కొన్నేళ్ళ క్రితం చీకటి కొట్లో
ఆత్యవవసర దండనలో
జైలు ఊసలతో ఎన్ని చేతులు
ఊసులాడి ఊపిరాగిపోయాయో
ఎంతమంది నేతలకారణంగా
నిర్బంధాల మధ్య జీవితపు చేదుననుభవించారో
మాట్లాడాలన్నా సమాచారందచేయాలన్నా
లాఠీల విన్యాసాలు తుపాకి మొనల బెదిరింపులు, ఆంక్షలెన్నో
కుహనా ప్రజాస్వామ్య వ్యవస్థ
నిరంకుశావతారమెత్తి ఎన్ని నిజాలని ఎన్కౌంటర్ చేసిందో
అనుభవాలు పంచుదామనే
ఆశలు ఎన్ని నిరాశకు గురైనాయో
ఎన్నో జైలు గోడలపై నినాదాలు రచించిన
కవులెన్ని ఉద్యమాలకూపిరి పోసారో
రాక్షస చట్టాలను ఎదిరించిన యోధులు
రక్షకభటుల చేతిలో హతులయ్యారో....
No comments:
Post a Comment