Tuesday, July 30, 2013

ఆయకట్టు కంటనీరు

ఆయకట్టు కంటనీరు

కపిల రాంకుమార్||ఆయకట్టు కంటనీరు||
వన్నెచిన్నెల పంటకాలువ పట్టుచీర కట్టునెపుడొ
విలువలెరిగి రైతులందరు నీటిపొదుపు చేసినపుడె!
జొన్నన్నమేగాని సన్నన్నమెరుగని పరిగకంకెలపాటి వరిపండనిచేలు
మెరకపొలాలన్న మొరటుచూపేల అరక పట్టిన వాడికే అరమరికలేదన్న!
పాతాళనూతుల్లో కొల్లేటి చాంతాళ్ళు శనగలెండుటె ఆనాటి చేవ్రాళ్ళు
కృష్ణమ్మ కరుణతో కాలువైపారేను చేదుకోబోతేను చేతికే అందేను!
ఉద్యమాల ఫలమియిద్ది లేతసూర్యుని కరములద్ది
నీలిరంగు అలలమీద సాగివచ్చె కృష్ణవేణి!
ఆటంకమూలేక ఆయకట్టుకంతా చివరిభూమివరకు నీరందునంటూ
ఆశతో యిన్నాళ్ళు కళ్ళుకాయలేకాచాయి అవకతవకల నీళ్ళు ఆశలే కూల్చాయి!
చిరిగిన చొక్కాయి నీరుకావి పంచె – పైమీదతుండు నెరసినాజుట్టు
బక్కచిక్కినరైతు డొక్కలెండుతూంటె – ఒక్కచుక్కకూడనీరందదండి!
కారులో వచ్చేటి కారుకూతాకదిరి నీటితో విందులు పోటీలు పడతారు!
బదిలీలు, స్థానాలు పదిలంగవుండాలి మజిలీలపి వారు యెదుగుతూండాలి!
నీటివేగపు కొలతలంటూ కాగితాల్లో చిక్కకుండా
మరలు తిప్పే గేటులోనే మర్మమంతా నింపుతారు!
మందురుచికె ఇంజినీర్లకు ముందుచూపు మందగించె
నీటినిలవచేయలేక మీనమేషపు లెక్కలెన్నో!
గొడవచేస్తే నీరుయిచ్చి – బుడగలెన్నోలెక్కకట్టి
మడతపేచీ పెట్టుతారు తడిమి జేబులు నింపుతారు
నమూనాల లోపాలు సృష్టికర్తల తప్పు – నిర్మాణపు  లోపాలు కార్యకర్తల  తప్పు
అజమాయిషీలేకుంట మనందరి తప్పు – ఇందరి తప్పులకు రైతులకు ముప్పు!
ఈ సాలు కాలువలు మోసాలు చేశాయి
చుక్కకూడ జారక వెక్కిరించె రైతును
దిక్కుతోచక అప్పుతీరక
గప్ చుప్ గా నొక్కిన గొంతులైరి
ఆలుపిల్లల వేలువిడిచి
గోడకెక్కిన దండలైరి
దీనికెవరు జాబు చెప్పరు
ఆదుకోవగ రూక రాల్చరు!
ఈ రీతి వాదాలు యేపాటి లాభాలు
ఏ జాతి బేధాలు పొడసూపకూండాను
యికనైన మనకు కలగాలి కనువిప్పు
ఉమ్మడి బాధ్యతలు మూపున వేసుకుందాం!
_____________________________________
2012-13 ఖరిఫ్- రబీలో నాగార్జునసాగర్ కాలువలలో సాగునీరందక
దిగాలుపడ్డ రైతు దీన స్థితికి స్పందన .
_____________________________________
30.7.2013

