16, ఫిబ్రవరి 2013, శనివారం

తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు



తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు
సంవత్సరం           పుస్తకం                                సాహితీ విభాగం                   రచయిత
2007                  శతపత్రం                                ఆత్మకథ                    గడియారం రామకృష్ణ శర్మ
2006                  అస్థిత్వ నదం ఆవలి తీరాన          చిన్న కథ                   మునిపల్లె రాజు
2005                  తనమార్గం                        కథా సంకలనం                   అబ్బూరి ఛాయాదేవి
2004                 కాలరేఖలు                       నవల                 అంపశయ్య నవీన్
2003                  శ్రీ కృష్ణ చంద్రోదయము          పద్యరచన            ఉత్పల సత్యనారాయణాచార్య
2002                  స్మృతి కిణాంకం                  వ్యాసాలు             చేకూరి రామారావు
2001                  హంపి నుంచి హరప్పా దాకా   ఆత్మకథ             తిరుమల రామచంద్ర
2000                 కాలాన్ని నిద్ర పోనివ్వను       పద్యరచన            ఆచార్య ఎన్.గోపి
1999                   కథాశిల్పం                        వ్యాసాలు             వల్లంపాటి వెంకటసుబ్బయ్య
1998                   బలివాడ కాంతారావు కథలు   కథలు                 బలివాడ కాంతారావు
1997                   స్వప్నలిపి                        కవిత                  అజంతా (పి. వి. శాస్త్రి)
1996                   కేతు విశ్వనాథ రెడ్డి కథలు     కథలు                 కేతు విశ్వనాథరెడ్డి
1995                   యజ్ఞంతో తొమ్మిది             కథలు                 కాళీపట్నం రామారావు
1994                   కాలరేఖ                           విమర్శ               గుంటూరు శేషేంద్రశర్మ
1993                   మధురాంతకం రాజారాం కథలు            కథలు                 మధురాంతకం రాజారాం
1992                   హృదయ నేత్రి                    నవల                 మాలతీ చందూర్
1991                    ఇట్లు మీ విధేయుడు            కథలు                 భమిడిపాటి రామగోపాలం
1990                   మోహనా ఓ మోహనా          కవిత                  కె.శివారెడ్డి
1989                   మణిప్రవాళము                  వ్యాసాలు             ఎస్.వి.జోగారావు
1988                   అనువాద సమస్యలు           విమర్శ               రాచమల్లు రామచంద్రారెడ్డి
1987                   గురజాడ గురుపీఠం             వ్యాసాలు             ఆరుద్ర
1986                   ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం   సాహితీ విమర్శ      ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం
1985                   గాలివాన                         కథలు                 పాలగుమ్మి పద్మరాజు
1984                   ఆగమ గీతి                       కవిత                  ఆలూరి బైరాగి
1983                   జీవనసమరం                    వ్యాసాలు             రావూరి భరద్వాజ
1982                   స్వర్ణ కమలాలు                  కథలు                 ఇల్లిందల సరస్వతీదేవి
1981                    సీతజోస్యం                        నాటకం               నార్ల వెంకటేశ్వరరావు
1979                   జనప్రియ రామాయణం         కవిత్వం               పుట్టపర్తి నారాయణాచార్యులు
1978                   కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు)         కవిత్వం, నాటకాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి
1977                   కుందుర్తి కృతులు                కవిత్వం              కుందుర్తి ఆంజనేయులు
1975                   గుడిసెలు కూలిపోతున్నాయి   కవిత్వం               బోయి భీమన్న
1974                   తిమిరంతో సమరం             కవిత్వం               దాశరథి
1973                   మంటలు మానవుడు           కవిత్వం               సి.నారాయణరెడ్డి
1972                   శ్రీశ్రీ సాహిత్యము                 కవిత్వం               శ్రీశ్రీ
1971                    విజయవిలాసము: హృదయోల్లాస వ్యాఖ్య            వ్యాఖ్యానం            తాపీ ధర్మారావు
1970                   అమృతం కురిసిన రాత్రి         కవిత్వం               దేవరకొండ బాలగంగాధర తిలక్‌
1969                   మహాత్మకథ                      కవిత్వం               తుమ్మల సీతారామమూర్తి
1965                   మిశ్రమంజరి                      కవిత్వం               రాయప్రోలు సుబ్బారావు
1964                   క్రీస్తుచరిత్ర                         కవిత్వం               గుర్రం జాషువా
1963       పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా      నవల                 త్రిపురనేని గోపీచంద్
1962       విశ్వనాథ మధ్యాక్కరలు                    కవిత్వం               విశ్వనాథ సత్యనారాయణ
1961        ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము               జీవిత చరిత్ర          బాలాంత్రపు రజనీకాంతరావు
1960       నాట్యశాస్త్రము                                చరిత్ర                  పోనంగి శ్రీరామ అప్పారావు
1957       శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర                జీవిత చరిత్ర          చిరంతానందస్వామి
1956       భారతీయ తత్వశాస్త్రము                    పరిశోధన             బులుసు వెంకటేశ్వర్లు
1955       ఆంధ్రుల సాంఘిక చరిత్రము               చరిత్ర                  సురవరం ప్రతాపరెడ్డి

1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.
తెలుగు భాషకు చెందిన అనువాదాల పురస్కార గ్రహీతలు
సంవత్సరం           అనువాద పుస్తకం పేరు         అనువాద రచయిత             మూలం పేరు (భాష, సాహితీ విభాగం)                మూల రచయిత
2005      మాస్తి చిన్నకథలు               జి.ఎస్.మోహన్       సన్న కథెగళు సం. 12-13 (కన్నడ, చిన్న కథలు)     మాస్తి వెంకటేశ అయ్యంగార్
2004     పర్వ                   గంగిశెట్టి లక్ష్మీనారాయణ        పర్వ (కన్నడ, నవల)                        ఎస్.ఎల్.బైరప్ప
2003      శ్రీ దేవీభాగవతము   బేతవోలు రామబ్రహ్మం          దేవీభాగవతం (సంస్కృతం, పురాణం)      వేదవ్యాసుడు
2002      మాటన్నది జ్యోతిర్లింగం         డి.వి.సుబ్బారావు    కన్నడ 'వచనాల' సంపుటి (కన్నడ, పద్యాలు)        వివిధ రచయితలు
2001      ఆత్మ సాక్షాత్కారము           పింగళి సూర్య సుందరం         సెల్ఫ్ రియలైజేషన్ (ఇంగ్లీషు, జీవిత చరిత్ర)           బి.వి.నరసింహస్వామి
2000     ఛాయారేఖలు        ఆర్.ఎ.పద్మనాభరావు           షాడో లైన్స్ (ఇంగ్లీషు, నవల)   అమితావ్ ఘోష్
1999       సగం వెన్నెల రాత్రి   వేమరాజు భానుమూర్తి          ఆధ్ చనాణీ రాత్ (పంజాబీ, నవల)         గుర్దయాళ్ సింగ్
1998       మెట్టుకు పైమెట్టు    ఇలపావులూరి పాండురంగారావు          ఎనిప్పాదికళ్ (మలయాళం, నవల)        తక్కాళి శివశంకర పిళ్ళై
1997       గడచిన కాలం        బి.కె.ఈశ్వర్           కజింజ కాలం(మలయాళం, నవల)         కె.పి.కేశవ మీనన్
1996       కావ్య ప్రకాశము      పి.శ్రీరామచంద్రుడు   కావ్య ప్రకాశం (సంస్కృతం, వ్యాఖ్యానం)    మమ్మట
1995       తలదండం            భార్గవి పి. రావు      తలెదండ (కన్నడ, నాటకం)     గిరీష్ కర్నాడ్
1994       అమృతం విషం       పి.ఆదేశ్వరరావు     అమృత్ ఔర్ విష్ (హిందీ, నవల)           అమృత్లాల్ నాగర్
1993       సమయం కాని సమయం      మద్దిపట్ల సూరి       అసమయ (బెంగాలీ, నవల)     బిమల్ కార్
1992       తమస్    యార్లగడ్డ లక్ష్మీప్రసాద్          తమస్ (హిందీ, నవల)          భీషమ్ సాహనీ
1991        తిరుక్కురళ్           సి.ఆర్.శర్మ            తిరుక్కురళ్ (తమిళం, వ్యాఖ్యానం          తిరువళ్ళువార్
1990       గణపతి రామాయణ సుధ      చర్ల గణపతిశాస్త్రి      శ్రీమద్రామాయణం(సంస్కృతం, పురాణం) వాల్మీకి
1989       రవీంద్రుని నాటికలు             బెజవాడ గోపాలరెడ్డి             బిదాయెర్ అభిశాప్, చిత్రాంగద, మొ.. (బెంగాలీ, నాటికలు)       రవీంద్రనాథ టాగోర్
బయటి లింకులు

15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

|| చింత పడమాకు పటేల ||

కపిల రాంకుమార్ || చింత పడమాకు పటేల ||

పటెల్ గిరి పోయిందని - చింతపడమాకు
పుట్టికతో పొటీలీవు - చెంతనేనున్నాను

పదిమందికి బువ్వెట్టే
సిరికలిగేవున్నావు
కడగండ్లు తీర్చనీకి
కండకలిగేయున్నావు!

ఆలమంద నమ్ముకుంటె
అరలచ్చవస్తాది - మా
ఆడమంద గుండెల్లో
పెద్దపీటయేస్తాది!

యెన్నిసార్లు యెన్నెల్లో
వాగులెంట తిరిగాము
సిననాటి సెలికాడ
నేనుండ దిగులేల?

బుర్రమీసమొడిసిపట్టి
కిర్రుసెప్పులేసుకోని
రచ్చబండమీద
(మా)రాజులాగుంటావు!

గుండెలోన గుబులుంటె
గాదెలెట్ల నిండేను?
ఆండగా నేనుండ
గండాలు దాటుదాము!

ఊరువాడ నువ్వంటే ఉరికొస్తాది
ఏరువాక సాగనీకి కదిలొస్తాది!
కడుపు పండలేదాని కలవరమంద్కు
కడుపు నింప కూలోల్లకి కన్నతండ్రినీవె!

కొలువుకన్న పరువు మిన్న
కలతలేక బతుకేందుకు
పసుపుతాడు కట్టవోయి
కట్టుకున్న ఆలినౌత!

గువ్వలమై దండలోని పువ్వులమై
ఒద్దికగ యిరువరము సాగిద్దామిక కాపురము!

(అమలిన శృంగారాని అద్దంపట్టే గీతం)
15.2.2013 ....రాత్రి 7.35 .....

|| మావూరి సిన్నోడు ||

కపిల రాంకుమార్ || మావూరి సిన్నోడు ||

మావూరి సిన్నోడు మాకెంతో నచ్చాడు
సీకటిలోవున్న మాకు సిరుదీపమయ్యాడు

యేపసెట్టు కొమ్మలపై కోయిలలా కూసాడు
నొప్పులేమిలేకుంద సదువుపురుడుపోసాడు

లంకెలబిందెలవిలువలను మించే
అచ్చరలచ్చల అంకెలు తెలిపి
సంకెల్మనుగడ తొలగేలా
సంకురాత్రిరి పండుగ చేసాడు

మడ్డికారే బట్టలి వీడి పరిశుభ్రత తెలిపాడు
యెడ్డిమొగం పెదవుల్పై సిరునవ్వులు నిలిపాడు
దేవుడనేవాడిని మనిషిలోనె సూడమని
బండరాతి బతుకుల్లో గుండెవీణ్ మీటాడు!

సిత్తుగ తాగి మమ్ముల కోట్టె
మత్తుమామల్ మైకం దింపినాడు
సత్తువ సంపె సారా భామను
మొత్తవద్ద్నె మత్తుపెట్టిన సిన్నాడు

మనేదన్నది పోగొట్టి మాకండగ నిలిచాడు
బతక తెలివి అందించి మా ప్రేమను గెలిచాడు
ఉదయించె సూరీడై కొత్త యెలుగు తెచ్చాడు
అగ్నానపు మబ్బులనెల చెల్లచెదరు చేసాడు!

15.2.2013 ఉ. 10.27
(అక్షరాస్యతా ఉద్యమ ఫలితాలపై పల్లె మగువల స్పందన)

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

|| శ్రమైక గీతాలు ..||.1||

కపిలరాంకుమార్ || శ్రమైక గీతాలు ..||.1||

శ్రమజీవులు ఒడ్డెరోళ్ళు - నవసమాజపు మైలురాళ్ళు
గతచరిత్ర కానవాళ్ళు - నికార్సయిన గీటురాళ్ళు

శ్రమజీవుల వర్గానికి నేతలుగా నిలంచారు
సుఖజీవనమన్నది పనిలోనేవున్నదన్నారు
నిలువెత్తు ఋజువులా దుర్భేద్య బురుజులు
నింగిని తాకేతి గోపురాలు- నీటినాపిన రాతి వారధులు!

