4, మార్చి 2013, సోమవారం

అందెల సందడి



నాట్య కళా పోషణం నటరాజ పాద పూజనం

apr  -   Sun, 3 Oct 2010, IST
అందెల సందడి
మన రాష్ట్రంలో కళాకారుల కోసం ఇప్పుడు సంఘాలు ఏర్పడి నట్టే ఈ రోజు లలో కులాలు ఏర్పడేవి. ఆ దృష్టితో చూస్తే దేవదాసి వ్యవస్థలో దేవదాసీలు, గణికలు అని రెండు రకాల వారుండే వారు. దేవ దాసీలలో, శివదాసీలు, విష్ణు దాసీలు అని రెండు రకా లున్నాయి. శివ దాసీలలో బసవిలు, పార్వతిలు, గణాచా రులు అని రకరకాలుగా కనబడ తారు. అలాగే గణికలలో కేళిక, మేజువాణి, మేళం వాళ్లు అని రకాలు కనబడతారు.
వీరంతా సమా జంలో తెగలుగా కనబడతారు. సమాజంలో ఒక తెగను సృష్టించి ఎడతె గని విధంగా వ్యవస్థను ఏర్పడేలా చేయ గలిగా యంటే పెద్దలు కళలను కాపాడేం దుకు పునాదిని ఎంత బలంగా వేశారో అర్థం చేసుకోవచ్చు. అలాగే నృత్య నాటకాల కోణం నుంచి చూస్తే మన రాష్ట్రంలో అనేక భాగవత మేళాలు ఏర్ప డ్డాయి. ఈ భాగవతులను వీధి భాగవ తులు ప్రధానమైన వారు. వీరిలో కూచిపూడి బ్రాహ్మణ భాగవతులు, కోడ కొండ, కపట్రాల, యానాది, చెంచు, గొల్ల, నక్కల భాగవతులు అని అనేక రకాల వారున్నారు. వీరు కాక దాసరి పాటకులు, బహురూపులు ఉన్నారు. వీరంతా తెగలు గా ఏర్పడి భాగవత సంప్రదాయాన్ని కాపాడారు. ఎవరికి వారు గా ఒక వ్యవస్థగా నిలిచి నిలబెట్టారు. ఇది మన పూర్వీకులు కళలను నిలబెట్ట డంలో ప్రదర్శించిన చిత్తశుద్దికి తార్కాణంగా చెప్పు కోవచ్చు.
నాట్య కళకు వీరు మహారాజ పోషకులు
వ్యవస్థలు ఆవేశంతో ఏర్పడినా వాటికి ఆలంబన అవసరం. వనిత, కవిత, లత ఆదరువు లేకుండా రాణించలేవు అన్న పెద్దల సూక్తి కూడా ఇదే చెబుతోంది. పెద్దలు ఉదహరించిన వాటిలో కవిత 64 లలిత కళలకూ ప్రాతినిధ్యం వహిస్తోంది. కళలకు మహా రాజపోషకులుగా నిలిచి వాటిని బతికించిన జమీందారి సంస్థా నాలూ చాలా వున్నాయి. కార్వేటినగరం, కాళహస్తి, వెంకటగిరి, కొల్లాపురం, గద్వాల, వనపర్తి, నూజివీడు, పిఠాపురం, పెద్దపురం, తుని, విజయనగరం, బొబ్బిలి, జయపురం సంస్థానాలు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. వీరి ఆదరణతో పల్లవులు, జక్కిణి, దరువులు, పదదరువులు, పెద్ద వర్ణాలు, పదాలు వంటి సంగీత రచనలు వీరి ఆదరణలో రూపుదిద్దుకు న్నాయి. భామాకలాపాలు, గొల్ల కలాపాలు, వీధి నాటకాలు గజ్జెకట్టి బతకగలిగాయి.
విజయనగర సంస్థానం
హంపి విజయనగరం తెలుగు కళలకు
పెద్దదిక్కుగా నిలిచి స్వర్ణయుగాన్ని ఆవిష్క రించింది. ఆ తరువాత లలిత కళలను బతికించిన ఘనత విజయనగరం సంస్థా నానికి దక్కింది. దీనికి కవి పండితుల సంస్థానంగా మంచి పేరుంది. ఆనంద గజపతి మహారాజా వారి హయాంలో పదాలు, పల్లవులు, శబ్దాలు వచ్చాయి. అందులో మండూక శబ్దం విలక్షణమైంది. అలాగే శుభలక్షణ పల్లవి కూడా ఈ సంస్థా నంలోనే పుట్టింది. అలాగే సీతారామ గజపతి కాలంలో సప్తతాళాలతో రూపొం దిన జక్కిణి దరువులు, పద దరువులు, స్వరపల్లవులు, పొణ్ణంగి దరువులు అనేకంగా రచించబడ్డాయి.
కార్వేటినగర సంస్థానం
ఈ సంస్థానాన్ని వెంకటపెరుమాళ్‌ రాజేంద్రుల కాలంలో నృత్యకళ అమో ఘంగా వర్థిల్లింది. గోవింద సామయ్య వర్ణ పంచకం అనే పెద్దవర్ణాలు ఈయన హయాంలోనే రచించారు. కళాకారుడికి వీటిలో నృత్యం చేయడం నిజంగా అగ్ని పరీక్ష వంటిదే! వీటిలోని మోహన వర్ణం కార్వేటినగరం, కాళహస్తి, వెంకటగిరి ప్రాంతంలో, నవరోజు వర్ణం కోస్తాజిల్లాలో బహుళ ప్రచారంలో వుంది.
వెంకటగిరి సంస్థానం :
ఈ సంస్థానాన్నేలిన బంగారెచ భూపాలుని కాలంలో కవి, పండిత, గాయక, నాట్యచార్యులను ఆద రించి పోషించింది. ఈయన హయాంలో సభా రంజని అనే నాట్య గ్రంథం రూపొం దింది.
అందెల సందడితీర్థ క్షేత్రాలలో గజ్జెల గలగల
ఇక పుణ్యతీర్థాలు నృత్యకళకు వేదికగా నిలిచాయి.
శ్రీశైలం : ఇక్కడ శైవ సంప్రదాయ కళలు అనేకం వర్థిల్లాయి. ఇక్కడ కొలువుదీరిన మల్లికార్జున, భ్రమ రాంబికలపై అనేక కవు తాలు రచించారు నాటి కవులు. ఇక్కడ భామాకలాపం, గొల్ల కలాపం ప్రదర్శనలు భ్రమరాంబికపై రచించిన అంబాస్థవంతో ప్రారంభమయ్యేవి. శృంగనాట్యాలు, సప్తలా స్యాల వంటి అతి ప్రాచీన కళారూ పాలకు ఈ క్షేత్రం ఆటపట్టుగా ఉండేది.
చెయ్యూరు : ఇక్కడ సుందరేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఈ ఆలయంలో శైవ సంప్రదాయం విశేషంగా వర్థిల్లింది. స్వామిపై ప్రత్యేక రచనలు అనేకం ఉన్నాయి. ఇక్కడ సప్తలాస్య ఆరాధన, కేళిక, యక్షగాన సంప్ర దాయాలు ఇక్కడ అభివృద్ధి చెందాయి. సర్వవాద్య ఆరాధన ఇక్కడి విశేషం. శ్రీకాళహస్తి, మన్నారు పోలూరు, జొన్న వాడ, శింగరాయకొండ, బాపట్ల, మర్కాపురం, మాచర్ల, ధర్మపురి, అల్వాల్‌, శ్రీకాకుళం, పిఠాపురం, శ్రీకూర్మం వంటి ఎన్నో శైవ, వైష్ణవ, క్షేత్రాలు నాట్యకళకు పెట్టింది పేరుగా వాసికెక్కాయి. ఈ క్షేత్రా లలో కేళిక, బలిహరణ నాట్యాలు శైవ, వైష్ణవ సంప్రదాయాల భేదాలే తప్ప దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఈ ఆల యాలలో ప్రదర్శించే కవుతుకాలు, సప్తలాస్యాలలో కొంత మార్పు కనబడు తుంది.
జిల్లాల వారీగా నాట్య విశ్వరూపం :
మన తెలుగునాట నాట్యకళ అభివృద్ధి తీరుతెన్నులు చూసినపుడు గంజాము ప్రభువులు ఓఢ్రులు. అయినా వారి మంత్రులు తెలుగు వారు కావడంతో ఇక్కడ తెలుగు కళలు వర్థిల్లాయి.ఇక్కడి జమీందారీలలో తెలుగు నాట్యాలు అభివృద్ధి చెందాయి. గంజా ముకు చెందిన జమిందారు ప్రతాప రుద్ర దేవుడు వెయ్యి మంది దేవదాసీలను తెలుగునాటి నుంచి తెప్పించి పూరి ఆలయానికి సమ ర్పించాడు. వారంతా నాట్యకళతో జగన్నాథస్వామి వారిని ఆరాధించారు. ఈ విధంగా తెలుగు సంస్కృతి ఈ ప్రాంతం మీద బలంగా పడింది. అందువల్లనే ఒడిస్సీ నాట్యంలోని గతి, విన్యాసాలు, అభినయక్రమాలు, జతి కట్టుబాట్లు తెలుగు నాట్యాలకు చాలా దగ్గర పోలికతో కనబడతాయి.
శ్రీకాకుళం, విజయనగరం : జిల్లాలలోని శ్రీకూర్మం, అరసవిల్లి ఆలయాలు నృత్య కళకు వేదికలుగా నిలిచాయి. బొబ్బిలి, కోమటిపల్లి, విజయనగరం, జయపురం, మాడుగుల, చోడవరం, జామి, నిమ్మలవలస నరసన్నపేట, రాజాము, నర్సీపట్నం, దొడ్డిగల్లు సంస్థానాలలో నాట్యకళలకు పుట్టిళ్లుగా వర్థిల్లాయి. ఇక్కడ దేవ దాసీల భరగనాట్యం, పురుష భాగవతుల భామా కలాపం, గొల్ల కలాపం బాగా అభవృద్ధి చెందాయి.
ఈ రెండు జిల్లాలలో ఉన్నన్ని భామా కలాప, గొల్లకలాప నాట్యమెెళాలు మరెక్కడా లేవంటే అతి శయోక్తికాదు. ఇక్కడ స్త్రీలు కలా పాలు ఆడడమనేది అరుదుగా కనబడు తుంది. ఇక్కడ కలాప కళా కారులు సిద్ధేం ద్రుల కలాపాలకుతోడు వంకాయలవారి కలాపాలు, చింతలపాటి వారి కలాపాలు, కసింకోట వారి కలాపాలు చేర్చి ఆడుతున్నారు. ఈ కలా పాలు కూచిపూడి కన్నా భిన్నంగా కనబడ తాయి. కాగా దేవదాసీల విద్య మాత్రం శ్రీకూర్మం నుంచి తంజావూరు వరకు ఒకే విధంగా కనబడుతుంది.
గోదావరి జిల్లాలు : తుని, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ, అమలాపురం, ముమ్మిడి వరం, పేరూరు, మానేపల్లి, మండపేట, ముర మండ,రాజమండ్రి, ధవళేశ్వరం, పసలపూడి, తాటిపాక, రాజోలు, వాడపల్లి,ద్రాక్షా రామం, ఉండి, మారంపల్లి, నరసా పురం, ఆచంట, అంతర్వేది, ఏలూరు తదితర జమీందారీలలో నాట్యకళ విశేషంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ స్త్రీలే కచ్చేరీ నాట్యాలు, కలాపాలు ఆడడం ఆనవాయితీ! ఇక్కడ నాట్యకళా కారిణులు సానులు, భోగంవారు అని రెండు రకాలు. భోగంవారు కచ్చేరీలో నాట్యం చేస్తే సానులు భాగవతమాడేవారు. ఈ కళా కారిణులకు సంస్కృత, తెలుగు సాహిత్యా లలో మంచి పరిచయం ఉంది.
కృష్ణ, గుంటూరు జిల్లాలలో కూచిపూడి, మొవ్వ, నంగిగడ్డ, రేపల్లె, తెనాలి, గుంటూరు, బాపట్ల, గుడివాడ, శ్రీకాకుళం, పొన్నూరు, ఒంగోలు ప్రాంతాలు కూచిపూడి భాగవత మేళాలకు ప్రసిద్ధి.
నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో టంగుటూరు, కావలి, సింగ రాయకొండ, జొన్నవాడ, నెల్లూరు, కలువాయి. బుచ్చి రెడ్డిపాలెం, వెంకటగిరి, మన్నారుపోలూరు, నాయుడుపేట, కాళహస్తి, కార్వేటి నగరం, జంగాలపల్లి ప్రాంతాలు నృత్యకళలకు రంగస్థలంగా ఉన్నాయి. దేవదాసీల కేళికానృత్యానికి ఈ ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. కృష్ణాజిల్లా కూచిపూడిలాగే ఈ ప్రాంతంలోని జంగాల పల్లి నాట్యమేళ కళాకారులకు ప్రసిద్ధి. ఈ కళా కారులు యక్షగా నాలకు, వీధినాటకాలకు ప్రఖ్యాతి గడించారు. ఇప్పుడు తమిళ నాడులో కలిసిపోయిన తెలుగు ప్రాంతాలు తిరుత్తణి, చెయ్యూరు, మధురాంతకం పట్టణాలు కూడా నాట్యమేళకు ఆటపట్టుగా వుండేవి.
రాయలసీమలో : దత్తమండలాలైన కడప, కర్నూలు, అనంతపురం, జిల్లా లలో కోడకొండ, బనగానపల్లె, ప్రొద్దుటూరు, హిందూపురం, తాళ్లపాక, పుల్లంపేట, బుక్కాయపాలెం, కోటకొండ భాగవ తులు కూచిపూడి సంప్రదాయానికి చెందిన వారు. బనగానపల్లెనేలిన నవాబు కూచి పూడి భాగవతులను పిలిపించి వారికి గ్రాసవాసాలు సమకూర్చి ఆ ప్రాంతంలో కూచిపూడి భాగవత సంప్రదాయం వర్థిల్లేందుకు కృషి చేశారు. ఇక్కడ దేవ దాసీలు కేళికా నృత్యాన్ని ఆరాధించారు.
తెలంగాణాలో : ధర్మపురి, పెద్దపల్లి, నాగుపూర్‌, గద్వాల, వనపర్తి, జటప్రోలు, ఆత్మ కూరు, హైదరా బాదులలో నాట్యకళ బహుళ ఆదరణ

