక్తిగత హింసా వాదం
నేల విడిచిన సాము!
యెన్ని సార్లు తుంచినా
చిగురుపెట్టె మొలక అది!

పొరుగింటి పుల్లకూర రుచే కాని
తయారుచేయటానికి
తగిన సామాను - తాహతుండాలి కదా!

మాసిన గడ్డం వ్చెక్కిరిస్తుంటే
పేరుమోసిన గడ్డ పిలుస్తోంది!
యెందుకండీ మీరు
దొడ్డి దారికెగబడుతున్నారు!
పులిని చూచి నక్క వాతలాగ
చరిత్ర పుటల్ని అధ్యయనం చేయకుండా
మీరెంచుకున్న మార్గం
చాల ప్రమాదం!
ప్రమాణాలకంటే
పరిమాణాలకంటే
పరిణామం విలువైనది సుమా!

తలలు హరించే బదులు
పది తలలు కూడగట్టిన మీరు
తలపులను సంహరించండి చాలు!

15-12-2012 సా. 3.40

*** 1967-68 ప్రాంతంలో విప్లవ సంఘాలపై నేను మొగ్గు చూపినపుడు, యెంచుకున్న మార్గం అనువైనది కాదని అధ్యయనం చేయటాని 63 సాహిత్య గ్రంథాల జాబితా యిచ్చి అధ్యయన శీలునిగా మార్చిన శ్రీ పరస సత్యనారాయణ గారి వల్ల మారిన నాకు ఈ భావన కలిగింది. నాలో మార్పు వచ్చింది. దానిని అలాగే దాచుకుని యిపుడు మీ ముందుకు తెచ్చా!

బాపు బొమ్మల కొలువు

బాపు బొమ్మల కొలువు

More articles by Jampala Chowdary »
Written by: Jampala Chowdary
Tags: ,
జూన్ 4-6 తేదీల్లో హైదరాబాద్‌లో బాపు బొమ్మల కొలువు జరుగుతుందని తెలిసినప్పుడు చాలా రోజుల తర్వాత బాపుగారి బొమ్మల ప్రదర్శన పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు చాలా ఆనందం, ఆ పండగలో ప్రత్యక్షంగా పాలుపంచుకొనే అవకాశం లేనందుకు కొంత బాధ కలిగాయి. ఈ ప్రదర్శన సందర్భంగా బ్నిం గారి సంపాదకత్వంలో ఒక ప్రత్యేక సంచిక వస్తుందని తెలిసినప్పుడు చాలా ఉత్సుకత కలిగింది. ప్రదర్శన మొదటిరోజున పత్రికల్లోనూ, పుస్తకంలోనూ, ఇతర బ్లాగుల్లోనూ వివరాలు చూశాక ఆ ఉత్సుకత ఇంకా పెరిగింది. మూడో రోజున ప్రదర్శన చూడడానికి వెళ్ళినవారికే ఈ సావెనీర్లు దొరకలేదంటే కొంత దిగులు; ఐనా, ఈ పుస్తకం కాపీ .ఎలాగోలా దొరుకుతుందిలే అన్న ధీమా. అనుకున్నట్లుగానే జూన్‌లో ఆఖరువారంలో అమెరికా వచ్చిన మిత్రుడు నవీన్ నాకోసం ఈ పుస్తకం పట్టుకొచ్చారు. అమెరికా మొదటిసారి వస్తున్న నా చెల్లెలు కూడా పనిగట్టుకొని ప్రత్యేకంగా ఒక కాపీ తీసుకువచ్చింది.
పుస్తకంపై అట్ట మీద ఉన్న బాపు గారి ఫొటో అద్భుతంగా ఉంది (ఫొటోగ్రాఫర్: శివ మల్లాల; ముఖచిత్రం డిజైన్: అన్వర్). మనసారా ఆనందంగా, స్వచ్ఛంగా నవ్వుతున్న బాపుగారి బొమ్మ ఆయన సహజ స్వభావాన్ని పట్టుకుంది – బాపుగారు తాను వేసే బొమ్మల్లో ఇతరుల స్వభావాలని పట్టుకున్నట్టు. నేను చూసిన బాపుగారి ఫొటోలన్నిటిలోకీ నాకు బాగా నచ్చిన ఫొటో ఇది. అంకితం పేజీలో రమణగారి రేఖాచిత్రం, దానికింద బాపు గారి వ్యాఖ్య (నను గోడలేని చిత్తరువును చేసి వెళ్ళిపోయిన నా వెంకట్రావు కోటికోట్ల జ్ఙాపకాలకు సభక్తికంగా), ఇంతకుముందు చూసినప్పటికీ, మరొక్కసారి గుండెని పట్టేశాయి. గోడలేని చిత్తరువు! ఏం మాట్లాడగలం?
మొదటి బొమ్మ (పే. 9 – కుమారస్వామి, గణపతులతో అర్థనారీశ్వరుడు) చూడగానే మళ్ళీ గుండె ఝల్లుమంది. మాకు అత్యంత ఇష్టమైన, అపురూపమైన బొమ్మ. మమ్మల్ని ఆశీర్వదిస్తూ రమణగారురాసిన పద్యంతో సహా బాపుగారు మాకు బహుకరించిన బొమ్మ ప్రతిరూపం.
ఒక్కో పేజీ తిప్పుతూంటే పులకరింపచేస్తూ, నవ్విస్తూ, కవ్విస్తూ, జ్ఞాపకాలను వెదకి తవ్వుతూ, ఠక్కున ఆపి నిలబెట్టేస్తూ, ఆలోచింపచేస్తూ, ఆనందపరుస్తూ, ఆశ్చర్యపరుస్తూ, అబ్బురమనిపించే చూడచక్కని బొమ్మలు. సీరియల్స్ బొమ్మలు, కథల బొమ్మలు, పిల్లల కథల బొమ్మలు, పురాణ కథల బొమ్మలు, పండుగల బొమ్మలు, శుభాకాంక్షల బొమ్మలు,   పద్యాలకు  బొమ్మలు, ఘజళ్ళకు బొమ్మలు,  పుస్తకప్రపంచం బొమ్మలు,  పుస్తకాలు చదువుకుంటున్న బాపు బొమ్మల బొమ్మలు,  దేవుళ్ళ బొమ్మలు, తెరవేలుపుల బొమ్మలు,  తెలుగు వెలుగుల బొమ్మలు,  రకరకాల డేన్సింగ్ పిల్లల బొమ్మలు, పసలపూడి, దిగువ గోదావరి బొమ్మలు, పుస్తకాల పై అట్టల బొమ్మలు, ఎమెస్కో ముఖచిత్రాలు, ఎప్పట్నుంచో గుర్తుపెట్టుకున్న బాపు సంపాదకత్వంలో వెలువడిన 11 కథల కథ-1 బొమ్మలు, ఒకటి కాదు, రెండు కాదు, నూట అరవై పేజీల బాపు బొమ్మలు. ఇంతకు ముందు చూడని కొత్త బొమ్మలు కొన్ని, ఎంతో కాలంగా పరిచయమున్న పాత నేస్తాల్లాంటి బొమ్మలు మరిన్ని. ఎప్పుడో చదివిన కథలు, పుస్తకాలు, జరిగిపోయిన సంఘటనలు, మిత్రులతో చర్చలు గుర్తుకు వచ్చాయి.
ఈ పుస్తకంలో ప్రత్యేకత ఏమిటంటే బాపుగారి గురించి ఉన్న వ్యాసాలు. బాపు చిన్నతనం గురించి  శివరాజు సుబ్బలక్ష్మిగారు (బుచ్చిబాబుగారి శ్రీమతి – సుబ్బలక్ష్మి గారిపై నిడదవోలు మాలతిగారు రాసిన వ్యాసం ఇక్కడ  చూడండి.), బివిఎస్ రామారావుగారు వ్రాసిన వ్యాసాలు ఇంతకుముందు నేనెక్కడా చదవలేదు. బుచ్చిబాబుగారిచ్చిన డ్రాయింగ్‌పేపర్‌మీద బాపు గీసిన మొదటి బొమ్మ తాలూకు మూడు గీట్ల గురించి సుబ్బలక్ష్మిగారు చెప్పిన వివరం హృద్యంగా ఉంది. చిన్నప్పటి బాపు పదివేల పై గంటల ప్రాక్టీసు గురించి బివిఎస్ రామారావుగారు ఆసక్తికరంగా చెప్పింది కొత్త విషయాలే ఐనా ఆశ్చర్యంగా లేదు. ఇంకా రమణగారు వివిధ సంధర్భాల్లో రాసిన వ్యాసాలు, నండూరి రామ్మోహనరావుగారు, కొ.కు, సి,రామచంద్రరావు, ఆరుద్ర, సినారె, అక్కినేని, శంకర్, సదాశివరావు, సుధామ, విజయశాంతి, చిరంజీవి వగైరాలు రాసిన వ్యాసాలు, తన గాడ్‌ఫాదర్ ఆర్టూర్ ఈసెన్‌బర్గ్ గురించి బాపు గారు రాసిన వ్యాసం కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.
ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించింది శ్రీ బ్నిం (బి.ఎన్. మూర్తి). 1995లో దశమ తానా సమావేశాలలో బాపు-రమణల స్వర్ణోత్సవం జరుపుతున్నప్పుడు బాపు చిత్రకళా ప్రదర్శనం ఏర్పాటు చేద్దామని ప్రయత్నించాను (ఇంతకు ముందు బొమ్మా-బొరుసు పుస్తకం గురించి రాసినప్పుడు చెప్పిన కథే). నవోదయా రామ్మోహనరావు గారి సహాయం అడిగితే, ఆయన, “బ్నిం అనే ఆర్టిస్టు హైదరాబాదులో ఉంటారు. బాపుగారి బొమ్మల కలెక్షన్ ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది. నా దగ్గర ఉన్న బొమ్మలన్నీ కూడా ఆయనకే ఇచ్చేశాను; ఆయన్ని కలవండి” అన్నారు. హైదరాబాదులో బ్నింగారిని వెతుక్కుంటూ వెళ్ళాను. బొమ్మల గురించి అడిగాను. ఆయన మంచం కిందంతా చెక్క అరలు ఏర్పాటు చేసి ఉన్నాయి. ఆ అరలనిండా బాపుగారి బొమ్మలు – పత్రికలకి వేసినవీ, ముఖచిత్రాలుగా వేసినవీ వందల (వేల?) సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ చూస్తూ, ఆయనా, మోహన్ అనే ఇంకో ఆర్టిస్టూ (పి. రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి; ప్రసిద్ధుడైన ఇంకో మోహన్ కాదు) బాపు బొమ్మల గురించి చర్చించుకొంటూ నాకు వివరిస్తూంటే వినటం నేను మర్చిపోలేని మంచి అనుభవాల్లో ఒకటి. ఆ తర్వాత బ్నిం రచయితగా (మిసెస్ అండర్‌స్టాండింగ్; వివిధ టీవీ సీరియళ్ళు) పేరొందారు. బాపుగారి బొమ్మలన్నిటినీ కంప్యూటరు కెక్కించి శాశ్వతత్వం కల్పిస్తున్న గంధం దుర్గాప్రసాద్‌గారు ఈ పుస్తకంలో బొమ్మల్ని సేకరించి పెట్టారు.
పుస్తకంలో బొమ్మలు అపురూపంగానే ఉన్నా, చాలా పేజీల్లో ఈ బొమ్మల అమరిక ఇంకా బాగా చేయవచ్చేమో అనిపించింది. ఒకే పేజీలో రకరకాల Genres సంబంధించిన బొమ్మలు, రకరకాల పద్ధతుల్లో, వివిధ సమయాల్లో వేసిన బొమ్మలు కలిపివేయడం కంటికి ఇంపుగా లేదు. రంగుల బొమ్మలు పక్కపక్కనే పెట్టేటప్పుడు ఆ బొమ్మల మధ్య తూకం ఉండేట్టు చూసుకోవలసిన అవసరం ఉంటుంది. కొన్ని పేజీలు గజిబిజిగా అనిపించి, ప్రతి బొమ్మని విడివిడిగా ఆస్వాదించటానికి కష్టమయ్యింది. బాపు మొదటి రోజుల బొమ్మలు (ఆంధ్రపత్రిక రోజుల్లోవి) మరిన్ని,  కాసిని కార్టూ(ట్యూ)న్లు కూడా ఉంటే ఇంకా బాగుండేది.
మంచి వ్యాసాలున్నాయని ముందు చెప్పాను కదా; ఐతే ఈ వ్యాసాలు చదువుతున్నప్పుడు అచ్చుతప్పులు మిక్కుటంగా ఉండి చాలా ఇబ్బంది పెట్టేశాయి; ముఖ్యంగా ఆంగ్లపదాలు వచ్చినప్పుడు. ఒక మరీ విపరీతమైన ఉదాహరణ: So, Bapu as a film director. Hi knows what is happining is the film world. నిఝం.  ఐనా, మేము చాలా తప్పులు చేశాం అని ప్రచురణకర్త (శివలెంక పావని ప్రసాద్ – ముఖీ మీడియా) ముందే ఒద్దికగా ఒప్పేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువగా మాట్లాడగూడదు. ఏ పనైనా ఇంకా బాగా చేయొచ్చు అని చెప్పటం తేలికే. (ఒక ఒప్పుకోలు: అంతగా రాయని బాపుగారితో ఆయన సినిమాలగురించి వ్యాసం రాయించి దాన్ని కొన్ని క్షమించరాని అచ్చుతప్పులతో ప్రచురించిన సంపాదక ఘన చరిత్ర నాకూ ఉంది).
బాపుగారి బొమ్మల వెలుగుల ముందు ఈ క్రీనీడలు పెద్ద పట్టించుకోదగ్గవేమీ కాదు.  తప్పకుండా కొనుక్కుని,  రోజూ కాసిన్ని బొమ్మలు చూసుకొని, మనసు తేలిక చేసుకుని, మళ్ళీ జాగ్రత్తగా దాచిపెట్టుకోవలసిన పుస్తకమే. మంచి ఆర్ట్‌పేపర్ మీద బొమ్మలు శ్రద్ధగా ముద్రించారు (విప్ల కంప్యూటర్ సర్వీసెస్). ప్రకటనలు చాలా ఉన్నా, వాటినీ బాపు బొమ్మలతో కూర్చి మిగతా పుస్తకంలో కలిసిపోయేలా చేయడం బాగుంది.
ఈ పుస్తకం చూస్తుంటే ఇంతకు ముందు చూసిన బాపు బొమ్మల కొలువుల ప్రత్యేక సంచికలు గుర్తుకు వచ్చాయి. వాటి గురించి వీలువెంట మరోసారి.