ఎర్రటి యెండలో బుర్ర చుర్రుమంటున్నా
పలుగుపార పట్టి మట్టి తట్టయెత్తి
కండలు కరిగించి కొండలు తొలిచి
కాల్వలు, భవనాలు సృష్టించు కాయాలు!

పూరిగుడిసె కాపురాలు బండినిండిం సంతు
గుండే దిగులులెనివారు గంజిమెతుకులె పరమాన్నం!
తాత తండ్రినాటినుండి వృత్తిలో కొనసాగుతూ
పిల్లపాప చదువు సంధ్య పొందలేక సాకుతూ

నలుగురిలో తలయెత్తుకు కలివిడిగా తిరిగేందుకు
బండచాకిరి బతుకున అండనిచ్చు చేతులకై
యెదురుచూచు వారికి ఆదుకునే వారున్నరని
వెన్నుదట్టి ఆలంబన నందించగ కదులుదాం !

12.02.2013 (కొత్త సంకలనంలోది) సా.4.18

11, ఫిబ్రవరి 2013, సోమవారం

|| నా పాట ||

కపిల రాంకుమార్|| నా పాట ||

నా పాట పంచామృతమే కాదు
పంచతంత్ర సారం కావాలి

జోలలే కాదు జోదులకు ప్రేరణ కావాలి
కోటగా మారి ఆశ్రయం కావాలి
తోటగా మారి సేద తీర్చాలి
బాటగా గమ్యం చేర్చాలి!

మాటగా మారి ఉద్యమ జెండా కావాలి!
తూటాగా మారి అక్రమాల నిర్జించాలి!
ధిక్కారపాఠమై అతివలకండకావాలి
గాయకులు ప్రజాపోరు శకటమవ్వాలి!

ఏతా వాతా నాపాట!
అనధికార శాసనకర్త కావాలి!
అందరిని కలిపే వారథి కావాలి
విప్లవాలకు సారథి కావాలి!

11.2.2013 ఉ. 9.25

10, ఫిబ్రవరి 2013, ఆదివారం

కపిల రాంకుమార్ || సూక్తులు హితోక్తులు ||
1) ఎంత ఒదిగి చెప్పినా సుభాషితం వెలుగును కుమ్మరిస్తూనేవుంటుంది..

-----------------------మహాభారత

2) నీవు చదివినపుడు సంతోషపరిస్తే గొప్ప సూక్తి ఉద్భవిస్తుంది..---------------------..మాంటేగ్

3) తాత్వికత స్పటికంగా మార్పుచెంది సూక్తి అవితుంది ....------------------షల్లి పహమీం

4) పెద్దగా చదువుకోనివాడికి సూక్తులపుస్తకం దవడం అత్యంత ఉపయోగకరం ..-------------.వింస్టన్.

5) వివేకులు కాలాన్ని ఒడపోసిబణ్దువల్ల సూక్తులు ఏర్పడతాయి .------------.డిజ్రేలీ

6) సూక్తులంటే నేను భరించలేను; నీకు తెలిసింది చెప్పు ..----------------ఎమర్సన్.

7) సమయం వచ్చినప్పుడు సూక్తి సైనికుల కంటే ్శక్తివంతమైనది --------------- గేట్స్.

8) నాకు నేనే సూక్తి వెల్లడిస్తాను అది నా సంభాషణకు మసాలాలా పనిచేస్తుంది. .....----------జి.బి.షా

9) ఉపయోగించడానికి నుందు ఆ గ్రంథం చదువుతారు --------.. ఎమర్సన్.

10) ఉపన్యాసంలో, వ్యాసంలో, గ్రంథంలో సూక్తి సైనికుడి చేతిలో తుపాకీ వంటింది. అది అధికారయుతంగా చెబు్తుంది. .--------.....బ్రెండాన్ ఫ్రాంసిస్

మిత్రుడు పా.శ్రీనివాసరెడ్డి నిన్న నాకు తన గుర్తుగా బహుకరించిన '' ప్రపంచ ప్రఖ్యాత సూక్తులు - హితోక్తులు ''-పూర్విత .... పుస్తకం వెనుక పేజీలీవి.

10.9.2013 సా.4. 20 ( పారువెల్ల శ్రీనివాసరెడ్డికి ..అభిమానానికి కృతజ్ఞతa లతో)

||మినీలు ||

కపిల రాంకుమార్ ||మినీలు ||

కుక్కతోక వంకర
పాలక వర్గాల తీరుర!
కాగ్ లు, కోర్ట్లు తిట్టినా
బే ఖాతరురా!

***

చిన్నప్పటి కథలో
రాళ్ళువేసి పైకొచ్చిన
నీరు తాగిందిఒక కాకి!
కాని రాళ్ళు నిండుతాయే కాని
నీళ్ళొస్తాయా పైకె? ఆలోచించకుండానే
ఊ కొట్టీసాం!

***

అనుబంధాలు కొరవడితే
సంబంధాలు తెగిపోతాయి!
అందుకే
అనురాగాలు శ్వాసించక పోతె
అభిమానాలు శ్వాస విడుస్తాయి!

***

సంయమనం లోపిస్తే
రాయబారాలు విఫలం
ఆచారాలు మౌఢ్యమైతే
సంస్కారాలకు తిలోదకాలే!

***

చర్యకు ప్రతి చర్య
అనివార్య లక్షణమైనా
ప్రతీ దానికి చర్య
లక్ష్యం కాకూడదు!

***

ప్రేమకి - కోపానికి
అనుసృజన యెక్కువ
కామానికి - కార్యానికి
ఆలోచన బహు తక్కువ!

***

పట్టుదల దక్షత
కొరవడితే
మొండితనం వివక్షగా
రూపొందుతుంది!

***

ఇచ్చి పుచ్చుకోటం
సజీవ ప్రక్రియ
అది విలోమమైతే
మనిషి జీవచ్చవమే!

****
10 ఫిబ్రవరి 2013 సా. 3.10

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

||వితరణలో తస్కరణెందుకు?||

కపిల రాంకుమార్ ||వితరణలో తస్కరణెందుకు?||

వక్ర గతిని కాల చక్రం భ్రమిస్తున్నప్పుడు
రే-బవళ్ళతేడాలేక నిప్పులు వర్షంలా కురుస్తున్నప్పుడు
రేగిన, చెలరేగిన గాలి దుమారం తోడైనప్పుడు,
' సోషలిజం ' అమలు పరుస్తున్నట్లు
అగ్ని ఉక్కు ఖిల్లాల నుండి,
మురికి గళ్ళీలవరకు
ఇంటి తాటాకు కప్పు ఎండి
మంటల్లో - పూరి గుడిసెలు
వాటితో పాటు పెంకుటిళ్ళు
'' శోషలిజానికి '' గురై
సర్వస్వం పోగొట్టుకొని
గట్టిగా ప్రాణాలు బిగపట్టుకొని,
ఆక్రోశించే ఆర్తనాదాలు,
ఆక్రందనలు
అసాధారణ ప్రకృతి వికృతచేష్టకు
బలికావటానికి వెనకాల
ఏయే అదృశ్య శక్తులున్నాయో
యెవరికెరుక???

కాని ఉదారులు, పెద్దలు
పెద్దపెద్ద ఉదరాలున్నవారు
బూర్జువాలు కొందరు, భూస్వాములు కొందరు
దయార్ద్ర హృదయులతో పాటుగా
వెనకపడతామేమోనని వితరణ మొదలెట్టారు
పత్రికలకెక్కటానికి,
తమరు చేసిన పాత పాపాలకు, పాతకాలకు
దానం ప్రత్నామాయ పరిష్కార మార్గమని
సంస్కార (వేష)మని!
బియ్యం సరఫరాలో
పాల క్యూలో, బట్టల పంపిణీలో
ద్రోహం - మోసం
కల్తీ శాల్తీ గల్లంతు ఆనమాయితి!
వితరణలో తస్కరణెందుకు?
సమసమాజ సువ్యవస్థ కోసం
పాటుపడతామని వాగ్దానాలిచ్చి
గోడ చాటు వ్యవహారాలకు చోటిచ్చి,
బొజ్జ పెంచుకునే అప్పలసామీలు జాగ్రత!
ఆర్తులకు అవేదితులకు
సక్రమ పంపిణీ జరిపించండి!
మధ్యలో తమరు భక్షించకుండా
వారిని రక్షించండి!

8.02.2013 రాత్రి 7.45

4, ఫిబ్రవరి 2013, సోమవారం

జర నజర్ అందాజ్ కరో!

కపిల రాం కుమార్ || జర నజర్ అందాజ్ కరో||

ఇంటి కట్టుబడిలో
గానుగాడిన సున్నానికి
బూడిద కలిసిన సిమెంటుకి
ఫలితాలెలావుంటాయో!
జర నజర్ అందాజ్ కరో!

నినాదాల ప్రేలాపన
కానేరదు కవిత
జీవనాల వ్యథాభరిత
చరిత గతుల చర్నకోల!
మగర్ తు బందర్ న బనో!

మాటమీద నిలువలేక
మాటమార్చి తప్పుకుంటు
వాయిదాల యంత్రంగ
పుటెత్తులు చెల్లవింక!
అవాజ్ దో! వజీఋ పర్ దావా కరో!

పురాణాల గాథల అగాథాల పడబోకు
సాములోర్ల పాలపడి  సంస్కారం కోల్పోకు
తర్కించిన ఉపనిషత్తులె వికాసానికి విత్తులు
గత తార్కిక వాదాలే నిజాల్కు బద్ధులు!
ఇంక్విలాబ్ సె మొహ్బత్ కరో!

ఆశయం అంగడి సరుకు కాదు
అవేశం  అరువు తెచ్చుకునేదీ కాదు
సంయమనం సంస్కార ఫలితం మాత్రమే
అవేదన అనుభవిస్తేనే పోరుకు మార్గమౌతుంది!
నిభానాకేలియే వాదా కరో -హిమ్మత్ న హారో!

గుణపాఠపు పునాదులే
సమసమాజ ప్రేరకం
గణీతాలు గుణింతాలు
సంప్రదాయ స్ఫోరకాలు
బుజుర్గోంకా బాత్ పర్ ధ్యాన్ దో!

అయినప్పటికి ఆలోచనాలోచనాల
బేరీజుతో
కిసీ పాత్ పర్ జానా
ఆరాం సే నిర్ణయ్ కరో!

4.02.2013 సా.4.10







తస్మాత్ జాగ్రత!

కపిల రాంకుమార్ ||తస్మాత్ జాగ్రత! ||

పడావు పదిన పొలంలా
యేపుగా పెరిగిన గుబు ముళ్ళపొదలా
పగ్గాల్లేని పరువాలు
యింగిత జ్ఞానం నశించి ఒడిగట్టుతున్న అత్యాచారాల్లా
హత్యలతో పాటు పెరిగిపోయిన బ్రూణహత్యల్లా
అంతులేని అవినీతి యెల్లడల వ్యాపించింది!
యే రంగం మినహాయింపు కాదు!
ఆఖరికి అంతరంగాలు సైతం అతీతం కాదు!
సర్కారు సుభాషితాలు వల్లించడానికే పరిమితమై,
పెరుగుతున్న ఆగడాలు అరికట్టే కనీస నైతికత కోల్పోయి,
చర్యలు తీసుకోకపోగా, వారికే వత్తసు పలుకుతూ
సపర్యలు - పరిచర్యలు చేస్తూ
అగ్నికి ఆజ్యం తోడైనట్లు ప్రజాస్వామ్య సూత్రాలు
స్థానభ్రంశం చెంది విరుగుట పెరుగుట కొరకేనన్నట్లు
మంగళ్సూత్రం కట్టుకుని
అవినితితో కలకాలం కాపురం సాగిస్తోంది!
**
కొన్నిసా మెతలు నిజమౌతున్నా
వాస్తవాలను అంగీకరించలేని వ్యవస్థైంది!
పైపెచ్చు సామెతల మీదే ఆగ్రహించేలా
వ్యవహరిస్తోంది, కులాల మతాల ముసుగులో
పబ్బం గడుపుతూ
సదరు అనుభవాలే త్రోసిరాజనటం,
మంచి మాటలకు సైతం వక్ర భాష్యాలు చెప్పటం,
నే చెప్పింది చెయ్యమంటూ, నే చేసేది చెయ్యొద్దు అంటోంది!
**
మనం శాంతమూర్తులం - యేమీ పట్టించుకోం!
పోరాటం చేసే వాళ్ళు యెలాగూవున్నారనే నిర్లిప్తత!
కష్టాలు, నష్టాలు భరిస్తూనే వుంటాం!
పల్లెత్తు మాట అనం!
అనుభవించడానికే సిద్ధపడ్డాం!
క్షుద్బాధలకు ' రోటీ' కరువైనా
ఆ బాధల ' రోటిలో ' తలదూర్చి రోకటిపోటుకు వెరువని వాళ్ళం!
మనమెవరో మనకే తెలియదు
తిరిగబడాలా?
పారిపోవాలా?
కూరుకుపోవlలా?
మీమాంసలో నలిగిపోయే జాతికి వారసులం
(రంథి సోమరాజు అన్నట్లు)
అలాగేవుందామా?
' సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్లా '
ఐక్యంగా పోరాడమన్న శ్రీశ్రీ దారి పడదామా!
పడావు పొలాలంలా ఉందామా!
తేల్చుకోవాల్సిన సమయం
మేలుకోవాల్సిన ఘడియ
వచ్చింది!
తస్మాట్ జాగ్రత! జాగ్రత!