పొందింది. ఒక్క హైదరాబాద్‌ను మినహాయిస్తే ఇతర ప్రాంతాలలో కేళికా నాట్యం అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో ముస్లిం సంప్ర దాయాల ప్రభావం పడింది. అయినా హైదరాబాద్‌ గానాభజానాలకు, ఆట పాటలకు ఆటపట్టుగా నిలి చింది. భాగ్యమతి అనే నాట్యకళాకారిణి పేరుమీద భాగ్యనగరం ఏర్పడడం, అది తెలుగు జాతికి ఖ్యాతిని నింపుతున్న హైటెక్‌ సిటీగా మారడం మనందరికీ గర్వకారణం.
ఇలా సమాజ నిర్మాణంలో మమేకమై కులాలుగా, తెగలుగా ఏర్పడి నాట్యకళకే జీవితాలు అంకితం చేసిన ఘనకీర్తి మన తెలుగు రాష్ట్రానికి దక్కుతుంది. జన జీవితంలో ఇంతగా
మిళితమైన కళను దేవస్థానాలు, రాజస్థానాలు, సంస్థానాలు, జమీందారులు ఆదరించి పోషించాయి... ప్రోత్సహించాయి.
నాట్యం నటరాజ నర్తనం
త్రిమూర్తులలో ఒకడైన శివుడు తాండవ ప్రియుడు. ఆయనను నటరాజు అని పిలుస్తారు. ఆయన అర్ధాంగి పార్వతి శివునితో సరిసమానంగా నాట్యంచేసి ఆయనను మెప్పించేది. ఆయన ఉధృతంగా తాండవం చేస్తే ఆమె సుకుమారంగా నాట్యంచేసి ఆయనన ప్రసన్నం చేసేందుకు ప్రయత్నించేది. విష్ణుమూర్తి దశవిధావతారాలు ఎత్తినా ఆయన ఒక్క కృష్ణావతారంలోనే కాళియ మర్ధనం సన్నివేశంలో కాళియ సర్పం పడగలను చితకకొట్టేందుకు తాండవం చేశాడు. తాండవ కృష్ణుడు తెలుగువారి చేత తారంగాలందుకున్నా ఆయన తాండవమూర్తిగా వాసికెక్కలేదు.
వినాయకుడు కూడా అష్టభుజాలతో ఆటలాడే వాడైనా ఆయన నాట్యగణపతిగా ముద్ర పడ్డాడే తప్ప తాండవమూర్తిగా పేరు తెచ్చుకోలేదు. జైన సాహిత్యంలో జైన తీర్థంకరుడు వృషభుని జయంతినాడు ఇంద్రుడు తాండవమాడినట్టు చెప్పారు. సంప్రదాయ నాట్యంలో విని యోగించే వివిధ ముద్రలు ఆధారంగానే సంప్రదాయ నాట్యం రూపొందిందని పెద్దలు చెబు తారు. త్రిమూర్తు కర్తవ్యాలు, కార్యకలాపాలు తెలిస్తే శివుని తాండవం వెనక ఉన్న మర్మం అర్థమవుతుంది.
పంచ భూతాత్మకమైన ఈ విశాల విశ్వాన్ని సృష్టించి, పెంపొందించి, ధర్మమార్గంలో నడిపి, అంతం చేసేందుకు, సృష్టిని తనలో లీనం చేసుకునేందుకు ఆది శక్తి త్రిమూర్తులను నియోగించింది. ఆమె విధించిన కర్తవ్యాల ప్రకారం బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు. విష్ణువు సృష్టికి అవరోధంగా మారే శక్తులను ఏరివేసి అది సాఫిగా, సజావుగా సాగేందుకు కృషి చేస్తున్నాడు. శివుడు సృష్టిని అంతం చేస్తున్నాడు. ఈ మూడు మహాకార్యాలు ముగిశాక మొత్తం సృష్టిని తనలో ఇముడ్చుకుని, వెలికి తీసే మహత్తర కార్యాన్ని ఆదిశక్తి నిర్వహిస్తుంది. శివుడు చేసే నాట్యాన్ని తాండవం అంటారు.
మహాలయుడు, ప్రళయకాల విలయుడు, తాండవ ప్రియుడు అయిన శివుడు ఈ మొత్తం క్రియను చూస్తూ ఏడు రకాలైన నాట్యాలు చేస్తాడు. శివుడు ఇన్ని రకాల తాండవాలు చేసినా లోకానికి బాగా తెలిసింది ఆనంద తాండవం, రుద్రతాండవం మాత్రమే! శివునికి పరివారం ఉంది. పార్వతి ఆయన భార్య. వృషభం వాహనం. పాములు అభరణాలు. కైలాసం నివాసం. వీరుకాక ప్రమదగణాలున్నాయి. వారంతా కూడా శివుని పదనర్తనకు అనువుగా వాయిద్యాలు వాయిస్తూ తాండవం చేస్తారు. హశ్శరభ, దశ్శరభ అంటూ ఉధృతంగా నాట్యం చేయడం శైవం నేర్పిన సంప్రదాయమే!
శివాలెత్తి తాండవం చేయడం ద్వారా చూపరులను బలంగా ఆకర్షించ డమే కాదు నాట్యం రాని వాడిని కూడా ప్రేరేపించి ఆవేశంగా నాట్యం చేయించగల అమే యమైన శక్తి ఈ తాండవానికి ఉంది. రాజరాజచోళుని వంటి సుప్రసిద్ధ రాజులు నాట్యకళను అమితంగా ఆదరించి ప్రోత్సహిం చారు. ఆయన కాలంలో ఎందరో నర్తకీమణులు బృహ దీశ్వరుని ఆలయంలో నృత్యపూజ చేసినట్టు ఆధారాలున్నాయి. కంచి ఆల యాలలో కూడా నృత్యయ పూజ ఉంది. ఆనాటి నాట్య కళారీతులను సంఘం కాలం నాటి తమిళ గ్రంధం వివరంగా పేర్కొంది. కవిత్తొగై గ్రంధంలో శివతాండవం గురించి అనేక వివరాలున్నాయి. కొడుకొట్టు, పండరంగం, కాపాలి నాట్యాలలో శివుని నర్తన విధానాలు వివరంగా ఉన్నాయి.
యుద్ధానికి వెళ్ళే రాజులకు, సైన్యానికి విజయం కలగాలని కోరుతూ తమిళ దుర్గను పూజించే సంప్రదాయం ఆ రోజులలో ఉండేది. ఆ పూజలో భాగంగా తాండవం చేసే వారు. ఈ నాట్యం కోసం ఏడు తీగల యాల్‌ అనే వాయిద్యాన్ని వాడే వారు. ఇందులో ఉన్న ఊపు, ఉత్సాహం అలాంటిది.
సృష్టి, స్థితి, సంహారాలు, దుష్టశిక్షణ, శిష్టరక్షణలు ఆయనకు ఒక ఆట అని తెలియజెప్పడానికే శివుడు నటరాజులా మనకు దర్శన మిస్తున్నాడు. నిరంతర యోగముద్రలో గంభీరంగానూ, కాటికాపరిగా ఒకింత భయంకరంగానూ కనిపించే శివుడు నాట్యమూర్తిగా అందరినీ అలరిస్తాడు.. ఆకట్టుకుంటాడు. అందుకు కారణం విగ్రహమూర్తిలో మనకు కనిపించేది ఆనంద తాండవం. శివుడు ఏడు రకాల తాండవాలు చేస్తాడని శాస్త్రాలు చెబుతుంటే లోకంలో బాగా ప్రచారంలో ఉన్నవి ఆనందతాండవం, రుద్ర తాండవం మాత్రమే!
శివుడు సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ, తిరాధానాలు అనే పంచకృత్యాలను చేస్తాడు. శివుడు పంచముఖుడు. ఇవే పంచభూతాలు. ఈశాన్య ముఖం నుంచి పరమాత్మ, తత్పురుషం నుంచి వాయువు, అఘోర ముఖం నుంచి అగ్ని, వామదేవం ముఖం నుంచి నీరు, సద్యోజాత ముఖం నుంచి భూమి పుడుతున్నాయి. అందుకే శివ తాండవాన్ని పంచభూతాత్మక తాండవం అంటారు.
శివుడు చేసే తాండవాలనే శివతాండవాలు అనాలి. శివ తాండవం పేరుతో లోకంలో కనిపించే నాట్యాలను తాండవాలు అని అనాలే తప్ప వాటిని శివ తాండవాలు అనకూడదు. శివ తాండవాలే సృష్టి, స్థితి, సంహారాలను సూచించే మహత్తర నృత్యం. కనుక తాండవమాడదలచుకున్న కళాకారుడు ముందుగా ప్రకృతిని అధ్యయనం చేయాలి. అప్పుడే ఈ నృత్యంలోని భావాలు అర్థమవు తాయి. శివుడు చేసే తాండవాలు ఏడు రకాలు. ఈ సప్త తాండవాలు ఒక్క శివునికే సాధ్యం.
అవి 1. ఆనంద తాండవం 2. సంధ్యా తాండవం 3. కలిక తాండవం 4. విజయ తాండవం 5. ఊర్ధ్వ తాండవం 6. ఉమా తాండవం 7. సంహార తాండవం.
శివుని తాండవాన్ని ఏ శైలిని ఆశ్రయించి చేసినా ఊర్ధ్వ తాండవాన్ని అందరూ చేయడం విశేషం. శివుని పేరుతో ఎన్ని రకాల తాండవాలు భక్తులు ఆవేశంతో చేసినా శివుడు చేసే తాండవాలే ప్రధానమైనవి కనుక వాటి గురించి విశదముగా తెలుసు కోవడం అవసరం.
- శ్రుతకీర్తి

3, మార్చి 2013, ఆదివారం

|సంస్మరణ కాదు సంస్కరణ ముఖ్యం |

కపిల రాంకుమర్||సంస్మరణ కాదు సంస్కరణ ముఖ్యం ||

ఎన్నోసారని అడుగుతున్నాను
వేదికలెక్కడం గురించి కాదు!
సమావేశాలు జరుపుకోడం గురించసలే కాదు!
దేనిగురించా?
అమాయకులను హత్యచేయ
క్షమించడమెన్ని సార్లని?
విచక్షణ్లేకుండా తుపాకి గుండ్లకొ,
బాంబులతోనో యెరచేయడం యెన్నోసరని?
నేరస్తులను క్షమించి
ఉదాసీనంగవుండడమెన్నోసారని
ఆడుగుతున్నాను!

**

దేశం గొప్పల గురించి
సరిహద్దుల గురించి
పొంగే నదీనగాల గురించి
ఊక దంపుడుపున్యాసగురించి
అడుగుతున్నాను!
సి (సినీ) నా (నాదాల) రె (రెక్కల) కు
కలగానో, అలవోకగానో
సంస్మరణగానో '' నాదేశం పావన గంగ, ్
అగ్ని పునీత సీత, కాళిదాస కావ్య ఝరి ''
అవును నిజమే కాదనను అదీ ఒకప్పుడు!
కాని నేడు టెర్రరిస్టులకు, దోపిడీదారులకు
సత్యాన్ని హత్య చేయటం- సామాన్యుడ్ని ముంచటం,
నడిబజారులో న్యాయాన్ని పొడవటం,
చీకటి గుహల్లో ధర్మాన్ని బందీ చేయటం
పాలు తాగి రొమ్ములను గుద్దటం - నీతి!
ఆలిని స్వార్థ ఆర్థిక ప్రగతి కోసం తార్చటం - రీతి!
అవుతున్నపుడు
కవిత్వానుకి బదులు కసిత్వం పెరిగి
ఆవేశం కట్టలు తెంచుకోదా!

**

కాని నేను అశక్తుడినే కావొచ్చు!
తలవంచుకుంటాను
కాని ..తప్పు చేసికాదు
ఆ తప్పు నేనొక్కడినే దిద్దలేక
గద్గద స్వరంతోనైనా పెగల్చుకుని
దద్దరిల్లేలా స్వరం పెంచి ఆడుగుతున్నాను!
అసహనంతో వుండడమెన్నాళ్ళని?
నిస్సహాయులంగా మిగలడ మెన్నాళ్ళని?
మా తాతలు తాగిన మూతులు
నేదు నేతి వాసం వేయడంలేదు!
ఇంగువ కట్టిన గుడ్డకుండే ఆపాటి
ఇంగితమూ మనకు లేదు
సంస్మరణలు కాదు!
సంస్కరణ్ ముఖ్యమంటాఅను!
ఆత్మ విమర్శ చేసుకున్నంతగా బాధ పడటం
(నటించడం) తీరా ఆచరణలోకు వస్తే
ఆ చరణాలు దారి తప్పి
కర్కశ, దుష్క్కర, నిర్జీవ్, నిర్వీర్య పరిస్థితులే
పున:పున: పునరావృతమవడమేమిట్?
దీనికి అంతం యేది? మంచికి ఆరంభం యేది?
నాటి గాడ్సేలనుండి - నేటి టెర్రరిస్టులనుండి,
మేటి ఖాజీ మస్తానులాంటి వారినుండి
స్మగ్లర్ల నుండి, '' నాటోరియస్ బర్ గ్లర్ల " నుండి
భోజనాల మధ్య పానంగా మద్యపానం తీసుకునే
కుహనా రాజకీయ మహా పోషకులనుండి
మనకి యెప్పుడు ముక్తి?
మనకెప్పుడువచ్చునా శక్తి?
ఆలోచించండి వచ్చే యెన్నికల నాటికైనా!