3 సాహిత్య వ్యాసాలు – ధోరణులు

3 సాహిత్య వ్యాసాలు – ధోరణులు

అసలు సిసలు పోస్ట్ మోడర్న్ కథలు: “మాయలాంతరు”
ఒక రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ముఖం చూసుకుందామని అద్దం ముందుకు వెళితే అక్కడ మీ ముఖానికి బదులు ఓ పురుగు కనిపిస్తుందనుకోండి. మీ పరిస్థితి ఏంటి? ఫ్రాంజ్ కాఫ్కా అనే ఫ్రెంచి రచయిత “మెటామార్ఫాసిస్” అనే కథను ఇలా మొదలుపెడతాడు. మనిషి రోజురోజుకు ఒంటరివాడై పోవడం (థీమ్ ఆఫ్ ఎలియనేషన్), నాగరికత పేరుతో మానవ జీవితంలో జరుగుతున్న విధ్వంసం ఇలాంటి రచనల్ని సృష్టించింది. రచయిత చెప్పవలసిన విషయం, అందుకు ఎంచుకున్న ప్రక్రియల సారం – రూపం (కంటెంట్ – ఫార్మ్) ఇరవయ్యో శతాబ్దపు చివరి దశకాలలో ముందెన్నడూలేని ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఆంగ్ల సాహిత్యంలో వచ్చిన ప్రతి ప్రయోగం అనతికాలంలోనే తెలుగు సాహిత్యంలో మనం గమనించవచ్చు. అలాంటి ప్రక్రియా ప్రధానమైన శిల్పంగా పోస్ట్ మోడర్నిజమ్ ను చెప్పుకోవచ్చు. చెప్పడంలో వినూతనత్వం, చెప్పే విషయం సమకాలీనం కావడం రచయిత సామాజిక బాధ్యతను ఎత్తి చూపిస్తుంది. ఇలాంటి శిల్ప విన్యాసాల్లో కథావస్తువులను ఎంచుకుంటున్న రచయితలను తెలుగులో లెక్కబెడితే మన చేతివేళ్లు చాలా మిగిలిపోతాయి. ఆ కొద్దిమంది ప్రతిభావంతులైన ప్రభావశీల రచయితల్లో డాక్టర్ వి. చంద్రశేఖర రావు ఒకరు. ఇప్పటికి ఆయన మూడు కథా సంపుటాలను వెలువరించారు. “జీవని”, “లెనిన్ ప్లేస్”, “మాయలాంతరు”. ఇవికాక “ఐదు హంసలు” అనే నవలికను కూడా రచయిత ప్రచురించారు. వీటిల్లో “మాయలాంతరు” కథాసంపుటిని ఈ వ్యాసం పరిచయం చేస్తుంది.
ఈ కథా సంపుటి ప్రత్యేక లక్షణమేమిటంటే ఇందులోని కథలను మనం ఏకబిగిన చదవలేం. కథకూ కథకూ మధ్య కొన్ని రోజుల విరామం కావాలి. జీవితంలోని విషాదమంతా ఈ కథల్లోనే పోగుపడిందా అని భయంకూడా మనకేస్తుంది. భయం, నిరాశ, విషాదం కలగలిసిన వాతావరణంలో కథలన్నీ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఒక్కో కథ చదివిన వెంటనే కొద్ది రోజులపాటు ఆ దైన్యం మనల్ని వెంటాడుతుంది. ఆ దైన్యానికి కారణమెవరో మనకు తెలిసిపోతుంది. రాజ్యాన్నో, అధికారాన్నో, ప్రకృతినో ఏమీ చేయలేని నిస్సహాయత మనల్ని వెక్కిరిస్తుంది. దాంతో మన గుండె మరింత జారిపోయి దైన్యపు ఊబిలోపడి గిలగిల్లాడిపోతాం. సాహిత్యం కొనుక్కుని చదువుకుని ఇంత శ్రమపడడం అంత అవసరమా అని అడిగితే సమాధానం చెప్పలేం కాని, శీతాకాలంలో మంట దగ్గర కూర్చుని చలి కాచుకోవడం, వేసవికాలంలో చల్లటినీడలో సేదదీరాలనుకోవడం దివ్యమైన మానవానుభవాలు. అలాంటి మానవానుభవం పొందాలని కాంక్షించే సాహితీ మిత్రులంతా ఈ “మాయలాంతరు” కథలు చదవవచ్చు. జీవితం అనుభవాల నది ఒడ్డున సేదదీరవచ్చు. అనుభవించవచ్చు. సాహిత్యం నెరవేర్చే ఈ మహత్తర ప్రక్రియనే అరిస్టాటిల్ ‘కెథార్సిస్’ అన్నాడు. గొప్ప గొప్ప విషాదాంత నాటకాలన్నీ మనిషిలో దైన్యాన్ని క్షాళన చేస్తాయని తన “పొయెటిక్స్” లో చెప్తాడు.
ఈ “మాయలాంతరు” కథాసంపుటి ‘నీటి పిట్టల కథలు’ అనే కథతో ప్రారంభమవుతుంది. కథలో మాజిక్ రియలిజం వుంటుంది. మిస్టిసిజం వుంటుంది. పల్లెటూరిలో పొలాలు అమ్ముకుని పట్నం వచ్చి వ్యాపారం సాగించలేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు కథనే మనకు పూర్తిగా అపరిచితమైన కొత్త కొల్లాజ్ టెక్నిక్ తో రచయిత చెప్తారు. ఒక విధంగా సామాన్య పాఠకునికి ఇదో మానసిక వ్యాయామం. చిన్న చిన్న వ్యాపార స్తులను వడ్డీ వ్యాపారులు కప్పల్ని పాములు మింగేసినట్టుగా మింగేయడం చూస్తాం. ఇంకా వైద్య వృత్తిలో దోపిడీని చూస్తాం. సాహిత్య విద్యార్థులమై తే కథలో కథను చెప్పడమెలానో పరిశీలిస్తాం. మత ఘర్షణల నేపథ్యంలో సాగిన ‘సలీం సుందర్ ప్రేమ కథ’ చైతన్య స్రవంతి ధోరణినీ, అబ్సర్డిటీని, ఎగ్జిస్టెన్షిలియలిజాన్ని దాటుకుని సర్రియలిస్టిక్ ధోరణిలో చెప్పిన ఆధునికానంతర కథగా చెప్పుకోవచ్చు. 2001 ప్రజాతంత్ర వార్షిక సాహిత్య ప్రత్యేక సంచికలో వచ్చినప్పుడే ‘కాకుల ఇల్లు’ కథ పెద్ద దుమారం రేపింది. దళిత నాయకుడిని హత్యచేసిన హంతకులు సాక్ష్యం చెప్పడానికి సాహసించిన వారినికూడా హత్య చేయడం ఈ కథావస్తువు. ఉత్తర తండ్రి పనిచేస్తున్న ఏనిమల్ లేబరేటరీలో పెంచుతున్న ఆవు మాయ. రెండు ఏనుగులంత ఆ ఆవు చిన్నారి ఉత్తర ఇంటలెక్చువల్ ఫ్రెండ్. ఇది గుండె లోతుల్ని తట్టే కథ. దళిత ఉద్యమంలో చురుకుగా పనిచేస్తున్న తల్లిదండ్రులను ఉద్యమానికి విడిచిపెట్టేసి తమ పొట్టచేత పట్టుకుని పట్ట ణాలలో ఉద్యోగాలు చూసుకునే పిల్లల కథ ‘చరిత్ర’. ఆ పిల్లలలో గిల్టీ కాన్షస్ నెస్ ను వివరంగా చిత్రించిన ఈ కథ కూడా టెక్నికల్ గందరగోళమే. ఇంకో కథ పేరు ‘చలికాలం ఒక మేఘం అంతే కథ!’. ఈ కథలో మేఘం దేనికి ప్రతీక – చావుకా? దు:ఖానికా? వ్యథాభరిత జీవితానికా? ముందు అనుకున్నట్టు గ్లూమీనెస్ మోసుకొచ్చే దిగులుకా? కనిపించిన ప్రతివారికీ వాళ్లవాళ్ల వెబ్ సైట్లను పచ్చబొట్లలాగా పొడిచేస్తుంటారీ కథలో. వికృతంగా పెరిగిపోతున్న వినియోగ తత్వాన్ని వెటకారంగా చెప్పడమే కథారచయిత ఉద్దేశం. మోహినీ అపార్ట్ మెంటులో ఒక గదిలో మరణించిన లోకేశ్ వున్నట్టు కథకుడు భ్రమ పడడంకూడా ఈ కథలో ఒక వెంటాడే జ్ఞాపకం (హాంటింగ్ మెమరీ).
ఈ కథా సంపుటిలోకెల్లా నాకు బాగా నచ్చిన కథ ‘నిప్పు పిట్ట, ఎర్ర కుందేలు మరియు అదృశ్యమౌతున్న జాతుల కథ’. చంద్రశేఖర రావు కథన శిల్పాన్ని, శైలిని, వర్ణించగలిగే, వివరించగలిగే మాటలు మనకు దొరికేది ఈ కథలోనే. పేజీ 66లో ఈ వాక్యాలు చదవండి: ‘చావుకు భయపెట్టే గుణం పోయింది. ఇప్పుడు అందరినీ భయపెట్టేది మానవ సంబంధాల ధ్వంసం. వ్యాధికన్నా, చావుకన్నా, ఎక్కువ భయం కలిగించేవి మనుషుల్లోని ఎడారులు’. జ్ఞాపకం వుండడం వల్లనే ఈ బాధలన్నీ, అందుకని కొన్ని విషయాలు జ్ఞాపకం లేకపోతే ఎంతో బాగుంటుందనుకుంటాం. మరికొన్ని విషయాలు మరిచిపోతే మంచిదనుకుంటాం. ఇందులో కథకుడితోపాటు మోహినికూడా ఎలా స్పందిస్తున్నారో చూడండి: ‘జ్ఞాపకాల్ని పోగొట్టుకోవడమే! ఎందుకో క్షణంపాటు జలదరింపులా తోచింది’. ‘నాకీ జ్ఞాపకాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. ఈ మరణం, వేదన, ఆందోళన, భయం, కోరిక, పోరాటం నాకు సైనికురాలుగా జీవించడమే ఇష్టం‘. p.68 మోహన సుందరం మాటల్ని కథకుడు ‘సుధీర్ఘమైన దు:ఖగాథ’తో పోలుస్తాడు (పేజీ 70). ఈ పదబంధాన్ని కథారచయితకు కూడా అన్వయించవచ్చు.
‘అపరిచిత భాషలు’ అనే మరో కథ వుంది. నిశ్శబ్దం కూడా ఒక పనిష్మెంట్ లాంటిదేనని ఒప్పుకుని తీరుతాము. ఊరవతల వీధి చివరి ఇల్లు, ఆఫీసు ఉద్యోగంతో అలసిసొలసి ఇంటికి చేరిన భర్త కూడా మాట్లాడడు. ఇది కూడా డొమెస్టిక్ వయొలెన్స్ గా గుర్తిస్తాం. ఐదారేళ్ల కిందట నల్గొండ జిల్లాలో పౌరహక్కుల ఉద్యమ కార్యకర్త బెల్లి లలితను ‘ఎవరో’ అతి కిరాతకంగా చంపేశారు. ఎంత దారుణమంటే శరీరాన్ని పదమూడు ముక్కలుగా కోసి లలితక్క ఊరిలోనే ఒక్కో శరీర భాగం ఒక్కోచోట పడేశారు. (ఆ తరువాత కొద్ది మాసాలకే ఎలిమినేటి మాధవరెడ్డిని అప్పటి నక్సలైట్లు ప్రతీకారంగా హతమార్చారని అప్పట్లో అంతా గొణుక్కునేవారు). ఈ కిరాతకంపై స్పందనే ‘మాయలాంతరు’ కథగా మనం భావించవచ్చు. దళిత రచయిత పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఈ కథలన్నీ చదివాక మనకు అనిపించేది రచయిత ఎంతో పొదుపుగా సంభాషణలు వాడుతుంటారని. సినిమాల్లో రీళ్లమాదిరిగా, దృశ్యమాలగా సంఘటన తర్వాత సంఘటన జరిగిపోతుంటాయి. మనోఫలకంపై ఆ కథంతా ఒక రీలులాగా తిరుగుతుంది. భయంగొలిపే నిశ్శబ్దం నేపథ్య సంగీతమవుతుంది. కిందటేడాది నోబెల్ బహుమానం పొందిన హెరాల్డ్ పింటర్ ను ఈ బీభత్స రసం సృష్టించేవానిగా కీర్తిస్తారు. మెనేస్ (బీభత్సం అని తెలుగులో అనొచ్చా?) ను అద్భుతంగా ఆవిష్కరిస్తాడని పింటర్ రచనాశైలిని ‘పింటారెస్క్’ అని పిలుస్తారు. కానీ, అతడు మన చంద్రశేఖరరావు కథలను చదివితే ఏమనుకుంటాడో? ఈ కథనాల్లో కథ సాఫీగా సాగదు. సంఘటనలు కూడా ఒక క్రమంలో వుండవు. శకలాలుగా కథాంశం పాఠకుని చేరుతుంది. వాటన్నింటిని ఓపిగ్గా బ్రెయిన్ టీజర్ పజిల్ లాగా ఒక క్రమంలో పేరిస్తేనే పాఠకునికి సంపూర్ణ చిత్రం ఆవిష్కృ తమయ్యేది.
254 పేజీలు, 21 కథలతో “మాయలాంతరు” పుస్తకాన్ని 50 రూపాయలకే పొందవచ్చు. ప్రచురణకర్త వివరాలు లేని ఈ పుస్తకంలో పోస్ట్ మోడర్న్ కథలతోపాటు ”చంద్రశేఖరరావు కథలు, నేపథ్యం, నిర్మాణం” అన్న బి. తిరుపతిరావు వ్యాసాన్ని కూడా చదవొచ్చు. పూర్తిగా ప్రాచ్య సాహిత్యపు ప్రభావంతో రాసిన తెలుగు కథలు కావడం వల్ల నా ఈ వ్యాసంలో చాలా ఆంగ్ల పదాలు అనివార్యంగా దొర్లాయి. కాని కథల్లో మాత్రం రచయిత ఎంతో నిగ్రహంగా తెలుగు పదాలనే వాడడం విశేషం. మరి మీరూ వీటిని చదువుతారుగా!
2తెలుగు ఆధునికోత్తరవాదాలు- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ 14/01/2013
ఆధునికోత్తరఅంటే -Post Modern అని అర్థం. దాదాపు 1975 ప్రాంతంలో ఆధునిక భావ అభ్యుదయకవిత్వోద్యమాలు ముగిసి ఆధునికోత్తర ఉద్యమాలు వాదాలు మొదలైనాయని విశే్లషకులుఅభిప్రాయపడుతున్నారు. ఉద్యమం- వాదం, ధోరణి ఈ మూడు సమానార్థకాలు కావు. సమానధర్మమూ లేదు. ఉద్యమంను ఆంగ్లంలో మూవ్‌మెంట్ అనే పదానికి సమానార్థకంగావాడుతున్నారు. వాదం అంటే ‘‘ఇజం’’ ధోరణి అంటే ట్రెండ్. ఉద్యమం దీర్ఘకాలికంగాసాగితే మహాకావ్యాలు ఖండకావ్యాలు కూడా వస్తాయి- ట్రెండ్‌లో గీతాలు, లఘుకవితలు మాత్రమే వస్తాయి. ‘ఇజం’ అనేదిఒక సిద్ధాంతం. ఇది ప్రాతిపదిక. అంటేభిన్న ఉద్యమాల వెనుక ఏదో ఒక ఇజం ఉంటుంది. అంటే మైనారిటీవాదం – ‘దళిత’వాదంస్ర్తివాదం, ప్రాంతీయవాదం, జాతీయవాదం ఉప ప్రాంతీయ వాదం, సామ్యవాదం ఇలా.. ఈవాదాలన్నీ ఉద్యమ స్థాయికి చేరకపోవచ్చు. ప్రధానంగా సామ్యవాదం, జాతీయోద్యమం, ప్రాంతీయోద్యమం, ఉప ప్రాంతీయోద్యమం రాజకీయమైనవి. అధివాస్తవికతావాదం, అనుభూతి వాదం, మాజిక్ రియలిజం వంటివి కొన్ని ధోరణులు, కొన్ని చిత్రకళ నుండిదిగుమతి చేసుకున్నవి. అంటే కొన్ని వాదాలు ధోరణులుగా మిగిలిపోయాయేకానిఉద్యమస్థాయికి చేరలేదని తాత్పర్యం. ఉదాహరణకు దిగంబర కవిత్వం చూడండి. 1960వ ఐదారుగురు యాంగ్రీ యంగ్‌మెన్ సమాజాన్ని తిడుతూ కవిత్వం వ్రాయటంమొదలుపెట్టారు. అందులో క్రమంగా తిట్ల పంచాంగం ఎక్కువైంది.జాతీయోద్యమంరాజకీయమైనది. అది లక్ష్యసాధన తర్వాత సహజ పద్ధతిలో సమాప్తమయింది. ఒక కారణంఎందుకు పుట్టిందో అది కావ్యం తర్వాత ముగుస్తుంది. దిగంబర కవిత్వానికిఅసంతృప్తియే కారణం. వారు చెప్పిన సామాజిక రుగ్మతలు నేటికీ ఉన్నాయి. ఐనాప్రొటెస్ట్ చేయటంతో తమ పని అయిపోయిందని అనుకున్నారు. ఈ సిద్ధాంతాన్నిగమనించాలి. నేడు కొన్ని ముఖ్యమైన ఉద్యమాలు నడుస్తున్నాయి.
క్రైస్తవ మత ప్రచారోద్యమం: ఇది దళితవాదం కాదు. కేవల మతవాదం. కేవలం జీసస్మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలడు అనే విశ్వవ్యాప్తమైన ఒక మతం. దీని ప్రచారానికిఎన్నో గీతాలు కావ్యాలు పుట్టాయి. మహాకావ్యాలు, లఘుకావ్యాలు వస్తే ఉద్యమతీవ్రత వ్యక్తమవుతుంది. క్రీస్తు చరిత్ర వంటి గ్రంథాలను ఈ సందర్భంగాఉదహరించవచ్చు.
శాంతివాదం: ఇది మతవాదం కాదు. అంటే క్రీస్తులోని శాంతి, బుద్ధునిలోని శాంతి, గాంధీలోని అహింస వాటి భావనలను మాత్రమే తీసుకున్నవాదం.
బౌద్ధవాదం: అంబేద్కర్ చివరి దశలో బౌద్ధ మతం స్వీకరించారు. ఈ కారణం చేత నవబౌద్ధవాదం, దళిత వాదం ఒకటేననే భ్రమ కలుగుతున్నది- కాని అది సరికాదు. బౌద్ధంఒక క్షణిక వాదాన్ని ప్రతిపాదించింది. వైదిక హింసాత్మక యజ్ఞాలపై ఒకతిరుగుబాటు చేసింది. బుద్ధుని శాంతి, బుద్ధుని కుల రహిత సమాజం, బుద్ధునిసమకాలీన వైదిక సమాజ నిరసన, ఈ మూడూ మూడు వేర్వేరు అంశాలు. ఈ భేదాన్నిస్పష్టంగా గమనించాలి.
వైదిక పునరుజ్జీవనోద్యమం: ఇది నేడు తీవ్ర స్థాయిలో ఉంది. పరిపూర్ణానంద, సుందర చైతన్య, చిన జీయర్‌స్వామి వంటి వారి ప్రసంగాలకు వేల నుండి లక్షలసంఖ్యలో ప్రజలు హాజరుకావటం చూస్తున్నాము. ఈ విధంగా ఈ పునరుజ్జీవనోద్యమంసాహిత్యంపై ప్రభావాన్ని చూపుతుంది.
మైనారిటీవాదం: అంటే ఇండియాలో ముస్లిముల శ్రేయస్సు కోసం వ్రాసే కవిత్వం.కాశ్మీరులో హిందువులు మైనారిటీలు. కాని మైనారిటీ కవిత్వం అంటే ‘ముస్లింకవిత్వం’ అనే అర్థమే స్థిరపడింది.
ఇవికాకుండా ఇంకా అవకాశవాదం (ఆపర్చునిజం), శాడిజం (పాశవికానందవాదం), నిహిలిజం (నరద్వేష వాదం), దైవీకరణవాదం, అతి మానసవాదం (అరవిందుడు) ఇలాంటిఅంశాలపై కూడా విస్తృతంగా విశే్లషణం జరుగవలసి ఉంది.
కొన్ని సాహిత్య ప్రక్రియలను కొందరు ఉద్యమస్ఫూర్తితో వ్యాప్తి చేస్తున్నారు.వచన ఛందస్సు (ఫ్రీవెర్స్)ను మాదిరాజు రంగారావు, శీలావీర్రాజు, కుందుర్తివంటివారు ఉద్యమస్ఫూర్తితో ప్రచారం చేశారు. అలాగే పద్య (అక్షర- మాత్రం)గణఛందస్సును కొందరు ఉద్యమ స్ఫూర్తితో పునరుద్ధరిస్తున్నారు. అంటే ఒకసిద్ధాంతం కాక ఛందోప్రక్రియయే ఉద్యమ శీలాన్ని సంతరించుకున్నదని అర్థం. అంటేపద్య ఛందస్సులో మాడు పగిలే మూడు శతకాలు (త్రిపురనేని మహారధి) రాజకీయకవిత్వం వ్రాశారు. అదే పద్య ఛందస్సులో అక్కిరాజు సుందరరామకృష్ణ అధిక్షేపలఘుశతకాలూ వ్రాశారు. అంటే దిగంబర కవులు వచన పద్యం (ఫ్రీవెర్స్)లో చూపిన ‘యాంగ్రీ యంగ్‌మెన్’ లక్షణం అక్కిరాజు సుందరరామకృష్ణ పద్య ఛందస్సులోచూపాడు. ఇలాంటివారు మరికొందరు ఉన్నారు. అలాగే ఆనాడు మినీ కవిత, నేడు నానీకవిత రూపపరంగా వ్యాప్తి చెందింది.
భక్తి ఉద్యమం: 20వ శతాబ్దంలో మళ్లీ భక్తి ఒక ఉద్యమంగా వ్యాపించటం గమనార్హం.ఇవి హిందూ ధర్మప్రచారం అని భావించకూడదు. మానవుడు ఆర్తితో అభిలాషతోవాంఛాహితమైన దృష్టితో నిస్సహాయతలో భగవంతుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఆ దేవుడువెంకన్న కావచ్చు, అయ్యప్ప కావచ్చు, ఏసుప్రభువూ కావచ్చు. నిర్వేదం..పారిశ్రామికీకరణ, నగర జీవనం, సంగణిక యంత్ర అంతర్జాలం (కంప్యూటర్నెట్‌వర్క్) సృష్టించిన ఒత్తిడి (డఆళఒఒ) మానవ నిర్వేదానికిదారితీస్తున్నది. సమాజంలో రాజకీయ అవినీతి, వాతావరణ కాలుష్యం వంటివి మానవమస్తిష్కాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇవి కవిత్వంలో కథలో వ్యాసంలోప్రతిబింబిస్తున్నాయి. ఈ నిర్వేదం- నిరసన (ప్రొటెస్ట్) ఉద్యమ స్థాయికిచేరింది. ఇక్కడ మరో అంశం గమనించాలి. కవి నిరసన తెలుపుతున్నాడు, పాఠకుడుచదివి ఆనందిస్తున్నాడు. అలాంటి ఇద్దరి బాధ్యతలూ తీరిపోయినట్టుభావిస్తున్నారు. అంటే ఇక నిరసన కవిత్వం- అటు సృజనకర్తను ఇటు పాఠకుణ్ణి కూడాఆచరణ దిశగా తీసుకొనిపోతే వాపోతున్నది ఎందుకని?
‘అభివ్యక్తి అందంగా ఉంది. బలంగానూ ఉంది’ అని వ్యాఖ్యానించి వదిలేస్తున్నారు. ఎందుకని?? ఎప్పుడైనా ఆలోచించారా?
3 సాహిత్యవాదాలు.. సామాజిక వైషమ్యాలు- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సెల్: 9848774243
29/04/2013
…………..
నేటి సమాజంలో కాలానుక్రమంగా ఉద్భవిస్తున్న సరికొత్త సమస్యలను, అవి ఏ విధంగావర్ణాల్లో వర్గాల్లో విషాన్ని విరజిమ్ముతుంది, మనుషులు పరారుూకరణ ఏవిధంగా చెందుతుంది పసికట్టే లోతుల్లోకి కవులు, రచయితలు వెళ్లడం లేదు. వస్తువులుదర్శించే కోణాల్లో ఇసుమంత మార్పులేదు. దాని విస్ఫోటనంలో విచ్చుకుంటున్నపాపపంకిలకోణాల్ని పట్టుకోవడం లేదు. శ్రమ దోపిడిని గూర్చి ఎక్కువగా కవులు, రచయితలుమాట్లాడుతుంటారు. అన్నివర్గాల్లోకి ప్రవహించిన బూర్జువా భావజాలాన్ని, దోపిడీ తత్వాన్ని పెత్తనందారీ విధానాన్ని నిజాయితీ లేమినీ, సాహిత్యవర్గాల్లో ఈదులాడే కవులు, రచయితలు పసిగట్టలేకపోతున్నారు.
…………..
కళ ప్రజల కోసం. సాహిత్యం ప్రజల ఆయుధం. మానవీయతతో కూడిన వర్గ, వర్ణ, కుల, మతరహితమైన ధ్యేయంగా సాహిత్యం వెలువడాలనేది నేటి సాహిత్య దృక్పధం. ఇలాంటిలక్ష్యంతో మార్గాన్ని అనే్వషిస్తూ ముందుకుపోవలసిన సాహిత్యం సమాజాన్ని ‘కొత్తచూపు’తో అనే్వషిస్తున్న తరుణంలో కవిత్వంలో వివిధ వాదాలుపుట్టుకొచ్చాయి. మత, రాజకీయ కవిత్వోద్యమాల తరువాత ‘జెండర్’ ప్రాతిపదిగ్గాస్ర్తివాదం, కులాలు ప్రాతిపదిగ్గా దళితవాదం, బి.సి వాదం, మైనారిటీ వాదం, అస్తిత్వవాదం; ప్రాంతీయవాదం (ఏదైనా ఒక ప్రాంతపు నిర్లక్ష్యాన్ని వివక్షతనూఎత్తిచూపుతూ వ్యక్తీకరించే కవిత్వం)గా పురుడోసుకున్నాయి. ఈ వాదాలన్నీవారివారి మూలాలను తవ్వుకుంటూ వారి ఆవేదనలను, అనుభవాలను దోపిడీకి గురవుతున్నవైనాన్ని వ్యక్తీకరించుకుంటూ ముందుకొచ్చాయి. దోపిడీని నిలువరించే పోరాటపటిమను, ఆయావర్గాల్లో చైతన్యపరచే బంధన శక్తిగా సాహిత్యం రూపుదాల్చింది.దీని ఫలితంగా సొంత గొంతుకలతో, వో కొత్త చూపుతో, తిరుగుబాటు బావుటాఎగురవేస్తూ, ఆర్థిక రాజకీయ పురోగామి దిశగా పయనించే మార్గానే్వషణతో, ఆయావాదాలు ఎంతో విజయాన్ని సాధించాయనే చెప్పవచ్చు. దోపిడిని నిలువరించేప్రతిఘటనా కంచెలు నాటాయనే ఊహించవచ్చు. సామాజిక నూతన మలుపులకు ఈ వాదాలుదోహదపడినాయనడంలో సందేహం లేదు. తొలిదొల్తగా వాదాల్లో పుట్టిన కవుల నిబద్ధత, నిజాయితీ, సంఘటిత శక్తి, ప్రతిఘటనా పటిమ, సృజనాత్మకత, విస్తృతి, గొప్పకళాభివ్యక్తితో కూడుకొని ఎంతో నిజాయితీగా పరిఢవిల్లిందనే చెప్పొచ్చు.రానురాను ఈ స్ఫూర్తి అన్ని వాదాల్లోను మసకబారుతూ, వ్యక్తిస్వార్థం మూసలోకిజారుతూ, కుహనా మేధావి వర్గాల స్వార్థపరత్వానికి తాళంవేస్తూ, సాగిపోతున్నతీరును ఆయా వర్గాల కవులు, రచయితలు గమనించి పునర్ మూల్యాంకనం చేసుకోవలసినఅవసరం ఎంతైనావుంది. వర్ణాగ్రహాలు, జెండర్ ఆగ్రహాలు ధర్మాగ్రహంగా కనిపించడంలేదు. అరిగిపోయిన పాత రికార్డును తిరిగి తిరిగి గరగరల మధ్యవినిపించినట్లుగానే వుంటుంది. అధిక్షేప ధోరణిలో కొత్తదనం కనిపించడం లేదు.కొత్తకోణం వినిపించడం లేదు. గత 20 సంవత్సరాల ముచ్చట్లే తిప్పితిప్పిరాస్తూ, కలాలను అరగదీస్తూ కులాల పోరు రెచ్చగొట్టినట్టుగా లింగ భేదాలనుపడకటింటి సుఖాలకు ముడివెడుతూ దాడులు మొదలెడుతూ బతకమనే సూచనలే బహుళంగాకనిపిస్తున్నాయి. నేటి సమాజంలో కాలానుక్రమంగా ఉద్భవిస్తున్న సరికొత్తసమస్యలను, అవి ఏ విధంగా వర్ణాల్లో వర్గాల్లో విషాన్ని విరజిమ్ముతున్నదీ, మనుషులు పరారుూకరణ ఏవిధంగా చెందుతుంది పసికట్టే లోతుల్లోకి కవులు, రచయితలువెళ్లడం లేదు. వస్తువులు దర్శించే కోణాల్లో ఇసుమంత మార్పులేదు. దానివిస్ఫోటనంలో విచ్చుకుంటున్న పాప పంకిల కోణాల్ని పట్టుకోవడం లేదు. శ్రమదోపిడిని గూర్చి ఎక్కువగా కవులు, రచయితలు మాట్లాడుతుంటారు. ప్రపంచీకరణఫలితంగా, కార్పొరేట్ వ్యవస్థల వాణిజ్య విధానాల దోపిడికి అనుగుణ్యంగాఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాల ప్రసారాల ఫలితంగా తరతమ భేదంలేకుండాఅన్నివర్గాల్లోకి ప్రవహించిన బూర్జువా భావజాలాన్ని, దోపిడీ తత్వాన్నిపెత్తందారీ విధానాన్ని నిజాయితీ లేమినీ, సాహిత్యవర్గాల్లో ఈదులాడే కవులు, రచయితలు పసిగట్టలేకపోతున్నారు. వీరంతా ఆయావర్గాల్లో కమిటెడ్ కవులుగానేమిగిలిపోతూ మనిషిలోకి దూరుతున్న దుష్ట్భావజాలాన్ని ఖండించలేకపోతున్నారు.కొత్త కలలు కనాలనే తెగింపుతో, పాత కలల అపోహలకు అడ్డుకట్టలువేయలేకపోతున్నారు. ఏనాటినుండో అరిగిపోయిన విరిగిపోయిన శిథిలావస్థలో వున్నభావజాలానికి తానతందాన అంటున్నారు. ఏ కవితా వాదంలో అనంతానే్వషణకు తెరలేపారు? పునర్ మూల్యాంకనం గూర్చి చర్చలు జరిపారు? నిర్ణయాలు తీసుకున్న దాఖలాలుఏవైనావున్నాయా? ఒక్కసారి కవులు, రచయితలు ఆలోచించాలి. ఈ వాదాలు పుట్టినప్పటిసామాజిక పరిస్థితులు వేరు. ఇప్పటి సామాజిక పరిస్థితులు వేరు. కుల వృత్తులునశించిపోయాయి. కులాలకు అడ్డుగా గీయబడిన లక్ష్మణరేఖలు చెరిగిపోయాయి.అంటరానితనం దాదాపు అంతరించిపోయిందనే చెప్పొచ్చు. అయితే కులాలు, మతాల మధ్యమాత్రం సజీవంగా ఆర్థికపరంగా అన్నీవున్నాయ్ అనడం సర్వసత్యం. ప్రతి మనిషిలోనూఓ వేటగాడు మాటువేసి వున్నాడు. ఆర్థిక వేటకు విల్లంబులుఎక్కుబెట్టేవున్నాడు. ఎవడి పరిధిలో ఎవడి స్తోమతను బట్టివాడు దోపిడీకిసిద్ధపడుతూనే వున్నాడు. ప్రభుత్వాలు పెట్టే ప్రలోభాలకు అనుగుణ్యంగాప్రభుత్వ నిధులను దోచుకోడానికి సంసిద్ధవౌతూనే వున్నారు. ఈ జ్ఞానంఎక్కడనుంచి ఇంపోర్టవుతుందో, పై ప్రలోభాలకు నోళ్ళు తెరచుకొని అట్టడుగువర్గాలు దోపిడీదార్ల కొమ్ము ఎందుకు కాస్తున్నారో, ఇసుమంత ఆలోచించాల్సినఅవసరం లేదంటారా? ప్రశే్న మేనిఫెస్టోగా, ధిక్కారమే ఆయుధంగా, వర్గ చైతన్యమేసాహిత్య వాహికగా నమ్మిన కవులు, రచయితలు వారు సాగిస్తున్న లోతైన కృషి ఏమిటి? వారి సరికొత్త తీర్పు ఏమిటి? కుల వృత్తుల్లో మూలాలైన వారింకామనగలుగుతున్నారా? ప్రతి కులానికీ ప్రతీకలుగా చెప్పుకునే వస్తువులు వారికులాల చేతుల్లో ఈనాటికి పదిలంగా వున్నాయా? వాదాల్లో కరగి రాస్తున్న కవులు, రచయితలు ఆలోచిస్తున్నారా? సంప్రదాయవాదాన్ని తెగడడం మొదలెట్టిన సాహిత్యంలో వివిధ వాదాల వారంతావారివారి వాదాల్ని చైతన్యవంతంచేసి జనంలో ‘‘అవేర్‌నెస్’’తెచ్చి, కొన్నిపోరాటాల్లో సామాజిక ప్రతిఘటనల్లో నెగ్గుకొచ్చిన తరువాత వారు రేకెత్తించినవాదాల్ని మరచిపోయి, వారే నయా బ్రాహ్మణవాదులుగా మారిపోవడం ఎంతటిదురదృష్టకరం. వారి అవకాశవాద ధోరణులను ఎంతవరకు ఎండగట్టడం జరుగుతుంది? సాహిత్యాన్ని వ్యాపారం చేయడం, అధికారానికి తాకట్టుపెట్టడం ధనానికిదాసోహమనడం, పాలకవర్గ రాజకీయపు వలల్లో చిక్కుకోవడమేకాకుండా సంబంధిత వాదాన్నిమోస్తున్నట్లే కవిత్వం రాయడం, జనాన్ని నమ్మించ ప్రయత్నించడం ఒక జాతికిచేస్తున్న ద్రోహంకాదా? జెండర్, కులమత ప్రాతిపదికమీద ఏర్పడ్డ సాహిత్య ముఠాలన్నీ కవిత్వపు కమతాలైవారిని వారు అభినందించుకుంటూ ప్రజలకు లేని ప్రత్యేక సంస్కృతి తమకు ఉన్నదనేగుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. వ్యవస్థీకృత నీతికి తిలోదకాలిచ్చిఅస్తిత్వవాదులంతా ఎవరి నీతిని వారు ఏర్పాటుచేసుకుంటూ మనిషి అసలుసారాంశాన్ని విస్మరిస్తుంటారు. నిబద్ధత లేని స్వేచ్ఛను కోరుకుంటుంటారు.అట్లే ప్రాంతీయవాదులు ప్రాంతీయంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోరడంకంటేప్రాంతీయ విభజనను రాజకీయ పోరాటంగా భావిస్తుంటారు. ప్రజల ఇష్టాయష్టాలువారికి పట్టవు. ప్రాంతీయవాదాన్ని ఉద్యమరూపంలోకి తెచ్చి జనాల్లో ఆశలురగిల్చే సాహిత్యం సృష్టిస్తుంటారు. వారు కోరుకున్న ఆశించిన స్వఫలితాలుప్రభుత్వపరంగా దక్కితే ఉద్యమం నీరుగార్చి పారిపోతుంటారు. చివరిదాకా నిలబడిఉద్యమాన్ని నిలబెట్టే శ్రమ, పట్టుదల ఈ వాదాల్లో అంతగా కనిపించదు. అందుకేఅనేకసార్లు ప్రాంతీయ వాదాలు పాలపొంగులా ఎగసి అంతలోనే నీళ్ళు చల్లినట్లుచల్లారిపోతుంటాయి. ఉద్యమంలో మాత్రం అనె్నం పునె్నం ఎరుగని అమాయకులుబలైపోతుంటారు. వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులుదులుపుకుంటుంటుంది.
ఏ సాహిత్యవాదమైనా మారే కాలంతోపాటు మార్పును ఆహ్వానించాల్సిందే. వేదాల్లాగావాదాలు పూజింపబడతాయనే వాదం సరికాదు. నీరుగార్చే ఉద్యమాల్నిత్రోసిపుచ్చినట్లే నిలకడ లేని వాదాలనుకూడ త్రోసిపుచ్చే దశ వస్తుంది.సాహిత్య వాదాల్లోకి మతం, రాజకీయం ప్రవేశించి యదార్థాల కళ్ళుగప్పి వ్యక్తిస్వార్థం రాజ్యమేలడం సహించరానిదిగా భావించాలి.