4.02.2013 ఉదయం 10.10

అంతస్సారం బతుకుపోరు! - అరుణ్‌సాగర్

అంతస్సారం బతుకుపోరు!
- అరుణ్‌సాగర్

నిన్ను చదువుతుంటే నీతో మాట్లాడుతున్నట్లే ఉంది. నీదైన మాడ్యులేషన్‌లో నిన్ను వింటున్నట్టే ఉంది. నువ్వెట్ల ఆలోచిస్తవో అట్లనే రాసినట్లుంది. అందులోని ఫొనెటిక్ బ్యూటీ గుండె మడికి నీరు పెడుతూనే ఉంది. ఇదంతా నీ స్నేహంలా నీ ప్రేమలా స్వచ్ఛంగా హాయిగా ఉంది. నీ గాంభీర్యంలా సూటిగా ధాటిగా ఉంది. లవ్ యూ.

నువ్వయితే నవ్వుతా చెబుతావు, తమ్ములుంగారూ ఎవడికోసం రాస్తున్నాం రా ఏమి రాస్తున్నాం. ఆర్టు పటాలు కట్టించుకుని ఏ స్టారు హోటలు గోడకు వేలాడిపోతామ్‌రా అని. అందుకేనా గురూ కవిత్వమంటే సూర్యుడు చంద్రుడు కాదు నేలతల్లి కదలికంటూ ఓ కొటేషన్ కొట్టావ్. స్టయిల్ పేరుతో క్రాఫ్ట్ పేరుతో కమ్యూనికేట్ కాని కవితలు రాస్తే గొప్పనుకుంటున్నావా మేస్టారూ అయితే వినండొక ప్రకటన - ఇదే కవిత్వమన్నోళ్లు ఇలాగే ఉంటుందన్నోళ్లు చరిత్ర చెత్తబుట్టలో కలిసిపోయారు. అందుకే కవీ భావాలు కురిసి వెళ్లు నీకు తోచినట్టు రాసివెళ్లు. కవీ ఇవీ నీ మాటల్.

మరీ ఇంత కచ్చితంగా మాట్లాడితే ఏం జేయగల్తం, ఓకే చదువుకుంటం. కానీ గురూ మునుషుల మధ్య ఉన్న అస్పష్టలతో పోలిస్తే తొక్కలో కవిత్వంలోని అస్పష్టత ఏపాటిది చెప్పు? అయినను నీకే వేయవలె ఓటు.

వచన కవిత్వాన్ని వండి పెట్టాలని వచ్చాడు గానీ, పుట్టడానికి గిట్టడానికీ మధ్య కరుసైపోకూడదన్న ఒక్క కోరికే దీనికి బేస్! ఇది శీనన్న విన్నపం : మనసు తొణికినప్పుడు ఒలికిన సిరాచుక్కలు పిడికెడు ఆసరాతో మన మనసు కాగితంపై కవిత్వమై పుట్టేందుకు పడిన ఆరాటమిది పోరాటమిది అభ్యుదయగీతమిది. ప్రతీకాత్మకత శ్రుతి మించినా ప్రత్యేకత సంతరించుకున్న తాజాదనపు పరిమళమిది. ఇదే పాట ప్రతీచోట ఇలాగే పాడుకుంటున్న శిశువా, నువ్వయినా నేనయినా ఇదే గీతానికి మరో రెండు పాదాలు పాడుకుంటూ వెళ్లిపోవాల్సిందే. కానీ, అన్నా నువ్వు ఎక్కడున్నా నీ పాట జనం చెవుల రింగుమని మోగాలిఎంత చల్లని కవిత. ఎంత స్పష్టమైన కవిత. ఎంత అందమైన కవిత. ఈన నిన్నూ నన్నూ వాళ్లావిడనూ ప్రేమిస్తున్నట్టు ప్రకటించేందుకు కవిత్వం రాశాడు. ఈ మన్నునూ నాన్ననూ నాన్న ప్రేమించిన ఎద్దునూ మిస్సవుతూ కవిత్వం రాశాడు. ఈన మట్టిగట్టు, మడిచేలూ నుంచి మహానగరం వరకూ విస్తరిస్తూ కవిత్వం రాశాడు. ఎంతటి విప్లవాగ్రహం రగిలించాడో అంతటి రొమాన్సిజం పండించాడు. చెప్పకూడదు కానీ, తలలో తలపు వూల వలపు వాసన ఆఘ్రాణించాడు. ఏమి ప్రేమాస్పదుడు గురూ. నానమ్మ ధైర్యం, అమ్మమ్మ ఊపిరిలో జనించిన శక్తి, వాళ్లావిడ ఇచ్చే బీపీబిళ్ళ, కూతురు ఇచ్చే మరోఛాన్స్... ఈ కవిత్వం ఒక ప్రేమ ప్రకటన! ఈ వాక్యాలు కృతజ్ఞగీతాలు.

భూమంటే ఒక కమోడిటీ అయిపోయిన కాలంలో నేలనూ నేలమీది ఆవరణాన్నీ మానవ సముదాయంలో భాగంగా చూడగలిగిన ఒక మట్టిమనిషి, అందుకే తను ఛాతీ మీద పూసుకున్న మట్టినీ, తను ఈదులాడిన చెరువు నీళ్లనీ ఆఖరికి ఎణభై నంబరు వంకాయరంగునేత చీరనీ తన కవిత్వంలో భాగం చేశాడు. తన జీవావరణంలో ప్రవహించిన సమస్త సంగతులనీ సాహిత్యంలో రికార్డు చేశాడు. పొలిమేరకీ పడమరకీ మధ్యతెగిపోని పేగులాంటిదేదో ముడిపడింది. అందుకే పొలిమేర దాటాడో లేదో పోగొట్టుకుంటాడు మనసు కొట్టాడితే పయనమవుతాడేమో గానీ మట్టివాసన లేక ఉక్కిరిబిక్కిరైపోతాడు. నీకూ నాకూ కొంత ఆక్సిజన్ కావాలి... మట్టిని తడిపి ఆవిరై పుట్టిన ప్రాణవాయువును మోసుకొచ్చే కవిత్వం కావాలి. గుండె ఊపిరితిత్తులూ మలినాలను వీడి పరిశుభ్రమై వికసించాలి. ఇదిగో ఇక్కడొక వాగ్దానం ఆశాదీపం వెలిగిస్తోంది.

చలనశీలి. ప్రవాహం ప్రియమైన జీవనశైలీ సూత్రం. కానీ శీనన్న రాబర్ట్‌ఫ్రాస్ట్ కాదు. అందుకే - తను కలిసి పయనించే ప్రవాహం వేరు, తను చెవులు రిక్కించి వినే ప్రవాహసంగీతం వేరు! అది ప్రజోద్యమహోరు క్రాశ్రీ తల్లివేరు. అందుకే అంతిమంగా ఈ కవిత్వ పంక్తులలో అంతస్సారం బతుకుపోరు!

కొందరు వెంటిలేట్ అవడానికి ఆ చీకటి గదిలో అర్థరాత్రి గుడ్డిదీపం వెలిగించుకుని కూర్చుంటారు. మరికొందరు అలవోకగా అల్లికలూ కుట్లూ వేసి కళాతపస్వి కవితారత్నాలై తిష్టవేస్తారు. ఇంకొందరు సందేశాత్మక శిల్పాలు చెక్కి పీఠాధిపతులై విలసిల్లుతారు. పలువురైతే ఎక్‌స్ట్రా ఆర్టిస్టులై కేవల - అత్యాధునికులై వేలాడుతారు. (దేన్ని పట్టుకుని?)

అయితే బాబూ ఇక్కడలా కాదు. ముసుగు వెయొద్దు మనసు మీద! పదునైన ఖడ్గం పట్టుకుని చీరేయడమే. అందుచేత సోదరులారా మనం ముందే చెప్పుకున్నట్టు శీనుగారి వాక్యాలు పోజు కొట్టవు. ఎందుకనగా అవి మంచి మాగాణిలో చేసిన అక్షర సేద్యంలో పుట్టాయి. ఆయనెవరో బాధపడ్డారు : మాయమై పోతున్నడన్నో మనిషన్నవాడూ అని. ఇదిగో ఈ మనిషి కవిత్వాన్ని చూడండి... పరిచయం చేసుకోండి. స్నేహం చేయండి. మీరు నమ్ముతారు - మాయమైపోలేదని మనిషన్నవాడు.

మనకి ఆ మాత్రం కామన్‌సెన్స్ లేదు... ముందుమాటకైనా ముందస్తుమాటకైనా కొన్ని కొటేషన్లు కొట్టాలని! కానీ,... కోట్ చేయాలంటే కోటి. పునర్ మూల్యాంకనము చేయుటకు నీవెవడవు, నేనెవడను? చివరాఖరికి శీనన్న తమ్ములంగారలము.

ఈ కవిత్వాన్ని ఏవో కొన్ని రిఫరెన్సులతో తూచి కొలచి ఒక చట్రంలో ఒదిగించి విశ్లేషించలేను. విమర్శకుడను కాను. సాటి కవిని (మీరొప్పుకుంటే). మిత్రులారా నన్ను ఇకనైనా క్షమించి... ఈ పేజీల్లోని కవిత్వాన్ని అనుభవించండి!

- అరుణ్‌సాగర్
(మువ్వా శ్రీనివాసరావు కవిత్వం 'సమాంతర ఛాయలు' పుస్తకావిష్కరణ ఫిబ్రవరి 6న ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది)

కవిత్వంలో ' క్రాంతి' దర్శనం సవ్వడి డెస్క్ - కె.ఆనందాచారి

కవిత్వంలో ' క్రాంతి' దర్శనం
సవ్వడి డెస్క్ - కె.ఆనందాచారి Sun, 3 Feb 2013, IST

"Poetry is the breath and finer spirit of all knowledge, is the impressioned expression which is the countenance of all Science అంటాడు వర్డ్స్‌వర్త్‌. కవిత్వాన్ని దొరకబుచ్చుకోవటం అంత తేలికైన విషయమేమీ కాదు. అయితే, అన్ని నైపుణ్యాలను మనిషి సాధనతో సాధించవచ్చు. కవిత్వమూ ప్రయత్న సాధ్యమైన విద్యనే! కానీ, కేవలం సాధన మాత్రమే సరిపోదు. జ్వలనం కావాలి. ఆ జ్వలనంలో అంతరాత్మలోని కల్మషాలు ధ్వంసం కావాలి. ఒక స్వచ్ఛతను సాధించే నిత్య ఏకాగ్రతలోంచే కవిత్వం వెలువడుతుంది. ప్యూరిటీ కోసం పరితపిస్తూ, సత్యాన్వేషణ కోసం సంఘర్షించేవాడే కవి కాగలుగుతాడు. 'కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం పెద్దన్నకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు' అన్నాడు తిలక్‌.