***
' సుధామ' అన్నట్లు '' దేశానికైన, దేహానికైనా
నలుబది దాటితే - రక్తపుటేరులు పారొచ్చు!
రక్తపు పోటులూ రావొచ్చు! ''
అందుకే '' దేవుడా రక్షించు నా దేశాన్ని ''
అన్న తిలకును స్మరిస్తూనే
ఆ దేవుడికీ దిక్కులేదు కాబట్టి
మిమ్మల్నే ఆలోచించమని
ఈ దుర్మార్గాన్ని చీల్చి చెండాడమని
ఆదుగుతున్నాను
మీరు కదిలినా సరే
లేక నాతో గొంతు కలిపినా సరే!
మొదట ఒక్కడి అడుగే..
తరువాతే అడుగులు జాడలౌతాయ్!
పోరు సలిపే వాడలౌతాయ్!

3.3.2013 సాయంత్రం 4.35.

2, మార్చి 2013, శనివారం

తెలుగు పిడుగు గిడుగు రామమూర్తి గారు…

తెలుగు పిడుగు గిడుగు రామమూర్తి గారు…

తెలుగు పిడుగు గిడుగు రామమూర్తి గారు…
గిడుగు రామమూర్తి పంతులు గారు అనగానే తెలుగులో వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యులుగా మాత్రమే అందరికీ గుర్తుకొస్తుంది. ఆ కారణంగానే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సామాన్య ప్రజలకు అర్థం కాని… వేదాల్లో ఉండే భాషను ప్రామాణికంగా తీసుకున్న కాలంలో తెలుగు భాషను సామాన్యుల స్థాయికి దించడానికి ఆయన జీవితకాల పోరాటం చేసిన మాట వాస్తవమే !
కానీ ఆయన కేవలం తెలుగు భాషోద్ధరణకే పరిమితం కాలేదు. అప్పటికీ, ఇప్పటికీ ఎవరికీ పట్టని ఆదివాసుల సమస్యలకు ఎన్నిటికో ఆయన పరిష్కారం చూపారు. ఆదివాసుల సంక్షేమానికి కృషి చేసిన వాళ్ళకు ఈయనే మార్గదర్శి అని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల గిరిజనులు మాట్లాడే భాషలలో ముఖ్యమైనది సవర భాష. ఐతిరేయ బ్రాహ్మణంలో కూడా ఈ భాష ప్రస్తావన ఉందంటారు. అప్పటివరకూ ఆ భాషకు లిపి లేదు. వారి మాతృ భాషలో చదువుకునే యోగం ఆ గిరిపుత్రులకు ఉండేది కాదు. ఈ పరిస్థితి గమనించిన గిడుగు వారు ఆ భాషపై విస్తృత పరిశోధన చేసి ధ్వన్యాత్మక లిపిని రూపొందించారు.
కేవలం లిపిని రూపొందించి వదిలివేయలేదు. ఆ లిపిలో పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసారు. ఆ గిరిజన ప్రాంతాలలో ప్రజలను విద్యావంతులను చెయ్యడానికి పాఠశాలలు ఏర్పాటు చేయించారు. వాటి నిర్వహణకు తన స్వంత డబ్బును సైతం ఖర్చు చెయ్యడానికి వెనుకాడలేదు. వాటిని అభివృద్ధి చెయ్యడానికి ప్రభుత్వంమీద ఒత్తిడి తీసుకువచ్చి సాధించారు. అంతే కాదు. సవర భాషకు నిఘంటువు, వ్యాకరణం కూడా రూపొందించారు. వారి సమస్యలెన్నిటికో ఆయన పరిష్కారాలు చూపారు. గిరిజనుల అభ్యున్నతికి ఇంతగా కృషి చేసినవారు అప్పటికీ, ఇప్పటికీ ఇంకెవరూ లేరేమో !
గిడుగు వారు కేవలం తెలుగు వ్యావహారిక భాష మీదనే పరిశోధనలు చెయ్యలేదు. గ్రాంథిక భాషలో కూడా ఉద్దండులే ! ఆంగ్ల భాషలో కూడా ఆయన పరిశోధనలు సాగాయి. తెలుగు వారికి ఆంగ్లం సులువుగా నేర్చుకునే పద్ధతులను గురించి తెలియజేసేందుకు ఒక పత్రికను కూడా నిర్వహించారు.
నిజానికి గిడుగు రామమూర్తి గారి ముందుతరం వారు, సమకాలీనుల గురించి పరిశోధన, ప్రచారం జరిగినంతగా ఆయన గురించి జరుగలేదేమో ! అక్కడక్కడ కొంత జరిగినా అది అసమగ్రంగానే వుంది. మన భాషావికాసానికి ఉద్యమించి తెలుగును సజీవం చెయ్యడానికి పాటుపడిన ఆ మహానుభావుడి గురించి మరింత విస్తృత పరిశోధన జరగాల్సిన అవసరం ఎంతైనా వుంది. అప్పుడే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు సార్థకత వుంటుంది.
తేనె కన్నా తీయనిది తెలుగు భాష
దేశభాషలందు తెలుగు భాష లెస్స …….
ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం: ‘శిష్ట వ్యవహారిక’ రూప శిల్పి ” గిడుగు ” జయంతి
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని రాష్ట్ర ప్రజలు మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటారు.. శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు జన్మించారు. 1875లో తండ్రి మరణించేవరకూ పర్వతాల పేటలో చదువుకున్న రామమూర్తి ఆ తరువాత విశాఖలోని తన మేనమామ ఇంటికి చేరుకున్నారు. అక్కడ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ముఖలింగ దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకున్నారు. 1879లో మెట్రిక్యులేషన్ పాసయిన తరువాత టీచరుగా పని చేస్తూ, చదువు కొనసాగించారు. 1886లో ఎఫ్.ఎను, 1896లో బి.ఎను డిస్టింక్షన్‌లో పూర్తి చేశారు. గజపతి మహారాజు స్కూలు కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు. తెలుగు భాషా బోధనను వ్యావహారికంలో చేయాలన్న ఆయన ఆలోచనకు 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయుడి నుంచి మద్దతు లభించింది. అప్పటి ఏ వీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, యేట్స్, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం ‘తెలుగు’ అనే పత్రికను గిడుగు ప్రా రంభించారు. వీరి కృషి కారణంగా 1912-13లో స్కూల్ ఫైనల్ బోర్డు తెలుగు వ్యాస పరీక్షను గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయొచ్చని ఆదేశాలు జారీ చేసింది. అప్ప టి నుంచి స్కూలు, కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో వెలువడడం మొదలుపెట్టాయి. ఆ తరువాత ప్రభుత్వం వేసిన ఒ క కమిటీలో గ్రాంథిక వాదులు ఆధిపత్యంతో వ్యావహారిక భాష లో బోధనను రద్దు చేసినా అనంతర కాలంలో పున రు ద్ధరించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆ యన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉత్తరాంధ్ర అడవుల్లో సవరులు అనే తెగ భా షను నేర్చుకుని అందులో వారికి బోధించారు. దీంతో మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదునివ్వగా ఆ తరువాత కైజర్ ఈ హింద్ బిరుదు ఆయనకు లభించింది. వ్యావహారిక భాషకు ఇంత సేవ చేసిన గిడుగు రామమూర్తి 1940, జనవరి 22న మరణించారు.
-తెలుగు సాహిత్య వేదిక

ఆధునిక బాలగేయ సాహిత్య పతాక గిడుగు వెంకట సీతాపతి

ఆధునిక బాలగేయ సాహిత్య పతాక గిడుగు వెంకట సీతాపతి
Sun, 2 Jan 2011, IST vv

పెద్దలకు సాహిత్యం వుంది. అలాగే బాలలకు కూడా సాహిత్యం వుంది. అదే బాలసాహిత్యం. క్రీ.శ.1800 సంవత్సరానికి పూర్వం బాల సాహిత్యమనేది లేదనుకోవచ్చు. ఉన్నా అది లిఖితం కానిది. జానపదసాహిత్యంలో అంతర్భాగమై వుంది. 1819లో పిల్లల కోసం విక్రమార్కుని కథలు పుస్తకం అచ్చయ్యింది. ఆనాటి నుంచి బాలసాహిత్యం అంతర్లీనంగా వచ్చింది.

బాలల సాహిత్యానికి ఒక ప్రత్యేక స్థానం వుంది. ఇది ఒక పూలతోట వంటిది. దానికి తోటమాలి కావాలి. బాలలు విత్తుల్లాంటి వాళ్లూ, మొక్కలాంటి వాళ్లు మొలవడం పెరగడం వాటి ధర్మం. అయితే వాటికి అవకాశాన్ని రక్షణను పోషణను కల్గించడం పెద్దల కర్తవ్యం. బాలల వ్యక్తిత్వ వికాసాల పరిరక్షణ భారం ఎప్పుడూ పెద్దలదే. ఇది సామాజిక నైతిక ధర్మం. దీన్ని గుర్తించిన సాహితీవేత్తలు బాలల సాహిత్యాన్ని సృష్టించి సంస్కృతిని కాపాడతారు. వారు సంస్కర్తల లాంటివారు వారు తల్లిలాగా, తండ్రిలాగా గురువు లాగా, మిత్రునిలాగా బాలల కోసం సాహిత్యం సృష్టిస్తుంటారు. దీని పరిధి విస్తారమయ్యింది. బాధ్యతాయుతమైంది. శ్లాఘనీయమైంది.

20వ శతాబ్ది ప్రారంభంలో అధునిక తెలుగుసాహిత్యంలో వివిధ ప్రక్రియలు ఆంగ్లభాషా సాహిత్య ప్రభావ కారణంగా పరిణమించినట్లే బాలసాహిత్య ప్రక్రియ కూడా ఆంగ్లసాహిత్య ప్రభావం వల్ల వచ్చింది. పిల్లలు చదివి అర్థం చేసుకో గల సాహిత్యం ఈ వికాస దశలోనే వెలువడింది. బాల సాహిత్యరచయితల్లో ప్రథముడిగా, ప్రముఖుడి గా దర్శనమిస్తారు శ్రీ గిడుగు వెంకట సీతాపతి. ఈయన 1885వ సంవత్సరం జనవరి28 వ తేదీన విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తెలుగు వ్యావహారిక భాషోద్యమసారధి అయిన గిడుగు వెంకటరామ మూర్తి దంపతులకు జన్మించారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం పర్లాకిమిడిలో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమంలోను, సవర భాషోద్దరణ లోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు. రైతుబిడ్డ, స్వర్గసీమ, పల్నాటి యుద్ధం, భక్తిమాల వంటి కొన్ని చలనచిత్రా ల్లోను మరియు కొన్ని నాటకాల్లోను నటించారు. మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వానికి అనేక వ్యాసాలు రాశారు. తెలుగులో భాషాసమితి ఏర్పడినప్పుడు తెలుగు విజ్ఞాన సర్వస్వానికి ప్రధాన సంపాదకుడిగా నియమితుల య్యారు. చరిత్ర- రాజనీతిశాస్త్రసంపుట సంపాదక వర్గంలో ప్రముఖ పాత్ర పోషించారు. సూర్యరా యాంధ్ర నిఘంటువు చివరిదశలో వీరు సంపాదకత్వం వహించారు. ఈయన రాసిన తెలుగు వాక్యాల్లో ముఖ్యమైనవి భారతీశతకం, సరస్వతీ విలాసం, కొద్దిమొర్ర కువలయావళీ నాటిక మొదలై నవి. వీరు బైబిల్‌ మూడు సువార్తల్ని సవరభాషలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభ్యర్థనపై తెలుగు సాహిత్య చరిత్రను ఇంగ్లీషులోకి అనువదించారు. '' తెలుగులో చంధోరీతులు' అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. ఈయనను ఆంధ్రవిశ్వకళా పరిషత్‌ కళా ప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. వీరి ఇంగ్లీషురచనల్లోని విశిష్టతను గుర్తించి వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ అకాడమీ వీరికి డి.లిట్‌ ప్రదానం చేసింది.

సీతాపతి రాసిన రచనలన్నీ ఒక ఎత్తు అయితే, బాలల కోసం సృష్టించిన సాహిత్యం మరొక ఎత్తు. ఈయన చిలకమ్మ పెళ్లి, ఎలుకా-పిల్లి, రైలుబండి, ఈగా-సాలీడు మొదలైన రచనలు 1907-1909 మధ్యకాలంలో 'వివేకవతి' పత్రికలో ప్రచురిత మయ్యాయి. ఆనాడు బాలగేయాలకు అసలు ఆదరణే వుండేది కాదు. ఆ కారణంచే ఆయన చాలా కాలం వరకు మళ్ళీ గేయాలు రాయలేదు.

సీతాపతి 1909 సంవత్సరంలో రాసిన చిలకమ్మ పెండ్లి గేయకథలో బొమ్మల పెళ్లిళ్లను గూర్చి -

చిలకమ్మా పెండ్లి అని చెలికత్తెలందరూ

చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు.

పందిట పిచ్చుకలు సందడి చేయగా

కాకుల మూకలు బాకాలూదగ

కప్పలు బెకబెక డప్పులు కొట్టగ

కొక్కొరోకోయని కోడికూయగా

ఝుమ్మని తుమ్మెద తంబుర మీటగ

కుహుకుహుయని కోయిల పాడగా

పిల్ల తెమ్మరలు వేణువూదగా

నెమలిసొగసుగా నాట్యం చేయగా

సాలీడిచ్చిన చావుకట్టుకుని

పెండ్లి కుమారుడు బింకము చూపగ

మల్లీమాలితీ మాధవీలతలు

పెండ్లి కుమారుని పెండ్లి కూతురిని

దీవిస్తూ తమ పూవులు రాల్చగా

మైనా గోరింక మంత్రము చదివెను

చిలకమ్మ మగడంత చిరునవ్వు నవ్వుతూ

చిలకమ్మ మెడకట్టె చింతాకుల పుస్తె

అంటూ

ఈ గేయం ప్రకృతి సౌందర్యంలో పెళ్ళి ముచ్చట్లను మేళవించి పిల్లలకు వేడుక కలిగించింది.