బాపు బొమ్మల కొలువు ప్రత్యేక సంచిక
జూన్ 4,5,6 – 2011, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్
సంపాదకుడు: బ్నిం
చిత్రసేకరణ: గంధం దుర్గాప్రసాద్
ప్రచురణ: ముఖీ మీడియా, నం. 4, బీమా వ్యాలీ,
రోడ్ నం. 5, బంజారా హిల్స్,హైదరాబాద్
ఫోన్: 9966567449
e-mail: mukhimedia@gmail.com
ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ
166 పేజీలు; 300 రూ. /10 $
వంశీ కోసం వేసిన చిత్రాలు:

గ్యాలరీ లోపల లైట్లు పడటం వల్ల ఫోటోలు కొద్దిగా క్లారిటీ తగ్గాయి. కొన్నింటి మీద బాగా లైట్ పడిపోవటం వల్ల బావున్నా ఇక్కడ పెట్టటం లేదు.
అదివరకూ విజయవాడలో బాపూ బొమ్మల ప్రదర్శన పెట్టినప్పుడు సినిమాల సెట్ల కోసం వేసుకున్న బొమ్మలు కూడా పెట్టారు. (వాళ్ళ సినిమాల్లో ప్రతి ఫ్రేం ముందుగానే బొమ్మ గీసేసి పెట్టుకుంటారుట బాపుగారు. అచ్చం బొమ్మలాగానే ఉండేలా సెట్ తయారుచేస్తారుట.) ఈ ప్రదర్శనలో అలా సినిమాలకు వేసినవి పెట్టలేదు. అవి భలేగా ఉంటాయి. తదుపరి టపాలో దేవుళ్ళ బొమ్మలు…

Friday, December 14, 2012

పీడ

చేనుకు పట్టిన గొంగళిలా
వ్యవస్థకు అవినీతి పీలుస్తున్నది!
క్రిమి సంహారం కల్తీ కాబడి
చేతకాక మొరాయిస్తున్నది!!
14.12.2012
** (1969 లో రాసిన మినీ కవిత)

భాస్కర్ //హైకూ - చిన్న పరిచయం//

భాస్కర్ //హైకూ - చిన్న పరిచయం//
------------------------------------------------
హైకు అనేది జపాన్ దేశపు,సాంప్రదాయ కవిత్వంలో ఒక భాగం,.
వీటికి ఆధారంగా నిలిచింది, జెన్ (ధ్యాన)బౌద్ధం.
హైకూలలో మూడు పాదాలు (కిరు,కైరేజి,కిగో) వుంటాయి,
కిగో అంటే ఋతువునో,కాలాన్నో సూచించడం,.మిగతావి రెండు దృశ్యాలనో,అనుభూతులనో కలిపేవి,
అక్షరాల (ఒంజి)పరిమితి 17,. (5-7-5)
జెన్ బౌద్దం ప్రకారం మనిషిలో వుండే చిత్తలక్షణాలు 17,అందుకే విస్తీర్ణం అంతవరకే పరిమితం.
కేవలం ప్రకృతి వర్ణన మాత్రమే వుండాలి, వర్తమానంలోనే చెప్పాలి,. అలంకారాలు, ఆడంబరమైన
భాషకు చోటులేదు,కవి తన అభిప్రాయాన్ని చొప్పించకూడదు,ఇది కేవలం ఒక దృశ్యాన్ని పాఠకుడి ముందు వుంచాలి,ఇలా చాలా నియమాలతో వుంటుంది,సాంప్రదాయ హైకు,.
నిజానికిది చాలా సులభంగా కనిపించే కష్టమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు,.
fu-ru-i-ke ya (5)
ka-wa-zu to-bi-ko-mu (7)
mi-zu no o-to (5)

పాత తటాకం,
ఒక కప్ప దూకింది,
నీటి శబ్ధాలు.( నా అనువాదం)
ఇది హైకూలకు ఆద్యుడుగా భావించబడే బషో (1644-1694) రాసిన హైకూ.

