కపిల రాంకుమార్|| జ్ఞానేశ్వర్ కీర్తి - కవిత ||
కింద బండా
మీద బండా
కరుగుతూన్నది మా కండ
డొక్కలు కట్టుక
గుడిసెకు వస్తే
కుండల కిందా
లేదుర మంట! //కింద//
తట్టకూలి పారకానీ
కోడికూసే జాముపోతే
మిల్లరు కలిపిన మాలైపోతిమి
ఒల్లంతా పుండ్లయిపాయె //కింద//
ఇల్లనకా, పిల్లనకా
రోహం నొప్పులు యేమనకా
పాడిపంటలుంపండిస్తే
మేం చేసిన కష్టం దొర యింటా //కింద//
బీటు బజార్లో
లోడులు దింపి
గోదామ్ముల్లో ధాన్యం నింపి
హమాలి పనితో వొంగిపోతిమి
గొంతులో మెతుకుకు
కరువైపోతిమి //కింద//
కాలాలు మారబట్టే
మేడలు మిద్దెలు పెరగబట్టే
సర్కార్లూ మారబట్టే
పెట్టుబళ్ళూ పెరగబట్టె
మా బ్రతుకింకేమోగాని
ఎప్పటి చిప్ప అంగట్లే //కింద//
కుప్పలు మేసే
పందికొక్కులకు
కత్తులబోనులు
తప్పవులే //కింద//
8.2.1980 హనుమకొండలో గుండాలచే సజీవ దహన చేయబడినాడు.
మరణ వాజ్ఞ్మూలం '' నేను రచయితను. విప్లవరచయితల సంఘంలో సభ్యుడను. అక్రమాలను, అన్యాయాలను,దోపిడీలను, దౌర్జన్యాలను ప్రజలకు తెలియచెపుతూ కవితలు, కథలు, నాటికలు, నాటకాలు, నాలలు రాస్తాము. వీలైనంత వరకు ప్రతిఘటిస్తాము. అలాగే నేను, కొండయ్యయొక్క శరత్ ప్రభుత్వామోదిత ఉన్నతపఠశాల బోర్డు వెనక జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను దోపిడీ, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తూ వస్తున్నాను. అతడు సాగిస్తున్న వ్యాపారానికి నేను అడ్డంకిగవున్నను. అందుకే నన్ను శాశ్వతంగా నిర్మూలించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను నిద్రిస్తున్న సమయం చూసి, పెట్రో, గ్యాస్నూనె పోసి నిప్పంటించాదు, కొండయ్య, దామోదర్ కలిసి ''
______________________________
కవిత్వంపై ఎర్రజెండా..(1980-94).సంకలనంలో పేజి 3-5. విరసం ప్రచురణ మార్చి 1995
_______________________________
21.7.2013 ఉదయం 10.20

No comments:
Post a Comment