సీతాపతి బాలలకు నీతులు మనసుకు హత్తుకునే విధంగా ఎలా చెప్పాలో వివరిసూ.....

'' పిల్లల చెవులకు ఇంపగు పలుకులు

పిల్లల మదిలో నిలిచే నీతులు

పిల్లల కోసము పిట్ట కథలుగా

పెద్దలు చెప్పండీ సుద్దులు పలకండీ''

అన్నారు.

రాతలు కాకుండా పిల్లలు మెచ్చేవి చిరకాలం మనసులో నిలిచే కథలు, కబుర్లు తేలిక భాషలో చెప్పాలంటారు సీతాపతి. ఆ తర్వాత 1940 సంవత్సరంలో సీతాపతి ''భారతి' సాహిత్య మాస పత్రికకు సంపాదకులైనప్పుడు బాలలకోసం సుహిత మైన రచనలు చేయమని కవులకు, రచయితలకు ప్రబోధించారు. ఈ విన్నపానికి చాలా కాలం ముందే బాలసాహిత్య వికాసం పట్ల విజ్ఞాన దృష్టి కలిగిన సీతాపతి గారి మనవి యిది.

బాల చిత్తములు చిగుర్చునట్లుగ

పాటలు పాడండో కవులార!

పిల్లల ఊహాలు ప్రబలేరీతిని

పిల్లల కనువగు నీతులు చూపే

అచ్చరవును కల్గిస్తూ అందరూ

మెచ్చెకథలను చెప్పండయ్యా!

అని అన్నారు.

సీతాపతి తృష్ణ నెరవేరింది. నూతనోత్సాహంతో కవులు, రచయితలూ బాలల కోసం కలం పట్టారు. వారు రాసిన గేయాల్ని గేయకథల్ని చిన్న కథల్ని 1955 సంవత్సరంలో 'బాలానందం' అనే అనే శీర్షికతో పుస్తకరూపంలో ముద్రించారు. 1958 సం||లో బాలవినోదం అనే గేయసంపుటా న్ని ప్రచురించారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన బాలసాహిత్య రచనాలయాల్ని నిర్వహించి యువ రచయితలకు శిక్షణ కూడా యిచ్చారు. ఎందరో, కవులకు రచయితలకు మార్గ దర్శకులయ్యారు.. అందుకే ఆయనని 'ఆధునిక బాల గేయ సాహిత్య ఆధ్యులు అని అంటారు.

ఖీ మోకా ప్రతాప్‌
http://www.visalaandhra.com/literature/article-33661

||జానపద గీతం||**

కపిల రాంకుమార్ ||జానపద గీతం||**

పువులాంటి పిల్లా నీవు - పాలిపోతివి సూసావా
రత్తహీనత జబ్బుతొ నీవు వాదిపోతివి మల్లమ్మా!

యెల్లిపాయ అల్లంముక్క నీసుకోసం తిప్పలేమి!
ఆకు కూర పప్పున వేయి అంతకుమించి బలమేలేదు!

ఒక్కరి కట్టం నలుగురి కూదు - రెక్కలు తెగినా లాబంలేదు
కుందంబొమ్మలాటి నీవు పూచికపుల్లగ మారినావు!
మందిమాటలు సెవినబెట్టి మందుమాకులు వదిలిపెట్టి
యింట్లో యీగలు మురికి కాలువ రోగం రొస్టు తెచ్చిపెట్టె!

చుట్టుపక్కల బాగుసేయి - మురుగు నీటికి తొవ్వదీయి
చల్లగాలి యీసేటందుకు - సెట్టు సేమ పెంచాలమ్మా
సేతులు కాల్లు సబ్బరగుంచు - గోల్లన మట్టి తీసేయి
అంతకు మిచి మందులు లేవు - కుంగదీయు జబ్బులురావు!

కొడిగట్టె దీప కాకు జతకట్టి రోగం తేకు
వడకట్టిన నీరే తాగు వల్లమాలిన సోకుకుబోకు!
గుడిసె గుడెస్కు దూరం లేక
గూడెం లోన గుబులాయె!
గుండె గుండెకు చేరువలేక
గుండెల్లోన దిగుల్లాయె!

సెట్టు సెట్టుకు దూరముంటే
కాపు సక్కగ కాస్తాదంట!
బిడ్డ బిడ్డకు యెడముంటె
ఆలన పాలన అందేనంట!

యిప్పటికైన పరవాలేదు
తప్పులు నీవు దిద్దుకుంటె!
వంటికి జిలుగు యింటుకి వెలుగు
కంటిపాపలై పిల్లలు యెదుగు!

**
2.3.2013
(** రచనా కాలం 6/97 ఐ.సి.డి.యస్.వారికోసం రాసినది)

1, మార్చి 2013, శుక్రవారం

||జానపద గీతం||

కపిల రాంకుమార్||జానపద గీతం||

అన్న : యేవమ్మో కావమ్మొ - కొడుకు లగ్గమెపుడమ్మో
నా మాట వినవమ్మో నా ముద్దుల సెల్లెమ్మా
ముదురుబెండకాయైతే కత్తిపీట ఒల్లదమ్మో
నా మాట యినకుంటే నీకు నాకు చెల్లమ్మో!

చెల్లి: యేందన్నా యెల్లన్నా యెల్లబెట్టినావేందన్నా
మెలికలేమి లేకుంట మూలమేదొ సెప్పన్నో
సల్లకొచ్చి ముంతదాచకెల్లన్న కతయేందన్న!
కల్లుపిడతందుకోని సల్లబడర మాయన్నా!

అన్న : బావేడే? సెప్పనీకి అరుగుమీద లేడాయె
పొద్దుగల్నే యేడకెల్లె - పొద్దెక్కి పోతుండె
పుంతలోన ఊసబియ్యం పరువుకొచ్చె జొన్న
మంచె మీది మల్లిగాడు కన్నెలెంక సూస్తండు!

చెల్లి: సంతలోన జీవాలను తోలకెల్లి రాలేదు
బేరమింక కుదిరిందా బీరువాలు నిండేను
అంతమాట అనకన్న యెంత సెడ్డ అల్లుడాయె
చింతతోపు మిర్చి కాత యెంతలోకిగాదె నిండు!

అన్న: కిందటేడు పంటలోనె సెందిరేమొ పెద్దదాయె
సందులోని జామమొక్క పిందెలేమొ పంటకొచ్చె

చెల్లి : రెండెకరాల చెలకలోన శనక్కాయ కైలు చేయి
పిల్లతోటి అంపవోయి -సల్లగాను సూసుకుంట!

అన్న: కోరికల గుర్రలు కల్లేలు లేకుంటే
కోరినంత కట్నాలు యీఓయలేను సెల్లెమ్మా!

చెల్లి: పైస లీయకుంటేను పుస్తె లెట్టకట్టనిస్త ?
అన్న బిడ్డ యెక్కువేంది కాలుబెట్టనీయనన్నా!

అన్న:పెద్దన్నను ననుయినకుంటె నీ మక్కెలిరగ తన్నేను
బక్కపానమాగిపోతే బావ బతుకు బుగ్గికాద!

చెల్లి: బెదిరేదిలేదని తెలియదా నీకు
నీలాగె పరుసాన నీతోడ పుట్టాను!

అన్న: రా చిలుక గోరింక రంజైన జోడంట
కట్నాలు లెఖుంటె నీకల్ల నీల్లంట!

రోజులేమొ మారిపోయె
జాజి పొదల చూడువారి
మల్లిగాడు సెందిరమ్మ
చెట్టపట్టలాడుతుండ్రు!

చెల్లి అట్లయితే నేనేమి చేతు - కులపోళ్ళ యిందు పిలిచి
పల్లకీల పిల్లనంపు - మల్లిగాడి మనువు చేస్త!

అన్న: తాలిబొట్టు తోరనాలు - ఊరువాడ సంబరాలు
కట్నమూసులేని పెల్లి - పట్నమోల్ల కల్లు కుట్ట!

@@@@

(అముద్రిత జనపద్యం నుండి)
1.3.2013 ఉ.5.30

28, ఫిబ్రవరి 2013, గురువారం

||వెయ్ దరువెయ్ ||

కపిల రాంకుమార్ ||వెయ్ దరువెయ్ ||

ధనాధన చప్పుడుతో
దండోరా యెయరన్నా
ఓ నా కొమరన్నా
వంత పాడు గేడి ఈరన్నా!

గుండెలోన బండరాళ్ళు - దొరలించె భూసాములకు
రాతి గుండె లదరగా దండోర వెయరన్నా!

మెలితిప్పే మీసాకు కాలమిఖ్మ చెల్లదని
తప్పుడు నాయాళకు తిప్పలింక తప్పవని
యెర్రి జనం గొర్రె జనం తలవుఫి వస్తరనే
బొర్రపెంచు ఆసాముల బుర్రలలదిరిపోయేలా

ధనాధన చప్పుడుతో! దండోరా యెయరన్నా

కులం లేదు భూమికి మతంలేదు గాలికి
పేరు లేదు నీటికి, ఊరులేదు అగ్గికి
పుట్టినోడు గిట్టు వరకు యెన్ని మెట్లు యెక్కినా
సమవాదం అందించే వల్లకాడు పిలుపేనని!

ఓ నా కొమరన్నా! వంత పాడు గేడి ఈరన్నా!

ఆసాముల మోసాలు యిక మీదa కుదరవని
అచ్చరాల బాట పుచ్చయెన్నెలిచ్చిందని
వెలుగులోన కలివిడిగా తిరుగుబాట పట్టేరని
బక్కవాడు యికమీదట ఒక్క తాటి నడిచేరని
దప్పుమోత అదరగొట్టు! మదపు వత్తు వదల్గొట్టు!

ధనాధన చప్పుడుతో దండోరా యెయరన్నా!

....** (యెంతో ఆశ...నెరవేరేదెపుడో!)

28.2.2013.......ఉదయం 5.00

27, ఫిబ్రవరి 2013, బుధవారం

|కవి/కవిత్వము : సూక్తులు, హితోక్తులు ||

కపిల రాంకుమార్ ||కవి/కవిత్వము : సూక్తులు, హితోక్తులు ||

1. కవి శ్రమను కవి మాత్రమే చక్కగా తెలుసుకొగలడు ---- నలచంపువు

2. ఓ బ్రహ్మ దేవా! రసికతలేని వా్ఖ్ఖలి కవిత్వం వినిపించే దుస్థితిని మా నుదిటిపై రాయకు! రాయకు! ...........ఆపస్తంభ గృహ్య సూత్రాలు

3.పాండిత్యమున్న కవులే నిజ్మైన కవులు, తక్కిన వారు ఒట్టి కవులు - .........మహాభారతం

4. కవిత్వపు అసలు గుణం నూతన కల్పన, ఆ కల్పన అనూహ్య ఫలితాన్నిస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది, ఆనందాన్నిస్తుంది. -------శామ్యూల్ జాంసన్.

5. సన్నిహితంగా ఉన్న కవి యెంతటి గొప్పవాడైనా అతడిప లోకం ఆదరణ చూపదు .........కావ్య మీమాంస

6.కవి ఓ కోకిల, చీకటిలో పాడుతూ తియ్యని శబ్దాలతో మానవునికి మానసిక ఉల్లాసం కలిగిస్తాడు .........పి.బి.షెల్లీ

7. ప్రేమలో మునిగిన వాడే కవి ....... ప్లేటో

8. ప్రసిద్ధుడైన తాత్వికుడు కానివాడు ఇంతవరకు యెవ్వరూ గొప్ప కవి కాలేదు....... కాలెరిడ్జ్ .

9. దుర్నీతి చివరిగా అంటుకునేది కవికి మాత్రమే ------- ఇటాలియను సామెత

10. పరిణితి చెందిన కవి - అనుకరిస్తాడు. పరిణతి చెందని కవి - చౌర్యంచేస్తాడు. ............టి.ఎస్.ఇలియట్

27-02-2013 ఉ.11.02..>>>>>...మిగతావి రేపు. <<<<<

26, ఫిబ్రవరి 2013, మంగళవారం

|| మినీలు -2 ||

కపిల రాంకుమార్ || మినీలు -2 ||

పౌరుషం అనేది
రక్తంలోనే వుంటుంది కాని
పప్పుభోజనం గాడనో, ఉప్పు కారం తినడనో
అనుకుంటే యెలా?
హింసను ప్రేరేపిస్తే
రుధిరయాగమౌతుంది
మా రాతలు సంస్కరణలై
మమతల పూదోటౌటలౌతాయ్!

**

మీసాలకి రంగేస్తే మాత్రం
వంటికి లేని హుందా వస్తుందా?
మీ '' సాలు '' వారసత్వమే కదా
అది మోసాలు చేయకుంటుందా!
తాడిని తన్నేవాడుంటే
వాని తలదన్నే వాడుంతాడని
తెలిసి మసలండి !
లేదా మా క్రోధాగ్నిలో మాడి మసవుతారు!
మమ్మల్ని ఉసికొల్పకండి!
ఉశిళ్ళై మాడి చస్తారు.!
నీ చేతిలో నిప్పు
కొంపలు తగలెట్టడానికే కాదు
కుంభం మెక్కడానికీ ఉపయోగమే
పిచ్చోడి చేతిలోని రాయిలా
అది నిన్నే తన్ని తగలేస్తుంది !
నిప్పుతో తల గోక్కుంటే
యెప్పటికైనా అదేనీ
చివరి స్నేహితురాలు!