Sunday, July 28, 2013

అప్పుడూ - ఇప్పుడూ అదే తంతు

కపిల రాంకుమార్||  అప్పుడూ-ఇప్పుడూ - అదే తంతు ||

ఆరు రుచుల ''విరోధా''నికి, ఆరంగేంట్రం
ఐదేళ్ళైనా అదే తంతు '' జయ '' కు!
ఎన్నికకు ఎంపికకు
''ఎన్నికలలో''
ఎన్ని ' కలలో ' - ఎన్ని ' కల్లలో '
ఎల్లలు దాటించడానికి
దింపుడుకళ్ళలెన్నో!
ఉంపుడు పెళ్ళాలకోసం

తంపుల గొళ్ళలెన్నో!
కల్లబొల్లి కబుర్లకు
తల్లి చెల్లి వరుసలకు
వరిపొలాల్లోంచి దౌరాను
మిరప తోటలకి తిప్పాలి
చేతులట్టుకున్నా, చేతులంటుకున్నా,
మూతులు నాకినా, తుడిచినా, తడిపినా, యిదే అదును!
కాళ్ళట్టుకోవడాలు
కళ్ళకద్దుకోవటాలు
వేళ్ళు పట్టడాలు, కాళ్ళకు బలపాలు కట్టినపుడే!
**

సాహిత్యంలో విరోధబాస - అలంకారమే కాని
విరోధిభాష వికటిస్తేనే - రసాభాస!
మొన్నటిపొత్తుల్లో పెట్టిన ముద్దుల మూతులు
నేడుగుద్దులాడబోతే పెట్టాయి బుంగమూతులు!
**
ఎగ్గుసిగ్గులేనివాళ్ళు అటు యిటూ మారుతుంటారు
కుబుసం వీడిన నాగేంద్రాల్లా
యేపుట్టలోనైనా దూరుతుంటారు!
కొత్త అంగీ దొరుకుతుందంటే - పదవికోసం
పరువును పరుపులో కలిపేస్తారు!
సతుల మార్చైనా, పర పతుల యేమార్చైనా!
కంబళిలో భోంచేస్తు వెంట్రుకలపై విసుగెందుకు
నిజాయితీలోపించిన పార్లమెంటరీ భ్రమలెందుకు?
అయినా లొంగుతాం
మాటలకు ఒంగుతాం

శీలం పోయిన తరువాత
గగ్గోలు పెడతాం!
**
ప్రజాస్వామ్య జాతరలో ఎన్ని బోనాలో
నరబలులే జరుగుతాయో
ఖరపాద పూజలే కొనసాగుతాయో
తినపోతూ రుచులెందుకూ
ఆడబోయే తీర్థాలే యెదురౌతున్నప్పుడు?
**
ప్రపంచ రంగ స్థలంలో
సంభవించే ప్రతీది కళాత్మకమే!
చావైనా, బతుకైనా
ప్రపంచీకరణ వచ్చాక ప్రతీది పోరాటమే!