తెలుగులో మొట్టమొదటి సారి హైకూలను రాసిన కవిగా గాలి నాసర్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు,
17 అక్షరాల నియమం పాటించిన కవి బహుశా ఈయనోక్కరే,
వారి హైకు ఒకటి, వీరి సంకలనం దొరకలేదు,
ఎండుకొమ్మపై,
ఒంటరిగా ఓ కాకి,
శిశిర సంధ్య,.

అమెరికాలో హైకూలు 1950నుంచి విస్తృతమైన ప్రచారంలో వున్నాయి,కానీ అక్కడ అక్షరనియమం పాటించబడటం లేదు,.కొంత మంది కవులు ఒక్క పాదంలో, రెండుపాదాలలో కూడా హైకూలు రాస్తున్నారిప్పుడు,.గోపి గారి మాటలలో చెప్పాలంటే,హైకూస్నాప్ షాట్ లాగా, ఫోటోగ్రాఫిక్ గా వుంటుంది,.సగటు శ్రోతకు దీనిలో కదలక కనిపించదని ,పాఠకుడు కవితో పాటు సమభావకుడు అయినప్పుడు మాత్రమే హైకు ప్రకాశవంతమపుతుందని ,ఇవి తాత్వికత, ప్రకృతితో తాదాత్మ్యం లాంటి మౌనవస్తువులకు సరిపోతుంతని ,ఆయన భావించారు,.. అందుకేనేమో నానీల బాట పట్టారు,. .ఇస్మాయిల్ గారి తెలుగు హైకూలను ప్రతిభావంతంగా రాశారు, వారి హైకూలు కొన్ని,.

**కొలను లోకి రాయి విసిరారెవరో*
అలలు ఇ౦కా వ్యాపిస్తూనే ఉన్నాయి
రాయేదీ…

ఎవరికోస౦ వర్షిస్తాయి మేఘాలు
పిల్లల కోస౦ కాకపోతే
గొడుగులడ్డు పెట్టుకునే వాళ్ళకోసమా?

ము౦దు మనస్సునీ
ఆ వెనక గదినీ
తర్వాత విశ్వాన్నీ ఆవరి౦చి౦ది చీకటి.
------------------------------------------------
పెన్నా శివరామకృష్ణ గారి హైకూలు కొన్ని,...

సాయంత్రం వానజల్లు
చీకటిని దిగబెట్టి
వెళ్లిపోయింది,.

పక్షి నోటిలో
గడ్డి పరకలు
ఇల్లు మారుతున్నదేమో.,.

సుడిగాలి,
కొమ్మను ఊపుతున్నాని,
పిట్ట గర్విస్తుంది,.
------------------------
బివివి ప్రసాద్ గారి హైకూలు కొన్ని,.....

చేయి పట్టుకొంది నిద్రలో
పాప కలలోకి
ఎలా వెళ్ళను

పిట్టలు కూస్తున్నాయి
గాలి నిండా
రంగుల శబ్దాలు

దూరంగా దీపం
దానిని కాపాడుతూ
అంతులేని చీకటి
-------------------------------
తెలుగులో ఈ మధ్యకాలందాకా వచ్చిన హైకూ సంకలనాల వివరాలు కొన్ని,.
రహస్య ద్వారం ( పెన్నా శివరామకృష్ణ,1991)
కప్పల నిశ్శబ్థం (ఇస్మాయిల్,1997)
దృశ్యాదృశ్యం (బివివి ప్రసాద్1995)
హైకూ(బివివి ప్రసాద్1997)
పూలు రాలాయి(బివివి ప్రసాద్1999)
హైకూ చిత్రాలు (సూర్యభాస్కర్,1997)
ఆకాశదీపాలు ( లలితానంద్,1997)
సీతాకోక చిలకలు(శిరీషా,1997)
చినుకుల చిత్రాలు( పెన్నా శివరామకృష్ణ,2000)
ఇంకా చాలానే వచ్చినట్లున్నాయి,..
-----------------------------
నాకు అర్థమైన కొన్ని విషయాలివి,..మరంత సమాచారం వుంటే అందివ్వండి, ఎవరైనా.....

తలనొప్పి!

కపిల రాంకుమార్ || తలనొప్పి! || ***

కొన్ని ఉద్యమాలు
అప్పుడే రెక్కలొచ్చిన పిట్టల్లాగ
ముందువెనకలు చూడకుండ
ధ్యేయమేమిటో తేల్చుకోకుండా
పర్వులిడితే గమ్యం ఆలస్యమౌతుంది!

వేటగాడి బాణపు గురి
తప్పితే తప్పనిసరిగా
తనకే ముప్పుగా పరిణమిస్తే
వర్తమానం భవిష్యత్తు గోడు వినదు!
తదుపరి కర్తవ్యం అగమ్యగోచరమై
భవిష్యత్తుకు తలనొప్పి కాకమానదు

ఉద్యమ కాకా చల్లారక ముందే
కొత్తయెత్తుగడ వేయకపోతే
అసలు లక్ష్యపుటునికే
ప్రమాదం పొంచివుంటుంది

పదును పెట్టి
అదును పట్టి
శరస్సంధానం కావించు!
లోచనాలోచనాలను సవరించు

14-12-2012.
(*** 40 ఏళ్ళ క్రితపు కవితను సవరించాను నేటికి తగ్గట్టుగా)

Thursday, December 13, 2012

వ్యాప్తి|

కపిల రాంకుమార్ || వ్యాప్తి||

పట్టణాలలోని సెగ పల్లెలకూ పొగ పెట్టింది!
రావణ కాష్టంలా
ఆడపిల్లల జీవితాలు తాలు చేయ!