**

తిరగబడటానికి దమ్ములేక కాదురా
హింస మా మార్గం కాదు కనుక!
అలా అని చేత ' కాని '' లేనివాళ్ళమైనా
'' చేతకాని వాళ్ళం '' కాదు!
చావుని నవ్వుతూ కూడ
కౌగలించుకోగలవాళ్ళం!
నీలా పారిపోయేవాళం కాదురా!
మా మంచితనాన్ని
అలసత్వం అనుకుంటే పొరపడ్డట్టే!
సామ దాన బేధ దండోపాయాలు
మాకు తెలుసు!
ఊరికే పేట్రేగకు - మరీ పేట్రేగితే
ఆవగింజంత పేడు కూడ నీ పుర్రెలో మిగలదు!
మా ధాటికి - ఖబడ్దార్ !
____________
26.2.2013 సా.4.00

24, ఫిబ్రవరి 2013, ఆదివారం

|| భావ మంజరి|| ***

కపిల రాంకమమార్|| భావ మంజరి|| ***

వీణ తీగలు తాకగా - వాణి పలుకును తీయగా
బాణి కూర్చిన పాట -నా రాణి పాడును హాయిగా!

ఇందులోచన బేలవై - కుందుచుంటివి యేలకో
మందహాసిని జేయగా -ముద్దులిడుదును తీయగా!

చాల కాలము వేచినా యేల రావది యేలకో
కాలమన్నది యాగునే జాలి జూపపగ రాగదే!

మంజుభాషిణ్ రాగదే సంజ వేళ యెడందలో
మంజుమాన్విత రాగ -సౌ మంజరీ మధుపమ్ముతో!

మల్లెపూల సుdధమున్ అల్లి తెమ్మర తోడుగా
జల్లినావ సఖీ యెదన్ -మెల్లగా నను జేరగన్.!

ప్రేమతో నిను జేర నా -భామ నీ హృదయమ్ములో
ప్రేమగా నివసింతునో -లేమ నన్ను తరింపవే!్

రాగ జీవన యాత్రలో - భోగ జీవిత భాగమున్
వేగ బొందగ రాగదే నా దరిన్ చెలీ శీఘ్రమున్!

వచ్చినావ సఖీ ప్రియా, తెచ్చితే యనురాగమున్,
మెచ్చి యిచ్చిన రాగమే పుచ్చుకొందు మనోజ్ఞతన్.

పాలుకారెడు బుగ్గతో క్రాలుగంటి సఖీ
కాలయాపనమేలకో పాలుపంచుకొనంగరా!

ఏరి కోరితి నిన్ను నా -తారవీవు సఖీ ప్రియా
దారగా నినుజేయు నీ- తారి నీ సఖుడే సుమీ!

నీవు నా ప్రియురాలవే - భావి జీవిత నావ - పో
బోవుచున్నది దూర తీ రావలోకన చేయగా!

చాటులేకను రమ్ము-యే లోటు చేయక జూచెదన్!
మాటదప్పననివాడ - మో మాట్మేల - సరస్వతీ!

సాహితీ మధురామృతిన్, స్వాహ జేయగ వచ్చితిన్!
ఊహకందని భావమున్- ఓహటిల్ల వచింపగాన్!

తామమాంగిని జూడ నా-లో మదీయ మనోజ్ఞతా
రామమందు సుసాహితీ -ధూమ రేఖలు పొంగెనో!

పూవులోని మరందమున్- ద్రావి తుమ్మెద జుమ్మనెన్!
నావికా విభువోలే యీ - త్రోవజూపె కవీతకున్!

24.2.2013 ఉ. 5.21
(వాస్తవ రచన కాలం 1968 ఉగాది)***

23, ఫిబ్రవరి 2013, శనివారం

|| వీల్ చైర్ టు - గోని సంచి ||

కపిల రాంకుమార్ || వీల్ చైర్ టు - గోని సంచి ||

ఇప్పుడే అందిన వార్త
మొబైల్ లో
మా ఫ్రెండ్ బాంబు దాడికి
ఆపరేషను జరిగి గురై వీల్ చైర్లో
అర్జంటు కబురొస్తే
పోస్ట్ మార్టం గదికి,
చని చూస్తే
గోనిసంచిలో తన సగ భాగం
గుర్తు పట్టలేని మాంసం ముద్ద
ముద్దుగా అరగంట క్రితం
కొన్న గోల్డ్ వాచీ
గుర్తు పట్టీందట నేనూ ఆంటూ!

23.2.2013 సా 4.30

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

|| కలానికే రక్తపు పోటు||

కపిల రాంకుమార్ || కలానికే రక్తపు పోటు||

దారుణ మారణ కాండ
భాగ్యనగర నడిబొడ్డున
విధ్వంసం
అందరూ ఖండించే వాళ్ళే
ఇంకొక పక్క
ఓకరి మీద ఓకరు
దుమ్మెత్తిపోసే వాళ్ళే
దొంగలే .. దొంగాదొంగా అన్నచందాలు!
ప్రపంచ పకృతిలో మార్పులు సైతం
కనిపేట్టి హెచ్చరికలు చేసే
డేగ కళ్ళకు
దుర్మార్గుల అంతరంగాల
కుతంత్రాల పసిగట్టే
రోజెపుడో! నేర్పెపుడో!

కళింగ యుద్ధ భీభత్సానికి
అశోకునికి వైరాగ్యమొచ్చి
భౌద్ధం స్వీకరించాడు అది అతని
సంస్కారం!

ఉగ్ర వాదులకు మాత్రం పరివర్తన
రాదు...రాదు.

నిఘాలోపం స్పష్టంగా కనబడుతోంది
మృతుల,క్షత గాత్రుల లెక్కింపులో్
పత్రికకు పత్రికకూ
మీడియ మీడియాకు
పొసగని గణాంకాలు
సర్కారు గణితాలు మరొకతీరు

పుకార్లకి సికారు చేసే అలవాటెక్కువ
ప్రజలు జాగ్రత వహించపోతే
సంయమనం పాటించకపోతే
పునరావృత మయ్యే ప్రమాదాలు లేక పోలేదు

సమయానికి రాని రక్షక భటులు
అత్యవసర వైద్య సేవల నిర్లక్ష్యాలు
శవాలనమ్ముకునే వారికి
సవాలు చేసే వారెవరూ లేక
పెచ్చుమీరుతున్న స్వార్థ పరత్వం

రాజకీయ పబ్బం గడుపునే
ఆరంగేట్రం మరో యెత్తుగడలకు
సన్నద్ధం కాకముందే
మరెంత మనసులుం మానవత్వం
మసి కానుందో...భూతద్దాలతో వెతుకుదాం
దొరికితే ఉతికి ఆరేద్దాం!

మానవత్వం తో రక్త దానం చేసే వారు
అనాథలైన పిల్లలను ఆదుకునేవారు
పోషించే దిక్కు కోల్పోయినావరికి చేయూతనిచ్చేవారు
చెదిరిన మదిని ఒదార్చేవారు
తమ పరిథిలో ఆపన్న హస్తాలివ్వటమే!
.....
యేదో ఇంకా రాయాలనివున్నా
అక్షరాలు విలపిస్తుంటె
పదాలు ముందుకు కదలలేనంటుంటే
ఈ నాలుగు మాటలు రాయటానికి
కూడ మొరాయిస్తున్న చేతి వేళ్ళను
సముదాయించలేని
నిస్సహాయతతో.........నా కలానికి రక్తపు పోటొచ్చింది!
కాస్త మౌనం మనసుకు స్వాంతనం కావాలి

22.2.2013 ఉ. 5.45

21, ఫిబ్రవరి 2013, గురువారం

|| జ్ఞాపకాల యాది -5||

కపిల రాంకుమార్ || జ్ఞాపకాల యాది -5||
యెవరునమ్మినా, నమ్మక పోయినా
గత స్మృతుల యవనికలో దాగున్న
చిన్న రహస్యం, నా అక్షరాల
దూకుడుకు నేపథ్యం
యెన్నో మలుపులు తిరిగింది!
పదో తరగతి అర్థంతరంగా మానేసి
ప్రైవేటు చదువుల ప్రస్థానం
మెట్రిక్ నుండి స్నాతకోత్తర విద్య వరకు
కాలేజి తెలియదు, రాగింగ్ తెలియదు,
మార్క్స్ ని చదవాల్సి రావడం వల్ల
ప్రైవేటుగా వెలగపెడ్తున్న
ఎం.ఏ (తెలుగు) చదువు
కుంటుపడింది
ప్రీవియస్ సీరియస్ గా చదవలేదు
మార్కులు తక్కువే వచ్చాయి!
చందోవ్యాకరణాలు సందు
యివ్వని కారణంగా వెనకబడినా
ఫైనల్ పరీక్ష నా వెనుక బడింది
చాల యిష్టంగా నాటకాలాడటం చేతనో,
చిన్నప్పుడు తాతయ్యగారి వద్ద
తెల్గు శతక పద్యాలు వల్లెవేయటం వల్లనో,
పల్లెటుర్లో రాత్రుళ్ళు
మాయింటివద్ద
గ్రామీణులు చిరుతల రామాయణం
ఆడటంవల్లనో,
ఐచ్చిక ఆంశాలైన
నాటకాలు, శతకాలు, జానపదగేయాల
పత్రాలలో తొంభై సగటు మార్కులు వచ్చీ
ప్రీవియస్ కు తోడు యివ్వక పోగా
తదుపరి కొనసాగింపు కై యేమాత్రం
నన్ను ఆదుకోలేకపోయాయి!
అనే కోపం యిప్పటికీ తగ్గలేదు!
ఐనా తెలుగులో పట్టు నాకు వుంది అని
అనుకుంటే కేవలం చిన్నప్పటి
తాతగారి ఉద్బోధలే కారణం పునాది!
చందస్సు వంటపట్టకపోయినా
ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠపు సహచరుల్లో
కొంపెల్ల రామకృష్ణ వాడే
మాత్రా చందస్సు ఆకర్షించింది!
రేగడిమిల్లి సత్యమూర్తి వచ కవిత్వ ధోరణి
మరో ప్రేరణనిచ్చింది!
వచనంలోనూ మాత్రల పోకడలు
అందుకే కనబడతాయి
కేవలం సరదాగా చదివిన
చాత్ర స్నాతక విద్య
కూడ దూరవిద్యే అయింది,
అందుకు మాత్రం కాంటాక్ట్ క్లాసులు విజయవాడలొ
సెవెంత్ ఎడ్వెంచర్ స్కూల్ వేదికయ్యింది!
85 శాతం యువకుల మధ్య ఆ 15 శాతం పెద్దవాళ్ళ లో నేను.
***
ఇంతకీ యీ సోదెందుకంటే
గత నెలలో (జనవరి31 న)
నా చిన్నప్పటి అక్షరాభ్యాసపు చాయాచిత్రం
(నలుపు-తెలుపు) కంటపడింది,
కాని శిధిలావస్థలో యెవరెవరున్నరో గుర్త్రుపట్టలేనంతగా!
అది మదరాసులో 1957 లో తీసినది,
నాకు తెలిసిన వారి చిరునామా
అందిపుచ్చుకుని ఫోనుచేసి
మరీ వివరం రాబట్టాను
చిక్కుముడి వీడింది
ఇద్దరు ఉద్దండులు నా చేత పలకను
అక్షీకరింపచేస్సారట!
ఒకరు రెండు శ్రీల కళ్ళజోడు *
మరొకరు ఇది మల్లెలవేళయని ముందే కూసిన కోయిల **
పట్టరాని ఆనందం
లోకం బాధ
తన బాధ చేసుకొన్న దొకరు
తన బాధను
లోకానికే బాధను చేసిన మరియొకరు!
అందుకే నవ్య నవనీత సమానమైన
పదాల కూర్పుతో పాటు
దారుణాఖండల శస్త్రతుల్యమైన
తీక్షణ విప్లవ భావాలు
సమాంతర కవిత్వాని ప్రేరణై
నన్నిలా నిలబెట్టాయి
తలచుకుంటేనే చెప్పలేని
అనుభూతి నా కంట చెమ్మగా
....కేవలమిప్పుడు ఒక
జ్ఞాపకాల యాదిగా మిగిలింది!

21.2.2013 రాత్రి 7.40
________________
* శ్రీశ్రీ
** దేవులపల్లి
( మా నాన్నగారికి గరికిపాటి రాజారావు, గూడవల్లి రామబ్రహ్మం స్నేహితులు
పుట్టిల్లు సినిమా తీసేటప్పుడు వారితో పనిచే్సారు. మద్రాసులో వుండగా మా యింటికి వింజమూరి లక్ష్మి, సీత, దేవులపల్లి వారితో వస్తూండే వారు. మా మేనత్త సుభద్ర బర్త గారైన వేమరాజు భానుమూర్తి ( అప్పట్లో ఆంధ్ర ప్రభలో చేస్తూవుండేవారు....మామయ్య తరువాత ఢిల్లీ సమాచార పౌర సంబాధాల శాఖ్కు వెళ్ళారు ,పంజాబి బాషనుంది తెలుగు అనువాదాలు చే్సారు.కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద రచనలకు బహుమతి పొందిన వారిలో ఒకరు) పక్కపక్కనే వూండేవారం కాబట్టి వస్తూవూండే వారు. అదీ ఫ్లాష్ బాక్ )

| ఎల్లోరా కవిత: చెమట బిందువు ||**


కపిల రాంకుమార్ || ఎల్లోరా కవిత: చెమట బిందువు ||**
కవితా మంజీర ధ్వని తరంగాల మీద
పయననిస్తా రేపటి ఉదయార్క్
ప్రభాసదస్సుకు!
కవిగా వినిపిస్తా వెన్నెల తామ్రపత్ర
శాసనాన్ని ప్రతి హృదయానికీ
అమృత భావనా ప్రబోధాన్ని!
చీకటి దెయ్యాలకు
రాజకీయ కయ్యాలకు
మరణ శాసనం విరచిస్తా!
వెలుగురథం మీద
తెలుగు జాతిని
యెక్కించుకుని ప్రగతి ప్రస్థానం సాగిస్తా!
విశ్వ మానవ సహృద్య సంకేతంగా
చెమట బిందువులలోంచి ఆత్మ శక్తిని రగిలించి
రక్తపు చుక్కలలోంచి
సమతా గీతం వినిపిస్తా!
21.2.2013 ఉ. 4.54
_________________________________________

20, ఫిబ్రవరి 2013, బుధవారం

| ఉగ్రవాద ఫలితాలింతేనా?