_______________________________
2009 లో రాసినా.....పరిస్థితులలో స్వల్ప మార్పు.
________________________________
28.7.2013  ఉదయం 10,50

మది పిండిన ముదిగొండ

కపిల రాంకుమార్|| మదిపిండిన ముదిగొండ||
గుండె చెదరిన భావచిత్రం - యే కుంచెకూ చిక్కని రక్త ఛిద్రం!
నిద్రపట్టని రాత్రిలోన 
దిక్కుతోచక బిక్కుమన్నది పల్లె హృదయం!
గూడుకోసం - కూటి కోసం
నీడలేని జన సమూహం
ఒక్కచోట కూడినందుకు మూకుమ్మడి  ఖాండవదహనం!
అలసి పోయారు అర్జీలు పెట్టి
విసిగిపోయారు కచేర్ల తిరిగి
కదలనీ అధికార్లు - కాదు పొమ్మంటేను
గతిలేని స్థితిలోన - శిబిరాలు వేసారు.
కళ్ళుకుట్టిన కుళ్ళు సర్కారు
కర్కశంగా మారినాది,
మనుషులపై  మనషులచే చిచ్చు రగిల్చినాది!
హస్తముద్ర పాలకుల రిక్త హస్తదానం

అస్త్ర శస్త్ర వంటకాల రక్త దాహ రాజ్యం
పేదవాడు బక్కచిక్కి శల్యమవాలనీ
వాదులాడు హక్కువీడి శవమవాలనీ
ఎర్ర జెండా నీడ అంటే ప్రబుతకంత యేవగింపా
మాట తప్పే రాజ్యకాంక్షతో అణిచివేతల మోహరింపా!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు
కల్లుతాగిన కోతిమాదిరి కుప్పిగంతులేస్తూ
రెచ్చిపోయి పావురాలకుచ్చువేసిన చందం!
చచ్చేదాక జనాలను కాల్చిన యుద్ధం!
శిబిరమంతా కూల్చి, లాఠీలు, తూటాలు
పోటీపడి వీరంగమేయ తలపగిలి కొందరు
గుండాగిపోతే, చెల్లచెదరై కాళ్ళు నేలంత ఎరుపెక్కె!
అశోకుని కళింగయుద్ధం - తెచ్చిందట మహరాజులో మార్పు
ముదిగొండ చిందిన రక్తం - మార్చాలిక పాలక తత్వం!
మడమతిప్పని పోరు చేసి మడులుకట్టి పంటలేసి
బడుగు జనులశక్తి చూపగ గుడిసె జెండాలెత్తుతారు!
_______________________________
(ఖమ్మం జిల్లా ముదిగొండ కాల్పులు జూలై 28-2007 న జరిగింది)
________________________________
28.7.2013 ఉదయం 5.55

Saturday, July 27, 2013

||సాహిత్యం కర్తవ్యం || తిరునగరి ఆంజనేయులు||

కపిల రాంకుమార్||సాహిత్యం కర్తవ్యం || తిరునగరి ఆంజనేయులు||

కవిత్వానికి పరమార్థం

అందరికీ తెలియాలి దానర్థం!
ఎందుకు భాషా భేషజాల దారుఢ్యం?
అవి లేకుంటే పెట్టాలా కవితకు శార్థం!
మాట భావాలను నడిపేబాట
ఆ బాటే కంటకావృతమైతే
ఆ మాటే యినుపగుగ్గిళ్ళపాకమైతే
కవిత కంచెకు - చైతన్యం యింటికి
సామాజిక చైతన్యానికీ
సాహిత్యం సహకరించాలి!
సామాన్యునికందుబాటుగా
సాహిత్యం వికసించాలి!
నీ ముక్కేదంటే మెడచుట్టి చూపినట్టు
భావాల్ను ఉక్కుసంకెళ్ళతో బంధించి
పడికట్టు పదాడాంబరాలతో
దట్టించిందేనా గట్టి కవిత్వం?
ఆనాటి రాజస్థానాల్లో
కవి ఘంటాసురుల పరుగు పందాల్లో
ఒకరిని మించి వకరు
కవి గండభేరుండాలై
శృంగార మొలికె కావ్యాలను
సొంగలు కార్చే రసవిరాట్టుల మెప్పుకై
పచ్చింబూతుని పాండిత్యంతొ పొదివి
ప్రబంధాల కావ్యనాయికల
బరితెగింఫు విరహ వేదనలను
బట్టలు విప్పి బజారు కీడ్చి
ప్రభూలతో గజారోహణలు
పండితులతో గండపెండేరాలు
అందుకున్న అంధకారయుగమది!
పాండిత్యం వండపాషాణమై
కవిదిగ్గజాల సమరాంగణమై
మేకతోకలౌ, పద వియాసాల సల్లాపమై
వినోద ప్రక్రియల విలాపమై
పిచ్చి ముదిరిం పచ్చి శృంగారంతో
పెచ్చరిల్లిన చీకటి వ్యవస్థ అది!
నేడిది ప్రజాయుగం!
తరతరాలుగాముసిరిన
తిమిరముపై జనశక్తులు
సమరము సాగించేందుకు
సమాయాత్తమైన యుగం!
తమ తమ జీవన సరళిని
సమతా మమతలు విరియిగ
సర్వజనులు కదం తొక్కి
సమరం సాగించేందుకు
చైతన్య స్ఫూర్తినిడుటే
సాహిత్యం కర్తవ్యం!
అదేనేటి కవిత్వానికర్థం-పరమార్థం
_________________________________
- నూరు అలల హోరు - ప్రజాసాహితి కవితల నుండి.ఆగస్టు 1999
_________________________________
27.7.2013 - ఉదయం 10.05

|| మౌన ఘోష - ఎ. సోమసుందర్ ||

కపిల రాంకుమార్|| మౌన ఘోష - ఎ. సోమసుందర్ ||
ఆకలి వేస్తోందమ్మా! అన్నంపెట్టమ్మా!
స్వర్ణారుణానవ్యశ్యామలమగు
ఈ జగతిని, దరిద్రమున
ఆకలితో చావలేను!
ఆశా సుమమాలా
సౌరభమిది వీడలేను
ఆకలి!అమ్మా! ఆకలి!!
అన్నపూరణ గర్భగుడిని
ఆకలిగంటలు మ్రోగెను;
ఆరని ఆకలి కీలలు
భైరవ నాట్యం చేసెను;
ఘోరపరాజయమా ఇది?
మానవ మారణహోమం!
తల్లీ! ఆకలి....!ఆకలి...!!
ఆకలి నాగుల నాలుక
అగ్ని జ్వాలలనెగజిమ్ముతోంది!
అమ్మా....!ఆకలి!ఆకలి!
నా కడుపొక బడబానలమై
మండుతోంది తల్లీ...!
లోకం నరహంతక కంటకముల
కావృతమై ఘాండ్రిస్తోంది!
లోకం పరాన్నభుక్కుల చేతులలో
పరాధీమమై విలపిస్తోంది!
తల్లీ! ఆకలి...!ఆకలి...!
నాలో చెలరేగిన
ఆకలికంతిమ ఆశ్వాసం ఎచటో?
తుది మజిలీ ఎపుడో?
పేదల నిర్భాగ్యుల రక్తంతో
స్మశానాలు శాసనాల వ్రాస్తున్నాయవిగో...
అమ్మా! ఆకలి...!ఆకలి....!
నాలో, నరాలలో,
లోపలి గడియారం తలుపులు
ఘడియ పడిందెపుడో...!
ఆ కలి, నన్నీలోకంనుంచిచెడబాపులు
చేసేందుకు చూస్తున్నది!
అమ్మా...చావలేను; చావలేను!!
నరులందరికీ
సరిపోయే సిరిసంపదలతో
తులతూగే ఈ దేశం నాదమ్మా!
తల్లీ విడువలేను
నా, యీ, అందమైన లోక!
అమ్మా! ఆకలి...! ఆకలి....!
________________
సిందూరం వచన కవితా సంకలనం - యువభారతి ప్రచురణ
__________________
26.7.2013 రాత్రి 8.19

|| తప్పదు - ఆరుద్ర కవిత||

కపిల రాంకుమార్|| తప్పదు - ఆరుద్ర కవిత||

అల్లిన కథలాగ
అట్టమీద బొమ్మలాగ
మల్లెపూల దండలాగ
మనోజ్ఞంగా
చల్లగాలి లాగ సేదతీరుస్తూ
ఎల్లాగూవుండదుకదా జీవితం!~
పాటూపడక తప్పదు!
పరితపించక తప్పదు!
రెక్కలమ్మికొన్నా
దొక్క నిండదని
ఎక్కడ పరిచిన గొంగళీ
అక్కడే వుంటుందని
తిట్టుకుంటూ
నిట్టూరుస్తూ
మట్టికొట్టుకొంటూ
మళ్ళా మళ్ళా మళ్ళా
కష్టపడుతూనేవుంటావుకదా!
ఇంకొంచెం కష్టపడు
ఈ సారి నీకోసమే కాదు
నీ లాంటివాళ్ళందరికోసం
నీలాగ,
నీకోసం వాళ్ళూ పాటుపడితే
అల్లిన కథలాగ,
అట్టమీద బొమ్మలాగ
చల్లగా సొగసుగా
రేపు వుండకేం చేస్తుంది?
_____________________________________________________
(సిందూరం వచన కవితా సంపుటి నుండి - యువభారతి ప్రచురణ )
_____________________________________________________
16.7.2013 సాయంత్రం 6.40

Wednesday, July 24, 2013

జి.పురుషోత్తం - వాగ్దానభంగం - కవిత||

కపిల రాంకుమార్|| జి.పురుషోత్తం - వాగ్దానభంగం - కవిత||

చేసే వాగ్దానాలకు
చెవుతప్ప మనస్సుండదు
మనస్సు చేసేవానికి
మనిషియొక్క అండవుండదు
అండ వున్నవానికేమో
అమలు జరిపే అధికారముండదు
అమలు జరుపు వానికేమో
అధిష్టానం అనుమతుండదు
అధిష్టానం అనుమతి వుంటే
ప్రతిపక్షం ఒప్పుకోదు
ప్రతిపక్షం ఒప్పుకుంటే
న్యాయస్థానం నిలిపేస్తుంది.

(ప్రపంచకవిత్వంతో ఒక సాయంత్రం ..నుండి)
24.7.2013 ఉదయం 9.55

శ్రీరంగం నారాయణబాబు - కిటికిలో దీపం||

కపిల రాంకుమార్|| శ్రీరంగం నారాయణబాబు - కిటికిలో దీపం||
జితేంద్రియుని బుద్ధిలాగు
జేగంటలాగు - కిటికిలో దీపం!
గోడివతల గదిలోపల
పేరుకున్నకాంతి
గోడవతల చీకటి!
హృదయంలో ఒకటి రెండు
వెలుతురు గాయాలు
స్వర్గం - నరకం
చావు - బ్రతుకు
గొప్ప - బీద
వ్యత్యాసం - తెలివితక్కువ
చదువెక్కువ - తారతమ్యం!
జీవహింస
చేయనని, చూడనని
నా శపథం!
గోడమీద, గదిలోపల
వెలుతురు కాశించి
చేరిన జీవుల ఆకలితో
భక్షించే బల్లి!పక్కలో పాలు త్రాగు
పసిపిల్లడు
ఉక్కిరిబిక్కిరైనట్లు
గొప్పగాలి రేగింది!
గోడవతల చీకటి నవ్వింది!
కటికిలో దీపం
కంపించి ఉపెత్తిన వెర్రి పీరులా
సాగి సాగి తెగిపోయిన
రబ్బరుముక్కై తెగటారెను!
ఇప్పుడో
కిటికీలో
గోడివతల
గోడవతల
గదిలోపల
ఓకటే చీకటి
జీవ రహస్యం!
(పే.56-సిందూరం-యువభారతి ప్రచురణ రెండవ ముద్రణ నుండి ఆగష్ట్ 1978)
24.7.2013 ఉదయం 10.15

Monday, July 22, 2013

నిదురెట్ట పోతావు తమ్ముడా?**||

కపిల రాంకుమార్|| నిదురెట్ట పోతావు తమ్ముడా?**||

పాపికొండల నడుమ - గోదారి అందాలు
రేపొ మాపొ మాయమౌతావుంటే
నిదురెట్టపోతావు తమ్ముడా?
యెదురెళ్ళి ''కట్టడాల'' నాపరా?
గిరికోనల - గిరికూనల
సంబరాల రేల సమసిపోనీకు
అడివిలో రామ్ముణ్ణి ఆదరించిన శబరి
ఆనవాళ్ళనంతరించనీకు!
వనవాటిక సౌందర్యం కాపాడుట మన లక్ష్యం
పాలకుల ఆంతర్యం అమిత గర్హనీయం
మానవుని మనుగడకు మచ్చతెచ్చు పనులాపు
కోయల గోండుల పరిసరాలు కాపాడు
విల్లంబులు విప్ప పూలు జుంటితేనె కొమ్ముబూర
లేజింకల పరుగుల్లు వాగువంక పరవళ్ళు
ప్రకృతిని తుంచి సంస్కృతిని చంపి
పునాదిని సమాధిఉకి బదిలిచేయొద్దు!
ఖ్యాతి నశించితే ప్రోది చేయగలము!
జాతి నశించితే అనాథలమే మనము!
గుళ్ళు గోపురాలే కాదు,
ఊళ్ళకాపురాలు కూలు!
వేరు మార్గమేమి లేదు,
పోరుబాటె శరణము!
ఇంతమంది జనం యెలుగత్తి వస్తుంటె
జాగెందుకు - జాలెందుకు
తిరుగుబాటు చేసేందుకు?
తరతరాల వారసత్వపు జనపదాల సవ్వడులు
పరువు పరువున పరువులో పడకుండ
కలకాలం వెన్నంటి కదనదారి పట్టరా!
నిలువెత్తు సాక్ష్యాలు నీటపడకుండ
దీటైన మార్గాలు అనుసరించకుంటె
నిదురెట్టపోతావు తమ్ముడా!
యెదురెళ్ళి కట్టడాల నాపరా!

