నాట్య కళా పోషణం నటరాజ పాద పూజనం
మన రాష్ట్రంలో కళాకారుల కోసం ఇప్పుడు
సంఘాలు ఏర్పడి నట్టే ఈ రోజు లలో కులాలు ఏర్పడేవి. ఆ దృష్టితో చూస్తే
దేవదాసి వ్యవస్థలో దేవదాసీలు, గణికలు అని రెండు రకాల వారుండే వారు. దేవ
దాసీలలో, శివదాసీలు, విష్ణు దాసీలు అని రెండు రకా లున్నాయి. శివ దాసీలలో
బసవిలు, పార్వతిలు, గణాచా రులు అని రకరకాలుగా కనబడ తారు. అలాగే గణికలలో
కేళిక, మేజువాణి, మేళం వాళ్లు అని రకాలు కనబడతారు.
వీరంతా సమా జంలో తెగలుగా కనబడతారు. సమాజంలో ఒక తెగను సృష్టించి ఎడతె గని విధంగా వ్యవస్థను ఏర్పడేలా చేయ గలిగా యంటే పెద్దలు కళలను కాపాడేం దుకు పునాదిని ఎంత బలంగా వేశారో అర్థం చేసుకోవచ్చు. అలాగే నృత్య నాటకాల కోణం నుంచి చూస్తే మన రాష్ట్రంలో అనేక భాగవత మేళాలు ఏర్ప డ్డాయి. ఈ భాగవతులను వీధి భాగవ తులు ప్రధానమైన వారు. వీరిలో కూచిపూడి బ్రాహ్మణ భాగవతులు, కోడ కొండ, కపట్రాల, యానాది, చెంచు, గొల్ల, నక్కల భాగవతులు అని అనేక రకాల వారున్నారు. వీరు కాక దాసరి పాటకులు, బహురూపులు ఉన్నారు. వీరంతా తెగలు గా ఏర్పడి భాగవత సంప్రదాయాన్ని కాపాడారు. ఎవరికి వారు గా ఒక వ్యవస్థగా నిలిచి నిలబెట్టారు. ఇది మన పూర్వీకులు కళలను నిలబెట్ట డంలో ప్రదర్శించిన చిత్తశుద్దికి తార్కాణంగా చెప్పు కోవచ్చు.
నాట్య కళకు వీరు మహారాజ పోషకులు
వ్యవస్థలు ఆవేశంతో ఏర్పడినా వాటికి ఆలంబన అవసరం. వనిత, కవిత, లత ఆదరువు లేకుండా రాణించలేవు అన్న పెద్దల సూక్తి కూడా ఇదే చెబుతోంది. పెద్దలు ఉదహరించిన వాటిలో కవిత 64 లలిత కళలకూ ప్రాతినిధ్యం వహిస్తోంది. కళలకు మహా రాజపోషకులుగా నిలిచి వాటిని బతికించిన జమీందారి సంస్థా నాలూ చాలా వున్నాయి. కార్వేటినగరం, కాళహస్తి, వెంకటగిరి, కొల్లాపురం, గద్వాల, వనపర్తి, నూజివీడు, పిఠాపురం, పెద్దపురం, తుని, విజయనగరం, బొబ్బిలి, జయపురం సంస్థానాలు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. వీరి ఆదరణతో పల్లవులు, జక్కిణి, దరువులు, పదదరువులు, పెద్ద వర్ణాలు, పదాలు వంటి సంగీత రచనలు వీరి ఆదరణలో రూపుదిద్దుకు న్నాయి. భామాకలాపాలు, గొల్ల కలాపాలు, వీధి నాటకాలు గజ్జెకట్టి బతకగలిగాయి.