కపిల రాంకుమార్ || ఉగ్రవాద ఫలితాలింతేనా? ||

సర్వ జనుల సుఖముకోరి - వేదం ఘోషించినా
హాలికుల స్వేదంతో - నేల పునీతమైనా
సైనికుల రుధిరంతో - సరిహద్దులు సరిద్దినా

నిర్మాణం కుంటుపడె
నిర్వాకం తగులబడె
నిర్యాణం వెంట తరుమ
నిష్క్రమించు తీరమై
ప్రజాస్వామ్య వృక్షానికి
చీడపురుగు మాదిరిగ
పెద్దలను హతమార్చె
పిదప బుద్ధి హెచ్చినది!

హింసవీడి దారి మార్చి
నేటికైన కళ్ళుతెరచి
జనజీవన మార్గానికి
మనిషిలాగ మారండి!

ఎందుకంటె........

ఎదలు కరిగి గిరులు కూలె
మతులు చెదరి మందగించె !
అవీదన ఆక్రందన
యెల్లెడల వ్యాపించె !
సర్వజనుల మనసు నలిగి
దీనంగా విలపించె !

రక్తంతో స్నానమాడు - ఉగ్రవాద రాచక్రీడ
కత్తులతో రాజ్యమేల యింత కన్న దారిలేదా?
ఈ మాదిరి హత్యలతో యేలాభం పొందుతారు?
దొంగచాటు దెబ్బలతో పొందలేరు అధికారం!

పావురాల నట్యాలను ఈర్ష్యతోన త్రుంచుటేల?
పావులుగా మారిపోయి విధ్వంసం చేయనేల?
నేల విడిచి సాములా నేతల తల తెంచనేల?
తలపులు మార్చకుండ తలుపులు మూయుటేల!

నలుగురిలో కలువలేక - నలుగురిని కలుపలేక
పిరికితనపు చేష్టలతో - హతమార్చె రాచక్రీడ
గెలువబోదు యేనాడు - కలకాలం మనబోదు!

అందుకే......

స్వేచ్చగాను పావురాలు గగనంలో విహరింప
స్వచ్చమైన ప్రకృతికి నాందిపలుక కదలండి!
ఈ కత్తులు వదలండి - తుత్తునియలు కాకుండ
ఆ కక్షలు మానండి - శాంతి బాట నడవండి!

20.2.2013 మధ్యాహ్నం: 12.26

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

గజల్ స్థితిగతులపై కొత్త చూపు

గజల్ స్థితిగతులపై కొత్త చూపు
ఆయా పరిస్థితులూ, బతుకు తీరులో పాటించే విలువలలో అమరిపోయిన ఏ సంప్రదాయమైనా, కళా విషయమయినా రూపు మాసిపోవడం సాధ్యం కాని పని. ఇతరేతర శక్తుల దాడికి గురైనా పరిస్థితుల ప్రాబల్యానికి అణగారిపోయినా వెనుక తట్టు పడిపోవచ్చు. సరైనా స్థితిగతులు రాజుకుంటే తిరిగి మొగ్గ తొడగడం ఖాయం. కళారూపమేదయినా భౌతిక పరిస్థితులలో తగిన ప్రతిపాదిక, జీవితానికి సం బంధం ఉంటే దాని మునుగడ ఎల్లవేళలా ఉంటుంది. కాకపోతే రూపం మారవచ్చు. పోవడిలో మార్పులు చేర్పులు కొనసాగవచ్చు. ఇటీవల హైదరాబాదు నగరంలో పుంజుకున్న ఉర్దూ నాటకం, ముషయిరా, హిందుస్తానీ సంగీత కచేరీలు ఈ పరిణామ క్రమాన్నే సూచిస్తున్నవి. మొగలాయిల పాలనలో ఎన్ని అవాంఛనీయ పోకడలయినా పుట్టవచ్చు. ఆ రాజవంశం పాలన ఫలితం వల్లే భారతదేశానికి గాలీబు వంటి కవితో పాటు ఉర్దూ భాష, తాజ్ మహల్ సంక్రమించాయన్నది ఒక విశ్లేషణ. హైదరాబాదుకు చెందిన నిజాములైనా, ఢిల్లీ రాజులైనా మొగల్ రాజవంశానికి చెందినవాళ్లే. కనుక అది వాస్తవం కావచ్చు. ఉర్దూ సాహిత్యం గజల్ ప్రక్రియ, ముషయిరా సంప్రదాయాల పుట్టుక, వికాసం హైదరాబాదు కేంద్రంగా జరిగింది. ఢిల్లీ చేరుకుని దశదిశలా వ్యాప్తి చెందింది. ఈ వాస్తవాన్ని ఉత్తరాది ఉర్దూ సాహిత్యకారులు దాటవేస్తుంటారు. ఉంటే ప్రస్తావన మాత్రంగా ఉంటుంది. లక్నో సాహిత్య సంస్కక్షుతులపై ప్రామాణిక గ్రంథాన్ని వెలువరించిన ఉర్దూ చరివూతకారుడు శరార్ నుంచి అకాడమీ ప్రచురణ వరకు ఇదే తంతు. ఈ పుస్తకం ఆ లెక్కలోకి చేరదు. చివరి మొగలాయి ప్రభువు బహుదుర్ షా జఫర్ కాలం నాటి ముషయిరా సంప్రదాయం గురించి దాని లోతుపాతులు, నియమావళి గురించిన రచన ఇది. ఉత్తరాది వారి చరిత్ర రచనా పద్దతులను అధిగమించిన ఆ రచయిత పేరు మిర్జా ఫర్హాతుల్లా బేగ్. ఉర్దూ భాష వికాసంలో హైదరాబాదు పాత్రను పట్టిచ్చుకున్న పుస్తకమిది. ‘పేరు ది లాస్ట్ ముషయిరా ఆఫ్ ఢిల్లీ’.

మొగలాయిల పాలన ఫలితంగా ఉర్దూ భారతదేశానికి సంక్రమించిందన్నది తెలిసిందే. అటువంటి కళాత్మక భాష అయిన ఉర్దూకు, గజల్ ప్ర క్రియ, ముషయిరాల మధ్య గల అంతర్గత, అంతరంగ సంబంధాన్ని అంతే కళాత్మకంగా విశదం చేసే గ్రంథరాజమిది. ఆంగ్లంలో సైతం సొంతరచన వలె కనిపించే ఈ పుస్తకం ఉర్దూ ప్రపంచంలో ప్రామాణిక రచనగా ఉన్నత స్థానం పొందిందని అనువాదకి ఆఖ్తర్ ఖంబర్ అంటారు. రచయిత ఉర్దూ వచన శైలి తనను ఆకట్టుకోవడం వల్లె తాను తర్జుమా కు ఉపక్షికమించినట్టు ఆమె చెబుతారు. ఈ రచన చేయడంలో ప్రేరణ మౌల్వీ కరీం ఉద్దీన్, ఆయన రచన తబ్‌ఖత్- ఉల్- షోరాబు- హింద్ అనే గ్రంథం. 1845 లో ఢిల్లీ దర్బారులో జరిగిన ముషయిరా విశేషాలను ఆయన ఈ పుస్తకంలో పొందుపరిచారు. అది చదివిన బేగ్ సాబ్‌కు గజల్, ముషయిరా సంప్రదాయాలను రచన రూపేణా పదిలం చేయాలన్న ఆలోచన తట్టింది. ఇందుకు ‘ఆత్మకత’ రీతిలో రచన చేస్తూ ఉర్దూ భాషావికాసం, గజల్ పుట్టుక, మొగల్ దర్బారు గురించి పరిచయం చేశారు. ఈ క్రమంలో హైదరాబాదు పాత్ర గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇందులో పాత్రదారి రచయిత కాదు. తాను ఎవరి నుంచయితే ప్రేరణ పొందారో ఆ రచయితే పాత్రదారి. అతని పేరు కరీముద్దీన్. కథనమంతా స్వగతం వలె ఉండడంతో ఈ పుస్తకం చదివిన పాఠకులకు తాము ముషయిరాలో పాల్గొన్న అనుభూతి కలుగుతుంది. ఉర్దూ రాకపోయినా గజల్‌ను అర్థం చేసుకోగల్గిన ఆంగ్ల పాఠకులకు ఈ పుస్తకం సరికొత్త సాహితీ కళా ప్రపంచాన్ని పరిచయం కావడం ఖాయం. ఢిల్లీ పతనాన్ని ముషయిరా ముగింపును షమ్మా (దీపపు చెమ్మ) ఆరిపోవడంతో రచయిత సూచిస్తారు. ఇట్లా చెప్పడంలో రాజరికపు, దర్బారు సంప్రదాయాలకు కాలం చెల్లిందని రచయిత భావమని అనువాదకి అంటారు. నిజానికి గజల్ గానంతో వెలిగిన షమ్మా 1857లోనే కాదు, ఆతర్వాత వెలుగుతూ ఆరిపోతూనే ఉంది. ఈ పుస్తకానికి ప్రేరణ అయిన భూమిక 1845, 1848 (పోలీసు యాక్షన్),1979, 2010 వంటి సాంవత్సరిక సందర్బాలు కూడా గజల్, ముషయిరా వంటి కళా ప్రక్రియల ఉత్తాన, పతనాలను సూచిస్తాయి.

1979 నే తీసుకుందాం. దేశ విదేశాలలో ప్రసిద్ధి గాంచిన హైదరాబాదు ముషయిరా ఈ కాలంలోనే ఆగి పోయింది. స్థాపకుడు శంకర్‌జీ. ఆయనే నుమాయిష్ (ఎగ్జిబిషన్ సొసైటీ) స్థాపకుడు కూడ. నిజాం కాలంలోనే ప్రారంభించారు. ఆయన పేరుతో కూడ ఈ కవితా జాతర పేరు గాంచింది. మొత్తం భారత ఉపఖండంలో అంటే ‘పార్టీషన్’ కు ముందు అటు తర్వాత ఉర్దూ భాషా ప్రియులు ఎంతగానో మక్కువ చూపే కవుల కలయిక ఇది. ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నుంచి పేరెల్లిన ప్రగతిశీల కవి ఫైజ్ వరకు, సరోజినీ నాయుడు నుంచి కాళోజి, దాశరథి, దేవులపల్లి రామానుజరావు, దాశరథి రంగాచార్య వరకు, సి. నారాయణడ్డి, సామల సదాశివ వంటి ఈనాటి ప్రముఖులు ఆ సభపై ఆసీనులై, కవితాగానం చేసినవాళ్లో, ప్రేక్షకులుగా పాల్గొన్న వాళ్లో అయి ఉంటారు. ఈ ముషయిరాలో అత్యంత ఆకర్షణ శక్తి గల వ్యక్తి షాయర్-ఏ - ఇంక్విలాబ్ మఖ్దూం సాబ్. అటువంటి మానవీయ కళాసంవూపదాయం 1978లో మతం పేర జరిగిన మారణహోమానికి అణగారిపోయింది. పెద్దలు దేవులపల్లి రామానుజరావు, దాశరథి వంటి వారు ఈ ముషయిరా గురించి రాసి ఉన్నారు. సరిగా అదే ఏడు ‘దిల్లీకా ఆఖరి షమా’పేరుతో ఉర్దూ సాహిత్య ప్రపంచంలో పేరు గాంచిన ఈ గ్రంథం ఆంగ్ల తర్జుమా వచ్చింది. అదే హైదరాబాదు నుంచి వెలువడడం మరో వైచిత్రి. రచయిత కూడా ఇక్కడి నివాసే. 1978 వరకు నిర్విరామంగా కొన్ని దశాబ్దాలుగా నడిచిన ఈ ముషయిరా గురించి ఈయాళ్ల కూడా చెప్పుకునే వాళ్లు అనేకం ఉన్నారు. సరిగా మూడు దశకాల కిందట అచ్చయిన ఈ పుస్తకం ఎన్నెన్ని ప్రభావాలు నెరిపిందో తెలియదు. ఎటువంటి ఆలోచనలకు పాదులు వేసిందో అందాజలేదు. కానైతే 2010లో వెలువడినప్పటికీ హైదరాబాదులో స్థితిగతులు మారిపోయాయి. 1979లో ఆరిపోయిన ముషయిరా సంప్రదాయం తిరిగి గత రెండు మూడేళ్ల నుంచి ఊపిరి పోసుకుంది.