కొన్నేళ్లుగా విద్యాలయాలను, విద్యాలయ యాజమాన్య సంఘాన్నీ నడుపుతున్న క్రాంతి శ్రీనివాసరావుకూ ఈ విద్య తెలిసింది. కొత్తగా చిగుర్లు వేస్తున్నట్లు, మొగ్గలు వికసిస్తున్నట్లు, ఉదయం రెక్కలు తొడుగుతున్నట్లు, ఓ మలయ మారుతం హాయి గొలుపుతున్నట్లు, సముద్రం ఉప్పొంగుతున్నట్లు, అగ్నిగుండం మంటలెగజిమ్ముతున్నట్లు ... సంధించిన బాణాల్లా భావాలను కవిత్వాన్ని హృద్యంగా పేరుస్తున్నాడు. క్రాంతి కవి కాగల మూలాలు గట్టిగానే ఉన్నాయి. ఒకటి : సామ్యవాద భావజాల దృక్పథం. ఇది దార్శనికతను, స్పందించే గుణాన్ని, భవిష్యత్తుపై విశ్వాసాన్ని ఇచ్చింది; రెండు : యాభై ఏళ్ల క్రితం గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరగడం... అప్పటికి మానవీయ సంబంధాల విధ్వంసం జరగలేదు. రాజకీయ, సామాజిక చైతన్య చెలిమి నిండుగానే ఉంది; మూడో విషయం : శ్రీశ్రీపై అభిమానంతో శతజయంతిని ఓ సంవత్సరమంతా జరిపి విగ్రహాన్ని ప్రతిష్టించడం, ఆ సందర్భంగా ఆయన కవిత్వాన్నీ ఆవాహన చేయడం, సీతారాం లాంటి స్నేహితుల బృందాన్ని అంటేసుకోవడమూ అతనిలో ఎక్కడో గూడుకట్టుకున్న గువ్వను తట్టిలేపింది.

ప్రతి మనిషీ సృజనకారుడే! సృజనాత్మకత అందరిలోనూ ఉంటుంది. కానీ, ఈ సమాజం మనిషిలోని సహజ ఉద్వేగాలను, ఉద్రేకాలను సృజనాత్మకతలను నిరోధించి, ఆర్థిక మార్కెట్టు కార్యకలాపాలతో బంధించి మనిషినే ఒక సరుకు చేసేస్తుంది. మానవ సంబంధాల స్థానంలో మార్కెట్‌ సంబంధాలు ఆధిక్యంలోకి వస్తాయి. ఇదొక మానవ విధ్వంస ప్రవాహం. కానీ, మనుషత్వం ఎప్పుడూ ఘర్షణ పడుతూనే ఉంటుంది. మనిషి ఈ ఎదురీత, సంఘర్షణ ఒంటరిగా చేసి విజయం పొందలేడు. అందుకే కవి సామూహానికి ప్రతినిధిగా నిలుస్తాడు. మనిషిగా మరో జన్మ ఎత్తాలన్న ప్రయత్నంలోంచి కవిత్వం పెల్లుబుకుతుంది. క్రాంతిలోనూ ఇప్పుడు ఈ మానవీయ ఘర్షణ కొనసాగుతోంది.

'ఎటాచ్‌మెంట్స్‌ లేని అపార్ట్‌మెంట్స్‌ల్లో... ఏకాకి బృందాలం / సమూహంలో ఏకాకులం' అని అనటం వెనకాల ఎంత ఘర్షణ ఉంది. 'గాజుపూలకంపులో... కల రివర్సయింది. 'మేల్కొనే ఉన్న నేను వస్తువుల్లో ఇరుక్కుపోయిన నా జీవితాన్ని పట్టుకొందామని పరుగెత్తుతున్నా... వస్తువుల్ని ప్రేమిస్తూ మనుషుల్ని వాడుకొంటున్న సమాజంలో సగటు మనిషిగా ఉన్నానేమో నేను. అర్థం కాని గ్లాస్‌కర్టెన్‌ ఎకానమీ పద్మవ్యూహంలో అభిమన్యునిలా / జీవితాలు వ్యర్థం అవుతూనే ఉన్నాయి'. ... అంటూ మార్కెట్‌ ఇంద్రజాలం మనిషిని ఎలా ఏమారుస్తున్నదో సరళంగా పట్టిస్తాడు. 'అందరం మనుషుల్లాగే ఉందాం' అనే ఆకాంక్షలో మనుషుల్లా మనలేకపోతున్నామనే బాధ కనపడుతుంది.

"Only a poem can record the dream" అన్నాడు కీట్స్‌ శిశువు మొదటిసారి జగత్తులోని వస్తుజాలాన్ని చూసి ఆనంద ఆశ్చర్యాల్లో తేలియాడినట్లే- కవి కూడా ఒక అపూర్వ రసనావస్థలోకి దొర్లిపోతాడు. నిజంగానే క్రాంతి దొర్లిపోయాడనిపిస్తుంది. 'బాల్యంలోకి, భవిష్యత్తులోకి, బతుకుచక్రంలోకి, వెలుగు దివ్వెలోకి, కలుగు చీకట్లోకి, కటిక దారిద్య్రాల్లోకి వెళ్ళి ... పిల్లకోడికెందుకంత పౌరుషమో, పామెందుకు ఆకలితో మండిపోతోందో, తల్లులెందుకు తల్లడిల్లుతారో తెలుసుకున్నాడు.

కవి మనిషికి కలుగుతున్న అన్యాయాన్ని సహించలేడు. పశుపక్ష్యాదులక్కూడా అధర్మం జరక్కూడదంటాడు. అందుకనే ఆకుపచ్చ కన్నీరులో 'ఆకాశం ఓజోను వలువలు ఊడి విలపిస్తూనే ఉంది / నదినీళ్ళు కాళ్ళకు సంకెలలు పడ్డాయి/ నూపురాలు ఊపిరులు పోగొట్టుకున్నాయి' అని ఆవేదన చెందుతున్నాడు. 'నాన్నకళ్ళు'లో... 'అమ్మా నాన్న వెక్కివెక్కి ఏడుస్తున్నారు, పొద్దునార్పిన పొయ్యి వెలిగించలేదు / పెద్దెద్దు చనిపోయిందని వోదార్చేవాళ్ళు వోదారుస్తూనే ఉన్నారు.. తన మాట వినగానే తనంతతానే కాడీ మెడకెత్తుకునేదనీ / నాగా పెట్టకుండా నాగలి దున్నిందనీ, తనతో సమానంగా తన సంసారం లాగిందనీ/ తలుచుకుని తలుచుకునీ విలపిస్తున్న నాన్న మాటలు / శోకపు గింజలై మొలకెత్తుతూనే ఉన్నాయి / ఏడ్చి ఏడ్చి చింతనిప్పులయిన నాన్న కళ్ళు నాకింకా గుర్తే / ఎద్దుపోతేనే గుండెలవిసిన నాన్న కళ్ళు మానవత్వపు వాకిళ్ళు' అని రైతుకూ, పశువులకూ మధ్య ఉండే సంబంధాలను గొప్పగా అభివ్యక్తీకరించాడు. 'నిన్నటి ఆర్తనాదాలు ఆగిపోయాయనుకునేంతలోపే గుండెలు పగులుతున్న చప్పుళ్ళు మళ్ళీ మొదలవుతున్నాయి / నిన్నటి కన్నీటితో సేదతీరక ముందే సన్నటి ధార ప్రవహించాల్సి వస్తూనే ఉంది' అనీ, 'పరిణామాలూ, పరివర్తనాలూ కాదు తిరుగుబాట్లు రావాలని' దళితులపై జరుగుతున్న దారుణాలను క్రాంతి తన బాధగానే పలికించాడు. కవిగా క్రాంతి అందరి జీవితాల్లోకి వెళ్ళాడు. ఓ మధ్య తరగతి జీవి గురించి, నెలజీతం కోసం ఎదురు చూసే సగటు జీవన చిత్రాన్ని, ఆకలితో అలమటించే దీనదృశ్యాన్ని, 1975 నాటి రాజ్యహింస బీభత్సాన్ని, విద్యావ్యవస్థలోని డొల్లతనాన్ని, మీడియాపాత్రనూ దృశ్యీకరించాడు. ముదిగొండలాంటి చోట్ల 'రోడ్ల గుండెల్ని గుండ్లకు అడ్డుపెట్టి / రహదారిపై రక్తపుష్పాలు రచిస్తుంటే' అని తన సామాజిక నిబద్ధత చాటుకొన్నాడు. మనసులోకి దూసుకొచ్చిన ప్రతి అంశాన్ని కవిత్వీకరించడమే కాక ప్రగతికాముక దృక్పథంతోనే ప్రతి విషయాన్ని, దాని మూలాలనూ చూడగలగటం క్రాంతి ప్రత్యేకత. ఎంత శ్రీశ్రీ ప్రేమికుడైనా, కవి స్నేహితులు ఎందరున్నా తన సొంత ముద్రతోనే కవితారంగ ప్రవేశం చేస్తున్నాడు. ఎన్నో వైవిధ్యమైన వస్తువులతో, నూతనమైన అభివ్యక్తితో భావాలకు మెరుగులు పూసి ఇన్నిన్ని కవితల్ని మన మనసు దోసిళ్ళలోకి కురిపిస్తున్నాడు. కవిత్వానికి కొత్త సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసే ప్రయత్నంలో పరిణతి చెందుతున్న బలమైన కవి ఖమ్మం గుమ్మంపై అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది.

- కె.ఆనందాచారి

9948787660

(ఇది క్రాంతి శ్రీనివాస్‌ వెలువరించిన కవిత్వ సంపుటి 'సమాంతర ఛాయలు'కు రాసిన ముందుమాటలో కొంత భాగం. ఈ పుస్తకావిష్కరణ ఈనెల 6వతేదీ సాయంత్రం 5 గంటలకు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జరుగుతుంది.)

రెంటాల గోపాలకృష్ణ గురించి -- డా||జయదేవ

రెంటాల గోపాలకృష్ణ గురించి -- డా||జయదేవ

‘ఎంత దూరమో, అంత దగ్గర!’
మా నాన్నగారి దగ్గర ర్యాక్‌ల నిండా వందల కొద్దీ పుస్తకాలు ఉండేవి.
కాళిదాసు నుంచి కార్ల్‌మార్క్స్ వరకు; బృహజ్జాతకం నుంచి బృహత్ స్తోత్ర రత్నాకరం దాకా; బెర్నార్డ్ షా నాటకాల నుంచి బాల్జాక్ కథలదాకా; ఇంకా సంగీతం, నృత్యం, నాటకం, జ్యోతిషం- తెలుగు, సంస్కృతం, ఇంగ్లిషు భాషలలోవి అరుదైనవి ఉండేవి.

నాకు ఊహ తెలిసే నాటికే నాన్నగారు - రెంటాల గోపాలకృష్ణ- పేరున్న రచయిత, జర్నలిస్టు. విజయవాడ సత్యనారాయణ పురంలో పురుషోత్తం వీథిలో అగిె్గపట్టె లాంటి అద్దింట్లో ఉండేవాళ్లం. నాన్నగారు కన్ను మూసే వరకు (ఆ ఇంట్లోనే, ఆ పుస్తకాల మధ్యనే) అరవై ఏళ్ల పాటు అలుపెరగక రచనా వ్యాసంగం సాగించారు.

కలం దించకుండా....

మేం ఎనిమిది మంది సంతానం. మా చదువులు, ఏడుగురి పెళ్ళిళ్ల కోసం ఆయన ఎత్తిన కలం దించకుండా ఎన్నివేల పేజీలు రాశారో! 200 పుస్తకాలు లెక్క తేలతాయి. అందులో 150కి పైగా ప్రచురితాలే. పదహారో ఏట ‘రాజ్యశ్రీ’ అనే చారిత్రక నవలతో ఆయన రచనలు ప్రారంభించారు. అప్పుడే పార్వతీశ శతకం కూడా రాశారు. ‘నయాగరా’ (అనిసెట్టి పెళ్లికి మిత్రులు ఇచ్చిన కావ్య కానుక) కవులలో ఒకరైన నాటి నుంచి (మిగిలిన వారు బెల్లంకొండ, కుందుర్తి, ఏల్చూరి), ప్రభుత్వ నిషేధానికి గురైన ‘కల్పన’ కవితా సంకలనం సంపాదకత్వం రోజుల దాకా నాన్నగారి జీవిత మంతా కవిత్వం, రంగస్థలమే.

అయినా అలభ్యమే!

‘అమ్మా! ఉమా! రుమా! హిరోషిమా! విలపించకు...’ అంటూ హిరోషిమాపై బాంబు దాడి ఉదంతాన్ని వస్తువుగా తీసుకుని రాసిన కవిత అప్పట్లో ఎంతో మందిని ఆకర్షించింది. శ్రీశ్రీ ఎంతో మెచ్చుకుని 1952 ప్రాంతంలో జపాన్ నుంచి వచ్చిన శాంతి సంఘం ప్రతినిధులకు అప్పటికప్పుడు ఆ కవితను ఆంగ్లంలోకి అనువదించి వినిపించారు. నాన్నగారు చివరి రోజుల్లో తన మూడో కవితా సంపుటి ‘శివధనువు’ ప్రచురించాలని ఎంతో తపిం చారు. భారమైనా ఆ సంపుటినీ, కొన్ని నాటకాలను మేమే ప్రచురించుకున్నాం. అభ్యుదయ కవిత్వంలో మైలురాయిగా నిలిచిన ‘సంఘర్షణ’, తెలంగాణ ప్రజా పోరాటం మీద దృష్టి పెట్టిన ‘సర్పయాగం’ కవితా సంపుటాలు. ‘శిక్ష’, ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’, ‘అంతా పెద్దలే’ వంటి నాటకాలు తొలి నాళ్లలో నాన్నగారికి గుర్తింపు తెచ్చాయి. 150 పుస్తకాలు అచ్చయినా సంస్కృత మూలంతో సహా తెనిగించిన ‘వాత్సాయన కామసూత్రాలు’ మినహా ఇప్పుడు మరేవీ లభ్యం కావడం లేదు.