విజయనగర సంస్థానం
హంపి విజయనగరం తెలుగు కళలకు
పెద్దదిక్కుగా నిలిచి స్వర్ణయుగాన్ని ఆవిష్క రించింది. ఆ తరువాత లలిత కళలను బతికించిన ఘనత విజయనగరం సంస్థా నానికి దక్కింది. దీనికి కవి పండితుల సంస్థానంగా మంచి పేరుంది. ఆనంద గజపతి మహారాజా వారి హయాంలో పదాలు, పల్లవులు, శబ్దాలు వచ్చాయి. అందులో మండూక శబ్దం విలక్షణమైంది. అలాగే శుభలక్షణ పల్లవి కూడా ఈ సంస్థా నంలోనే పుట్టింది. అలాగే సీతారామ గజపతి కాలంలో సప్తతాళాలతో రూపొం దిన జక్కిణి దరువులు, పద దరువులు, స్వరపల్లవులు, పొణ్ణంగి దరువులు అనేకంగా రచించబడ్డాయి.
కార్వేటినగర సంస్థానం
ఈ సంస్థానాన్ని వెంకటపెరుమాళ్ రాజేంద్రుల కాలంలో నృత్యకళ అమో ఘంగా వర్థిల్లింది. గోవింద సామయ్య వర్ణ పంచకం అనే పెద్దవర్ణాలు ఈయన హయాంలోనే రచించారు. కళాకారుడికి వీటిలో నృత్యం చేయడం నిజంగా అగ్ని పరీక్ష వంటిదే! వీటిలోని మోహన వర్ణం కార్వేటినగరం, కాళహస్తి, వెంకటగిరి ప్రాంతంలో, నవరోజు వర్ణం కోస్తాజిల్లాలో బహుళ ప్రచారంలో వుంది.
వెంకటగిరి సంస్థానం :
ఈ సంస్థానాన్నేలిన బంగారెచ భూపాలుని కాలంలో కవి, పండిత, గాయక, నాట్యచార్యులను ఆద రించి పోషించింది. ఈయన హయాంలో సభా రంజని అనే నాట్య గ్రంథం రూపొం దింది.
తీర్థ క్షేత్రాలలో గజ్జెల గలగల
ఇక పుణ్యతీర్థాలు నృత్యకళకు వేదికగా నిలిచాయి.
శ్రీశైలం : ఇక్కడ శైవ సంప్రదాయ కళలు అనేకం వర్థిల్లాయి. ఇక్కడ కొలువుదీరిన మల్లికార్జున, భ్రమ రాంబికలపై అనేక కవు తాలు రచించారు నాటి కవులు. ఇక్కడ భామాకలాపం, గొల్ల కలాపం ప్రదర్శనలు భ్రమరాంబికపై రచించిన అంబాస్థవంతో ప్రారంభమయ్యేవి. శృంగనాట్యాలు, సప్తలా స్యాల వంటి అతి ప్రాచీన కళారూ పాలకు ఈ క్షేత్రం ఆటపట్టుగా ఉండేది.
చెయ్యూరు : ఇక్కడ సుందరేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఈ ఆలయంలో శైవ సంప్రదాయం విశేషంగా వర్థిల్లింది. స్వామిపై ప్రత్యేక రచనలు అనేకం ఉన్నాయి. ఇక్కడ సప్తలాస్య ఆరాధన, కేళిక, యక్షగాన సంప్ర దాయాలు ఇక్కడ అభివృద్ధి చెందాయి. సర్వవాద్య ఆరాధన ఇక్కడి విశేషం. శ్రీకాళహస్తి, మన్నారు పోలూరు, జొన్న వాడ, శింగరాయకొండ, బాపట్ల, మర్కాపురం, మాచర్ల, ధర్మపురి, అల్వాల్, శ్రీకాకుళం, పిఠాపురం, శ్రీకూర్మం వంటి ఎన్నో శైవ, వైష్ణవ, క్షేత్రాలు నాట్యకళకు పెట్టింది పేరుగా వాసికెక్కాయి. ఈ క్షేత్రా లలో కేళిక, బలిహరణ నాట్యాలు శైవ, వైష్ణవ సంప్రదాయాల భేదాలే తప్ప దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఈ ఆల యాలలో ప్రదర్శించే కవుతుకాలు, సప్తలాస్యాలలో కొంత మార్పు కనబడు తుంది.