గత ఏడాది ఒక వెయ్యి మంది సమక్షంలో అదే నుమాయిష్ హాలులో జరిగింది. మొత్తానికి 1979 నుంచి 2010 వరకు స్థానికంగా ఈ పట్టణపు జన జీవితంలో ఉర్దూ సాహితీ లోకంలో అనేక విపరీతాలు వచ్చిపడ్డాయి. స్వతంత్ర భారతావనిలో 1978 రాజకీయంగా కీలకమయినదే. ఇది చాలా మంది మేధావులు గుర్తించిన అంశమే. మతం, ప్రాంతం, కులం వంటి సామాజికాంశాలు రంగు మారి రంగం మీదికి వచ్చిన గడియ కూడ అదే. అవే అనేక రూపాల వైరుధ్యాలుగా మామూలు జనం జిందగీలోకి చొరబడ్డ కాలం కూడ అదే. మామూలు రీతి, రివాజులను అతలాకుతలం చేసిన గడియ అది. మతం పేరుతో బీజేపీ, భాష పేరుతో టీడీపీ రాజకీయ రంగపు అధికార పీటం పైకి వచ్చిన పూర్వరంగం కూడా అదే. ఇక అప్పటి నుంచి నాలుగైదు ఏళ్ల మునుపు వరకు హైదరాబాదు స్థానిక సంప్రదాయాలు, విలువలన్నీ తీవ్రమయిన నిర్లక్ష్యానికి, ఉపేక్షకు గురై కోస్తా పాలక వర్గాల ఆధిపత్యపు విధానాలకు అణగారిపోయాయి. ప్రభుత్వమే రహస్య ఎజెండాతో పనిచేస్తూ.. హైదరాబాదుతో సహా తెలంగాణ భాషా సంస్కక్షుతులను మట్టుపెట్టడానికి పూనుకుంది. వాటికి కొనసాగింపే ‘హైదరాబాద్ నగరం మాదే అన్న’ వాదన. తెలంగాణ సాహితీ సమరం ముందుకు తెచ్చిన అనేక చర్చల నేపథ్యంలో ఈ పుస్తకం ‘ది లాస్ట్ ముషయిరా’ వెలువడడం ఒక మ లుపు గానే చెప్పవచ్చు. ఈ ప్రచురణల కాలంలోనే తెలంగాణ లో మరో విపరీతం జరిగింది. శతాబ్దాలుగా ఉర్దూ భాషను తమదిగా చేసుకుని ప్రేమించిన స్థానికులు మరో చాపల్యానికి గురయ్యారు. దానిని పరాయిదిగా భావించి ముస్లింలకు, వారి మతానికి చెందినదిగా భావించడం మొదలు పెట్టారు. అదేరకంగా వారు కూడ ఆ భాష తమదేనన్న దురాలోచనలోకి పడిపోయారు. ఈ తరహా పోకడల వల్ల పెద్దలు, కాళోజి, సదాశివ వంటి వారు ఎంతగానో బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే బేగ్‌సాబ్ రచనలో చానా ప్రజాస్వామిక వైఖరి కనబరిచారు. ఉర్దూ రచనా సంప్రదాయాలు, కళారీతుల వికాసానికి దక్కన్‌లో జరిగిన వృద్ధిని బాగా చెప్పుకొచ్చారు. ఇందుకు బేగ్‌సాబ్ ఢిల్లీలో పుట్టి హైదరాబాదులో ఉండవల్సిరావడం కావచ్చు. ఉర్దూ, గజల్, హిందూస్తానీ సంగీతం వికాసంలో హైదరాబాదు పాత్ర గురించి వారికి తెలిసింది కొంతే. ఉత్తరాది వారికి తెలిసిందల్లా తొలి దివాస్ (సంకలనం)ను ముద్రించిన కులీకుతుబ్‌షా మొదటి వచన గ్రంథాన్ని ప్రచురించిన వలీ దక్కనీ, ప్రగతిశీల కవి మఖ్దూం మాత్రమే. మొత్తం ఉప ఖండంలో ప్రసిద్ధి గాంచిన రెండు ఆంగ,్ల ఉర్దూ సాహిత్య చరివూతలలో ఒకటి హైదరాబాదు నుంచి వెలువడిన విషయం వారు తాపీగా విస్మరిస్తుంటారు. కానీ ఈ రచయిత ఆ తీరుకు తావు లేకుండా చేశారు.

ముఖ్యంగా హైదరాబాదు, ఢిల్లీ వంటి రాచనగరాలలో గజల్, ముషయిరా,మర్సియా లాంటి ప్రక్రియలు, వాటిని పెంచి పోషించిన దర్బారు, రీతి రివాజుల గురించి చెప్పే గ్రంథమే కావచ్చు. సాంతం చారివూతక చూపు ప్రతిఫలించిన రచన ఇది. అయితే విధించుకున్న పరిమితి 1857 వరకే కావడం వల్ల అప్పటి లోకపు స్థితిగతులకే ఇందులో పెద్దపీట దొరికింది. హైదరాబాదు, ఢిల్లీ అటు తరువాత రాంపూర్, అవద్ సంస్థానాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రచన ఇది. అనాటి ప్రతిఫలనాల సారాంశాన్ని పట్టుకోవడంలో రచయిత విజయం సాధించారు. అట్ట చివర చెప్పినట్టు ఉర్దూ భాషా, సాహిత్య పరిణామాలను సముచితరీతిలో విశ్లేషించారు. మొత్తంగా చూస్తే ఈ గ్రంథం ఉర్దూ భాష, గజల్, ముషయిరాల చరిత్ర కూడ. విస్తక్షుతమైన చదువరి కావడం వల్ల రచకుడు తనదైన స్వతంత్ర వైఖరి తీసుకోవడం వల్ల రచన సాంతం ఉర్దూ గుబాళింపులను ప్రతిఫలించింది. ఒక కవితా ప్రక్రియగా గజల్ క్రమ వికాసాలకు భూమికయిన మూడు రీతులను ప్రతిపాదించారు. ఒకటి దక్కన్, రెండవది ఢిల్లీ, మూడవది లక్నో. గజల్ ప్రక్రియ వికాసంలో దక్కన్ తండ్లాటకు ఆయన ప్రథమ స్థానం ఇచ్చారు. పైగా దాని స్వభావాన్ని నిర్ధారించి ఢిల్లీ, లక్నో రీతులకంటే ఎంతటి విశిష్టమయిందో తేల్చి చెప్పారు. దక్కన్ అంటే ప్రధానంగా హైదరాబాదు నగరంలో పుట్టిన గజల్ ఉర్దూ కవివూబహ్మా వలీదక్కనీ వల్ల ఢిల్లీకి చేరుకుని ఏ రకంగా బలోపేతమయిందో ఈ రచయిత విశదీకరించారు. సాధారణంగా ఉర్దూ సాహితీ ప్రక్రియలే కాదు మొగలాయిల పేరుతో,దక్కన్ పేరుతో చెలామణిలో ఉన్న ఏ ప్రక్రియ అయి నా పశ్చిమాసియాలో అరబీ, పార్శీ సంపర్కంతో పుట్టిందనీ ఉత్తరాది చరివూతకారులు రాయడం పరిపాటి. బేగ్ సాబ్ ఈ వైఖరిని కాదన కున్నా స్థానికతకు సరైన తావే ఇచ్చారు. నిజానికి భారతీయ వలస చరివూతలో దక్కన్‌ను, ఆదివాసీలను విస్మరించడం మామూలే. ఈ రచయిత అందుకు మినహాయింపుగా చెప్పుకోవచ్చు. కొంత ప్రజాస్వామిక వైఖరి కనబరుస్తారు. పరస్పరం పర్షియన్, అరబీ వంటి భాషా రీతుల ప్రమేయంతో గజల్ ఏమేరకు పుష్టిని పొందిందో చెబుతారు. గజల్ రచనకు అద్యు డుగా అమీర్ ఖుస్రూను చెప్పడం కూడ ఉంది. పార్శీ, ఉర్దూ, తెలుగు భాషలలో ప్రగాఢమైన పట్టుగల డా.సామల సదాశివ వంటి సాహితీవేత్తలు, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి ఔత్సాహిక గజల్ ప్రి యులు ఈ వాదనను అంగీకరించరు. ‘గజల్ మినార్లు గోల్కొం డలో లేచాయి’అని అంటారు శేషేంద్ర శర్మ. అందులో కొంత వాస్త వం కూడా ఉంది. కులీకుతుబ్ షా ఉర్దూ దివాస్ ప్రచురించే వరకు గజల్ అనే మాట ప్రచారంలో లేదు. పశ్చిమాసియాలో అరబీ, పార్శీ భాషా సాహిత్యాల ప్రభావంతో పుట్టింది రుబాయత్ అని అమీర్ ఖుస్రూ రాసింది దోహాలనీ, దక్కన్ స్థానిక కవితా, సంగీత, సంప్రదాయాల ప్రభావంతో కులీ రచన వల్ల గజల్ రూపుదిద్దుకుందనీ వాదన ఉంది.

ఈ వాదనల జోలికి పోకుండా హిందూస్తాన్ కళా సంప్రదాయాల ప్రభావం అరబీ, పర్షియన్ భాషా సాహిత్యాలపై ఉందని అదేవిధంగా వాటి ప్రభావం ఉర్దూ భాషా సాహిత్యాలపై పడిందనీ రచయిత చెబుతారు. ఈ తరహా ఆలోచనతో ఎవరైనా అంగీకరిస్తారు. ఇదొక ప్రజాస్వామిక అవగాహన. ఇప్పటికీ గజల్ దక్కన్‌లో పుట్టిన కవితా విశేషమన్న అంశాన్ని ఉత్తరాది ఉర్దూ రచయితలు ససేమిరా ఒప్పుకోరు.దక్కన్, ఉత్తరాది ఉర్దూ సాహిత్య కవితా సంప్రదాయాలపై గాఢ పరిచయమున్న బేగ్‌సాబ్ తటస్థమయిన, ప్రజాస్వామికమైన వైఖరి తీసుకోవడం విశేషం. దక్కన్‌లో ముస్లిం రాజవంశాల ప్ర భావాన్ని పరిగణలోకి తీసుకుంటే ఉర్దూ సాహిత్య చరివూతకారుల ఢిల్లీ కేంద్రిత వైఖరి కొంతైనా తగ్గి ఉండేది. బేగ్‌సాబ్ ఢిల్లీ లో జరిగిన ఒక ముషయిరా ఆధారంగా ఈ రచన చేసినప్పటికీ చరిత్రకు సంబంధించినంత వరకు వాస్తవికమయిన వైఖరి తీసుకున్నారు. ఢిల్లీ పెత్తనాన్ని పక్కన పెట్టేశారు. ముషయిరా అనేది ఉర్దూ కవితా సంప్రదాయాలకు, సంబంధించినంత వరకు కవి సమ్మేళనమో, కవి సభోకాదు. అదొక కళావిన్యాసం. ఇది కేవలం ఉర్దూ బాషా సాహిత్యాలకే పరిమితం. దీనినొక విశేషంగా కూడ భావించక్కరలేదు. ప్రతి రచనా సంప్రదాయంలో ఈ తరహా అనేక సంప్రదాయాలు కనిపిస్తాయి. ముషయిరా నిర్వహణకు సంబంధించిన నియమాలు, సంప్రదాయాలపై ఈ పుస్తకంలో వివరమయిన చర్చ ఉంది. ఉర్దూ చదవరాని పాఠకులకు ‘ద ముషయిరా’ పేరుతో ఉన్న భాగం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సారాంశంలో ఒక కళా విశేషంపై చర్చ అన్నమాట. ఒక కళ నిర్వహణా తీరుతెన్నులను కళ్లకు కట్టినట్టు చిత్రించడం ఈ రచనా విశేషం. ఈ పుస్తకం మొత్తంలో ప్రధానమయిన భాగమిదే. గజల్‌కు ముషయిరా శరీరం వంటిది. ఈ రెండింటిలో దేన్నించి దేనిని విడదీసినా మొత్తం ప్రక్రియ నిర్జీవమే. అయితే రచయిత వీటికి ఆత్మవంటిదయిన హిందూస్తానీ సంగీతాన్ని విస్మరించారు. గజల్, ముషయిరా, గాత్ర, వాయిద్య సంగీతం కలయిక వల్లే ప్రక్రియ మొత్తంగా అర్థవంతమౌతుంది. ఒకప్పుడు 1960 వరకు హైదరాబాదు నగరంలో గజల్ గానా బజనాలో రాత్రిళ్లు రాజుకునేవని స్థానిక పెద్దలు చెబుతారు.

ఆంధ్రవూపదేశ్ ఏర్పడి హైదరాబాదు నగరం సీమాంధ్ర క్యాస్టిస్టు, ప్యూడలిస్టు పోలీసు అధికారుల చేతులలోకి వెళ్లడంతో వారి దాష్టికాల వల్ల ఆ సంప్రదాయం సైతం అడుగంటి పోయింది. స్థానిక జీవన రీతిపై ఏమాత్రం ఖాతరు లేకపోవడంతో జరిగిన విపరీతం ఇది. గత నాలుగైదేళ్లుగా పరిస్థితి మారింది. ఇంతేకాదు హైదరాబాదు నగరంలో కులీకుతుబ్‌షా కాలం నాటి సంప్రదాయాలతో ముషయిరాను పునర్జీవింప చేసే ప్రయత్నమూ కొనసాగుతున్నది.1956 వరకు ఎంతో జనాదరణ పొందిన ఘరేలు, మెహిఫిల్, (ఇంటింట గజల్ సంగీత కచేరీ) భూపాళం (తెలుగు, ఉర్దూ, హిందీ గీతాలాపన, భజనావళి) సంప్రదాయం అటు తరువాత కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. గత కొంతకాలంగా పెరిగిన సాంకేతికత వల్ల, పెరిగిన సంగీత సోయి వల్ల తిరిగి మొగ్గ తొడిగింది. వారాంతాన, నెలకోసారి పాతబస్తీ ఇండ్లల్లో ఈ కచేరీలు కొనసాగుతున్నట్లు తెలిసింది.ఆంగ్లంలోనయినా ఒక కొత్త కళా సాహితీ ప్రపంచాన్ని పరిచయం చేసే ఈ పుస్తకం ఇందుకు మరింత దోహదం చేస్తుందనీ కచ్ఛితంగా చెప్పవచ్చు. పుస్తకం ఆఖరిలో రచయిత పొందుపరిచిన బిబ్లియోక్షిగఫి, నోట్సు రచయిత పడ్డ కష్టాన్ని, చిత్తశుద్ధిని, భాషా సాహిత్యాల పట్ల ప్రగాఢ అభినివేశాన్ని అందుకు తగ్గ గౌరవాన్ని తెలియచేసేవి. ఆఖరికి కొసమెరుపు ఏమిటంటే నిజాం మునిమనుమడు రెడ్ హిల్స్‌లో ఉంటారు.ఆయన ఇంట్లో ఇప్పటికీ మొగల్,ఆసఫ్ జాహీల కాలం నాటి సంప్రదాయంలోనే ముషయిరా జరుగుతుందట. అందులో మీర్ మహబూబ్ అలీఖాన్ తన దర్బారులో ముషయిరా సందర్భంగా ఉపయోగించిన షమ్మానే ఉపయోగిస్తారట!
-ఎస్. జగన్‌డ్డి