_________________________________
(**రచనాకాలం 15.12.2005 - '' జీవన్మరణం '' (పోలవరం సమస్య పై ఖమ్మం సాహితీ స్రవంతి కవుల ఐక్య స్పందన యాత్రానుభవంతో) ప్రచురణ.
_________________________________+
22.7.2013

Sunday, July 21, 2013

అలిశెట్టి ప్రభాకర్ - కవిత/గుండె గుండెకీ మధ్య |

కపిల రాంకుమార్|| అలిశెట్టి ప్రభాకర్ - కవిత/గుండె గుండెకీ మధ్య ||

పిడికెడు మట్టిని
మైదానం చెయ్యగలిగిన వాన్ని
పిడిబాకుని
కరవాలంగా మార్చలేనా?
అనంతాకాశ క్షేత్రంలో
అక్షరాన్ని
సూర్యబింబంగా నాటగలిగిన వాన్ని
ఒక పోరాటకెరటాన్ని
యుద్ధనౌకగా తీర్చిదిద్దలేనా?
చిందించిన నెత్తుటితో
చీకటి కోణాలన్నీ వెలిగించగల
యోధున్ని
గుండే గుండెకీ మధ్య
విప్లవ వారధుల్ని
నిర్మించలేనా?

(అనారోగ్యంతో 3,1,1993 అమరు డైనాడు)
_____________________________
కవిత్వంపై ఎర్రజెండా..(1980-94).సంకలనంలో పేజి 34-విరసం ప్రచురణ మార్చి 1995
_______________________________
21.7.2013 ఉదయం 11.22

జ్ఞానేశ్వర్ కీర్తి - కవిత

కపిల రాంకుమార్|| జ్ఞానేశ్వర్  కీర్తి - కవిత ||
కింద బండా
మీద బండా
కరుగుతూన్నది మా కండ
డొక్కలు కట్టుక
గుడిసెకు వస్తే
కుండల కిందా
లేదుర మంట!                                                //కింద//

తట్టకూలి పారకానీ
కోడికూసే జాముపోతే
మిల్లరు కలిపిన మాలైపోతిమి
ఒల్లంతా పుండ్లయిపాయె                                  //కింద//
ఇల్లనకా, పిల్లనకా
రోహం నొప్పులు యేమనకా
పాడిపంటలుంపండిస్తే
మేం చేసిన కష్టం దొర యింటా                        //కింద//

బీటు బజార్లో
లోడులు దింపి
గోదామ్ముల్లో ధాన్యం నింపి
హమాలి పనితో వొంగిపోతిమి
గొంతులో మెతుకుకు
కరువైపోతిమి                                             //కింద//

కాలాలు మారబట్టే
మేడలు మిద్దెలు పెరగబట్టే
సర్కార్లూ మారబట్టే
పెట్టుబళ్ళూ పెరగబట్టె
మా బ్రతుకింకేమోగాని
ఎప్పటి చిప్ప అంగట్లే                                   //కింద//
కుప్పలు మేసే
పందికొక్కులకు
కత్తులబోనులు
తప్పవులే                                               //కింద//

8.2.1980 హనుమకొండలో గుండాలచే సజీవ దహన చేయబడినాడు.
మరణ వాజ్ఞ్మూలం  '' నేను రచయితను. విప్లవరచయితల సంఘంలో సభ్యుడను.  అక్రమాలను, అన్యాయాలను,దోపిడీలను, దౌర్జన్యాలను ప్రజలకు తెలియచెపుతూ కవితలు, కథలు, నాటికలు, నాటకాలు, నాలలు రాస్తాము. వీలైనంత వరకు ప్రతిఘటిస్తాము. అలాగే నేను, కొండయ్యయొక్క శరత్ ప్రభుత్వామోదిత ఉన్నతపఠశాల బోర్డు వెనక జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను దోపిడీ, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తూ వస్తున్నాను. అతడు సాగిస్తున్న వ్యాపారానికి నేను అడ్డంకిగవున్నను. అందుకే నన్ను శాశ్వతంగా నిర్మూలించాలనుకున్నాడు.  ఆ ప్రయత్నంలో భాగంగానే నేను నిద్రిస్తున్న సమయం చూసి, పెట్రో, గ్యాస్నూనె పోసి నిప్పంటించాదు, కొండయ్య, దామోదర్ కలిసి ''
______________________________
కవిత్వంపై ఎర్రజెండా..(1980-94).సంకలనంలో పేజి 3-5. విరసం ప్రచురణ మార్చి 1995
_______________________________
21.7.2013 ఉదయం 10.20







Saturday, July 20, 2013

| కుందుర్తి -( నాలోని నాదాలు) -మహతి

కపిల రాంకుమార్|| కుందుర్తి  -( నాలోని నాదాలు) -మహతి ||
ప్రతి మనిషి తనలో  తాను తీరిక చీకినప్పుడల్ల యేదో గొణుక్కుంటూనేవుంటాడు.. కవిత్వమొ, సంగీతమో, చిత్రలేఖనమో యేదో ఒకటి పైకి పెల్లుబికి వస్తుంది
**
చందస్సువంటి కట్టుబాట్లను తెంచేసుకున్నవారికి మళ్ళీ శైలికోసం పెనుగులాట యెందుకని వెంటనే ప్రశ్న వేస్తారు. కట్టుబాట్లను తెంచినది కేవలం తెంచడంకోసమే కాదు; మరొక పరమ ప్రయోజనం కట్టుబాట్లు సాధించడానికి , అందుకే ఆధునిక వచన గేయ కవిత్వంత్లో ఇటీవల ఒకానొక లయకు ప్రాధాన్యం యేర్పడింది. తాళ్ళపాకవారి వచనాల్కూ ఈ నాటి ఫ్రీవర్స్ కవితా రచనలోని నడకకూ చాల బేధంవుంది.  శబ్దానికి గాని, భావానికి గాని,  ఆ నాటి వచనాలలోని లయ వచనపు లయ. వచన గేయంలోని లయ కవిత్వపు లయ. ఈ రెంటికీ మధ్య సరిహద్దు కేవలం బుద్ధికి మాత్రమే తోచే స్వభావం కలది.
**
అంత్యప్రాస యెక్కువగా వాడిన ఆధునిక కవుల్లో  నేను ఒక్కణ్ణేనని కొందరు విమర్శకులన్నారు. ఈ లయ సాధించే కృషిలోనే నేనీపని నాకు తెలియకుండానే చేస్తున్నాననుకుంటాను. ఒకానొకప్పుడు నన్ను చూచి నేనే నవ్వుకుంటాను కూడ. ' అంతటి విప్లవం తెచ్చి అంత్యప్రాసలకు లొంగానని విహంగం వెక్కిరించింది ''. కాని యీ అంత్యప్రాస ప్రయత్నపూర్వకమా లేక సహజమా అని పాఠకుడు ఆలోచించే అవకాశం కూడ యివ్వ్నంత సహజంగావుండి దానికి తోడు భావ తీవ్రత కొట్టవచ్చినట్లుండే యీ అంత్యప్రాసల వల్ల అంత ప్రమాదం లేదనే నేననుకుంటాను.
**
ప్రస్తుతం మనకు అవసరంలేదు కాని  వచన గేయపు పంక్తి యెక్కడ, యెందుకు అంతం కావాలి అనే విషయంలో కూడ నిర్మాణాత్మక వైఖరి అవలంబించటం అవసరమని నేననుకుంటాను. అయితే చిన్న చిన్న విషయాలన్నీ కలిపి యింకో కొత్త చందో మార్గమైతే? కానివ్వండి అది వెర్రితలలు వేసిననాటికి దానిమీదా మరో విప్లవం అస్తుంది. అంతే కాని, భ్యంచేత, కావాలని, వచ్చిన లయలను వదిల్?ఏయటం, పంక్తిని యిష్టనిష్టాలను బట్టి విరవడం. అర్థంలేనిచోట ముగించడం మాత్రం అనవసరం! కాగావచన గేయమైన విశృంఖలం విహారం చేయరాదనీ, దాని నడకలోనూ ఓక లయ, పంక్తిలో ఒక నిర్మాణపద్ధతీ వుండాలని
సారాంశం. ఈపంక్తి  నిర్మాణ పద్ధతులు ఆయా కవుల యిష్టానిష్టాలనుబట్టి శతాధికంగావుండవచ్చు. స్థూలంగా ఒక నియమం అనేది మాత్రం వుండాలి.
**




|| నాలోని నాదాలు - కుందుర్తి ||

1.ఒకటి (వరుసలో కూడ)

ఈగ దూరను సందులేదు
ఇది అడివి
భూలోక మంతా కలసి జానెడు నిడివి
నాలోకి నేను వెడతాను!

జీవితం అన్వయం కుదరదు
అంతా అచ్చు తప్పు
అందం ఆకారంలేని పూరు ముడువని కొప్పు
ఊహల దండలు కడతాను

ఆత్మలోనే ఆనందం వుంది
అది విపంచి
తాకితే పలికే ధ్వనులు తలచి తల పంకించి
నాలోని నాదాలకు ఉలికి పడతాను
(పేజి. 1)

2. పదమూడు (వరసలో)

వంద చెప్పు, వెయ్యి చెప్పు
లక్షల్లో ఒకడుంటాదు
కవిత్వం చదివే వాడు!
వందిమాగధులు మిగతా వాళ్ళు;
పేజీలు తిరగేసి చూచి
ప్రయోజనార్థులు పొగుడుతారు!
గుండెలు ముక్కలుగా కోసి వండిన వంటకం గనుక
నీ కవిత, నీకు గొప్ప!
ఈ పూట చెప్పినమాట మాపటికి మార్చేవాడికి
పొగడిక బ్రతుకుదెరువు తెప్ప!
కవిత్వం రాస్తే సరా?
నేడు ప్రచారమే పెద్ద పని!
అనుకూల సమీక్షలకోసం అడ్డమైన అగచాట్లు!
పండితాభిప్రాయాల కొరకు
ప్రతి ఊరు తిరిగే రచయిత పడే యాతన దేవుడికెరుక!
కవిత్వం వినేవాడికి,
చదివేవాడు లోకువ!
సభలో యీలలు, గోలలు
సాగదీసి సంగీతం శ్రావ్యంగా వినిపించే వాడికి
పుష్కలంగా పూల మాలలు!
కావ్యానికి ప్రతిఫలం మహా వస్తే వంద!
కాగితం, ముద్రణ ఖర్చు తప్పదు
న్యాయంగా తనవంతు తీసికొని మిగిలింది వదలడానికి
ప్రచురణకర్తకు మనసొప్పదు!
(పేజీ 17)

3. ఇరవై మూడు ( వరుసలో)

నడుస్తున్న చరిత్ర కొప్పులో
ఉద్యమాల విరజాజులు
ముడుస్తుంది ప్రజావాణి!
ప్రాకే పరిమళాలవంటి మార్పుల్ని గ్రహిస్తుంది
కాలం విప్లవపాణి!

ఉదయిస్తున్న ఉర్వి యాత్రను
ఆపలేదు పోకిరి మంచు
చప్పుడు ఎంత చేసినా, మేలిమి విలువ
సాధించలేదు కంచు!

కాల స్వభావం గుర్తించి , గతం విస్మరిస్తే
వర్తమానం మన పొత్తు
ఈనాటి అనుభవాల యినుపగుగ్గిళ్ళు సేవించి
నిర్మిద్దాం విశాల భవిష్యత్తు!

అచలాన్ని నేను కదిలిస్తాను
అందుకే ప్రతిసారి వజ్రంలా పదునెక్కిన పాట
అమృతాన్ని నేను గౌరవిస్తాను;
అందుకే పక్షిలాగ ఎగిరే
స్వేచ్ఛా స్వాతంత్ర్యాల బాట
వడివడిగా నడుస్తోంది చరిత్ర,
ఒంటరినై పోతాను బద్ధకించి వెనుకబడితే
హృదయంతో ఆహ్వానిస్తాను,
ఎదురేగి స్వాగతిస్తాను,
ఈలోగా మరో ఉద్యమం పుడితే!
(పేజి. 39)

సం|| కుందుర్తి
ఫ్రీవర్స్ ఫ్రంట్
హైదరాబాద్
15.12.1967
మొత్తం ముప్పై నాలుగు కవితలు ''నాలోని నాదాలు'' లోవున్నాయి. డిసెంబరు 1967 సుపర్ణ ప్రచురణలు -4 (ముఖ చిత్రం శిలా వీర్రాజు) అప్పట్లో వెల 1.50/-
___________________________
నోట్: స్థలాభావం దృష్ట్యా ముఖ్యమైన అంశాలనే యెత్తి చూపాను.

Friday, July 19, 2013

ఎన్నికల కల

కపిల రాంకుమార్|| ఎన్నికల కల ||
**
పార్టీ మారినా నాకు సీటు ఖాయం
సొంత పార్టీలో నీకు వెన్ను పోటు నికరం!
**
రంగుల చక్రంగా
ఎన్నీకల రంగం
ఓటేసే యంత్రం
తేల్చునంతరంగం!
**
మాజీలకు గుబులు - తాజాలకు వగలు
మిత్రులకు పగలు - శత్రువులకు సెగలు
వాడి వేడి మాటలు - ఆచితూచి పావులు
పొత్తులలో జిత్తులు - ఎత్తుల గమత్తులు!
**
పెద్దకోడలికి - అడ్డు గోడకి రాపిడెక్కువ - నాడు
అధినేతలకి, అధిష్టానానికి తలనొప్పి - నేడు!
**
చొక్కాలు మార్చేటాప్పుడు
పార్టీ సిద్ధాంతాలెందుకు?
నిబద్ధత నిమగ్నత లేనపుడు
ప్రోపర్టీ రాద్ధాంతాలెందుకు?
**
మాజీలందరు
పార్టీలకు అల్లుళ్ళా ?
అలిగినప్పుడల్లా
వేరేపార్టీకి దూక్కుళ్ళా!
**
తల్లి - తండ్రి - అన్న - తమ్ముడు
భార్య - భర్త - మామ - కోడలు
ఒకరికొకరు పోటాపోటీ
తిట్టిన తిట్టు తట్టకుండ
ఒట్టుతీసి గట్టుమీదెట్టి
మన వారు గెలిస్తే చాలు
మనకింక ఢోక్క వుండదు!
**
నామినేషన్‌ స్థాయిలోనే
యిన్ని ఘర్షణలా
తీరా ఎన్నికల నాటికి
యింకెన్ని రక్తవర్షాలో
**
నిర్వచనాలకు అంతు చిక్కని
నేటిపొత్తులు
నిత్రుల పర్పరాగ సంపర్కంలో
కుక్కమూతి పిందెలు!
**
ప్రధాన శత్రువునోడించటానికి
కలసివచ్చే దెవరు?
శత్రువే మారినపుడు
సైద్ధాంతిక మొక్కుబడులెందుకు?
**
ఏ పార్టీ వారు అతీతులుకారు
ఏ పాటి తేడాలు సహించలేరు
నోటిమాటలే కదా మొత్తానికి కారు చౌక
బూతులు పండితేనే కదా చిత్రాలకు  వంద నడక
అందుకే అందుకున్నారు
పంచాంగపు జలతారు!
దుమ్మెత్తిపోసే అవధానులు
ఉమ్మేసినా సహించే వదాన్యులు!
19.7.2013 ....
***

Thursday, July 18, 2013

జిప్సీలు - సంచార జాతులు

కపిల రాంకుమార్|| జిప్సీలు ( సంచార జాతులు)- ఎం. ఆదినారాయణ ||
పుస్తకాన్ని పరిచయ వాక్యాలు ఆదినారాయణ గారి ' ప్రయాణాల పక్షి ' పేరుతో యిలా రాశారు.
పాటలు పాడుకుంటూ, కథలు చెప్పుకుంటూ, బొమ్మలాటలు చూపుతూ, పల్లెటూళ్ళు తిరిగుతూ, పొట్టపోసుకునే జానపద కళాకారులు, భిక్షుక గాయకౌల గురించి కొద్దో గొప్పో అందరికి తెలిసేవుంటుంది. గ్రామాల్లో పుట్టి పెరిగిన వార్కీతే ఆ సంచార జీవులతోటి ఒక విధమైన అనుబంఢం కూడ యేర్పడేవుంటుంది. ప్రతి సంవత్సరం విధిగా అదేకాలంలో ఆయా ప్రాంతాలకు వస్తారు కాబట్టి.
ఊరి బయట పొలాల్లోనూ, విశాలమైన పచ్చిక మైదనాల్లోనూ పశువుల్ని, మేకల్ని, గొర్రెల్ని తిప్పుకునే కాపరులగురించి కూడ మనకి తెలుసు. పొలాల్లోకి వెళ్ళినపుడు మెడ యెత్తకుండ, తోకలు ఊపుకుంటూ గడ్డిమేస్తున్న పశువుల్ని చూసి యెంతో సరదాపడివుంటాం. పరుగెత్తే ఒక మేకపిల్ల వెంటబడి దాన్ని వాటేసుకుని ముద్దు చేసివుంటాం. గొడ్లకాడ పిల్లలు హాయిగా యెగురుతూ ఆటలాడుకుంటుంటే వారితొ పాటుగా వుండిపోవాలనిపిస్తుంది మనకి.