13.12.2012 ఉ.5.30

Tuesday, December 11, 2012

ఒక భారత్ ఒక భారతి రాలిన మొగ్గలు ‘వెన్నెల్లో సింధు నదిలో పడవపై మలయాళ భామతో అందమైన తెలుగు పాట పాడుకోవాలి’ (సుందర తెలింగిళ్ పాట్టు ఇసెత్తు) అని స్వప్నించిన కవి సుబ్రహ్మణ్య భారతి. ఈ పాటలో ఆయన భారతదేశంలోని అన్ని జాతులవారూ కలిసి సాగాలని భావించారు. గురజాడ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితాప్రవాహాల త్రివేణీ సంగమం ‘భారతి’ గేయం. ‘ఊడి వలయాడు పాప...’ లాంటి చిన్నపిల్లల గీతాలు రాసినా, ‘కాలిపోయినా బాధపడ్డా పదేపదే వందేమాతరం పాడాలి’ అని నినదించినా, ‘కవిత రాసేవాడు కవి కాడు. కవిత్వాన్ని జీవితంగా జీవితాన్ని కవిత్వంగా చేసుకున్నవాడే కవి’ అని పలికినా... సుబ్రహ్మణ్య భారతి పదాలు పదాలు కావు... అక్షర తూణీరాలు. పార్థసారథి కోవెల అది. చెన్నైలోని ట్రిప్లికేన్‌లో ఉంది. అతనో యోగిలా ఉన్నాడు. రోజూలాగానే ఆ ఉదయం కూడా గుడిలోకి అడుగుపెట్టాడు. ఎప్పటిలాగానే తాను తెచ్చిన అరటిపళ్లను అక్కడున్న ఏనుగుకి పెట్టాడు. అది రోజూ జరిగేదే. కాని ఆ రోజెందుకో ఆ మాతంగం కదనం తొక్కింది. ఒక్కసారిగా ఆ గజరాజు తన బలమైన కాళ్లతో ఆ కవియోగిని తొక్కేసింది. రక్తపు మడుగులో మూర్ఛిల్లిన ఆ వ్యక్తి... భరతమాతకు కవితాహారతి పట్టిన తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి. తమది ప్రత్యేక ద్రవిడ జాతి అన్న ఆత్మవిశ్వాసం తమిళులది. భారతీయత కన్న తమిళ జాతీయతను మిన్నగా ప్రేమించే తత్త్వం వారిది. అలాంటి తత్త్వం నుంచి బయటకు వచ్చిన తొలి తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. ఓ పక్క తమిళ సంస్కృతీ సాహిత్యాల ఉనికిని నినదిస్తూనే మరోపక్క భారతీయ ఏకాత్మను చాటిన కవి. అందుకే ‘కాశీ పండితుల స్వరాన్ని కంచిలో వినిపించే పరికరాన్ని’ అని అనగలిగారు. తమిళ భాషని తల్లీ అని సంబోధించి అక్కున చేరిన అదే కవి, ‘ప్రియురాలు తమిళంలో మాట్లాడితే అది జీవనదుల ఊట’ అని పలికిన అదే కవి - ‘హిమాలయాలు మనవి, గంగానది మనది, ఇంకెందుకు ఆత్మన్యూనత మనకి’ అని ఎలుగెత్తి చాటగలిగారు. పువ్వు పుట్టగానే... సుబ్రహ్మణ్య భారతి అసలు పేరు సుబ్బియ. 1882 డిసెంబర్ 11న తమిళనాడులోని తూతుకూడి జిల్లా ఎట్టియపురంలో జన్మించారు. మూడేళ్ల ప్రాయం నుండే సంగీతం నేర్చుకునే భాగ్యం కలిగింది. కానీ అయిదేళ్లకే తల్లి ఎలక్కుమి అమ్మాళ్ మరణించింది. దాంతో సుబ్బియ జీవితంలో ఏదో తెలీని శూన్యత. అప్పుడు సంగీతమే తల్లయ్యింది. 1893లో ఎట్టియపురం రాజావారు సంగీత పాటవ పోటీలు నిర్వహించారు. గండపెండేరాలు తొడిగించుకున్న ఉద్ధండ గాన గంధర్వులతో 11 ఏళ్ల సుబ్బియ పోటీపడ్డాడు. పిట్ట కొంచెమైనా కూత ఘనమనిపించాడు. రాజావారు ‘భారతీయార్’ అన్న బిరుదునిచ్చారు. అలా సుబ్బియ కాస్తా సుబ్రహ్మణ్య భారతి అయ్యారు. అయితే తండ్రి చిన్నస్వామి సుబ్రహ్మణ్య అయ్యర్‌కి మాత్రం తన కొడుకు ఇంజినీర్ కావాలనిపించింది. కాని సుబ్రహ్మణ్యానికి మాత్రం సంగీతమూ కవిత్వమే సర్వస్వాలయ్యాయి. ఒక్కోసారి పిచ్చిపట్టినవాడిలా తనలో తాను పాడుకుంటూ అలౌకికానుభూతి పొందేవాడు. తండ్రికి భయం వేసింది. పెళ్లే దీనికి మందు అనుకున్నాడు. అలా మరదలి వరసైన ఏడేళ్ల చెల్లమ్మాళ్‌తో 16 ఏళ్ల సుబ్రహ్మణ్యానికి వివాహమైంది. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, ఇంజినీరింగ్... ఇవన్నీ సామాన్యులకు కొలమానాలు. పుట్టింది తమకోసం కాదు అన్న సత్యం తెలిసినవారికి ఇవన్నీ నీటిబుడగలు. అందుకే సుబ్రహ్మణ్య భారతి సంసారంలో ఇమడలేకపోయారు. మేడిపండు లాంటి ప్రాపంచిక సుఖం ఆయనను ఆకర్షించలేకపోయింది. దాంతో జీవిత తత్త్వాన్వేషణతో లోక సంచారి అయ్యారాయన. వారణాసిలో... అలా 17 ఏళ్ల వయసులో భారతి ఇల్లు విడిచి కాశీకి పయనమయ్యారు. జాతీయవాదం, దేశభక్తి, హైందవ తత్త్వం లాంటి భావాలపై భారతికి మక్కువ కలిగింది ఇక్కడే. సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు రావడానికి కారణమైంది ఈ ప్రవాసమే. దీనికి తోడు నాలుగేళ్ల పాటు ఈ ఊరూ ఆ ఊరూ అంటూ అనేక ప్రాంతాలు తిరిగారు. దాంతో ఆనాటి వాస్తవిక విషాదమయ భారతదేశం ఎలా ఉందో తెలిసొచ్చింది. కులం, లింగం, విద్య, డబ్బు పేరిట ఒకరు మరొకరిని హీనంగా చూసే రుగ్మతల్ని చూసి ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. ఫలితంగా ఆయన ఆలోచనాఖడ్గధార పదునెక్కింది. వివేచనతో పాటు వేషమూ మారింది. తలపాగా, దాని నుంచి మెడ చుట్టూ సాగే వస్త్రం, మెలి తిరిగిన మీసం, పెరిగిన గెడ్డం, అమానవీయతను దహించే నిప్పు కణికల్లాంటి కళ్లు - వెరసి ఒక సాంఘిక వీరుడిలా మారారు. దార్శనికతకు నేపథ్యం 1905లో బెంగాల్ విభజనతో దేశం అట్టుడికిపోతున్న రోజులవి. భారత రాజకీయాల్లో అతివాదం స్పష్టంగా రూపుదిద్దుకుంటున్న కాలమది. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో తన పాత్ర ఏమిటో తెలిసొచ్చింది సుబ్రహ్మణ్య భారతికి. 1905లో బెనారస్‌లోనూ, 1907లో సూరత్‌లోనూ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా సూరత్ సదస్సులో మితవాద, అతివాద నేతల మధ్య చీలిక రావడం; తిలక్, అరవింద్ ఘోష్ లాంటి అతివాదుల వాదనలు... భారతిపై తీవ్ర ప్రభావం చూపాయి. అసలు ఫైర్‌బ్రాండ్‌లా ఆయన మారడానికి కారణమిదే! ఈ స్ఫూర్తితోనే జాతిని ఉత్తేజితం చేసే కవితలు రాశారు. ‘భారతమాతను తల్చుకుంటేనే నీకు శత్రువులంటే భయం పోతుంది’ అని నినదించగలిగారు. స్వదేశీ మిత్రన్, ఇండియా లాంటి పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించి, జాతీయోద్యమ రచనలనెన్నింటినో వెలువరించారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పత్రికల్లో రాజకీయ కార్టూన్లు, క్యారికేచర్లను ప్రచురింపజేసింది ఈయనే! ఆ కాలంలోనే స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదితను కలిసే అవకాశం వచ్చింది భారతికి. ఆమెతో సంభాషించాక, స్త్రీజాతి ఎంత న్యూనంగా చూడబడుతుందో, మగువ తెగువ చూపి ఎలా అడుగు ముందుకు వేయాలో అర్థమైంది. అందుకే స్త్రీ చైతన్యం కోసమే వెలసిన తొలి తమిళ పత్రిక ‘చక్రవర్తిని’కి సంపాదక బాధ్యతల్ని చేపట్టారాయన. మరోవైపు బాల భారత సంఘం స్థాపించి, యువతను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడేలా చేశారు. 1908లో స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇవన్నీ సహజంగానే బ్రిటిష్‌వారికి కంటగింపయ్యాయి. భారతిని నిర్బంధించే పరిస్థితి వచ్చింది. దరిమిలా ఫ్రెంచి పాలనలో ఉన్న పాండిచ్చేరికి వెళ్లిపోయారు. తనకోసం కాదు... పాండిచ్చేరిలో దాదాపు దశాబ్ద కాలం ఉన్నారు. పదేళ్లూ దుర్భర జీవితమే! అయితేనేం... తన సామాజిక సాహిత్య సేవ మాత్రం మానలేదు. విజయ, బాలభారత్, సూర్యోదయం, ఆర్య, కర్మయోగి లాంటి పత్రికల్ని నడిపారు. ఫ్రెంచి నేర్చుకున్నారు. క్రీస్తు, అల్లాపై సైతం కవిత చెప్పారు. అత్యద్భుత కవిత్వ విలువలు ఉన్న సాహిత్యమాయనిది. ఆయనది కవితాత్మకంగా సాగే పూతుక్కవితై అనే వచన గేయ శైలి. తమిళులు గ్రాంథికాన్ని గుండెలకు హత్తుకుంటారు. కాని భారతిది అచ్చమైన వాడుక భాష. తొలక్కాప్పియం లాంటి తమిళ ప్రాచీన వ్యాకరణ గ్రంథాల్ని సూత్రాల్ని తమిళులు నెత్తిన పెట్టుకుంటారు. కాని ఈయన మాత్రం ఛందస్సుల సర్పపరిష్వంగం వదిలి వ్యాకరణాల సంకెళ్లు తెంచుకున్నారు. కన్నన్ పాట్టు, కూయిల్ పాట్టు, పాంచాలీ శపథం, పాప్ప పాట్టు, పూదియ ఆతి చూడి లాంటి అనేక రచనలు చేశారు. తీవ్రమైన భావావేశంతో జలపాతంలా సాగే ఆయన కవితలు చదివితే హృదయనరం జివ్వుమంటుంది. ‘నిప్పులో చెయ్యి పెడితే నిన్ను ముట్టుకున్నట్లే ఉందేమిటి కృష్ణా’ అని భక్తిలోని గొప్పతనాన్ని చెబుతారు అమాయకంగా. ఆదిపరాశక్తిని అపారంగా పూజించి ‘శక్తి దాసన్’గా పేరొందారాయన. అందుకే ఆయన ఏ ఉత్తరం రాసినా ‘ఓం శక్తి’ అని ప్రారంభించి, ‘మీరు శాశ్వతమవుగాక’ అని ముగించేవారు. ఆదిపరాశక్తిని స్తుతిస్తూ ‘నా శవం కాలుతున్నా నిన్నే తలచాలి నా హృదయం’ అనే భక్త్యావేశం ఆయనది. అదే ఆవేశం ఎంతాయం తామం, జయభారత్ లాంటి దేశభక్తి గీతాల్లోనూ కనిపిస్తుంది. బ్రాహ్మణ కులంలో పుట్టినా మొదట్నుంచీ కులవివక్షను నిరసించారాయన. హరిజనుడికి స్వయంగా ఉపనయనం చేశారు. ఒక దశలో తన కూతురు తంగమ్మను హరిజనుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. బంధువులు పడనివ్వలేదు. నిమ్నకులాల వారిని ఇంటికి పిలిచి యాగాలు చేయించారు. చివరకు మిగిలేది సంపాదనపై ధ్యాస లేక, సంఘ రుగ్మతలపైనే కన్నెర్ర చేస్తూ సాగిన సుబ్రహ్మణ్య భారతికి పాండిచ్చేరిలో గడవడం రాను రాను కష్టమైపోయింది. దాంతో 1918 నవంబర్‌లో చెన్నైకి తిరిగి రాక తప్పని పరిస్థితి. కడలూర్ దగ్గర బ్రిటిష్ ఇండియాలోకి ప్రవేశిస్తున్నప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. మూడు వారాల నిర్బంధంతో ఆరోగ్యం క్షీణించింది. బంధువుల బలవంతం మీద పోలీసుల నిర్బంధం నుంచి బయటకు రాగలిగారు. దాంతో చెన్నైలోని ట్రిప్లికేన్‌కి ఆయన మకాం మారింది. అప్పటికే ఒకానొక యోగస్థితిలోకి వెళ్లిపోయారు. కవిత్వం రాయడం, ఉపన్యాసాలివ్వడం, పార్థసారథి కోవెలకు వెళ్లడం, ఏనుగుతో గడపడం - ఇవీ ఆయన నిత్యకృత్యాలు. ఈరోడ్‌లోని కరుంగల్పాయం లైబ్రెరీలో ‘మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్’ అన్న అంశంపై ఇచ్చినదే ఆయన చిట్టచివరి ఉపన్యాసం. రోజూలాగానే ఆ రోజూ కోవెలకు వెళ్లారు. కానీ విధి విచిత్రమైంది. ఏనుగు దాడిలో గాయపడ్డ సుబ్రహ్మణ్య భారతి కొంతకాలం మరణంతో పోరాడారు. మంచంపై ఉండే ‘భారత సముదాయం వాళ్లవే’ (భరతమాత వర్ధిల్లు గాక) అన్న గీతం రాశారు. రాసిన మూడు వారాలకు 1921 సెప్టెంబర్ 11న 39 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ‘పుట్టావా అయితే బతుకును సార్థకం చేసుకో’ అంటారు తిరువళ్లువర్. ఆ తమిళ తాత్త్వికుడి మాటను నిజం చేసిన తమిళ కవియోగి సుబ్రహ్మణ్య భారతి. తనకోసం, తన కుటుంబం కోసం క్షణమంటే క్షణం కూడా గడపని, గడపాలని తెలీని కవి ఆయన. కాని ఆయన అంత్యక్రియలకు హాజరైంది కేవలం 14 మంది మాత్రమే! ఈ సమాజం కూడా ఆ ఏనుగు లాంటిదే! సుబ్రహ్మణ్య భారతి జీవితచరిత్ర ఆధారంగా 2000 సంవత్సరంలో తమిళంలో ‘భారతి’ సినిమా వచ్చింది. షాయాజీ షిండే ప్రధాన పాత్ర పోషించగా, భారతీయార్ భార్యగా దేవయాని నటించారు. జ్ఞాన రాజశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఇళయరాజా సంగీతం అందించారు. ఆకెళ్ల రాఘవేంద్ర