జిల్లాల వారీగా నాట్య విశ్వరూపం :
మన తెలుగునాట నాట్యకళ అభివృద్ధి తీరుతెన్నులు చూసినపుడు గంజాము ప్రభువులు ఓఢ్రులు. అయినా వారి మంత్రులు తెలుగు వారు కావడంతో ఇక్కడ తెలుగు కళలు వర్థిల్లాయి.ఇక్కడి జమీందారీలలో తెలుగు నాట్యాలు అభివృద్ధి చెందాయి. గంజా ముకు చెందిన జమిందారు ప్రతాప రుద్ర దేవుడు వెయ్యి మంది దేవదాసీలను తెలుగునాటి నుంచి తెప్పించి పూరి ఆలయానికి సమ ర్పించాడు. వారంతా నాట్యకళతో జగన్నాథస్వామి వారిని ఆరాధించారు. ఈ విధంగా తెలుగు సంస్కృతి ఈ ప్రాంతం మీద బలంగా పడింది. అందువల్లనే ఒడిస్సీ నాట్యంలోని గతి, విన్యాసాలు, అభినయక్రమాలు, జతి కట్టుబాట్లు తెలుగు నాట్యాలకు చాలా దగ్గర పోలికతో కనబడతాయి.
శ్రీకాకుళం, విజయనగరం : జిల్లాలలోని శ్రీకూర్మం, అరసవిల్లి ఆలయాలు నృత్య కళకు వేదికలుగా నిలిచాయి. బొబ్బిలి, కోమటిపల్లి, విజయనగరం, జయపురం, మాడుగుల, చోడవరం, జామి, నిమ్మలవలస నరసన్నపేట, రాజాము, నర్సీపట్నం, దొడ్డిగల్లు సంస్థానాలలో నాట్యకళలకు పుట్టిళ్లుగా వర్థిల్లాయి. ఇక్కడ దేవ దాసీల భరగనాట్యం, పురుష భాగవతుల భామా కలాపం, గొల్ల కలాపం బాగా అభవృద్ధి చెందాయి.
ఈ రెండు జిల్లాలలో ఉన్నన్ని భామా కలాప, గొల్లకలాప నాట్యమెెళాలు మరెక్కడా లేవంటే అతి శయోక్తికాదు. ఇక్కడ స్త్రీలు కలా పాలు ఆడడమనేది అరుదుగా కనబడు తుంది. ఇక్కడ కలాప కళా కారులు సిద్ధేం ద్రుల కలాపాలకుతోడు వంకాయలవారి కలాపాలు, చింతలపాటి వారి కలాపాలు, కసింకోట వారి కలాపాలు చేర్చి ఆడుతున్నారు. ఈ కలా పాలు కూచిపూడి కన్నా భిన్నంగా కనబడ తాయి. కాగా దేవదాసీల విద్య మాత్రం శ్రీకూర్మం నుంచి తంజావూరు వరకు ఒకే విధంగా కనబడుతుంది.
గోదావరి జిల్లాలు : తుని, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ, అమలాపురం, ముమ్మిడి వరం, పేరూరు, మానేపల్లి, మండపేట, ముర మండ,రాజమండ్రి, ధవళేశ్వరం, పసలపూడి, తాటిపాక, రాజోలు, వాడపల్లి,ద్రాక్షా రామం, ఉండి, మారంపల్లి, నరసా పురం, ఆచంట, అంతర్వేది, ఏలూరు తదితర జమీందారీలలో నాట్యకళ విశేషంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ స్త్రీలే కచ్చేరీ నాట్యాలు, కలాపాలు ఆడడం ఆనవాయితీ! ఇక్కడ నాట్యకళా కారిణులు సానులు, భోగంవారు అని రెండు రకాలు. భోగంవారు కచ్చేరీలో నాట్యం చేస్తే సానులు భాగవతమాడేవారు. ఈ కళా కారిణులకు సంస్కృత, తెలుగు సాహిత్యా లలో మంచి పరిచయం ఉంది.
కృష్ణ, గుంటూరు జిల్లాలలో కూచిపూడి, మొవ్వ, నంగిగడ్డ, రేపల్లె, తెనాలి, గుంటూరు, బాపట్ల, గుడివాడ, శ్రీకాకుళం, పొన్నూరు, ఒంగోలు ప్రాంతాలు కూచిపూడి భాగవత మేళాలకు ప్రసిద్ధి.
నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో టంగుటూరు, కావలి, సింగ రాయకొండ, జొన్నవాడ, నెల్లూరు, కలువాయి. బుచ్చి రెడ్డిపాలెం, వెంకటగిరి, మన్నారుపోలూరు, నాయుడుపేట, కాళహస్తి, కార్వేటి నగరం, జంగాలపల్లి ప్రాంతాలు నృత్యకళలకు రంగస్థలంగా ఉన్నాయి. దేవదాసీల కేళికానృత్యానికి ఈ ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి. కృష్ణాజిల్లా కూచిపూడిలాగే ఈ ప్రాంతంలోని జంగాల పల్లి నాట్యమేళ కళాకారులకు ప్రసిద్ధి. ఈ కళా కారులు యక్షగా నాలకు, వీధినాటకాలకు ప్రఖ్యాతి గడించారు. ఇప్పుడు తమిళ నాడులో కలిసిపోయిన తెలుగు ప్రాంతాలు తిరుత్తణి, చెయ్యూరు, మధురాంతకం పట్టణాలు కూడా నాట్యమేళకు ఆటపట్టుగా వుండేవి.
రాయలసీమలో : దత్తమండలాలైన కడప, కర్నూలు, అనంతపురం, జిల్లా లలో కోడకొండ, బనగానపల్లె, ప్రొద్దుటూరు, హిందూపురం, తాళ్లపాక, పుల్లంపేట, బుక్కాయపాలెం, కోటకొండ భాగవ తులు కూచిపూడి సంప్రదాయానికి చెందిన వారు. బనగానపల్లెనేలిన నవాబు కూచి పూడి భాగవతులను పిలిపించి వారికి గ్రాసవాసాలు సమకూర్చి ఆ ప్రాంతంలో కూచిపూడి భాగవత సంప్రదాయం వర్థిల్లేందుకు కృషి చేశారు. ఇక్కడ దేవ దాసీలు కేళికా నృత్యాన్ని ఆరాధించారు.
తెలంగాణాలో : ధర్మపురి, పెద్దపల్లి, నాగుపూర్, గద్వాల, వనపర్తి, జటప్రోలు, ఆత్మ కూరు, హైదరా బాదులలో నాట్యకళ బహుళ ఆదరణ
పొందింది. ఒక్క హైదరాబాద్‌ను మినహాయిస్తే ఇతర ప్రాంతాలలో కేళికా నాట్యం అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌లో ముస్లిం సంప్ర దాయాల ప్రభావం పడింది. అయినా హైదరాబాద్ గానాభజానాలకు, ఆట పాటలకు ఆటపట్టుగా నిలి చింది. భాగ్యమతి అనే నాట్యకళాకారిణి పేరుమీద భాగ్యనగరం ఏర్పడడం, అది తెలుగు జాతికి ఖ్యాతిని నింపుతున్న హైటెక్ సిటీగా మారడం మనందరికీ గర్వకారణం.
ఇలా సమాజ నిర్మాణంలో మమేకమై కులాలుగా, తెగలుగా ఏర్పడి నాట్యకళకే జీవితాలు అంకితం చేసిన ఘనకీర్తి మన తెలుగు రాష్ట్రానికి దక్కుతుంది. జన జీవితంలో ఇంతగా
మిళితమైన కళను దేవస్థానాలు, రాజస్థానాలు, సంస్థానాలు, జమీందారులు ఆదరించి పోషించాయి... ప్రోత్సహించాయి.
