ఏడుకోలల బాయి ...ఒక పరామర్శ
దాదాపు పద్నాలుగు గజాల లోతు బాయి నుంచి ఎన్నికల శతకం చదవాను.
ఈ లోకపు కాలపు ఓటర్ల వెర్రిబాగులతనం ఎత్తి చూపుతూ చైతన్య పరిచే పద్యాలివి.
కవి, పరిశోధకులు, కాలమిస్ట్, ఉన్నతాధికారి ఆత్మీయ సాహితీ మిత్రుడు, ఏనుగు నరసింహారెడ్డి ఎంతో అభిమానంతో ఈ శతకాన్ని చదివి నాలుగు మాటలు అందించమన్నారు.
అదిరిపోయే మకుటంచూసి...
అబ్బురనడ్డాను
" మాయమాటల హామీల మర్మమెరిగి
గుర్తులేకుండ ఓటెట్ల గుద్దుతావు
ఓరి వెంకన్న! దోస్తుగా! ఒర్లబోతు
ఒక్కమాటన్న వినవారా! తిక్కలోడ! "
ఇది ఒక్కటే చాలు వారి ఆశయమేమిటో.
ఇన్నేళ్ళుగా ఓటరేవిధంగా మోసపోతున్నాడో, అనర్హులనెలా అందలమెక్కస్తున్నాడో, ఏమి చేయాలో, తన మిత్రుడు వెంకన్ననుద్దేశించి మాట విను ఓ తిక్కలోడా అని ఎంతో చనువుగా, మొట్టికాయలు వేస్తూ, చెప్పిన తీరు ప్రశంసనీయం.
స్వతహాగా ఉన్నతాధికారిగా ఉన్నత విలువలు పాటిస్తూనే సమాజం యెడల బాధ్యత కవిగా నిర్వహించడంలో సఫలమయినట్లే.
ప్రజా స్వామ్యం, ప్రజా క్షేమం ,చైతన్యం పట్ల నిబద్ధతతో శతకం ప్రకాశిస్తోంది.
మొద్దునిద్రపోతున్నవారిని బడితపూజ చేయగల సున్నితమైన మాటలు కొండొకచో
కొరడా ఝళిపించేలా, చురకలు వేసేలా అలతి పదాలతో శతకం నడుస్తుంది.
ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలనే
గట్టి కోరిక ఏడుకండేల బావిలో
కూలిపోకూడదనే శతకకర్తగా పడిన
తపన, పాఠకులకు కొట్టవచ్చినట్టు అవగతం అవుతుంది. అందులో సందేహం లేదు.
ఆత్మీయసాహితీ మిత్రులు నరసింహ రెడ్డి గారి అభినందనలు.
No comments:
Post a Comment