ఆప్తమిత్రులు

నాన్నగారి ఆప్తమిత్రులనగానే అనిసెట్టి సుబ్బారావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, అవసరాల సూర్యా రావు, కుందుర్తి ఆంజనేయులు, దాశరథి కృష్ణమాచార్య, గిడుతూరి సూర్యం, గంగినేని వెంకటేశ్వరరావు, కాట్రగడ్డ నరసయ్య, చదలవాడ పిచ్చయ్య, ఉమా పబ్లిషర్స్ కాండూరి సుబ్రహ్మణ్యం, జయంతి పబ్లికేషన్స్ మువ్వల పెరుమాళ్లు వంటివారి పేర్లు ఠక్కున గుర్తుకొస్తాయి.

అభ్యుదయ రచయితల సంఘం తొలి రోజుల నుంచి, ప్రజా నాట్యమండలి ప్రభ వెలిగిపోతున్న కాలం వరకు; ప్రపంచ సాహిత్యం నుంచి అనువాదాల ప్రచురణ ఒక పరిశ్రమగా సాగిన కాలం వరకు వారంతా నాన్నగారి సహచరులు. మిక్కిలినేని, కె.వెంకటేశ్వరరావు, సుంకర కనకారావు, కోగంటి గోపాల కృష్ణయ్య, మోటూరి ఉదయం, మహీధర రామమోహనరావు, ఆవంత్స సోమసుందర్, కేవీ రమణారెడ్డి, ఏటుకూరి, వీఆర్ బొమ్మారెడ్డి - ఒకరా ఇద్దరా ఆనాటి దిగ్గజాలంతా మా ఇంటికొచ్చినవారే.

బహుపాత్రాభినయం!

నేను కళ్లు తెరిచే సరికి ‘ఆంధ్రప్రభ’ సంపాదక వర్గం లో ఆయన ముఖ్యుడు. విలు వైన సంపాదకీయాలెన్నో రాసి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆరు దశాబ్దాల రచనా వ్యాసం గంలో నాలుగు దశాబ్దాల జీవితం పత్రికా రచనతోనే పెనవేసుకుని ఉంది. గుంటూరు నుంచి చల్లా జగన్నాథం సంపాదకత్వంలో వెలువడిన ‘దేశాభిమాని’తో పత్రికా రచయితగా ఆయన జీవితం ఆరం భమైంది. తరువాత వివిధ పత్రికలలో కొంత అనుభవం వచ్చిన తరువాత చదలవాడ పిచ్చయ్య ‘నవభారతి’ మాస పత్రికకు ఇన్‌చార్జ్ ఎడిటర్‌గా పనిచేశారు.

నీలంరాజు వెంకట శేషయ్య ఎడిటర్‌గా ఉన్న కాలంలో ఆంధ్రప్రభలో చేరి, 1980 వరకు వివిధ హోదాలలో బాధ్య తలు నిర్వర్తించారు. ఆయన సినిమా పేజీ ఎడిటరు. పొద్దున్నే గంభీరమైన సం పాదకీయం రాసిన నాన్నగారే, సాయంకాలం సినిమా వారి సభలో వాణిశ్రీ గురించీ ‘దసరాబుల్లోడు’లో ఆమెపై చిత్రీ కరించిన పాటలోని సొగసునీ చలోక్తులతో వివరించేవారు.

కలనేత

అభ్యుదయ భావాలు, ఆర్ష సంస్కృతీ మూలాల కలనేత మా నాన్నగారు. అరసం సభ్యునిగా కమ్యూనిజమే తారకమం త్రమని భావించినవారు. కాని విశ్వనాథ వారంటే గురుభావం. ‘నవభారతి’ పత్రిక కోసం వారింటికి వెళ్లి మధ్యాక్కరలు రాయించుకున్నారు. అనేకసార్లు ఆయన్ను ఇంటర్వ్యూ చేశారు. కవిసమ్రాట్ అస్తమించినపుడు ‘ఆంధ్రప్రభ’లో ‘వాగ్దేవి కటాక్షం పొందిన కవి మూర్దన్యు డు’ అన్న సంపాదకీయం రాశారు. శ్రీశ్రీ మానసికమైన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినపుడు విజయవాడలో ఆ గది దగ్గర కాపు ఉన్నది కూడా నాన్నగారే. ఒక సిద్ధాంతాన్ని నమ్మినంత మాత్రాన ఇతర సిద్ధాంతాల వారి పట్ల వైమనస్యం సరికాదన్న విశాల దృక్పథం నాన్నగారిదని పిస్తుంది. అలాగే కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఆయన్ను చాలా మందిలాగే ఎంతో బాధించింది.

పాతతరం పెద్ద మనిషి నాన్నగారు. రావలసినంత గుర్తింపు రాలేదాయనకు. అమ్మ పర్వతవర్ధని ఆయనకు ఎప్పుడు గొప్ప అండ. కీర్తికాయంతో ఆయన చిరం జీవులై పదహారేళ్లవుతున్నా (జూలై 18, 1995) ఇప్పటికీ ఆయన ప్రస్తావన వస్తే మా అందరి గొంతులు పూడుకు పోతాయి. నా సోదరి (కల్పనా రెంటాల) మాటలే చెప్పాలని అనిపిస్తుంది -
‘నాన్నా, ఇవాల్టికీ మన మధ్య ఎంత దూరమో, అంత దగ్గర!’

- డాక్టర్ రెంటాల జయదేవ

3, ఫిబ్రవరి 2013, ఆదివారం

కపిల రాంకుమార్|| పుస్తక పరిచయం||
ఉదయిని - కవి - గంగినేని వెంకటేశ్వర రావు

ప్రథమ ప్రచురణ 1950 అభ్యుదయ రచయితల సంఘం - అక్టోబర్ 1950
విశాలంధ్ర ప్రచురణ - హైదరాబాద్  - డిశంబర్ -1989 రూ.15/-

'' తెలంగాణా విముక్తి సమర కవితాదర్పణం ''- అన్నారు -అనిసెట్టి (16-12-89)

ముందుమాట : ఏటుకూరిబలరామమూర్తి - విశాలాంధ్ర (15-12-89)

'' ఆముఖం  : '" చంద్రం  '"  (మద్దూరి చంద్ర శేఖర రావు) అందించారు

--ఉదయిని మొదటి ప్రచురణ నాటి  '' ఈ నాటికి '' ఉదయిని '' అని  ప్రయాగ  10-10-1950 లో: 

ప్రకాశకులు:  '' ఎప్పుడో  ' ఉదయిని ప్రచురించాలనుకున్నం. కాని ఆర్థిక  రాజకీయ నిర్బంధాలు కారణంగా ఆలస్యం అనివార్య మయినది. ఈ నాటికి ' ఉదయిని ' వేయి పడగలు విప్పుతూ కావ్య ధాత్రికి జీవగర్ర అవుతున్నది. దీనికి ఆంధ్ర మహాజనుల ఆదరం లభిస్తుందని నమ్ముతున్నాం '
అందులో ' ఎరుపు '

పాప ఎరుపు
కనుపాప ఎరుపు
చెల్లి బొట్టు ఎరుపు
తల్లి ఫాలం ఎరుపు

పండ్ల తోట ఎరుపు
బండ చాకిరెరుపు
వెర్రికేక యెరుపు
నదుల ఆకలెరుపు

కొత్తకోర్కె యెరుపు
కొడవలంచు ఎరుపు
తుదిక్షణాలు ఎరుపు
తూర్పుకొండ ఎరుపు

దుక్కిచాలు ఎరుపు
తెలుగుపూలు ఎరుపు
ఇంటి ముంగిటెరుపు
ఎల్లలన్నీ ఎరుపు

కోపం రూపం ఎరువు
గుండె గాయం ఎరుపు
రక్త గానమెరుపు
నేనంత్తిన జండా ఎరుపు
నా కావ్య రాశి ఎరుపు
నా స్వప్న స్వర్గం ఎరుపు !......

ఉదయినిలో 3 పర్వాలున్నాయి
1. అరణ్య పర్వం :  1. వెలుగు నీడలు, 2. ఎర్ర సముద్రం 3. ఓ రాత్రి, 4. ఎరుపు
   5. ప్రి యుడు-ప్రియురాలు 6. తల్లి తనయునికి

2. యుద్ధ పర్వం: 1. నీలి మంటలు 2. పొలిపాట 3. తెలంగాణా 4. గెరిల్లాతో    ఒకనిమిషం. 5. భహిరంగ లేఖ -1  6.అరిచేతిలో మృత్యువు 7.నిజంలో నిజం
8. భహిరంగ లేఖ -2

3,. శాంతి పర్వం : 1. చైనా 2. శాంతి గీతం 3. బేబీ 4. అమ్మా!

కవితలున్నాయి.

ఈ గ్రంథం మా బి.వి.కె. గ్రంథాలయంలో వున్నది.

జ్ఞాపకాల సోది - 4

కపిల రాంకుమార్|| జ్ఞాపకాల సోది - 4 ||

ఒక సారి యేమయ్యిందంటే
రోహిణీ కార్తె వచ్చీరాగానే
పొలానికి ఎరువు తోలటం
తప్పని సరి!
నాన్న బండిముందు
నేను బండిమీద
సరిగా నారుమడి దగ్గిరికి రాగానే
బండి రోజా దుగం యెక్కింది కామోసు
ఒరిగి ఎరువు నేలపాలయినప్పుడు
నేను యేడుపు లంకించుకున్నాను
నాన్న అదలించినందుకు కాదు
కాడిగట్టు మడిలో
ఎరువు చిమ్ముతున్న నరసమ్మ
నన్ను చూసి పక్కున నవ్వినందుకు!
'' దాని మొహం కుర్రాళ్ళని చూస్తే అది అంతేలే
ఇంకా నయం రోడ్డుమీద బండి పడలేదుగా ''
నాన్న మాటలు వింటూ,
పొలంలోనేగా, చిమ్ముకుంటె సరిపోద్ది
చీమిడి చీదుకుని,
నరసమ్మ వెపు కోపంగా చూస్తూ
మా పొలం పనికీస్తావుగా
అప్పు్డు చెప్తా నీ పని అని
సైగ చేస్తూ పార అందుకున్నను!
మొగుడు కొట్టినందుకు కాదు,
తోటికోడలు నవ్వినందుకు అంటె
నా బాధలాంటిదే
అని అవగతమయ్యింది!
తపన పడటం సహజమే
తప్పటడుగు నివారణే ముఖ్యం!

3 జనవరి 2013 ఉదయం 5.10

2, ఫిబ్రవరి 2013, శనివారం

|| జ్ఞాపకాల సోది. 3||

కపిల రాంకుమార్ || జ్ఞాపకాల సోది. 3||

వయసుకు నెచ్చలి
ఉచ్చిలి!
ఉచ్చిలి కాకపోతే యేమిటి
వెంకటచారి యింట్లోకి వెళ్ళినపుడు
పెద్దపనివాడిలా నేను
బాడిశ తీసుకొని
మేడిని చెక్కడం మొదలేసా!
చెక్కిలిపై ముద్దులా (నఖ క్షతాల చందంగా)
అరచేతి బొటనవేలుతో సరాగమాడితే
కళ్ళల్లో నీళ్ళు,
కుయ్యోమంటూ కీచ గొంతు సంగీతం!
15-16 యేండ్ల యెచ్చిడి కదా!
నా కంగాళీకి పరిగెత్తుకొచ్చి
అబ్బాయిగారు మీకెందుకీపని
అని గద్దిస్తూనే, గబ గబా కట్టిన
ఆకు పసరు మంట నషాలనికెక్కింది
పనిలో మెలకువలు నేర్చుకోకుండ
తగుదునమ్మా అని తల దూరిస్తే
యిదుగో యిలాగే శాస్తి జరుగుతుంది!
ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసము లేకపోతే
యే కళ అబ్బదు!
వెంకటాచారి యెన్నేళ్ళుగా వాళ్ళయ్య దగ్గర
నేర్చుకుంటే వచ్చిందో పనితనం!
తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరమన్నట్లు అయింది
అరక పనికి రెందు రోజులు కుంపు పెట్టా
నాన్నగారి చివాట్లు తిన్నా!