నాట్యం నటరాజ నర్తనం
త్రిమూర్తులలో ఒకడైన శివుడు తాండవ ప్రియుడు. ఆయనను నటరాజు అని పిలుస్తారు. ఆయన అర్ధాంగి పార్వతి శివునితో సరిసమానంగా నాట్యంచేసి ఆయనను మెప్పించేది. ఆయన ఉధృతంగా తాండవం చేస్తే ఆమె సుకుమారంగా నాట్యంచేసి ఆయనన ప్రసన్నం చేసేందుకు ప్రయత్నించేది. విష్ణుమూర్తి దశవిధావతారాలు ఎత్తినా ఆయన ఒక్క కృష్ణావతారంలోనే కాళియ మర్ధనం సన్నివేశంలో కాళియ సర్పం పడగలను చితకకొట్టేందుకు తాండవం చేశాడు. తాండవ కృష్ణుడు తెలుగువారి చేత తారంగాలందుకున్నా ఆయన తాండవమూర్తిగా వాసికెక్కలేదు.
వినాయకుడు కూడా అష్టభుజాలతో ఆటలాడే వాడైనా ఆయన నాట్యగణపతిగా ముద్ర పడ్డాడే తప్ప తాండవమూర్తిగా పేరు తెచ్చుకోలేదు. జైన సాహిత్యంలో జైన తీర్థంకరుడు వృషభుని జయంతినాడు ఇంద్రుడు తాండవమాడినట్టు చెప్పారు. సంప్రదాయ నాట్యంలో విని యోగించే వివిధ ముద్రలు ఆధారంగానే సంప్రదాయ నాట్యం రూపొందిందని పెద్దలు చెబు తారు. త్రిమూర్తు కర్తవ్యాలు, కార్యకలాపాలు తెలిస్తే శివుని తాండవం వెనక ఉన్న మర్మం అర్థమవుతుంది.
పంచ భూతాత్మకమైన ఈ విశాల విశ్వాన్ని సృష్టించి, పెంపొందించి, ధర్మమార్గంలో నడిపి, అంతం చేసేందుకు, సృష్టిని తనలో లీనం చేసుకునేందుకు ఆది శక్తి త్రిమూర్తులను నియోగించింది. ఆమె విధించిన కర్తవ్యాల ప్రకారం బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు. విష్ణువు సృష్టికి అవరోధంగా మారే శక్తులను ఏరివేసి అది సాఫిగా, సజావుగా సాగేందుకు కృషి చేస్తున్నాడు. శివుడు సృష్టిని అంతం చేస్తున్నాడు. ఈ మూడు మహాకార్యాలు ముగిశాక మొత్తం సృష్టిని తనలో ఇముడ్చుకుని, వెలికి తీసే మహత్తర కార్యాన్ని ఆదిశక్తి నిర్వహిస్తుంది. శివుడు చేసే నాట్యాన్ని తాండవం అంటారు.
మహాలయుడు, ప్రళయకాల విలయుడు, తాండవ ప్రియుడు అయిన శివుడు ఈ మొత్తం క్రియను చూస్తూ ఏడు రకాలైన నాట్యాలు చేస్తాడు. శివుడు ఇన్ని రకాల తాండవాలు చేసినా లోకానికి బాగా తెలిసింది ఆనంద తాండవం, రుద్రతాండవం మాత్రమే! శివునికి పరివారం ఉంది. పార్వతి ఆయన భార్య. వృషభం వాహనం. పాములు అభరణాలు. కైలాసం నివాసం. వీరుకాక ప్రమదగణాలున్నాయి. వారంతా కూడా శివుని పదనర్తనకు అనువుగా వాయిద్యాలు వాయిస్తూ తాండవం చేస్తారు. హశ్శరభ, దశ్శరభ అంటూ ఉధృతంగా నాట్యం చేయడం శైవం నేర్పిన సంప్రదాయమే!
శివాలెత్తి తాండవం చేయడం ద్వారా చూపరులను బలంగా ఆకర్షించ డమే కాదు నాట్యం రాని వాడిని కూడా ప్రేరేపించి ఆవేశంగా నాట్యం చేయించగల అమే యమైన శక్తి ఈ తాండవానికి ఉంది. రాజరాజచోళుని వంటి సుప్రసిద్ధ రాజులు నాట్యకళను అమితంగా ఆదరించి ప్రోత్సహిం చారు. ఆయన కాలంలో ఎందరో నర్తకీమణులు బృహ దీశ్వరుని ఆలయంలో నృత్యపూజ చేసినట్టు ఆధారాలున్నాయి. కంచి ఆల యాలలో కూడా నృత్యయ పూజ ఉంది. ఆనాటి నాట్య కళారీతులను సంఘం కాలం నాటి తమిళ గ్రంధం వివరంగా పేర్కొంది. కవిత్తొగై గ్రంధంలో శివతాండవం గురించి అనేక వివరాలున్నాయి. కొడుకొట్టు, పండరంగం, కాపాలి నాట్యాలలో శివుని నర్తన విధానాలు వివరంగా ఉన్నాయి.
