కపిల రాంకుమార్//ఉసురు// **
మును టోలెనే మల్ల - ముందెత్తు బులిపించి
నసిగి నసిగీ యేదొ - మునగ గొడుతుంటారు
మాదారికడ్డాలు లేరయ్యా యింక
మాయ దారీ ముచ్చటేలయ్యా!
దోసాలు దొడవగుతున్నాయి
యేసాలతో యిసిగి యేసార్ వోనాము!
పోసుకోలూ కబురు కోరయ్యా! మా
పొట్ట నిండుతాద పోరయ్యా!
దేసె బాగ్గెంబెరిగి తిర్గబడెనన్నారు
లెక్కేసి మాబతుకు సిక్కులిడునన్నారు!
వుత్తుత్తి కూతలకు వోలయ్యా మము
లుబ్బిపొమ్మంటారు పోరయ్యా!
కన్నె పిల్ల్కు పరువు గప్ప గుడ్డేనేదు!
తలదాసుకోనీడ తలపులెంచగరాదు!
కొరకాసుతో తలలు వోలయ్యా ! మమ్ము
గో్కుక్కొమ్మంటారి పోరయ్యా!
పసిగందులకే జావ ససిగ దొరుకుతనేదు
రోగాలరొచ్చులో మాగి సత్తున్నాము!
సన్నకారుకు సుగములోరయ్యా1
సున్నయైపోనాది పోరయ్యా!
కసుగాయ వొసివాడి దుసిగిల్లుతున్నాది
పసిగుండెలలకచ్చె ముసురుగొంటున్నాది.
వుసురూరికేపోదు వోలయ్యా మిమ్ము
కసిబట్టి తరుముద్దిలేరయ్యా!
7.11.2012 సా.4.02 ని.
**(రావెళ్ళ వెంకట రామారావు -కవి- తెలంగాణా సాయు్ధపోరాటయేధుడు-
గోకినేపల్లి /ముదిగొండ మండలం, మా ఖమ్మం జిల్లా - వారి రచనలోని పల్లె
పదాల్ను ఆస్వాదించండి))
No comments:
Post a Comment