జానపద కళాకరుల వెంట గ్రామాలు తిరుగుదామని, పసులకాపరులతో పాటుగా ప్రకృతిలోకి ప్రయాణం చేద్దమనే ఆలోచనలు  నా మంస్తత్వం వీద బాగా పనిచేశాయి. అలాంటి భావాలు నా జీవిత మార్గాన్ని మార్చివేస్తున్నా, ' నా కలలోని ప్రయాణాలను నిజం చేసుకుంటున్నాను కదా ' అనే సరదాల సెలయేతిలీ యీదులాడుతుండేవాడిని.
నిజమైన ఆనందం, సౌందర్యం తిరిగటంలోనే ఉందని తెలుసుకున్నాక, ప్రకృతి అరచేతిమీద లాబి వదిలిన బొంగరం మాదిరిగా తరగటం మొదలుపెట్టాను. అలాంటి ప్రయాణాలు, నన్ను హిమాలయ పర్వత గ్రామాల వద్దకి తీసుకొనిపోయాయి. పల్లెకారుల జీవితల్లోని మాధుర్యాన్ని రుచి చూపిస్తూ సముద్ర తీరాల వెంట తిప్పేశాయి. ప్రజలు పాటలు నెమరువేసుకుంటూ ప్రవహించే నదుల ఒడ్డున నడిపించాయి.

ఆ సంచారాలు నాకు భారతదేశంలోని  గ్రామసీమలు అందించే ప్రేమని పంచిపెట్టాయి. పన్నెండువేల  కిలోమీటర్ల పొడవున సాగిన ఆ పాదయాత్రల అనుభవాల్లో కొన్ని, నేను రాసిన ' భ్రమణ కాంక్ష ' లో చదివిన నా మిత్రులు, విద్యార్థులు సంతోషించి ' మీ యాత్రానుభవాలు ఇంకా కొన్ని రాయండి ' అంటూ ప్రోత్సహించారు. ............................................................అలా జిప్సీల గురించి, వారిలో పండితులగురించి, జీవిత శైలి గురించి, భారత దేశం నుండీ విశాల ప్రపంఛంలో వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వారి సామాజిక, ఆర్థిక, సంప్రదాయాల గురించి, అలవాట్ల గురించి, కళాపోషణ, పశుపోషణ గురించి భాషా, పాండిత్యాల గురించి , కవిత్వం, జానపద గేయాల గురించి, ఇతర జీవన అలవాట్లు, ప్రేమ, పెళ్ళి, వివాదాలు, విడాకులు, మూఢనమ్మకాలు
సమగ్ర సమాచారం లభ్యమవుతుంది.
పైర గాలుల్లో ప్రయాణాలు చేస్తూ, పంటచేల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోయే సంచారులు ప్రపంచమంతా వ్యాపించివున్నారు. భారతదేశపు ' గదూలియా లోహార్ ', ఆఫ్రికా ' పశువుల కాపరులు ', అరేబియా ఎడారిలో జీవించే ' ఒంటెల కాపరులు ', మధ్య ఆసియా కొండల్లో తిరిగే ' డ్రోక్ పా పశువుల కాపరులూ', దృవప్రాంతాల్లోని ' సంచారులూ, యూరప్, అమెరికా దేశాల్లో తిరుగుతున్న  జిప్సీ (రోమాలు)లాంటి అస్థిర వాసుల జీవితాలను ' తెలుగు వెలుగు ' లోనికి తీసుకురావటాని ఆదినారాయణ చేసిన ప్రేమ ప్రయత్నమే ఈ '' జిప్సీలు '' -  మురళి చండూరి.  అభిప్రాయవెలిబుచ్చారు.  

 కొసమెరుపు: సాగర తీరంలో తిరగాలని ఆరాటపడుతున్న సాహితీ మిత్రుడు స్మైల్ ( మహమ్మద్ ఇస్మాయిల్) గారికి అంకితం యీ పుస్తకం.

*** ఎం. ఆదినారాయణ.
ప్రథమ ప్రచురణ 2002
విశాలాంధ్ర - విశాఖ పట్టణం  వెల:100/-
________________________
18.7.2013 సా. 4.55

Wednesday, July 17, 2013

||ఆరుద్ర తో కాసేపు మండవ సుబ్బారావు ||

కపిల రాంకుమార్||ఆరుద్ర తో కాసేపు మండవ సుబ్బారావు ||
27-12-1987 ఉదయంజ్ 10 గంటలు - టి-నగర్ - మద్రాసు -
ఆరుద్ర గారిల్లు - ఆయన తన గ్రంథాలయంలో పుస్తకం చుదువుతున్నారు
మండవ: నమస్కారం!
ఆరుద్ర : (లేచి ప్రతి నమస్కారం చేసి కూర్చోమని సైగ చేసారు)
మండవ: గత రెండురోజులుగా మీరు అనేక విషయాలు చెప్పి, నా సందేహాలను తొలగించారు. ఇక చివరిగా 'త్వమేవాహం' గురించి కొన్ని ప్రశ్నలడుగుతాను. దయతో చెప్పండి
ఆరుద్ర : అలాగే. రికార్ద్ చేసుకుంటారా? రాసుకుంటారా?
మండవ: రాసుకుంటాను
ఆరుద్ర : మంచిది. అలా టెబుల్ దగ్గర కుర్చీలో కూర్చోండి. ఆ! అడగండి!
మండవ: '' త్వమేవాహం " అనే పేరు శ్రీశ్రీ సూచించినట్లు, దాన్ని మీరు పెట్టినట్లు కవి హృదయంలో చెప్పారు. అందరికి అర్థమయ్యే పేరు పెట్టవచ్చు కద!
ఆరుద్ర: శ్రీశ్రీ పెద్దవాడు చెప్పాడు కాబట్టి, గౌరవంగా ఆ పేరు పెట్టడం జరిగింది
మండవ: '' త్వమేవాహం " పేరు మీరంగీకరించటంలోనే సంప్రదాయ ముద్ర మీలోవుందని కొందరంటున్నారు. దానికి మీ జవాబు యేమిటీ?
ఆరుద్ర: సంప్రదాయ పునాది మీదే నడవాలి కదా! వైరు మీద నడిచే వాడి కర్రలు కూడ నేల మీడే నిలబడాలి కదా!
మండవ: ' త్వమేవాహం ' లోని కాంటెంట్ కు తగిన ఫారమ్‌ ను మీరు యెన్నుకోలేదు. అందుకే మీ ' త్వమేవాహం ' మిగిలిని కావ్యాలల పేలలేదని అనుకుంటున్నాను. మీరేమంటారు?
ఆరుద్ర: తెలంగాణా ఒక సంస్యే గాని కావ్యం ఒక సమకాలిక సమస్య. ప్రేరణ - తెలంగాణా. ఈతగాడు ఉపయోగించే స్ప్రింగ్ బోర్ద్ లాంతిది తెలంగాణా సమస్య.
మండవ : '' భళానోయ్ భాయి ' అనే బుర్ర కథ తెలంగాణా స్టెయిల్ కాదు కద?
ఆరుద్ర: కాదు అని నాకు తరువాత తెలిసింది.
మండవ: ఏ పాఠకుడ్ని ఉద్దేశించి మీ కావ్యం వ్రాయబడింది?
ఆరుద్ర: ' కవి ' ఏ ఒక్క పాఠకుడ్ని ఉద్దేశించి కావ్యం వ్రాయడు. కావ్యం ప్రజలలోకి వచ్చిన తరువాత అది వాళ్ళ స్తాయిని బట్టి అది ప్రయోజనం పొందుతుంది. 1940-50 లో చదువుకున్న చదువు ప్రభావం ' త్వమేవాహం ' లోవుంది.
మండవ: మిమ్మల్ని అభ్యుదయ కవిగా నిలిపే కావ్యాలేవి?
ఆరుద్ర: త్వమేవాహం, సినీవాలి, నా కావ్యాలన్ని అభ్యుదయ కావ్యాలే.
మండవ: మీరు ' ప్రయోగాల కవి ' మాత్రమే అనేవాళ్ళున్నారు, అదెంతవరకు నిజం?
ఆరుద్ర: కేవలం ప్రయోగాలకోసమే ఎవరూ కవిత్వం రాయరు! ప్రయోగాలు లేకుండ ఆరుద్ర లేడు!
మండవ: మార్క్సు వాదులు తప్ప అన్యులు అభ్యుదయ రచయితలు కారా?
ఆరుద్ర: మార్క్సిస్టు కాని వాడు అభ్యుదయ కవి కాడు. అభ్యుదయ కవి చెప్పేది మార్క్సిజమే. వేమన, గురజాడ మార్క్సిజం చరువుకోలేదు.ఆర్థిక ఒనరులపై చెప్పింది మార్క్సిజమే. మార్క్స్ చెప్పిన మాటలు చెప్పకుండా అభ్యుదయ కవిత్వం చెప్ప వచ్చును. 1942-43 లో మార్క్సిజం చదువుకోకపోతే ఈ కవిత్వం వ్రాసేవాడ్ని కాదు.
మండవ: మీరు మొదట అభ్యుదయవాదే గాని, తరువాత మానవతా వాదిగా మారిపోయినట్లు, కె.వి.ఆర్.నరసింహం గారన్నారు. మీ అభిప్రాయమేమిటి?
ఆరుద్ర: అభ్యుదయ - మానవతా వాదం వ్యతిరేకం కాదు. మార్క్స్ కూడ మానవతావాదే.
మండవ: మీరు ' త్వమేవాహం ' లో ఉపయోగించిన ప్రతీకలు ఎవరికీ అర్థం కావటంలేదు అనే విమర్శవుంది. మీరేమంటారు?
ఆరుద్ర: ఒక చెప్పుకోదగ్గ కావ్యం వస్తే దాని ప్రభావం రెండు తరాల యువకవుల మీద పడుతుంది. కొత్త్త ప్రతీకలు ప్రవేశపెడితే మొట్టమొదట వాటిని అర్థం చేసుకోడం కష్టమే. ఐతే కొంత సమయం తీసుకున్నాక అదే చదువరులకు ఈజీగా అర్థమవుతాయి.
నేను త్వమేవాహం లో రాసిన టెక్నిక్ లో పదాలు కొన్ని ఆ తరం వాళ్ళకణ్ణా ఈ తరం వాళ్ళకి బాగా అర్థమవుతున్నాయి.
మండవ: ఇప్పుడు మీరు సినిమా పాటలు రాయడంలేదు, యెందుకని?
ఆరుద్ర: ప్రస్తుతం సినిమా పాటలు నేను రాసే స్థితిలో లేవు.
మండవ: కవికి కమిట్మెంట్ అవసరమా?
ఆరుద్ర: అసలు కమిట్మెంట్ వున్న వాడే కవి. నా దృష్టిలో కమిట్మెంట్ అంటే కట్టూబడి వుండడం - ప్రజలకి, ధర్మానికి, న్యాయానికి!
**
(ఇంతలో ఆరుద్ర గారి మిత్రుడొకరు వచ్చీ రాగానే) ఆరుద్రగారు మీకు అభినందనలు!
(మండవ సుబ్బారావు గారితో ) మీకు తెలియిదా ఆరుద్ర గారికి 1987 సంవర్సరానికి గాను కేంద్ర సహిత్య అకాడెమీ అవార్డ్ వచ్చింది!
మండవ: హృదయపూర్వక అభినందనలు !
ఆరుద్ర: థ్యాంక్స్ ! ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా?
మండవ: ఏ పుస్తకానికి అవార్ద్ ప్రకటించారు?
ఆరుద్ర: గురజాడ గురుపీఠం! ( చాలా తాపీగా సమాధానం. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ వచ్చినప్పటికి యే మార్పు లేకుండా గత రెండు రోజులుగా యెలా వున్నారో అలానే సింపుల్ గా వున్నారు ఆరుద్ర)
మండవ: కవిత్వం ఆనందాన్ని కలిగించాలా?
ఆరుద్ర: ఆనందం కార్యోన్ముఖుణ్ణి చేయటానికి అవసరమేగా?
మండవ: అర్థం కాకుండా రాయటం వలన ప్రయోజనమేమిటి?
ఆరుద్ర: ''ఇ = ఎం.సి. స్క్వేర్ '' ఎవరికీ బోధపడ కాని ప్రజల కోసమే కదా!
మండవ: థ్యాంక్స్, నాకు సెలవు యివ్వండి. కలుస్తాను!
ఆరుద్ర: ఫర్వాలేదు. మీకు మళ్ళీ యేదైనా అవసరం వుంటే కలవండి!
మండవ: ఉత్తరం రాస్తాను!
ఆరుద్ర: మళ్ళీ జవాబు రాయటానికి నాకు తీర్కి దొరకదు. లేటైతే మీకు బాధ!
మండవ: సరే. వీలును బట్టీ, మరొక సారి కలుస్తాను.
ఆరుద్ర: విష్ యు ఆల్ ది బెస్ట్!
మండవ: థ్యాంక్స్!
_____________________________
ఈ ఇంటర్వ్యూ :ఆరుద్ర గారి ' త్వమేవాహం' కావ్యదర్శనం అనే విశ్లేషణ మండవ సుబ్బారావు (కొత్తగూడెం) 1995 జనవరి లో ప్రథమ ప్రచురణ. విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలో లేదా మండవ సుబ్బారావు, ఇంటి నెం 9-40, లక్ష్మీదేవిపల్లి కొత్తగూడెం 507101.