ఒక భారత్ ఒక భారతి
రాలిన మొగ్గలు
‘వెన్నెల్లో సింధు నదిలో పడవపై మలయాళ భామతో అందమైన తెలుగు పాట పాడుకోవాలి’ (సుందర తెలింగిళ్ పాట్టు ఇసెత్తు) అని స్వప్నించిన కవి సుబ్రహ్మణ్య భారతి. ఈ పాటలో ఆయన భారతదేశంలోని అన్ని జాతులవారూ కలిసి సాగాలని భావించారు. గురజాడ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితాప్రవాహాల త్రివేణీ సంగమం ‘భారతి’ గేయం.

‘ఊడి వలయాడు పాప...’ లాంటి చిన్నపిల్లల గీతాలు రాసినా, ‘కాలిపోయినా బాధపడ్డా పదేపదే వందేమాతరం పాడాలి’ అని నినదించినా, ‘కవిత రాసేవాడు కవి కాడు. కవిత్వాన్ని జీవితంగా జీవితాన్ని కవిత్వంగా చేసుకున్నవాడే కవి’ అని పలికినా... సుబ్రహ్మణ్య భారతి పదాలు పదాలు కావు... అక్షర తూణీరాలు.

పార్థసారథి కోవెల అది.
చెన్నైలోని ట్రిప్లికేన్‌లో ఉంది.

అతనో యోగిలా ఉన్నాడు. రోజూలాగానే ఆ ఉదయం కూడా గుడిలోకి అడుగుపెట్టాడు. ఎప్పటిలాగానే తాను తెచ్చిన అరటిపళ్లను అక్కడున్న ఏనుగుకి పెట్టాడు. అది రోజూ జరిగేదే. కాని ఆ రోజెందుకో ఆ మాతంగం కదనం తొక్కింది. ఒక్కసారిగా ఆ గజరాజు తన బలమైన కాళ్లతో ఆ కవియోగిని తొక్కేసింది. రక్తపు మడుగులో మూర్ఛిల్లిన ఆ వ్యక్తి... భరతమాతకు కవితాహారతి పట్టిన తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి.

తమది ప్రత్యేక ద్రవిడ జాతి అన్న ఆత్మవిశ్వాసం తమిళులది. భారతీయత కన్న తమిళ జాతీయతను మిన్నగా ప్రేమించే తత్త్వం వారిది. అలాంటి తత్త్వం నుంచి బయటకు వచ్చిన తొలి తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. ఓ పక్క తమిళ సంస్కృతీ సాహిత్యాల ఉనికిని నినదిస్తూనే మరోపక్క భారతీయ ఏకాత్మను చాటిన కవి.

అందుకే ‘కాశీ పండితుల స్వరాన్ని కంచిలో వినిపించే పరికరాన్ని’ అని అనగలిగారు. తమిళ భాషని తల్లీ అని సంబోధించి అక్కున చేరిన అదే కవి, ‘ప్రియురాలు తమిళంలో మాట్లాడితే అది జీవనదుల ఊట’ అని పలికిన అదే కవి - ‘హిమాలయాలు మనవి, గంగానది మనది, ఇంకెందుకు ఆత్మన్యూనత మనకి’ అని ఎలుగెత్తి చాటగలిగారు.

పువ్వు పుట్టగానే...
సుబ్రహ్మణ్య భారతి అసలు పేరు సుబ్బియ.
1882 డిసెంబర్ 11న తమిళనాడులోని తూతుకూడి జిల్లా ఎట్టియపురంలో జన్మించారు. మూడేళ్ల ప్రాయం నుండే సంగీతం నేర్చుకునే భాగ్యం కలిగింది. కానీ అయిదేళ్లకే తల్లి ఎలక్కుమి అమ్మాళ్ మరణించింది. దాంతో సుబ్బియ జీవితంలో ఏదో తెలీని శూన్యత. అప్పుడు సంగీతమే తల్లయ్యింది.

1893లో ఎట్టియపురం రాజావారు సంగీత పాటవ పోటీలు నిర్వహించారు. గండపెండేరాలు తొడిగించుకున్న ఉద్ధండ గాన గంధర్వులతో 11 ఏళ్ల సుబ్బియ పోటీపడ్డాడు. పిట్ట కొంచెమైనా కూత ఘనమనిపించాడు. రాజావారు ‘భారతీయార్’ అన్న బిరుదునిచ్చారు. అలా సుబ్బియ కాస్తా సుబ్రహ్మణ్య భారతి అయ్యారు.

అయితే తండ్రి చిన్నస్వామి సుబ్రహ్మణ్య అయ్యర్‌కి మాత్రం తన కొడుకు ఇంజినీర్ కావాలనిపించింది. కాని సుబ్రహ్మణ్యానికి మాత్రం సంగీతమూ కవిత్వమే సర్వస్వాలయ్యాయి. ఒక్కోసారి పిచ్చిపట్టినవాడిలా తనలో తాను పాడుకుంటూ అలౌకికానుభూతి పొందేవాడు. తండ్రికి భయం వేసింది. పెళ్లే దీనికి మందు అనుకున్నాడు. అలా మరదలి వరసైన ఏడేళ్ల చెల్లమ్మాళ్‌తో 16 ఏళ్ల సుబ్రహ్మణ్యానికి వివాహమైంది.

ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, ఇంజినీరింగ్... ఇవన్నీ సామాన్యులకు కొలమానాలు. పుట్టింది తమకోసం కాదు అన్న సత్యం తెలిసినవారికి ఇవన్నీ నీటిబుడగలు. అందుకే సుబ్రహ్మణ్య భారతి సంసారంలో ఇమడలేకపోయారు. మేడిపండు లాంటి ప్రాపంచిక సుఖం ఆయనను ఆకర్షించలేకపోయింది. దాంతో జీవిత తత్త్వాన్వేషణతో లోక సంచారి అయ్యారాయన.