2.2.2013 ఉదయం 10.35

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

|| జ్ఞాపకాల సోది - 2 ||

కపిల రాంకుమార్|| జ్ఞాపకాల సోది - 2 ||

మొదటి సారి
దమ్ముచేలో
పారతో దుగ్గాలు చెక్కుతూ
తడిపార జారి
ఏడమకాలి మడమ శీలతో
సరసమాడితే
దమ్ములో రక్తపు బురద

**
కలబంద కట్టుతో
రెండు రోజులు పనికి నాగా!
కాసేపు పారని,
దుగాన్ని తిట్టుకుని
పనిలో జాగ్రత చాల అవసరమని
తెలుసుకున్నా!
పరధ్యానంగావుంటీ
అవాంతరాలే కాదు
ప్రమాదాలు తప్పవని తెలుసుకున్నా!

1.2.2013 ఉ. 5.13

|| జ్ఞాపకాల సోది - 1 ||

కపిల రాంకుమార్|| జ్ఞాపకాల సోది - 1 ||
మొదటిసారి
నాగేటి కోండ్ర
వంకరొచ్చిందని
వెనుక అరక దున్నుతున్న
పాలేరు పుల్లయ్య
గుచ్చిన ముల్లుకర్ర
పిర్రకు గడ్డై రెండురోజులు
ఇబ్బంది పడినది
మాపుల్లయ్యను చూసినప్పుడల్లా
యాదికొస్తాంటది
ఇప్పుడా పుల్లయ్యకు 88 ఏళ్ళు
నాకు 61 నిండి 62 లోకి ఆడుగేసా...
31.1.2013

30, జనవరి 2013, బుధవారం

*
కపిల రాంకుమార్|| రజితోత్సవం|| **

సువిశాల
సుందర
రమణీయ ఉద్యానవంలో
మనోహర ప్రకృతీ రమణీయంలో
కోకొల్లలుగా జాజులు
విరబూచిన తరుణంలో
ఇంతుల సిగలోని
బంతిపూల హ్ర దయాంతరంగ
తరంగ పంక్తుల్లో
విలాస, విహారమాశించిన
శుభ దినంలో
ఈ శ్రావణంలో
ఆ వనంలో
ఒకచోట
ఆ నల్లబండమీద
వేపచెట్టు దక్షిణపు నీడన
కుక్కలు చింపిన విస్తరిలా
విసిరేసిన విస్కీ బాటిల్లా
అంత నీచంగ కనబడ్డా
మంచి వయసుగ
మనసు దోచేలా
మరులు కొలిపేలా
ఈలవేసేలా
జాలి కలిగేలా
జడవిరబోసుకున్న సుకుమారి
నగ్న శరీరంలా
నాగరికతా ప్రపంచంచే
మోసం చేయబడ్డ వనితలా
విధి వంచితయై
మనో వేదితయై
విరహంతో - విరసంతో - నీరసంతో
సృంఖలాలు తెంచుకొని
స్పందనాలు కలిగించుకొని,
బంధనాలు విడగొట్టుకొని
రజితోత్సవ వత్సరాన
రజ:తమోగుణాలు విరబూసిన
మన దేశం - ఈ వనిత!
ఎన్నో పంచవర్ష ప్రణాళికలు
ప్రవేశించాయి,
ఆక్రోశించాయి,
ఆవేశించాయి,
అలసట చెందాయి
ఆయాసం తీర్చుకుంటున్నాయి!
కట్టుబడిలోనే వున్నాం!
పెట్టుబడిలోనేవున్నాం!
అడపా దడపా ముట్టడికి
గురౌతూనేవున్నాం!
ఎంతమంది రాజులు-తరాజులు
తమ ఫోజులు చూపించలేదు?
ఈ బూజులు దులుపుతామని
రోజులు దాటించలేదు?
యెంతమంది చేతగాక గాజులు తొడుక్కోలేదు?
ఆ నాటి జాజులు వాడిపోయాయి!
వాటిపై మోజులు తీరిపోయాయి!
'' మాసాలు గడుస్తున్నకొద్ది
మోసాలకు గిరాకీ పెరుగుద్ది! "
పామరుడి నోటవచ్చిన మాట
విలువైన వరహాల్ మూట
ప్రగతి ప్రపంచానికి కొత్త బాట!
కని పిస్తోందిచూడు దూర దూర తీరాలలోని
దేస దేశాలలోని రాజకీయ చైతన్యం!
శ్రామిక - కర్షక మేథావుల మస్తిష్కంలొ
కదిలే
మెదిలే
కుమిలే
వేదన - అవేదన
కనిపెట్టారా ఎవరైనా!
స్వాతంత్ర్యోత్సవం జరుపుకోవలెననియున్నా
సహజోత్సాహం నిండుసున్నా!
అందుకే మౌనం వహించి యిలా ఓ గేయం రాసి కూర్చున్నా!
__________________________________________
30.01.2013 10.50 am.
_____________
** 15.08.1973 న - పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శ్రీమాం పెద్దింటి సూర్యనారాయణ్ దీక్షితదాసురధ్యక్షతన, నరసాపురం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ అతిథిగా హాజరై జరిగిన కవిసమ్మేళనం లో చదివినది.

29, జనవరి 2013, మంగళవారం

ఒక్క పలుకు

కపిల రాంకుమార్ || ఒక్క పలుకు ||
వక్క పలుకు ఒంటికి హాని
ఒక్క పలుకు యింటికి హాయి!
నన్నయ చెప్పినదదే!

నీ ఓటు వోటి పోతోంది కాని
తూటా కావడంలేదెందుకని?
తల పట్టుకుని కూర్చోడం కాదు
తలపడటం నేర్చుకో!

నా పాట
పగ పట్టదు కాని
పగను పెంచుతుంది!

నా మాట
తూటాలంటిదే కాని
నా మనసు మిఠాయి సుమా!

నుదిటి రాతను  చదువలేం
చేతిరాత మాత్రం చదువగలం
మన అంతరంగాన్ని ఆవిష్కరించేదే అది!

నీ అడుగులు తడబడుతున్నాయి
నిలదీసి అడుగలేక
బడుగువనే భయం!
వెనుకబడితే - నీ వెంకాలే బడిత వస్తుంది
తిరగబడితే
ఆ బడితే పారిపోతుంది!

'' ఇస్తా యిస్తా నన్న వారిని -
వస్తా వస్తా నన్న వారిని నమ్మొద్దంటే
సామెతలంటూ నన్ను తిట్టావు!
 సర్కారీ మాటల్ మర్మం తెలిసి
ఇపుడేమంటావు?

'' పోరాడితే పోయేవేమీ లేవు - బానిస సంకేళ్ళు తప్ప ''
అది రాజకీయ నినాదమని కొట్టిపారేసావు!
ఇప్పూడా పోరాట ఆరాటమే శరణ్యమయిందికదా!
నిజం యెప్పుడూ  చేదు మాత్రే
చేదుతో కాని వున్న మాయరోగం పోదని తెలుసుకో!

ఇవి ఊసుబోని కబుర్లు కావు!
ఊపిరి పోసే ' ఖబర్లు !లేవో!
29 జనవరి 2013 ఉదయం 9.21


27, జనవరి 2013, ఆదివారం

'' ప్రణయ తపస్సు ''

శ్రీ రావెళ్ళ వెంకట రామారావు (గోఖినేపల్లి - ఖమ్మం) వారి కవిత
'' ప్రణయ తపస్సు ''

మధురామృతము గ్రోలి మత్తెక్కినానే,
కలికీ! నీ కన్నులలో కవితగన్నానే!

ప్రణయ దేవత పొందు ప్రాప్తిగన్నానే,
కలమెత్తి నీ కీర్తి కవిత రాసేనే!

తారుణ్య లావణ్య తను, గ్రోలినానే,
సరళ హృదయపు వీణ సారించు తానే!

అనురాగ జలధిలో అడుగులుంచానే
గళమెత్తి నీ ప్రేమ ఘనత పాడేనే

వాక్సుధ ధార్ల్లో ప్రవహించి నానే
చిత్తాన నీ మూర్తి స్థిరపరచినానే!

వలపు తేనియ ద్రావి పులకరించానే
భావమందున ప్రణయ సేవ జేసేనే!

మహనీయమౌ రాగ మహిమగొలిచేనే
నిత్య జీవిత శ్రమల నేను గెల్చెదనే!

ప్రణ్య ' ఓంకార " మే  పఠన జేసేనే
స్వర్గ సుఖముల యిలనె సాధించుతాన!.

(రాగ జ్యోతులు - గేయ సంపుటి -ప్రథమ ముద్రణ 1954 జయ ఉగాది 1954 వెల నాల్గణాలు -తెలంగాణా రచయితల సంఘం, ఖమ్మంమెట్టు - పేజి. 12-13)
ఆ నాటి వారి పదాలు, లాలిత్యం, తెలుసుకోటం కోసం పోస్టు చేసాను)  27.1.2013 ఉ.10.42.
శ్రీ రావెళ్ళ వెంకట రామారావు (గోఖినేపల్లి - ఖమ్మం) వారి కవిత
'' ప్రణయ తపస్సు ''

మధురామృతము గ్రోలి మత్తెక్కినానే,
కలికీ! నీ కన్నులలో కవితగన్నానే!

ప్రణయ దేవత పొందు ప్రాప్తిగన్నానే,
కలమెత్తి నీ కీర్తి కవిత రాసేనే!

తారుణ్య లావణ్య తను, గ్రోలినానే,
సరళ హృదయపు వీణ సారించు తానే!

అనురాగ జలధిలో అడుగులుంచానే
గళమెత్తి నీ ప్రేమ ఘనత పాడేనే

వాక్సుధ ధార్ల్లో ప్రవహించి నానే
చిత్తాన నీ మూర్తి స్థిరపరచినానే!

వలపు తేనియ ద్రావి పులకరించానే
భావమందున ప్రణయ సేవ జేసేనే!

మహనీయమౌ రాగ మహిమగొలిచేనే
నిత్య జీవిత శ్రమల నేను గెల్చెదనే!

ప్రణ్య ' ఓంకార " మే  పఠన జేసేనే
స్వర్గ సుఖముల యిలనె సాధించుతాన!.

(రాగ జ్యోతులు - గేయ సంపుటి -ప్రథమ ముద్రణ 1954 జయ ఉగాది 1954 వెల నాల్గణాలు -తెలంగాణా రచయితల సంఘం, ఖమ్మంమెట్టు - పేజి. 12-13)
ఆ నాటి వారి పదాలు, లాలిత్యం, తెలుసుకోటం కోసం పోస్టు చేసాను)  27.1.2013 ఉ.10.42.

26, జనవరి 2013, శనివారం

మీకిది తగునా?

కపిల రాంకుమార్|| మీకిది తగునా?||

నా ఊసెందుకు మీ తిట్ల పురాణంలో
నేను మోసే బ్రువు అంత సులువనా!
జాగ్రత రేవు పెట్టేస్తాను!

నా పేర్ రెట్టిస్తారెందుకు?
నమ్మకద్రోహులకు నాకు పోలికా?
ప్రాణాలకు తెగించే విశ్వాసం మీకుందా?

నాతో పోలికేంటి? బద్ధకస్తులకి
పొలందున్నినా, బండిలాగినా
పోటికి రాలేరు!

కాకి ముక్కుకు దొండపండని
మూతి విరుపెందుకు?
నే ముట్టితే కదా
మీ పితృ దేవతలకి ఆత్మతృప్తి?

ఇక నుండి మిమ్మల్ని మీరే పోల్చుకోండి
మాటలతో కాల్చుకోండి
మంచిచెడులుయెంచుకోండి
కలుపు మొక్కలనేరితేనే
స్వార్థ పరుల ఆటకట్టు!

ఉపమానాలతో మావూసులెత్తకండి
ఎంతసేపు యెదుటివారినెంచటం కాదు
మీ వీపుపై మరకల్ని చూసుకోండి
మాలావెనుకచూపుండదుగా!

మాకు కినుక తెప్పించకండి!
తరువాతి పరిణామాలకు
బాధ్యత మాత్రం మీదే!
తస్మాత్ జాగ్రత!