కొన్ని కవితలు - మోహన విషాదం - కొప్పర్తి ||

కపిల రాంకుమార్|| కొన్ని కవితలు - మోహన విషాదం - కొప్పర్తి ||
1.కస్తూరి వాహకుడు
అతను
అప్పుడప్పుడూ వచ్చేవాడు
సంశయంగా కవిత్వం వినిపించేవాడు
తర్వాత, తర్చు వచ్చి
చొరవగా కవిత్వం వెదజల్లేవాడు
ఇప్పుడు రోజూ వస్తాడు
తన కవిత్వాన్ని అలవాటు చేశాడు
వొక్క రోజు
ఎప్పటిలానే వచ్చి వెళతాడు
అయితే ఆరోజు
కవిత్వం వినిపించలేదని మనకు తెలీదు.
(బి.వి.వి. ప్రసాద్ కోసం)
వార్త - సృష్టి 24.10.1998

2.మెలాంకలీ స్ట్రెయిన్‌
రాత్రి చాలా గడిచింది
నిదురంతా బయటికి ప్రవహించింది
ఎందుకో బాధ
సన్నని తీగలాంటి బాధ
లోహపు కవచమేదో లోలోపల గుచ్చుకున్న బాధ
బాధగా ఉంది
కారణమేదీ లేదు కారకులెవరూ లేరు
వొట్టినే బాధగావుంది
బాధకంటే కాస్త కూడ్శ తక్కువగా లేదు
ఇంకొంచెంసాపు ఇట్లాగే ఉండాలను వుంది
నులి వెచ్చగా వుంది
కొంచెం కొంచెం జ్వరంగా వుంది
వొళ్ళు వొళ్ళంతా కవిత్వంగా వుంది
ఆదివారం ఆంధ్ర జ్యోతి 19.3.2000

3.ఎ నైట్ మేర్
ఉదయం
తలుపు రెక్క తెరవగానే
శీతగాలి
న్యూస్ పేపర్ కోసం వెతికే కళ్ళకి
రాత్రి పడుకునే ముందు
ఇంట్లో పెట్టడం మరచిప్యిన
చిట్టి చెప్పులు కనిపిస్తాయ్ఎప్పూడూ
వాటినే అంటిపెట్టుకుని ఉండే
చిన్న తల్లి
వాటిల్లో కాళ్ళుపెట్టి
రాత్రంతా నిలుచున్నట్టు
వొక ఊహ
శీతగాలితో కలిసి
కోత పెడుతుంది.
వార్త -సృష్టి 2.11.1996

4. ప్రతి క్రియ
నీది
కటిక నేల మీద అన్నం పెట్టిన
పశున్యాయం
శవాల బట్టలు కట్టుకోమన్న
శవ నాగరికత
ముట్టుకున్నందుకు మరణశిక్ష వేసిన
విలోమస్మృతి
కాకులతోపాటు పొండాకూడు పంచిన
పిండ సంస్కృతి
ఇనుప ఆభరణాల్ని తగిలించిన
లోహ చరిత్రా
అతనిప్పుడు నాగరికుడవుతున్నాడు
నిన్ను నాగరికుణ్ణి చేస్తున్నాడు
ఆదివారం ఆంధ్ర జ్యోతి 17.6.1995

5. అగ్ని సూక్తం
రాళ్ళలో
ఎండిన చెట్టు కణాల్లో
అంతర్హితంగా
ఆకాశంలో సముద్రంలో
అరణ్యంలో హిరణ్యంలో
ప్రచ్ఛన్నంగా
గడ్డగట్టిన చీకటి రాత్రుల్లో
సవితృ శకలంగా
ఆటంలో ఆక్సిజనులో
సూత్రంగా
సూక్తంగా
జంతువుల్ని భయపెట్టిన
అనాగరికం నుంచి
యజ్ఞ వాటికా గానాలనుంచి
పాతివ్రత్య పరీక్షల మీదుగా
సతీ సహగమనాల మీదుగా
ఒక ప్రవాహంలా
మోస్తూ, సహిస్తూ
రగుల్చుకుంటూ, మిగుల్చుకుంటూ
నిఖిల లోకం
నిరంతరంగా.
(రాహుల్ సాంకృత్యాయం ' రుగ్వేద ఆర్యులు చదివి)
ఆంధ్రజ్యోతి సాహితీ వేదిక 26.2.1996.
____________________________________________
జూన్‌ 2003 ప్రథమ ప్రచురణ
కొప్పర్తి వెంకట రమణ మూర్తి, 35-56-5 పబ్లిక్ పార్క్ పక్కన, మాంట్ సోరీ స్కూల్ వద్ద తణుకు 534211 పశ్చిమ గోదావరి జిల్లా అన్ని ప్రముఖ పుస్తక విక్రయ శాలలలో లభ్యం రు.30/-
_____________________________________________
1.7.2013 6.1O AM

| ''కవిత్వంతో సమాజం మారదు" ||ఇంటర్వ్యూ ||

కపిల రాంకుమార్|| ''కవిత్వంతో సమాజం మారదు" ||ఇంటర్వ్యూ ||
సరస్వతీ పుత్ర ''పుట్టపర్తి నారాయణాచార్యులతో'' ''శశిశ్రీ'' ఇంటర్వ్యూ 10-10-1988 కడపలో వారింట్లో   ఆంగ్ల సాహిత్యంలో తనదైన ప్రత్యేక శైలి, భావ గంభీరత కల : ది ప్రాఫెట్ కర్త ఖలీల్ జీబ్రాన్‌ పుస్తకం పఠిస్తున్న పుటపర్తి ఇంటర్వ్యూ వివరాలు:
* ఖలీల్ జీబ్రాన్‌ ప్రాఫెట్ గురించి నాలుగు వివరాలు
- ది. ప్రాఫెట్ లో 'ది సిటీ ఆఫ్ ది డెడ్' లో జీబ్రాన్‌ సంతానం గురించి వ్రాసిన వాక్యాలు గొప్పవి, జీబ్రాన్‌ది సులభతరమైన శైలె. భావం చాల గంభీరంగా వుంటుంది.
' May you give them your love but not your thoughts
for they have their own thoughts
you may house their bodies but not their souls
for their souls dwell in house of tomorrow
which you can not visit, not even in your dreams. '
*భావ వ్యక్తీకరణకు భాషకు గల సంబంధం గురించి జీబ్రాన్‌ను దృష్టిలో పెట్టుకొని మీ అభిప్రాయం చెప్తారా?
-భాష కంటే భావం గాంభీర్యమే కోరదగినది.  భాషయొక్క బరువు భావాన్ని క్లిష్టం చేస్తుంది. సాధారణంగా భావం గంభీరంగా వ్యక్తీకరింపలేని వారే భాషను ఆలంబనంగా తీసుకూంటారు. అలాగని భాషను ఇగ్నోర్ (నిర్లక్ష్యం) చేయమని నా భావం కాదు.  దానికొక మితి వుందని మాత్రం చెబుతున్నారు.
* ఖలీల్ జీబ్రాన్‌ సాహిత్యంలో తాత్విక దృష్టి కోణం ఏమిటి?
- మార్క్సిజానికి పూర్వ స్థితే ఖలీల్ జీబ్రాన్‌ సాహిత్యం. అంటే మార్క్స్ రంగంలోకి ప్రవేశించి సామ్యవాదాన్ని శాస్త్రంగా చేసినాడు.  ఒక పద్ధతి ప్రకారం దాన్ని పొందటానికి కావాల్సిన మార్గాలు చెబుతూ పోయాడు. దాన్నే శాస్త్రీకరణమంటారు. ఖలీల్ జీబ్రాన్‌లో అవే భావాలున్నాయి.  అయితే దాన్ని శాస్త్రీయంగా చెప్పే అంతస్తుకు ఆయన యెదగలేదు. జీబ్రాన్‌ ముఖ్యంగా క్వి, తర్వాతనే తాత్వికుడు. మార్క్స్  కఠోరమైన మేధావి. పరమ తాత్వికుడు.
* ఆంగ్ల సాహిత్యంలో జీబ్రాన్‌ రాసిన మరో కవి ఎవరైన వున్నారా?
- ఆంగ్లంలో ఈ రీతిలో రాసిన వారు నా దృష్టికి రాలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ త్రోవలో పోయారే కాని, భాష కాస్త బరువే!  జీబ్రాన్‌ సాహిత్యం చదువుతుంటే బైబిల్ చదువుతున్నట్టేవుంటుంది. జీబ్రాన్‌ సాహిత్యం ద్వారా ఎన్నో సంప్రదాయాలు మన దృష్టికి వస్తాయి.
*జీబ్రాన్‌ సాహిత్యాన్ని సమాజం ఏ విధంగా రిసీవ్ చేసుకుంది?
-'' ది ప్రాఫెట్ '' పుస్తకం వెలుగులోకి వచ్చకే జీబ్రాన్‌ను ప్రజలు గుర్తించారు, ఆదరించారు. అందమైన, స్వచ్ఛమైన స్వతంత్ర భాఆలు జీబ్రాన్‌ ప్రతి పేజీ నుంచి గ్రహించవచ్చు.  శైలి కోసం జీబ్రాన్‌ పాకులాడింది లేదు.  ఆ కారణంగానే ఆయన సాహిత్యం ప్రపంచంలోని ఇరవై భాషలలోనికి  అనువాదమయింది. ఆయన గీసిన చిత్రాలు ప్రపంచంలోని ప్రసిద్ధ ప్రాంతాల్లో, ప్రదర్శన శాలల్లో వున్నాయి. తన కవిత్వాని తానే చిత్రాలు గీసుకునే గుణం హండి మహాదేవ వర్మకు వుంది.  ఆమె హిందీలో ఛాయా వాదానికి నాయకురాలు.
*కవిత్వానికి శాశ్వతగుణం అవసరమా?
-అవసరమా, కాదా అనేది కాదు ప్రశ్న! కవి ఏదో ఒక పాలు తాత్వికుడుగా వుంటాడు. వాని తాతిక దృష్టి ఇంకొకక్రు అనుకునేదిగా ఉండకపోవచ్చు. కాని దానికే వశుడైపోడు. సౌందర్యదృష్టి ప్రధానంగా వుంటుంది. నీడలాగ తాత్విక దృష్టి వెన్నాడుతూ వుంటుంది.  ఈ ప్రశ్న ఆనంద వర్థనుడు ఎన్నడో వేసుకున్నాడు (ఆయన ధ్వని వాదమును అమలులోకి తెచ్చిన గొప్ప అలంకారికుడు - కాశ్మీరీ దేశస్తుడు) అతడు ' ధ్వన్యాలోకం ' రాసిన నాటినుంచి, అలంకార శాస్త్రంలో అదే సిద్ధాంతమైపోయింది. గుడ్డిగా నీతిని చెప్పడం కవిత్వం కాదని నిక్కచ్చిగా ఖండించేశారు.  కనుక తాత్వికత అనే పదం ఈ అర్థంలోకాదు వాడేది. ఇలావుంటే; ప్రపంచంలో బావుంటుందనే భావం, ప్రతీ రచయతకు ఏదో ఒక మోతాదులో వుంటుంది.  దాన్నే తాత్వికతగా చెప్తాము. ఖలీల్ జీబ్రాన్‌ ప్రాఫెట్ లో పెళ్ళి గురించి చెబుతూ - ఇదే భావాన్ని వెప్పాడు. అరవిందులు ఊర్వశి అనే కావ్యంలో యిటువంటి భావాలే ఊర్వశినోట పలికిస్తాడు.
* కవితత్వంలో చెప్పే మాటలకు, చేతకు సామ్యం వుండాలా?
- ఒకప్పుడు ఆ విధంగా బతికేవారు. ఈ నాడు ఆ పద్ధతులు చాల మటుకు మారిఫ్యాయి. దీనికి కారణాలు సామాజికంగా, ఆర్థికంగా ఎన్నోవున్నాయి. సమాజం మటుకు యెలావున్నా మనిషి మనిషిగా నిలవవలెనని ఆదర్శవాదులు అంటారు.  నేను అలా అనుకోను. మనిషి పరిస్థితులు తయారుచేసే బొమ్మ.  అందుచేత తన బలహీనతలు కానీ, దౌర్బల్యాలు కానీ ఒప్పుకునే స్థితిలో వుండాలి. ఇది  లేకపోతే  వంచనవుతుంది.  చెస్టర్న్‌ ఓక చోట ఓక పుస్తకంలో ఈ విధంగా అంటాడు. '' paint me as I am, with my weaknessess  and virtues as they are " అదే నా భావం కూడ.
* బలహీనతలు, దౌర్బల్యాలు కలిగివున్న సాహిత్యకారుడు తాత్విక దృష్టితో ప్రవచనాలు చేస్తే - సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటుందంటారు?
-అంతా మన వంటివారే. కాకపోతే సాహిత్యకారులు తమ లోపాలు విప్పి చెబుతున్నారు. 'ఇలా వుండాలనే సంకల్పం, కానీ ఈ సమాజం అలా వుండనివ్వడంలేదంటున్నారు'. ఇదంతా చివరికి మొదలుకే వస్తుంది. వ్యక్తి మారితే సమాజం మారుతుందా? సమాజాని బట్టి వ్యక్తి మారతాడా అనేది ఓ కాలం నుంచి జేరుగుతూ వుండే రగడలే? వ్యక్తి మారితే సమాజం మారుతుందని మన ప్రాచీనులే భావించారే కాని, నేడు దానికి భరత వాక్యం పలికారు.  సమాజమే వ్యక్తిని మారుస్తుంది. పైగా కేవలం కవిత్వంతో సమాజం మారుతుందనే దురాశ నాకెప్పుడూ లేదు.  సమాజాన్ని మార్చగలిగినీ శక్తులు ఆర్థికాలు - దానికి సంబంధించిన బలాలు.