వారణాసిలో...
అలా 17 ఏళ్ల వయసులో భారతి ఇల్లు విడిచి కాశీకి పయనమయ్యారు. జాతీయవాదం, దేశభక్తి, హైందవ తత్త్వం లాంటి భావాలపై భారతికి మక్కువ కలిగింది ఇక్కడే. సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషలపై పట్టు రావడానికి కారణమైంది ఈ ప్రవాసమే. దీనికి తోడు నాలుగేళ్ల పాటు ఈ ఊరూ ఆ ఊరూ అంటూ అనేక ప్రాంతాలు తిరిగారు. దాంతో ఆనాటి వాస్తవిక విషాదమయ భారతదేశం ఎలా ఉందో తెలిసొచ్చింది.

కులం, లింగం, విద్య, డబ్బు పేరిట ఒకరు మరొకరిని హీనంగా చూసే రుగ్మతల్ని చూసి ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. ఫలితంగా ఆయన ఆలోచనాఖడ్గధార పదునెక్కింది. వివేచనతో పాటు వేషమూ మారింది. తలపాగా, దాని నుంచి మెడ చుట్టూ సాగే వస్త్రం, మెలి తిరిగిన మీసం, పెరిగిన గెడ్డం, అమానవీయతను దహించే నిప్పు కణికల్లాంటి కళ్లు - వెరసి ఒక సాంఘిక వీరుడిలా మారారు.

దార్శనికతకు నేపథ్యం
1905లో బెంగాల్ విభజనతో దేశం అట్టుడికిపోతున్న రోజులవి. భారత రాజకీయాల్లో అతివాదం స్పష్టంగా రూపుదిద్దుకుంటున్న కాలమది. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో తన పాత్ర ఏమిటో తెలిసొచ్చింది సుబ్రహ్మణ్య భారతికి. 1905లో బెనారస్‌లోనూ, 1907లో సూరత్‌లోనూ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు.

ముఖ్యంగా సూరత్ సదస్సులో మితవాద, అతివాద నేతల మధ్య చీలిక రావడం; తిలక్, అరవింద్ ఘోష్ లాంటి అతివాదుల వాదనలు... భారతిపై తీవ్ర ప్రభావం చూపాయి. అసలు ఫైర్‌బ్రాండ్‌లా ఆయన మారడానికి కారణమిదే!

ఈ స్ఫూర్తితోనే జాతిని ఉత్తేజితం చేసే కవితలు రాశారు. ‘భారతమాతను తల్చుకుంటేనే నీకు శత్రువులంటే భయం పోతుంది’ అని నినదించగలిగారు. స్వదేశీ మిత్రన్, ఇండియా లాంటి పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించి, జాతీయోద్యమ రచనలనెన్నింటినో వెలువరించారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పత్రికల్లో రాజకీయ కార్టూన్లు, క్యారికేచర్లను ప్రచురింపజేసింది ఈయనే!

ఆ కాలంలోనే స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదితను కలిసే అవకాశం వచ్చింది భారతికి. ఆమెతో సంభాషించాక, స్త్రీజాతి ఎంత న్యూనంగా చూడబడుతుందో, మగువ తెగువ చూపి ఎలా అడుగు ముందుకు వేయాలో అర్థమైంది. అందుకే స్త్రీ చైతన్యం కోసమే వెలసిన తొలి తమిళ పత్రిక ‘చక్రవర్తిని’కి సంపాదక బాధ్యతల్ని చేపట్టారాయన.

మరోవైపు బాల భారత సంఘం స్థాపించి, యువతను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడేలా చేశారు. 1908లో స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇవన్నీ సహజంగానే బ్రిటిష్‌వారికి కంటగింపయ్యాయి. భారతిని నిర్బంధించే పరిస్థితి వచ్చింది. దరిమిలా ఫ్రెంచి పాలనలో ఉన్న పాండిచ్చేరికి వెళ్లిపోయారు.
తనకోసం కాదు...

పాండిచ్చేరిలో దాదాపు దశాబ్ద కాలం ఉన్నారు. పదేళ్లూ దుర్భర జీవితమే! అయితేనేం... తన సామాజిక సాహిత్య సేవ మాత్రం మానలేదు. విజయ, బాలభారత్, సూర్యోదయం, ఆర్య, కర్మయోగి లాంటి పత్రికల్ని నడిపారు. ఫ్రెంచి నేర్చుకున్నారు. క్రీస్తు, అల్లాపై సైతం కవిత చెప్పారు.

అత్యద్భుత కవిత్వ విలువలు ఉన్న సాహిత్యమాయనిది. ఆయనది కవితాత్మకంగా సాగే పూతుక్కవితై అనే వచన గేయ శైలి. తమిళులు గ్రాంథికాన్ని గుండెలకు హత్తుకుంటారు. కాని భారతిది అచ్చమైన వాడుక భాష. తొలక్కాప్పియం లాంటి తమిళ ప్రాచీన వ్యాకరణ గ్రంథాల్ని సూత్రాల్ని తమిళులు నెత్తిన పెట్టుకుంటారు. కాని ఈయన మాత్రం ఛందస్సుల సర్పపరిష్వంగం వదిలి వ్యాకరణాల సంకెళ్లు తెంచుకున్నారు. కన్నన్ పాట్టు, కూయిల్ పాట్టు, పాంచాలీ శపథం, పాప్ప పాట్టు, పూదియ ఆతి చూడి లాంటి అనేక రచనలు చేశారు.

తీవ్రమైన భావావేశంతో జలపాతంలా సాగే ఆయన కవితలు చదివితే హృదయనరం జివ్వుమంటుంది. ‘నిప్పులో చెయ్యి పెడితే నిన్ను ముట్టుకున్నట్లే ఉందేమిటి కృష్ణా’ అని భక్తిలోని గొప్పతనాన్ని చెబుతారు అమాయకంగా. ఆదిపరాశక్తిని అపారంగా పూజించి ‘శక్తి దాసన్’గా పేరొందారాయన.

అందుకే ఆయన ఏ ఉత్తరం రాసినా ‘ఓం శక్తి’ అని ప్రారంభించి, ‘మీరు శాశ్వతమవుగాక’ అని ముగించేవారు. ఆదిపరాశక్తిని స్తుతిస్తూ ‘నా శవం కాలుతున్నా నిన్నే తలచాలి నా హృదయం’ అనే భక్త్యావేశం ఆయనది. అదే ఆవేశం ఎంతాయం తామం, జయభారత్ లాంటి దేశభక్తి గీతాల్లోనూ కనిపిస్తుంది.

బ్రాహ్మణ కులంలో పుట్టినా మొదట్నుంచీ కులవివక్షను నిరసించారాయన. హరిజనుడికి స్వయంగా ఉపనయనం చేశారు. ఒక దశలో తన కూతురు తంగమ్మను హరిజనుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. బంధువులు పడనివ్వలేదు. నిమ్నకులాల వారిని ఇంటికి పిలిచి యాగాలు చేయించారు.

చివరకు మిగిలేది
సంపాదనపై ధ్యాస లేక, సంఘ రుగ్మతలపైనే కన్నెర్ర చేస్తూ సాగిన సుబ్రహ్మణ్య భారతికి పాండిచ్చేరిలో గడవడం రాను రాను కష్టమైపోయింది. దాంతో 1918 నవంబర్‌లో చెన్నైకి తిరిగి రాక తప్పని పరిస్థితి. కడలూర్ దగ్గర బ్రిటిష్ ఇండియాలోకి ప్రవేశిస్తున్నప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. మూడు వారాల నిర్బంధంతో ఆరోగ్యం క్షీణించింది. బంధువుల బలవంతం మీద పోలీసుల నిర్బంధం నుంచి బయటకు రాగలిగారు.

దాంతో చెన్నైలోని ట్రిప్లికేన్‌కి ఆయన మకాం మారింది. అప్పటికే ఒకానొక యోగస్థితిలోకి వెళ్లిపోయారు. కవిత్వం రాయడం, ఉపన్యాసాలివ్వడం, పార్థసారథి కోవెలకు వెళ్లడం, ఏనుగుతో గడపడం - ఇవీ ఆయన నిత్యకృత్యాలు. ఈరోడ్‌లోని కరుంగల్పాయం లైబ్రెరీలో ‘మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్’ అన్న అంశంపై ఇచ్చినదే ఆయన చిట్టచివరి ఉపన్యాసం. రోజూలాగానే ఆ రోజూ కోవెలకు వెళ్లారు.

కానీ విధి విచిత్రమైంది. ఏనుగు దాడిలో గాయపడ్డ సుబ్రహ్మణ్య భారతి కొంతకాలం మరణంతో పోరాడారు. మంచంపై ఉండే ‘భారత సముదాయం వాళ్లవే’ (భరతమాత వర్ధిల్లు గాక) అన్న గీతం రాశారు. రాసిన మూడు వారాలకు 1921 సెప్టెంబర్ 11న 39 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

‘పుట్టావా అయితే బతుకును సార్థకం చేసుకో’ అంటారు తిరువళ్లువర్. ఆ తమిళ తాత్త్వికుడి మాటను నిజం చేసిన తమిళ కవియోగి సుబ్రహ్మణ్య భారతి. తనకోసం, తన కుటుంబం కోసం క్షణమంటే క్షణం కూడా గడపని, గడపాలని తెలీని కవి ఆయన. కాని ఆయన అంత్యక్రియలకు హాజరైంది కేవలం 14 మంది మాత్రమే!
ఈ సమాజం కూడా ఆ ఏనుగు లాంటిదే!