కపిల రాంకుమార్ 26.01.2013 ఉ.5.03

25, జనవరి 2013, శుక్రవారం

సమకాలీన కవిత్వంలో - నిఖిలేశ్వర్,

సమకాలీన కవిత్వంలో

- నిఖిలేశ్వర్, 9177881201
01/10/2012

TAGS:

ఆరేడు దశాబ్దాల మీదుగా పయనించిన మన సమకాలీన తెలుగు కవిత్వం ఒక సజీవ ప్రవాహం! ఈ ప్రవాహంలోని ఆటుపోటుల మధ్య కొందరు కవులు మాత్రమే తమ సత్తాను నిరూపించుకోగలిగారు. మరికొందరు పదాల అల్లికతో, ప్రాసల గారడీతో చప్పట్లు కొట్టించుకున్నారు. ఇక సామాజిక- రాజకీయ అవగాహన లోపించిన కొందరు అంతే త్వరగా కాలగర్భంలో కలసిపోయారు. ఆత్మ సంతృప్తికోసమే రాయాలనుకునే కవులు ఎటుతోచని స్థితిలో ఏదో ఒకటి రాస్తున్నారు. తమ భావజాలాన్ని సంక్లిష్టంగా వ్యక్తీకరించి చివరికి- ‘‘ఎవరికీ అర్థంకాని నా కవిత్వం ఎవరిని ఉద్ధరించడాని’’కని మానుకున్నారు. ఇక మానవీయ సంవేదనను గుండెలకు హత్తుకునేలా వ్యక్తంచేసిన కవులు ఏ కాలంలోనైనా స్వల్పంగానే వుంటారు. దృశ్య- శ్రవ్య అనుభవాలను అంతే గాఢంగా అక్షరీకరించేవారు కూడా కొందరు మాత్రమే! వచన కవితా ప్రక్రియలో రచనలు చేస్తున్నవారు ఈ రోజు వందలాది సంఖ్యలో వున్నారు. వీరిలో చాలామంది ఏదో ఒక అంశంపై వెంటనే స్పందించి, పత్రికలకు ఎక్కేయాలనే ఆదుర్దాకొద్ది వ్యాస రచన సరళిలో రాసి కవిత్వమని భ్రమపడుతున్నారు. సుప్రసిద్ధ కవులు కొందరు నిస్సారమైన కవితలతో గత కీర్తి పెట్టుబడిగా ఉద్భోదలు చేస్తున్నారు. సమాంతరంగా మరోవైపు పునరుద్ధరణ ధోరణితో పద్య రచనను ప్రోత్సహించాలని, పౌరాణిక గాథలను- కులీన వాదనలను తిరగదోడుతూ, అదే మన సంస్కృతి పరిరక్షణ అని ఊదరగొడుతున్నారు. కవిత్వరూపమేదైనా సమకాలీనతను, ఆధునిక హేతువాద స్పృహను కోల్పోతే ఆ కవిత్వానికి ప్రాసంగికత వుండదు.
ఉద్యమశీలిగా నిరంతర చైతన్యంతో ప్రజలను స్పందింపచేసిన తెలుగు కవిత్వం- భావ, అభ్యుదయ, దిగంబర- విప్లవ భావజాలంతో సాహిత్య సామాజిక దిశలను స్పష్టంగా చూపించింది. ఆయా చారిత్రక దశల్లో ప్రజా ఉద్యమాలకనుగుణంగా వివిధ అస్తిత్వ పోరాటాలతోనూ తన అద్యాయాలను లిఖించింది. ముఖ్యంగా గత పాతికేళ్ల కవిత్వాన్ని నిశితంగా పరిశీలించినపుడు, తెలుగు కవిత్వ దశ-దిశ మారిపోయిన వాస్తవాన్ని అర్థంచేసుకోగలం. వివిధ అస్తిత్వ వాదాల మధ్య కొనసాగుతున్న సంభాషణలో, ఎన్నో వాద-వివాదాల చర్చలతో ప్రస్తుతం కవులు అనేక పాయలుగా- గ్రూపులుగా విడిపోయారు. కులం, ప్రాంతం, బాల్యం, ప్రపంచీకరణ, పర్యావరణ, మతం వంటి సమస్యల చుట్టూ కవిత్వం పరిభ్రమిస్తున్నది. వీటి ప్రమేయం లేకుండా అనిబద్ధ కవులుగా చలామణిలో వున్నవారు కొందరు, తామే అచ్చమైన కవిత్వం రాస్తున్నామని- తమ అంతరంగాల చీకటి గదుల్లో తచ్చాడుతున్నారు. కోల్పోయిన తమ గతంలోని ఆనందాన్ని- మాధుర్యాన్ని లేదా విషాదాన్ని ఏకరువు పెడుతూ వ్యక్తిగత ప్రతీకలు- ఉపమానాలతో తమకు మాత్రమే అర్థమయ్యే కవిత్వం రాస్తున్నారు. ఈ కవుల రచనా ప్రక్రియకు (ఉత్పత్తికి) ఎలాంటి ఎరువు - విద్యుత్తు అక్కరలేదు.
ఇక ఈ దశలోనే గతానుగతికంగా వచ్చిన ధోరణుల గురించి క్లుప్తంగా ప్రస్తావించి ఒక అంచనాకు రావాలనుకుంటే -
సామాజిక న్యాయంకోసం, ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా దళిత సాహిత్యోద్యమం ఈ దశలోనే పురోగమించింది. కవితాపరంగా కొందరు శక్తివంతమైన అభివ్యక్తినివ్వగలిగారు. దళిత కులాల స్పృహకు- చైతన్యానికి పూలే- అంబేడ్కర్- మార్క్స్ తాత్వికత ఒక దిశను చూపించింది. అట్టడుగు ప్రజల వేదనలకు- ఆకాంక్షలకు గొంతునిచ్చింది. అయితే వర్గీకరణ గొడవల్లో అనవసర రాద్ధాంతం చేసుకున్నారు కొందరు దళిత కవులు!
సమాంతరంగా స్ర్తివాద కవిత్వం ‘దేహరాజనీతి’ని అధిగమించే క్రమంలోనే- నిస్సంకోచంగా తమ శరీర బాధలను- అవమానాలను గాధలను బలంగా వ్యక్తంచేస్తూ పురుషాధిక్యతను సవాలుచేయగలిగింది. అనేక కోణాల్లో ప్రసరించిన ‘స్ర్తివాదం’ చివరికి పునరావృతమై స్తంభించిపోయింది. సామూహిక సామాజిక పోరాటాలను విస్మరించి వ్యక్తిగత పరిష్కారాలకు- పురస్కారాలకు పరిమితమైపోయింది.
మరోపాయ- మైనార్టీ అస్తిత్వవాదం. ముస్లీం సోదరుల ఆత్మనివేదన, సాంఘిక వివక్ష (మతపరంగా)కు ప్రతిరూపమే తెలుగులోని ముస్లిం కవిత. సాంస్కృతికంగా- భాషాపరంగా ఈ మైనార్టీ కవిత్వం తన విలక్షణతను కొంతమేర నిరూపించుకుంది. అయితే అవసరాన్ని మించిన ఉర్దూ పద బాహుళ్యంతో కవితాభిమానులకు అర్ధంకాకుండా, అధోపీఠికల (చ్య్యిఆ శ్యఆళఒ) అవసరాన్ని నొక్కి చెప్పింది.
కొంతకాలంగా ప్రాంతీయ అస్తిత్వ సమస్యల నేపథ్యంలో ఆయా మాండలిక పద ప్రయోగాలతో కవిత్వం వచ్చింది. తెలంగాణ ప్రజలు తమ ప్రాంతీయ సంస్కృతి పరిరక్షణకు ఆత్మగౌరవానికి, జల వనరుల సౌకర్యానికి రాజకీయంగా- పాలనాపరంగా ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ మాండలికంలో కవితలు- కథలు ఆయా సంకలనాలు సంపుటాలుగా వెలువడుతున్నాయి. ప్రాంతీయ అసమానతలు తొలగిపోడానికి ప్రజల బాధలను - గాథలను వారి వాడుక భాషలో- యాసలో వ్యక్తం చేయడం ఒక సాహిత్య పరిణామం. అయితే మాండలికాన్ని కృత్రిమంగా సందర్భ రహితంగా ఉపయోగించినందువల్ల కవితా రచన పేలవమై నిస్సారమైపోయింది. తెలంగాణ తెలుగు మాత్రమే అచ్చమైన తెలుగు భాష అని మన తెలుగు భాషా పరిణామక్రమాన్ని, చారిత్రక వికాసాన్ని నిరాకరించడం అవివేకమైన చర్య. తెలుగు ప్రజల ఉమ్మడి సాహిత్య- సాంస్కృతిక వారసత్వం ఒక చారిత్రక సత్యమనే యధార్థాన్ని విస్మరించలేము. ఈ దశలోనే ఒక మంచి పరిణామం- తెలంగాణ ప్రాంత సాహిత్య- సాంస్కృతిక రినైజాన్స్- పునర్ వికాస క్రమంవల్ల అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి.
ఆయా దశల్లో వచ్చిన మన అత్యాధునిక తెలుగు కవితా పరిణామాల నేపథ్యంలో ఆలోచిస్తే- ప్రపంచంలోని ఏ భాషలోని కవిత్వానికైనా సమానంగా సమ ధీటుగా - సగౌరవరంగా మన కవిత్వం నిలిచిందనే వాస్తవాన్ని మరచిపోలేము. ఇంగ్లీషు- హిందీలో వచ్చిన ఆయా భాషా కవిత్వాల అనువాదాలను చాలాకాలంగా చదువుతున్న అనుభవంతో నేను ఈ మాట చెబుతున్నాను. ఇక ప్రస్తుతం మన వర్తమాన దశను నిర్మొహమాటంగా- విమర్శనాత్మకంగా అంచనా వేస్తే ఎదుటవున్న దృశ్యం - అస్తిత్వం - కవుల కెరీరిజం - ఆశ్రీత పక్షపాతం - ముఠాతత్వం - నేల బారుగా వస్తున్న శుష్కమైన రచనలు- ఉద్యమాల పట్ల భ్రమవిచ్ఛిత్తి, అంతిమంగా ఖరీదైన అందమైన అట్టల వెనుక ఊరేగుతున్నాయి. అందువల్లనే ఈ అసంబద్ధమైన పద చిత్రాలను, పేలవమైన భావజాలాన్ని చూసి - ఇంతకు మన కవిత్వం దిశ ఏమిటి? అని కొందరు విమర్శకులు- పాఠకులు ప్రశ్నలను సంధిస్తున్నారు. ఈ ప్రశ్నలకు జవాబుగా మనం- గత దశాబ్ద కాలంలో వచ్చిన అసంఖ్యాక కవితా సంకలనాలను- వ్యక్తిగత సంపుటాలను పరిశీలించవచ్చు. మిత్రులు రామచంద్రవౌళి, దర్భశయనం, పాపినేని విడివిడిగా వార్షిక కవితా సంకలనాలు వెలువరిస్తూ సమకాలీన కవిత్వానికి వేదికలవుతున్నారు. జిల్లాల వారిగా సంకలనాలు వచ్చాయి. వీరందరిని మనం మనసారా అభినందించవచ్చు.
ఇంతకు ఈ కవితా సంపుటాలు- సంకలనాలు పుస్తకాల షాపుల్లో ఒక మూలన పడివున్నా కొందరు తెలుగు కవులు కీర్తికాంక్షతో - కొంత నిష్కామకర్మతో ఆర్థికంగా నష్టపోయినా, వందలాది సంఖ్యలో తమ కవితా వ్యవసాయాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆత్మసంతృప్తితో పేఠికలు, పొగడ్తలు స్వాతిశయంతో విజృంభించేసరికి, ఈనాటి కవిత్వాన్ని చివరికి ఆ కవులు మాత్రమే చదువుకుంటున్నారనేది మరో చేదు నిజం! ఇటీవల ఒక పాజిటివ్ పరిణామాన్ని మన గమనించవచ్చు- ఇంటర్నెట్, ఫేస్‌బుక్‌ల ద్వారా తెలుగులోకి కొత్త కవులు రంగంలోకి ప్రవేశిస్తున్నారు. వేలాది మంది ఈ కవిత్వాన్ని పంచుకుంటున్నారనే వార్తను ఆహ్వానిద్దాం మనసారా! కవి సమ్మేళనాలు - సామూహిక పఠనాలు క్షీణించిన ఈ దశలో ఇదో శుభపరిణామం. కవిత్వంలో ఎప్పుడైనా నూతన వ్యక్తీకరణ, భాషపై పట్టు కొత్త అనుభవాలతో వచ్చే ప్రతీకలు, నిజాయితీ, సరళత్వంతోపాటు కవుల జీవన నిబద్ధత- స్పష్టమైన సామాజిక అవగాహన- గాఢత వుంటే తప్ప అంతరంగంలోని నిజం కవిత్వంగా వెల్లువెత్తదు. అలాగే ఈ వర్తమాన కవితా పరిదృశ్యంలో ఇప్పుడు మహాకవులు - కవితా ప్రవక్తలనే వారు ఎవ్వరూ లేరు!!
కవిత్వం మెదడులో వున్నంత కాలం గర్భస్థ శివువే అని అంటున్న కొడవటిగంటి కుటుంబరావుగారు ఒక వాస్తవాన్ని విడమర్చి చెబుతున్నారు- ‘‘ప్రచురణ అయినప్పుడు అన్ని కవితలూ ఒక్కటే- వాటి జాత్య లక్షణాలు భిన్నం కావచ్చు గాక - కాని బయటికి వచ్చి, పుష్టి సంపాదించుకుని, పెరిగి పెద్దవై చరిత్ర ప్రసిద్ధాలవుతాయి. కొన్ని ఈసురోమంటూ జీవిస్తాయి. కొన్ని పురిట్లోనే సంధిగొట్టి పోవటమూ కద్దు.’’ (జ్యోతిమాస పత్రిక - జనవరి 1970)
ఇక అంతిమంగా కాలం మాత్ర నిర్దయగా కవిత్వంలోని చెత్తాచెదారాన్ని ఊడ్చి పారేస్తూనే వుంది. చక్కని చిక్కని ఉత్తమ కవిత్వాన్ని రాసే కవులను అక్కున చేర్చుకుంటున్నది! మనందరి అనుభవంలోకి వస్తున్న యధార్థమిది!http://archive.andhrabhoomi.net/content/contemporary-poetry