Monday, July 15, 2013

అసహనపు చీకటి చరిత్రలో

కపిల రాంకుమార్|| అసహనపు చీకటి చరిత్రలో||
బొక్కల గద్దెను
నక్కలు  అడ్డాగా చేసుకున్నాయి
శాంతి మంత్రాలు,
కుతంత్రపు వేద భాష్యాలు వల్లిస్తున్నాయ్!
లోకం చేతనాచేతనావస్థలో జోగుతుంటే
అణుమాత్రం అస్త్రం దొరకలేదనే అక్కసుతో
యుద్ధమే ధ్యేయంగా
కక్కసుదొడ్లో విందులు చేసుకునే
నైజం మానని
' సద్దాం ' పై రాద్ధాంతం చేసిన అమెరికా!
కుర్దుల ఊచకోత సాకు
యుద్ధ ఖైదీలకంటే హీనంగా
మర్మాంగాలను బాకులతో, కుళ్ళబొడిచి
మట్టుబెట్టింది కదా!
' గడుసు తోడేలు - గొర్రె పిల్ల ' సామెత్ను నిజం చేసింది కదా!
ఇతిహాసపు బైబిల్ కథలో కరుణామయుడు జీసెస్
ప్రజల కోసం ' ఖనా ' లో సుజల స్రవంతిని
దాక్షసారాగా మారిస్తే
అదే (క్రాస్ ) వారసత్వం మాదంటూ
యుద్ధ వారసత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని
లక్ష్యాలను ఛేదించే క్షిపణులతో
అదే ' ఖనా ' ను ఖననం కావించింది కదా!
దారుణ మారణ కాండతో సంబరాలు చేసుకుంది
నెత్తుటి దాహార్తిని తీర్చుకుందికదా!
ఓకటేమిటి ' లెబనాన్‌ ' ' లిబియా ' 'దక్షిణాఫ్రికా'
యే భూమైనా మరుభూమి చేయాల్సిందే
జాతి వివక్షలతో పాటు
రోగాల ఉచిత సరఫరా చేసి
వికటాట్టహాంగా
మన మనసులను వికలం చేయలేదా?
దృశ్యాదృశ్య చీకటిలో
చేసిన విధ్వంసాలు గుర్తుకొస్తుంటే
రుద్రాక్షమాలలు కావాలని కోరుకుంటానని
అరమరికల మెలికల  అమెరికా చెపుతుంటే
నిలువెల్లా సామ్రాజ్యవాదం కమ్ముకున్న
కుహనా సాధువును నమ్మేదెవడు?
చరిత్ర పుటలపై అసహనపు చీకట్లలో
అక్షరాలెలా క్షేమంగా వుంటాయ్!
తనలో నిక్షిప్త క్షిపణులను విదల్చకుండా?
_________________________
పాత ప్రజాశక్తి వార్తాపత్రికను దులిపి అలమారాలో
వేస్తున్నపుడు కనపడిన ' ప్రపంచగమనం' శీర్షికపై ఈ స్పందన
15-7-2013  ఉదయం 10.45



Sunday, July 14, 2013

||చాకిరి గాళ్ళం||

కపిల రాంకుమార్ ||చాకిరి గాళ్ళం||
రహదారులు అందంగా
పగటిపూట మెరిసేలా
మీరందరి నిదురవేళ
మా చాకిరి మొదలౌను!

వంచిన నడుమెత్తక
చీపురితో కసువూడ్చి
స్వచ్చమైన అద్దంలా
తీర్చిదిద్దుతాం!

మారెక్కలు ముక్కలైన
మా బతుకుల చింకిపాత
మా చాకిరి నగర వాకిలి
చులకనగా చూడకండి!

మా పిల్లలు మీ లాగే
కోకొల్లల ఆశలతో
అరులుచాచి ఆంత్రంగా
ఆశలెన్నోనింపుకున్నరు!

అందించే ఆపన్నుల
పెద్ద మనసులేవని?
ఆబగాను కలల్లోనె
ఆనందించే కూనలు!

ప్రమాదాలు ప్రమోదాలు
ముంచుకొచ్చు ఉపద్రవాలు
సహిస్తు, భరిస్తూ
ఊడ్పుబతుకులీడుస్తూ!

నింగిలోన తిరుగాడె
ధరవరలు దిగిరావు
నేలమీది బతుకున్న
ఊపిరున్న శవాలం!

చాలీ చాలని కూలీతో
తీరీతీరని ఆకలిలో
గుత్తేదారు దోపిళ్ళను
గుండెలో దాచేస్తూ!

ఆసరా యెవరైనవస్తారని
మా తరఫున సర్కారుకు
విన్నవించకుందామని
కట్టకట్టి రాసామొక అర్జీ!

పథకాల ఫలితాలు మాముంగిట చేరాలని
ఆపత్తులు విపత్తులు యికనైనా తొలగాలని
సంకటాల, ఆటంకాల నదుమ నలిగిన
నినదిస్తూ నిరీక్షిస్తున్నాం, జెండా చేతపట్టి!

14.7.2013  సాయంత్రం 4.10


Friday, July 12, 2013

కీ.శే. డా.కె. హరీష్ (ఖమ్మం)అముద్రిత కవిత||

కపిల రాంకుమార్ || కీ.శే. డా.కె. హరీష్ (ఖమ్మం)అముద్రిత కవిత||
నేను రచిస్తాను
ప్రవచించలేను
మోదుగుపూల
రక్తవర్ణరీతి
నా నడకకు సంకేతం!
నా మాట చెబుతాను
ప్రసంగించలేను
ఆర్తి నుంచి,
అన్నార్తి నుంచి
బానిసతనం నుంచి
అణగారిన ఆర్తిని
చస్తున్న అన్నార్తిని
రెక్క తెగిన ఆశని
జొజ్జొరికొట్టి లేపి
సూరీడి వెపు చూస్తూ
కనపడిన మోదుగు
పూల మందహాసాన్ని
గూర్చి చెప్పాలనివుంది!
ఇంకా చూడాలని వుంది!
రగిలిన గుండెనుండి
నెట్టె విడిచిన చెలకనుండి
రాజకీయం విడచిన విషప్పురుగునుండి
కలుషిత విపంచి అలజడినుంచి
మనిషి బ్రతికేందుకు
కిరాతకం తప్పదని
నా మాటగా చెబుతాను!
ప్రసంగం నాకు రుచించదు!
పోరాట ఆరాటాలకు పరిథి మరణమేనని
ఎదురొడ్డిన గుండెకు తుపాకి
గుండె సరిహద్దని
తెలిసి తెలిసి
తలెత్తి తెగిన తలల
స్థితికి రెచ్చిపోయి
నా మాటగా చెబుతాను
కలంబట్టి రాయలేను
కాలం కరిచిన
మనిషిగ మిగిలీ
మోదుగుపూల
రక్తార్ణవు రీతికి
దండాలు పెట్టి
యెదురుపడ్డ మనిషికి
నా మాటగ చెబుతాను
ప్రవచించలేను!
______
యెప్పుడు రాసారో తెలీదు..తాను చదివిన '' కవిత్వంపై ఎర్రజెండా ''
పుస్తకం, చివర అట్టలోపల (ఖాళీ)పేజీలో రాసిన కవిత)
12.7.2013 రాత్రి. 8.22

Tuesday, July 2, 2013

కపిల రాంకుమార్|| తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం - నవలా సాహిత్యం||

కపిల రాంకుమార్|| తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం - నవలా సాహిత్యం||
తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట ప్రారంభానికి ముందు పరిస్థితులు - పోరాటకాలపు
స్థితిగతులు - పోరాట మిరమణ కాలం వరకు చారిత్రిక నేథ్యంలో వచ్చిన నవలాసాహిత్య
పరామర్శించటమే ఈసమాచార ఉద్దేశం. ఆ కాలపుటుద్యమాలు, ఆటుపోటులు, జీవన క్రమంలో జాగీరుదారుల ఆగడాలు, నైజాం నిరంకుశపాలనలో ప్రజలు పొందిన కష్టాలు, రుచిచూచిన అవమానాలు, తెగబడి నడిపిన పోరాటాల క్రమం తెలుసుకోటానికి ఈ నవలలు మనకు ఉపయోగపడతాయి. ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ పోరాటం, ఇతర ప్రజాసంఘాల నిర్మాణం సహాయ పడిన శక్తులు, వ్యక్తులు, మనకు అవగతమవుతాయి. అక్షరీకరించిన సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం, నవల, నాటకాలు, బుర్ర కథలు, యితర జానపద కళారూపాలు ఆనాటి పోరాటాన్ని కళ్ళముందు సాక్షాత్కరింపచేస్తాయి.

భారత దేశంలో జరిగిన వివిధ పోరాటాలకంటే భిన్నమైనది తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంభూమి కోసం, భుక్తి కోసం, విముక్తికోసం జరిగిన సమరమిది. ఆ కాలంలోనూ, తరువాతి కాలంలోను వెలువడిన నవలలుగా మృత్యుంజయులు (బొల్లిముంత శివరామకృష్ణ ) సింహ గర్జన ( పమిడిముక్కల లక్ష్మీకాంతమోహన్‌) చెప్పుకోతగినవి. ఇవి పోరాటకాలంలో వెలువరింపబడిన నవలలు. తరువాత (దాశరథి రంగాచార్య నవలాత్రయం)చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం (వట్టికోట ఆళ్వారుస్వామి) గంగు, ప్రజలమనిషి, (అంపశయ్య నవీన్‌) కాలరేఖలు (తిరునగరి రామాంజనేయులు ) సంగం పోరాటాలకు అద్దంపట్టే రచనగా ప్రసిద్ధిచెందినది. (పి.చంద్) శేషగిరి నవల్ కేవలం కార్మిక వర్గానికి, ముఖ్యంగా సింగరేణి కార్మికుల జీవనశైలి, సంఘ నిర్మాణం, పోరాట దశలు కలగలిపిన నవల. తెలంగాణా పోరాటం యెందరో కవులు, కళాకారులను కదిలించి, కళారుపాలు, చిత్రాలు, కథలు, కావ్యాలు సృష్టించబడటానికి హేతువైంది. ఎందరో పర భాషా రచయతలను ప్రేరేపించింది చిత్త ప్రసాద్ కుంచె, సునీల్ జనా కెమెరా, హరీంధ్రనాథ్ చటోపాధ్యాయ్, కిషన్‌ చందర్, ఆచార్య నాగార్జున్‌, అణ్ణాభావు సాఠె లాంటి మరాఠీ కళాకారునిచేతీలో మరాఠి ఒగ్గుకథగా, ( ఇలా భారతీయ కవులను, కళాకారులను కదిలించింది). హరికథలు, బుర్రకథలు, చలన చిత్రాలు, నాటకాలు ఎన్నో...కొన్నింటిలో వాదాలు, వివాదాలు వుండవచ్చు. తెలుగు సాహిత్యంలో కుందుర్తి ఆంజనేయులు, ఆవంత్స సోమసుందర్, ఆరుద్ర తెలంగాణా పోరాట నేపథ్యాన్ని తమ కవితల్లో అభివర్ణించారు. అమరవీరుడు బందగీ సమాధి ఆరంభంగా ' మా భూమి ' నాటకం కొన్ని వందల ప్రదర్శనలకు నోచుకున్నదంటే '' వాసిరెడ్డి -సుంకర'' జంటకవుల అద్భుత సృష్టి. దానిని విశ్వనాథ సత్యనారాయణ లాంటి సంప్రదాయకవి యెంతగానో మెచ్చుకున్నారంటే
ఆ రచయతలు ఉపయోగించిన జాతీయాలు, తెలుగు పలుకుబడులు, సామెతలు, పాత్రోచిత భాషా సంభాషణం ఆయనను ముగ్ధపరిచిందని వారే స్వయంగ మెచ్చుకున్నారు.
చివరగా చెప్పేదేమిటంటే తెలంగాణా రైతాంగ సాయుధపోరాట కాలంలో వికసించిన నవలా సాహిత్యం - పరిచయాలు - పరిశీలన అనే పుస్తకాన్ని '' జనసాహితి , జంటనగరాల శాఖ ' మే 2011 లో ప్రచురించింది. మైత్రీ బుక్ హౌస్, దిశ్, సహచరి, విశాలాంధ్ర, ప్రజాశక్తి మొదలగు ప్రముఖ పుస్తకాల అంగడిలో లభ్యమవుతుంది.
యితర వివరాలకు ravibabujs@yahoo.co.in / 9440167891 ను సంప్రదించ వచ్చును. 2.7.2013 / 6.00 am.

Monday, July 1, 2013

గేయం - పాట 2

కపిల రాంకుమార్|| గేయం-పాట|| వివరణ ||
కొన్ని ఉదాహరణలు
1.చరణంలో నాలుగు పాదాలు సమాన మాత్రలు 
దేశమనియెడి దొడ్డ  వృక్షం                  14 మాత్రలు
ప్రేమలనుపూలెత్తవలెనోయ్                        ''
నరుల చెమటను తడిస్ మూలం                  ''
ఢనం పంటలు పండవలెనోయ్
                    ''
2.గణానికి గణం విగడం
విరిగి పెరిగితి పెరిగి విరిగితి   3+4+3+4
కష్ట సుఖముల సార మెరిగితి   ''        ''

3.చూతునా అని చూసితిని; మరి   = 3+3+5+2
చేతునా అని చేసిరిని; ఇక         = 5+3+5+2

4.గుత్తునా ముత్యాల సరములు     = 5+5+4
కూర్చుకొని తేటైన మాటలు     = 5+5+4

5.పూర్ణమ్మ గేయం  16 మాత్రలతో చతురస్ర గతిలో  నడిచే చందస్సు
ఏయే వేళలపూసే పువ్వుల  = 4+4+4+4 = 16
ఆయా వేళల అందించి     = 4+4+5      = 13

ఇంకొక తరహా ముత్యాల సరం
6.చివురులూ కొమ్మలా చివర   = 5+5+4 = 14
గుబురులై గుబురులా చివరా = 5+5+4 = 14
పూవులూ నాలుగూ వైపుల     =5+5+4 = 14
బుగులు కొన్నాయీ             = 3+4+2 = 9  (కోకిలమ్మ పెండ్లి)

7.సంఖ్యామాత్రల గేయం శ్రీశ్రీ  '' పేదలు ''  (ముత్యాల సరం కాదు)
అంతేలే పేదల గుండెలు                   = 6+4+4   = 14
అశ్రువులే నిండిన కుండలు                       ''
శ్మశానమున శశి కాంతులలో                    ''
చలిబారిన వెలిరాబండలు
                         ''
8.విశ్వనాథ వారి '' కిన్నెర నడకల్లో ''  మాత్రలు ఖండగతిలో ప్రయోగ  వైవిధ్యం
కదిలింద కదిలింది                           = 5+5    = 10
కదిలింది కదిలింది                           = 5+5    = 10
కదిలి  కిన్నెరసాని వొదుగుల్లు వోయింది     =5+5+5+5 = 20
సుదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది          ''         ''
ముదిత కిన్నెరసాని నురుగుల్లు గ్రక్కింది        ''         '' 


.....మరిన్ని వివరాలు త్వరలో               .7.2013  సా.2,45