సుబ్రహ్మణ్య భారతి జీవితచరిత్ర ఆధారంగా 2000 సంవత్సరంలో తమిళంలో ‘భారతి’ సినిమా వచ్చింది. షాయాజీ షిండే ప్రధాన పాత్ర పోషించగా, భారతీయార్ భార్యగా దేవయాని నటించారు. జ్ఞాన రాజశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఇళయరాజా సంగీతం అందించారు.

ఆకెళ్ల రాఘవేంద్ర

గజల్

గజల్
గజల్ (ఆంగ్లం: Ghazal) ఉర్దూ కవితాసాహిత్యంలో అత్యంత ప్రముఖ సాహితీ ప్రక్రియ మరియు కవితా రూపం.
మిర్జా గాలిబ్
జావేద్ అఖ్తర్
గజల్ అనగా ‘స్త్రీ సంభాషణ’, ‘స్త్రీల సంభాషణ’. ‘స్త్రీ సౌందర్యాన్ని’ వర్ణించడానికి గజల్ వాడే వారు. గజల్ అనే పదం ‘గజాల్’ ‘గజాల’ నుండి ఆవిర్భవించింది (మూలం టర్కీ భాష), అర్థం ‘జింక’, ‘జింక కనులు గల’, ‘మృగనయని’.
పర్షియన్లు ఖసీదా ద్వారా దీన్ని వాడుకలోకి తెచ్చారు.10 వ శతాబ్దంలోఇర
ాన్ లో గజల్ ఆవిర్భావం జరిగినది.12 వ శతాబ్దంలోముస్లిం రాజుల ప్రాబల్యంలో,మొగలులు ఇరానీయుల ఆచారవ్యవహారాలతో పాటు గజల్ ను ఇరాన్ నుండి భారతదేశానికి దిగుమతి చేశారు.అమిర్ ఖుస్రో ఉత్తరభారతంలో గజల్ ను ప్రారంభించాడని చెబుతారు కాని,నిజానికి గజల్ దక్కనులోనే మొదలయింది. గజల్లు పర్షియన్ భాషలో జలాలుద్దీన్ మొహమ్మద్ రూమి (13వ శతాబ్దం), హాఫిజ్ (14 వ శతాబ్దం) మరియు తుర్కీ కవి ఫుజూలి, భారత కవులు మిర్జా గాలిబ్ (1797-1869), ముహమ్మద్ ఇక్బాల్ (1877-1938) ఇరువురూ పారశీ మరియు ఉర్దూ భాషలలో గజల్ రచించారు.
గజల్ రచనా సరళి
గజల్ లో కనీసం 5 షేర్ లు లేదా అషార్ లు వుంటాయి. 7, 9, 11… అషార్ లూ వుండవచ్చు. ప్రతి షేర్ లో రెండు మిస్రా లు వుంటాయి.
ప్రతి మిస్రా ఛందస్సు గల్గి వుంటుంది.
గజల్ లో మొదటి షేర్ ను మత్ లా, ఆఖరి షేర్ ను మఖ్ తా అంటారు.
మఖ్ తా లో కవి తన తఖల్లుస్ (కలం పేరు) ను ఉపయోగిస్తాడు.
ప్రముఖ గజల్ కవులు
వలీ దక్కని, సిరాజ్ ఔరంగాబాది, మీర్ తఖి మీర్, గాలిబ్, మీర్ దర్ద్, మోమిన్ ఖాన్ మోమిన్, ఇబ్రాహీం జౌఖ్, బహాదుర్ షా జఫర్, దాగ్ దెహల్వి, ఇక్బాల్, హస్రత్ మోహాని, జిగర్ మురాదాబాది, ఫిరాఖ్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, నాసిర్ కాజ్మి, అహ్మద్ ఫరాజ్, నిసార్ అహ్మద్ సయ్యద్, ఖమర్ జలాలాబాది, మగ్దూం మొహియుద్దీన్, సాహిర్ లుధ్యానవి, నిదా ఫాజిలి, మునవ్వర్ రానా, ఖ్వాజా షౌఖ్ హైదరాబాది, జాలిబ్ కడపవి, సాఖి కడపవి, పర్వీన్ షాకిర్, కైఫి అజ్మి మొ.
గజల్ గాయకులు
బేగం అక్తర్, మెహ్ది హసన్, గులాం అలి, జగ్జీత్ సింగ్, పంకజ్ ఉధాస్, అహ్మద్ హుసేన్ , ఎహ్ సాన్ హుసేన్, హరిహరన్, ఆషా భోంస్లే, ఫరీదా ఖానం, మహమ్మద్ రఫీ, మున్ని బేగం, పీనాజ్ మసాని, రేష్మా, తలత్ మెహమూద్, తలత్ అజీజ్, నూర్ జహాం, లతా మంగేష్కర్, కె.ఎల్. సైగల్ మొ.
తెలుగు గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్.షేర్ ఉర్దూలో కవిత లేదా పద్యం లోని రెండు పంక్తుల జోడి. మొదటి పంక్తికి ‘మిస్ర-ఎ-ఊలా’, రెండవ పంక్తికి ‘మిస్ర-ఎ-సాని’ అని అంటారు. ఈ షేర్ పద్యసాహితీ ప్రామాణికాలను గల్గివుండాలి. అనగా తఖ్తీ ఛందస్సు, బెహర్ (మీటర్), జమీన్, అర్కాన్, ఖాఫియా, రదీఫ్ లను కలిగి వుండవలెను.

షేర్ కు ఉదాహరణలు:

మిర్జా గాలిబ్
దిల్-ఎ-నాదాఁ తుఝే హువా క్యా హై
ఆఖిర్ ఇస్ దర్ద్ కీ దవా క్యా హై

ఈ హృదయం పిచ్చిది. దీనికేమయ్యిందో తెలియడం లేదు. ఈ వేదనకు మందేమైనా ఉందా?

మహమ్మద్ ఇక్బాల్
సారే జహాఁ సె అఛ్ఛా, హిందూస్తాఁ హమారా
హమ్ బుల్ బులేఁ హైఁ ఇస్ కీ, ఏ గుల్ సితాఁ హమారా

ప్రపంచమంతటిలోనూ మా హిందూస్తాన్ ఉత్తమమైనది. ఈ పూదోట మాది. మేము ఇందులో పాడే పక్షులం

అహ్మద్ నిసార్
సారి తహ్ జీబేఁ మిట్ గయీఁ లైకిన్
మేరే భారత్ కి షాన్ బాఖీ హై
అన్ని నాగరికతలు సమసినాయి గాని, నా భారత ఖ్యాతి అలాగే నిలిచింది.

దేశమును ప్రేమించుమన్నా

కీర్తి  శేషులు శ్రీ గురజాడ అప్పారావు గారు షుమారు 102 సంవత్సరాల క్రితం రాసిన అజరామరమైన ఈ గీతం నుండి గ్రహించ వలసిన పాఠాలు, జీవిత సత్యాలు అనేకం....

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌

1. BE A TRUE PATRIOT
2. WORK FOR THE EXPANSION OF GOOD AMONG THE PEOPLE
3. STOP TALKING THE THINGS WHICH ARE NOT USEFUL TO ANY
4. DO CONSTRUCTIVE HELP TO OTHERS


పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్‌

తిండి కలిగితే కండ కలదోయ్‌
కండ కలవాడేను మనిషోయ్‌
5. DEVELOP THE AGRICULTURAL PRODUCTS
6. TAKE HYGIENIC  FOOD FOR SOUND BODY
7. STRONG BODY IS ASSET FOR PEOPLE


ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్‌
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌

8. COUNTRY WILL NOT FETCH WITH THE LAZY AND WEAK PEOPLE
9. DEVELOP YOUR ARTS AND SKILLS
 10  PRODUCE INDIGENOUS GOOD

అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకుల నమ్మవలెనోయి;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి


11. PROMOTE THE SALES OF INDIGENOUS GOODS
12. MONEY BRINGS YOU  FAME AND PROSPERITY


వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి


13. DONT LIVE IN YOUR PAST
14. FOCUS ON FUTURE
15. NEVER BE COMPLAISANT

పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే;
వ్యర్థ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్


16. HAVE COMPETITION IN EDUCATION
17. HAVE FIGHTING SPIRIT IN BUSINESS
 18. NEVER HAVE GRUDGES AND ENEMITY
19. AVOID WARS AND ENEMITY

 దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌


20. NEVER EX AGGREGATE YOUR PATRIOTISM 
21. DO SOMETHING GOOD FOR THE PEOPLE
21. YOUR DEED SHOULD SPEAK NOT THE WORDS

ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్;
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్

22. IMPATIENCE IS DANGEROUS FOR COUNTRY
23. ENJOY OTHERS SUCCESS
24. LEARN TO BE UNITED

పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్;
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్

25. JEALOUS MAN NEVER BE HAPPY
26. ONE FEELS OTHERS GOOD AS HIS WILL HAVE LOT OF GOOD

సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌

27. SACRIFICE YOUR PROFIT TO HELP THE OTHER
28.COUNTRY IS MADE BY THE PEOPLE NOT BY LAND

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌


29. LIVE WITH CO OPERATION AND CO EXISTENCE 
30 FRATERNITY AMONG THE RACES AND RELIGIONS

మతం వేరైతేను యేమోయ్
మనసు లొకటై మనుషులుంటే;
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్


31. DEVELOP UNITY AMONG THE MINDS OF ALL RELIGIONS
32. NATIONAL INTEGRITY FETCHES SUCCESS


దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్

33. DEVELOP LOVE AMONG THE NATION
34. PERSPIRE IN ORDER TO PROSER

ఆకులందున అణగిమణగీ
కవిత కోవిల పలకవలెనోయ్;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్
35. LITERATURE AND POETRY SHOULD BE DEVELOPED
36. ART AND LITERATURE SHOULD BRING NAME AND FAME TO THE NATION
                            ఇవి నాకు అర్థమైన భావాలు. మీరు విభ్ధించినా పరవాలేదు.  కేవలం ఒక పాటగా కాకుండా కర్తవ్యోణ్ముఖుల్ని చేసే ఒక అభ్య్దయ గీతం గా గురజాడ గారి పాటను స్మరిస్తూ   పాటిస్తే  అదే   మనం ఆ మహానీయునికిచ్చే గొప్ప నివాళి..