||'' మెరికలు ''||

కపిల రాంకుమార్||'' మెరికలు ''||
1
సంక్షేమ పథకాలు
సంక్షోభంలో పడ్డాయి
తమ క్షేమం పెరిగి
జన క్షేమం మరచి!
2
పోలీసులకు లేదు బలం
పాలసీలో యేది నిజం - ఆరుద్ర
సంస్కరణలు బేహోష్
మార్పుల్ పైపై పాలిష్
పోలీష్ మాలిష్ - మింగును ఆయుష్!
3
సగానికి సగం యాభై కాదట
సగంలో సగం పాతికేనట!
సమానవాటా బిల్లు పెద్దల చిల్లు
జాషువా యేనాడో చెప్పలేదా
మన నేతలే దానికి అడ్డు!
4
బరువులసంచీ చదువు
యశపాల్ వద్దన్నా
ఎల్కేజీ తు ఇంటరు వరకు
మూటలు మోసే కూలీలుగా
తయారుచేయటమే కద్దు!
దండనలేని చదువొక నినాదం
బండమోతలేని విధానం కాదా!
దండగ మారి యోచనలౌ కాకపోతే?
5
చూస్తున్నరు కదా తీస్తున్నాం
తీస్తున్నరుకదా   చూస్తున్నాం
ఓకరికొకరు తప్పించుకునే వాదన!
మరి విజయవంతమౌతున్న
కుటుంబ చిత్రాల మాటేమిటి
చిత్రాల మోజులో జరుగుతున్న నేరాలమాటేమిటి?

25-01-2013 . 4.50 am.

23, జనవరి 2013, బుధవారం

|| శాడిజం ముర్దాబాద్||

కపిల రాం కుమార్|| శాడిజం ముర్దాబాద్||

వీడొక కొత్తరకం వ్న్మాది (శాడిస్టు)
పదేళ్ళ కాపురం
ఓ రెండేళ్ళ కొడుకు
ఇప్పుడేమొ మొహం మొత్తింది
కొత్త పిట్టను వలేసి పట్టాడు
పెళ్ళాన్ని వదిలించుకోవాలికదా
ఆ బిడ్డ్ తన బిడ్డ కాదని వింత వాదం
అక్రమ సంతు అని కొత్త తంతు

***
భార్య విలవిల
న్యాయ పోరాటం
డి.ఎన్.ఏ పరీక్ష
ఆమెకు వ్యతిరేకం
మనోడి పంట పండింది
కోర్టులో విడాకులు
రిపోర్ట్ ఆధారంగా!

***
ఆమెది అరణ్య రోదన
మేలుకున్న మీడియా
రహస్య శోధన
వెలుగులోకి పచ్చి నిజం
అమ్ముడుపోయిన
వ్యవస్థ తప్పుడు నివేదిక

***

కట్టుకున్నోడని గుడ్డిగా
నమ్మకు వనితా
ప్రతీ దానికి ఆధారలుంచుకోకుంటివా
ముప్పులు తప్పవు సుమా!

***

మృగాడి పథకం తిరగబడి
చట్రంలో అరదండం!
పదాలంటె ఆ మాత్రం
చైతన్యం పొందక తప్పదు!

23-01-2013 సా> 7.02

నన్నయ హితోక్తులు!

సభా మర్యాద

సభలో ఎలా మాట్లాడాలి? (యయాతి బోధన)

మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్

సభలో మనసుకు ప్రియంగా ఉండే హిత వాక్యాలే చెప్పాలి. చాలా మితంగా మాత్రమే మాట్లాడాలి. అదీ సరళంగా, ఎదుటివారు నొచ్చుకొనని రీతిగా మాట్లాడాలి.
సత్యవాక్యం విలువ

నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
వ్రత! యొక బావి మేలు, మఱి బావులు నూఱిటికంటెనొక్క స
త్క్రతు వది మేలు, తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు, త
త్సుతు శతకంబుకంటె నొక సూనృత వాక్యము మేలు చూడగన్

నూరు నూతులకంటె ఒక బావి (దిగుడు మెట్లున్నది) మంచిది. నూరు బావులకంటె ఒక యజ్ఞము మంచిది. అటువంటి నూరు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు. నూరుగురు కొడుకులకంటె ఒక సత్యవాక్యము మేలు
శారద రాత్రుల వర్ణన

ఇది నన్నయ వ్రాసిన చివరి పద్యం - శరత్కాలపు రాత్రుల అందమయిన వర్ణన

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచిపూరము లంబరి పూరితంబులై

మెరిసే తారకహారాలపట్ల శారదరాత్రులు దొంగలుగామారాయి (తెల్లని వెన్నెలలో చుక్కలు బాగా కనపడవు). అప్పుడే వికసించిన తెల్లకలువల http://te.wikiquote.org/wiki/

22, జనవరి 2013, మంగళవారం

|| అష్టపదాలు||

కపిల రాం కుమార్ || అష్టపదాలు||

దమ్ము చూపి దుమ్ము దులిపి
దిమ్మ తిరిగె తీర్పు నిద్దాం!
కొమ్ము పెరిగి కొమ్మలనూపె
రిమ్మ తెగులు మట్టుపెడదాం!
-1-
సొమ్ము పొగరు కమ్ముకున్న
కుమ్ములాటల ఆటకట్టుదాం!
జాలరా, జూదరా! కాదు
వాడు ఓటడగే బిచ్చగాడు!
-2-
మంత్రగాడు, తంత్రగాడు
యంత్రవేగపు మోసగాడు!
మీటనొక్కిన బల్బు వెలుగున
బలుపు కాస్త తగ్గిపోవు!
-3-
నానబెట్టి సాగదీసి
తేట తెల్లం చేయకుండా
మొలకల పిలకలపై
ఉక్కుపాదం మోపుటేంది!
-4-
శుష్క వాగ్దానాలు
శూంస్య హస్తాలు
రిక్త సౌలతులు
భజన మండలులా!
-5-
కాంగీయుల గాంగేయులు
నిప్పులగుండం తొక్కేరు
కాలు వాచి కీలు విరిగి
కూలబడిరి వెన్నువిరిగి
-6-
చేతుల పనిదాటి
నోటి దురద హెచ్చి
అపవాదుల బురదలోన
అనివార్యపు తప్పిదాలు
-7-
రాబోయే సాలుకు యే హస్తగతాలు జారి
అయారాం గయారాం కొల్లేటీ తాడంత బారులు
విదేశీ పక్షుల్లా యే గూటికి వలసలో!
వెండి తెర వినోదం త్వరలోనే విడుదల!
--8--
ఈ '' నెల వంక '' ను చూడకు
అపశ్రుతులొస్తాయి!
'' ఈనెల " వంక చూడకు
చూపులకే మొక్క మాడిపోయె!
ఈ ' నెల ' వంకను చూడకు
జేబుకు చిల్లులే
ఈ నెలవు నీది కాదు
భంగ పడతావు!

22-01-2013 ఉ.10.34

| ఎన్నికలు – ఎన్ని కలలు?||

కపిల రాంకుమార్|| ఎన్నికలు – ఎన్ని కలలు?||
ఎన్నికల్లో ఎన్ని కలలో – సోషలిజపు పిచ్చి భ్రమలు
ఓట్ల బాంకులు కొల్లగొట్టే జిత్తులమారియెత్తుగడలు
కట్ట గుడ్డ తిన రొట్టె ఉండగూడు ఓటుకొరకు
కళ్ళు పొడిచి వేళ్ళు కూరికె వేనవేల్ వరములెన్నొ!
తీర్చబోవగ నికి ధనము లేదని తీర్చడానికి చేతులడ్డమని
తీర్చజాలక తలలువంచియు వంకలెన్నొ వెతుక గలరు!
పదవి వస్తే మరుపు వచ్చును పదవి పోతే ప్రేమ పుట్టును
పెదవి తడిసిన ఒక యెత్తు పెదవి విరిచిన యిక చిత్తు!
గోడమీది పిల్లి మాదిరి గోడ దాటె అదును కోసం
నోట్ల సంచుల రాక కోసం యెదురు చూచు వెంగళాయిలు!
పరువు సైతం మదుపు పెట్టి ఓటువేసె క్షణంలోనే
అనుభవాల నేర్పు తోన పిచ్చివాళ్ళుగ చేయగలరు!
నిన్న తిట్టి నేడు పొగిడి
రేపు ముంచి రేవు దాటి
ప్రభుత పేరున డబ్బు పొంది
జనత నోటిన మట్టి గొట్టి
పారిపోయె దొడ్డ దొరలకు
దొడ్డిదారిని పీఠమెక్కగ
గడ్డిసైతం మింగటంలో
గోల్డ్ మెడలు బోలెదొచ్చాయి
ప్రజల చేతికి చిప్పలొచ్చి
తిప్పలెన్నో దెబ్బ తీసాయి!  

(కవిత్వంలో ఓనమాలు దిద్దుతున్న రోజుల్లో 1968)

21, జనవరి 2013, సోమవారం

|| ఆ నలుగురు ||

కపిల రాం కుమార్ || ఆ నలుగురు ||

వెర్రితలల వికృత చేష్టలకు
సభ్యసమాజం తలదించుకుంటే
ఓ నలుగురి విధినిర్వాహణా
రాహిత్యమే కారణం!

మనోక్షీరంలో వికృతపుటాలోచన
విషపు చుక్కై మైకంతో
పడమటి గాలి వాటుకు
చంకలెగరేసుకుంటూ
నాగరీకులమంటూ
తందనాలాడే వారిని సత్పౌరులుగా
మలచలేని ఆ నలుగురే బాధ్యులు!

కమ్మనైన మాతృభాషలో
ముద్దు మురిపాలతోపాటు
మచ్చికతీర గోరుముద్దలతో పాటు
బుద్ధు నేర్పని తల్లి -
ఒకటో ముద్దాయి!

తడబడే అడుగులు
తప్పటదుగులు కాకుండా
అడ్డాల్లో బిడ్డకాని గడ్డాలప్పుడు బిడ్డలా
సమర్థించుకోచూచి,
నిఘావుంచని తండ్రి
రెండో ముద్దాయి!

దండం దశగుణం భవేత్ - అన్నరని
అతి చేస్తేనో - అసలు మిన్నకుంటేనో
గోడలుదూకి, చదువులెగ్గొట్టి
స్నేహితులవలయంలో
చిక్కుకునే విధ్యార్థికి
మార్గమేయలేని ఉపాధ్యాయుడూ
మూడో ముద్దాయి!

వ్యక్తిత్త్వం దిగజార్చి
అవ్యక్త ప్రేలాపనలు
ఉచితానుచితాల తేడా
గమనించక ప్రవ్రించే వాణ్ణి
సరిదిద్దలేని స్నేహ సమాజమూ
నాలుగో ముద్దాయి!

వీరి నిర్లక్ష్యాని తోడు
ఇంగితం యిసుమంతలేని
వాడు భావి క్రౌర్యుడు కావటానికి
ఆ అవలక్షణాలు పునికిపుచ్చుకోవటానికి
ఆ నలుగురేగా కారణం!

మనమూ ఆ నలుగురిలో ఒకరం
మన పద్ధతి మార్చుకొని
మరొక క్రౌర్యం జరుగకుండా
జాగ్రత పడక తప్పదు!
ముద్దాయిగా మారొద్దు!