|| ముద్రాపకుని అంతరాత్మ||**

కపిల రాంకుమార్|| ముద్రాపకుని అంతరాత్మ||**

వ్యాస భారతానికి
వ్రాయసకారుడైన గణపతిలా
బాసుల అధికారపుటాజ్ఞలను,
అనునయాలను,
నయనాల చివరనుండి జాలువారే
సైగ విన్యాసాలను,
ముద్రారాక్షసం కాకుండ,
పత్ర వ్యవహారశైలిని,
కార్యాలయ ప్రాతినిథ్యం వుట్టిపడేలా,
మీటలు నొక్కి,
వేళ్ళనరాల సత్తువకొద్ది వేగాన్ని జోడించి,
జవాబుల్లో నిర్థిష్టత,
చూపులకు స్పష్టత అందించే నువ్వు,
అయ్యగారు పిలిచినప్పుడల్లా ఓ చిరునవ్వు రువ్వు!
అయ్యగారి ఆగమనానికి ముందే వచ్చి,
నిష్క్రమణ తరువాతే నీకు ఆటవిడుపు!
కండొకచో ఆదివారము లేదు!
బ్రతుకులో ఆది తాళమూలేదు!
నీ బాధలు నీవి -నీలోనే వుండనీయ్!
వాటిని కదిలించకు!
టైపు మీటలు తప్ప!
అర్హతానర్హతల్ను పక్కన పెట్టి
అధికారులనుండి అనధికారులవర్కు
తెగరాసే అక్షర స్ఖాలిత్యాలను
ముత్యాలా పొదిగి, లలితంగా, సున్నితంగా,
కాగితపు కేన్వాసుపై
అక్షర భావ చిత్రాలను అందించే నీకు
పాతికేళ్ళ పైబడిన సర్వీసుందా?
కాని నీకంటే నీ కంటి ముందున్న యీ '' టైపు రైటరు ''
యే సర్వీసుకు నోచుకోక దిఘాలుగావుంది గమనించావా?
దీనిపైఅ పనిచేసిన యెంతమంది
రాజులు, మహరాజులు, చక్రవరులయ్యారో తెలియది కాని
ఇది మాత్రం పురానా హవేలీలా,
చాదర్ ఘాట్ బ్రిడ్జీలా మైలురాయిలా మిగిలివుంది!
తన వయస్సును కూడ లెక్కచేయకుండానే, పనిచేస్తూ
అప్పుడప్పూడు మొరాయిస్తూనే
నీ చేతి స్పర్శతో అచ్చక్షరాల విన్యాసం చేస్తూ
ముక్కుపై జారిన కళ్ళజోడునూ
ముగ్గుబుట్టైన నీ బట్టతలనూ
యెప్పటికీ రాని ప్రమోషను ద్రాక్షను వెక్కిరిస్తూ
అసహనం కంపించకుండానే,
ప్రహసనం నడిపిస్తూ
ఎన్.జి.వో గానే బతుకీడుస్తూ,
ఎన్ని జీ.వోలు వచ్చినా
నిర్జీవంగా (దాదాపు) యిప్పుడూ, యెప్పుడూ
సమాంతర గమన శ్రామికుడవై
(Horizontal Mobility of Labour)
అర్థశాస్త్రంలో నిర్వచింపబడ్డావు!
ఆఫీసుకు ముఖ్యమైన మరమనిషివి
పులిహోరలో కరివేపాకయినావు!
సాధించుకున్న రాయితీలు కుదించే రీతిలో
ప్రబుత్వం తీసేస్తున్నా,
కరిగిపోయే సత్తువని పూడ్చే విత్తంలేదు!
సంసారపు బడ్జెట్టుకు ఓవర్ డ్రాఫ్టూ లేదు!
పనిముట్టు పాతబడితే
నాగేటి కోండ్ర సైతం వంకరపోతుంది!
అక్షరాలు తారుమారైతే అర్థమే మారిపోతుంది
అర్థమూ క్షీణిస్తుంది (ఇంక్రిమెంట్ కట్ రూపంలో)
అందుకే యేలినవారికి విన్నపాలు చేసుకో
జారిపోయిన ముత్యాలు యేరుకో!
వాడిన వదనంపై దరహాసం నింపుకో!
భవితపై నమ్మకంతో వర్తమానాన్నివీడకు!
భూతకాలపు తీపి చేదు అనుభవాలు మరువకు!

19.2.2013 ఉదయం 5.23
*****************************
( నా ఉద్యోగ పప్రస్థానంలో దాదాపు 28 యేండ్లు టైపిస్ట్ గా పనిచేసి
చివరి రోజుల్లో సూపెరింటెండెంటు కేదరులీ పద్వీ విరమణ చేసాను. ఇది
మా టపిస్ట్స్ అండ్ స్టెనోగ్రాఫర్స్ అసోసియేషను రాట్ష్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా
యెన్నికైన సందర్భంగా సభలో చదివినది ( 1998 మే 10 )

18, ఫిబ్రవరి 2013, సోమవారం

కపిల రాంకుమార్|| జానపద గీతం||
|| కట్టాలనెదిరించి సక్కంగ వుందాము ||

ఆమె: సింత సెట్టెక్కేవు - సిగురాకు కోసేవు
సెప్పకుండ నీవు తిరునాలకెల్లేవు
అచ్చట తీర్సంగ ముచ్చట సెప్పంగ
యేడసూసినాకాని కానరాకున్నవు!
యిట్ట చేస్తివంటె రెంకో రెంకా
వల్లనూ నేనింక యెంకరోరెంక!

అతడు: అప్పుడంటావు -యిప్పుడంటావు
సప్పుడు లేకుంట తప్పుకుంటావు
అక్కోరి పిల్లా - అల్లరీ సేమాకు
అక్కున నీ వల్లో వాలి పోతాను!

ఆమె: మాయమ్మ తమ్ముడాని మనసిచ్చి నేనుంటి
అక్క బిడ్డానని అలుసేలయ్య!
తిక్కరేగిందంటె మాడుసెక్కపెట్టి
పచ్చడి మెతుకుల బొచ్చె బోర్లిస్త!

అతడు: పప్పులోకి సిగురు కమ్మగుంటాదమి
నాజూకు సేతుల గాజులూ నింప
సంతాకు నేబోతే పంతాలు నీకేల
నారాజు కామాకు నీ రాజు నే కాన!

ఆమె: ఉడికించ నిన్ను అట్లంటికాని
నినుయీడి నేనెటుల వుండేదిరెంక!
నీకాల ములుదిగిన నా కాలు నొవ్వేను
నాకాన కూడ - నా మగడవీవె!

అతడు: నీ తాన యెల్లపుడు నా పానముంటాది
యేకోన వున్నా మరువనంటాది!
తడవ తడవకు మరి గొడవల్లు సేమాకు
యెన్నెలా రాత్రుల్లు మంటలూ కానీకు!

ఇద్దరు: ఒకరు నొకరింక - యిడస కుండాను
యెవ్వరేమన్న దడసకుండాను!
సెట్టుకూ తీగల్లె పెనవేసుకుందాము
కట్టాలనెదిరించి సక్కంగనుందాము!

****
18.2.2013 సా. 3.41
(అముద్రిత ' జనపద్యం ' కావ్యం నుండి)

|ఎర్రపిడికిలి|| కె.వి.రమణారెడ్డి||| పుస్తకపరిచయం||


కపిల రాంకుమార్|| పుస్తకపరిచయం||
||ఎర్రపిడికిలి|| కె.వి.రమణారెడ్డి||
________________________________
విరసం – ప్రచురణ సెప్టెంబర్ 1972 వెల రు.3/=
బాలాజీ పబ్లిషర్స్ – బజారు వీధి – తిరుపతి
_______________________________ ముందుమాట త్రిపురనేని మధుసూదనరావు ” ఎప్పూదూ, ఇప్పుడులోనే”
1.కొంత మంది కవులు కలం పట్టుకున్న రోజునే ముసలాళ్ళు. సావిత్రో, ఊర్వశో, రాముడో అవేశించి (ఆవహించి ) పాత కాలాన్ని నెమరేస్తూ భూతకాలపు కవిత్వాన్ని రాస్తారు. శవ వాహకులుగా మిగుల్తారు. నిన్నటి గురించి రాయగలరు కాని నిన్నలా జీవించి రాయటం సాధ్యంకాని పని.”
2.ఇంకో రకం ఆధునికత పేరుకోసం ఒక రోజున ఆ రోజు గురించే కవిత రాస్తారు. జీవిత కాలలెండరులో ఆరోజు తొలిగిపోయినా అందులోనే కూరుకుపోతారు. వెనక్కి పరిగెత్తటంలో వీళ్ళు భూతకవులు (పై వారితో) పందాలు కాస్తారు, వేస్తారు–అవకాశవాద కవులౌతారు.”
3. నిజమైన కవులు ఎప్పుడు, ఇప్పుడులోనే జీవిస్తారు. పాతబడిన ఆయుధాలను విసిరి కొత్త కొత్త గతుల్ని, కత్తుల్ని వెతుక్కుంటారు. గమ్యం చేరేదాకా, శిఖరాన్ని అధిరోహించేదాకా ముందుకే నడుస్తారు.
కటకటాలు కరకరమంటున్నా,తుపాకులు మ్రోగుతున్నా..ముందుకే..పరుగెత్తే వాడే ప్రజాకవి..రమణారెడ్డి యీ కోవకు చెందిన ప్రజాకవి. ప్రజా వుద్య్మాల్ను అనుసరిస్తూ, ప్రజాస్వామ్య వలలు పన్ని మభ్యపెట్టె పార్లమెంటరీ విధానాన్ని
యెదురొడ్డి, బలికాకుండ, నిజమైన ప్రజా వైఖరిని సమర్థిస్తూ సందేశిస్తూ,అక్షర శక్తి సమర్పించాడు.రెండు దశాబ్దాల నుండి నవ కవే, యువకవే (1972 నాటి వ్యాఖ్యలో) అడవి, భువనఘోష, అంగారవల్లి రాసి..యిపుడు ‘ ఎర్ర పిడికిలి ‘ బిగించాడు……
రమణారెడ్డి కవి కాడనే అర్భకులున్నారు (నిరాకరించే అర్చకులూ వున్నారు) వాళ్ళ ప్రమాణాలకు సరితూగే కవికాకపోవటమే గొప్ప విషయం. ” నీ శత్రువు అభినందిస్తున్నాడంటే నీలో నిస్సందేహంగా లోపం వున్నట్లే ” అయితే సాను భూతి పరులు కూడ ఆ మాట అంటే అది వారి తప్పు కాదు. ఆదిలో రేమణరెడ్డి కవిత్వంలో శిల్ప వ్యామోహం, భాషా భేషజం మెండు, పండితులని మెప్పించాలనే పరోక్ష కాంక్ష వున్నందున, అభ్యుదయ కవిత్వ పాఠకులకు కొంత దూరమయ్యాడు. దాన్ని అధిగమించే రీతిలో సంస్కరించుకున్నాడు కాబట్టే ‘ ఎర్రపిడికిలి ” యెత్తాడు, ప్రజా హృదయాలమీద ముద్ర వేసే స్థాయిలో>>>>>
కత్తుల చక్రం – తిప్పుతూ ‘ అయ్యా! కవి వర్యా/ కొయ్య లాగుంటే మొయ్య బరువయ్యా!/కత్తిలాగుంటేనే ఘనమయ్యా! ” 9/1972
స్వాహాతంత్రం – మంత్రం జపిస్తూ (1) ఎట్లాగైతే వచ్చింది/బేరమాడితే అచ్చింది / ఎవరు తెస్తేనే వచ్చింద్/అట్లా యిస్తే వచ్చింది/ యెప్పుడైఅతేనేం వచ్చింది – చచ్చి చేదుగా వచ్చిందీయెవ్విధమైతేం వచ్చింది – విప్లవాన్ని చంపి తాను వచ్చింది ”
2) ” ద్వీపాంతర వాసాల ముగింపుపై/ ఉరి చెర శిక్షల కెల్లా తుడుపై/ విప్లవకారుల గోరీ రాయై/ పితూరిదారుల శవాల గోయ్యై, రక్తం పంటల నింపిన గాదై/ ధూర్తుడెక్కి కూర్చున్న గాడిదై/ పెత్తందారుల ఉంపుడుగత్తై/ హంగు చేసుకుని వచ్చింది ” 8/72
….
” ఎర్రపిడికిలి ” లో
కలలు కంటు కవిత రాస్తూ
కలను మెలుకువతో పెనవేస్తూ!
అడవి పిట్టలు బదులు చెబుతూ
పాడుతూ పోరాడుతుంటివిగా!
పళ్లలోపల దొండపండూ – పూవుల్లో మందారపువ్వూ
పేరు నీది తలచుకొంటె – గుర్తువస్తై ఎర్రయెర్రంగా!
….
ఒంటి నిండా యెర్ర్ జెండా
ఉదయసంధ్యే కప్పివేస్తే!
గాయమే కనిపించకుండా
అడవికొమ్మలు రెమ్మలిచ్చిందా!
ఒత్తుకున్నం కంటిలో తడి – ఎత్తుకున్నాం ఎర్రపిడికిలి!
సత్యమెన్నడు చావదంటున్నాం – నీకీర్తి మూర్తే తరగదంటున్నాం ” 21.5.72
________________________________________________
ముక్తాయింపు నాది.
యిలా ఎన్నో యెన్నెన్నో………చదవాలని కోరుకుంటాను.
18.2.2013 ఉ. 1016