Friday, December 7, 2012

చేవలేని సర్కారు

కపిల రాం కుమార్ // చేవలేని సర్కారు// **

జనపదాల మేలుకోరి జానపదుల మేలుకొలుపు!
వెతలులేని బతుకు కొరకు రాజిలేని పోరు సలుపు!!

నోరు తడప నీరడిగితే
నములు నీళ్ళు సర్కారు!
సేద్యానికి కొదువనీరు
మద్యానికి అదుపు లేదు!!
ఏందీ అన్నాయమని
అందమన్న అననీదు!

రోగమొస్తే దవాఖాన్ల
సర్కారీ మందుల్లేవు!
ఫుడ్ లేదు, బెడ్ లేదు
యిచ్చేటాంకి మనిషిలేడు!
సందుగొందులెందుచూడ
మందుపాత్రల యిందు!

తన తప్పులెంచనీదు
గొంతెప్పుడు పెగలనీదు!
మత్తుతప్ప మునగనీదు
బెల్టుషాపు మూయనీదు!
పాలకులు ఊక హోరు
కాటికి పంపే జోరు!

తిన్నోడికే తినబెట్టి
బోడినెత్తికి తలలంటు!
పిట్టల్ని పట్టేరు
గద్దల్ని వదిలేసి!

మంత్రాల యంత్రాంగం!
తంత్రాల మంత్రాంగం!!

7.12.2012. **( చైతన్య మానవి - త్రైమాస పత్రిక -అక్టోబర్ -డిసెంబర్ 2012 సంచికలో -పేజి 5 లో ప్రచురితం)

Thursday, December 6, 2012

మసి వాసన

కపిల రాంకుమార్//మసి వాసన//

మతమన్నది మౌఢ్యమై - పతనానికి మార్గమై
మనిషి కూలుతున్నాదు - మనసు కాలుతున్నది!

వందలాది మందమతుల రాజ్యకాంక్ష చూస్తుంటె
మనిషి మనసు కాలుతూ మసి వాసన వేస్తుంటే
బందిఖాన బ్రతుకులోన ప్రగతిమాత విలపించె
మందిరాలకోసం మందిరాలినపుడు!

ఈ రక్తం - ఈ దు:ఖం - మీ చిత్తం - ఈ యుద్ధం
తల్లిలాంటి భరతమాత తల్లడిల్ల భావ్యమా?
ప్రవహించె రక్తపు కాలువ - తలదించెను మానవత!
మతరక్కసి నర్త్రనలో దానవతే గంతులేయ!

సహనాలకు హద్దులులేక - కుహనాలకు బుద్ధులు మారి
దహనాలకు ఆజ్యంపోసే పవనాలను ఆపే దెన్నడు?
మారామే చేయబోని ఆ రాముని పేరు మీద
మానవుల మనుగడకు మచ్చతెచ్చు పనులేల?

నీ వార్ని చంపుకొనే మాయదారి మతమెందుకు?
నీ చెల్లి - నీ అన్న కనుపించర కనులుంటే?
చరితలోని సత్యాలకు - భవితనేల చంపటం?
భరతజాతి ఘనతనేల భావిలేక్ తుంచటం?

తరతరాల్ ఘర్షణలే కాలానికి వంతనలై
బానిసత్వ వర్షంలో వత్సరాలు తడిసాము
స్వాతంత్ర్యం సాధించుటలో సాగించిన సమరాలెన్నో
లక్ష్యాలను నెరవేర్చుటలో అడుగడుగున గండాలెన్నో?

నాటి స్పూర్తి మరల పొంది
కోటి గొంతు కోయిలలై
జనత ఘనత చాటవలె - సమత పాట పాడవలె!

6-12-2012 ఉదయం 5.20

(6-12-1992 - 6-12-2012 - 20 సంవత్సరాల కాలంలో ఇంకా మత సామరస్యం ఇంకా నెలకొనగపోగా ..అక్కడక్కడ జరుగుతున్న విధ్వంసాలకు స్పందనగా)

Wednesday, December 5, 2012

బాల్య, యౌవ్వన, కౌమార, వార్థక్యాలు

కపిల రాం కుమార్ //

చిలిపి చిలిపి చేష్టలు, చిన్నారి పొన్నారి నవ్వులపువ్వులు
జారిపడే తప్పటడుగులు, మంచి చెడుగులేమెరుగని
అల్లరుల వల్లరులు
ముద్దు తీర్చు ముచ్చటైన మారాముల బాల్యం!

ఉద్రేకం కనుపించదు యుక్తాయుక్త విచక్షణం
క్షణికానంద ఆవేశం క్రమ్మి కామాగ్నికి ఆజ్యం-
ప్రయోజనం పూజ్యం - క్రమమైనది కాకపోతే - యౌవనం!


కౌమార్యం - బాధ్యతాయుతం
సంతునికని - సత్కర్మల నిర్వహించి
బిడ్డల భవిష్యత్తే ధ్యేయంగా
త్యాగమయ జీవనం శ్లాఘనీయం!

వార్థక్యం - జీవితానికి ఆఖరి మెట్టు
అనుభవాల ప్రోదియై
ముందు తరాల వారికాదర్శప్రాయుడై
తాను కరిగిపోతూ కొవ్వొత్తిలా
కుటుంబానికి వెలుగు బాటలు వేస్తూ
పొద్దుండగానే యిల్లు చక్కదిద్దుకునే
మార్గం చూపుతూ
చాదస్తాన్ని మరో హస్తంగా (కొంత మంది దృష్టిలో)
అస్త్రంగా ప్రయోగించి
ఉపయోగపడటమే వృద్ధులకానందం!!!

మానవ జీవన చక్రంలో - ముఖ్య సక్రమ ఘట్టాలివే
ఎన్నో బాధల,వేదనల, సంతోషాల సమిశ్రన చిత్రం!

5-12-2012

@@@(సుమారుగా 40 సంవత్సరాల క్రితం సంస్కృత శ్లోకానికి స్వేచ్చానువాదం)

Thursday, November 29, 2012

పచ్చి నిజం

కపిల రాంకుమార్ //పచ్చి నిజం // ***

ప్రసవించి
పక్షం రోజులు కాకముందే
రక్తం స్రవించేలా
రక్కస రతితో దాహం తీర్చుకుంటున్న
యిటు పతిని వారించనూ లేక
వక్షం నుండి క్షీర బిందువుల బదులు
కేవల స్వేదబిందు్వులే కారుతుంటే
రక్తం పిండిన బాధను భరిస్తూ

బిక్కమొహపు పసివాడ్ని అటు లాలించనూ లేక
ఆ తల్లి తల్లడిల్లుతున్నది.!

పిల్లగాడి బలానికి మందులు తెమ్మని
దుడ్డులిస్తే
తేకపోగా పైపెచ్చు
ఇంకో జిలవర్థక ' మందు ' కొట్టివచ్చిన
పశుపతి కాదు పతి పశు బలానికి
నీరసంగా లొంగిపోతున్న దయనీయ స్థితి ఆమెది.!

నియంత్రణల హోరుకు కాలం చెల్లిందో
నియమ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందో
అర్థంకాక
అర్థనగ్న అచ్చాదనతో
సరిపెట్టుకోలేక
సరిపెట్టుకుంటూనే
రోదిస్తున్నదామె!

ఆకలి తీర్చగ అన్నం లేకపోయినా
ఆ-ఆకలికి కరవులేదని
పరువుకోసం
బరువుగా కాలం దొర్లిస్తున్నది !

పురుషాధిక్యతకు నలిగిపోతూ
ఏ ఆపన్న హస్తమైనా ఆలంబన యివ్వదా అని
ఎదురుచూస్తున్నది!!

29.11.2012
_________________________________________
*** ఇది 10.7.1991 రాత్రి 8.15 లకు
ఆలిండియా రేడియో కొత్తగూడెం ఎఫ్.ఎం. ద్వారా ప్రసారమైనది.