యుద్ధానికి వెళ్ళే రాజులకు, సైన్యానికి విజయం కలగాలని కోరుతూ తమిళ దుర్గను పూజించే సంప్రదాయం ఆ రోజులలో ఉండేది. ఆ పూజలో భాగంగా తాండవం చేసే వారు. ఈ నాట్యం కోసం ఏడు తీగల యాల్ అనే వాయిద్యాన్ని వాడే వారు. ఇందులో ఉన్న ఊపు, ఉత్సాహం అలాంటిది.
సృష్టి, స్థితి, సంహారాలు, దుష్టశిక్షణ, శిష్టరక్షణలు ఆయనకు ఒక ఆట అని తెలియజెప్పడానికే శివుడు నటరాజులా మనకు దర్శన మిస్తున్నాడు. నిరంతర యోగముద్రలో గంభీరంగానూ, కాటికాపరిగా ఒకింత భయంకరంగానూ కనిపించే శివుడు నాట్యమూర్తిగా అందరినీ అలరిస్తాడు.. ఆకట్టుకుంటాడు. అందుకు కారణం విగ్రహమూర్తిలో మనకు కనిపించేది ఆనంద తాండవం. శివుడు ఏడు రకాల తాండవాలు చేస్తాడని శాస్త్రాలు చెబుతుంటే లోకంలో బాగా ప్రచారంలో ఉన్నవి ఆనందతాండవం, రుద్ర తాండవం మాత్రమే!
శివుడు సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ, తిరాధానాలు అనే పంచకృత్యాలను చేస్తాడు. శివుడు పంచముఖుడు. ఇవే పంచభూతాలు. ఈశాన్య ముఖం నుంచి పరమాత్మ, తత్పురుషం నుంచి వాయువు, అఘోర ముఖం నుంచి అగ్ని, వామదేవం ముఖం నుంచి నీరు, సద్యోజాత ముఖం నుంచి భూమి పుడుతున్నాయి. అందుకే శివ తాండవాన్ని పంచభూతాత్మక తాండవం అంటారు.
శివుడు చేసే తాండవాలనే శివతాండవాలు అనాలి. శివ తాండవం పేరుతో లోకంలో కనిపించే నాట్యాలను తాండవాలు అని అనాలే తప్ప వాటిని శివ తాండవాలు అనకూడదు. శివ తాండవాలే సృష్టి, స్థితి, సంహారాలను సూచించే మహత్తర నృత్యం. కనుక తాండవమాడదలచుకున్న కళాకారుడు ముందుగా ప్రకృతిని అధ్యయనం చేయాలి. అప్పుడే ఈ నృత్యంలోని భావాలు అర్థమవు తాయి. శివుడు చేసే తాండవాలు ఏడు రకాలు. ఈ సప్త తాండవాలు ఒక్క శివునికే సాధ్యం.
అవి 1. ఆనంద తాండవం 2. సంధ్యా తాండవం 3. కలిక తాండవం 4. విజయ తాండవం 5. ఊర్ధ్వ తాండవం 6. ఉమా తాండవం 7. సంహార తాండవం.
శివుని తాండవాన్ని ఏ శైలిని ఆశ్రయించి చేసినా ఊర్ధ్వ తాండవాన్ని అందరూ చేయడం విశేషం. శివుని పేరుతో ఎన్ని రకాల తాండవాలు భక్తులు ఆవేశంతో చేసినా శివుడు చేసే తాండవాలే ప్రధానమైనవి కనుక వాటి గురించి విశదముగా తెలుసు కోవడం అవసరం.
- శ్రుతకీర్తి

No comments:
Post a Comment